cautions
-
ఇంధన పరివర్తనపై జాగ్రత్త అవసరం
న్యూఢిల్లీ: ఇంధన పరివర్తన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ వ్యాఖ్యానించారు. వృద్ధి విషయంలో రాజీపడకుండా దీన్ని సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘ఇంధన పరివర్తన, వాతావరణ పరిరక్షణ లక్ష్యాల సాధన పేరుతో వృద్ధిని పక్కన పడేయకూడదు. వృద్ధి అనేదే లేకపోతే, పర్యావరణ మార్పులను నియంత్రించడం కోసం పెట్టుబడులు పెట్టేందుకు వనరులు కూడా ఉండవు‘ అని ఆయన చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ ఈ విషయాలు వివరించారు. పారిశ్రామిక విద్యుత్ ధరలు ఒక్కసారిగా ఎగిసి యూరప్ ఆర్థికంగా సంకట స్థితిలో పడటానికి .. పునరుత్పాదక విద్యుత్, ఇంధన పరివర్తనపైనే పూర్తిగా దృష్టి పెట్టడం కూడా పాక్షికంగా కారణమన్నారు. ఈ అంశం కేవలం రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా కూడా పెద్ద సవాలని, భారత్‌తో పాటు ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధికి నోచుకోని దేశాలపైనా ప్రభావం చూపుతోందని నాగేశ్వరన్ చెప్పారు. దేశీయంగా మందగమనం గురించి ఆందోళన చెందనక్కర్లేదని, ఆర్థిక సర్వేలో పేర్కొన్నట్లుగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.5–7 శాతం వృద్ధిని సాధించే దిశగా పురోగమిస్తోందని పేర్కొన్నారు. -
IT Return: పొరపాటు జరిగిందా? రిటర్న్‌ని రివైజ్ చేసుకోవచ్చు..
ఒరిజినల్ రిటర్ను వేశారు. వెరిఫై కూడా అయింది. కానీ మీరు ఆ రిటర్నుని చెక్ చేసుకుంటే, ఏవైనా పొరపాట్లు జరిగి ఉండొచ్చు. వాటిని సరిదిద్దుకుని రివైజ్డ్ రిటర్న్ దాఖలు చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎటువంటి పొరపాట్లు జరుగుతాయంటే .. » కూడిక, తీసివేతల్లో తప్పులు » ఆదాయం మర్చిపోవడం.. పరిగణనలోకి తీసుకోకపోవడం » ఆదాయం లెక్కించడంలో పొరపాటు జరగడం » మినహాయింపులు, తగ్గింపులు మొదలైనవి మర్చిపోవడం » ట్యాక్స్ లెక్కింపులో తప్పులు » టీడీఎస్‌లో పొరపాట్లు » అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినవి మర్చిపోవడం » మినహాయింపు మొదలైనవాటిని తప్పుగా, ఎక్కువగా క్లెయిమ్ చేయడం » బ్యాంకు అకౌంటు వివరాలు తప్పుగా ఇవ్వడం » ఒక ఫారంనకు బదులుగా మరొక ఫారం వేయడంసెక్షన్ 139(5) ప్రకారం మీరు మీ ఒరిజినల్ రిటర్నుని రివైజ్ చేసుకోవచ్చు. రివైజ్డ్ రిటర్న్ అంటేనే ఒరిజినల్ రిటర్న్‌కి బదులుగా అని .. మరొక రకంగా ‘రిప్లేస్మెంట్’ అని చెప్పవచ్చు. ఇలా వేయడంలో గతవారం చెప్పినట్లుగా రూ. 1,000/5,000 చెల్లించనవసరం లేదు. మీరు సకాలంలో వేసినట్లే. అయితే, పన్ను కట్టాల్సి ఉంటే పన్నుతో పాటు వడ్డీ చెల్లించాలి.ఎప్పటిలోగా ఈ రిటర్ను వేయొచ్చు.. మీరు వేసిన ఒరిజినల్ రిటర్నుకి సంబంధించి అసెస్మెంట్ ఆర్డర్లు వచ్చేలోగా లేదా 2024 డిసెంబర్ 12లోగా .. (ఈ రెండింటిలో ఏది ముందు అయితే అది). గడువుతేదీ తర్వాత రిటర్ను వేసిన వాళ్లు కూడా రివైజ్డ్ రిటర్ను వేయొచ్చు. ఇలా ఎన్నిసార్లు రివైజ్ చేయొచ్చు .. అంటే ఎన్నిసార్లయినా రివైజ్ చేయొచ్చు. ఎటువంటి ఆంక్షలు, పరిమితులు లేవు. అలా అని మాటిమాటికీ చేయకండి.రివైజ్ చేయాల్సిన అవసరం వస్తే ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి సుమా.. » మళ్లీ పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకోండి » సమగ్రంగా అన్ని వివరాలు సేకరించండి » రివైజ్ రిటర్న్ ఆప్షన్‌ను ఎంచుకోండి » సరైన ఐటీఆర్‌ను ఎంచుకోండి » ఒరిజినల్ రిటర్ను వివరాలన్నీ ఇవ్వాలి లేదా అప్లోడ్ చేయాలి » మిగతా పద్ధతంతా షరా మామూలేమనంతట మనమే రివైజ్ చేస్తున్నాం. మళ్లీ మళ్లీ చేయడం సబబు కాదు. సమంజసం కాదు. రివైజ్ చేయడానికి కారణాలు సాంకేతికపరమైనవి, చిన్న చిన్నవైతే ఫర్వాలేదు. కానీ పెద్దవి అయితే మాత్రం మీ రివైజ్డ్ రిటర్నుని స్క్రూటినీ కోసం సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్ పంపించగలరు. -
ఇన్వెస్టర్లకు అలర్ట్.. బీఎస్ఈ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టిస్తున్న నకిలీ(ఫేక్) సోషల్ మీడియా సంస్థలకు దూరంగా ఉండాలంటూ స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం బీఎస్ఈ ఇన్వెస్టర్లను తాజాగా హెచ్చరించింది. లింక్డ్ఇన్, ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అనధికార, నకిలీ సంస్థలు బీఎస్ఈ అధికారిక గుర్తింపులను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బీఎస్ఈతో సహచర్యం కలిగి ఉన్నట్లు తప్పుగా పేర్కొంటున్నాయని తెలియజేసింది. వెరసి ఇలాంటి సంస్థలు లేదా వ్యక్తులపట్ల అప్రమత్తతో వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది. "తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా హ్యాండిల్స్/ ఎంటిటీల బారిన పడకుండా ఇన్వెస్టర్లను బీఎస్ఈ అప్రమత్తం చేస్తోంది. బీఎస్ఈకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు క్లెయిమ్ చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రామాణికతను నిర్ధారించుకోవాల్సిందిగా సూచిస్తోంది" బీఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎస్ఈ అధికారికంగా ధ్రవీకరించబడిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను విశ్వసించాలని ఇన్వెస్టర్లను కోరింది. -
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో అవకాశాలు..కానీ వాటిని నమ్మొద్దు!
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మరిన్ని అవకాశాలు ఉన్నాయని హెచ్డీఎఫ్సీ మాజీ చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. మ్యూచువల్ ఫండ్–జీడీపీ రేషియో 16గానే ఉందంటూ, అంతర్జాతీయంగా ఇది 80గా ఉన్నట్టు చెప్పారు. కనుక మ్యూచువల్ ఫండ్స్ రంగంలో మరిన్ని సంస్థలకు చోటు ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. అలాగే తప్పుడు సమాచారంపై కీలక హెచ్చరిక చేశారు. ‘వాట్సాప్ యూనివర్శిటీ’ విస్తరణ, మార్కెట్లలో డబ్బు సంపాదించడంపై వస్తున్న తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండలన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ప్రజలు దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టేలా చూసుకోవాలని , HDFC AMC . HDFC లైఫ్ చైర్మన్ దీపక్ పరేఖ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్‌తో ప్రారంభించి, ఆ తరువాత కొన్ని చిట్కాలతో నేరుగా మార్కెట్లలో పెట్టుబడులతో భారీ లాభాలు పొందవచ్చని భావించి నష్టపోయిన పెట్టుబడిదారులు చాలామంది ఉన్నారని పేర్కొన్నారు. ముందు మార్కెట్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. (నువ్వు క్లాస్..బాసూ! ఆనంద్ మహీంద్ర లేటెస్ట్ ట్వీట్ వైరల్) ప్రస్తుతం ఫండ్స్ పరిశ్రమలో 43 సంస్థలు ఉండగా, వీటి నిర్వహణలోని ఆస్తులు రూ.47.6 లక్షల కోట్ల మేర ఉన్నాయి. ఇందులో సింహ భాగం ఆస్తులు టాప్–5 సంస్థల చేతుల్లోనే ఉన్నాయి. ‘‘50 కోట్ల పాన్లు, 11 కోట్ల డీమ్యాట్ ఖాతాలు ఉన్నాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ 4 కోట్ల మందినే చేరుకుంది. కనుక మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి’’ అని పరేఖ్ వివరించారు. మ్యూచువల్ ఫండ్ ఇప్పటికీ బలవంతంగా విక్రయించే ఉత్పత్తిగానే ఉందన్న పరేఖ్.. మరింత మంది పంపిణీదారులను కలిగి ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. యూనిట్ హోల్డర్లు, ఫండ్స్ సంస్థలకు మధ్య వారు కీలక అనుసంధానమని పేర్కొన్నారు. -
టెలిగ్రామ్, వాట్సప్‌లో ఈ ఇన్వెస్ట్మెంట్ సలహాలు విన్నారో.. కొంప కొల్లేరే!
ముంబై: రియల్ ట్రేడర్, గ్రో స్టాక్ సంస్థలో ఎలాంటి పెట్టుబడులు పెట్టొందంటూ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్(ఎన్ఎస్ఈ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ‘‘టెలిగ్రామ్, వాట్సప్ సామాజిక మాధ్యమాల ద్వారా కచ్చితమైన రాబడులను అందిస్తామంటూ రియల్ ట్రేడర్, గ్రో స్టాక్ సంస్థలు మోసపూరిత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటిలో పెట్టుబడులు పెట్టి మోసపోద్దు. ఈ సంస్థలకు ఎక్స్చేంజ్ నుంచి ఎలాంటి గుర్తింపు లేదు’’ అని ఎన్ఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే తరహా తప్పుడు ఆఫర్లను ప్రకటించడంతో గత నెలలో షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సైతం ఎక్స్చేంజ్ నిషేధించింది. ఇది చదవండి: కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలు: అంబానీకి ఐటీ నోటీసులు అదానీ గ్రూప్ చేతికి ఎన్డీటీవీ.. మరి మాతో చర్చించ లేదు! భారత్‌లో క్షీణిస్తున్న క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి -
ట్రంప్ చర్యలతో మరింత ప్రాణనష్టం: బైడెన్
వాషింగ్టన్: కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి సరైన సహకారం అందకపోతే చాలా మంది అమెరికన్లు చనిపోయే అవకాశముందని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో ఫలితాలను తిరస్కరించిన విషయం తెలిసిందే. కొత్త ఉపశమన చట్టాన్ని ఆమోదించాలని యుఎస్ కాంగ్రెస్‌ను జో బైడెన్ కోరారు. కోవిడ్ -19 మహమ్మారి తరువాత దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించడానికి వ్యాపారవేత్తలు ,కార్మిక నాయకులు కలిసి పనిచేయాలన్నారు. ‘మనము డార్క్ వింటర్‌లోకి వెళ్తున్నాము. కొన్ని విషయాలు సులభతరం అయ్యే ముందు కఠినంగానే ఉంటాయి’ అని బైడెన్ అన్నాడు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మిలియన్ల కొద్దీ ఉద్యోగ నష్టాలను చవిచూసిన ఆర్థిక వ్యవస్థను జో బైడన్ రాబోయే కాలంలో వాటి భారాన్నిమోయనున్నారు.ఇప్పటికే అమెరికాలో 2,46,000 మందికి పైగా మరణించారు. రోజువారీగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. జనవరి 20 న బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరోవైపు ట్రంప్ తన మొండి వైఖరిని వీడడంలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తానే గెలిచానని ట్వీట్లు వేస్తున్నారు. మోడెర్నా వ్యాక్సిన్ ప్రకటన తరువాత,‘మరొక టీకా ఇప్పుడే ప్రకటించారు. ఈసారి మోడెర్నా95% ప్రభావవంతంగా పనిచేస్తుంది. చరిత్రకారులారా గుర్తుంచుకోండి.. చైనా మహమ్మారిని అంతం చేసే ఈ గొప్ప ఆవిష్కరణలు అన్నీ నా పాలనలోనే బయటకు వచ్చాయి. ’ అని ట్రంప్ అన్నారు. -
దిగుమతులు తగ్గించాలనుకోవడం సరికాదు : రాజన్
సాక్షి, ముంబై: ఆత్మ నిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) చొరవల్లో భాగంగా ‘టారిఫ్‌లు పెంపుతో’ దేశం దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని, దేశీయ ఉత్పత్తులను పెంచడం ద్వారా స్వయం సంమృద్ధిని సాధించాలనీ భావించడం సరికాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. గతంలో అనుసరించిన ఈ తరహా విధానాలు తగిన ఫలితాలను ఇవ్వలేదని కూడా ఆయన ఈ సందర్భంగా అన్నారు. సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ స్టడీస్ నిర్వహించిన ఒక వెబ్‌నార్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఒక దేశం చౌకగా వస్తున్న ముడి పదార్థాలను దిగుమతి చేసుకుని, వాటి ఆధారిత ఉత్పత్తులను ‘అంతర్జాతీయ మార్కెట్లో పోటీకి తగినట్లు’ తగిన ధర వద్ద ఎగుమతి చేయాలి. తద్వారా దేశం తగిన ప్రయోజనం పొందాలి. చైనా అనుసరించిన విధానం ఇదే. ఆ దేశం ఈ దిశలో మంచి ఫలితాలను సాధించింది. ఈ తరహా ఉత్పత్తి వాతావరణం దేశంలో నెలకొనడానికి తగిన కృషి జరగాలి’’ అని వెబ్‌నార్‌లో రాజన్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... లక్ష్యాన్ని ఉద్దేశించి కేంద్రం చేసే ప్రతిపైనా దీర్ఘకాలంలో ప్రతిఫలం అందిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో విచక్షణారహిత వ్యయ విధానాలు అనుసరించరాదు. కరోనా సవాళ్లకు ముందే దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారిందన్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఇందుకు కారణాలను, పర్యవసానాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోవాలని సూచించారు. భారత్ ఫైనాన్షియల్ వ్యవస్థ ఇప్పటికీ బలహీనంగా ఉందని పేర్కొన్న ఆయన, సవాళ్ల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి అవసరమని అన్నారు. తద్వారానే సామాన్యుని కష్టాలను తీర్చగలమని పేర్కొన్నారు. సమీప కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతర ద్రవ్య పరపతి విధానాన్నే అవలంభిస్తుందన్న అభిప్రాయాన్ని ఆయన ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అలా భావించడం తగదు..: సన్యాల్ స్వావలంబన భారత్ ఉద్దేశం ‘దిగుమతులు తగ్గించడమో... లేక లైసెన్స్ రాజ్‌ను తిరిగి ప్రవేశపెట్టడమో లేదా సమర్థవంతంగా వ్యాపారం చేయని సంస్థలను రక్షించడమో కాదు’ అని సీఐఐ గురువారం నిర్వహించిన ఫైనాన్షియల్ మార్కెట్ 2020– వెర్చువల్ సదస్సులో కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ ప్రకటన నేపథ్యంలో సన్యాల్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. అత్యంత పటిష్టమైన, సామర్థ్యంతో కూడిన సంస్థలు సవాళ్లను ఎదుర్కొని నిలబడేట్లు చేయడమే ఆత్మ నిర్భర్ భారత్ ప్రధాన ఉద్దేశమని ఆయన అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ అంటే సర్కార్ నిర్భర్ భారత్‌గా భావించరాదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో ఎంతో సామర్థ్యంతో పనిచేస్తున్న ఫార్మా రంగం ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, అలాంటి పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా తగిన సహాయ సహకారాలు అందాల్సి ఉంటుందని అన్నారు. కోవిడ్-19తో తీవ్రంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలో తిరిగి డిమాండ్ నెలకొనడానికి తక్షణం తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సన్యాల్ పేర్కొన్నారు. ఆతిథ్యం వంటి ఎన్నో రంగాల్లో డిమాండ్ మెరుగుపడాల్సి ఉందని అన్నారు. -
పరువమా.. పరుగు తీయకు
కౌమారం ఓ జలపాతం..కౌమారం ఓ సెలయేటి గలగల... కౌమారం పగ్గాల్లేని వేగం.. పాఠశాల దశ దాటి కళాశాలలో అడుగుపెట్టగానే.. అంతా ఓ కొత్త బంగారు లోకం... కానీ ఆ కొత్త బంగారులోకంలో పూల వెనక .. ముళ్లుంటాయి... ఆనందపు జలపాతాల వెనక సుడులుంటాయి... జారిపడితే అధఃపాతాలానికి దారులుంటాయి... అందుకే ప్రాయంలో అపాయాన్ని గుర్తెరగాలి... టీనేజీ డ్యామేజీ కాకుండా జాగురూకత ఉండాలి..ఎ దిగే వయసులో తప్పటడుగు పడకుండా చూడాలి... భవితకు క్రమశిక్షణతో బంగారు బాట వేసుకోవాలి... కౌమారంలో అంతా కొత్త బంగారులోకం.. తప్పటడుగు వేస్తే టీనేజీ...డ్యామేజీ.. కొత్త ఆనందాల వెనక అనర్థాలు.. బాలికలకు సదా అప్రమత్తత అవసరం సాక్షి, అచ్యుతాపురం(విశాఖపట్టణం) : ప్రపంచం గురించి ఇప్పుడే తెలుసుకుంటారు. అనేక పరిచయాలు కొత్త ఆలోచనలు, ఆకర్షణలు, ఆలోచనలు తెలుస్తుంటాయి. పాలకు, నీళ్లకు తేడా తెలుసుకోలేని వయసు. పాఠశాల విద్యను పూర్తిచేసి ఉన్నత విద్యకు శ్రీకారం చుట్టే ప్రథాన ఘట్టం ఇదే. తాము ఏర్పాటు చేసుకునే లక్ష్యాలకు పదును పెట్టాల్సిన సమయం ఇదే. పట్టుదలతో చదవాలన్నా, పరిచయాలతో చెడు అలవాట్లకు గురికావాలన్నా ఇక్కడే జరుగుతుంది. బాగుపడాలన్నా చెడిపోవాలన్నా టీనేజ్ కత్తిమీద సామని చెప్పాలి. ఉజ్వల భవిష్యత్‌కి భుజం తట్టి ప్రోత్సహించే చేతులుంటాయి. చెడుమార్గాన్ని నడిపించే చేతులుంటాయి జాగ్రత్తని ప్రముఖులు చెబుతున్నారు. ఆ...కర్షణలో రక్షణ లేదు కౌమార దశలో వచ్చే కొత్త కొత్త అనుభూతులు కొందరిని బలహీనులుగా మారుస్తాయి. హార్మోన్ల ప్రభావంతో లైంగిక ఆకర్షణలకు గురికావడం, ఆపై దాడులకు గురవడం, మోసపోవడం చూస్తుంటాం. ఇటువంటి పరిస్థితుల్లో పరువానికి పగ్గాలు వేయడం ముఖ్యం. ముఖ్యంగా బాలికలు ఎదుర్కొనే పరిస్థితులు వేరు. తోటి విద్యార్థులుగాని, ఉపాధ్యాయులుగాని శుభాకాంక్షలు చెబుతూ షేక్‌హ్యాండ్ ఇచ్చినప్పుడు అరచేతిని వేలితోరుద్దడం, ప్రోత్సహిస్తున్నట్టు భుజంపై చేయివేయడం, ప్రయాణంలో చేతులు తాకించడం వంటి పలు చర్యలను ఆడపిల్లలు ఎదుర్కొనే ఇబ్బందికర స్పర్శలుగా గుర్తించారు. పరుషపదాలతో మాట్లాడడం, ఏకవచనంతో సంబోధించి మానసికంగా వేధించడం వంటి చర్యలూ వారిని కుంగదీస్తుంటాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారి వివరాలను పోలీసులకు చేర వేస్తే శక్తి టీం మహిళా కానిస్టేబుళ్లు రంగంలోకి దిగుతారు. వారి భరతం పడతారు. కళాశాలకు బస్సులో ప్రయాణించేటప్పుడు ఇబ్బందికరంగా ఎవరైనా ప్రవర్తిస్తే ప్రయాణంలో ఉండగానే పోలీసులకు సమాచారం ఇస్తే బస్ ట్రాకింగ్ చేసి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది బస్‌స్టాప్‌కు చేరుకొని చర్యలు తీసుకుంటారు. మజా ఖర్చులతో కరుసైపోతారు పాఠశాల వదిలి కళాశాలలో అడుగుపెట్టగానే స్మార్ట్‌ఫోన్, నెట్ బ్యాలెన్స్‌కు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బర్త్‌డే పార్టీలు, వాలెంటైన్స్‌డే, యూత్‌డే, ఫ్రెడ్షిప్డేలంటూ పార్టీ కల్చర్ ఎక్కువవుతుంది. గ్రూపుగా యువతీయువకులు చేరి ఎంజాయ్చేయాలనే ఆలోచన వస్తుంది. ఆ వేడుకలు రానురాను కాస్త అప్‌గ్రేడ్ అవుతున్నాయి. లంచ్, డిన్నర్, డ్రింక్, బీర్లవరకూ దారితీస్తుంది. మదర్స్‌డే. ఫాదర్స్డేలను కూడా తమ ఆనందాల కోసమే వాడుకుంటున్నారు. తరుచూ పాస్ట్ఫుడ్కి అలవాటుపడి ఖర్చుని అమాంతంగా పెంచేస్తున్నారు. ఐదుగురు హోటల్‌కి వెళ్తే 2వేలుకి మించి ఖర్చుచేస్తారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కి వెళ్లే వందలకొద్దీ ఖర్చు చేస్తారు. తల్లిదండ్రులు స్కూల్ ఫీజు చెల్లించడానికి ఇబ్బందిపడే పరిస్థితిలో పిల్లల ఖర్చు భారంగా మారుతుంది. తల్లిదండ్రులు జేబు ఖర్చులకు దండిగా డబ్బులు ఇవ్వకపోతే పోపుల డబ్బాలో చేయిపెట్టక తప్పడం లేదు. అక్కడ చిల్లర దొరకకపోతే చిల్లర దొంగతనాలకు పాల్పడే స్థాయికి సిద్ధపడుతున్నారు. బాలనేరస్తుల్లో ఎక్కువ మంది తమ వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడం కోసమే నేరాలకు పాల్పడుతున్నారు. డబ్బు అవసరాలను తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం పట్టించుకోరు.. కాలేజీకి వెళ్తున్నామంటే కొందరు క్యారేజీని పక్కనపెట్టేస్తా రు. మధ్యాహ్నం భోజ నం చేయకపోవడం, చిరుతిండితో సరిపెట్టడంతో ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. సమృద్ధిగా నీరుతాగరు. తాగమని చెప్పేవారుండరు. చెప్పినా వినిపించుకోరు. జంక్‌ఫుడ్ తినడంతో తరుచూ అనారోగ్యానికి గురవుతా రు. బాలికలు జీరోసైజ్కోసం తిండిని పక్కన పెట్టేస్తున్నా రు. చాక్లెట్లు డ్రింక్‌లతో సరి పెడుతున్నారు. అప్పటివరకూ పుస్తకాలబ్యాగ్తోపాటు భోజనం క్యారియర్ని ప్రత్యేకబ్యాగులో తీసుకెళ్తారు. ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకూ అదే అలవాటుగా కొనసాగుతుంది. కాలేజీకి రాగానే ఇంటి భోజనంపై శ్రద్ధ తగ్గుతుంది. ఎదిగేవయçసులో సమృద్ధిగా పౌష్టికాహారం తినాలి. కానీ జంక్ ఫుడ్‌కు అలవాటు పడతారు. అందుకే క్రమశిక్షణగా ఇంటినుంచి భోజనం తీసుకెళ్లాలి. ‘షి’కారులు వద్దే వద్దు పిక్నిక్, హాలిడేట్రిప్, సైన్స్ టూర్, కెరియర్ మీట్, ఎగ్జిబిషన్, సమ్మిట్‌కి హాజరుకావడం ఇప్పుడు అవసరమయ్యింది. విద్యలో రాణించడానికి ఉపాధి అవకాశాలను చేజిక్కించుకోవడానికి దూరప్రదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ క్రమంలో కొత్త కొత్త పరిచయాలు పెంచుకుంటారు. అయితే మిత్రులే అంటూ ఎవరినీ ఎక్కువగా నమ్మడం సరికాదు. ఏకాంత ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లడం మానుకోవాలి. అవే పరిచయాలతో అవకాశం ఉన్న ప్రతిసారీ బీచ్‌లకు, లాంగ్‌డ్రైవ్‌కి వెళ్లడం అలవాటు చేసుకుంటున్నారు. అటువంటి ‘షి’కారులతో అనర్థాలే. ఒక్కసారే...అనుకుంటే అనర్ధమే.. చెడు అలవాటును పరిచయం చేయడంలో ఫ్రెండ్స్ వాడే మాట ఒక్కసారికి ఏమైపోతుందిలే..అని. అక్కడ నుంచి వ్యసనం మొదలవుతుంది.అదే పతనానికి నాంది అని గ్రహించాలి. మత్తుపదార్థాలను తీసుకోవడం, అసభ్యకరవీడియోలను చూడడం జీవితాలను నాశనం చేస్తాయి. మంచి ఫ్రెండ్స్‌కి దగ్గరవ్వాలి. చెడుస్నేహాన్ని వీడాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం ద్వారా టీనేజ్‌లో ప్రమాదాల నుంచి బయటపడగలరు. కౌమార దశలో జాగ్రత్తలు అవసరం కౌమారదశలో ఆడపిల్లలకు శారీరక మార్పులు, హార్మోన్ల ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో పిల్లల్ని వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టే వారిపై కఠినంగా ఉండాలి. వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నారు. అభం శుభం తెలియదు. ఏవో అనుభూతులతో కొందరు ఆకర్షణలో పడిపోతారు. భవిష్యత్‌ని నాశనం చేసుకుంటున్నారు. మగ స్నేహితుల మాటలకు ఆకర్షితులై చనువు పెంచుకుంటున్నారు. అవే శారీరక దాడులకు దారితీస్తున్నాయి. టీనేజ్ పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ప్రేమగా ఉండి ప్రతి అంశాన్ని అడిగి తెలుసుకోవాలి. – ఎం.కనకమహాలక్ష్మి, వైద్యాధికారిణి, అచ్యుతాపురం పీహెచ్సీ ఓ కంట కనిపెట్టి ఉండాలి పదో తరగతి వరకూ జాగ్రత్తగా చూస్తాం. ఇంటర్‌కి వెళ్లేసరికి ఎవరి మాటా వినరు. కొత్త పరిచయాలు, కొత్తస్నేహాలు, కొత్త అనుభూతులు ఉంటాయి. సరిగ్గా భోజనం చేయరు. మగపిల్లలతో పరిచయాలు పరిమితికి మించకూడదు. తల్లిదండ్రులకు జవాబుదారీగా ఉండాలి. ఎదుటివారికి అవకాశం ఇవ్వకూడదు. – ఎ.విజయ, ప్రధానోపాధ్యాయుని హైస్కూల్, అచ్యుతాపురం క్రమశిక్షణతోనే బంగారు భవిత క్రమశిక్షణతో ఉంటేనే పిల్లల ఉన్నత చదువులు సాధ్యమవుతాయి. ఆడపిల్లలకు అణువణువునా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఇంటర్, పాలిటెక్నిక్‌కి వెళ్లే పిల్లలకు అంతా కొత్త వాతావరణం..దీంతో తప్పటడుగులు పడే అవకాశం ఎక్కువ. సోషల్‌మీడియా ప్రభావంతో ప్రతి చిన్నవిషయానికి పార్టీ చేసుకోవడం లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లడం ఇటీవల ఎక్కువయ్యాయి. అవి బాలికలపై దాడులు జరగడానికి అవకాశంగా మారుతుంది. ఆడపిల్లలు ధైర్యంగా సమస్యలను ఎదురొడ్డి నిలబడేలా వారిని తీర్చిదిద్దాలి. – పక్కుర్తి కుమారి, ఉపాధ్యాయుని -
లామినేటెడ్ ఆధార్ కార్డు వాడకండి..!
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ కార్డ్ గోప్యత ప్రశ్నార్థకమవుతున్న వేళ యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ)తాజా హెచ్చరికలు జారీ చేసింది. ప్లాస్టిక్ లేదా లామినేటెడ్ ఆధార్ కార్డును వాడవద్దని ప్రజలను హెచ్చరించింది. వీటి వల్ల కార్డుదారుల వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యే అవకాశముందని తెలిపింది. అంతేకాదు.. అసలు ప్లాస్టిక్ ఆధార్ కార్టులను తీసుకోవద్దని, వాటి వలన ఎలాంటి ఉపయోగం లేదని స్పష్టం చేసింది. ఈ పనికిరాని కార్డుకోసం డబ్బులు వృధా చేసుకోవద్దని సూచించింది. ఈ అనధికార ముద్రణ ద్వారా క్యూఆర్ కోడ్ చోరీకి గురయ్యే అవకాశం ఉందని దీంతో మన సమ్మతి లేకుండా వ్యక్తిగత సమాచారం లీక్అవుతుందని యుఐడిఎఐ సీఈవో అజయ్ భూషణ్‌పాండే తెలిపారు. ప్లాస్టిక్ ఆధార్‌కార్డు పూర్తిగా వ్యర్థమని పేర్కొన్నారు. దీనికి బదులు సాధారణ కాగితంపై డౌన్లోడ్ చేసుకున్న ఆధార్‌కార్డు, ఎం-ఆధార్ మాత్రమే చెల్లుబాటు అవుతాయని చెప్పారు. కొంతమంది దుకాణదారులు రూ.50 నుంచి 300 వరకు చార్జ్ వసూలు చేస్తూ ప్లాస్టిక్ ఆధార్‌కార్డులు ఫ్రింట్ చేసి ఇస్తున్నారని..అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని పాండే తెలిపారు. అన్ని రకాల అవసరాల కోసం వినియోగదారులు ఖచ్చితంగా సాధారణ పేపర్ ప్రింటెడ్ ఆధార్, ఎం-ఆధార్‌లనే వాడాలని సూచించారు. ఆధార్‌కార్డు పోగొట్టుకున్న సందర్భంలో https://eaadhaar.uidai.gov.in కి లాగిన్ అయి ఆధార్‌కార్డును ఉచితంగా పొందవచ్చని తెలిపారు. ఆధార్ కార్డుల ముద్రణ కోసం ప్రజలు అనధికారిక సంస్థలను ఆశ్రయించవద్దని కోరారు. అలాగే ఆధార్ కార్డును అనధికారికంగా ప్రచురించడం చట్టప్రకారం నేరమని, జైలు శిక్షకు గురి కావల్సి వస్తుందని హెచ్చరించారు. -
డిపాజిట్లపై ఆర్బీఐ హెచ్చరిక
హైదరాబాద్: సహకార సంఘాల్లో సభ్యులు కానివారి నుంచి డిపాజిట్లను స్వీకరించ వద్దని రిజర్వు బ్యాంకు సహకార సంఘాలను హెచ్చరించింది. అలాగే సహకార సంఘాలలో నామమాత్రపు సభ్యులు, అనుబంధ సభ్యుల నుండి కూడా డిపాజిట్లను స్వీకరించరాదని ఆర్బీఐ తేల్చి చెప్పింది. కొన్ని సహకార సంఘాలు / ప్రాధమిక సహకార క్రెడిట్ సొసైటీలు .. సభ్యులు కానివారు / నామినల్ సభ్యులు / అసోసియేట్ సభ్యుల నుంచి డిపాజిట్లను స్వీకరిస్తున్నారని రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిపై ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్, ఆర్ బిఐ (తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్) శ్రీ ఆర్. సుబ్రమణియన్ క్లారిటీ ఇచ్చారు. ఈ సహకార సంస్థలకు, బ్యాంకింగ్ వ్యాపారము చేయడానికి, రిజర్వు బ్యాంకు బి.ఆర్. యాక్ట్ (బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949) అనుసరించి ఎటువంటి లైసెన్స్ ను జారీ చేయలేదని, అధికారం కూడా ఇవ్వలేదని ఆయన వివరించారు. ఇంటువంటి సహకార సంఘాలలో డిపాజిట్ చేసిన సొమ్ముకు ఎటువంటి బీమా కవరేజ్ లేదని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాలను గమనించి, సహకార సంఘాలతో డిపాజిట్ల విషయంలో జాగ్రత్త వహించాలని ఆర్. సుబ్రమణియన్ కోరారు. -
పురుగుల మందులు చల్లుతున్నారా?
జాగ్రత్తలు తప్పనిసరి.. నిర్లక్ష్యం కూడదు రక్షణ చర్యలు చేపట్టాలి.. లేదంటే అనర్థాలు తప్పవు గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ సలహా సూచనలు గజ్వేల్: వివిధ రకాల పంటలకు చీడపీడల నివారణకు పురుగు మందులను వాడకం ప్రస్తుతం తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో కనీస జాగ్రత్తలు పాటించక రైతులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. జాగ్రత్తలతో ఇలాంటి పరిస్థితి రాకుండా చేసుకోవచ్చు. పురుగు మందుల వాడకంలో తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ (సెల్: 7288894469) వివరించారు. కొనుగోలు