బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం | Bandi Sanjay Prajahitha Yatra | Sakshi
Sakshi News home page

బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం

Published Sat, Feb 10 2024 11:25 AM | Last Updated on Sat, Feb 10 2024 4:27 PM

Bandi Sanjay Prajahitha Yatra - Sakshi

కరీంనగర్: ప్రజాహిత యాత్రకు బీజేపీ నేత బండి సంజయ్ బయలుదేరారు. మహాశక్తి ఆలయంలో పూజల అనంతరం ఇంటి వద్ద తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. కొండగట్టు అంజన్నకు పూజలు చేసి మేడిపల్లి నుంచి ప్రజాహిత యాత్రను సంజయ్ ప్రారంభించనున్నారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేశానో వివరించేందుకే ఈ యాత్ర చేపడుతున్నట్లు వెల్లడించారు. 

తాను ఏం చేయలేదని అంటున్న వాళ్లకు సమాధానం చెప్పేందుకే యాత్ర చేస్తున్నానని వివరించారు. గ్రామాలకు కేంద్రం ఇచ్చిన నిధులే తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సవాళ్లకు ఇప్పటికే సమాధానం చాలాసార్లు చెప్పా.. వాళ్లేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అదే ఈ యాత్రలో చర్చ పెడతా.. తాము చేసింది.. చేయబోయేది ప్రజలకు వివరిస్తానని బండి సంజయ్ తెలిపారు.

ఇదీ చదవండి: ఆటోడ్రైవర్లకు బీఆర్‌ఎస్‌ సంఘీభావం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement