pestisides
-
చలికాలంలో పిండినల్లి, చీడపీడలు : ఇవి చల్లుకుంటే చాలు
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసు కోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.ఘా చ్ఛాదన: కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులుటమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నేమసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండి΄ోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామరపురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలురసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి.వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బు పొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ΄్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు.రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే?రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి. – డా. గడ్డం రాజశేఖర్ సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ -
ఎడాపెడా పురుగుమందుల స్ప్రే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పురుగుమందుల వాడకం మితిమీరుతున్నట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) వెల్లడించాయి. దీంతో రైతులను తీవ్రమైన శ్వాసకోశ, చర్మ వ్యాధులు పట్టిపీడిస్తున్నాయని పేర్కొంది. వరి, పత్తి పండించే రైతులే ఎక్కువగా పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ఐసీఎంఆర్, ఎన్ఐఎన్ సంస్థలు నిర్వహించిన ‘దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పురుగుల మందు వాడకం–రైతుల ఆరోగ్యంపై ప్రభావం–నివేదిక’అనే అధ్యయనంలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. 18–70 ఏళ్ల మధ్య వారిపై సర్వే చేశారు. అందులో కనీసం ఒక సంవత్సరం పాటు పురుగుమందులు పిచికారీ చేసిన వారున్నారు.వయస్సు, లింగం, ఎత్తు, బరువు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి, విద్యాస్థాయి, ప్రధానవృత్తి, వారు అనుసరించే వ్యవసాయ పద్ధతులు, పురుగుమందుల వాడకం, విస్తీర్ణం, ఖర్చులు, కూలీల పనులు, çపురుగు మందుల వినియోగానికి గల కారణాలు తదితర సమాచారం సేకరించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రక్తం, మూత్ర నమూనాలను సేకరించారు. పురుగు మందులను ఎక్కువగా వాడటం వల్ల కొందరు కేన్సర్, అల్జీమర్స్ వంటి పెద్ద వ్యాధులకు కూడా గురువుతున్నారని పేర్కొంది.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన లెక్కల ప్రకారం 28 రకాల పురుగు మందుల్లో 11 రకాల మందులు అత్యంత ప్రమాదకరమైనవిగా వర్గీకరించింది. రైతుల నుంచి సేకరించిన రక్త, మూత్ర నమూనాల ద్వారా వారిలో పురుగు మందుల అవశేషాలు కనుగొన్నట్టు ఆ నివేదిక తెలిపింది. నిషేధిత రసాయనాలు కూడా విరివిగా ఉపయోగిస్తున్నారని తేలి్చంది. యాదాద్రి–భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని గ్రామాల్లో క్రాస్ సెక్షనల్ సర్వే జరిగింది. అధ్యయన నివేదికలోని ముఖ్యాంశాలు ⇒ వాణిజ్య పంటల్లో మితిమీరిన పురుగు మందుల వినియోగం వల్ల అనేక నష్టాలు వాటిల్లుతున్నాయి. అవగాహన లేకపోవడంతో తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు. ⇒ రైతులు పురుగుమందులను కలపడానికి ఒట్టి చేతులను ఉపయోగించడం వల్ల కూడా నష్టం జరుగుతోంది. ⇒ పురుగు మందుల మితిమీరిన వాడకం వల్ల ఊపిరి ఆడక పోవడం, ఛాతీనొప్పి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, వాంతులు, తిమ్మిరి, కండరాల బలహీనత, తలనొప్పి, తల తిరగడం, బ్యాలెన్స్ సమస్యలు తలెత్తుతున్నాయి. ⇒ ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో వాణిజ్య పంట లు పండించే రైతులు పురుగు మందులను మితిమీరి వా డారు. నిషేధిత రసాయనాలను కూడా వినియోగించారు. ⇒ అవగాహన ఉన్న రైతులు మాత్రం 36 శాతం తక్కువగా పురుగు మందులను వినియోగించినట్టు తేలింది. ఈ రైతులు మెరుగైన విత్తన రకాలు, సేంద్రియ పురుగు మందులు వాడుతున్నారని తేలింది. ⇒ పురుగు మందులకు గురికావడం వల్ల రైతుల్లో జీర్ణాశయ సమస్యల నుంచి నాడీ సంబంధిత లక్షణాలు, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వంటివి చుట్టుముడుతున్నాయి. పిల్లలు కూడా పురుగు మందులకు గురవుతున్నారు. ⇒ సేంద్రియ పురుగు మందులు వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. -
అన్నంలో పురుగు మందు కలుపుకొని తిని.. ఇద్దరు కుమార్తెలతో సహా..!
కారేపల్లి: కూలి పనులు చేస్తే వచ్చే డబ్బు అంతంతే కావడం.. దానికితోడు భర్త మద్యానికి బానిసయ్యాడని మనస్తాపం చెందిన ఓ మహిళ తన ఇద్దరు కుమార్తెలకు అన్నంలో పురుగు మందు కలిపి పెట్టి, తాను తిని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చిన్నకట్టుగూడెంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చిన్నకట్టుగూడెం గ్రామానికి చెందిన బానోతు శివ, ఉమ భార్యాభర్తలు. వీరికి ఐదో తరగతి చదివే భానుశ్రీ, నాలుగో తరగతి చదివే శ్రీవిద్య అనే కూతుళ్లు ఉన్నారు. కూలి చేసుకుని జీవించే వీరి కుటుంబంలో మద్యం చిచ్చుపెట్టింది. ఇటీవల శివ మద్యానికి బానిస కావడంతో ఉమ అతనిని వారిస్తోంది. అయితే, శివ శనివారం రాత్రి కూడా మద్యం తాగి రావడంతో ఉమ మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం శివ పనికి వెళ్లాక అన్నంలో పురుగు మందు కలిపి కూతుళ్లకు పెట్టాక ఆమె కూడా తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అనంతరం గోవింద్‌తండా గ్రామంలోని తన తండ్రికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. సమాచారం తెలుసుకున్న స్థానికులు వారిని కారేపల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, ఉమ, ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. ఇదీ చూడండి: మాకు న్యాయం చేయాలి -
ఖరీఫ్ సాగు లక్ష్యం ..93.91 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్–2022 కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కోసం సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను వైఎస్సార్ ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. పంటలు ప్రకృతి వైపరీత్యాల బారినపడకుండా ముందస్తు ఖరీఫ్‌కు వెళ్లేలా రైతులను సమాయత్తం చేయాలని అధికారులు నిర్ణయించారు. నిర్దేశించిన గడువులోగా సాగు నీటిని విడుదల చేయడం ద్వారా జూన్ మొదటి వారంలోనే నాట్లు పడేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖరీఫ్–2022లో 93.91 లక్షల ఎకరాల్లో పంటల్ని సాగు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ప్రధానంగా 40.34 లక్షల ఎకరాల్లో వరి, 18.40 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 14.82 లక్షల ఎకరాల్లో పత్తి, 6.62 లక్షల ఎకరాల్లో కందులు, 3.71 లక్షల ఎకరాల్లో చెరకు, 2.72 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతాయని అంచనా. ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ రానున్న సీజన్లో రూ.196.70 కోట్ల విలువైన 6.84 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించాలని అధికారులు నిర్ణయించారు. తొలిసారి వాణిజ్య పంటలైన పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాల (నాన్ సబ్సిడీ)ను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు సరఫరా చేయబోతున్నారు. వేరుశనగ విత్తన పంపిణీ మే మూడో వారం నుంచి, వరి విత్తనాలను జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేయనున్నారు. గిరిజన మండలాల్లో మాత్రం వేరుశనగ, వరి విత్తనాలను మే 3వ వారం నుంచే పంపిణీ చేస్తారు. మరోవైపు 19.02 లక్షల టన్నుల ఎరువులు కేటాయించారు. వీటిని ల్యాబ్‌లలో సర్టిఫై చేసిన తర్వాతే పంపిణీ చేయబోతున్నారు. కనీసం 1.50 లక్షల టన్నుల ఎరువులను ఆర్బీకేల వద్ద ముందస్తుగా నిల్వ చేస్తున్నారు. ఈసారి మొత్తం వినియోగంలో కనీసం 30 శాతం ఎరువులు, 10 శాతం పురుగుల మందులను ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీజన్లో రూ.92,687 కోట్ల మేర వ్యవసాయ రుణాలివ్వాలని నిర్దేశించారు. రైతు ముంగిటకే అన్నిసేవలు ఖరీఫ్‌లో ప్రతి రైతుకు వారి గ్రామాల్లోనే విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి వాటిని ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. సేంద్రియ సాగును ప్రోత్సహించేలా ఆర్బీకేల ద్వారా రైతులకు పెద్దఎత్తున అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పకడ్బందీ ఏర్పాట్లు పంటలు వైపరీత్యాల బారిన పడకుండా సాధ్యమైనంత త్వరగా సీజన్ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నాం. సీజన్‌కు ముందుగానే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నాం. 8,508 పొలం బడులు నిర్వహించడం ద్వారా ఉత్తమ యాజమాన్య పద్ధతులు పాటించే రైతులకు జీఏపీ సర్టిఫికేషన్ జారీకి శ్రీకారం చుడుతున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ (చదవండి: రూ.390 సిమెంట్ బస్తా రూ.235కే!) -
ఉన్నావ్ దారుణం: సంచలన విషయాలు వెల్లడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై దురాగతాలకు అంతు లేకుండా పోతుంది. తాజాగా కొద్ది రోజుల క్రితం ఉన్నావ్‌లో ముగ్గురు మైనర్, దళిత బాలికలపై విషప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఈ బాలిక కాన్పూర్ ఆస్ప్రతిలో చికిత్స పొందుతుది. ఈ దారుణానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రధాన నిందితుడు వినయ్ అలియాస్ లంబుని అదుపులోకి తీసుకున్నారు. తానే ముగ్గురు మైనర్ బాలికలకు విషం ఇచ్చినట్లు అంగీకరించాడు. ఈ సందర్భంగా పోలీసు అధికారి లక్ష్మి సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ దారుణం వెనక ప్రధాన కారణం ప్రేమను అంగీకరించకపోవడం. నిందితుడు వినయ్, ఈ ముగ్గురు బాలికలకు లాక్డౌన్ కాలంలో పరిచయం ఏర్పడింది. వీరంతా పశువుల మేపడం కోసం పొలానికి వచ్చేవారు. అందరూ కలిసి భోజనం చేసేవారు.. కబుర్లు చెప్పుకునే వారు. ఈ క్రమంలో వినయ్ ముగ్గురు బాలికల్లో ఒకరిని ప్రేమించాడు. అనేకసార్లు ఆమెకు ప్రపోజ్ చేశాడు. కానీ సదరు బాలిక అంగీకరంచలేదు. కోపం పెంచుకున్న వినయ్ ఎలాగైనా బాలికను అంతం చేయాలనుకున్నాడు’’ అని తెలిపారు. పథకం ప్రకారమే హత్య ‘‘ఈ క్రమంలో వినయ్ తన స్నేహితులతో కలిసి సదరు బాలికను చంపేందుకు ప్రణాళిక రచించాడు. దానిలో భాగంగా తన ఇంటిలో ఉన్న పురుగుల మందును తీసుకెళ్లి నీళ్ల బాటిల్ కలిపాడు. ఆ తర్వాత తినుబండారాలు, పురుగుల మందు కలిపిన వాటర్ బాటిల్ తీసుకుని బాధిత మైనర్ బాలికల దగ్గరకు వెళ్లాడు’’ అని తెలిపారు. ‘‘రోజులానే నిందితుడు వినయ్, మిగతా బాలికలు అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత వినయ్ తన దగ్గర ఉన్న పురుగుల మందు కలిపిన వాటర్ బాటిల్లోని నీటిని తను ప్రేమించిన అమ్మాయి చేత తాగించాలని భావించాడు. కానీ దురదృష్టం కొద్ది ముగ్గురు అమ్మాయిలు ఆ నీటిని తాగారు. కాసేపటికే బాధితులంతా స్పృహ తప్పి పడిపోయారు. ఊహించని ఈ ఘటనకు భయపడిని వినయ్, అతడి స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు అని తెలిపారు. పట్టించిన కాల్ డీటెయిల్ రికార్డు దారుణం గురించి తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. అక్కడ వారికి సిగరేట్ పీక, వాటర్ బాటిల్ కనిపించింది. ఆ తర్వాత మిగతా వారిని ప్రశ్నించగా.. వినయ్ పాత్ర బయటకు వచ్చింది. దాంతో పోలీసులు కాల్ డీటెయిల్ రికార్డ్(సీడీఆర్) టెక్నిక్ ద్వారా వినయ్ ఈ దారుణం జరిగినప్పుడు అక్కడే ఉన్నాడని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను చేసిన దారుణం గురించి వెల్లడించాడు. ఇక తమ పిల్లలను పొట్టన పెట్టుకున్న నిందితుడిని ఉరి తీయాల్సిందిగా బాధిత బాలికల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జరిగిన దారుణం పట్ల విపక్షాలు మండిపడుతున్నాయి. మహిళల భద్రత విషయంలో యూపీ ప్రభుత్వం దారుణంగా విఫలమయ్యింది అంటూ మండి పడుతున్నాయి. చదవండి: దారుణం: ఉలిక్కి పడిన ‘ఉన్నావ్’ వాళ్లను పెళ్లికి పిలవొద్దు.. పిలిచారనుకో.. -
‘సరిహద్దు’లో దగా..!: నిషేధిత పురుగు మందులు
సాక్షి, చిలుకూరు (కోదాడ): అమాయక రైతులను అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు దళారులు నిషేధిత పురుగు మందులను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆ మందుల వాడకంతో స్వల్పకాలంలో ప్రయోజనాలు కనిపిస్తుండగా దీర్ఘకాలంలో వాటితో ఎన్నో దుష్పరిణామాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పురుగుల మందులను గుంటూరు జిల్లా నుంచి దిగుమతి చేసుకుంటున్న దళారులు రాష్ట్ర సరిహద్దు (సూర్యాపేట , నల్లగొండ జిల్లాలు) మండలాల్లోని రైతులకు తక్కువ ధరకేనంటూ విక్రయిస్తూ దగా చేస్తున్నారు. అనుమతులు లేని విషతుల్యమైన రసాయన మందుల విక్రయాలు యథేచ్ఛగా జరుగతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. నీటి విడుదలతో.. నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు ఎగువనుంచి వరద వస్తుండడంతో ఎడమకాల్వకు సకాలంలో నీటిని విడుదల చేశారు. దీంతో ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలోని దామరచర్ల, గరిడేపల్లి, నేరేడుచర్ల, హుజూర్నగర్, మఠంపల్లి, చిలుకూరు, కోదాడ తదితర మండలాల్లో ప్రస్తుత వానాకాలం సీజన్లో వరి పంటను ఎక్కువగా సాగు చేశారు. నెల రోజులు దాటిన వరిపొలాలకు ప్రస్తుతం దోమపోటు, తెగుళ్లు ఆశించాయి. అయితే ధర తక్కువగా ఉండడంతో రైతులు తమ పొలాలను కాపాడుకునేందుకు గుంటూరు జిల్లా మందుల వాడకంపై మొగ్గు చూపుతున్నారు. ధర తక్కువంటూ.. ఈ ప్రాంతంలో లభించే రసాయనిక మందులు దాదాపుగా మల్టీనేషన్ కంపెనీలకు చెంది ప్రభుత్వ ఆమోద ముద్రతో విక్రయిస్తున్నారు. మార్కెట్లో వీటి ధర కూడా ఎక్కువే. ఇదే అదునుగా చేసుకున్న దళారులు ఆంధ్రా ప్రాంతంలో నిషేధించిన గుంటూరు మందులు తక్కువ ధరేనంటూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ మందులు గుంటూరు జిల్లా కేంద్రం సత్తెనపల్లి రోడ్డులోని ఓ మిర్చి యార్డు దగ్గరలోని గోదాము నుంచి సరఫరా అవుతున్నాయని తెలిసింది. కాగా, ఈ మందులు ( లాకర్, బీపీహెచ్ పురుగు, దోమలకు , మూవ్ తెగుళ్లకు సంబంధించినవి) పిచికారీ చేసిన వెంటనే పురుగులు చనిపోతుండడం, ధర తక్కువ (ఎకరానికి 100 గ్రాముల ప్యాకెట్ రూ.1000)కు లభిస్తుండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఇదే ప్రాంతంలో లభించే మందులకు రెట్టింపు ధర ఉండడంతో రైతులు వాటిని కొనుగోలు చేయడం లేదు. ఫలితంగా ఇటు రాష్ట్ర ఆదాయానికి కూడా గండిపడుతోంది. గ్రామానికి ఇద్దరు చొప్పున ఏజెంట్లు రాష్ట్ర సరిహద్దు మండలాల్లోని ప్రతి గ్రామంలో ఇద్దరు చొప్పున ఏజెంట్లు ఆయా కంపెనీల నిర్వాహకులు నియమించుకుని మందుల విక్రయాలు జరుపుతున్నారని తెలిసింది. అయితే ఈ ఏజెంట్లు రైతుల వద్ద ముందస్తుగానే డబ్బులు తీసుకుని రాత్రి వేళల్లో ఆర్డర్ మీద సరఫరా చేస్తున్నారని సమాచారం. ఏజెంట్లకు కమీషన్ ఎక్కువగా వస్తుండడంతో స్థానిక రైతులకు మాయమాటలు చెప్పి అంటగడుతున్నారని ప్రచారం జరుగుతోంది. నష్టాలు ఎక్కువే... గుంటూరు మందులు పిచికారీ చేసిన వెంటనే పురుగులు చనిపోతున్నాయి. కానీ దీర్షకాలికంగా ఎన్నో నష్టాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నిషేధిత మందులలో సైనైడ్ కలుపుతారని, వీటిని పిచికారీ చేస్తే కొద్ది రోజులకు చేలు ఎర్రబారతాయని, తదనంతరం సారవంతమైన భూములు చౌడు భూములుగా మారుతాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ మందులతో నీరు విషతుల్యంగా మారడంతో మానవాళికి కూడా ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. మా దృష్టికి కూడా వచ్చింది గుంటూరు జిల్లా మందుల వ్యవహారం మా దృష్టికి కూడా వచ్చింది. అ మందులు పిచికారీ చేయకూడదని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కొంత మంది రైతులు దళారుల ద్వారా రహస్యంగా తెచ్చుకుంటున్నారు. ఈ మందులపై నిఘా ఏర్పాటు చేశాం. ఈ మందుల తయారీలో సైనైడ్ కలుపుతారు. ఎంతో ప్రమాదకరం. ఎవరైనా ఆ మందులు విక్రయిస్తే మాకు సమాచారం ఇవ్వాలి. –జ్యోతిర్మయి, జిల్లా వ్యవసాయాధికారిణి -
‘ప్రాణాంతక మందుల’ పై ఉదాసీనత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో రైతుల ప్రాణాలను హరిస్తున్న 18 రకాల క్రిమిసంహారక మందులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెల్సిందే. అయితే అందులో గతేడాది మధ్య భారత్‌లో పదుల సంఖ్యలో పత్తి రైతులను బలితీసుకున్న మోనోక్రోటోపాస్, మాంకోజెబ్ క్రిమి సంహారక మందులు లేకపోవడం ఆశ్చర్యకరం. దోమల సంహారానికి మున్సిపల్ సిబ్బంది, తెగుళ్ల నివారణకు రైతులు కొట్టే డీడీటీని కూడా నిషేధించక పోవడం గమనార్హం. మానవులు, జంతువుల ప్రాణాలకు హానికరమైన ఈ మూడు మందులను కూడా నిషేధించాలని వ్యవసాయ శాస్త్రవేత్త అనుపమ వర్మ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మొత్తం 18 క్రిమిసంహారక మందుల్లో 11 మందుల రిజిస్ట్రేషన్, ఉత్పత్తి, అమ్మకం, దిగుమతి, ఉపయోగాన్ని తక్షణమే నిషేధించగా, ఆరు క్రిమిసంహారక మందులను 2020, డిసెంబర్ నాటికి విడతల వారిగా నిషేధించాలని నిర్ణయించింది. హెర్బిసైడ్ ట్రిఫులారిన్ను కూడా కేంద్రం తక్షణమే నిషేధించినప్పటికీ ఒక్క గోధుమ పంటకు మాత్రం అనుమతించాలని నిర్ణయించింది. వాస్తవానికి దీన్ని కూడా సంపూర్ణంగా నిషేధించాలని వర్మ కమిటీ సిఫార్సు చేసింది. వాస్తవానికి ఈ క్రిమిసంహారక మందులను కేంద్రం ఎప్పుడో నిషేధించి ఉండాల్సిందీ, తాత్సారం చేస్తూ వచ్చింది. దేశంలో రైతులు ప్రాణాంతకమైన క్రిమిసంహారక మందులను ఉపయోగిస్తున్నారంటూ సామాజిక కార్యకర్తలు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రాణాంతకమైన 66 మందుల ప్రభావాన్ని సమీక్షించి తగిన సిఫార్సులను చేయాల్సిందిగా కోరుతూ 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం వర్మ కమిటీని నియమించింది. ఆ కమిటీ 66 మందుల్లో 19 మందులను సంపూర్ణంగా నిషేధించాలని సిఫార్సు చేస్తూ 2015, డిసెంబర్ నెలలోనే నివేదికను మోదీ ప్రభుత్వానికి అందజేసింది. దాదాపు 20 నెలల అనంతరం ఆగస్టు 8వ తేదీన చర్యలు తీసుకుంది. ప్రపంచంలోని పలు దేశాల్లో నిషేధించిన క్రిమిసంహారక మందుల్లో 104 మందులను మన దేశంలో వాడుతున్నారని ఆరోగ్య కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వాటిల్లో 66 రకాల మందులను మాత్రమే వర్మ కమిటీ సమీక్షించిందని వారు చెప్పారు. అలాగే ప్రపంచంలో పలు దేశాలు నిషేధించిన ‘గ్లైఫోసేట్’ను వర్మ కమిటీ సమీక్షించినా దాన్ని నిషేధించాల్సిందిగా ఎలాంటి సిఫార్సు చేశారు. ప్రాణాంతక మందులను నిషేధించే అధికారం ఒక్క కేంద్రానికి మాత్రమే ఉంది. రాష్ట్రానికి వాటిపై 90 రోజులపాటు తాత్కాలికంగా నిషేధం విధించే అధికారం మాత్రం ఉంది. కాకపోతే వాటి ఉత్పత్తి యూనిట్లకు లైసెన్స్‌లు నిరాకరించే అధికారం ఉంది. -
20 మంది రైతుల మృతి
ముంబై: పంట చేలకు పురుగు మందులు కొడుతుండగా వెలువడ్డ విష వాయువుల్ని పీల్చడంతో మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో 20 మంది రైతులు, రైతు కూలీలు మృత్యువాత పడ్డారు. గత రెండు నెలల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ మరణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పురుగు మందుల ప్రభావంతో 700 మంది ఆస్పత్రి పాలయ్యారని, 25 మంది కంటి చూపు కోల్పోయారని జిల్లాకు చెందిన రైతు నాయకుడు దేవేంద్ర పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. మోతాదుకు మించి పురుగుమందుల వాడకంతోనే ఈ మరణాలు సంభవించాయన్న విమర్శల నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శితో క్షేత్ర స్థాయిలో విచారణ చేయించామని, మెరుగైన వైద్యం అందని బాధిత రైతుల్ని నాగ్‌పూర్‌కు తరలించామని మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పాండురంగ ఫండ్కర్ చెప్పారు. -
పురుగుల మందులు చల్లుతున్నారా?
జాగ్రత్తలు తప్పనిసరి.. నిర్లక్ష్యం కూడదు రక్షణ చర్యలు చేపట్టాలి.. లేదంటే అనర్థాలు తప్పవు గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ సలహా సూచనలు గజ్వేల్: వివిధ రకాల పంటలకు చీడపీడల నివారణకు పురుగు మందులను వాడకం ప్రస్తుతం తప్పనిసరి అయ్యింది. ఈ క్రమంలో కనీస జాగ్రత్తలు పాటించక రైతులు అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. జాగ్రత్తలతో ఇలాంటి పరిస్థితి రాకుండా చేసుకోవచ్చు. పురుగు మందుల వాడకంలో తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ (సెల్: 7288894469) వివరించారు. కొనుగోలు స్థిర పరిమాణంలో ఒకసారి చల్లడానికి కావాల్సిన పరిమాణం మేరకే కొనుగోలు చేయాలి. ఉదాహరణకు 100, 250, 100 మిల్లీలీటర్ల చొప్పున పురుగు మందులు కొనాలి. చినిగిన లేదా కుట్టులేని సంచులను గానీ, కారుతున్న లేదా విడి/వదులు పాత్రల్లోగానీ కొనకూడదు. సరైన అధీకృత లేబిల్స్ లేనివి కొనుగోలు చేయవద్దు. వాడకం గృహ పరిసరాల్లో పురుగు మందులను నిల్వ చేయవద్దు. సీలు భద్రంగా ఉన్న సహజ పాత్రల్లోనే దాచిపెట్టాలి. ఇతర పాత్రల్లోకి మార్చవద్దు. ఆహారం, మేత, దాణాలతో కలిపి నిల్వ చేయరాదు. పశువులకు, పిల్లలకు అందకుండా నిల్వచేయాలి. సూర్యరశ్మికి, వాన నీటికి బహిర్గతం కాకుండా దాచాలి. పురుగు మందులను, కలుపు నివారణ మందులతో కలిపి నిల్వ చేయవద్దు. ఆహార పదార్థాలతో పాటు వెంట తీసుకెళ్లటం గానీ, రవాణా చేయటం గానీ ఎప్పుడూ చేయకూడదు. వీపు, భుజాలు, తలమీద, పొడులు/గుళికల బస్తాలను మోయవద్దు. స్ప్రే దావక తయారీ పరిశుభ్రమైన నీటినే వాడాలి. చేతులు, చెవులు, నోరు, కళ్లు, ముక్కులకు రక్షణ ఏర్పాటు చేసుకోవాలి తలకు టోపీ, తువ్వాలు, ముఖానికి ముసుగు, చేతులకు తొడుగు వేసుకోవాలి. పురుగు మందులతో వచ్చిన పాలిథిన్ కవర్లను ఇందుకోసం వాడరాదు. చేతి రుమాలును, తువ్వాలును, శభ్రమైన గుడ్డను, పాలిథిన్ సంచులను టోపీ, ముసుగు, తొడుగుగా వాడవచ్చు. స్ప్రే ద్రావకం తయారు చేసేముందు పురుగు మందు డబ్బాలకు గల లేబిల్‌ను చదవాలి. అవసరానికి అనుగుణంగా స్ప్రే ద్రావకాన్ని తయారు చేసుకోవాలి. గుళికలను నీటిలో కలపరాదు. పాత్రలను తెరిచేటప్పుడు ముందు చేతుల మీద పడకుండా చూసుకోవాలి. మందును ముక్కుతో వాసన చూడకూడదు. స్ప్రేయర్ ట్యాంక్‌లో ద్రావకం పోసేటప్పుడు ఒలికిపోకుండా చూడాలి. ద్రావకం తయారుచేసేటప్పుడు పొగ తాగటం, నీరు తాగటం, తినటం వంటివి చేయకూడదు. ద్రావకం కలిపే మనిషి కాళ్లకు, చేతులకు పాలిథిన్ సంచులను రక్షణ కవచాలుగా ధరించాలి. మందుచల్లే పరికరం సరైన పరికరాన్ని ఎంచుకోవాలి. లోపం గల పరికరాన్ని, కారుతున్న పరికరాన్ని వాడకూడదు. సరైన నాజిల్‌ను ఎంచుకోవాలి మూసుకుపోయిన నాజిల్‌ను నోటితో ఊది శుభ్రం చేయకూడదు. పరికరానికి వేలాడగట్టిన పాత టూత్‌బ్రష్‌ను ఉపయోగించి నీటితో శుభ్రం చేయాలి. పురుగు మందులకు, కలుపు నివారణ మందులకు ఒకే స్ప్రేయర్‌ను ఉపయోగించవద్దు. పురుగు మందులను చల్లకం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సిఫార్సు మేరకు మాత్రమే మందు మోతాదులను కలపాలి. గాలి ఎక్కువగా వీచినపుడుగానీ, ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నపుడు గానీ చల్లకూడదు. వర్షాలకు ముందు, వర్షం కురిసి వెలిసిన తర్వాత చల్లకూడదు. గాలి వీచే దిక్కుకు వ్యతిరేకంగా చల్లకూడదు. బ్యాటరీతో నడిచే అల్ట్రాలోవాల్యుమ్ను స్ప్రేయర్‌ను ద్రవ రూప మందులను చల్లడానికి ఉపయోగించకూడదు. స్ప్రేయింగ్ చేసిన తర్వాత వాడిన స్ప్రేయర్, బకెట్ మొదలగు వాటిని సబ్బుతో కడగాలి. ఖాళీ మందు టిన్ను/బుడ్లను, మందు కలిపిన బకెట్ మొదలగు వాటిని గృహావసరాలకు వాడకూడదు. స్ప్రేయింగ్ చేసిన తర్వాత ఆ పొలంలోకి పనివాళ్లను, పశువులు వెళ్లకుండా చూడాలి. కాలుష్య నివారణ స్ప్రే చేయగా మిగిలిన ద్రావకాన్ని కాల్వలు/బోదెలు/చెరువులు/కుంటల్లో పారబోయరాదు. వాడేసిన ఖాళీ డబ్బాలు, పాత్రలను రాయి, కర్రతో చితగొట్టి నీటి వనరుకు దూరంగా భూమిలో లోతుగా పాతిపెట్టాలి. ఖాళీ అయిన బుడ్లు, డబ్బాలను ఏ అవసరానికైనా సరే తిరిగి వాడకూడదు. మరిన్ని సూచనలు చల్లాల్సిన మందు మోతాదు, సమయాల గురించి మందును పొలంలో చల్లడానికి ముందే సస్యరక్షణ రంగంలో అనుభవమున్న నిపుణులను సంప్రదించాలి. పురుగు మందులను అపమార్గంలో వినియోగించవద్దు. పురుగు మందులను వివేకంతో ఎంచుకోవాలి అవసరానికి అనుగుణంగా మాత్రమే పురుగు మందులను విచక్షణతో ఎంచుకోవాలి. పురుగు మందులను చల్లిన తర్వాత పచ్చి ఆకులను ఆహారంగా వాడకూడదు. -
చనిపోదామని చెప్పి..
బేల(ఆదిలాబాద్): 'మన మధ్య అనుమానాలు ఎందుకు.. అనుమానాలు ఉన్న చోట బతకకూడదు. ఇద్దరం కలిసే పురుగుల మందు తాగి చనిపోదాం' అని ప్రియురాలిని నమ్మించిన యువకుడు, ముందుగా.. ఆమెకు పురుగుల మందు తాగించి, తాను తాగకుండా పారిపోయిన ఉదంతమిది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్పూర్ గ్రామానికి చెందిన బాలిక (17), వరూర్(కె) గ్రామానికి చెందిన మడావి సంతోష్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ బాలికను సంతోష్ అనుమానంతో వేధించాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేసి సదల్‌పూర్‌కు వచ్చానని, ప్రభుత్వ పాఠశాల వెనకకు రావాలని చెప్పాడు. అక్కడకు వచ్చిన బాలికతో అనుమానం ఎందుకని.. ఇద్దరం పురుగుల మందు తాగి చనిపోదామని అన్నాడు. ఈ క్రమంలో ముందుగా ఆ బాలికకు విషం తాగించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయూడు. స్పృహతప్పిపడిపోయిన బాలికను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. -
విత్తనాల కొరత లేదు
ఎరువులు అందుబాటులో ఉన్నాయి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఖరీఫ్ రైతులు ఆందోళన చెందవద్దు శాస్త్రీయంగా భూసార పరీక్ష పత్రాలు సేంద్రియ ఎరువుల వాడకంపై అన్నదాతలకు అవగాహన ఈ నెలాఖరులోగా రెండో విడత రుణమాఫీ అందుతుంది 'సాక్షి'తో వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ డి. నర్సింహా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మృగశిర, ఆరుద్ర కార్తెల ప్రభావం మొదలైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వానల జోరు పెరిగింది. ఈ నేపథ్యంలో రైతులు సాగుకు సన్నద్ధమయ్యూరు. ఖరీఫ్ పనులు వేగం పుంజుకున్నాయి. ఎరువులు, విత్తనాల సరఫరాపైనే అనుమానాలు. వ్యవసాయ పనిముట్లు, రుణమాఫీ, యంత్రలక్ష్మి పథకాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. భూసార పరీక్ష లు మొదలు పంటల సాగు వరకు అనేక అంశాలు ప్రాధాన్యంగా మారాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు ఎం.నర్సిం హాసింహా 'సాక్షి'ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. అనుమానాలను నివృత్తి చేయడంతోపాటు, రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. వివరాలు ఆ యన మాటలలోనే... విత్తనాలు, ఎరువుల కొరత లేదు... ఈ విషయంలో అపోహలు వద్దు ఖరీఫ్‌కు రైతులు విత్తనాలు, ఎరువుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీజన్‌కు సరి పడే విధంగా ఎరువులు, విత్తనాలు సరఫరా చేసేం దుకు వీలుగా అన్ని చర్యలు తీసుకున్నాం. 1,04,550 క్వింటాళ్ల జీలుగ, సోయాచిక్కుడు, మొక్కజొన్న తది తర విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేస్తున్నా ము. 75,000 పత్తి ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. ఈ సీజన్ కోసం 234303 మెట్రిక్ టన్నుల యూ రియా, డీఏపీ, కాంప్లెక్స్ తదితర రకాల ఎరువులను సరఫరా చేయనున్నాం. 1,02, 809 మె.టన్నుల ఎరువులు మార్క్‌ఫెడ్ ద్వారా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(ప్యాక్స్)లకు సరఫరా చేశాం. విత్తనాలు, ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించే వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. ఖరీఫ్ సాగు అంచనా 4.18 లక్షల హెక్టార్లు 2013, 2014 ఖరీఫ్ సీజన్ల సాగును దృష్టిలో పెట్టుకుని ఈసారి ఖరీఫ్ సాగును అంచనా వేశాము. 4,18,100 హెక్టార్లలో వివిధ పంటలు వేస్తారనుకున్నాం. అత్యధికంగా సోయా, వరి పంటలు మూడు లక్షల హెక్టార్ల వరకు ఉండవచ్చు. ఈసారి అటవీశాఖ ఆక్రమిత భూముల విషయంలో సీరియస్‌గా వ్యవహరిస్తున్నందున సుమారు 20 వేల హెక్టార్లలో సాగు తగ్గే అవకాశం ఉంది. 3.98 లక్షల హెక్టార్లు అనుకు న్నా ఇప్పటి వరకు పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సోమవారం నాటికి జిల్లా వ్యాప్తంగా 1,14, 860 హెక్టార్లలో వివిధ పంటలు వేశారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు 21 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైనా, మిగతా జిల్లాలతో పోలిస్తే తక్కువే. ఆన్లైన్ ద్వారానే ఇక ‘యంత్రలక్ష్మి’ దరఖాస్తులు యంత్రలక్ష్మి పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆన్లైన్ ద్వారా అర్హులైన రైతుల దరఖాస్తులు స్వీకరించనుంది. మ ండల వ్యవసాయాధికారి కార్యాలయంలో పూర్తి వివరాలు పొందవచ్చు. ఈ ఏడాది జిల్లాకు యంత్రలక్ష్మి కింద రూ.18.74 కోట్లు కేటాయించారు. 25 హెచ్‌పీ ట్రాక్టర్లు,రొ టవేటర్లు, మినీ ట్రాక్టర్లు, ట్రాలీలు, టార్పాలిన్లు, వ్యవసాయ సస్యరక్షణ పరికరాలు తదితర యంత్రాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకనుంచి వీటిని దరఖాస్తు చేసు కున్న వారం రోజులలోనే అందిస్తాం. మూడేళ్లలో భూములకు భూసార పరీక్ష పత్రాలు శాస్త్రీయ పద్ధతిలో భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు పత్రాలు అందజేసే ప్రక్రియను ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టింది.మోతాదును మించి రసాయన ఎరువులు వాడటంతో చాలా చోట్ల భూసారం దెబ్బతిన్నది. ఇందుకోసం జిల్లాలోని భూములన్నింటినీ మూడు విడతలుగా మూడేళ్లలో పరీక్షలు నిర్వహించి శాస్త్రీయంగా వ్యవహరించే వీలు కల్పించనున్నాం. వర్షాధార పంటలు వేసే భూములైతే 10 హెక్టార్లు ఒక గ్రిడ్‌గా, బాబులు, ప్రాజెక్టుల కింద సాగయ్యే భూములైతే రెండున్నర హెక్టార్లు ఒక గ్రిడ్ పరిగణించి భూమి ఆరోగ్య పథకం కింద పరీక్షలు నిర్వహించి కార్డులు అందజేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 'పరం పరాగత్' స్కీం ద్వారా గతంలో రసాయన ఎరువులు వాడిన భూములను 25 ఎకరాలను ఒక క్లస్టర్‌గా తీసుకొని సేంద్రియ ఎరువులపై రైతులందరికీ అవగాహన కల్పించనున్నాం. పకడ్బందీగా విత్తన గ్రామ పథకం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విత్తన గ్రామ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం. బోధన్, భిక్కనూర్, బిచ్కుంద మండలాలో మినుముల విత్తనాల కోసం ఆరు క్వింటాళ్లు సరఫరా చేశాము. 12 మండలాలలో 900 క్వింటాళ్ల వరి విత్తనాలు రైతులకు సరఫరా చేయగా, నారుమళ్లు కూడ సిద్ధం చేశారు. సోయా సీడ్ కోసం 3000 క్వింటాళ్లు లక్ష్యం కాగా, 2600 క్వింటాళ్లు సరఫరా చేశాము. వచ్చే ఏడాదిలో రైతులు ప్రరుువేటు కంపెనీలపై ఆధారపడే పరిస్థితి ఉండదు.రెండో విడత రుణమాఫీకి నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఈ నెలాఖ రులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీంతో మరో రూ.393.40 కోట్ల రుణా లు రైతులకు మాఫీ కానున్నాయి.