Fake Social Media Post
-
ఇన్వెస్టర్లకు అలర్ట్.. బీఎస్ఈ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టిస్తున్న నకిలీ(ఫేక్) సోషల్ మీడియా సంస్థలకు దూరంగా ఉండాలంటూ స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం బీఎస్ఈ ఇన్వెస్టర్లను తాజాగా హెచ్చరించింది. లింక్డ్ఇన్, ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ తదితర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అనధికార, నకిలీ సంస్థలు బీఎస్ఈ అధికారిక గుర్తింపులను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బీఎస్ఈతో సహచర్యం కలిగి ఉన్నట్లు తప్పుగా పేర్కొంటున్నాయని తెలియజేసింది. వెరసి ఇలాంటి సంస్థలు లేదా వ్యక్తులపట్ల అప్రమత్తతో వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది. "తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా హ్యాండిల్స్/ ఎంటిటీల బారిన పడకుండా ఇన్వెస్టర్లను బీఎస్ఈ అప్రమత్తం చేస్తోంది. బీఎస్ఈకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు క్లెయిమ్ చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రామాణికతను నిర్ధారించుకోవాల్సిందిగా సూచిస్తోంది" బీఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎస్ఈ అధికారికంగా ధ్రవీకరించబడిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను విశ్వసించాలని ఇన్వెస్టర్లను కోరింది. -
ప్రాణం తీసిన.. సోషల్ మీడియా పోస్ట్
డెట్రాయిట్: సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ అబద్ధపు కథనం ఓ బాలుడి ప్రాణం తీసింది. అమెరికాలో మిచిగాన్కు చెందిన టైసన్ బెంజ్ అనే 11 ఏళ్ల బాలుడు.. తన గాళ్‌ఫ్రెండ్ (13) చనిపోయినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చూశాడు. నిజానికి ఆ అమ్మాయి చనిపోలేదు. కొందరు ఆకతాయిలు ఆటపట్టించాలని ఈ తప్పుడు కథనాన్ని పోస్ట్ చేశారు. అయితే ఈ విషయం తెలియని బెంజ్ తన గాళ్‌ఫ్రెండ్ చనిపోయిందని భావించి విషాదంలో మునిగిపోయాడు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంజ్ తల్లి గదిలోకి వెళ్లి చూడగా, అతని వేలాడుతూ కనిపించాడు. డెట్రాయిట్ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనం పోస్ట్ చేసిన ఓ నిందితుడిపై కేసు నమోదు చేశారు. తాను చూసినపుడు తన కొడుకు ఉల్లాసంగా ఉన్నాడని, 40 నిమిషాల తర్వాత గదిలోకి వెళ్లి చూడగా ఆత్మహత్యయత్నం చేశాడని బెంజ్ తల్లి కట్రినా గ్రాస్ ఆవేదన వ్యక్తం చేసింది. మొబైల్ ఫోన్లో తప్పుడు పోస్టింగ్‌లు చూసి బెంజ్ తన జీవితాన్ని అంతం చేసుకున్నాడని చెప్పింది. గాళ్‌ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకున్నందుకు బాధతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చనిపోయేముందు బెంజ్ పోస్ట్ చేశాడని వెల్లడించింది. తప్పుడు కథనం పోస్ట్ చేసి బెంజ్ మరణానికి కారణమైన బాలనేరస్తుడి వయసు ఎంత? పేరు ఏమిటి? బెంజ్‌తో అతనికి సంబంధం ఏంటి? అన్న విషయాలను పోలీసులు వెల్లడించలేదు. సోషల్ మీడియా వల్ల కలిగే దుష్పరిణామాల గురించి టీచర్లు పిల్లలకు చెప్పాలని గ్రాస్ కోరింది.