పురుగుల మందులు చల్లుతున్నారా? | using pestisides for crops? | Sakshi
Sakshi News home page

పురుగుల మందులు చల్లుతున్నారా?

Published Tue, Aug 9 2016 9:55 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

పొలంలో పురుగు మందును స్ప్రే చేస్తున్న రైతు

పొలంలో పురుగు మందును స్ప్రే చేస్తున్న రైతు

  • జాగ్రత్తలు తప్పనిసరి.. నిర్లక్ష్యం కూడదు
  • రక్షణ చర్యలు చేపట్టాలి.. లేదంటే అనర్థాలు తప్పవు
  • గజ్వేల్‌ ఏడీఏ శ్రావన్‌కుమార్‌ సలహా సూచనలు
  • గజ్వేల్: వివిధ రకాల పంటలకు చీడపీడల నివారణకు పురుగు మందులను వాడకం ప్రస్తుతం తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో కనీస జాగ్రత్తలు పాటించక రైతులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. జాగ్రత్తలతో ఇలాంటి పరిస్థితి రాకుండా చేసుకోవచ్చు. పురుగు మందుల వాడకంలో తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను గజ్వేల్‌ ఏడీఏ శ్రావన్‌కుమార్‌ (సెల్‌:  7288894469) వివరించారు.

    కొనుగోలు

    • స్థిర పరిమాణంలో ఒకసారి చల్లడానికి కావాల్సిన పరిమాణం మేరకే కొనుగోలు చేయాలి. ఉదాహరణకు 100, 250, 100 మిల్లీలీటర్ల చొప్పున పురుగు మందులు కొనాలి.
    • చినిగిన లేదా కుట్టులేని సంచులను గానీ, కారుతున్న లేదా విడి/వదులు పాత్రల్లోగానీ కొనకూడదు.
    • సరైన అధీకృత లేబిల్స్‌ లేనివి కొనుగోలు చేయవద్దు.

    వాడకం

    • గృహ పరిసరాల్లో పురుగు మందులను నిల్వ చేయవద్దు.
    • సీలు భద్రంగా ఉన్న సహజ పాత్రల్లోనే దాచిపెట్టాలి.
    • ఇతర పాత్రల్లోకి మార్చవద్దు.
    • ఆహారం, మేత, దాణాలతో కలిపి నిల్వ చేయరాదు.
    • పశువులకు, పిల్లలకు అందకుండా నిల్వచేయాలి.
    • సూర్యరశ్మికి, వాన నీటికి బహిర్గతం కాకుండా దాచాలి.
    • పురుగు మందులను, కలుపు నివారణ మందులతో కలిపి నిల్వ చేయవద్దు.
    • ఆహార పదార్థాలతో పాటు వెంట తీసుకెళ్లటం గానీ, రవాణా చేయటం గానీ ఎప్పుడూ చేయకూడదు.
    • వీపు, భుజాలు, తలమీద, పొడులు/గుళికల బస్తాలను మోయవద్దు.

    స్ప్రే దావక తయారీ

    • పరిశుభ్రమైన నీటినే వాడాలి.
    • చేతులు, చెవులు, నోరు, కళ్లు, ముక్కులకు రక్షణ ఏర్పాటు చేసుకోవాలి
    • తలకు టోపీ, తువ్వాలు, ముఖానికి ముసుగు, చేతులకు తొడుగు వేసుకోవాలి.
    • పురుగు మందులతో వచ్చిన పాలిథిన్‌ కవర్లను ఇందుకోసం వాడరాదు. చేతి రుమాలును, తువ్వాలును, శభ్రమైన గుడ్డను, పాలిథిన్‌ సంచులను టోపీ, ముసుగు, తొడుగుగా వాడవచ్చు.
    •  స్ప్రే ద్రావకం తయారు చేసేముందు పురుగు మందు డబ్బాలకు గల లేబిల్‌ను చదవాలి.
    • అవసరానికి అనుగుణంగా స్ప్రే ద్రావకాన్ని తయారు చేసుకోవాలి.
    • గుళికలను నీటిలో కలపరాదు.
    • పాత్రలను తెరిచేటప్పుడు ముందు చేతుల మీద పడకుండా చూసుకోవాలి. మందును ముక్కుతో వాసన చూడకూడదు.
    • స్ప్రేయర్‌ ట్యాంక్‌లో ద్రావకం పోసేటప్పుడు ఒలికిపోకుండా చూడాలి.
    • ద్రావకం తయారుచేసేటప్పుడు పొగ తాగటం, నీరు తాగటం, తినటం వంటివి చేయకూడదు.
    • ద్రావకం కలిపే మనిషి కాళ్లకు, చేతులకు పాలిథిన్‌ సంచులను రక్షణ కవచాలుగా ధరించాలి.

    మందుచల్లే పరికరం

    • సరైన పరికరాన్ని ఎంచుకోవాలి.
    • లోపం గల పరికరాన్ని, కారుతున్న పరికరాన్ని వాడకూడదు.
    • సరైన నాజిల్‌ను ఎంచుకోవాలి
    • మూసుకుపోయిన నాజిల్‌ను నోటితో ఊది శుభ్రం చేయకూడదు.
    • పరికరానికి వేలాడగట్టిన పాత టూత్‌బ్రష్‌ను ఉపయోగించి నీటితో శుభ్రం చేయాలి.
    • పురుగు మందులకు, కలుపు నివారణ మందులకు ఒకే స్ప్రేయర్‌ను ఉపయోగించవద్దు.

    పురుగు మందులను చల్లకం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    • సిఫార్సు మేరకు మాత్రమే మందు మోతాదులను కలపాలి.
    • గాలి ఎక్కువగా వీచినపుడుగానీ, ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నపుడు గానీ చల్లకూడదు.
    • వర్షాలకు ముందు, వర్షం కురిసి వెలిసిన తర్వాత చల్లకూడదు.
    • గాలి వీచే దిక్కుకు వ్యతిరేకంగా చల్లకూడదు.
    • బ్యాటరీతో నడిచే అల్ట్రాలోవాల్యుమ్‌ను స్ప్రేయర్‌ను ద్రవ రూప మందులను చల్లడానికి ఉపయోగించకూడదు.
    • స్ప్రేయింగ్‌ చేసిన తర్వాత వాడిన స్ప్రేయర్, బకెట్ మొదలగు వాటిని సబ్బుతో కడగాలి.
    • ఖాళీ మందు టిన్ను/బుడ్లను, మందు కలిపిన బకెట్‌ మొదలగు వాటిని గృహావసరాలకు వాడకూడదు.
    • స్ప్రేయింగ్‌ చేసిన తర్వాత ఆ పొలంలోకి పనివాళ్లను, పశువులు వెళ్లకుండా చూడాలి.


    కాలుష్య నివారణ

    • స్ప్రే చేయగా మిగిలిన ద్రావకాన్ని కాల్వలు/బోదెలు/చెరువులు/కుంటల్లో పారబోయరాదు.
    • వాడేసిన ఖాళీ డబ్బాలు, పాత్రలను రాయి, కర్రతో చితగొట్టి నీటి వనరుకు దూరంగా భూమిలో లోతుగా పాతిపెట్టాలి.
    • ఖాళీ అయిన బుడ్లు, డబ్బాలను ఏ అవసరానికైనా సరే తిరిగి వాడకూడదు.

    మరిన్ని సూచనలు

    • చల్లాల్సిన మందు మోతాదు, సమయాల గురించి మందును పొలంలో చల్లడానికి ముందే సస్యరక్షణ రంగంలో అనుభవమున్న నిపుణులను సంప్రదించాలి.
    • పురుగు మందులను అపమార్గంలో వినియోగించవద్దు.
    • పురుగు మందులను వివేకంతో ఎంచుకోవాలి
    • అవసరానికి అనుగుణంగా మాత్రమే పురుగు మందులను విచక్షణతో ఎంచుకోవాలి.
    • పురుగు మందులను చల్లిన తర్వాత పచ్చి ఆకులను ఆహారంగా వాడకూడదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement