
సాక్షి, బంజారాహిల్స్: అసలే పదహారేళ్ల అమ్మాయి... ఇంకా మైనార్టీ తీరలేదు... ఇంకో రెండేళ్లు ఆగితే దగ్గరుండి మేమే పెళ్లి చేస్తాం.. అంత వరకు ఓపిక పట్టు.. మా అమ్మాయిని వేధించకు.. నీ కాళ్లు పట్టుకుంటాం.. మా జోలికి రావొద్దంటూ తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కాళ్లావేళ్లా పడ్డా వినిపించుకోలేదు ఆ మూర్ఖుడు. చుట్టుపక్కల వాళ్లు చూస్తున్నా... తండ్రి కాళ్లు పట్టుకుంటున్నా కనికరించలేదు. ఇప్పటికిప్పుడు పెళ్లి చేయకపోతే మీ అంతు చూస్తానంటూ కుటుంబ సభ్యులతో పాటు మైనార్టీ తీరని ఆ బాలికను బెదిరించి వెళ్లిపోయిన ఘటనలో తన తండ్రిని చంపుతాడేమోనని భయపడి ఆత్మహత్య చేసుకుంది తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి గ్రామానికి చెందిన శ్యాంసన్ రెండో కూతురు కండ్రకోట దుర్గాభవానీ(16).
ఈ ఘటనలో నిందితుడైన అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కళ్యాణ్(30)పై బంజారాహిల్స్ పోలీసులు ఐపీసీ 306, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ప్రేమలో పడి వెంటపడి వేధిస్తుండటంతో భయపడ్డ దుర్గాభవానీ కళ్యాణ్‌తో పాటు హైదరాబాద్‌కు చేరుకుంది. ఇక్కడికి వచ్చాక కూడా కళ్యాణ్ వేధింపులు ఆగలేదు. ఎప్పటికైనా కళ్యాణ్‌తో ముప్పేనని భావించి ఆత్మహత్యకు ఒడిగట్టింది.
చదవండి: అకౌంట్స్ డీ–ఫ్రీజ్ కేసు: ఎట్టకేలకు అనిల్ చిక్కాడు!
Comments
Please login to add a commentAdd a comment