వెయ్యి కోట్ల డిపాజిట్లపై మహిళా బ్యాంక్ దృష్టి
ముంబై: భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) 2015 మార్చి నాటికి రూ.1,000 కోట్ల డిపాజిట్లు, రూ.800 కోట్లరుణ మంజూరు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ (సీఎండీ) డెరైక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. ఇక్కడ శనివారం బ్యాంక్ 35వ బ్రాంచ్ ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత బ్యాంక్ డిపాజిట్లు రూ. 300 కోట్లుకాగా, రుణ పరిమాణం రూ.500 కోట్లుగా ఉంది. మార్చి నాటికి బ్రాంచ్ నెట్‌వర్క్ సంఖ్యను 80కి పెంచాలన్నది కూడా లక్ష్యం. ముఖ్యంగా ఈ విషయంలో ద్వితీయ, తృతీయ పట్టణాల్లో బ్రాంచీల ప్రారంభానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎండీ తెలిపారు.