ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్(జగద్గిరిగుట్ట): 15 ఏళ్ల వయసులోనే ప్రేమలో మునిగిన ఓ బాలిక.. ప్రేమికుడికి వాట్సాప్‌లో వేరే యువతి పంపిన మెసేజ్ చూసి మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం... శ్రీనివాస నగర్‌లో నివాసం ఉండే సూర్య ప్రభకు భర్త లేడు. కూతురితో కలిసి ఉంటుంది. సోమయ్య నగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక స్థానికంగా ఉండే సాయితేజతో ప్రేమలో పడింది.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం జగద్గిరిగుట్టలో వీరిద్దరు కలుసుకున్నారు. అదే సమయంలో సాయితేజకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్ ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. నాతో ఉంటూ వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నావు అంటూ అలిగి ఇంటికి వెళ్లి బాలిక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సాయంత్రం వచ్చి చూసేసరికి అప్పటికే మృతి చెంది ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి వెళ్లిన సీఐ సైదులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
చదవండి: ప్రీతి కేసు ఎటువైపు? ఇంకెన్ని రోజులు? టాక్సికాలజీ రిపోర్టులో నెగెటివ్ వల్లే..
Comments
Please login to add a commentAdd a comment