డిపాజిట్లపై ఆర్‌బీఐ హెచ్చరిక
హైదరాబాద్: సహకార సంఘాల్లో సభ్యులు కానివారి నుంచి డిపాజిట్లను స్వీకరించ వద్దని రిజర్వు బ్యాంకు సహకార సంఘాలను హెచ్చరించింది. అలాగే సహకార సంఘాలలో నామమాత్రపు సభ్యులు, అనుబంధ సభ్యుల నుండి కూడా డిపాజిట్లను స్వీకరించరాదని ఆర్‌బీఐ తేల్చి చెప్పింది.
కొన్ని సహకార సంఘాలు / ప్రాధమిక సహకార క్రెడిట్ సొసైటీలు .. సభ్యులు కానివారు / నామినల్ సభ్యులు / అసోసియేట్ సభ్యుల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తున్నారని రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిపై ఆర్‌బీఐ రీజనల్ డైరెక్టర్, ఆర్ బిఐ (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్) శ్రీ ఆర్. సుబ్రమణియన్ క్లారిటీ ఇచ్చారు. ఈ సహకార సంస్థలకు, బ్యాంకింగ్ వ్యాపారము చేయడానికి, రిజర్వు బ్యాంకు
బి.ఆర్. యాక్ట్ (బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949) అనుసరించి ఎటువంటి లైసెన్స్ ను జారీ చేయలేదని, అధికారం కూడా ఇవ్వలేదని ఆయన వివరించారు. ఇంటువంటి సహకార సంఘాలలో డిపాజిట్ చేసిన సొమ్ముకు ఎటువంటి బీమా కవరేజ్ లేదని పేర్కొన్నారు.
ప్రజలు ఈ విషయాలను గమనించి, సహకార సంఘాలతో డిపాజిట్ల విషయంలో జాగ్రత్త వహించాలని ఆర్. సుబ్రమణియన్ కోరారు.