పెద్దూరు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద ఇరువర్గాలను చెదరగొడుతున్న పోలీసులు
సాక్షి నెట్‌వర్క్: పలు జిల్లాల్లో సహకార సంఘాల పాలకవర్గం ఎన్నికలు ఆదివారం ఉద్రిక్తతలకు దారి తీశాయి. చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు ఆశించి భంగపడటంతో ఆ పార్టీల నేతలు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో పలు చోట్ల పాలకవర్గం ఎన్నికలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతల మధ్యే ఎన్నికలు ముగిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దూరు సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో టీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల మధ్య, వరంగల్ రూరల్ జిల్లా నర్సం పేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీ సులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఉద్రిక్తతల మ ధ్య ఎన్నికలు నిర్వహించడం వీలుపడకపోవడంతో సోమ వారానికి వాయిదా పడ్డాయి. మరోవైపు ఖమ్మం జిల్లా మ ధిర మండలం దెందుకూరు సహకార సంఘ పాలకవర్గ ఎన్నికలో కోరం లేదని అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. మరోవైపు శనివారం సహకార సంఘ పోలింగ్ సమయంలో నాగులవంచ పోలింగ్ కేంద్రం వద్ద రేపల్లె వాడ గ్రామస్తుల మధ్య స్వల్ప ఘర్షణ జరగడంతో 9 మం దిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
రాళ్లతో దాడి...
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా సొసైటీలో ఆదివారం చైర్మన్ పదవికి నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ డైరెక్టర్లు వెళ్తుండగా, టీఆర్‌ఎస్ కార్యకర్తలు రావడం తో వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టా రు. నందిపేట మండలం చింరాజ్‌పల్లి సొసైటీ వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని 55 సొసైటీల్లో 52 చోట్ల టీఆర్‌ఎస్ మద్దతుదారులు చైర్మన్లుగా ఎన్నిక య్యారు. రెండు సొసైటీలను కాంగ్రెస్ సొంతం చేసుకో గా, ఒకచోట వాయిదా పడింది.
డైరెక్టర్లను లాక్కుపోయారు..
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ సహ కార సంఘం చైర్మన్ పదవి కోసం టీఆర్‌ఎస్ పార్టీలోని ఇరు వర్గాలు గొడవకు దిగాయి. ఒక వ ర్గం వెంట వచ్చిన డైరెక్టర్లను మరో వర్గం తమ వైపు లాక్కుపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాలు దాడికి దిగాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే కారులో సహకార సంఘం వద్దకు వచ్చిన ముగ్గురు డైరెక్టర్లను కారు అద్దాలు పగలగొట్టి మరో వాహనంలో తీసుకుని వెళ్లిపోయారు.
ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఒకరు.. పురుగుల మందు తాగి మరొకరు..
మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లో సహకార సంఘం చైర్మన్ పదవి కోసం ముగ్గురు పోటీ పడటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరి నిమిషంలో బస్వాపూర్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీంతో పదవి అశించి భంగపడ్డ జగదేవ్‌పూర్ డైరెక్టర్ శ్రీనివాస్‌గౌడ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జగదేవ్‌పూర్‌కు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త కనకయ్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు తనకు చైర్మన్ పదవి ఇస్తారని మోసం చేశారని తిగుల్‌కి చెందిన డైరెక్టర్ భూమయ్య పురుగుల మందు తాగి ఆత్మ హత్యయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్ పదవి కోసం పోటీలో ఉన్న నలుగురు డైరెక్టర్లు పదవి తనకే కావాలని లేదంటే, పార్టీ మారుతామని తెగేసి చెప్పడంతో గందరగోళంగా మారింది. చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుజ్జగించడంతో కథ సుఖాంతమైంది.
పదోసారి చైర్మన్‌గా..
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండ లం ఖానాపురం పీ ఏసీఎస్ చైర్మన్‌గా జొన్నలగడ్డ హను మయ్య పదోసారి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఆదివారం ఖానాపురం పీఏసీ ఎస్ కార్యాలయంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. 1959 ఆగస్టు 13న ఏర్పడిన ఈ సంఘానికి మొదటి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1987 వరకు 28 ఏళ్లుచైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటివరకు ఆయ న గ్రామ సర్పంచ్‌గా 18 ఏళ్లు పనిచేశారు. రెండు పదవులు ఉం డరాదని 1987లో నిబంధన రావడంతో మధ్యలో నాలుగేళ్లు మినహా తిరిగి 1992 నుంచి నేటివరకు ఆయన చైర్మన్‌గా కొనసాగుతూ వచ్చారు. మొత్తం 56 ఏళ్లు ఆయన చైర్మన్‌గా పనిచేశారు.
కాంగ్రెస్ టీసీల ఆందోళన
తమకు నామినేషన్లు వేసే అవకాశం ఇవ్వకుండా ఎన్నికల అధికారి అన్యాయం చేశారంటూ వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి సొసైటీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌కు చెందిన టీసీలు ఆదివారం నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ బొడ్రాయి సమీపంలో మద్దతుదారులతో కలిసి ధర్నా చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
చైర్మన్ అభ్యర్థి కిడ్నాప్?
వరంగల్ అర్బన్ జిల్లా వంగపహాడ్ సొసైటీ చైర్మన్‌న్‌అభ్యర్థి కిడ్నాప్‌నకు గురైనట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు సొసైటీ ఎదుట ఆదివారం ఆందోళనకు దిగారు. చైర్మన్‌గా పోటీ నుంచి తప్పించడానికి తన కుమారుడు అశోక్‌ను కిడ్నాప్ చేశారని అతడి తండ్రి కొమురయ్య ఆరోపించారు. అయితే ఓటింగ్ తర్వాత అశోక్ ఇంటికి వచ్చినట్లు సమాచారం.
చెల్లని డైరెక్టర్ ఓటు..
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసిన 12 వార్డు డైరెక్టర్ నాంసానిపల్లెకు చెందిన గుగులోతు పర్శ్యనాయక్ వేసిన ఓటు చెల్లలేదు. అనారోగ్యంతో ఉన్న ఆయన.. బ్యాలెట్ పేపర్‌పై మధ్యలో వేయడంతో ఓటు చెల్లకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment