బేల(ఆదిలాబాద్): 'మన మధ్య అనుమానాలు ఎందుకు.. అనుమానాలు ఉన్న చోట బతకకూడదు. ఇద్దరం కలిసే పురుగుల మందు తాగి చనిపోదాం' అని ప్రియురాలిని నమ్మించిన యువకుడు, ముందుగా.. ఆమెకు పురుగుల మందు తాగించి, తాను తాగకుండా పారిపోయిన ఉదంతమిది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సదల్‌పూర్ గ్రామానికి చెందిన బాలిక (17), వరూర్(కె) గ్రామానికి చెందిన మడావి సంతోష్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఇటీవల ఆ బాలికను సంతోష్ అనుమానంతో వేధించాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఫోన్ చేసి సదల్‌పూర్‌కు వచ్చానని, ప్రభుత్వ పాఠశాల వెనకకు రావాలని చెప్పాడు. అక్కడకు వచ్చిన బాలికతో అనుమానం ఎందుకని.. ఇద్దరం పురుగుల మందు తాగి చనిపోదామని అన్నాడు. ఈ క్రమంలో ముందుగా ఆ బాలికకు విషం తాగించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయూడు. స్పృహతప్పిపడిపోయిన బాలికను స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
చనిపోదామని చెప్పి..
Published Tue, Dec 1 2015 10:08 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement