కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ చిత్తు కాగితాలే: కేటీఆర్ | KTR Fire On Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ డిక్లరేషన్లన్నీ చిత్తు కాగితాలే: కేటీఆర్

Published Sat, Nov 11 2023 4:01 AM | Last Updated on Sat, Nov 11 2023 3:53 PM

KTR Fire On Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న డిక్లరేష న్లన్నీ చిత్తు కాగితాలేనని, డిక్లరేషన్ల పేరిట ఆ పార్టీ దేశ వ్యాప్తంగా ప్రజలను మోసగిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు విమర్శించారు. మైనార్టీ డిక్లరేషన్‌ పేరిట రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో మైనార్టీలు, బీసీల జనగణన చేసి ‘ఫెయిర్‌ రిజర్వేషన్‌’ ఇస్తామనడంలో కాంగ్రెస్‌ కుట్ర దాగి ఉందని విమర్శించారు.తెలంగాణ భవన్‌లో శుక్రవారం హోం మంత్రి మహమూద్‌ అలీ, పార్టీ నేతలు ఇంతియాజ్‌ ఇషాక్‌ అలీ, సలీమ్, సోహైల్‌ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 

బీజేపీ భావజాలానికి అనుగుణంగా..
ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు తదితరులను గతంలోనే రాజ్యాంగం మతపరమైన మైనార్టీలుగా గుర్తించిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు. మైనార్టీ డిక్లరేషన్‌ పేరిట మైనార్టీలు, బీసీల నడుమ విద్వేషాలు సృష్టించేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని, ఈ తరహా ప్రతిపాదనలతో అటు మైనార్టీలు, ఇటు బీసీలు నష్టపోతారని చెప్పారు. మైనార్టీలు బీసీలుగా గుర్తింపు పొందితే వారికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ, బడ్జెట్‌ కేటాయింపులు, మైనార్టీ సంక్షేమ, ఫైనాన్స్‌ కార్పొరేషన్ల రద్దు తదితర ప్రమాదాలు పొంచి ఉంటాయన్నారు. బీజేపీ భావజాలానికి అనుగుణంగా, బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్‌ మైనారిటీ డిక్లరేషన్‌ తయారైందని, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం కలిగిన వ్యక్తి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం వల్లే ఈ తరహా ప్రతిపాదన వచ్చిందని పేర్కొన్నారు.

తెలంగాణలో అతి ఎక్కువ బడ్జెట్‌ కేటాయింపులు
మైనార్టీ సంక్షేమం విషయంలో దేశంలోనే అతి ఎక్కువ బడ్జెట్‌ కేటాయింపులు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని కేటీఆర్‌ తెలిపారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ పదేళ్ల కాలంలో మైనార్టీ సంక్షేమానికి చేసిన కేటాయింపులతో పోలిస్తే, తాము తొమ్మిదేళ్ల కాలంలోనే అంతకు 11 రెట్లు వెచ్చించామని చెప్పారు. తెలంగాణలో మైనార్టీ సంక్షేమానికి కేటాయింపులు రాబోయే రోజుల్లో రూ.5 వేల కోట్లకు చేరనుండగా, కాంగ్రెస్‌ డిక్లరేషన్‌లో రూ.4 వేల కోట్టే ఇస్తామనడం విడ్డూరమన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇప్పటికే ఇమామ్‌లు, మౌజంలకు రాబోయే రోజుల్లో రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్, గోషా మహల్, హుజూరాబాద్‌లో గెలిచి తీరుతామని కేటీఆర్‌ దీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ బలహీన అభ్యర్థులను బరిలోకి దింపి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ వంద సీట్లు గెలుపొందడం ఖాయమని  ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌లో ఆర్థిక తీవ్రవాదం
కాంగ్రెస్‌ పార్టీలో ఆరాచక రాజకీయం, ఆర్థిక తీవ్ర వాదం నడుస్తోందని, టికెట్లు అమ్ముకుంటున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నేత సంగిశెట్టి జగదీశ్‌ బీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఇప్పటికే జరి గిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామని, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. మునుగోడు కాంగ్రెస్‌ నేత నక్క రవీందర్, నకిరేకల్‌ నాయకులు ప్రసన్నతోపాటు ముషీరాబాద్, జూబ్లీహిల్స్‌ నియోజక వర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ లో చేరారు.  కార్య క్రమంలో మహమూద్‌ అలీ, ఎమ్మెల్యే ముఠాగో పాల్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

ఇదీ చదవండి: అమలు గ్యారంటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement