స్టాక్ మార్కెట్ మదపర్లకు ముఖ్యగమనిక. వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు థర్డ్ పార్టీ యాప్‌లకు రియల్ టైమ్ షేర్ వ్యాల్యూ సమాచారాన్ని అందించే అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.
ఈ సందర్భంగా నిర్దిష్ట ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు, వెబ్‌సైట్‌లు మొదలైనవి రియల్ టైం షేర్ వ్యాల్యూ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ (పేపర్ కరెన్సీ), పలు ట్రేడింగ్ చేయడం ఎలాగో నేర్పించే ఫాంటసీ గేమ్ తయారీ సంస్థలకు అందిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అంతేకాదు కొన్ని లిస్టెడ్ కంపెనీలు సైతం సంబంధిత వర్చువల్ స్టాక్ పోర్ట్‌ఫోలియో పనితీరు ఆధారంగా రివార్డ్స్ లేదంటే డబ్బుల్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ విధానంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి సమస్యకు పరిష్కార మార్గంగా సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
సెబీ ప్రకారం, అనుమతులు లేకుండా రియల్ ట్రైం ట్రేడింగ్ వ్యాల్యూ ఏంటనేది మధ్యవర్తులకు చేరవేయకూడదని తెలిపింది. ఒకవేళ్ల పంపించాల్సి వస్తే వ్రాతపూర్వక ఒప్పందాలపై సంతకం చేయాలి. ఈ బాధ్యతల్ని మార్కెట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్‌లు (ఎంఐఐఎస్)లు పరిశీలించాల్సి ఉంటుందని సెబీ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. సర్క్యులర్ విడుదలైన ముప్పై రోజుల తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, అవగాహన కల్పించడం కోసం మార్కెట్ ధరల డేటాను పంచుకునేటప్పుడు ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరం లేదని సెబీ పేర్కొంది
Comments
Please login to add a commentAdd a comment