రూ.5లక్షల పాతనోట్ల డిపాజిట్లపై వీరికి నో వెరిఫికేషన్‌ | Tax Dept to go easy on deposits of up to Rs 5 lakh by those over 70 years | Sakshi

రూ.5లక్షల పాతనోట్ల డిపాజిట్లపై వీరికి నో వెరిఫికేషన్‌

Published Wed, Feb 22 2017 3:55 PM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

రూ.5లక్షల పాతనోట్ల డిపాజిట్లపై వీరికి నో వెరిఫికేషన్‌

రూ.5లక్షల పాతనోట్ల డిపాజిట్లపై వీరికి నో వెరిఫికేషన్‌

న్యూడిల్లీ: ఆదాయ పన్ను శాఖ సీనియర్‌ సిటిజన్‌ ఖాతాదారులకు  గుడ్‌ న్యూస్ చెప్పింది.  డీమానిటైజేషన్‌  తరువాత కాలంలో 70 ఏళ్లపైబడిన వారు చేసిన   రూ.5లక్షల వరకు పాత నోట్ల డిపాజిట్లపై ఎలాంటి  పరిశీలన చేపట్టబోమని ఐటీ శాఖ ప్రకటించింది. అయితే   రూ.2. 5 లక్షలకు మించిన ఇతర  వ్యక్తిగత డిపాజిట్లపై విచారణ లేదా పరిశీలన ఎప్పటిలాగానే కొనసాగుతుందని  స్పష్టం చేసింది. నోట్ల రద్దు తరువాత  70సం.రాల వయసు పైబడిన వారు చేసిన  డిపాజిట్లపై  వెరిఫికేషన్‌ చేపట్టబోమని బుధవారం వెల్లడించింది. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని  హామీ ఇచ్చింది.

నవంబర్ 8 -డిసెంబర్ 30, 2016 మధ్య కాలంలోని  డిపాజిట్ల ధృవీకరణకు చాలా స్పష్టమైన మార్గాలను చేపట్టామని అయితే రద్దయిన నోట్లను డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కర్నీ ఇబ్బంది పెట్టబోమని స్పష్టంచేసింది. కేవలం పరిశీలన  మాత్రమే చేయనున్నట్టు  సీనియర్ ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే 70 సం.రాల లోపు వ్యక్తులు రూ. 2.5 నుంచి రూ. 5 లక్షలవరకు  చేసిన డిపాజిట్లపై  ఆదాయ పన్నుశాఖ  వెబ్‌ సైట్‌ లో ఆదాయ  ఆధార వివరాలను  నమోదు చేస్తే సరిపోతుందన్నారు. అక్కడితో వెరిఫికేషన్ పూర్తవుతుందని పేర్కొన్నారు.  ఒకవేళ డిపాజిటర్‌ ఈ వివరాలను సమర్పించకపోయినా..లేదా  ఆదాయ వివరాలతో సరిపోలకపోయినా,  అనుమానాస్పదంగా అనిపించినా  ఐటీ శాఖ తదుపరి ఇ వెరిఫికేషన్‌ కు పేర్కొన్నారు. దీనికి మించి ఎలాంటి విచారణ థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్ ఉండబోదని స్పష్టం చేవారు.

కాగా  అనుమానాస్పద ఖాతాల పరిశీలనకు, నల్లధనం ఏరివేతకు గాను ‘ఆపరేషన్‌ క్లీన్‌ మనీ’ కార్యక్రమాన్ని ఆదాయపన్ను శాఖ చేపట్టిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.5 లక్షలకు మించి నగదు జమ అయిన 18 లక్షల మందిని వివరాలు కోరుతూ ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్స్‌ను ఆదాయపన్ను శాఖ పంపింది. వీరిలో 6 లక్షల మంది ఈ ఫైలింగ్‌ పోర్టల్‌ ద్వారా బదులిచ్చారు. డీమోనిటైజేషన్‌ తర్వాత భారీ మొత్తాల్లో నగదు జమ అయిన ఖాతాల పరిశీలన సందర్భంగా పన్ను చెల్లింపుదారుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని కేంద్ర ప్రత్యక్ష  పన్నుల బోర్డు ఆదేశించింన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement