భారతీయ రైల్వే ఆధీనంలోని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) జాక్‌పాట్ కొట్టింది. స్టాక్ మార్కెట్‌లో ఆ సంస్థ షేర్లు గురువారం (ఆగస్ట్ 3) నాడు 12 శాతం పెరిగి 52 వారాల కొత్త గరిష్ట స్థాయి రూ.44.65కి చేరుకున్నాయి.
ఐఆర్‌ఎఫ్‌సీ షేర్ల ధర భారీగా పెరగడానికి కారణం వెంటనే స్పష్టంగా తెలియనప్పటికీ, రూ.5.25 లక్షల కోట్ల పెట్టుబడికి రైల్వే శాఖ ప్లాన్ చేసిందని, దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదానికి ప్రయత్నిస్తున్నట్లు వారం రోజుల కిందట కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నాయి.
2024 నుంచి 2031 ఆర్థిక సంవత్సరాల కాలంలో దేశంలోని రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఈ పెట్టుబడి ఉద్దేశించినట్లు తెలుస్తోంది. ఇన్‌క్రెడ్ ఈక్విటిస్ గౌరవ్ బిస్సా ఈ స్టాక్‌పై రూ.45 ధర లక్ష్యంతో కొనుగోలు కాల్ జారీ చేయడంతో స్టాక్ కూడా ఊపందుకుంది.
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ. క్యాపిటల్ మార్కెట్‌లు, ఇతర రుణాల ద్వారా ఆర్థిక వనరులను సేకరిస్తుంది. దీనిపై రైల్వే శాఖ పరిపాలనా నియంత్రణను కలిగి ఉంది. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment