cooperative elections
-
బెంగాల్ సీఎం మమతకు ఊహించని షాక్.. భారీ విజయం అందుకున్న బీజేపీ
బెంగాల్ రాజకీయాల్లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల నుంచి రెండు పార్టీల నేతల మధ్య మాటల వార్ ఇంకా నడుస్తూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేయాలన్న బీజేపీకి చేదు అనుభవమే ఎదురైనప్పటికీ సీట్ల విషయం మాత్రం పుంజుకుంది. ఇదిలా ఉండగా, తాజాగా అధికార టీఎంసీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. పూర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాగా ఆదివారం భేకుటియా సమబే కృషి సమితికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నికల్లో 12 సీట్లకు గానూ 11 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఇక, ఈ ఎన్నికల్లో అధికార టీఎంసీ ఒక్క సీటుకే పరిమితమైంది. మరోవైపు.. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఓడించారు. ఇక, బీజేపీ విజయంపై సువేందు అధికారి స్పందిస్తూ.. బీజేపీని గెలిపించినందుకు నందిగ్రామ్ నియోజకవర్గం, భేకుటియా సమబే కృషి ఉన్నయన్ సమితి సహకార సంఘం ఓటర్లందరికీ ధన్యవాదాలు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో గొప్ప విజయానికి బాటలు వేస్తాయి అని కామెంట్స్ చేశారు. Big SETBACK for Mamata Banerjee, BJP wins 11 out of 12 seats in Nandigram co-operative body election Nandigram: Bhekutia Samabay Krishi Samity, which was held by Mamata Banerjee's Trinamool Congress (TMC) for a long time, took over by the Saffron camphttps://t.co/q55vSFd14i — Selvam 🚩 (@tisaiyan) September 19, 2022 -
తెలంగాణలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు
-
చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వీరికే..!
సాక్షి, హైదరాబాద్: సహకార ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. పూర్వపు ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు నేడు ఎన్నికలు జరగుతున్నాయి. సంఖ్యా బలం పరంగా టీఆర్ఎస్కు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్‌ల్లో స్పష్టమైన బలం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు ప్రారంభయ్యాయి. మధ్యాహ్నం 2 గం. వరకు నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ జరిగిన తర్వాత ఒక్కో పదవికి ఒకటి కంటే ఎక్కువ నా మినేషన్లు వస్తే సాయంత్రం 5 గం. వరకు పోలింగ్ నిర్వహించి ఫలితం ప్రకటిస్తారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా సీల్డ్ కవర్లు అందుకున్న టీఆర్ఎస్ సహకార ఎన్నికల పరిశీలకులు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు వరించిన వారి పేర్లను వెల్లడించారు. నల్గొండలో టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా నామినేషన్ వేస్తున్న కొండూరు రవీందర్రావు జిల్లాల వారీగా.. సహకార పదవులు పొందినవారు.. కరీంనగర్ డీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా పింగళి రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ గా ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఫకృద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన ఎన్నికల అధికారులు. ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కూరాకుల నాగభూషయ్య, వైస్ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. డీసీఎంఎస్ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు, వైస్ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాస రావు. మహబూబ్ నగర్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నిజాం పాషా, వైస్ చైర్మన్‌గా కొరమోని వెంకటయ్య, డీసీఎంఎస్ చైర్మన్‌గా ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా హర్యా నాయక్. మెదక్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా పట్నం మాణిక్యం, డీసీఎంఎస్ చైర్మన్‌గా మల్కాపూర్ శివకుమార్. నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా వట్టి జానయ్య యాదవ్, వైస్ చైర్మన్‌గా దుర్గంపూడి నారాయణరెడ్డి. ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా నామ్‌దేవ్ కంబ్లే, వైస్ చైర్మన్‌గా రఘునందన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా టి లింగయ్య, వైస్ చైర్మన్‌గా కొమరం మాత్తయ్య. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా నల్లవెల్లి మోహన్, వైస్ చైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొత్త మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా సత్తయ్య, డీసీఎంఎస్ చైర్మన్‌గా కృష్ణా రెడ్డి, వైస్ చైర్మన్‌గా మదుకర్ రెడ్డి. దాదాపు అన్ని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుని సత్తాచాటిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాల్చి, స్వీట్లు పంచారు. ఎన్నికపై అసంతృప్తి.. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా నల్లవెల్లి మోహన్, వైస్ చైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి ఎన్నికయ్యారు. అయితే, చైర్మన్ పదవులు ఆశిస్తున్న ఇద్దరు టీఆర్ఎస్ నేతలు, పీఏసీఎస్ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఈ ఎన్నికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమంలో ముందు నుంచి పనిచేసిన వారికి ప్రాధాన్యం లేదని వాపోయారు. -
టీఆర్ఎస్ ‘సహకార’ శిబిరాలు
సాక్షి, హైదరాబాద్: పాత ఉమ్మడి జిల్లాల పరిధిలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) మేనేజింగ్ కమిటీ ఎన్నికలు ముగియడంతో ఈ నెల 29న జరిగే చైర్మన్ ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. పూర్వపు 9 జిల్లాల పరిధిలోని డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్ స్థానాలకు మంగళవారం నామినేషన్లు స్వీకరించగా టీఆర్ఎస్ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ మినహా ఇతర జిల్లాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ స్థానాలను పలువురు టీఆర్ఎస్ నేతలు ఆశిస్తుండటంతో పదవులకు బహుముఖ పోటీ నెలకొంది. జిల్లాల వారీగా డైరెక్టర్ల స్థానాలకు పార్టీ మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించిన టీఆర్ఎస్.. చైర్మన్ పదవులకు కూడా పార్టీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు పావులు కదుపుతోంది. డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు దాదాపు అందరూ పార్టీ మద్దతుదారులే కావడంతో చైర్మన్ పదవులు అన్ని టీఆర్ఎస్ ఖాతాలో చేరనున్నాయి. జిల్లాల వారీగా చైర్మన్ పదవులు ఆశిస్తున్న నేతల జాబితాను పార్టీ ఎమ్మెల్యేలతో సంబంధిత జిల్లా మంత్రులు చర్చించి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆమోదం కోసం పంపించారు. ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ ఎన్నిక జరగనుండగా, అదేరోజు ఉదయం జాబితాను ప్రకటించే అవకాశముంది. క్యాంపులకు తరలిన డైరెక్టర్లు డీసీసీబీ, డీసీఎంఎస్ మేనేజింగ్ కమిటీలకు ఎన్నికైన డైరెక్టర్లను మంగళవారం రాత్రి పొరుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగించినట్లు సమాచారం. గోవా, బెంగళూరుతో పాటు తిరుపతి తదితర పుణ్యక్షేత్రాల సందర్శన అనంతరం ఈ నెల 29న ఉదయం పూర్వ ఉమ్మడి జిల్లా కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. చైర్మన్ పదవులకు బహుముఖ పోటీ నెలకొనడంతో వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఆశావహుల జాబితాను రూపొందించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ మేరకు తాము సహకార ఎన్నికల బరిలోకి దిగినట్లు కొందరు పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించిన వారినే చైర్మన్లుగా ఎన్నుకునేలా జిల్లాల వారీగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి చర్చల్లో డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ అభ్యర్థులు ఎవరనే అంశంపై స్పష్టత వచ్చినప్పటికీ, తుది జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
సహకారం.. ఉద్రిక్తం
సాక్షి నెట్వర్క్: పలు జిల్లాల్లో సహకార సంఘాల పాలకవర్గం ఎన్నికలు ఆదివారం ఉద్రిక్తతలకు దారి తీశాయి. చైర్మన్, వైస్‌చైర్మన్ పదవులు ఆశించి భంగపడటంతో ఆ పార్టీల నేతలు, మద్దతుదారులు ఆందోళనకు దిగారు. దీంతో పలు చోట్ల పాలకవర్గం ఎన్నికలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతల మధ్యే ఎన్నికలు ముగిశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్దూరు సహకార సంఘం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య, వరంగల్ రూరల్ జిల్లా నర్సం పేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీ సులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఉద్రిక్తతల మ ధ్య ఎన్నికలు నిర్వహించడం వీలుపడకపోవడంతో సోమ వారానికి వాయిదా పడ్డాయి. మరోవైపు ఖమ్మం జిల్లా మ ధిర మండలం దెందుకూరు సహకార సంఘ పాలకవర్గ ఎన్నికలో కోరం లేదని అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. మరోవైపు శనివారం సహకార సంఘ పోలింగ్ సమయంలో నాగులవంచ పోలింగ్ కేంద్రం వద్ద రేపల్లె వాడ గ్రామస్తుల మధ్య స్వల్ప ఘర్షణ జరగడంతో 9 మం దిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. రాళ్లతో దాడి... నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్సా సొసైటీలో ఆదివారం చైర్మన్ పదవికి నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ డైరెక్టర్లు వెళ్తుండగా, టీఆర్ఎస్ కార్యకర్తలు రావడం తో వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టా రు. నందిపేట మండలం చింరాజ్‌పల్లి సొసైటీ వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి జిల్లాలోని 55 సొసైటీల్లో 52 చోట్ల టీఆర్ఎస్ మద్దతుదారులు చైర్మన్లుగా ఎన్నిక య్యారు. రెండు సొసైటీలను కాంగ్రెస్ సొంతం చేసుకో గా, ఒకచోట వాయిదా పడింది. డైరెక్టర్లను లాక్కుపోయారు.. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ సహ కార సంఘం చైర్మన్ పదవి కోసం టీఆర్ఎస్ పార్టీలోని ఇరు వర్గాలు గొడవకు దిగాయి. ఒక వ ర్గం వెంట వచ్చిన డైరెక్టర్లను మరో వర్గం తమ వైపు లాక్కుపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాలు దాడికి దిగాయి. దీంతో పోలీసులు లాఠీచార్జి వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే కారులో సహకార సంఘం వద్దకు వచ్చిన ముగ్గురు డైరెక్టర్లను కారు అద్దాలు పగలగొట్టి మరో వాహనంలో తీసుకుని వెళ్లిపోయారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఒకరు.. పురుగుల మందు తాగి మరొకరు.. మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లో సహకార సంఘం చైర్మన్ పదవి కోసం ముగ్గురు పోటీ పడటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. చివరి నిమిషంలో బస్వాపూర్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీంతో పదవి అశించి భంగపడ్డ జగదేవ్‌పూర్ డైరెక్టర్ శ్రీనివాస్‌గౌడ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జగదేవ్‌పూర్‌కు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కనకయ్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటిచుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు తనకు చైర్మన్ పదవి ఇస్తారని మోసం చేశారని తిగుల్కి చెందిన డైరెక్టర్ భూమయ్య పురుగుల మందు తాగి ఆత్మ హత్యయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి వైస్ చైర్మన్ పదవి కోసం పోటీలో ఉన్న నలుగురు డైరెక్టర్లు పదవి తనకే కావాలని లేదంటే, పార్టీ మారుతామని తెగేసి చెప్పడంతో గందరగోళంగా మారింది. చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు బుజ్జగించడంతో కథ సుఖాంతమైంది. పదోసారి చైర్మన్‌గా.. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండ లం ఖానాపురం పీ ఏసీఎస్ చైర్మన్‌గా జొన్నలగడ్డ హను మయ్య పదోసారి ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఆదివారం ఖానాపురం పీఏసీ ఎస్ కార్యాలయంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. 1959 ఆగస్టు 13న ఏర్పడిన ఈ సంఘానికి మొదటి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1987 వరకు 28 ఏళ్లుచైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటివరకు ఆయ న గ్రామ సర్పంచ్‌గా 18 ఏళ్లు పనిచేశారు. రెండు పదవులు ఉం డరాదని 1987లో నిబంధన రావడంతో మధ్యలో నాలుగేళ్లు మినహా తిరిగి 1992 నుంచి నేటివరకు ఆయన చైర్మన్‌గా కొనసాగుతూ వచ్చారు. మొత్తం 56 ఏళ్లు ఆయన చైర్మన్‌గా పనిచేశారు. కాంగ్రెస్ టీసీల ఆందోళన తమకు నామినేషన్లు వేసే అవకాశం ఇవ్వకుండా ఎన్నికల అధికారి అన్యాయం చేశారంటూ వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం వంచనగిరి సొసైటీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్‌కు చెందిన టీసీలు ఆదివారం నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ బొడ్రాయి సమీపంలో మద్దతుదారులతో కలిసి ధర్నా చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చైర్మన్ అభ్యర్థి కిడ్నాప్? వరంగల్ అర్బన్ జిల్లా వంగపహాడ్ సొసైటీ చైర్మన్‌న్‌అభ్యర్థి కిడ్నాప్‌నకు గురైనట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ మేరకు సొసైటీ ఎదుట ఆదివారం ఆందోళనకు దిగారు. చైర్మన్‌గా పోటీ నుంచి తప్పించడానికి తన కుమారుడు అశోక్‌ను కిడ్నాప్ చేశారని అతడి తండ్రి కొమురయ్య ఆరోపించారు. అయితే ఓటింగ్ తర్వాత అశోక్ ఇంటికి వచ్చినట్లు సమాచారం. చెల్లని డైరెక్టర్ ఓటు.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి సహకార సంఘం చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసిన 12 వార్డు డైరెక్టర్ నాంసానిపల్లెకు చెందిన గుగులోతు పర్శ్యనాయక్ వేసిన ఓటు చెల్లలేదు. అనారోగ్యంతో ఉన్న ఆయన.. బ్యాలెట్ పేపర్‌పై మధ్యలో వేయడంతో ఓటు చెల్లకుండా పోయింది. -
‘సహకార’ సంఘాల్లో కారు జోరు
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని సహకార సంఘాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. 46 సహకార సంఘాల్లో టీఆర్ఎస్కు 35, కాంగ్రెస్‌కు8, బీజేపీకి ఒకటి , ఇతరులకు రెండు సహకార సంఘాలు(సోసైటీలు) దక్కే అవకాశముంది. మొత్తం 597 డైరెక్టర్ల స్థానాలు ఉండగా, 588 డైరెక్టర్ల స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 9 డైరెక్టర్ల స్థానాలకు వివిధ కారణాల నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేశారు. ఎన్నికలు జరగాల్సిన 588 డైరెక్టర్ల స్థానాల్లో 143 ఏకగ్రీవం కాగా, ఇందులో అత్యధికంగా అధికార టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవాలతో కలుపుకొని..మొత్తంగా 588 డైరెక్టర్ల స్థానాల్లో టీఆర్ఎస్ 385 డైరెక్టర్ల స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ 124 ,బీజేపీ 40 ఇతరులు 39 డైరెక్టర్ల స్థానాల్లో విజయం సాధించారు. మేడ్చల్ జిల్లాలో ఇలా... మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో తొమ్మిది సహకార సంఘాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ సత్తా చాటింది. 44 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవం కాగా, ఇందులో అత్యధిక డైరెక్టర్లను టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. మిగిలిన 72 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో తొమ్మిది సహకార సంఘాల పరిధిలో మొత్తంగా ఏకగ్రీవాలతో కలుపుకుని 116 డైరెక్టర్ల స్థానాల్లో అధికార టీఆర్ఎస్ 94 స్థానాలను, కాంగ్రెస్ తొమ్మిది, బీజేపీ ముగ్గురు, ఇతరులు 10 డైరెక్టర్ల స్థానాలను కైవసం చేసుకున్నారు. జిల్లాలో తొమ్మిది సహకార సంఘాలు ఉండగా, ఇందులో ఐదు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), నాలుగు రైతు సేవా సహకార సంఘాలు( ఎప్‌ఎస్‌సీఎస్) ఉన్నాయి. జిల్లాలోని తొమ్మిది సహకార సంఘాల్లో ఛైర్మన్‌తోసహా వైస్ చైర్మన్ వదవులను చేజిక్కించుకునే డైరెక్టర్ల స్థానాలను టీఆర్ఎస్ చేజిక్కించుకుంది. జిల్లా సహకార సంఘాల్లో మొత్తంగా 7,445 మంది సభ్యులు ఉండగా, 6,686 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవటంతో 89.80 శాతం పోలింగ్ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో ఇలా... రంగారెడ్డి జిల్లాలో 37 సహకార సంఘాల్లో బండ్లగూడ ఖిల్సా సంఘం ఏకగ్రీవం అయింది. మిగతా 36 సహకార సంఘాల పరిధిలోని 472 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందే 99 డైరెక్టర్ల స్థానాలు ఏకగ్రీవం కాగా ఇందులో అత్యధిక స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఏకగ్రీవాలను కలుపుకుని మొత్తంగా 37 సహకార సంఘాల పరిధిలోని 481 డైరెక్టర్ల స్థానాలకుగానూ 9 డైరెక్టర్ల స్థానాల్లో వివిధ కారణాల నేపథ్యంలో ఎన్నికలు జరగలేదు. మిగిలిన 472 డైరెక్టర్ల స్థానాల్లో టీఆర్ఎస్ 291, కాంగ్రెస్ 115, బీజేపీ 37, ఇతరులు 29 డైరెక్టర్ల స్థానాల్లో విజయం సాధించారు. గెలుపొందిన డైరెక్టర్ల స్థానాలను బట్టి రంగారెడ్డి జిల్లాలోని 37 సహకార సంఘాల్లో టీఆర్ఎస్ 26, కాంగ్రెస్ 8, బీజేపీ ఒకటి, ఇతరులు రెండు సంఘాలను చేజిక్కించుకునే అవకాశముంది. రంగారెడ్డి జిల్లాలో సహకార సంఘం ఎన్నికల్లో 69,840 మంది సభ్యులకుగాను 58,126 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకోవటంతో 83.23 శాతం పోలింగ్ నమోదైంది. క్యాంపు రాజకీయాలు షురూ... సహకార సంఘాల ఎన్నికల్లో డైరెక్టర్ల స్థానాల ఫలితాలు వెలువడటంతో ఆదివారం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం కొనసాగనుంది. అధికార టీఆర్ఎస్ పారీ్టతో సహా కాంగ్రెస్, ఇతరుల్లో ఆధిపత్య పోరు కొనసాగుతుండటంతో డైరెక్టర్ల మద్దతు కోసం క్యాంపు రాజకీయాలకు శనివారం రాత్రి నుంచి తెరలేపారు. గెలుపొందిన డైరెక్టర్లను అక్కడ నుంచి నేరుగా అధికార టీఆర్ఎస్ నాయకులు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు సూచనల మేరకు క్యాంపులకు తరలిచ్చినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే బుక్ చేసుకున్న రిసార్టులు, హోటళ్లకు నేరుగా సంఘాల డైరెక్టర్లను తరలించారు. -
నిజమైన రైతులకే ఓటు హక్కు
సాక్షి, అమరావతి: సహకార సంఘాల్లో బోగస్ సభ్యత్వాలను నియంత్రించి, నిజమైన రైతులకే ఓటు హక్కు కల్పించే దిశగా సహకార శాఖ చర్యలు ప్రారంభించింది. సహకార ఎన్నికలకు ముందు కార్యకర్తలు, నాయకులకు సహకార సంఘాల్లో గంపగుత్తగా సభ్యత్వం ఇచ్చే విధానానికి స్వస్తి పలుకుతోంది. నిజమైన రైతులు, కౌలుదారులకే ఓటు హక్కు కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. ఫలితంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం నిజమైన రైతులకే దక్కనుంది. ఈ మేరకు నిబంధనల్లో మార్పులు చేస్తోంది. ఓటు హక్కు వినియోగం, సభ్యత్వ అర్హతలపై రూపొందించిన నిబంధనలను సహకార సంఘాలకు వివరిస్తూ మూడు రోజుల క్రితం సర్క్యులర్ జారీ చేసింది. కేవలం ఎన్నికల కోసమే సభ్యత్వం తీసుకున్న రైతులు, భూమిలేని వ్యక్తులు, ధ్రువీకరణ పత్రాలు లేని కౌలుదారులు, సంఘాల సేవలు వినియోగించుకోని రైతులను గుర్తించి వారిని అనర్హులుగా ప్రకటించాలని ఆదేశించింది. ఈ వడపోత కార్యక్రమం ద్వారా ఓటర్ల సంఖ్య సగానికి తగ్గే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గంపగుత్త ఓట్లకిక చెల్లు అధిక టర్నోవర్ ఉన్న సంఘాలకు పాలకవర్గ సభ్యులుగా పోటీ చేయడానికి రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్న రైతులు వారి స్నేహితులు, బంధువులు, కౌలుదారులకు గంపగుత్తగా ఓటు హక్కు కల్పిస్తున్నారు. వారి పేరు మీద సభ్యత్వ రుసుము వీరే చెల్లించి, ఎన్నికల్లో వారి ఓటును పొందుతున్నారు. ఈ విధానంలో ఎన్నికైన పాలకవర్గం రైతులకు ఆశించిన స్ధాయిలో సేవలు అందించనందున ప్రభుత్వం నిబంధనలలో మార్పులు చేసింది. కాగా, కొత్త నిబంధనలను గ్రామాల్లోని రైతులకు వివరించాలని సహకార సంఘాల రిజిస్ట్రార్ జి.వాణీమోహన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త నిబంధనలు ఇవీ.. - ఆంధ్రప్రదేశ్ కో– ఆపరేటివ్ సహకార చట్టం–1964ను సవరిస్తూ 2006లో తీసుకువచ్చిన మార్పుల అమలు. - సభ్యత్వం కోరే వ్యక్తి ఆ సంఘం భౌగోళిక పరిధిలో యజమాని లేదా కౌలుదారునిగా ఉండాలి. కౌలుదారుడైతే గ్రామ రెవిన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి. యజమానిగా ఉండే రైతు తనకున్న భూమికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం, విక్రయ దస్తావేజు, గ్రామ రెవిన్యూ అధికారి జారీ చేసిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. భూ విస్తీర్ణం, సరిహద్దులు, సర్వే నంబరు తదితర వివరాలను జత చేయాలి. - కనీసం రూ.300 షేరు ధనం కలిగి ఉండాలి. సంఘం నుంచి ఏడాది కాలంలో కనీసం రూ.1,000 రుణం తీసుకుని ఉండాలి. లేదా ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసి ఉండాలి. ఈ రెండూ లేకపోతే రూ.1,000 కనీసం డిపాజిట్ చేసి ఉండాలి. అప్పుడే ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లభిస్తుంది. - సంఘంలో చేరిన నాటి నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి మధ్య కనీసం 30 రోజులు నిరాటంకంగా సభ్యునిగా కొనసాగి ఉండాలి. - సంఘంలో తీసుకున్న రుణాన్ని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చెల్లించిన రికార్డు ఉండాలి. - సంఘంలోని సభ్యునికి సాధారణ ప్రాంతంలో రూ.5 వేలు, షెడ్యూల్ ప్రాంతంలో రూ.2,500కు తక్కువ కాకుండా సంఘంలో డిపాజిట్ ఉండాలి. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కనీసం రెండేళ్లు వరుసగా ఈ డిపాజిట్ కలిగిన వారికే పోటీచేసే అవకాశం. - స్వయం సహాయక సంఘాలు అయితే ఎన్నికల నోటిఫికేషన్‌కు ఆరు నెలల ముందు కనీసం రూ.10 వేల రుణం తీసుకుని ఉండాలి. భూమితో సంబంధం లేకుండా గ్రూపంతటికీ కలిపి ఒక ఓటు ఉంటుంది. పోటీ చేయడానికి అర్హత ఉండదు. ఈ సంఘాలు రైతులు, కౌలుదారులకు రుణాల మంజూరు, విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులను విక్రయిస్తున్నాయి. గ్రామాల్లో అందుబాటులో ఉండి, బహిరంగ మార్కెట్లో కంటే ధరలు తక్కువగా ఉండటంతో రైతులు వీటి సేవలను వినియోగించుకుంటున్నారు. -
సహకార ఎన్నికల పోలింగ్
-
మాజీ సర్పంచ్ దారుణ హత్య
-
ముగిసిన ‘సహకార’ ఎన్నికల పోలింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్) ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ కొనసాగింది. ఏకగ్రీవం కాగా(157 ప్యాక్స్‌లు... 5,403 డైరెక్టర్ స్థానాలు) మిగిలిన 747 ప్యాక్స్‌లు, 6,248 వార్డులకు (ప్రాయోజిత నియోజక వర్గాలు) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం 14,530 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సాయంత్రంలోపు ఫలితాలు ప్రకటిస్తారు. ఇక పోటీ చేసే అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఆ లాటరీలో ఎంపికైన అభ్యర్థికి మిగిలిన వారికన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినట్లు పరిగణించి ఆ అభ్యర్థి ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. ►నారాయణఖేడ్ ఒకటవ ప్రాదేశిక నియోజకవర్గంలో సంగారెడ్డి అనే వ్యక్తి పేరిట ఉన్న ఓటును మరొకరు వేశారు. ఆరేళ్ల క్రితం చనిపోయిన సంగారెడ్డి ఎలా ఓటు వేస్తారని ఎన్నికల సిబ్బందితో టీఆర్ఎస్ నేతల వాగ్వాదానికి దిగారు. దొంగ ఓట్లు వెయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ►నారాయణఖేడ్ లో ఎన్నికల అధికారులతో 14 వ వార్డు కౌన్సిలర్ నూర్జహాన్ బేగం వాగ్వాదం తన ఓటును వేరే వ్యక్తులు ఎలా వేస్తారని ప్రశ్నించిన కౌన్సిలర్ ►నల్లగొండ జిల్లా చిట్యాలలో జరుగుతున్న ‘సహకార’ ఎన్నికల్లో ఓ పెళ్లి కొడుకు ఓటు హక్కు వినియోగించుకున్నా. ఉదయం 11.30గంటలకి వివాహ ముహూర్తం ఉండడంతో ఉదయమే వచ్చి ఓటు వేసి వెళ్లిపోయాడు. ► ఆదిలాబాద్ జిల్లా బోథ్ సహకార ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతల ఆందోళన దిగారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణ అదుపు చేశారు. ►నిజామాబాద్ జిల్లాలో సహకార ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కోటగిరి, మొస్ర చందూర్ మండలాల్లో ఉన్న 5సహకార సంఘాల్లోని 54 డైరెరక్టర్ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ►కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సహకార సంఘాలు ఉండగా 3 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 14 సహకార సంఘాలకు ఓటింగ్ ప్రారంభమైంది. 220 డైరెక్టర్ పదవుల్లో 104 ఏకగ్రీవం కాగా, 116 లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 125 సహకార సంఘాలు ఉండగా12 ఏకగ్రీవం అయ్యాయి. 743 డైరక్టర్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 113 సహకార సంఘాలకు పోలింగ్ ప్రారంభమైంది. -
సూర్యాపేట జిల్లాలో దారుణం
సాక్షి, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో తెరాస నాయకుడిని కాంగ్రెస్ వర్గీయులు దారుణంగా హత్య చేశారు. యర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న సహకార ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఓటర్లను కలుస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దాదాపు 20 మంది కాంగ్రెస్ వర్గీయులు మారణాయుదాలతో వెంబడించగా గ్రామానికి చెందిన అవుదొడ్డి వీరయ్య ఇంటిలో దాక్కున్న వెంకన్నను కత్తులతో నరికి, బండ రాయితో కొట్టి హత్య చేశారు. సమస్యాత్మక గ్రామమైన యార్కరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నుండే ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సహకార ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓటర్లను సూర్యాపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఉంచగా కాంగ్రెస్ వర్గీయులు అక్కడికి వెళ్లడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి కాంగ్రెస్ వర్గీయులపై తెరాస నాయకులు దాడికి పాల్పడ్డారు. జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న కాంగ్రెస్ వర్గీయులు అదును కోసం వేచి చూసి ఎన్నికల ప్రచారంలో ఉన్న వెంకన్నను అర్ధరాత్రి సమయంలో వెంబడించి హత్య చేశారు. ఐతే ఈ క్రమంలో కాంగ్రెస్ వర్గీయుడు మిద్దె సైదులుకు సైతం కత్తి గాయం అయింది. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్ రావు నేతృత్వంలో యర్కారంలో పోలీసులు పికెట్ నిర్వహిస్తున్నారు. మరోవైపు సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి సాయంత్రానికి ఫలితాలు వెల్లడిస్తారు. -
అభ్యర్థులకు పెళ్లిళ్ల తిప్పలు
సాక్షి, కేతేపల్లి: ఈ నెల 15న సహకార ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదేరోజు అధికంగా పెళ్లిళ్లు ఉండడంతో నేతలు, డైరెక్టర్ స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని 15న ఓటింగ్‌కు రావాలని కోరితే చాలా మంది వివాహాలు ఉన్నాయని చెబుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. గ్రామాల్లో ఉన్న వారు కూడా ఇతర ప్రాంతాల్లో ఉండే బంధువుల ఇంట జరిగే వివాహాలకు ఒకట్రెండు రోజుల మందు వెళ్లే అవకాశముంది. పక్కాగా తమకే పడతాయన్న ఓట్లు పెళ్లిళ్ల కారణంగా పోలయ్యే అవకాశం కనిపించకపోవడంతో అభ్యర్థులకు పాలుపోవడం లేదు. పెళ్లి కాగానే వచ్చి ఓటేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే పోలింగ్ ఉండడంతో దూర ప్రాంతాలకు వెళ్లిన వారిని ఓటింగ్ పూర్తయ్యే సమయానికి తీసుకొచ్చే వీలుండదు. పెళ్లి మూహూర్తాలు పోలింగ్‌పై తప్పకం ప్రభావం చూపనున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అశ్వాపురం, నెల్లిపాకల్లో ఏకగ్రీవాల హవా..
సాక్షి, అశ్వాపురం: ఏళ్లు కాదు..దశాబ్దాల చరిత్ర ఉన్న ఆ సంఘాల్లో ప్రతిసారీ తీవ్ర పోటీనే. కానీ..ఈసారి ఏకగ్రీవమై ప్రత్యేకత సంతరించుకున్నాయి. అవే..అశ్వాపురం, నెల్లిపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు. 1957లో ఏర్పాటైన ఈ రెండు సహకార సంఘాల్లో గత ఎన్నికల వరకు హోరాహోరీ పోరు ఉండేది. ఈ సారి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఏకగ్రీవమయ్యేట్లు చూశారు. జిల్లాలోని 20 సహకార సంఘాల్లో 13కు 13 వార్డులు ఏకగ్రీవమైన సంఘాలుగా అశ్వాపురం, నెల్లిపాక సహకార సంఘాలు నిలిచాయి. ఈ రెండు సంఘాల అధ్యక్షులుగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నిక కానున్నారు. అశ్వాపురం పీఏసీఎస్ అధ్యక్షుడిగా తుళ్లూరి బ్రహ్మయ్య మూడో సారి ఎన్నిక కానున్నారు. నెల్లిపాక పీఏసీఎస్ అధ్యక్షుడిగా తుక్కని మధుసూదన్ రెడ్డి ఎన్నిక కానున్నారు. గతంలో బ్రహ్మయ్య డీసీసీబీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. గత ఎన్నికల్లో అశ్వాపురం పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఎన్నికై డీసీసీబీ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలోనే అశ్వాపురం, నెల్లిపాక సహకార సంఘాలు ఏకగగ్రీవమయ్యేలా రాజకీయ పార్టీలను ఒప్పించి మండల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. జిల్లాలోని సహకార సంఘాల్లో అశ్వాపురం, నెల్లిపాక సొసైటీలకు ప్రత్యేక స్థానం ఉంది. 3,232 మంది సభ్యులతో ఏడాదికి రూ.10 కోట్ల టర్నోవర్‌తో అశ్వాపురం పీఏసీఎస్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. నెల్లిపాక పీఏసీఎస్‌కి జిల్లాలోని మొదటి మూడు సహకార సంఘాల్లో ఒకటిగా ఉంటు పలుమార్లు ఉత్తమ సంఘంగా అవార్డు పొందింది. -
అభ్యర్థిపై రాళ్లదాడి.. పరిస్థితి విషమం..!
సాక్షి, నల్గొండ : సహకార ఎన్నికల నేపథ్యంలో చిట్యాల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ వార్డు అభ్యర్థిగా పోటీచేసిన గోధుమ గడ్డ జలందర్‌రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మొహం, ఉదర భాగంలో రాళ్లతో చితకబాదారు. బాధితున్ని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. ఎన్నికల్లో నేరుగా తలపడలేక ప్రత్యర్థి వర్గంవారు రౌడీయిజానికి దిగారని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఘర్షణ.. ముగ్గురికి గాయాలు సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామం లో సహకార ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఈ ఘటనలో ముగ్గురు కాంగ్రెస కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. -
సభ్యులు 33లక్షలు.. ఓటర్లు 19లక్షలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)లో 33 లక్షల మంది సభ్యులుంటే, కేవలం 19 లక్షల మందికి మాత్రమే ఓటు హక్కు లభించింది. మిగిలిన వారంతా ఓటు వేయడానికి, పోటీ చేయడానికి అర్హత కోల్పోయారు. ఈ విషయాన్ని సహకారశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయం, అనుబంధ రంగాల కోసం తీసుకున్న అప్పులను సకాలంలో తిరిగి వాయిదాలు చెల్లించకపోవడంతో ఆయా సహకార సంఘాల్లోని రైతులు అనేకమంది ఓడీ (ఓవర్ డ్యూ) జాబితాల్లో చేరారు. తీరా రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా (ప్యాక్స్) లకు ఎన్నికలు ప్రకటించడంతో ఓడీలో ఉన్న వారంతా ఓట్లున్నా అనర్హుల జాబితాల్లోకి ఎక్కారు. దీంతో గ్రామాల్లో అలజడి నెలకొంది. చాలా మంది రూ.లక్షపైన రుణం కలిగి ఉండటం, మరికొందరు షేర్ క్యాపిటల్ రూ.300 మాత్రమే ఉండటంతో ఓటు హక్కు కోల్పోయినట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అధికారులు చెబుతున్నారు. అలాగే సభ్యులుగా ఉన్న కొందరు రైతులు చనిపోయినప్పటికీ వారి పేర్లను ఇంకా తొలగించలేదు. అయితే వారి ఓట్లు లేనట్లుగానే నిర్ధారించారు. ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత రావడం లేదు. అలాగే రెండేళ్ల క్రితం సహకార సంఘాల ద్వారా కొందరు ద్విచక్ర వాహనాలు, పాడి గేదెల కొనుగోలుకు రుణం పొందారు. వాయిదాలను సక్రమంగా చెల్లించని వారిని ఓడీ జాబితాల్లో చేర్చారు. ఇదిలా ఉండగా ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువ మంది అనర్హులు.. ఇక సిద్దిపేట జిల్లాలో 1,90,669 మంది సభ్యులుండగా, కేవలం 62,972 మంది మాత్రమే ఓటింగ్‌కు అర్హత సాధించగా.. 1.27 లక్షల మంది సభ్యులు అనర్హులయ్యారు. నల్లగొండ జిల్లాలోనూ 1,41,895 మంది సభ్యులుండగా, 1,09,380 మంది రైతులే అర్హులయ్యారు. నిజామాబాద్‌లోనూ 1,48,241 సభ్యులకుగాను 1,15,211 మంది, వరంగల్ రూరల్‌లో 1,50,530 సభ్యులకు గాను 97,599 మంది, మహబూబాబాద్‌లో 1,13,607 సభ్యులకుగాను 70,658 మంది, మెదక్‌లో 1,19,675 సభ్యులకుగాను 55,086 మంది మాత్రమే అర్హులైనట్లు రాష్ట్ర ఎన్నికల సహకార అథారిటీ వెల్లడించింది. ఇలా ప్రతీ జిల్లాలో, ప్రతీ ప్యాక్స్‌లో ఓవర్ డ్యూ కారణంగా ఓటింగ్‌కు, పోటీకి దూరమయ్యారు. వాస్తవానికి ప్యాక్స్‌లో బకాయిలు కొంత ఉన్నా అనర్హులవుతారు. అయితే ఈసారి రూ.లక్షలోపున్న రైతులకు మాత్రం పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షలోపు రుణమాఫీ ప్రకటించినందున, ఆ మేరకు మినహాయింపునిస్తూ సహకార ఎన్నికల అథా రిటీ అంతర్గత ఆదేశాలు జారీచేసింది. కొత్త ప్యాక్స్‌ల ఏర్పాటు అనంతరం అంటే జూన్‌లో ఎన్నికలు జరుగుతాయన్న భావనలో చాలామంది ఉన్నారు. దీంతో వారంతా రుణాలు చెల్లించలేకపోయారు. నోటిఫికేషన్ ఆగమేఘాల మీద ఇవ్వడం, తక్షణమే ప్రక్రియ మొదలు కావడంతో రుణాలు చెల్లించే సమయం లేకుండా పోయిందని రైతులు అంటున్నారు. -
రూ.లక్షలోపు అప్పుంటేనే ఓటు
సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): సహకార ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఓటు వేయడానికి కొత్త నిబంధనలను సహకార ఎన్నికల అథారిటీ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణం మాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సహకార సంఘాల్లోని సభ్యులు అంతకుమించి అప్పు తీసుకుంటే ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పంటరుణంలో అసలు, వడ్డీ కలిపి రూ.లక్షలోపు ఉన్న వారికే ఓటు హక్కును కలి్పంచనున్నారు. సహకార ఎన్నికల అథారిటీ ఈ కొత్త నిబంధనపై ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. దీంతో అన్ని సహకార సంఘాల్లో రూ.లక్షకు మించి పంట రుణం తీసుకున్న వారికి ఉద్యోగులు సమాచారం అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 144 సహకార సంఘాలు ఉండగా కొంత మంది పాత సభ్యులు తమకు ఉన్న ఎక్కువ భూమిని చూపి రూ.రెండు లక్షల వరకు పంట రుణం తీసుకున్నారు. రూ.లక్షకు మించి రుణం తీసుకున్నవారు, నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే నాటికి రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న సొమ్మును చెల్లించాలి. ఇప్పటికే బకాయిదారులు, రెగ్యులర్‌గా రుణం చెల్లించిన సభ్యుల వివరాలతో కూడిన జాబితాలను సహకార ఉద్యోగులు సిద్ధం చేశారు. ఇప్పుడు కొత్త నిబంధన అమలులోకి రావడంతో రూ.లక్షకు మించి పంట రుణం పొందిన సభ్యులను ఓటర్ల జాబితాల నుంచి వేరు చేసి వారికి సమాచారం అందిస్తున్నారు. ఈ నెల 6న నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండగా ఆలోపు రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న రుణం చెల్లిస్తేనే ఓటర్ల జాబితాల్లో పేర్లు చేర్చనున్నారు. గతంలో రుణ బకాయిలు ఉన్నవారికే ఓటు హక్కును తొలగించేవారు. ఇప్పుడు రుణ పరిమితి నిబంధనను అమలులోకి తీసుకురావడంతో ఓటు హక్కు కోల్పొయే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సమాచారం ఇస్తున్నాం రూ.లక్షకు మించి పంట రుణం పొందిన వారికి కొత్త నిబంధనపై సమాచారం అందిస్తున్నాం. రూ.లక్షలోపు అసలు, వడ్డీ ఉంటేనే ఓటు హక్కు కలి్పంచి పోటీకి అవకాశం ఇవ్వనున్నాం. సహకార ఎన్నికల అథారిటీ సూచించిన ప్రకారం సభ్యుల జాబితాలను సిద్ధం చేస్తున్నాం. – సింహాచలం, జిల్లా సహకార శాఖ అధికారి -
సహకార ఎన్నికలు లేనట్టేనా?
సాక్షి, భువనగిరి : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోమారు వాయిదా పడనున్నాయి. ఇప్పటికే ఎన్నికలను ప్రభుత్వం మూడు సార్లు వాయిదా వేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు పాలకమండళ్ల పదవీ కాలం పొడిగింపు కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా సహకార అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఆయా సంఘాలకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయడంలో ఇప్పటికే అధికారులు బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఎన్నికలను మరో ఆరు నెలలు పొడిగించే అవకాశాలు కనిపి స్తున్నాయి. జిల్లాలో 110 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. పాలక వర్గాలకు జూలై నెలాఖరుకు పదవీకాలం ముగుస్తుంది. ప్రస్తుత పాలకమండళ్లకే పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా.. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిం చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాలకమండళ్లను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. గతంలోనే ఓటరు జాబితా సిద్ధం ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణకు గడువు పొడిగించారు. సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితాను సైతం రూపొందించారు. వాటిపై అభ్యంతరాలను కూడా అధికారులు స్వీకరించారు. వరుసగా శాసనసభ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో సహకార సంఘాల పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. సహకార సంఘాలకు 2018డిసెంబర్లోనే రాష్ట్ర సహకార కమిషనర్ నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో వెంటనే సభ్యత్వ నమోదు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా పాత జాబితాను మార్పు చేశారు. రూ.10చెల్లించి సభ్యత్వం పొంది సహకార ఎన్నికల్లో ఓటు హక్కు పొందేవారు. ప్రస్తుతం అది రూ.300 చెల్లించి సభ్యత్వం తీసుకునే వారికి ఓటు హక్కు ఇవ్వనున్నారు. అలాగే సభ్యుల ఫొటో, గుర్తింపు కార్డు వివరాలను ఓటర్ జాబితాలో పొందుపర్చారు. ఇక సభ్యత్వం తీసుకునే ఏడాది తర్వాతే ఆసభ్యుడికి ఓటు హక్కు అవకాశం లభిస్తుంది. సంఘం నిర్మాణం ఇలా.. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 13మంది పాలకవర్గ సభ్యులు ఉంటారు. ఎస్సీ 01, ఎస్సీ మహిళ 1, ఎస్టీ 1, బీసీ 2, బీసీ మహిళ 01, ఓసీ 7మంది సభ్యులుగా కొనసాగుతారు. వీరి లో ఒకరు అధ్యక్షుడు, మరొకరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అయితే ఓటర్ల జాబితా ఫొటోలతో సహా రాష్ట్ర సహకార రిజిస్ట్రార్ కార్యాలయం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేశారు. ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుండటంతో మార్గదర్శకాలు వెలువడుతాయని భావిస్తున్నారు. వాయిదాపడే అవకాశం ఉంది 2013జూన్ 30వ తేదీన సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు పాలకవర్గాల పదవీకాలం పొడిగించడం జరిగింది. ఈసారి కూడా పదవీ కాలం పొడిగించనున్నారు. గత సంవత్సరం చివరిలో ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల కావడంతో ఓటర్ జాబితా సిద్ధం చేసి పంపాం. తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటే సంవత్సరం ముందు నుంచే ఓటర్ జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. –వెంకట్‌రెడ్డి, జిల్లా సహకార శాఖ ఇన్చార్జ్ అధికారి -
త్వరలో వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: జనవరి నాలుగో వారంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర సహకార రిజిస్ట్రార్ శాఖ సిద్ధం చేసింది. ఇప్పటికే అన్ని జిల్లాల సహకార శాఖ అధికారులకు రిజిస్ట్రార్, కమిషనర్ ఎం.వీరబ్రహ్మయ్య స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహణపై ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని అందులో పేర్కొన్నారు. ప్యాక్స్‌లలో ముసాయిదా ఓటర్ల జాబితాను శుక్రవారం ముద్రించాలని, వాటిపై అభ్యంతరాలు, విజ్ఞప్తులను ఈ నెల 21 వరకు స్వీకరించాలని పేర్కొన్నారు. పర్సన్ ఇన్చార్జి కమిటీ వాటన్నింటిని పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను ఈ నెల 22న ప్రచురించాల్సి ఉంది. జాబితాను ఈ నెల 23న సహకార శాఖ రిజిస్ట్రార్ ఆమోదానికి పంపాలి. రాష్ట్ర స్థాయిలో సహకార శాఖ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది. వాటిన్నింటిని పరిష్కరించి 28వ తేదీన ఆమోదం తెలపనున్నారు. ఆ తరువాత పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే జనవరి 15 నుంచి లేదా నాలుగో వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం 906 ఫ్యాక్స్‌లు ఉన్నాయి. వీటికి ఇప్పుడు పర్సన్ ఇన్‌చార్జ్‌లు పాలక వర్గాలుగా కొనసాగుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో కొన్ని, ఫిబ్రవరిలో ముగిశాయి. మరో నెల గడిస్తే ఏడాది అవుతుంది. హైదరాబాద్ నుంచే పర్యవేక్షణ.. గతంలో మాదిరి కాకుండా ఈసారి ఎన్నికలు వేరుగా జరగనున్నాయి. 1964 సహకార చట్టంలోని ఎన్నికల ప్రక్రియను తెలిపే 22వ నియమానికి సవరణలు ప్రభుత్వం గతంలో సవరణలు చేసింది. దీని ప్రకారం హైదరాబాద్ నుంచే ఎన్నికల అధికారులను నియమించి పర్యవేక్షణ చేయనున్నారు. ఎన్నికలకు సంబంధించిన వ్యయాన్ని ఎన్నికల అధికారి ప్రతిపాదనలు సమర్పించి సొసైటీ నుంచే ఖర్చు చేసే విధానానికి సవరణలో స్వస్తి చెప్పారు. లోటుపాట్లు, అవినీతి చోటు చేసుకుంటున్నందున ఎలక్షన్ నిర్వహణ వ్యయం మొత్తం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నుంచే వెళ్తోంది. -
సహకార ఎన్నికలకు కసరత్తు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. గతం కంటే భిన్నంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో సహకార సంఘం అధికారులే ఎన్నికలు నిర్వహించేవారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పీఏసీఎస్‌లకు లేఖ రాసినట్టు డీసీవో చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. ఎలక్షన్ అథారిటీ ఏర్పాటు... ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు స్టేట్ కో–ఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. జిల్లాలో 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వాటిలో సుమారు 42, 530 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మృతి చెందిన వారు, అప్పులు చెల్లించనని వారు, భూములు అమ్మకాలు చేసినవారు వారి ఓట్లు తొలగించగా 32, 420 మంది ఉన్నారని జిల్లా సహకార అధికారి సీహెచ్. చంద్రప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ముగిసిన పదవీకాలం. 2013 ఫిబ్రవరి 4న సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈనెల 4తో సంఘాల ప్రజాప్రతినిధులు పదవీ కాలం ముగిసింది. పీఏసీఎస్ చైర్మన్లు పర్సన్ ఇన్‌చార్జీలుగా వ్యవహరించనున్నట్లు డీసీవో ప్రకటించారు. 20 పీఏసీఎస్‌లు జిల్లాలో పెద్దపల్లి, అప్పన్నపేట, కూనారం, శ్రీరాంపూర్, పొత్కపల్లి, పత్తిపాక, నందిమేడారం, సుల్తానాబాద్, సుద్దాల, కనుకుల చిన్నకల్వల, గర్రెపల్లి, ఎలిగేడ్, ధూళికట్ట, జూలపల్లి, మేడిపల్లి, మంథని, ముత్తారం, కమాన్‌పూర్, కన్నాల, పీఏసీఎస్‌లు ఉన్నాయి. ఆధార్ తప్పనిసరి వ్యవసాయ పట్టాదారునితో పాటు ఓటర్లుగా నమోదు చేసుకున్న వారందరూ పీఏసీఎస్‌లలో ఆధార్‌కార్డుతో పాటు రెండు పాస్ ఫొటోలను జతచేసి ఎన్నికల అధికారికి అందేలా ఈనెల 20లోగా సంఘాల సీఈవోలు ఎన్నికల కార్యాలయంలో అందజేయాలని ఆదిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పీఏసీఎస్ సీఈవోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. 21వ తేదీలోపు జాబితా సమర్పించాలి ఈ నెల 21వ తేదీలోపు ఓటర్ల జాబితా రాష్ట్ర ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉందని డీసీవో తెలిపారు. జాబితాను సిద్ధం చేసి సంబంధిత డీసీవోలకు ఆయా పీఏసీఎస్‌ల సీఈవోలు అప్పగించాలని ఉత్తర్వులు జారీచేశారు. -
సహకార ఎన్నికలు లేనట్లే!
► 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికలు వద్దని సర్కారు భావన ► ఫిబ్రవరిలో ముగియనున్న టెస్కాబ్, ప్యాక్స్, డీసీసీబీల కాలపరిమితి ► వాటికి పర్సన్ ఇన్చార్జుల్ని నియమించాలనే యోచన సాక్షి, హైదరాబాద్: కొద్దినెలల్లో పదవీకాలం ముగి యనున్న సహకార సంఘాల పాలకవర్గాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించవద్దని రాష్ట్ర ప్రభు త్వం భావిస్తోంది. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పా టుతో వాటిల్లో సహకార సంఘాలు ఏర్పాటు చేయాల్సి రావడం, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు నియామకాలతో అసంతృప్తుల ఇబ్బందు లు వంటి వాటి నేపథ్యంలో ‘సహకార’ ఎన్నికలను వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పడ్డాక పెద్ద ఎత్తున జరగనున్న తొలి సహకార ఎన్నికలు కావడంతో రాజకీయంగా ఆలో చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని భావిస్తోంది. జిల్లాల విభజనతో సమస్యలు సహకార సంఘాలకు ప్రస్తుతమున్న పాలకవర్గాల పదవీకాలం వచ్చే ఫిబ్రవరి నాటికి ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (టెస్కాబ్) పాలకవర్గం పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26తో ముగియనుంది. జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)ల పాలకవర్గాల పదవీకాలం అదే నెల 18న.. 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్)ల పదవీ కాలం అదే నెల మొదటివారంలో ముగియన్నాయి. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించినప్పుడు తెలంగాణలో 10 జిల్లాలే ఉన్నాయి. ఇప్పుడు 31 జిల్లాలు అయినందున వాటి ప్రకారం జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లు ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియ ఇప్పుడు ప్రారంభిస్తే వచ్చే జనవరి నాటికి పూర్తవుతుంది. కొత్త జిల్లాలన్నింటికీ డీసీసీబీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టినా అదంత సులభం కాదని అంటున్నారు. కొత్త డీసీసీబీలు ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతమున్న డీసీసీబీల ఆస్తులు, డిపాజిట్లు, రుణాలు, రికవరీ, వ్యాపారం ఆధారంగా విభజించాలి. ఇందుకు రిజర్వుబ్యాంకు ఆమోదం ఉండాలి. తెలంగాణలోని డీసీసీబీల పనితీరు, అవినీతి ఆరోపణలను పరిశీలిస్తే కొత్తవాటికి ఆర్బీఐ అనుమతి ఇస్తుందన్న నమ్మకం లేదు. మరోవైపు ఇప్పుడున్న వాటి పదవీకాలాన్ని పొడిగించాలనుకున్నా.. పాలకవర్గాల్లో అధికార పార్టీ వారికంటే ఇతర పార్టీల వారే అధికంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా సహకార సంఘాలకు పర్సన్ ఇన్చార్జులను నియమిస్తే బాగుంటుందని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ ప్రకారమే తాము నడుచుకుంటామని.. అది రాజకీ యంగా తీసుకోవాల్సిన నిర్ణయమని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఎన్నికల ముందు ఎందుకంటూ ప్రస్తుత పాలకవర్గాలకు ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలయ్యాయి. అప్పుడు ఎక్కువగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఏడాది ముందు సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోన్న చర్చ టీఆర్ఎస్ వర్గాల్లో నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ముందు గ్రామాల్లో రాజకీయ సందడి చేసే సహకార ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని భావిస్తున్నట్లు సమాచారం. -
సహకార ఎన్నికల్లో పచ్చపాతం
• మంత్రి బొజ్జల ఎస్ఎంఎస్తో ఎన్నిక వాయిదా • కోరం ఉన్నా అధ్యక్ష ఎన్నికకు స్టే • వైఎస్సార్సీపీ డైరెక్టర్ల ఆందోళన పుట్టపర్తి టౌన్ : టీడీపీ నాయకులు అధికార దుర్వినియోగం ముందు ప్రజాస్వామ్యం ఓడిపోయింది. నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారి కూడా వారికే వత్తాసు పలకడంతో గురువారం జరగాల్సిన పుట్టపర్తి ప్రాథమిక సహకార సంఘం ఎన్నిక వాయిదా పడింది. నోటిఫికేషన్ మేరకు గురువారం ఎనుములపల్లి గణేష్ సర్కిల్ వద్ద ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో ఉదయం 8 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 13 మంది డైరెక్టర్లున్న సంఘంలో వైఎస్సార్సీపీకి చెందిన ఆరుగురు డైరెక్టర్లు రుషీకేశరెడ్డి, మాదినేని చెన్నక్రిష్ణ, సుబ్రహ్మణ్యం, పోమ్మేనాయక్, లింగమ్మ, చెన్నక్రిష్ణ ఉదయం 8.40 గంటలకు ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణరెడ్డికి అధ్యక్ష స్థానానికి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీకి చెందిన బండారు జయప్ప వారికి మద్దతు పలకడంతో ఓటమి తప్పదని గ్రహించిన పచ్చ నాయకులతోపాటు ఎన్నికల అ«ధికారి వెంటనే మంత్రి పల్లె రఘునాథరెడ్డి దష్టికి తీసుకుపోయారు. ఆయన ద్వారా సహకార మంత్రి బొజ్జల గోపాలకష్ణారెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చి ఎటువంటి కారణం లేకపోయినా ఎన్నికపై స్టే విధించేలా కుట్రకు పూనుకున్నారు. కోపోద్రిక్తులైన వైఎస్సార్సీపీ డైరెక్టర్లతోపాటు, టీడీపీ డైరెక్టర్ జయప్ప మంత్రి నుంచి వచ్చిన స్టే కాపీ చూపాలని, ఏ కారణాలతో ఎన్నిక వాయిదా వేస్తున్నారో తెలపాలని ఆందోళనకు దిగారు. 9.15 నిముషాలకు సహకార మంత్రి వ్యక్తిగత సహాయకుడు ఫోన్ మెసేజ్ ద్వారా పంపిన స్టే కాపీని టీడీపీకి చెందిన డైరెక్టర్ గూడురు ఓబిలేసు తీసుకువచ్చి ఎన్నికల అధికారి ఇవ్వడంతో ఆయన వాటిని పంచిపెట్టారు. మంత్రి బొజ్జల నోట్‌ప్యాడ్‌పై ఎటువంటి కారణాలు చూపకుండా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు, తదుపరి చర్యలు జిల్లా కలెక్టరు తీసుకోవాలని సూచించినట్లు ఉండడంతో వాగ్వాదం నెలకొంది. వెంటనే అక్కడికి చేరుకున్న సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి ఇరువర్గాలను బయటికి పంపించి వేశారు. -
అనంత సహకార ఎన్నికల్లో వైసీపీ హవా
-
అనంత సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ హవా
అనంతపురం: అనంతపురం జిల్లా సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. డీసీసీబీ, డీసీఎంఎస్‌లో మెజార్టీ డైరెక్టర్ స్థానాలను వైఎస్ఆర్ సీపీ కైవసం చేసుకుంది. డీసీసీబీ చైర్మన్‌గా శివశంకర్ రెడ్డి, వైఎస్ చైర్మన్‌గా రంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్‌గా మల్లికార్జున, వైస్ చైర్మన్‌గా జయరాం రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.