స్థిర పరిమాణంలో ఒకసారి చల్లడానికి కావాల్సిన పరిమాణం మేరకే కొనుగోలు చేయాలి. ఉదాహరణకు 100, 250, 100 మిల్లీలీటర్ల చొప్పున పురుగు మందులు కొనాలి. చినిగిన లేదా కుట్టులేని సంచులను గానీ, కారుతున్న లేదా విడి/వదులు పాత్రల్లోగానీ కొనకూడదు. సరైన అధీకృత లేబిల్స్ లేనివి కొనుగోలు చేయవద్దు. వాడకం గృహ పరిసరాల్లో పురుగు మందులను నిల్వ చేయవద్దు. సీలు భద్రంగా ఉన్న సహజ పాత్రల్లోనే దాచిపెట్టాలి. ఇతర పాత్రల్లోకి మార్చవద్దు. ఆహారం, మేత, దాణాలతో కలిపి నిల్వ చేయరాదు. పశువులకు, పిల్లలకు అందకుండా నిల్వచేయాలి. సూర్యరశ్మికి, వాన నీటికి బహిర్గతం కాకుండా దాచాలి. పురుగు మందులను, కలుపు నివారణ మందులతో కలిపి నిల్వ చేయవద్దు. ఆహార పదార్థాలతో పాటు వెంట తీసుకెళ్లటం గానీ, రవాణా చేయటం గానీ ఎప్పుడూ చేయకూడదు. వీపు, భుజాలు, తలమీద, పొడులు/గుళికల బస్తాలను మోయవద్దు. స్ప్రే దావక తయారీ పరిశుభ్రమైన నీటినే వాడాలి. చేతులు, చెవులు, నోరు, కళ్లు, ముక్కులకు రక్షణ ఏర్పాటు చేసుకోవాలి తలకు టోపీ, తువ్వాలు, ముఖానికి ముసుగు, చేతులకు తొడుగు వేసుకోవాలి. పురుగు మందులతో వచ్చిన పాలిథిన్ కవర్లను ఇందుకోసం వాడరాదు. చేతి రుమాలును, తువ్వాలును, శభ్రమైన గుడ్డను, పాలిథిన్ సంచులను టోపీ, ముసుగు, తొడుగుగా వాడవచ్చు. స్ప్రే ద్రావకం తయారు చేసేముందు పురుగు మందు డబ్బాలకు గల లేబిల్‌ను చదవాలి. అవసరానికి అనుగుణంగా స్ప్రే ద్రావకాన్ని తయారు చేసుకోవాలి. గుళికలను నీటిలో కలపరాదు. పాత్రలను తెరిచేటప్పుడు ముందు చేతుల మీద పడకుండా చూసుకోవాలి. మందును ముక్కుతో వాసన చూడకూడదు. స్ప్రేయర్ ట్యాంక్‌లో ద్రావకం పోసేటప్పుడు ఒలికిపోకుండా చూడాలి. ద్రావకం తయారుచేసేటప్పుడు పొగ తాగటం, నీరు తాగటం, తినటం వంటివి చేయకూడదు. ద్రావకం కలిపే మనిషి కాళ్లకు, చేతులకు పాలిథిన్ సంచులను రక్షణ కవచాలుగా ధరించాలి. మందుచల్లే పరికరం సరైన పరికరాన్ని ఎంచుకోవాలి. లోపం గల పరికరాన్ని, కారుతున్న పరికరాన్ని వాడకూడదు. సరైన నాజిల్‌ను ఎంచుకోవాలి మూసుకుపోయిన నాజిల్‌ను నోటితో ఊది శుభ్రం చేయకూడదు. పరికరానికి వేలాడగట్టిన పాత టూత్‌బ్రష్‌ను ఉపయోగించి నీటితో శుభ్రం చేయాలి. పురుగు మందులకు, కలుపు నివారణ మందులకు ఒకే స్ప్రేయర్‌ను ఉపయోగించవద్దు. పురుగు మందులను చల్లకం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిఫార్సు మేరకు మాత్రమే మందు మోతాదులను కలపాలి. గాలి ఎక్కువగా వీచినపుడుగానీ, ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నపుడు గానీ చల్లకూడదు. వర్షాలకు ముందు, వర్షం కురిసి వెలిసిన తర్వాత చల్లకూడదు. గాలి వీచే దిక్కుకు వ్యతిరేకంగా చల్లకూడదు. బ్యాటరీతో నడిచే అల్ట్రాలోవాల్యుమ్ను స్ప్రేయర్‌ను ద్రవ రూప మందులను చల్లడానికి ఉపయోగించకూడదు. స్ప్రేయింగ్ చేసిన తర్వాత వాడిన స్ప్రేయర్, బకెట్ మొదలగు వాటిని సబ్బుతో కడగాలి. ఖాళీ మందు టిన్ను/బుడ్లను, మందు కలిపిన బకెట్ మొదలగు వాటిని గృహావసరాలకు వాడకూడదు. స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఆ పొలంలోకి పనివాళ్లను, పశువులు వెళ్లకుండా చూడాలి. కాలుష్య నివారణ స్ప్రే చేయగా మిగిలిన ద్రావకాన్ని కాల్వలు/బోదెలు/చెరువులు/కుంటల్లో పారబోయరాదు. వాడేసిన ఖాళీ డబ్బాలు, పాత్రలను రాయి, కర్రతో చితగొట్టి నీటి వనరుకు దూరంగా భూమిలో లోతుగా పాతిపెట్టాలి. ఖాళీ అయిన బుడ్లు, డబ్బాలను ఏ అవసరానికైనా సరే తిరిగి వాడకూడదు. మరిన్ని సూచనలు చల్లాల్సిన మందు మోతాదు, సమయాల గురించి మందును పొలంలో చల్లడానికి ముందే సస్యరక్షణ రంగంలో అనుభవమున్న నిపుణులను సంప్రదించాలి. పురుగు మందులను అపమార్గంలో వినియోగించవద్దు. పురుగు మందులను వివేకంతో ఎంచుకోవాలి అవసరానికి అనుగుణంగా మాత్రమే పురుగు మందులను విచక్షణతో ఎంచుకోవాలి. పురుగు మందులను చల్లిన తర్వాత పచ్చి ఆకులను ఆహారంగా వాడకూడదు.