Rs 5 lakh
-
రూ.5లక్షల పాతనోట్ల డిపాజిట్లపై వీరికి నో వెరిఫికేషన్
న్యూడిల్లీ: ఆదాయ పన్ను శాఖ సీనియర్ సిటిజన్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీమానిటైజేషన్ తరువాత కాలంలో 70 ఏళ్లపైబడిన వారు చేసిన రూ.5లక్షల వరకు పాత నోట్ల డిపాజిట్లపై ఎలాంటి పరిశీలన చేపట్టబోమని ఐటీ శాఖ ప్రకటించింది. అయితే రూ.2. 5 లక్షలకు మించిన ఇతర వ్యక్తిగత డిపాజిట్లపై విచారణ లేదా పరిశీలన ఎప్పటిలాగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. నోట్ల రద్దు తరువాత 70సం.రాల వయసు పైబడిన వారు చేసిన డిపాజిట్లపై వెరిఫికేషన్ చేపట్టబోమని బుధవారం వెల్లడించింది. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని హామీ ఇచ్చింది. నవంబర్ 8 -డిసెంబర్ 30, 2016 మధ్య కాలంలోని డిపాజిట్ల ధృవీకరణకు చాలా స్పష్టమైన మార్గాలను చేపట్టామని అయితే రద్దయిన నోట్లను డిపాజిట్ చేసిన ప్రతి ఒక్కర్నీ ఇబ్బంది పెట్టబోమని స్పష్టంచేసింది. కేవలం పరిశీలన మాత్రమే చేయనున్నట్టు సీనియర్ ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే 70 సం.రాల లోపు వ్యక్తులు రూ. 2.5 నుంచి రూ. 5 లక్షలవరకు చేసిన డిపాజిట్లపై ఆదాయ పన్నుశాఖ వెబ్ సైట్ లో ఆదాయ ఆధార వివరాలను నమోదు చేస్తే సరిపోతుందన్నారు. అక్కడితో వెరిఫికేషన్ పూర్తవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ డిపాజిటర్ ఈ వివరాలను సమర్పించకపోయినా..లేదా ఆదాయ వివరాలతో సరిపోలకపోయినా, అనుమానాస్పదంగా అనిపించినా ఐటీ శాఖ తదుపరి ఇ వెరిఫికేషన్ కు పేర్కొన్నారు. దీనికి మించి ఎలాంటి విచారణ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ ఉండబోదని స్పష్టం చేవారు. కాగా అనుమానాస్పద ఖాతాల పరిశీలనకు, నల్లధనం ఏరివేతకు గాను ‘ఆపరేషన్ క్లీన్ మనీ’ కార్యక్రమాన్ని ఆదాయపన్ను శాఖ చేపట్టిన విషయం తెలిసిందే. పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ.5 లక్షలకు మించి నగదు జమ అయిన 18 లక్షల మందిని వివరాలు కోరుతూ ఎస్ఎంఎస్లు, ఈ మెయిల్స్‌ను ఆదాయపన్ను శాఖ పంపింది. వీరిలో 6 లక్షల మంది ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా బదులిచ్చారు. డీమోనిటైజేషన్ తర్వాత భారీ మొత్తాల్లో నగదు జమ అయిన ఖాతాల పరిశీలన సందర్భంగా పన్ను చెల్లింపుదారుల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశించింన సంగతి తెలిసిందే. -
ఐటీ మినహాయింపు 5 లక్షలు చేయాలి
రూ.2.50 లక్షలకు సెక్షన్ 80సీ మినహాయింపు పెంచాలి డెలాయిట్ బడ్జెట్ ముందస్తు సర్వేలో అభిప్రాయాలు న్యూఢిల్లీ: రానున్న కేంద్ర ఆర్థిక బడ్జెట్లో ఆ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆదాయపన్ను మినహాయింపును ప్రస్తుతమున్న రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలంటూ ట్యాక్స్ సలహా సేవల సంస్థ డెలాయిట్ నిర్వహించిన సర్వేలో బలమైన అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే, సెక్షన్ 80సీ కింద ప్రస్తుతమున్న రూ.1.50 లక్షల అదనపు మినహాయింపును సైతం రూ.2.50 లక్షలకు పెంచాలని కూడా సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో వెల్లడైన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... అందరిదీ ఒకటే మాట... ఆదాయపన్ను మినహాయింపును గణనీయంగా పెంచాలని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు అందరూ కోరగా... 58 శాతం మంది అయితే పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ‘‘ప్రభుత్వం ఇలా చేయడం వల్ల వినియోగదారుల చేతుల్లో మరింత నగదు ఉంచినట్టు అవుతుంది. దీంతో డిమాండ్ ఊపందుకుంటుంది. శ్లాబ్ రేటును మార్చడం వల్ల పొదుపును ప్రోత్సహించినట్టు అవుతుంది. ఫలితంగా వ్యవస్థలో పెట్టుబడులు పెరగడానికి ఇది దోహదం చేస్తుంది’’ అని డెలాయిట్ నివేదిక పేర్కొంది. రూ.2.50 లక్షలు చేయాలి... సెక్షన్ 80సీ కింద ప్రస్తుతం వివిధ రకాల సాధనాల్లో రూ.1.50 లక్షల పెట్టుబడులకు ఇస్తున్న పన్ను మినహాయింపును రూ.2.50 లక్షలు చేయాలని సర్వేలో 71 శాతం మంది అభిప్రాయం తెలిపారు. ‘‘ఆదాయ స్థాయిలు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రస్తుత పరిమితి సహేతుకంగా లేదు. దీన్ని పెంచడం వల్ల గృహస్థుల పొదుపు... బీమా, ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీ తదితర సాధనాల వైపు మళ్లుతుంది. దీంతో మౌలిక రంగంపై మరింత పెద్ద మొత్తంలో వ్యయానికి ఊతమిచ్చినట్టు అవుతుంది’’ అని సర్వే నివేదిక వెల్లడించింది. కార్పొరేట్ ట్యాక్స్‌ను 18%కి తగ్గించాలి:సీఐఐ కార్పొరేట్ పన్నును బడ్జెట్లో 18 శాతానికి తగ్గించాలని సీఐఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు వినతిపత్రాన్ని అందించింది. 2017–18 బడ్జెట్‌కు సంబంధించి ఇచ్చిన సూచనల్లో కార్పొరేట్ పన్ను రేటును 18 శాతానికి తగ్గించాలని, అన్ని సర్‌చార్జీలు, సెస్ కూడా కలిపి ఈ మేరకే ఉండాలని సీఐఐ సూచించింది. అదే సమయంలో పన్ను తగ్గింపులు, ప్రోత్సాహకాలను తొలగించాలని కోరినట్టు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఢిల్లీలో మీడియాకు తెలిపారు. -
తల్లే కూతుర్ని అమ్మకానికి పెట్టింది
థానె: మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ కన్నకూతుర్ని అమ్మేందుకు ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయింది. ముంబై పరిసర ప్రాంతం గోవండికి చెందిన నిందితురాలు (32) థానెకు వెళ్లి తన 16 ఏళ్ల కూతురును అమ్మకానికి పెట్టింది. ఆ అమ్మాయిని ఓ వ్యభిచారముఠాకు 5 లక్షల రూపాయలకు బేరం పెట్టింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో నిందితురాలిని అరెస్ట్ చేశారు. నిందితురాలు తన సోదరి కూతురి పెళ్లికి డబ్బులు సమకూర్చడం కోసం ఈపనికి పాల్పడినట్టు థానె పోలీసులు చెప్పారు. థానెలోని ఓ హోటల్లో నిందితురాలు బేరం మాట్లాడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె 4.25 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుందని, అడ్వాన్స్‌గా 50 వేల రూపాయలు తీసుకుందని పోలీసులు చెప్పారు. నిందితురాలు సెక్స్ రాకెట్ నడుపుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఆమెకు మూడు పెళ్లిళ్లు అయ్యాయని, ముగ్గురు కూతుర్లు ఉన్నట్టు సమాచారం. -
కన్హయ్య నాలుక కోస్తే..అయిదు లక్షలిస్తా..
న్యూఢిల్లీ: ఢిల్లీ జవహర్ లాల్ యూనివర్శిటీ వివాదం కొద్ది కొద్దిగా సద్దుమణుగుతున్న సందర్భంలో బీజీపీ యువజన విభాగం నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జెఎన్యూ యూనివర్శిటీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ నాలుక తెగ్గోస్తే.. అయిదు లక్షలు బహుమతిగా ఇస్తానంటూ కులదీప్ వార్ష్నే వ్యాఖ్యానించి తాజాగా వివాదానికి తెరలేపారు. భారతీయ జనతా యువమోర్చా బదౌన్ జిల్లా నేత కులదీప్ వార్ష్నే ఈ సంచలన వ్యాఖ్యాలు చేశారు. అఫ్జల్ గురు లాంటి తీవ్రవాదికి మద్దతుగా జాతి వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కన్హయ్య కుమార్ నాలుకను ఎవరైనా కత్తిరించాలని కోరారు. అలా చేసిన వారికి 5 లక్షల రూపాయలను కానుకగా ఇస్తానని చెప్పారు. గురువారం జైలు నుంచి విడుదలైనప్పటినుంచి బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని, అందుకే ఎవరైనా ఈ చర్యకు పూనుకోవాలన్నారు. కాగా కన్హయా దేశద్రోహం ఆరోపణలపై ఫిబ్రవరి 12 న అరెస్టు చేయగా, ఢిల్లీ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఈనెల 3న తీహార్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం విద్యార్థులనుద్దేశించి రాజద్రోహానికి, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు మధ్య తేడాను వివరిస్తూ అతడు ఉత్తేజపూరిత ప్రసంగంతో పలువురిని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. -
పాట రాయండి.. భారీ బహుమతి గెల్చుకోండి
న్యూఢిల్లీ: యోగాపై అవగాహన ఉందా.. సాహిత్య రచనలో ప్రవేశం ఉందా.. పాటలు బాగా పాడతారా? అయితే ఆ అయిదు లక్షలు మీరు గెల్చుకోవచ్చు... ఏంటీ.. అంతా కన్ఫ్యూజింగా ఉందా.. 'యోగగీతం పంపండి.. 5 లక్షలు గెలుచుకోండి' అని కేంద్రం ఆహ్వానిస్తోంది. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్ శాఖ ఆ పోటీ నిర్వహిస్తోంది. దీనికోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. తమకు అందిన వాటిల్లో ఉత్తమపాటను ఎంపికచేసి విజేతను ప్రకటిస్తారు. అత్యత్తుమ పాటగా నిలిచి దానికి రూ. 5 లక్షల నగదు బహుమతి ఇస్తారు. వ్యక్తిగతంగా గానీ, లేదా గ్రూప్‌గా గానీ ఈ పోటీలో పాల్గొనవచ్చు. 3 - 5 నిమిషాల నిడివిలో, ఎంపీ3 ఆడియో ఫార్మాట్లో ఉన్న యోగ గీతాన్ని పోటీకి పంపవచ్చు. అయితే దీని సైజ్ 5ఎంబీ దాటకూడదనే నిబంధన విధించింది. పోటీలో పాల్గొనేవాళ్లు మార్చి 31వ తేదీలోగా తమ ఎంట్రీలను inf-moayush@gov.in అనే ఈమెయిల్ ఐడీకి పంపాలి. మరిన్ని వివరాలకు www.indiamedicine.nic.in అనే వెబ్సైట్ ను పరిశీలించుకోవచ్చని తెలిపింది. అయితే మరో ముఖ్య విషయం ఏమిటంటే పాట హిందీ భాషలో మాత్రమే ఉండాలి. -
అదితి ఆచూకీ చెబితే రూ.5లక్షల నజరానా