న్యూఢిల్లీ: తప్పుదారి పట్టిస్తున్న నకిలీ(ఫేక్) సోషల్ మీడియా సంస్థలకు దూరంగా ఉండాలంటూ స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం బీఎస్‌ఈ ఇన్వెస్టర్లను తాజాగా హెచ్చరించింది. లింక్‌డ్‌ఇన్, ట్విటర్, యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అనధికార, నకిలీ సంస్థలు బీఎస్‌ఈ అధికారిక గుర్తింపులను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బీఎస్‌ఈతో సహచర్యం కలిగి ఉన్నట్లు తప్పుగా పేర్కొంటున్నాయని తెలియజేసింది. వెరసి ఇలాంటి సంస్థలు లేదా వ్యక్తులపట్ల అప్రమత్తతో వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది.
"తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా హ్యాండిల్స్/ ఎంటిటీల బారిన పడకుండా ఇన్వెస్టర్లను బీఎస్‌ఈ అప్రమత్తం చేస్తోంది. బీఎస్‌ఈకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు క్లెయిమ్ చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రామాణికతను నిర్ధారించుకోవాల్సిందిగా సూచిస్తోంది" బీఎస్‌ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎస్‌ఈ అధికారికంగా ధ్రవీకరించబడిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను విశ్వసించాలని ఇన్వెస్టర్లను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment