![20 farmers die of pesticide poisoning in Maharashtra - Sakshi](/styles/webp/s3/article_images/2017/10/9/former.jpg.webp?itok=kGAi2ksS)
ముంబై: పంట చేలకు పురుగు మందులు కొడుతుండగా వెలువడ్డ విష వాయువుల్ని పీల్చడంతో మహారాష్ట్రలోని యావత్‌మాల్ జిల్లాలో 20 మంది రైతులు, రైతు కూలీలు మృత్యువాత పడ్డారు. గత రెండు నెలల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ మరణాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. పురుగు మందుల ప్రభావంతో 700 మంది ఆస్పత్రి పాలయ్యారని, 25 మంది కంటి చూపు కోల్పోయారని జిల్లాకు చెందిన రైతు నాయకుడు దేవేంద్ర పవార్ ఆవేదన వ్యక్తం చేశారు.
మోతాదుకు మించి పురుగుమందుల వాడకంతోనే ఈ మరణాలు సంభవించాయన్న విమర్శల నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శితో క్షేత్ర స్థాయిలో విచారణ చేయించామని, మెరుగైన వైద్యం అందని బాధిత రైతుల్ని నాగ్‌పూర్‌కు తరలించామని మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పాండురంగ ఫండ్కర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment