Co-operative societies
-
కోర్టు ఆదేశించినా పట్టించుకోరా?
సాక్షి, హైదరాబాద్: సహకార సొసైటీల్లో అక్రమాలు, అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాల్సిన ‘రిజిస్టార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్’విభాగం తీరుపై విమర్శలు వస్తున్నాయి. నిబంధనల ఉల్లంఘనపై హౌసింగ్ సొసైటీల స భ్యుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఏ మాత్రం స్పందించడం లేదనే ఆగ్రహం కనిపిస్తోంది. అక్రమాలపై విచారణ చేపట్టాలని సాక్షాత్తు న్యాయస్థానం ఆదేశించినా కూడా అలసత్వం వహించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ సొసైటీలో అక్రమాలపై విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించి రెండు నెలలైనా సహకార శాఖలో చలనం లేకుండా పోయిందని సభ్యులు మండిపడ్డారు. కో–ఆపరేటివ్ కార్యాలయం ముందు ఆందోళనను నిర్వహించేందుకు సీనియర్ సభ్యులు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఎన్నెన్నో ఆరోపణలు, ఉల్లంఘనలు.. 1962లో ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీ చట్టం కింద ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌజింగ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ (జీహెచ్సీహెచ్బీఎస్)’రిజిస్టర్ అయింది. ఇందులో 4,962 మంది సభ్యులు ఉండగా.. 3,035 మందికి ఇళ్ల స్థలాలు అందజేశారు. మరో 1,952 మంది వెయిటింగ్లో ఉన్నారు. సొసైటీకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి.చాలాకాలం పాటు వాటికి అనుగుణంగా సొసైటీ కార్యకలాపాలు సాగినా.. తర్వాత కొందరు స్వలాభాపేక్షతో సొసైటీని ఆర్థిక వనరుగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుత సొసైటీ పాలకవర్గం అక్రమాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని సీనియర్ సభ్యులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న 800 మంది సభ్యులను తొలగించే ప్రయత్నం చేయడం, కొత్త సభ్యులకు అవకాశం పేరుతో దరఖాస్తులు పంచుకుని సొమ్ము చేసుకోవడం, సొసైటీకి సంబంధం లేని ప్రైవేటు వెంచర్‌కు జూబ్లీహిల్స్–4 పేరుపెట్టి అక్కడ ప్లాట్స్ కొంటే సొసైటీలో సభ్యత్వం అంటూ ప్రచారం చేయడం వంటి ఎన్నో అవకతవకలు జరిగాయని చెబుతున్నారు. ప్రత్యేక పర్యవేక్షణ ఏది? సహకార చట్టం ప్రకారం ఎక్కువ సభ్యత్వం, ఉన్నతస్థాయి వ్యక్తులు సభ్యులుగా ఉన్న సొసైటీలపై ప్రత్యేక పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. ఇలా రాష్ట్రస్థాయి రిజిస్టార్ ఆఫ్ కో–ఆపరేటివ్ సొసైటీస్ ప్రత్యేక పర్యవేక్షణలోకి ‘జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ’తోపాటు మరో నాలుగు సొసైటీలు కూడా వస్తాయి. కానీ జూబ్లీహిల్స్ సొసైటీపై కొన్నేళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. పట్టించుకునేవారే లేరన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సొసైటీ సభ్యులు కొందరు పాలకమండలి అక్రమాలపై కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయిందని అంటున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే.. ఈ వ్యవహారం పోలీసుల పరిధిలోకి రాదని, అక్రమార్కులపై క్రిమినల్ కేసు పెట్టేలా సహకార శాఖలో అర్జీ పెట్టుకోవాలని వారు పేర్కొన్నారని చెబుతున్నారు. పోలీసులు ఇచ్చిన కాపీని సైతం జతపర్చి సహకార కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సీనియర్ సభ్యులు వాపోతున్నారు. పాలక వర్గం అక్రమాలపై విచారణ జరిపించాలి సొసైటీ పాలక మండలి అక్రమాలపై తక్షణమే విచారణ జరిపించాలి. నిబంధనల ప్రకారం పాత సభ్యులందరికీ స్థలాల కేటాయింపు అనంతరమే కొత్త సభ్యత్వం చేపట్టాలి. సహకార రిజి్రస్టార్ తక్షణమే స్పందించాలి. – జ్యోతిప్రసాద్ కొసరాజు, సీనియర్ సభ్యుడు, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీఎలాంటి ఉత్తర్వులు అందలేదు..జూబ్లీహిల్స్ సొసైటీకి సంబంధించి ఎలాంటి ఉత్తర్వుల ప్రతి నాకు అందలేదు. రాష్ట్రంలోని 90 సొసైటీల్లో ఇదొకటి. సొసైటీలపై ఫిర్యాదులు రావడం సహజం. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు ఏవైనా వచ్చి ఉంటే.. సెక్షన్‌కు వచ్చి ఉండవచ్చు. – జి.శ్రీనివాసరావు, కో–ఆపరేటివ్ అడిషనల్ రిజి్రస్టార్ -
ఐదు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. గత నెల మూడోవారం నుంచే నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో కూడా కోతలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో పౌరసరఫరాల సంస్థ బిజీగా ఉంది. మార్చి 25వ తేదీ నుంచే అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ సీజన్లో మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి 75.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రారంభించిన 443 కొనుగోలు కేంద్రాల్లో పౌరసరఫరాల సంస్థ ద్వారా 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఒకటి రెండు రోజుల తర్వాత కోతలు పెరిగి ..ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. ఐకేపీ, పీఏసీఎస్ వంటి సహకార సంఘాల ద్వారా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడేనా..? కొన్నేళ్లుగా ధాన్యం సేకరణ ప్రక్రియలో మిల్లర్ల జోక్యం పెరిగింది. కొనుగోలు కేంద్రాలలోనే తరుగు పేరుతో క్వింటాల్‌కు 5 కిలోలకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి అదనంగా తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. తీరా ధాన్యం మిల్లులకు పంపిన తర్వాత కూడా రంగు మారిందని, తాలు, తేమ అధికంగా ఉందని కారణాలు చెబుతూ మిల్లర్లు నేరుగా రైతులకు ఫోన్లు చేయించి వేధించి తరుగు తీయడం పరిపాటిగా మారింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం తప్ప, కొర్రీలు పెడితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మిల్లులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో కూడా తరుగు, హమాలీ పేరుతో కిలోల కొద్దీ ధాన్యం రైతుల నుంచి దోచుకునే విధానానికి స్వస్తి పలకాలని రైతులు కోరుతున్నారు. అందుబాటులో 14 కోట్ల గన్నీ సంచులు రాష్ట్రంలో ఈసారి కొనుగోలు కేంద్రాలకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినా, ఈసారి దిగుబడి, ధాన్యం విక్రయాల తీరును బట్టి చూస్తే 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులలోపే ధాన్యం సేకరణ జరిగే అవకాశముందని పౌరసరఫరా వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగా ఈసారి వడ్ల సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని ప్రభుత్వం భావించింది. అందులో ఇప్పటికే 14 కోట్ల గన్నీ సంచులను పౌరసరఫరాల శాఖ అందుబాటులో ఉంచింది. ఈ గన్నీ బ్యాగులు 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు ఇవి సరిపోతాయి. మిగతా గన్నీ బ్యాగులను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా, వాటి అవసరం ఉండక పోవచ్చని అధికారులు అంటున్నారు. -
‘నేత’ రాత మారేదెలా?
