చోడవరం : రుణ మాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీ నమేషాలు లెక్కిస్తుండడంతో ఆందోళన చెం దుతున్న రైతులు, సహకార సంఘాలు పార్టీ అధినేతకు ఫ్యాక్స్ సందేశాలు పంపుతున్నారు. జిల్లాలో రూ. వెయ్యి కోట్ల రుణాలున్నట్లు అంచనా. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోనే రూ.300 కోట్ల అప్పు రైతుల నెత్తిపై ఉంది. రుణ మాఫీ ప్రకటనతో సక్రమంగా బకాయిలు చెల్లించే రైతులు కూడా మాఫీ జరుగుతుందన్న ఆశతో చెల్లింపులు నిలిపివేశారు.
ఈ పరిస్థితుల్లో రుణ మాఫీపై ప్రభుత్వం ఎటువంటి మెలిక పెట్టినా బ్యాంకులు మునిగిపోక తప్పదు. జాతీయ బ్యాంకుల మాటెలాఉన్నా సహకార బ్యాంకు, సంఘాల పుట్టి మునగడం ఖాయం. ప్రమాణ స్వీకారం సందర్భంగా తొలి సంతకం మాఫీపైనే అని టీడీపీ అధినేత చెబుతున్నా అందులో ఏం మెలిక పెడతారో అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. మరోవైపు ఖరీఫ్ ముంచుకు వస్తుండడంతో కొత్త రుణా ల పరిస్థితి ఏమిటన్న సందిగ్దం కనిపిస్తోంది.
2014 మార్చి నెలాఖరు వరకు ఇచ్చిన వ్యవసాయ సాధారణ, బంగారు రుణాలన్నీ మాఫీ చేస్తే పర్వాలేదుగాని, ఆంక్షలు విధిస్తే 70 శాతంపైగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ భయంతోనే సంపూర్ణ రుణ మాఫీ కోరుతూ రైతులు చంద్రబాబునాయుడుకు వినతులు పంపుతున్నారు. సంఘా ల అత్యవసర సమావేశాలు నిర్వహించి వ్యవసాయ రుణాలన్నింటినీ ఎటువంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా మాఫీ చేయాలని కోరుతూ తీర్మానం చేసి వాటిని అధినేతకు ఫ్యాక్స్ చేస్తున్నాయి.
ఆదర్శ సొసైటీగా పేరొందిన జుత్తా డ సభ్యులంతా ఇప్పటికే ఇటువంటి తీర్మానాన్ని బాబుకు ఫ్యాక్స్ చేశారు. ఇదే బాటలో కెజెపురం, మాడుగుల, విజయరామరాజు పేట, గోవాడ, రావికమతం, కొత్తకోట, బుచ్చెయ్యపేట, చీడికాడ, కె.కోటపాడుతోపాటు అన్ని ప్రాథమిక సహకార సంఘాల రైతులు నడిచేందుకు సిద్ధమవుతున్నారు. జుత్తాడ పీఏసీఎస్ అధ్యక్షుడు డి.సన్యాసినాయుడు మాట్లాడుతూ వాయిదా మీరిన రుణాలన్నింటినీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కోరుతూ కొత్త ప్రభుత్వానికి ఫ్యాక్స్ పంపినట్లు చెప్పారు.
టీడీపీ అధినేతకు ఫ్యాక్స్‌లు
Published Sat, May 31 2014 12:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement