share price
-
ఒకేరోజు రూ.3.53 నుంచి రూ.2.36 లక్షలకు చేరిన స్టాక్!
ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే స్మాల్ క్యాప్ స్టాక్ భారీగా పెరిగి రికార్డు నమోదు చేసింది. అక్టోబర్ 29న పెరిగిన స్టాక్ విలువ ఏకంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్లోనే ఖరీదైన స్టాక్‌గా మారింది. ఈ స్టాక్ ధర ఒక్క ట్రేడింగ్ సెషన్లో ఏకంగా 66,92,535 శాతం దూసుకుపోయింది. దాంతో గతంలో రూ.3.53గా ఉండే స్టాక్ ధర కాస్తా రూ.2,36,250కు చేరింది. ఇండియాలోనే ఇప్పటి వరకు ఖరీదైనా స్టాక్‌గా ఉన్న ఎంఆర్ఎఫ్ షేర్ ధర రూ.1.2 లక్షలును మించిపోయింది.షేర్ ధర రూ.3.53 వద్ద ఎందుకుందంటే..2011 నుంచి ఒక్కో షేరు ధర దాదాపు రూ.3గా ఉంది. కానీ ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కో షేర్ పుస్తక విలువ(వాస్తవ విలువ) రూ.5,85,225గా ఉంది. ఇలా కంపెనీ స్టాక్‌ల వాస్తవ విలువ ఆకర్షణీయంగా ఉండడంతో కంపెనీ షేర్లు ఎవరూ అమ్మడానికి ఇష్టపడలేదు. దాంతో షేర్ల ట్రేడింగ్ కొరత ఎక్కువైంది. తక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ల కారణంగా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలిపేశారు. ఫలితంగా దాదాపు ఒక దశాబ్దం పాటు స్టాక్ ధర సింగిల్ డిజిట్‌లోనే ఉంది.ఇదీ చదవండి: ‘షరతులు తీరిస్తే జాబ్ చేయడానికి సిద్ధం’ఎందుకు అంత పెరిగిందంటే..ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ వాల్యుయేషన్‌కు అనుగుణంగా ప్రత్యేక సెషన్‌ను నిర్వహించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలను సెబీ ఆదేశించింది. దాంతో ఎల్సిడ్ వాటాదారుల పంట పండినట్లయింది. కొత్త మెకానిజంలో భాగంగా లిక్విడిటీని మెరుగుపరచడం, సరసమైన ధరల ఆవిష్కరణను సులభతరం చేయడం లక్ష్యంగా హోల్డింగ్ కంపెనీలకు ఎటువంటి ప్రైస్ బ్యాండ్లు విధించలేదు. దాంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నిర్వహించిన ప్రత్యేక కాల్ ఆక్షన్ సెషన్లో స్టాక్ ధర భారీగా పెరిగింది. మంగళవారం కొన్ని షేర్లు చేతులు మారిన తర్వాత, బుధవారం ఉదయం ఎటువంటి ట్రేడింగ్ కార్యకలాపాలు జరగలేదు. -
సెబీ కొత్త నిబంధనలు..రియల్ టైం షేర్ వ్యాల్యూ షేరింగ్‌పై
స్టాక్ మార్కెట్ మదపర్లకు ముఖ్యగమనిక. వివిధ ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు థర్డ్ పార్టీ యాప్‌లకు రియల్ టైమ్ షేర్ వ్యాల్యూ సమాచారాన్ని అందించే అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.ఈ సందర్భంగా నిర్దిష్ట ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్‌లు, వెబ్సైట్లు మొదలైనవి రియల్ టైం షేర్ వ్యాల్యూ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ (పేపర్ కరెన్సీ), పలు ట్రేడింగ్ చేయడం ఎలాగో నేర్పించే ఫాంటసీ గేమ్ తయారీ సంస్థలకు అందిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. అంతేకాదు కొన్ని లిస్టెడ్ కంపెనీలు సైతం సంబంధిత వర్చువల్ స్టాక్ పోర్ట్‌ఫోలియో పనితీరు ఆధారంగా రివార్డ్స్ లేదంటే డబ్బుల్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, వారి సమస్యకు పరిష్కార మార్గంగా సెబీ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. సెబీ ప్రకారం, అనుమతులు లేకుండా రియల్ ట్రైం ట్రేడింగ్ వ్యాల్యూ ఏంటనేది మధ్యవర్తులకు చేరవేయకూడదని తెలిపింది. ఒకవేళ్ల పంపించాల్సి వస్తే వ్రాతపూర్వక ఒప్పందాలపై సంతకం చేయాలి. ఈ బాధ్యతల్ని మార్కెట్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్లు (ఎంఐఐఎస్)లు పరిశీలించాల్సి ఉంటుందని సెబీ తన మార్గదర్శకాల్లో వెల్లడించింది. సర్క్యులర్ విడుదలైన ముప్పై రోజుల తర్వాత కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, అవగాహన కల్పించడం కోసం మార్కెట్ ధరల డేటాను పంచుకునేటప్పుడు ఆర్థిక ప్రోత్సాహకాలు అవసరం లేదని సెబీ పేర్కొంది -
రిలయన్స్ షేర్ల రికార్డ్.. రూ.18 లక్షల కోట్ల మార్కు దాటిన ఆర్ఐఎల్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధర ఊపందుకుంది. మార్కెట్ విలువ ప్రకారం దేశంలో అతిపెద్ద కంపెనీ అయిన ఆర్ఐఎల్ షేర్లు గురువారం (జనవరి 11) 2 శాతానిపైగా పెరిగాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఈ కంపెనీ షేరు విలువ రూ. 2,700కిపైగా పెరిగి కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. ఫలితంగా ఆర్ఐఎల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 18 లక్షల కోట్ల మార్కును దాటింది. గతేడాది నిఫ్టీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువ 9 శాతం తగ్గుదల నమోదైంది. అయితే ఆర్ఐఎల్ షేర్ల కొనుగోళ్లు గత కొన్ని రోజులలో ఊపందుకున్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సుమారుగా 4 శాతం పెరిగాయని ఎకనమిక్స్ టైమ్స్ నివేదిక పేర్కొంది. డిసెంబరు త్రైమాసిక ఫలితాల సీజన్ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన బ్రోకరేజీల కొనుగోలు జాబితాలో ఆర్ఐఎల్ అగ్రస్థానంలో ఉంది. గోల్డ్‌మ్యాన్ సాచ్స్ ఇటీవల ఆర్ఐఎల్ టార్గెట్ ధరను రూ.2,660 నుంచి రూ.2,885కి పెంచగా జెఫరీస్ ఇంకా ఎక్కువగా టార్గెట్ ధరను రూ.3,125గా నిర్ణయించింది. ఇక నోమురా అయితే రూ. 2,985గా నిర్ణయించింది. త్వరలో గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్ జామ్‌నగర్‌లోని ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగా కాంప్లెక్స్‌ను 2024 ద్వితీయార్థంలో ప్రారంభించనున్నట్లు ఆర్ఐఎల్ చైర్పర్సన్ ముఖేష్ అంబానీ తాజాగా ప్రకటించారు. 5,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ హరిత ఇంధన రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టించడం, పర్యావరణహిత ఉత్పత్తులను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. -
భార్యతో తెగదెంపులు: ఇప్పటికే రూ. 1500 కోట్లు మటాష్!
రేమండ్ అధినేత, బిలియనీర్ గౌతమ్ సింఘానియా భార్యతో, విభేదాలు, విడాకులు అంశం వార్తలకెక్కింది మొదలు రేమాండ్ సంపద భారీగా కుప్పకూలింది. దాదాపు 1500కోట్ల రూపాయలను సంస్థ కోల్పోయింది. 32 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి అంటూ తన భార్య నవాజ్ సింఘానియాతో విడిపోతున్నట్లు సింఘానియా ప్రకటించిన సంగతి తెలిసిందే. భౌతిక దాడికి పాల్పడ్డారని బోర్డు మీటింగ్స్‌లో మాట్లాడనీయలేదని నవాజ్ మోడీ ఆరోపణల నేపథ్యంలో వివాదం నడుస్తోంది. అటు ఇద్దరు కుమార్తెల ప్రయోజనాలు, కుటుంబ గౌరవం నేపథ్యంలో తన గోప్యతను గౌరవించాలంటూ సింఘానియా మౌనం పాటిస్తుండటం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద సూట్ ఫాబ్రిక్ ఉత్పత్తిదారులలో ఒకటైన రేమండ్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా వివాదం నేపథ్యంలో పెట్టుబడిదారులలో ఆందోళన నెలకొంది. దీంతో వరుసగా ఏడో రోజు కూడా భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి. బుధవారం నాడు షేర్లు 4.4శాతం కుప్పకూలాయి. నవంబర్ 13 నుండి షేరు మొత్తంగా 12శాతం పతనమైంది. నవాజ్ మోడీ కూడా బోర్డు సభ్యురాలు కాబట్టి ఇది కార్పొరేట్ గవర్నెన్స్ సమస్య అనీ, ఇది కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదని ICICI సెక్యూరిటీస్ లిమిటెడ్ విశ్లేషకుడు వరుణ్ సింగ్ అన్నారు. రూ.11,658 కోట్ల నెట్‌వర్త్ మరోవైపు సెటిల్మెంట్లో భాగంగా నవాజ్ మోడీ 1.4 బిలియన్ డాలర్ల సంపదలో 75శాతం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.అయితే దీనిపై ఆ రేమండ్ గ్రూప్ ప్రతినిధి ఇంకా అధికారికంగా స్పందించలేదు. రేమండ్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,658 కోట్లు. రేమండ్ వ్యాపారంలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ వాటానే ఎక్కువ. దక్షిణ ముంబైలోని జేకే హౌస్ ఆస్తి అత్యంత విలువైందిగా అంచనా. దీని విలువ దాదాపు రూ. 6,000 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతోపాటు లంబోర్ఘిని గల్లార్డో LP570 సూపర్లెగ్గేరా, లంబోర్ఘిని ముర్సిలాగో, లోటస్ ఎలిస్ కన్వర్టిబుల్, నిస్సాన్ స్కైలైన్ GTR, హోండా S2000, ఫెరారీ 458 ఇటాలియా, ఆడి క్యూ7 లగ్జరీ కార్లు కూడా సింఘానియా సొంతం. -
22 వేలకోట్ల రూపాయలతో టీసీఎస్ బైబ్యాక్!
అత్యంత విలువైన భారత బ్రాండ్ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 22వేలకోట్ల రూపాయల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించనుంది. దాంతో తీవ్ర మార్కెట్ అనిశ్చితి మధ్య సోమవారం మార్కెట్లో టీసీఎస్ షేర్ విలువ స్వల్పంగా పెరిగి 52 వారాల గరిష్టానికి చేరింది. గడిచిన ఆరేళ్లలో కంపెనీ ఐదోసారి బైబ్యాక్ ప్రతిపాదనను పరిశీలిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. లిస్టెడ్ కంపెనీ తన నికర విలువలో 25శాతం వరకు షేర్లను తిరిగి కొనుగోలు చేయవచ్చు. దాని ప్రకారం జూన్ 30 చివరి నాటికి టీసీఎస్ రూ.22,620 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగలదు. ఇది 2017 నుంచి కంపెనీ బైబ్యాక్ చేసిన షేర్లకంటే ఎక్కువ. ఫిబ్రవరి 2017, 2018, 2020లో వరుసగా రూ.16000కోట్లు, 2022లో రూ.18వేల కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించింది. అయితే ఈ విధానం కంపెనీని ఆర్థికంగా ఎన్నోవిధాలుగా ప్రభావితం చేస్తుంది. జూన్ 30నాటికి కంపెనీ బ్యాలెన్స్షీట్లో రూ.15,622 కోట్లు క్యాష్ రూపంలో అందుబాటులో ఉందని తెలుస్తుంది. -
రైల్వే సంస్థ జాక్‌పాట్! రికార్డ్ స్థాయిలో పెరిగిన షేర్ల ధర
భారతీయ రైల్వే ఆధీనంలోని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) జాక్‌పాట్ కొట్టింది. స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు గురువారం (ఆగస్ట్ 3) నాడు 12 శాతం పెరిగి 52 వారాల కొత్త గరిష్ట స్థాయి రూ.44.65కి చేరుకున్నాయి. ఐఆర్ఎఫ్సీ షేర్ల ధర భారీగా పెరగడానికి కారణం వెంటనే స్పష్టంగా తెలియనప్పటికీ, రూ.5.25 లక్షల కోట్ల పెట్టుబడికి రైల్వే శాఖ ప్లాన్ చేసిందని, దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదానికి ప్రయత్నిస్తున్నట్లు వారం రోజుల కిందట కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. 2024 నుంచి 2031 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశంలోని రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ పెట్టుబడి ఉద్దేశించినట్లు తెలుస్తోంది. ఇన్‌క్రెడ్ ఈక్విటిస్ గౌరవ్ బిస్సా ఈ స్టాక్‌పై రూ.45 ధర లక్ష్యంతో కొనుగోలు కాల్ జారీ చేయడంతో స్టాక్ కూడా ఊపందుకుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. క్యాపిటల్ మార్కెట్లు, ఇతర రుణాల ద్వారా ఆర్థిక వనరులను సేకరిస్తుంది. దీనిపై రైల్వే శాఖ పరిపాలనా నియంత్రణను కలిగి ఉంది. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంది. -
లాభాల్లోకి టాటా మోటార్స్.. షేర్ల ధరకు రెక్కలు
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 3,301 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,951 కోట్ల నికర నష్టం ప్రకటించింది. లగ్జరీకార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్)తోపాటు వాణిజ్య వాహన బిజినెస్ పుంజుకోవడం కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదపడ్డాయి. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 71,228 కోట్ల నుంచి రూ. 1,01,528 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 77,784 కోట్ల నుంచి రూ. 98,267 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో టాటా మోటార్స్ స్టాండెలోన్ నష్టం రూ. 181 కోట్ల నుంచి రూ. 64 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ. 14,793 కోట్ల నుంచి రూ. 15,733 కోట్లకు బలపడింది. జేఎల్ఆర్ జూమ్... ప్రస్తుత సమీక్షా కాలంలో జేఎల్ఆర్ ఆదాయం 57 శాతం జంప్‌చేసి 6.9 బిలియన్ పౌండ్లను తాకగా.. 43.5 కోట్ల పౌండ్ల పన్నుకు ముందు లాభం ఆర్జించింది. కొత్త ఏడాదిని పటిష్టంగా ప్రారంభించినట్లు జేఎల్ఆర్ కొత్త సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. క్యూ1లో రికార్డ్ క్యాష్‌ఫ్లోను సాధించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం క్యూ1 స్థాయి పనితీరు చూపగలమని విశ్వసిస్తున్నట్లు గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ SEBI Notices To Yes Bank Ex CEO: యస్ బ్యాంక్ రాణా కపూర్‌కు సెబీ నోటీసు.. రూ. 2.22 కోట్లు కట్టాలి కాగా.. వాణిజ్య వాహన విభాగం ఆదాయం 4.4 శాతం పుంజుకుని రూ. 17,000 కోట్లను తాకింది. దేశీయంగా హోల్‌సేల్ అమ్మకాలు 14 శాతం క్షీణించి 82,400 యూనిట్లకు చేరగా.. రిటైల్ విక్రయాలు ఇదే స్థాయిలో నీరసించి 77,600 యూనిట్లకు పరిమితమయ్యాయి. ప్రయాణికుల వాహన విభాగం ఆదాయం 11 శాతం ఎగసి రూ. 12,800 కోట్లను తాకినట్లు కంపెనీ ఈడీ గిరీష్ వాగ్ తెలియజేశారు. అమ్మకాలు 8 శాతం వృద్ధితో 1,40,400 యూనిట్లకు చేరినట్లు వెల్లడించారు. బలమైన జూన్ త్రైమాసిక ఆదాయాలతో బుధవారం (జులై 26) ట్రేడింగ్‌లో ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్ షేర్లు 4 శాతానికి పైగా జంప్ చేసి 52 వారాల గరిష్ట స్థాయి రూ.665.40కి చేరుకున్నాయి. -
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
LIC: ఏడాదిలో రూ. 1.93 లక్షల కోట్లు ఆవిరి!
న్యూఢిల్లీ: జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ షేర్లు లిస్టయిన ఏడాది వ్యవధిలో 40 శాతం క్షీణించాయి. దీంతో రూ. 1.93 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఎల్ఐసీ గతేడాది ఐపీవో ద్వారా రూ. 20,557 కోట్లు సమీకరించి, రూ. 5.54 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో టాప్ 5 విలువైన కంపెనీల్లో ఒకటిగా నిల్చింది. షేర్లు మే 17న ఇష్యూ రేటుతో పోలిస్తే దాదాపు 8 శాతం డిస్కౌంటుకు బీఎస్ఈలో రూ. 872 వద్ద, ఎన్ఎస్ఈలో రూ. 867 వద్ద లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ. 949తో పోలిస్తే ప్రస్తుతం షేరు ఎన్ఎస్ఈలో 39.93 శాతం క్షీణించింది. బుధవారం రూ. 570 వద్ద ముగిసింది. తొలి ఏడాది ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి రూ. 920ని, 52 వారాల కనిష్ట స్థాయి రూ. 530.20ని తాకాయి. (ఈ పిక్స్ చూశారా? గుండెలు బాదుకుంటున్న కృతి సనన్ ఫ్యాన్స్) గురువారం కూడా షేరు ధర మరో 3 శాతం నష్టాలతో ఉంది. గడిచిన సంవత్సర కాలంలో ఇష్యూ ధరను మాత్రం దాటలేకపోయాయి. ఇదే వ్యవధిలో బీఎస్ఈ సెన్సెక్స్ 13.33 శాతం, నిఫ్టీ 11.82 శాతం పెరిగాయి. (అయ్యయ్యో! ఐకానిక్ స్టార్, ప్రిన్స్ మహేష్, డార్లింగ్ ప్రభాస్? ఎందుకిలా?) -
టాటా మోటార్స్ నష్టాలు, షేర్లు ఢమాల్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆటో మేజర్ స్ట్రీట్ నిరాశపరచడంతో గురువారం ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్ 5 శాతం కుప్పకూలింది. జాగ్వార్ ల్యాండ్ ఓవర్ (జేఎల్ఆర్) అమ్మకాలు ఆశ్చర్యపరిచినా, దేశీయ లాభాలు ఈ అంచనాలను అందుకోలేక మార్కెట్‌ను నిరాశపరిచాయి. ఫలితాల నేపథ్యంలో బుధవారం స్వల్ప నష్టాలతో రూ. 433 వద్ద ముగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్(క్యూ2)లో నికర నష్టాలు భారీగా తగ్గి రూ.945 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) ఇదే కాలంలో ఏకంగా రూ. 4,442 కోట్ల నష్టం వచ్చింది. ఆదాయం సైతం రూ. 62,246 కోట్ల నుంచి రూ. 80,650 కోట్లకు జంప్‌చేసింది. ఇక స్టాండెలోన్ నికర నష్టాలు సైతం రూ. 659 కోట్ల నుంచి తగ్గి రూ. 293 కోట్లకు పరిమితమయ్యాయి. మొత్తం ఆదాయం రూ. 11,197 కోట్ల నుంచి రూ. 15,142 కోట్లకు ఎగసింది. జేఎల్ఆర్ జూమ్ ప్రస్తుత సమీక్షా కాలంలో బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) ఆదాయం 36శాతం జంప్‌చేసి 5.3 బిలియన్ పౌండ్లను తాకింది. దేశీయంగా టాటా మోటార్స్ వాణిజ్య వాహన అమ్మకాలు 19శాతం వృద్ధితో 93,651 యూనిట్లను తాకగా.. ఎగుమతులు 22శాతం పుంజుకుని 6,771 వాహనాలకు చేరినట్లు కంపెనీ ఈడీ గిరీష్ వాగ్ పేర్కొన్నారు. ఈ కాలంలో 69శాతం అధికంగా 1,42,755 ప్యాసింజర్ వాహనాలు విక్ర యించింది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో 326శాతం వృద్ధితో 11,522 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
వావ్..అదరహో! ఎలైట్ క్లబ్‌లోకి ఎస్బీఐ ఎంట్రీ
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్‌లో ఘనతను సొంతం చేసుకుంది. రూ. 5.03 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌తో, కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్లోఎస్బీఐ ఏడో స్థానాన్ని సాధించింది. దీంతో రూ.5 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన దేశంలో మూడో బ్యాంకుగా ఎస్బీఐ నిలిచింది. ఎస్బీఐ రూ. 5-ట్రిలియన్ మార్కును అధిగమించడం ఇదే తొలిసారి. షేర్ ధర సెప్టెంబర్ 14న రికార్డు స్థాయిలో రూ. 573ని తాకింది. బీఎస్ఈ డేటా ప్రకారం మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ క్యాప్) తొలిసారిగా రూ. 5ట్రిలియన్ మార్కును తాకింది. బలహీనమైన మార్కెట్లో ఎస్బీఐ షేర్లు లాభాల్లో ఉంది. గత మూడు నెలల్లో ఎ స్బీఐ షేరు 26 శాతం ఎగిసింది. ఈ లిస్ట్‌లో ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ టాప్ ప్లేస్‌లో ఉంది. సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 8.42 ట్రిలియన్లు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 6.34 ట్రిలియన్లు గా ఉంది. అలాగే గత మూడునెలల కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ 32 శాతం ర్యాలీ చేయగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15 శాతం లాభపడింది. ఈ జాబితాలోని ఇతర ఆరు కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్ (రూ. 17.72 ట్రిలియన్), టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (రూ. 11.82 ట్రిలియన్), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (రూ. 8.42 ట్రిలియన్), ఇన్ఫోసిస్ లిమిటెడ్ (రూ. 6.5 ట్రిలియన్), ఐసిఐసిఐ బ్యాంక్ (రూ. 6.34 ట్రిలియన్) యూనిలివర్ (రూ. 6.08 ట్రిలియన్లు) ఉన్నాయి -
అటు భారీ నష్టాలు,ఇటు సీఎఫ్‌వో గుడ్‌బై, కుప్పకూలిన షేర్లు
బెంగళూరు: ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న స్పైస్‌జెట్‌కు మరోషాక్ తగిలింది. ఒకవైపు భారీ స్థాయిలో ఈ త్రైమాసికంలో నష్టాలు, మరోవైపు సంస్థ సీఎఫ్‌వో రాజీనామా చేయడంతో గురువారం నాటి మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా దాదాపు 15 శాతం కుప్పకూలాయి. ఇది ఇలా ఉండగా గురువారం ఉదయం ఆటోపైలట్ స్నాగ్ కారణంగా ఢిల్లీ-నాసిక్ స్పైస్‌జెట్ విమానాన్ని వెనక్కి మళ్లించిన ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఇంధన ధరల భారం, దేశీయ కరెన్సీ రూపాయిక్షీణత, స్పైస్‌జెట్ లిమిటెడ్ భారీ నష్టాన్ని నమోదు చేసింది. మరోవైపు సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంజీవ్ తనేజా రాజీనామా చేసినట్లు ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతింది. షేర్లు గురువారం ఆరంభంలో 14.7 శాతం నష్టపోయాయి. పెరుగుతున్న నష్టాలు, ఇటీవలి కాలంలో మిడ్-ఎయిర్ సంఘటనల మధ్య సంజీవ్ రాజీనామా చేసినట్లు తెలిపింది. (SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో సమస్య: మధ్యలోనే వెనక్కి) కాగా జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం రూ. 789 కోట్లకు పెరిగిందని, ప్రధానంగా అధిక ఇంధన ధరలు, రూపాయి క్షీణత కారణంగా నష్టాలొచ్చాయని బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఏడాది క్రితం కాలంలో రూ. 235.3 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. మార్చి 2022తో ముగిసిన త్రైమాసికంలో రూ. 458 కోట్ల నికర నష్టం వచ్చినట్టు వెల్లడించిది. అయితే సైబర్ సెక్యూరిటీ దాడి కారణంగా ఆలస్యమైందని కంపెనీ పేర్కొంది. అంతేకాదు నగదు సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ అద్దెదారులకు సకాలంలో చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతోంది, కొంతమంది తమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు వరుసగా రెండో నెలలో కూడా జీతాలు చెల్లింపు ఆలస్యమైందని ఉద్యోగులు ఆరోపిస్తుండగా, చెల్లింపులు "గ్రేడెడ్ ఫార్మాట్"లో జరుగుతున్నాయని స్సైస్‌జెట్ వివరణ ఇచ్చింది. -
డా.రెడ్డీస్ లాభం 108 శాతం అప్: అయినా షేరు ఢమాల్
హైదరాబాద్: ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో లాభాల్లో భారీ పురోగతి సాధించినప్పటికీ శుక్రవారం నాటి మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దాదాపు 4 శాతం కుప్పకూలి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. క్యూ1లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) రూ. 1,188 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం నమోదైన రూ. 571 కోట్లతో పోలిస్తే ఇది 108 శాతం అధికం. సమీక్షాకాలంలో ఆదాయం ఆరు శాతం పెరిగి రూ. 4,919 కోట్ల నుంచి రూ. 5,215 కోట్లకు ఎగిసింది. ప్రధానంగా ఇండివియర్, అక్వెస్టివ్ థెరాప్యూటిక్స్లతో సుబాక్సోన్ ఔషధ వివాద సెటిల్మెంట్తో వచ్చిన నిధులు, అలాగే కొన్ని బ్రాండ్ల విక్రయాలు తదితర అంశాలు ఇతర ఆదాయం పెరగడానికి కారణమని ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ తెలిపారు. ఉత్పాదకతను పెంచుకోవడం, కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం తదితర చర్యలతో వ్యాపారాన్ని మరింత మెరుగుపర్చుకోనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ కో-చైర్మన్, ఎండీ జి.వి. ప్రసాద్ తెలిపారు. బూస్టర్ డోస్‌గా స్పుత్నిక్ లైట్.. కోవిడ్‌కి సంబంధించి స్పుత్నిక్ లైట్‌ను దేశీయంగా ఇతర టీకాలకు యూనివర్సల్ బూస్టర్ డోస్‌గా ఉపయోగించే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు డీఆర్ఎల్ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ వెల్లడించారు. -
స్పైస్‌జెట్‌కు డీజీసీఏ షాక్, ఇండిగోకు జాక్‌పాట్
సాక్షి,ముంబై: విమానయాన సంస్థ స్పైస్ జెట్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇటీవల సంస్థ విమానాల్లో వరుస సాంకేతిక లోపాల ఘటనలు ఆందోళన రేపిన నేపథ్యంలో ఎయిర్‌లైన్స్ రెగ్యులేటరీ డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. సాంకేతిక సమస్యలు, సెఫ్టీ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎనిమిది వారాలపాటు కేవలం 50 శాతం విమానాలను మాత్రమే నడిపించాలని స్పైస్‌జెట్‌ను ఆదేశించింది ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించడంతో లాభాల మార్కెట్లో స్పైస్‌జెట్ షేర్ 7 శాతం కుప్పకూలింది. ఆ తరువాత మరింత అమ్మకాలు వెల్లువెత్తడంతో 9.66 శాతం తగ్గి రూ. 34.60 వద్ద 52 వారాలా కనిష్టాన్ని తాకింది. మరోవైపు ప్రత్యర్థి విమానయాన సంస్థ ఇండిగో షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. 3 శాతానికి పైగా లాభాలతో ఉంది. అయితే డీజీసీఏ ఆదేశాలపై స్పందించిన స్పైస్‌జెట్ తమ విమాన కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది. విమానాలను కేన్సిల్ చేయలేదని వెల్లడించింది. రానున్న రోజుల్లో, వారాల్లో అన్ని విమానాలు షెడ్యూల్ ప్రకారం పనిచేస్తాయని తెలిపింది. ఇటీవలి సంఘటనలపై చర్యలు తీసుకుంటున్నామన్న సంస్థ డీజీసీఏ ఆదేశాల మేరకు పని చేస్తామని పేర్కొంది. కాగా జూన్ 19, జూలై 5 మధ్య ఎనిమిది స్పైస్‌జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో డీజీసీఏ జూలై 6న విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. Hence, there will be absolutely no impact on our flight operations. We want to reassure our passengers and travel partners that our flights will operate as per schedule in the coming days and weeks. There will be no flight cancellation as a consequence of this order. >> — SpiceJet (@flyspicejet) July 27, 2022 -
రూ. 500 కోట్ల నిధుల సమీకరణ ప్లాన్స్: వోడాఫోన్ ఐడియా జూమ్
సాక్షి, ముంబై: ప్రముఖ టెల్కో వోడాఫోన్ ఐడియా భారీ ఎత్తున నిధులను సమీకరించనుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తరుణంలో బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. దీంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌లో వోడాఫోన్ షేర్ దాదాపు 3 శాతం లాభపడింది. వోడాఫోన్ గ్రూప్ సంస్థలకు ప్రాధాన్యత ఆధారంగా ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టిబుల్ వారెంట్ల ద్వారా రూ. 500 కోట్ల వరకు నిధులను సమీకరించే ప్రతిపాదనను పరిశీలించడానికి బోర్డు బుధవారం సమావేశమవుతుందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ సమాచారంలో వెల్లడించింది. వోడాఫోన్ ఐడియా గ్రూపు నుంచి రూ. 500 కోట్ల ఫండ్ ఇన్ఫ్యూషన్ ప్లాన్‌ను పరిశీలించేందుకు వోడాఫోన్ ఐడియా బోర్డు బుధవారం సమావేశం కానుంది. దీనికి బోర్డు ఆమోదం తె లిపితే రెండు నెలల్లో ఇది రెండవది కావడం విశేషం. మరోవైపు బోర్డు ఆమోదించిన రూ. 25,000 కోట్ల అదనపు పెట్టుబడులకు గాను ఇటీవలి రూ. 4,500 కోట్ల పెట్టుబడులకు తోడు తమకు ఇంకా రూ. 20,000 కోట్లు అవసరమని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రవీందర్ టక్కర్ ఇటీవల వెల్లడించారు. ఫండ్ ఇన్ఫ్యూషన్తో సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడంతోపాటు, 5జీ పెట్టుబడులపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. కాగా ఈ ఏడాది మార్చిలో ఇద్దరు ప్రమోటర్ల రూ. 4,500 కోట్ల నిధుల సమీకరణను కంపెనీ బోర్దు ఆమోదించింది. వోడాఫోన్ ఐడియాలో వొడాఫోన్ గ్రూప్ దాదాపు రూ.3,375 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.1,125 కోట్లు పెట్టింది. అయితే, ఎయిర్టెల్, జియోలతో పోలిస్తే కంపెనీ ఇప్పటివరకు ఒక్క విదేశీ ఇన్వెస్టర్ పెట్టుబడులను సేకరించ లేకపోయింది. -
ఎల్ఐసీ విషయంలో అలా జరగడం తాత్కాలికమే
న్యూఢిల్లీ: బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ షేరు తగ్గుదల ఆందోళనకరంగా అనిపిస్తున్నప్పటికీ, ఇది తాత్కాలికమైనదేనని ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. సంస్థ ఫండమెంటల్స్ గురించి షేర్హోల్డర్లు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలన్నింటినీ ఎల్ఐసీ పరిశీలించి, వాటాదారులకు మరింత విలువను చేకూర్చేందుకు తగు చర్యలు తీసుకుంటుందని పాండే వివరించారు. గత నెలలో నిర్వహించిన ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ద్వారా కేంద్రం రూ. 20,500 కోట్లు సమీకరించింది. అయితే మే 17న లిస్టయిన దగ్గర్నుంచి ఎల్ఐసీ షేరు క్షీణిస్తూనే ఉంది. ఇష్యూ ధర రూ. 949 కాగా గరిష్టంగా రూ. 920 స్థాయిని మాత్రమే తాకగలిగింది. అప్పట్నుంచి పతనబాటలోనే ఉన్న షేరు శుక్రవారం బీఎస్ఈలో రూ. 709.70 వద్ద క్లోజయ్యింది. చదవండి: ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి! -
ఇన్వెస్టర్లకు షాక్..నాలుగోవంతు సంపద మటాష్!
సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మార్కెట్ విలువ దారుణ స్థితికి చేరింది. మార్కెట్ వాల్యుయేషన్‌లో నాలుగో వంతు తుడిచిపెట్టుకుపోయింది. విశ్లేషకుల అంచనాలకు, భయాలకు అనుగుణంగానే షేరు మరింత దిగజారి కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. అమ్మకాల ఒత్తిడితో ఎల్ఐసీ షేర్ ధర గురువారం మరో కొత్త రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఐపీవో ఇష్యూ ధర 949 రూపాయలతో పోలిస్తే దాదాపు 25 శాతం కుప్పకూలింది. మే 17న స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టింగ్ అయిన దగ్గరినుంచి కేవలం నాలుగు సెషన్లలో మాత్రమే లాభపడిన షేరు ధర ఆల్ టైం లో రూ.720 టచ్ చేసింది. ప్రస్తుతం 723.20 వద్ద కొనసాగుతోంది. ఫలితంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,00,242 కోట్లకు చేరింది. ఒక దశలోమార్కెట్ క్యాప్ దాదాపు 4.6 లక్షల కోట్లకు పడిపోయింది. దలాల్ స్ట్రీట్‌లో షేరు విలువ రూ. 1.4 లక్షల కోట్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడంతోపెట్టుబడిదారులు లబోదిబో మంటున్నారు. -
ఒక్క మాటతో ఆ కంపెనీ షేర్లు ఎక్కడికో దూసుకు పోయాయి!
షేర్ మార్కెట్ అదొక అర్థం కాని మయాజాలం. గ్రాఫులు , లెక్కలు, విశ్లేషణలు, మార్కెట్ పండితులు ఇలా ఎందరు ఎన్ని చెప్పినా అంచనాలు క్షణాల్లో పట్టు తప్పుతుంటాయ్. పదేళ్ల డేటాతో చేసిన విశ్లేషణ కంటే కూడా సెంటిమెంట్ పవర్ ఎక్కువ మార్కెట్లో. చాన్నాళ్ల తర్వాత మార్కెట్‌కి సెంటిమెంట్ రుచి చూపించి ఇన్వెస్టర్లకు రూపాయికి రూపాయి లాభం అది రెండు వారాల వ్యవధిలోనే అందించింది ఓ బ్రాండ్. ఒకప్పుడు ఇండియన్ రోడ్లపై రారాజులా వెలిగింది అంబాసిడర్ కారు. బిర్లాలకు చెందిన హిందూస్థాన్ మోటార్స్ సంస్థ ఈ కారును మార్కెట్లోకి తెచ్చింది. మార్కెట్లోకి రావడం ఆలస్యం ట్యాక్సీ డ్రైవర్ నుంచి సెలబ్రిటీల వరకు అందరి మనసును దోచుకుంది. 90వ దశకం వరకు సినిమాల్లో ఈ కారే కనిపించేది. అంబాసిడర్ అంటే స్టేటస్ సింబల్‌గా వెలిగిపోయింది. విదేశీ కార్లు ఇండియాలోకి వచ్చినా రాజకీయ నేతలు చాన్నాళ్ల పాటు అంబాసిడర్‌ని వదల్లేక పోయారు. అయితే ఆధునికతను సంతరించుకోక క్రమంగా అంబాసిడరే కనుమరుగై పోయింది. అంబాసిడర్ సెంటిమెంట్ పాత అంబాసిడర్‌కు కొత్తగా ఎలక్ట్రిక్ హంగులు అద్ది మార్కెట్లోకి తెస్తామంటూ హిందూస్థాన్ మోటార్స్ సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు విదేశీ కంపెనీతో సంప్రదింపులు కూడా పూర్తయినట్టు వెల్లడించింది. రాబోయే ఎలక్ట్రిక్ అంబాసిడర్ కారు ప్రొటోటైప్ ఫోటోలు, వీడియోలు సైతం సోషల్ మీడియాలో హోరెత్తిపోయాయి. పాత కాలం అంబాసిడర్‌ను కొత్త లుక్‌లో చూసేందుకు దేశం యావత్తు ఆసక్తి చూపించింది. అంబాసిడర్ మీద ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. షేర్ల ధరకు రెక్కలు గడిచిన ఐదేళ్లుగా హిందూస్తాన్ మోటార్స్ షేరు రూ. 7 నుంచి రూ 10 దగ్గరే తిరుగాడుతోంది. కేవలం రెండు సార్లు మాత్రమే స్వల్ప కాలం పాటు రూ.15 గరిష్టాలను అందుకుంది. అంబాసిడర్ సరికొత్త రూపంలో మార్కెట్లోకి రాబోతుందన్న వార్త వచ్చిన తర్వాత హిందూస్థాన్ మోటార్స్ షేర్లకు రెక్కలు వచ్చాయి. లాభాలే లాభాలు మే 24న హిందూస్థాన్ మోటార్స్ ఒక్క షేరు ధర రూ. 10.80 దగ్గర ఉండగా జూన్ 8న షేరు ధర రూ.22.05కి చేరుకుంది. కేవలం రెండు వారాల వ్యవధిలో షేరు ధర రెట్టింపు అయ్యింది. మే 24న ఎలక్ట్రిక్ అంబాసిడర్ వార్త విని లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి రెండు వారాలు తిరిగే సరికి మరో లక్ష లాభం కళ్ల చూడగలిగారు. ఇక ఎప్పటి నుంచో ఈ షేర్లను అట్టిపెట్టుకున్న వారు ఒక్క వార్తతో బూరెల బుట్టలో పడ్డట్టు అయ్యింది. చాలా కాలం పాలు లాభాలు అందివ్వని హిందూస్థాన్ మోటార్స్ షేర్లు ఒక్క వార్తతో తారా జువ్వలా లాభాల్లోకి దూసుకుపోయాయి. చదవండి: Ambassador Electric Car: ఇండియన్ రోడ్ల రారాజు.. అంబాసిడర్ కొత్త లుక్కు చూసారా? -
ఎల్ఐసీ ఫ్లాప్ షో, మార్కెట్ క్యాప్ ఢమాల్: షాక్‌లో ఇన్వెస్టర్లు
సాక్షి,ముంబై:అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కి మార్కెట్లో వరుసగా ఐదో సెషన్లోనూ అమ్మకాల సెగ తాకింది. ఇన్వెస్టర్ల ఎడ తెగని అమ్మకాలతో సోమవారం ఎస్ఐసీ మరింత దిగజారి ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాప్ 5 లక్షల కోట్ల రూపాయల దిగువకు పడిపోయింది. ఇది లిస్టింగ్ నాటికి రూ.6 లక్షల కోట్లకు పై మాటే. ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. సోమవారం నాటి అమ్మకాలతో ఎల్ఐసీ షేరు 2.86 శాతం క్షీణించి రికార్డు ముగింపు కనిష్టం రూ.777.40 వద్ద స్థిరపడింది. బీఎస్ఈఇండెక్స్లో ఈ స్టాక్ ఆల్-టైమ్ ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ. 775.40ని తాకింది. దీంతో మార్కెట్ విలువ 4.97 లక్షల కోట్లకు చేరింది. అయితే భవిష్యత్తులో మరింత అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోనుందని, యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పీరియడ్ ముగియనున్న నేపథ్యంలో రూ. 750 వద్ద మరింత దిగజారే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎల్ఐసీ షేరు లిస్టింగ్ ప్రైస్ (మే 17న) రూ. 949 నుండి 18.08 శాతం కుప్ప కూలింది. ఎఫ్ఐఐల భాగస్వామ్యం దాదాపు శూన్యం కావడం, లాక్ ఇన్ పీరియడ్ ముగియనుండటంతోపాటు, క్యూ4 ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడంతో మరింత దిగజారవచ్చని, పొజిషనల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగాఉండాలని మార్కెట్ నిపుణుడు ఎస్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ జైన్ సూచించారు. దీంతో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు లబోదిబో మంటున్నారు. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా మార్చి 2022 త్రైమాసికంలో సంస్థ వార్షిక ప్రాతిపదికన ఏకీకృత నికర లాభం 17 శాతం క్షీణించి 2,410 కోట్లు రూపాయలుగా ఉంది. అయితే నికర ఆదాయం 17.9 శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరింది, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోరూ.1.2 లక్షల కోట్లుగా ఉంది. -
Anand Mahindra: అబ్దుల్ కలాం మాటలే మాలో ధైర్యాన్ని నింపాయి
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ స్ఫూర్తితోనే కఠిన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొని తిరిగి సరైన మార్గంలోకి రాగలిగామంటూ గతాన్ని నెమరు వేసుకున్నారు ప్రముఖ ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా. మిన్నువిరిగి మీద పడిన ఆ సందర్భంలో కేవలం అబ్దుల్ కలామ్ చెప్పిన మాటలే తమలో ధైర్యాన్ని నింపాయన్నారు ఆనంద్ మహీంద్రా. ఇందుకు సంబంధించిన వివరాలను ట్విటర్లో ఆయన షేర్ చేశారు. మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల కారణంగా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు షేర్ల ధర 2019లో భారీగా పడిపోయింది. ఆల్‌టైం హై రూ.984 నుంచి నేలకు దిగి వచ్చింది. కంపెనీ వ్యక్తులుగా మా అందరికీ ఆ ఘటన షాక్ కలిగించింది. అయితే అదే ఏడాది జరిగిన యాన్యువల్ లీడర్షిప్ కాన్ఫరెన్స్‌లో మా కంపెనీ ఉద్యోగులకు దిశానిర్ధేశం చేయాల్సి వచ్చింది. అప్పుడు మహనీయుడు అబ్దుల్ కలామ్ మాటాలనే ప్రస్తావిస్తూ వారిలో స్ఫూర్తిని నింపానంటూ ఆనంద్ మహీంద్రా తెలిపారు. అంతకు ముందు మహీంద్రా వ్యాలీ ప్రారంభోత్సవానికి వచ్చిన అబ్దుల్ కలామ్ మాట్లాడుతూ డేర్ టూ డ్రీమ్ అంటూ సలహా ఇచ్చారు. కలామ్ మాటలనే మరోసారి ఉద్యోగులకు వివరించానంటూ ఆనంద్ మహీంద్రా ఆనాటి ఘటన గుర్తు చేసుకున్నారు. మనందరం కష్టపడి పని చేస్తే మహీంద్రా గ్రూపు 75వ వార్షికోత్సవం నాటికి మరోసారి ఆల్‌టైం హైకి షేరు ధర చేరుకోవడం కష్టం కాదంటూ వారిలో నమ్మకం నింపేందుకు ప్రయత్నించినట్టు ఆయన వెల్లడించారు. In 2019, M&M’s share price had fallen sharply from its all-time high of ₹984. In our annual leadership conference that year, I reminded our team of the late President Kalam’s advice when he inaugurated Mahindra Research valley. “Take the Hill” he said, i.e, dare to dream. (1/3) pic.twitter.com/V6A9T4eROt — anand mahindra (@anandmahindra) May 30, 2022 అయితే ముందుగా నిర్దేశించుకున్నట్టు 75వ వార్షికోత్సం నాటికి ఆల్‌టైం హై రూ.984కి షేరు ధర తీసుకెళ్లలేకపోయామని ఆనంద్ మహీంద్రా అన్నారు. కానీ సరిగ్గా ఏడాది తిగిరే సరికి ఆల్‌టైం హైని దాటేసినట్టు తెలిపారు. కలాం డేర్ టూ డ్రీమ్ మాటలను నిజం చేస్తూ కొత్త ఆల్‌టైం హైకి షేరు ధర రూ.1000కి చేరుకుందన్నారు. మరోసారి ఈ ఘనత సాధించిన తన టీమ్‌కి కృతజ్ఞతలు తెలిపారు మహీంద్రా. చదవండి: భారతి ‘స్వరాజ్’’పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర వ్యాఖ్యలు -
అదానీ వెంటే ఇన్వెస్టర్లు.. అందరికీ లాభాలే లాభాలు!
అదానీ ప్రస్తుతం ఇండియన్ బిజినెస్ వరల్డ్ లోనే కాదు ఏషియా బిజినెస్ సర్కిళ్లలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. దూకుడైన వ్యాపార వ్యూహాలతో జెట్ స్పీడ్‌తో అదానీ కంపెనీలు దౌడు తీయిస్తున్నారు ఆ కంపెనీల సీఈవో గౌతమ్. తాజాగా ప్రపంచంలోనే పెద్ద సిమెంట్ కంపెనీల్లో ఒకటైన హోల్సిమ్ గ్రూప్‌కి చెందిన అంబుజా, ఏసీసీ సిమెంటులను ఆయన టేకోవర్ చేశారు. శుభశకునాలే! భారీ సిమెంట్ కంపెనీలను గౌతమ్ అదానీ టేకోవర్ చేయడంతో ఒక్కసారిగా గౌతమ్ అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలకు రెక్కలు వచ్చాయి. దీనికి తోడు త్వరలోనే భారత ప్రభుత్వం ఇన్ఫ్రా రంగంపై భారీగా ఖర్చు చేయబోతున్నట్టు మార్కెట్ నిపుణులు అంచనాలు వెలువరించారు. దీంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టు అదానీ కంపెనీల షేర్లు లాభాల్లోకి వచ్చాయి. రెండు గంటల్లోనే సోమవారం మార్కెట్ ఆరంభమైన తర్వాత ఈ కంపెనీల షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారు. మార్కెట్ ఆరంభమైన రెండు గంటల వ్యవధిలోనే ఈ గ్రూపుకు చెందిన కంపెనీల షేర్లు కనిష్టంగా ఒక శాతం నుంచి గరిష్టంగా ఐదు శాతం వరకు వృద్దిని నమోదు చేశాయి. ఒక్క ఎనర్జీ సెక్టార్ మినహా ప్రతీ కంపెనీ షేర్లు దౌడు తీస్తున్నాయి. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం కేవలం రెండు గంటల్లోనే అదానీ కంపెనీల షేర్లు భారీ లాభాలను ఆర్జించగలిగాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో దేశీ స్టాక్ ఎక్సేంజీలలో అదానీ గ్రూపులో వివిధ కంపెనీల షేర్లు ఇలా ఉన్నాయి. - అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ధర రూ. 40 పెరిగి రూ. 2094 దగ్గర ట్రేడవుతోంది. వృద్ధి 1.96 శాతంగా నమోదు అయ్యింది. - అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్జోన్ లిమిటెడ్ షేరు 0.86 వృద్ధిని నమోదు చేసింది. ఒక్కో షేరు ధర రూ.6.10 పెరిగి రూ. 712 దగ్గర ట్రేడవుతోంది. - అదానీ పవర్ షేరు ఏకంగా 4.99 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఒక్కో షేరు ధర రూ.12.70 వంతున పెరిగి రూ. 267.35 దగ్గర నమోదు అవుతోంది. - అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ధర రూ.61.30 వరకు లాభపడింది. 2.82 శాతం వృద్ధితో రూ.2231 దగ్గర ట్రేడవుతోంది. - అదానీ విల్మర్, అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. - అదానీ ట్రాన్స్మిషన్ షేరు మాత్రం స్వల్ప నష్టాల్లో ఉంది. 1.20 శాతం క్షీణతతో ఒక్కో షేరు విలువ రూ.26 తగ్గి రూ.2161 దగ్గర ట్రేడవుతోంది. -అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేరు కూడా నష్టాల్లో ఉంది. ఒక్కో షేరు ధరలో రూ.43 కోతకు గురైంది. రూ.2325 దగ్గర నమోదు అవుతోంది. చదవండి: అదానీ చేతికి హోల్సిమ్ ఇండియా -
ఐపీవోలో ఎల్ఐసీ రికార్డు!
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూలో భాగంగా షేర్ల కేటాయింపును చేపట్టింది. ధరల శ్రేణిలో తుది ధర రూ. 949ను ఖరారు చేసింది. అయితే పాలసీదారులకు రూ. 60 డిస్కౌంట్‌పోను రూ. 889కే షేర్లను జారీ చేసింది. ఈ బాటలో ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ. 904 ధర(రూ. 45 రాయితీ)లో షేర్లను కేటాయించగా.. ఇతరులకు రూ. 949 ధరలో షేర్ల జారీని చేపట్టింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించింది. ఇందుకు రూ. 902–949 ధరల శ్రేణిని ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి రూ. 20,557 కోట్లు సమకూర్చుకుంది. ఈ నెల 17న(మంగళవారం) ఎల్ఐసీ స్టాక్ ఎక్సేంజీలలో లిస్ట్‌కానుంది. దీంతో దేశీ క్యాపిటల్ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా ఎల్ఐసీ రికార్డు సృష్టించింది. ఫలితంగా ఇంతక్రితం 2021లో రూ. 18,300 కోట్లు సమీకరించడం ద్వారా రికార్డు నెలకొల్పిన పేటీఎమ్ రెండో ర్యాంకుకు చేరింది. ఇక 2010లో రూ. 15,500 కోట్ల విలువైన ఐపీవో చేపట్టిన కోల్ ఇండియా, 2008లో రూ. 11,700 కోట్ల ఇష్యూకి వచ్చిన రిలయన్స్ పవర్ తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి. చదవండి: ఎల్ఐసీ.. షేర్ల అలాట్మెంట్పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం -
ఓఎన్జీసీ అమ్మకానికి వేళాయే, కేంద్రం చేతికి వేలకోట్లు!
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీలో ప్రభుత్వం విక్రయానికి ఉంచిన 1.5 శాతం వాటా పూర్తి స్థాయిలో సబ్స్క్రయిబ్ అయ్యింది. దీంతో ప్రభుత్వానికి రూ. 3,000 కోట్లు లభించనున్నాయి. ఈ నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో లెక్కకురానున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ.159 ఫ్లోర్ ధరలో ప్రభుత్వం 1.5% వాటాకు సమానమైన 1.88 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. గురువారం(31) ఆఫర్ ప్రారంభంకావడంతో 1.33 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. మిగిలిన షేర్లను సంస్థాగత ఇన్వెస్టర్లకు ప్రభుత్వం కేటాయించనుంది. 30న ప్రారంభమైన సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగంలో 8.49 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. రూ.159.91 సగటు ధరలో 30.35 కోట్ల షేర్లకు డిమాండ్ కనిపించింది. వెరసి మూడున్నర రెట్లు అధిక సబ్స్క్రిప్షన్ నమోదైంది. ఈ బిడ్స్ మొత్తం విలువ రూ.4,854 కోట్లు! కాగా.. ఆఫర్‌కు అధిక డిమాండ్ కనిపిస్తే గ్రీన్‌షూ ఆప్షన్‌కింద రెట్టింపు షేర్ల(18.86 కోట్లు)ను విక్రయించేందుకు ప్రభుత్వానికి వీలుంది. ఆఫర్లో భాగంగా తొలుత 9.43 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచిన విషయం విదితమే. ఈ వార్తల నేపథ్యంలో ఓఎన్జీసీ షేరు 1 శాతం బలపడి రూ.164 వద్ద ముగిసింది. -
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం.. భారత్‌లో రాకెట్లా దూసుకెళ్తున్న షేర్లు ఇవే!
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన దాడి ఆ తర్వాత అనంతర పరిణామాలతో ఇన్వెస్టర్ల ఆలోచణ ధోరణిలో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. రష్యా దాడులు, అమెరికా దాని మిత్ర పక్ష దేశాలు విధిస్తున్న ఆర్థిక ఆంక్షల కారణంగా బడా వ్యాపారాల భవిష్యత్తు డోలయమానంలో పడగా, వాటి లాభాల మార్జిన్లకు కోతలు పడుతున్నాయి. అయితే యుద్ధం తెచ్చిన ఉద్రిక్తల కారణంగా రక్షణ రంగంలో వ్యాపారం చేస్తున్న కంపెనీల షేర్ల ధరలు రయ్‌రయ్‌మంటున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి మూడు వారాలు దాటినా నేటికి ఫలితం తేలలేదు. పైగా రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఓ పక్క. అమెరికా దాని మిత్ర పక్షలు ఒక పక్క అనే పరిస్థితి నెలకొంది. ఇరుపక్షాలు మూడో ప్రపంచ యుద్దం ముంగిట సంయమనం పాటిస్తున్నాయి. కానీ యుద్ధ భయాలు మాత్రం తొలగిపోలేదు. ముఖ్యంగా రెండు ప్రపంచ యుద్ధాలకు వేదికగా నిలిచిన యూరప్ దేశాలు తమ రక్షణ విషయంలో ఆందోళన చెందుతున్నాయి. నాటోను నమ్మలేం మరోవైపు కీలక సమయంలో నాటో దేశాలు చేతులెత్తాశాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కీ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలను పునరాలోచనలో పడేసింది. దేశ రక్షణ విషయంలో ఔట్సోర్సింగ్ నమ్మదగిన వ్యవహారం కాదనేట్టుగా పరిస్థితులు మారాయి. చాలా దేశాలు రక్షణ బడ్జెట్ పెంచే యోచనలో ఉన్నాయి. అస్థిరంగా ఆయిల్ ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తదనంతర పరిణామాల్లో స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలు చవి చూశాయి. ఇన్వెస్టర్లు వివిధ కంపెనీల్లో తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుని ఆయిల్, బంగారంలలో పెట్టుబడులు పెట్టారు. కానీ ముడి చమురు ధరలు మరింర అస్థిరంగా మారాయి. కేవలం పది రోజలు వ్యవధిలోనే బ్యారెల్ ముడి చమురు ధర 40 డాలర్ల వరకు హెచ్చు తగ్గులు చవిచూసింది. బంగారానిది ఇదే బాట. దీంతో నమ్మకమైన పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లు రక్షణ రంగంలో ఉన్న కంపెనీల వైపుకు చూస్తున్నారు. ఫలితగా డిఫెన్స్ సెక్టార్లో ఉన్న కంపెనీల స్టాక్స్ పరుగులు పెడుతున్నాయి. డిఫెన్స్‌పైనే గురి - డిఫెన్స్ సెక్టార్‌కి అవసరమైన ముడి పరికరాలు తయారు చేసే భారత డైనమిక్స్ షేరు ధర ఈ రోజు ఉదయం మార్కెట్ ప్రారంభంలో రూ. 529లు ఉండగా మధ్యాహ్నాం దాదాపు 7 శాతం వృద్ధితో రూ.36లు లాభపడి 558.65కి చేరుకుంది. - మన దేశంలో డిఫెన్స్‌లో ఎంతో కీలకమైన హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ షేరు ధర ఈ రోజు ఉదయం రూ. 1394ల వద్ద ట్రేడింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి 4.13 శాతంత వృద్ధితో రూ.1433 దగ్గర ట్రేడవుతోంది. - భారత్ ఎలక్ట్రానిక్ షేరు ఒక శాతం వృద్ది కనబరిచి రూ.207.80 దగ్గర ట్రేడవుతోంది - భారత్ ఎర్త్‌మూవర్స్ లిమిటెడ్ (బీఈఎంఎల్) షేర్లు రూ.25ల లాభంతో 1.65 శాతం వృద్ధి కనబరిచి రూ.1542 దగ్గర ట్రేడవుతోంది. - కీలకమైన సెమికండక్టర్లు తయారు చేసే ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్ లిమిటెడ్ షేరు 4.52 శాతం వృద్ధితో రూ.226.55 దగ్గర ట్రేడవుతోంది. జెన్ టెక్నాలజీస్ షేర్లు సైతం లాభాల్లో ఉన్నాయి. చదవండి: Ukraine War: శాంతించిన క్రూడ్.. దిగొచ్చిన బంగారం! -
లబోదిబో అంటున్న జొమాటో ఇన్వెస్టర్లు..!
Zomato On A Bumpy Ride: గత ఏడాది స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన జొమాటో షేర్ ధర ఇప్పుడు భారీగా పడిపోతుంది. జొమాటోలో ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడుదారులందరూ ఇప్పుడు లబోదిబో అంటున్నారు. బిఎస్ఈలో 9 శాతం పడిపోయి రూ.114.00కు పడిపోతుంది. ఈ కంపెనీ స్టాక్ ధర 52 వారాల గరిష్టం నుంచి 30 శాతానికి పైగా దిగజారింది. గత ఏడాది జీవనకాల గరిష్ట స్థాయి రూ.160.30కి చేరిన షేర్ ధర, నిన్న(జనవరి 23) అత్యంత కనిష్ట స్థాయి రూ.114కి పడిపోయింది. కేవలం ఈ ఏడాదిలోనే ఈ కంపెనీ షేర్ ధర 20 శాతానికి పైగా పడిపోవడం విశేషం. "జొమాటో కంపెనీ అనేక విధాలుగా స్విగ్గీ నుంచి కఠినమైన పోటీని ఎదుర్కొంటోంది. ప్రధానంగా మెట్రో నగరాల్లోని రెస్టారెంట్ నెట్ వర్క్, స్విగ్గీ నుంచి ఈ పోటీ ఉంది" అని వైస్ ప్రెసిడెంట్ & రీసెర్చ్ ఆఫ్ షేర్ ఇండియా డాక్టర్ రవి సింగ్ తెలిపారు. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లోనే సుమారు రూ.10 వేల కోట్లకు నష్టపోయినట్లు తెలుస్తుంది. అలాగే, కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్క్ కూడా రూ.1 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోకు సెప్టెంబర్ క్వార్టర్లో నష్టాలు మరింత తీవ్రమయ్యాయి. రూ.435 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నష్టాలు రూ.230 కోట్లుగానే ఉన్నాయి. ఆదాయం రూ.426 కోట్ల నుంచి రూ.1,024 కోట్లకు పెరిగింది. తన నిర్వహణలోని ఫిస్టో కంపెనీని క్యూర్ఫిట్కు 50 మిలియన్ డాలర్లకు విక్రయించనున్నట్టు ప్రకటించింది. (చదవండి: బుక్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ ప్రచారం.. టయోటా క్లారిటీ!)