సాక్షి, యాదాద్రి: ఆరేళ్లుగా చేనేత సహకార సంఘాల ఎన్నికల ఊసే లేదు. దీంతో క్షేత్రస్థాయిలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పట్టించుకునేవారే లేకుండా పోయారు. ఎన్నికలు జరగని కారణంగా టెస్కో ఉనికిలో లేకుండాపోయింది. 2018లో సహకార సంఘాల పదవీకాలం ముగిసింది. అయితే గత ప్రభుత్వం కొత్త పాలకమండలిని ఏర్పాటు చేయకుండా పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించింది. రాష్ట్ర స్థాయి పాలకవర్గం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో చేనేత వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లడానికి ఇబ్బందిగా మారింది. గత ప్రభుత్వం టెస్కోకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన తెలంగాణ హ్యాండ్లూమ్ కార్పొరేషన్,పవర్లూమ్ కార్పొరేషన్లు కేవలం చైర్మన్ల నియామకం వరకే పరిమితమయ్యాయి. జియో ట్యాగింగ్, త్రిఫ్ట్ ఫండ్, చేనేత బీమా, నేతన్నకు చేయూత వంటి పథకాలను గత ప్రభుత్వం అమలు చేసినా అవి అందరికీ అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 375 సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా 375 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటిల్లో 45మంది కార్మికులు ఉన్నారు. అయితే 2018లో ఓటర్ ఫొటో గుర్తింపు కార్యక్రమం చేపట్టగా, జియో ట్యాగింగ్ విధానం అమల్లోకి తెచ్చి, కేవలం 9వేలమందిని లెక్క చూపిస్తున్నారు. మిగతా కార్మీకులు జియో ట్యాగింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. సహకార సంఘాలకు 2013 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించగా, పదవీకాలం 2018 ఫిబ్రవరి 9తో ముగిసింది. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి. కానీ ప్రభుత్వం పర్సన్ ఇన్‌చార్జ్‌లను నియమించి, ప్రతి ఆరునెలలకోసారి పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. టెస్కో పాలకవర్గం ఎప్పుడు? ఉమ్మడి ఏపీలో చేనేత వృత్తిదారుల కోసం ఆప్కో ఉండగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత టెస్కోగా మారింది. అయితే ప్రస్తుతం టెస్కోకు పాలకవర్గం లేదు. సహకార సంఘాల ఎన్నికలు జరిగితే ప్రతి జిల్లా నుంచి ఒక డైరెక్టర్‌ను ఎన్నుకొని వారిలో నుంచి రాష్ట్రస్థాయి చైర్మన్, వైస్ చైర్మన్‌తోపాటు ప్రతి జిల్లా డైరెక్టర్ పాలకవర్గ సభ్యులుగా ఉండేవారు. ప్రస్తుతం పాలకవర్గాలు లేవు. ఐఏఎస్ అధికారుల చేతిలో పాలన కొనసాగడంతో వృత్తిదారుల సమస్యలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఎన్నికలు నిర్వహించాలని చేనేత వృత్తిదారులు కోరుతున్నారు. మూతపడిన సిరిపురం సొసైటీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేట మండలం సిరిపురం చేనేత సహకార సంఘంలో 1000 మంది సభ్యులు ఉన్నారు. సుమారు 40 ఏళ్లుగా వృత్తిదారులకు పని కల్పిస్తోంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పర్సన్ ఇన్‌చార్జ్‌ల పాలనలో సొసైటీ రూ.40 లక్షల నష్టాల్లో కూరుకుపోయింది. జియో ట్యాగింగ్ పేరుతో 150 మందినే పనిదారులుగా గుర్తించి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. సొసైటీ ఎన్నికలు నిర్వహించాలి – అప్పం రామేశ్వరం, సిరిపురం సొసైటీ మాజీ చైర్మన్ చేనేత సహకార సంఘం ఎన్నికలు నిర్వహించాలి. కొండాలక్ష్మణ్ బాపూజీ సహకార స్ఫూర్తితో ఏర్పడిన సహకార సంఘాల వల్ల చేనేత కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది. పాలకవర్గం లేకపోవడంతో చేనేత సమస్యలను మాట్లాడేవారు లేకుండా పోయారు. వస్త్రాల తయారీకి ఆర్డర్ ఇవ్వాలి ప్రభుత్వం వినియోగిస్తున్న వ్రస్తాల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల మాదిరిగా మాకూ ఇవ్వాలి. చేనేత సొసైటీలకు ఇస్తున్నట్టుగానే డీసీసీబీ రుణాలు ఇవ్వాలి. పవర్లూమ్లకు వ్రస్తాలను తయారు చేసే ఆర్డర్లు ఇవ్వాలి. వెంటనే సహకార ఎన్నికలు నిర్వహించాలి. – గాడిపల్లి శ్రవణ్ కుమార్, మాజీ చైర్మన్, శ్రీతారకరామ పవర్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్, ప్రొడక్షన్, అండ్ సేల్స్ సొసైటీ, రఘునాథపురం -
'భయో' ఫెర్టిలైజర్
సాక్షి, హైదరాబాద్ : బయో ఫెర్టిలైజర్ పేరిట బలవంతంగా ‘గోల్డ్ కంపోస్ట్’తమకు అంటగడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇష్టం లేకపోయినా తప్పనిసరి కొనాల్సిందేనని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (ప్యాక్స్) ఒత్తిడి తెస్తున్నాయని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో బహుళజాతి కంపెనీలు తక్కువ ధరకు ఇస్తున్నా, గోల్డ్ కంపోస్ట్‌ను అధిక ధరకు విక్రయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రోమోర్ కంపెనీకి చెందిన బయో ఫెర్టిలైజర్ 40 కేజీల బస్తా రూ. 300 వరకు మార్కెట్లో ఉండగా, స్థానికంగా రాష్ట్రంలో తయారయ్యే ‘మార్క్‌ఫెడ్ గోల్డ్ కంపోస్ట్’ధర మాత్రం ఏకంగా రూ. 472 ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. మార్క్‌ఫెడ్ నుంచి ఒత్తిడి పెరగడంతో ప్యాక్స్‌లు గోల్డ్ కంపోస్ట్‌ను కొనుగోలు చేయక తప్పడంలేదు. అయితే రైతులు కొనుగోలు చేయనిచోట ఆ మేరకు ప్యాక్స్‌ల వద్దే నిల్వ ఉండిపోతున్నాయి. గత వానాకాలం సీజన్ నుంచి పూర్తిస్థాయిలో దీనిని రైతులకు అందుబాటులోకి తీసుకురావడంతో అప్పటినుంచి ఈ ఫెర్టిలైజర్‌ను అంటగట్టే పనిలో మార్క్‌ఫెడ్ నిమగ్నమైంది. జిల్లాల్లోని మార్క్‌ఫెడ్ మేనేజర్లకు ఇండెంట్ పెట్టి మరీ దీనిని విక్రయిస్తున్నారు. దీంతో రైతులు, డీలర్లు, ప్యాక్స్ నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. టెండర్లు లేకుండానే ఒప్పందం... బయో ఫెర్టిలైజర్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలని గతేడాది మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. పంటలకు రసాయన ఎరువులను తగ్గించేందుకు ’మార్క్‌ఫెడ్ గోల్డ్ కంపోస్ట్’పేరుతో సేంద్రియ ఎరువును మార్కెట్లోకి తీసుకొచ్చింది. వరి, మొక్కజొన్న, పత్తితోపాటు ఉద్యాన పంటలకూ వినియోగించేలా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో విశ్వ ఆగ్రోటెక్ ఆధ్వర్యంలో పెద్ద ప్లాంట్ నిర్మించి దీనిని తయారు చేస్తున్నారు. ఈ సంస్థతో మార్క్‌ఫెడ్ ఒప్పందం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎరువుల దుకాణాలతోపాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లోనూ వీటిని రైతులకు అందుబాటులో ఉంచాలని మార్కెఫెడ్ నిర్ణయించింది. ఈ సేంద్రియ ఎరువును వరి, టమాటా, మిరప, మామిడి, బత్తాయి, నిమ్మ, నారింజ, అరటి, డ్రాగన్ ఫ్రూట్ సహా అన్నిరకాల పూలతోటలు, ఆయిల్‌పామ్, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ, పసుపు, చెరకు పంటలకు ఉపయోగించడం వల్ల నేల సారవంతమవుతుందని, అధిక దిగుబడి వస్తుందని మార్క్‌ఫెడ్ చెబుతోంది. అయితే ఇలాంటి సేంద్రియ ఎరువులకు ప్రసిద్ధి చెందిన అనేక కంపెనీలు జాతీయస్థాయిలో చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు విశ్వ ఆగ్రోటెక్తో ఒప్పందం చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. టెండర్ పిలవకుండా ఏకంగా ‘మార్క్‌ఫెడ్ గోల్డ్ కంపోస్ట్’పేరుతో దానికి నామకరణం చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి. ఒక ప్రైవేట్ కంపెనీని ప్రమోట్ చేయడానికి ప్రభుత్వానికి చెందిన మార్క్‌ఫెడ్ పేరును ఉపయోగించుకోవడంపై ఉద్యోగులు, కొందరు అధికారుల్లోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సంబంధిత కంపెనీ పేరు పెట్టుకుంటే సరేననుకోవచ్చు. అంతేకానీ మార్క్‌ఫెడ్ గోల్డ్ కంపోస్ట్ అని నామకరణం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమకున్న అధికారాన్ని ఉపయోగించుకొని మార్క్‌ఫెడ్ బోర్డులో ఆమోదం తెలుపుకోవడంపైనా ఆరోపణలు ఉన్నాయి. మార్క్‌ఫెడ్‌లో ఒక ఉన్నతస్థాయి ప్రజాప్రతినిధి సహా కొందరు పెద్దస్థాయి వ్యక్తులకు ఇందులో భాగస్వామ్యం ఉందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆ కంపెనీతో వారికి లోపాయికారీ సంబంధాలు ఉన్నాయన్న చర్చా జరుగుతోంది. అందుకే టెండర్లు లేకుండానే ఒప్పందం చేసుకొని మార్కెట్లోకి ప్రవేశపెట్టారని చెబుతున్నారు. అంతేకాదు అధిక ధరకు విక్రయించడంపై రైతులు, డీల ర్లు, ప్యాక్స్ నిర్వాహకులు మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వందృష్టిసారించాలన్న విన్నపాలు తమకు భారంగా మారిన గోల్డ్ కంపోస్ట్ ఎరువుల ధరలు తగ్గించాలని రైతులు కోరుతున్నారు. గ్రోమోర్ వంటి కంపెనీ ఉండగా, నిజామాబాద్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన కంపెనీకి ప్రాధాన్యం ఇవ్వడంపైనా విమర్శలున్నాయి. ఏ ప్రమాణాల ప్రకారం ఆ కంపెనీతో అవగాహనకు వచ్చారో కొత్త ప్రభుత్వం దృష్టిసారించాలని వారు కోరుతున్నారు. -
పంచాయతీకొక సొసైటీ
న్యూఢిల్లీ: సహకార సంఘాల ద్వారా రైతులకు రూ.10 లక్షల కోట్ల మేర చేయూత నివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా కొత్తగా 2 లక్షల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(ప్యాక్స్)ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామీణ సహకార బ్యాంకింగ్ విధానంపై కేంద్ర సహకార శాఖ, రాష్ట్ర సహకార బ్యాంకుల జాతీయ సమాఖ్య(ఎన్ఏఎఫ్ఎస్సీవోబీ) నిర్వహించిన జాతీయ సదస్సులో శుక్రవారం అమిత్ షా మాట్లాడారు. ‘ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 95 వేల ప్యాక్స్‌లో కేవలం 63 వేలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇవి రూ.2 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందజేస్తున్నాయి. వ్యవసాయ రుణ విధానానికి గుండెకాయలాంటి ప్యాక్స్‌ను విస్తరించి, పటిష్టం చేయాలి. ఇందుకోసం పంచాయతీ కొకటి చొప్పున దేశంలోని 3 లక్షల పంచాయతీలకు మరో 2 లక్షల ప్యాక్స్ నెలకొల్పాల్సిన అవసరం ఉంది’అని ఆయన చెప్పారు. ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించగలిగితే రూ.10 లక్షల కోట్ల రుణ సాయం అందించేందుకు వీలవుతుందని అన్నారు. మోడల్ బై–లాస్‌తోపాటు నూతన సహకార విధానం, సహకార వర్సిటీ, ఎక్స్పోర్ట్ హౌస్, సహకార బ్యాంకులకు డేటాబేస్ అభివృద్ధి వంటివి కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని మంత్రి అమిత్ షా వెల్లడించారు. -
పండుగలా వైఎస్సార్ సున్నా వడ్డీ ఉత్సవం
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్ సున్నా వడ్డీ ఉత్సవాలు శనివారం రాష్ట్రమంతటా పండుగ వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న వారిలో సీఎం జగన్ తర్వాతే ఎవరైనా అని నినాదాలు చేశారు. పొదుపు సంఘాల మహిళలు తీసుకున్న రుణాలకు సంబంధించి వరుసగా మూడో ఏడాది ప్రభుత్వమే వడ్డీని చెల్లిస్తున్న నేపథ్యంలో ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ పాల్గొని మహిళలకు సున్నా వడ్డీ చెక్కులు పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మార్కెట్ యార్డులో జరిగిన ఉత్సవానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ భవానీపురంలోని ఊర్మిళ సుబ్బారావు నగర్లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు, కృష్ణా జిల్లా గూడూరులో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రాయితీ చెక్కులను పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ మహిళలతో కలిసి ప్లకార్డు చూపుతున్న మంత్రి ఉషశ్రీ చరణ్ ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సున్నా వడ్డీ సంబరాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. నరసాపురం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెక్కులు పంపిణీ చేశారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో చెక్కుల పంపిణీ పండుగ వాతావరణంలో కొనసాగింది. -
కోపరేటివ్ సోసైటీలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు.. ఇకపై అలా చేస్తామంటే కుదరదు
ముంబై: సహకార సంఘాలు తమ పేర్లలో ‘బ్యాంక్’ ను జోడించుకోవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం స్పష్టం చేసింది. తమ పేర్లలో ‘బ్యాంక్’ను తగిలించుకోవడం, సభ్యులు కాని వారి నుంచి డిపాజిట్లు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడే సహకార సొసైటీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత ఏడాది సెప్టెంబర్ 29 నుంచీ అమలులోకి వచ్చిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ 1949 సవరణ చట్టం ప్రకారం సహకార సంఘాలు తమ పేర్లలో భాగంగా ‘బ్యాంక్‘, ‘బ్యాంకర్‘ లేదా ‘బ్యాంకింగ్‘ అనే పదాలను నిబంధనల ఉల్లంఘించి వినియోగించరాదని ఆర్బీఐ స్పష్టం చేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్ట నిబంధనలను ఉల్లంఘించి కొన్ని సహకార బ్యాంకులు తమ పేర్లలో ‘బ్యాంక్’ పదాన్ని జోడించుకుంటున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు ఆర్బీఐ ప్రకటన తెలిపింది. సభ్యులు కాని వారి నుంచి డిపాజిట్లు సేకరించవద్దు.. కొన్ని సహకార సంఘాలు సభ్యులు కానివారు/ నామమాత్రపు సభ్యులు/ అసోసియేట్ సభ్యుల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తున్నాయని పేర్కొన్న ఆర్బీఐ, ఇది నిబంధనలను ఉల్లంఘించి బ్యాంకింగ్ వ్యాపారం చేయడంతో సమానమని స్పష్టం చేసింది. సహకార సొసైటీలకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద ఎటువంటి లైసెన్స్‌లు జారీ కాలేదని, వాటికి బ్యాంకింగ్ వ్యాపారం చేయడానికి ద్వారా అధికారం లేదని పేర్కొంది. ఈ సొసైటీలలో ఉంచిన డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్– క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నుండి బీమా రక్షణ కూడా అందుబాటులో ఉండదని పేర్కొంది. ఏదైనా సొసైటీ ‘బ్యాంక్’ అని క్లెయిమ్ చేసుకుంటే, అటువంటి సహకార సంఘాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఆయా సొసైటీలతో లావాదేవీలు నిర్వహించే ముందు ఆర్బీఐ జారీ చేసిన బ్యాంకింగ్ లైసెన్స్ ఏమిటన్నది పరిశీలించాలని కూడా సూచించింది. ఆ తరహా సొసైటీల కార్యకలాపాలను తన దృష్టికి తీసుకురావాలని పేర్కొంది. -
సంపూర్ణ ‘సహకారం’తో స్వయం సమృద్ధి
సాక్షి, అమరావతి: సంఘ సభ్యుల సంక్షేమమే ధ్యేయంగా, పరస్పర సహకారమే లక్ష్యంగా, సంపూర్ణ సహకారాన్ని పొందడమే ఉద్దేశంగా సహకార సంఘాల వారోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. స్వయం సమృద్ధే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ ఇవి కొనసాగుతాయి. సహకార సంఘాల నుంచి సభ్యులు నగదును అప్పుగా తీసుకుని ఆ మొత్తాన్ని సద్వినియోగం చేసుకుని.. సొంత కాళ్లపై నిలబడగలిగేలా చేసేందుకు ఈ వారోత్సవాలు తోడ్పడాలన్నది లక్ష్యం. గ్రామీణ యువత తమ సొంత సహకార సంఘాల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా సహకార వ్యవస్థను పటిష్టం చేయొచ్చు. ఈ సంఘాల్లో ప్రజలు క్రియాశీల పాత్ర పోషించేలా చేసి, వారి పొదుపు మొత్తాలు ఏదో ఒక ఉత్పాదకతకు ఉపయోగపడేలా చేయడం కోసం ఈ సహకార ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. లక్ష్యం బాగానే ఉన్నా రానురాను ఈ సంఘాల సంఖ్య తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సహకార ఉద్యమాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. సహకార సంఘాల్లో మరింత మంది చేరేలా ప్రోత్సహించాలని సంకల్పించింది. సహకార వారోత్సవాల్లో భాగంగా.. సహకార సంఘాల ప్రయోజనాలు, వాటి పని తీరు మరింత మందికి చేరువయ్యేలా ప్రచారం చేస్తారు. తెలుసుకున్న సమాచారాన్ని సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు ఇతరులకు కూడా వివరిస్తుంటారు. సమాచార మార్పిడితో పాటు ఇతరులకు మనం ఎంతమేర ఉపయోగపడగలం అనే భావాన్ని ప్రోత్సహించడం చేస్తుంటారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువైనందున వాటిని కూడా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్య పక్షాలకు సూచించింది. రాష్ట్రంలో పరిస్థితి.. రాష్ట్రంలో సహకార సంఘాలు చట్టపరమైన హోదా కలిగిన స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా ఉంటున్నాయి. వీటి అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని సృష్టించడం ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సహకార సంఘాల నియంత్రణకు రాష్ట్రంలో రెండు చట్టాలున్నాయి. ఒకటి.. 1964 చట్టాన్ని 2001లో సవరించారు. సహకార సూత్రాలకు అనుగుణంగా సహకార సంఘాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ నియంత్రణను కొంత వరకూ తగ్గించడమే దీని లక్ష్యం. రెండోది.. మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం.రాష్ట్రంలో సుమారు 67,268 సహకార సంఘాలున్నాయి. అవి.. వాటిలో రాష్ట్రస్థాయి సహకార సంఘాలు 10, కాగా, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు 13, ప్రాథమిక సహకార సంఘాలు 2,037, పాల సహకార సంఘాలు 90, మార్కెటింగ్ సహకార సంఘాలు 13, గిరిజన సహకార సంఘం 1, చేనేత సహకార సంఘాలు 470, చక్కెర మిల్లుల సహకార సంఘాలు 10, సేవా రంగ సహకార సంఘాలు 1414, ఇతరత్రా సంఘాలు 63,210 ఉన్నాయి. అయితే వీటిలో పలు సంఘాలు పనిచేయడం లేదని ఇటీవలి ఆడిట్ రిపోర్టులు తెలియజేస్తున్నాయి. పీఏసీఎస్‌లను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం నడుంకట్టింది. నాబార్డ్ సహకారంతో ఈ ప్రక్రియ సాగుతోంది. -
వాయిదా వేయాలన్న ఉద్దేశం లేదు
సాక్షి, అమరావతి: వ్యవసాయ పరపతి సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం నివేదించింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పష్టం చేశారు. సహకార సంఘాల్లో సభ్యత్వాల యథార్థతను తేలుస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది కూడా అందులో తెలియచేస్తామని వివరించారు. కాలపరిమితి ముగిసిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలన్న చట్టం నిబంధన నుంచి రాష్ట్రంలోని అన్ని పరపతి సహకార సంఘాలను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జీవో 475 జారీ చేసింది. పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్చార్జిలను నియమించింది. జీవో 475తోపాటు పర్సన్ ఇన్చార్జిల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ సమయంలో సీజే స్పందిస్తూ ఎన్నికలు ఎప్పుడు పెడతారని ప్రశ్నించారు. అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ఏజీ బదులిచ్చారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన వాసిరెడ్డి ప్రభునాథ్ జోక్యం చేసుకుంటూ.. జీవో చెల్లుబాటునూ తేల్చాల్సిన అవసరముందన్నారు. అన్ని అంశాలపై విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అఫిడవిట్ దాఖలుకు ప్రభుత్వానికి గడువునిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది. -
సహకారానికి పూర్వ వైభవం
సాక్షి, అమరావతి: సహకార రంగానికి పూర్వ వైభవం వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రుణాల మంజూరు, ఎరువులు, విత్తనాల పంపిణీ లాంటి కార్యక్రమాలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గతంలో నిత్యం కోలాహలంగా కనిపించేవి. పాలక వర్గాల్లో రాజకీయ జోక్యంతోపాటు దీర్ఘకాలం పాతుకుపోయిన సిబ్బంది సహకార స్ఫూర్తికి భంగం కలిగించారు. టీడీపీ పాలనలో పాలకవర్గాలు ఇష్టారీతిన వ్యవహరించాయి. రాష్ట్రంలో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులుంటే 10 బ్యాంకులపై 51 విచారణలు జరుగుతుండటం గమనార్హం. దాదాపు 200 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో భారీ అక్రమాలు, అవినీతిపై సహకార ట్రిబ్యునళ్లలో కేసులున్నాయి. కొన్ని సంఘాలపై ఏసీబీ, సీఐడీ విచారణలు కూడా జరుగుతున్నాయి. వేతన స్కేళ్లను తెచ్చిన వైఎస్సార్.. రైతులకు విత్తనాలు, ఎరువులు సీజన్లో అందించాల్సిన సహకార సంఘాలు నష్టాల ఊబిలో కూరుకుపోయి చేతులెత్తేయడం, కనీసం రుణాలివ్వలేని దుస్థితికి చేరుకోవడంతో సహకార వ్యవస్థ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. నాబార్డు అనుబంధ సంస్థ నాబ్కాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 2,106 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా 811 సంఘాలు నష్టాల్లో కూరుకుపోయినట్లు నాబ్కాన్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. వైద్యనాథన్ కమిటీ సిఫారసుల మేరకు సహకార సంఘాల ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం నాబార్డు పరిధిలోకి తెచ్చింది. ఈ క్రమంలో మహానేత వైఎస్సార్ 2009లో ఉద్యోగులకు వేతన స్కేళ్లను అమలులోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఉద్యోగులకు వేతన సవరణ చేయాలి. అయితే ఆ తరువాత ప్రభుత్వాలు సహకార ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. అమూల్‌తో ఒప్పందం.. ఎన్నికల సమయంలో పశుపోషకులకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పాల ఉత్పత్తుల తయారీ, అమ్మకాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అమూల్‌తో ఒప్పందం చేసుకుంది. సహకార సంఘాల చట్టానికి అనుగుణంగా పనిచేస్తున్న సంఘాల్లో మహిళా పాల ఉత్పత్తిదారులకు సభ్యత్వం కల్పించడంతోపాటు పాడిపశువుల కొనుగోలుకు ఆర్థిక సాయం చేస్తోంది. ప్రైవేట్ డెయిరీల కంటే అధిక రేటుకు పాల ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేస్తోంది. తొలిదశలో ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో పాలసేకరణ కేంద్రాలను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల్లో రూ.6,551 కోట్ల వ్యయంతో 9,899 గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యత... రైతుల నుంచి ధాన్యం కొనుగోలు బాధ్యతను ప్రాథ«మిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం అప్పగిస్తోంది. సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకుంది. సేకరణ ద్వారా వచ్చే కమిషన్‌తో సంఘాలకు కొంత ఆదాయం సమకూర్చేలా చర్యలు చేపట్టింది. 48 కస్టమ్ హైరింగ్ సెంటర్లు.. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా వరికోత, నాట్లు వేసే భారీ యంత్రాలను అద్దెకు ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం అమలులోకి తెస్తోంది. ఇందుకోసం మండల స్ధాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలోని 48 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు భారీ యంత్రాల కొనుగోలుకు రుణం ఇవ్వనుంది. ఒక్కో సంఘానికి రూ.50 లక్షల నుంచి రూ.1.30 కోట్ల వరకు రుణం అందచేస్తారు. పాలనపరమైన అంశాల్లో కీలక నిర్ణయాలు.. ఉద్యోగులకు నిర్ణీత వ్యవధిలో వేతన సవరణ, సిబ్బందికి కనీస విద్యార్హతలు, బదిలీలు, చనిపోయిన వారి అంత్యక్రియలకు ఆర్థిక సాయం లాంటి నిర్ణయాలు తీసుకోవడంపై ఉద్యోగ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. విప్లవాత్మక మార్పులు.. రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఎరువులు, విత్తనాలు, రుణాల మంజూరు, యాంత్రిక పరికరాలను అద్దెకు ఇచ్చే విధానాలతో సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. అమూల్‌తో ఒప్పందం వల్ల మహిళా పాల ఉత్పత్తిదారుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. వినూత్న విధానాలతో ఆర్థిక ప్రయోజనాలు కలిగించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. – వాణీ మోహన్, సహకార శాఖ కార్యదర్శి -
పరపతి సంఘాలకు నాబార్డ్ చేయూత!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నాబార్డ్ చేయూతను అందిస్తోంది. రైతులకు విత్తనాలు మొదలు అన్ని రకాల సేవలు అందిస్తున్న వీటిని మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం రూ.3,321 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ► సంఘాల ఆధ్వర్యంలో గోడౌన్లు, కోల్డ్ రూములు, కలెక్షన్ సెంటర్లు, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, ప్లాట్‌ఫామ్‌లు నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రైతులకు గ్రామ స్థాయిలోనే సేవలతోపాటు సంఘాలకు అదనపు ఆదాయం లభిస్తుంది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుని సమగ్ర నివేదికలను అధికారుల ద్వారా నాబార్డ్ చైర్మన్ చింతల గోవిందరాజులుకు అందే ఏర్పాటు చేశారు. ► ఈ ప్రతిపాదనలకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతోపాటు తొలి విడత రూ.1,250 కోట్ల విడుదలకు అంగీకరించారు. ► మరే రాష్ట్రంలో లేని విధంగా నామమాత్రపు వడ్డీకి ఈ రుణం లభించనుంది. నాలుగు శాతం వడ్డీకి రుణం ఇస్తున్నప్పటికీ సకాలంలో చెల్లిస్తే మూడు శాతం రాయితీ ఇవ్వడానికి నాబార్డ్ అంగీకరించింది. దీంతో కేవలం 1 శాతం వడ్డీతోనే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు రుణం పొందనున్నాయి. సహకార సంఘాలను పటిష్టం చేయడానికే.. ► రాష్ట్రంలో 2,043 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఉంటే.. వీటిలో 800 నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ► ఈ సంఘాలు రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను విక్రయించలేకపోతున్నాయి. అదే విధంగా రుణాలను కూడా ఇవ్వలేకపోతున్నాయి. ► వీటితోపాటు మిగిలిన సంఘాలను ఆర్థికంగా పటిష్టపరిచి రైతులకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం రెండు నెలల క్రితం రూ.3,321 కోట్లకు డీపీఆర్‌లను రూపొందించింది. ► ఇందులో గోడౌన్ల నిర్మాణాలకు రూ.1,893 కోట్లు, పంటలను ఆరబెట్టుకోవడానికి ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణాలకు రూ.207 కోట్లు, పీపీసీ ఎక్విప్మెంట్, డయ్యర్లు తదితర యాంత్రిక పరికరాలకు రూ.1,009 కోట్లు, ప్రొక్యూర్మెంట్, ఈ–ప్లాట్‌ఫామ్‌లకు రూ.212 కోట్లను కేటాయించింది. ► నాబార్డ్ రుణం మంజూరు చేయడానికి అంగీకరించడంతో ఆసక్తి, ఆర్థిక పరిపుష్టి ఉన్న సంఘాలు.. గోడౌన్లు, కోల్డ్ స్టోర్ రూమ్‌ల ఏర్పాటుకు ముందుకు వస్తే, వాటికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ► సోమవారం ఇదే అంశంపై చర్చలు జరపడానికి సహకార, మార్కెటింగ్, నాబార్డ్ అధికారులు సమావేశం కానున్నారు. -
సహకారం.. ఉద్రిక్తం
సాక్షి నెట్వర్క్: పలు జిల్లాల్లో సహకార సంఘాల పాలకవర్గం ఎన్నికలు ఆదివారం ఉద్రిక్తతలకు దారి తీశాయి. చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు ఆశించి భంగపడటంతో ఆ పార్టీల నేతలు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో పలు చోట్ల పాలకవర్గం ఎన్నికలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతల మధ్యే ఎన్నికలు ముగిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దూరు సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య, వరంగల్ రూరల్ జిల్లా నర్సం పేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీ సులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఉద్రిక్తతల మ ధ్య ఎన్నికలు నిర్వహించడం వీలుపడకపోవడంతో సోమ వారానికి వాయిదా పడ్డాయి. మరోవైపు ఖమ్మం జిల్లా మ ధిర మండలం దెందుకూరు సహకార సంఘ పాలకవర్గ ఎన్నికలో కోరం లేదని అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. మరోవైపు శనివారం సహకార సంఘ పోలింగ్ సమయంలో నాగులవంచ పోలింగ్ కేంద్రం వద్ద రేపల్లె వాడ గ్రామస్తుల మధ్య స్వల్ప ఘర్షణ జరగడంతో 9 మం దిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రాళ్లతో దాడి... నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా సొసైటీలో ఆదివారం చైర్మన్ పదవికి నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ డైరెక్టర్లు వెళ్తుండగా, టీఆర్ఎస్ కార్యకర్తలు రావడం తో వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టా రు. నందిపేట మండలం చింరాజ్‌పల్లి సొసైటీ వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని 55 సొసైటీల్లో 52 చోట్ల టీఆర్ఎస్ మద్దతుదారులు చైర్మన్లుగా ఎన్నిక య్యారు. రెండు సొసైటీలను కాంగ్రెస్ సొంతం చేసుకో గా, ఒకచోట వాయిదా పడింది. డైరెక్టర్లను లాక్కుపోయారు.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ సహ కార సంఘం చైర్మన్ పదవి కోసం టీఆర్ఎస్ పార్టీలోని ఇరు వర్గాలు గొడవకు దిగాయి. ఒక వ ర్గం వెంట వచ్చిన డైరెక్టర్లను మరో వర్గం తమ వైపు లాక్కుపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాలు దాడికి దిగాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే కారులో సహకార సంఘం వద్దకు వచ్చిన ముగ్గురు డైరెక్టర్లను కారు అద్దాలు పగలగొట్టి మరో వాహనంలో తీసుకుని వెళ్లిపోయారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఒకరు.. పురుగుల మందు తాగి మరొకరు.. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లో సహకార సంఘం చైర్మన్ పదవి కోసం ముగ్గురు పోటీ పడటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరి నిమిషంలో బస్వాపూర్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీంతో పదవి అశించి భంగపడ్డ జగదేవ్‌పూర్ డైరెక్టర్ శ్రీనివాస్‌గౌడ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జగదేవ్‌పూర్‌కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కనకయ్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు తనకు చైర్మన్ పదవి ఇస్తారని మోసం చేశారని తిగుల్కి చెందిన డైరెక్టర్ భూమయ్య పురుగుల మందు తాగి ఆత్మ హత్యయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్ పదవి కోసం పోటీలో ఉన్న నలుగురు డైరెక్టర్లు పదవి తనకే కావాలని లేదంటే, పార్టీ మారుతామని తెగేసి చెప్పడంతో గందరగోళంగా మారింది. చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుజ్జగించడంతో కథ సుఖాంతమైంది. పదోసారి చైర్మన్‌గా.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండ లం ఖానాపురం పీ ఏసీఎస్ చైర్మన్‌గా జొన్నలగడ్డ హను మయ్య పదోసారి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఆదివారం ఖానాపురం పీఏసీ ఎస్ కార్యాలయంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. 1959 ఆగస్టు 13న ఏర్పడిన ఈ సంఘానికి మొదటి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1987 వరకు 28 ఏళ్లుచైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటివరకు ఆయ న గ్రామ సర్పంచ్‌గా 18 ఏళ్లు పనిచేశారు. రెండు పదవులు ఉం డరాదని 1987లో నిబంధన రావడంతో మధ్యలో నాలుగేళ్లు మినహా తిరిగి 1992 నుంచి నేటివరకు ఆయన చైర్మన్‌గా కొనసాగుతూ వచ్చారు. మొత్తం 56 ఏళ్లు ఆయన చైర్మన్‌గా పనిచేశారు. కాంగ్రెస్ టీసీల ఆందోళన తమకు నామినేషన్లు వేసే అవకాశం ఇవ్వకుండా ఎన్నికల అధికారి అన్యాయం చేశారంటూ వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి సొసైటీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌కు చెందిన టీసీలు ఆదివారం నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ బొడ్రాయి సమీపంలో మద్దతుదారులతో కలిసి ధర్నా చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చైర్మన్ అభ్యర్థి కిడ్నాప్? వరంగల్ అర్బన్ జిల్లా వంగపహాడ్ సొసైటీ చైర్మన్‌న్‌అభ్యర్థి కిడ్నాప్‌నకు గురైనట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు సొసైటీ ఎదుట ఆదివారం ఆందోళనకు దిగారు. చైర్మన్‌గా పోటీ నుంచి తప్పించడానికి తన కుమారుడు అశోక్‌ను కిడ్నాప్ చేశారని అతడి తండ్రి కొమురయ్య ఆరోపించారు. అయితే ఓటింగ్ తర్వాత అశోక్ ఇంటికి వచ్చినట్లు సమాచారం. చెల్లని డైరెక్టర్ ఓటు.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసిన 12 వార్డు డైరెక్టర్ నాంసానిపల్లెకు చెందిన గుగులోతు పర్శ్యనాయక్ వేసిన ఓటు చెల్లలేదు. అనారోగ్యంతో ఉన్న ఆయన.. బ్యాలెట్ పేపర్‌పై మధ్యలో వేయడంతో ఓటు చెల్లకుండా పోయింది. -
డిపాజిట్లపై ఆర్బీఐ హెచ్చరిక
హైదరాబాద్: సహకార సంఘాల్లో సభ్యులు కానివారి నుంచి డిపాజిట్లను స్వీకరించ వద్దని రిజర్వు బ్యాంకు సహకార సంఘాలను హెచ్చరించింది. అలాగే సహకార సంఘాలలో నామమాత్రపు సభ్యులు, అనుబంధ సభ్యుల నుండి కూడా డిపాజిట్లను స్వీకరించరాదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. కొన్ని సహకార సంఘాలు / ప్రాధమిక సహకార క్రెడిట్ సొసైటీలు .. సభ్యులు కానివారు / నామినల్ సభ్యులు / అసోసియేట్ సభ్యుల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తున్నారని రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిపై ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్, ఆర్ బిఐ (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్) శ్రీ ఆర్. సుబ్రమణియన్ క్లారిటీ ఇచ్చారు. ఈ సహకార సంస్థలకు, బ్యాంకింగ్ వ్యాపారము చేయడానికి, రిజర్వు బ్యాంకు బి.ఆర్. యాక్ట్ (బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949) అనుసరించి ఎటువంటి లైసెన్స్ ను జారీ చేయలేదని, అధికారం కూడా ఇవ్వలేదని ఆయన వివరించారు. ఇంటువంటి సహకార సంఘాలలో డిపాజిట్ చేసిన సొమ్ముకు ఎటువంటి బీమా కవరేజ్ లేదని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి, సహకార సంఘాలతో డిపాజిట్ల విషయంలో జాగ్రత్త వహించాలని ఆర్. సుబ్రమణియన్ కోరారు. -
అపార్టుమెంట్ల సొసైటీలకు సహకార రిజిస్ట్రేషన్
- తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం.. త్వరలో మార్గదర్శకాలు - పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యత తీసుకోనున్న సహకార శాఖ - ఏడాదికోసారి ఆడిటింగ్.. వివాదాలు వస్తే పరిష్కారం - దాదాపు రూ. 15 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: అపార్టుమెంట్ల సొసైటీలు ఇక నుంచి సహకార శాఖలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. ఆయా సొసైటీల పర్యవేక్షణ, ఏడాదికోసారి ఆడిటింగ్ బాధ్యతను సహకార శాఖ తీసుకోనుంది. దాంతోపాటు వివాదాలు వస్తే పరిష్కారం చూపనుంది. ఈ మేరకు అపార్ట్మెంట్ల సొసైటీలు సహకారశాఖలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తద్వారా సుమారు రూ. 15 కోట్ల ఆదాయాన్ని పొందనుంది. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించే పనిలో సహకార శాఖ ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. ఆ మార్గదర్శకాలకు సర్కారు ఆమోదం తీసుకొని.. అన్ని అపార్టుమెంట్లకు సర్క్యులర్ జారీ చేస్తారు. పాత అపార్టుమెంట్లతోపాటు కొత్తగా నిర్మించబోయే వాటి సొసైటీలు కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే నేరంగా పరిగణిస్తారు. పర్యవేక్షణ, నిర్వహణే ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలో దాదాపు 30 వేలకు పైగా అపార్టుమెంట్లు ఉంటాయని... అందులో 20 వేల వరకు హైదరాబాద్‌లో ఉంటాయని సహకార శాఖ అంచనా వేస్తోంది. ఈ సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే అపార్టుమెంట్లలో ఏర్పాటు చేసుకునే సొసైటీలపై ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో... వాటి నిర్వహణ దారుణంగా ఉంటోందన్న ఆరోపణలున్నాయి. వాటిలో నివసించేవారు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. నెలకోసారి నిర్వహణ రుసుము వసూలు చేస్తున్నా... నిర్వహణ లోపం, నీటి వసతి లేకపోవడం, లిఫ్టు వంటివి చెడిపోయినా మరమ్మతులు చేయించకపోవడం వంటివి జరుగుతున్నాయి. పలుచోట్ల వాచ్‌మన్ లేకపోవడమూ ఉంటోంది. సీసీ కెమెరాలు లేకపోవడంతో కొన్నిచోట్ల నేరాలు జరుగుతున్నాయి. సొసైటీలు సరిగా పనిచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని.. నిర్వహణ రుసుము వసూలు చేస్తూ కూడా సరిగా ఖర్చు పెట్టే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. కొందరు బిల్డర్లు అపార్టుమెంట్లు నిర్మించాక.. కొన్ని ఫ్లాట్లు ఖాళీగా ఉన్నా, వాటి నిర్వహణ రుసుమును కూడా మిగతావారి నుంచి వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు నెక్లెస్‌రోడ్డుకు సమీపంలో ఒక ప్రజాప్రతినిధికి చెందిన అపార్టుమెంటులో దాదాపు 20 వరకు ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. కానీ వాటి నిర్వహణ రుసుమును కూడా అందులో నివసించే మిగతా వారి నుంచి వసూలు చేస్తున్నారని తెలిసింది. దీంతో ఒక్కో ఫ్లాటులో నివసించే వారు రూ. 7 వేల వరకు కట్టాల్సి వస్తోందని సహకార శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. వాస్తవానికి కొనుగోలు కాకుండా ఖాళీగా ఉన్న ఫ్లాట్ల నిర్వహణ రుసుమును బిల్డరే చెల్లించాలన్న నిబంధన ఉంది. కొన్ని అపార్టుమెంట్ల సొసైటీలు ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. అదే సహకారశాఖ పరిధిలోకి వస్తే ప్రతీ ఏడాది తప్పనిసరిగా ఆడిటింగ్ చేస్తారు. నిర్వహణ లోపాలు తలెత్తినా, వివాదాలు వచ్చినా సహకార శాఖే పరిష్కరిస్తుంది. పెద్ద అపార్టుమెంట్లయితే అవసరాన్ని బట్టి ఎన్నికలూ నిర్వహించే అవకాశాలు లేకపోలేదని సహకార అధికారి ఒకరు చెప్పారు. మొత్తంగా త్వరలోనే అపార్టుమెంట్ల నిర్వహణ, రిజిస్ట్రేషన్లపై మార్గదర్శకాలు ఖరారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
యూరియా.. ఏదయ్యా?!
జిల్లాలో ఎరువుల కొరత వర్షాలు పడుతుండటంతో పెరిగిన డిమాండ్ పరుగులు పెడుతున్న రైతులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు ఖమ్మం వ్యవసాయం : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎరువులకు డిమాండ్ పెరిగింది. జూన్, జూలైలో అడపాదడపా కురిసిన వానలకు రైతులతు పలు పంటలు సాగు చేశారు. జిల్లాలో వర్షాధారంగా, నీటి ఆధారంగా పత్తి సాగు చేశారు. బోరు బావుల కింద, నీటి ఆధారం ఉన్న ప్రాంతాల్లో జూలై చివరి వారం, ఆగస్టు మొదటి వారంలో వరినాట్లు వేశారు. ప్రధానంగా పలు ప్రాంతాల్లో ముందుగా వేసిన ఈ రెండు పంటలు ప్రస్తుతం యూరియా వేసే దశలో ఉన్నాయి. అంతేగాక ప్రస్తుతం వేస్తున్న పైర్లకు కూడా యూరియా వేయాలనే తపనతో రైతులు ఎరువుల దుకాణాలకు, ఎరువులు విక్రయించే సహకార సంఘాలకు పరుగులు తీస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు ప్రైవేటు డీలర్ల వద్ద లభిస్తున్నప్పటికీ యూరియా మాత్రం సక్రమంగా దొరకడం లేదు. యూరియా సంపూర్ణ స్థాయిలో లభించక పోవడం, అరకొరగా రావడంతో జిల్లా మార్క్‌ఫెడ్ ద్వార ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు పంపిణీ చేస్తున్నారు. సహకార సంఘాలు చేసిన డిపాజిట్ల ప్రకారం మార్క్‌ఫెడ్ యూరియాను సరఫరా చేస్తోంది. పలువురు ప్రైవేటు డీలర్లు కూడా యూరియాను తెప్పించి విక్రయిస్తున్నారు. ఖమ్మం నగరంతో పాటు జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం, మధిర తదితర మండలాల్లో కొందరు ప్రైవేటు డీలర్ల వద్ద యూరియా లేకపోగా, నిల్వలున్న దుకాణాల వారు బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారు. ప్రభుత్వం యూరియాకు నిర్ణయించిన ధర రూ.284 కాగా ప్రైవేటు దుకాణాల్లో రూ. 350కు పైగానే విక్రయిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో రూ. 400 వరకు కూడా అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. శనివారం ఇల్లెందులో యూరియా అధిక ధరలకు అమ్ముతుండగా రైతులు ప్రతిఘటించినట్లు తెలిసింది. సహకార సంఘాలు రైతులు ఆశించిన విధంగా యూరియాను అందించలేక రైతు స్థాయిని బట్టి రెండు, మూడు బస్తాల కన్నా ఎక్కువగా ఇవ్వడం లేదు. దీంతో రైతులు ఎరువుల దుకాణాలను ఆశ్రయించాల్సి వస్తోంది. యూరియా డిమాండ్‌ను గుర్తించిన ఎరువుల వ్యాపారులు ఇదే అదునుగా భావించి ఇష్టారాజ్యంగా అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. వ్యాపారులు యూరియా కొరత ఉందని చెబుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధిక ధరలను నిరోధించి ప్రకటించిన ధరలకు రైతులకు ఎరువులు అందే విధంగా చూడాల్సిన అధికారులు ఎంత మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు. జిల్లాలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడుతూ అధిక ధరలకు ఎరువులు అమ్మే వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని జలాశయాల్లోకి నీరు చెరుతోంది. వాటి ఆయకట్టు భూముల్లో సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు సాగర్ నీటిని కూడా రెండో జోన్‌కు విడుదల చేయడానికి నీటి పారుదల శాఖ నిర్ణయించింది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3.51 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 2.41 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు వేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో మరో లక్ష హెక్టార్ల సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. వరి ఇప్పటి వరకు జిల్లాలో 50 వేల హెక్టార్లు, పత్తి 1.63 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 12 వేల హెక్టార్లు, పెసర 6 వేల హెక్టార్లు, కంది 3,300 హెక్టార్లు, మిర్చి 2 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రధానంగా వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆగస్టు 25 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు ఊపందుకున్నాయి. దీంతో పంటల సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉంది. పంటల సాగు విస్తీర్ణానికి తగిన విధంగా యూరియా లభించే అవకాశం లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
‘సహకారం’ ఏది ?
మోర్తాడ్: సహకార సంఘాల్లో కొత్తగా సభ్యత్వం పొందిన రైతులకు రుణాలు మంజూరు కావడం లేదు. రైతుల రుణ మాఫీపై ప్రభుత్వం ఇంకా స్పష్టతను ఇవ్వక పోవడంతో కొత్తగా సభ్యత్వం తీసుకున్న రైతులకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదని సహకార సంఘాల పాలకవర్గాలు చెబుతున్నాయి. కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసుకున్నవారు, తమ తల్లి తండ్రుల పేర్లపై ఉన్న భూములను తమ పేరున మార్చుకున్న వారు ఎంతో మంది సహకార సంఘాల్లో కొత్తగా సభ్యత్వం తీసుకున్నారు. కొత్తగా సభ్యులుగా చేరిన రైతులకు రుణాలను మంజూరు చేయాల్సిన బాధ్యత సంఘాలపై ఉంది. సహకార సంఘాలను అజమాయిషీ చేసే జిల్లా సహకార బ్యాంకు నిధులను మంజూరు చేస్తేనే సంఘాలు రుణాల ప్రక్రియను ప్రారంభిస్తాయి. జిల్లా సహకార బ్యాంకులకు లీడ్ బ్యాంకుగా ఉన్న ఆప్కాబ్ కొత్త రుణాలపై ఎలాంటి విధానాన్ని ప్రకటించలేదు. దీంతో సహకార సంఘాలు కొత్త సభ్యుల దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచాయి. జిల్లాలో 142 సహకార సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘంలో కొత్తగా సభ్యులు చేరిన వారు 50 నుం చి 75 మంది వరకు ఉన్నారు. వాణిజ్య బ్యాంకుల్లో పం ట రుణం పొందడం కంటే సహకార సంఘాల్లో రుణం పొందడం మేలు అని భావించిన రైతులు సహకార సం ఘాల్లోనే దరఖాస్తులు చేసుకున్నారు. సహకార సంఘా ల ద్వారా రాయితీలు ఎక్కువగా ఉండటం, రుణం సుల భంగా లభిస్తుండటంతో రైతులు సహకార సంఘాలనే నమ్ముకున్నారు. ఎన్నికలకు ముందుగా టీఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పంట రుణాల మాఫీకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. టీఆర్ఎస్కు మంచి మెజార్టీ స్థానాలు లభించడంతో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల హామీని నిలబెట్టుకునేందు కు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇం డియా నిబంధనల కారణంగా రుణ మాఫీ ఇంకా జరుగడం లేదు. రుణ మాఫీపై ఏదైనా స్పష్టత వస్తేనే కొత్త రుణాలకు నిధులు మంజూరు అవుతాయని సంఘాల పాలకవర్గాలు చెబుతున్నాయి. రుణ మాఫీపై స్పష్టత రాకపోవడంతో కొత్త పంట రుణాలకు బ్రేక్ పడింది. రుణం రాక పోతే భూములను ఎలా అభివృద్ధి చేయాలి, పంటలను ఎలా సాగు చేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారుల వద్ద పంటల సాగు కోసం రుణం తీసుకుంటే వడ్దీభారం అధికం అవుతుందని రైతులు తెలిపారు. గతంలో పంట రుణం పొందిన రైతుల పరిస్థితి ఎలా ఉన్నా తమకు మాత్రం రుణం దొరకక ఇబ్బందులు కలుగుతున్నాయని సంఘాల్లో కొత్తగా సభ్యులుగా చేరిన రైతులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి సహకార సంఘాల్లోని కొత్త సభ్యులకు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
టీడీపీ అధినేతకు ఫ్యాక్స్‌లు
చోడవరం : రుణ మాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీ నమేషాలు లెక్కిస్తుండడంతో ఆందోళన చెం దుతున్న రైతులు, సహకార సంఘాలు పార్టీ అధినేతకు ఫ్యాక్స్ సందేశాలు పంపుతున్నారు. జిల్లాలో రూ. వెయ్యి కోట్ల రుణాలున్నట్లు అంచనా. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోనే రూ.300 కోట్ల అప్పు రైతుల నెత్తిపై ఉంది. రుణ మాఫీ ప్రకటనతో సక్రమంగా బకాయిలు చెల్లించే రైతులు కూడా మాఫీ జరుగుతుందన్న ఆశతో చెల్లింపులు నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో రుణ మాఫీపై ప్రభుత్వం ఎటువంటి మెలిక పెట్టినా బ్యాంకులు మునిగిపోక తప్పదు. జాతీయ బ్యాంకుల మాటెలాఉన్నా సహకార బ్యాంకు, సంఘాల పుట్టి మునగడం ఖాయం. ప్రమాణ స్వీకారం సందర్భంగా తొలి సంతకం మాఫీపైనే అని టీడీపీ అధినేత చెబుతున్నా అందులో ఏం మెలిక పెడతారో అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. మరోవైపు ఖరీఫ్ ముంచుకు వస్తుండడంతో కొత్త రుణా ల పరిస్థితి ఏమిటన్న సందిగ్దం కనిపిస్తోంది. 2014 మార్చి నెలాఖరు వరకు ఇచ్చిన వ్యవసాయ సాధారణ, బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తే పర్వాలేదుగాని, ఆంక్షలు విధిస్తే 70 శాతంపైగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ భయంతోనే సంపూర్ణ రుణ మాఫీ కోరుతూ రైతులు చంద్రబాబునాయుడుకు వినతులు పంపుతున్నారు. సంఘా ల అత్యవసర సమావేశాలు నిర్వహించి వ్యవసాయ రుణాలన్నింటినీ ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి వాటిని అధినేతకు ఫ్యాక్స్ చేస్తున్నాయి. ఆదర్శ సొసైటీగా పేరొందిన జుత్తా డ సభ్యులంతా ఇప్పటికే ఇటువంటి తీర్మానాన్ని బాబుకు ఫ్యాక్స్ చేశారు. ఇదే బాటలో కెజెపురం, మాడుగుల, విజయరామరాజు పేట, గోవాడ, రావికమతం, కొత్తకోట, బుచ్చెయ్యపేట, చీడికాడ, కె.కోటపాడుతోపాటు అన్ని ప్రాథమిక సహకార సంఘాల రైతులు నడిచేందుకు సిద్ధమవుతున్నారు. జుత్తాడ పీఏసీఎస్ అధ్యక్షుడు డి.సన్యాసినాయుడు మాట్లాడుతూ వాయిదా మీరిన రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కోరుతూ కొత్త ప్రభుత్వానికి ఫ్యాక్స్ పంపినట్లు చెప్పారు. -
సహకార రైతు రుణాలపై వడ్డీ రాయితీ!
సాక్షి, హైదరాబాద్: సహకార సంఘాల నుంచి రుణాలను తీసుకున్న రైతులకు ఈ ఏడాది కూడా వడ్డీ రాయితీ పద్ధతిని అమలు పరచనున్నారు. ఈ మేరకు సోమవారం వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీనివాసులు ఉత్తర్వులను జారీ చేశారు. స్వల్ప కాలిక రుణాలను 2.5 శాతం, దీర్ఘకాలిక రుణాలపై 6 శాతం వడ్డీ రాయితీని ఇవ్వనున్నారు. ఈ వడ్డీ రాయితీ కేవలం సహకార సంఘాల రుణాలకే వర్తించనుంది. -
‘తడిసి’ మోపెడు
మోర్తాడ్, న్యూస్‌లైన్: అకాల వర్షంతో తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకువెళ్లేందుకు రైస్ మిల్లర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రా ల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. అటు రైతు లు, ఇటు మిల్లర్ల మధ్య తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారయ్యిందని వారు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ సహకార సంఘాలు, ఇందిర క్రాంతి పథం మహిళా సంఘాల ఆధ్వర్యంలో 289 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. చాలా మంది రైతులు కోతలు పూర్తి కాగానే ధాన్యాన్ని ఈ కేంద్రాలకు తరలించారు. తూకం వేసి, నిర్వాహకులకు అప్పగించి వెళ్లిపోయారు. మామూలుగా అయితే ఈ ధాన్యాన్ని మిల్లర్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అనుకోకుండా మూడు రోజుల క్రితం అకాల వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల నిలువ ఉంచిన దాదాపు ఎనిమిది వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు వీలుగా కాంట్రాక్టర్లు లారీలను పంపాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎన్నిమార్లు మొత్తుకున్నా కాంట్రాక్టర్ లారీలను పంపడం లేదు. కొనుగోలు కేంద్రాలకు గిడ్డంగుల సౌకర్యం లేదు. దీంతో వారు ధాన్నాన్ని రహదారులపైనే కుప్పలుగా పోసి ఉంచారు. వాటిని తరలించడానికి లారీలు రాక పోవడంతో పెద్ద మొత్తంలో నిలువ ఉన్న ధాన్యం తడిసి పోయింది. దీంతో నిర్వాహకులు జిల్లా కలెక్టర్‌కు, జిల్లా ఉన్నతాధికారులకు విషయా న్ని వివరించారు. లారీలు సకాలంలో కొనుగోలు కేంద్రాల వద్దకు రాకపోవడంతో ధాన్యం నీటిపాలైందని వారి దృష్టికి తెచ్చారు. అధికారుల ఒత్తిడితో కాంట్రాక్టర్ లారీలను పంపాడు. అయితే, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని తీసుకోవడానికి రైస్ మిల్లర్లు నిరాకరించారు. తడిసిపోయిన ధాన్యంలో కొంత తరుగు తీసేసి తిరిగి లెక్క వేయాలని కోరుతూ వారు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు శనివారం తిప్పి పంపించారు. నష్టం వస్తుందంటూ జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యాన్ని నిజామాబాద్ మండలం ఖానాపూర్ శివారులోని రైస్‌మిల్లులకు తరలించేందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వారు తడిసిన ధాన్యాన్ని తీసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అయోమయం లో పడిపోయారు. ధాన్యంలో తేమ శాతం కొంత ఎక్కువగా ఉన్నా పర్వాలేదని, పూర్తిగా తడిస్తే మాత్రం తాము తీసుకోమని మిల్లర్లు చెబుతున్నారని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. తడిసిన ధాన్యానికి మొలకలు కూడా రావడంతో, వాటిని తీసుకుంటే తాము పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారని పేర్కొన్నారు. ఇటు రైతులు తాము తూకం వేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అప్పగించి వెళ్లామని, అక్కడ ఏం జరిగినా వారిదే బాధ్యత అని చెబుతున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. లారీలు ఆలస్యంగా రావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుంటేనే రైతులకు డబ్బు చెల్లింపు జరుగుతుంది. లేకపోతే లేదు. దీంతో రైతులలోనూ ఆందోళన నెలకింది. జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకుని దీనికి ఏదో ఒక పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.