ముంబై: ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్ గడువు ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మూడో త్రైమాసికం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి గణాంకాలు గురువారం(ఫ్రిబవరి 29న) విడుదల కానున్నాయి. ప్రాథమిక మార్కెట్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు.
‘‘చివరి ట్రేడింగ్ సెషన్‌లో నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,297)ని నమోదు చేసిన తర్వాత తీవ్ర ఊగిసలాటకు లోనైంది. కొనుగోళ్ల కొనసాగితే 22,300 – 22,500 స్థాయిని పరిక్షీణింవచ్చు. లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 22,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఇన్వెస్టర్లు పతనమైన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేయడం ఉత్తమం’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు.
ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు స్థిరంగా కొనసాగడంతో గతవారం సూచీలు దాదాపు ఒకశాతం పెరిగాయి. సెన్సెక్స్ 716 పాయింట్లు, నిఫ్టీ 172 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇంధన షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
స్థూల ఆర్థిక గణాంకాలు
అమెరికా జనవరి గృహ విక్రయాలు, జపాన్ జనవరి ద్రవ్యోల్బణ డేటా ఫిబ్రవరి 27న, అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలు బుధవారం (28న) విడుదల కానున్నాయి. యూరోజోన్ ఫిబ్రవరి పారిశ్రామిక, సర్వీసెస్, కన్జూమన్ కాన్ఫిడెన్స్ డేటా బుధవారం వెల్లడి అవుతాయి. జపాన్ రిటైల్ అమ్మకాలు, నిర్మాణ ఆర్డర్లు, భారత క్యూ3 జీడీపీ వృద్ధి డేటా, అమెరికా నిరుద్యోగ, పీసీఈ ప్రైస్ ఇండెక్స్ గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం చైనా కాగ్జిన్ మానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, జపాన్ నిరుద్యోగ రేటు, యూరోజోన్ హెచ్‌సీఓబీ కాగ్జిన్ మానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, భారత్ ఆటో అమ్మకాలు, పారెక్స్ నిల్వల డేటా వెల్లడి కానున్నాయి.
బుధవారం ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ,
జీడీపీ వృద్ధి డేటా
ఈ గురువారం(ఫిబ్రవరి 29న) నిఫ్టీ సూచీకి చెందిన జనవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేరోజున ప్రస్తుత ఆర్థి క సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి డేటా విడుదల కానుంది. ప్రభుత్వ వ్యయంలో మందగమనం కారణంగా క్యూ2 జీడీపీ వృద్ధి (7.60%)తో తక్కువగా నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే వార్షిక ప్రాతిపదన గ త ఆర్థిక సంవత్సరం క్యూ3 జీడీపీ వృద్ధి(4.5%)తో పోలిస్తే అధికంగా ఉండొంచ్చంటున్నారు.
డెట్ మార్కెట్లోకి రూ.18,500 కోట్లు
భారత డెట్(రుణ) మార్కెట్‌లో ఫిబ్రవరి 2న నాటికి విదేశీ ఇన్వెస్టర్లు రూ.18,500 కోట్లకు పైగా పట్టుబడులు పెట్టారు. త్వరలో భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్‌లో చేర్చనున్న వార్తలు ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు తెలిపారు. జనవరిలో భారత డెట్ మార్కెట్లోకి రూ.19,836 కోట్ల పెట్టుబడులు రాగా, ఇది ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ నెలవారీ ఇన్‌ఫ్లోగా నిలిచింది. గతంలో 2017 జూన్‌లో ఇన్‌ఫ్లో రూ. 25,685 కోట్లుగా నమోదైంది. సమీక్ష కాలంలో (ఫిబ్రవరి 1– 23 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.424 కోట్లను వెనక్కి తీసుకున్నారు. జనవరిలో రూ.25,743 కోట్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి.
3 ఐపీఓలు, 2 లిస్టింగులు
ప్రాథమిక మార్కెట్ నుంచి ఆరు కంపెనీలు ఈ వారంలో రూ.3,330 కోట్ల సమీకరణకు సిద్ధమయ్యాయి. ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికం టెలీ–సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూలు ఫిబ్రవరి 27న మొదలై 29న ముగియనున్నాయి. భారత్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఐపీఓ ఫిబ్రవరి 28– మార్చి 1 తేదీల మధ్య జరగనుంది. గతవారం ప్రారంభమైన జీపీటీ హెల్త్‌కేర్ ఐపీఓ ఫిబ్రవరి 26న(సోమవారం) ప్రారంభం కానుంది. ఇదేవారంలో ఫిబ్రవరి 28న జునియర్ హోటల్స్, మరుసటి రోజున జీపీటీ హెల్త్‌కేర్ షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment