
దాడి జరగడానికి ముందు పోలీసులతో మట్లాడుతున్నజలందర్‌రెడ్డి
సాక్షి, నల్గొండ : సహకార ఎన్నికల నేపథ్యంలో చిట్యాల పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ 3వ వార్డు అభ్యర్థిగా పోటీచేసిన గోధుమ గడ్డ జలందర్‌రెడ్డి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మొహం, ఉదర భాగంలో రాళ్లతో చితకబాదారు. బాధితున్ని హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించారు. ఎన్నికల్లో నేరుగా తలపడలేక ప్రత్యర్థి వర్గంవారు రౌడీయిజానికి దిగారని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఘర్షణ.. ముగ్గురికి గాయాలు
సాక్షి, సూర్యాపేట : జిల్లాలోని అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామం లో సహకార ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.ఈ ఘటనలో ముగ్గురు కాంగ్రెస కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment