
భారతీయ రైల్వే జనరల్ టికెట్ తీసుకొని ప్రయాణించేవారికి సంబంధించి నిబంధనలను సవరించాలని యోచిస్తోంది. రైల్వేశాఖ అమలు చేయలని చూస్తున్న ప్రతిపాదిత నిర్ణయం వల్ల కోట్లాది మంది రోజువారీ ప్రయాణికులపై ప్రభావం పడనుంది. కొత్త నిబంధనల వల్ల రైళ్లలో రద్దీ తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
ప్రతిపాదిత సవరణలు ఇలా..
నిర్దిష్ట సాధారణ టిక్కెట్లు కొనుగోలు చేసినవారు ప్రస్తుతం జనరల్ కేటగిరీలో ఏ రైలు అయినా ఎక్కవచ్చు. కానీ ఇకపై ఈ నియమాన్ని మార్చాలని చూస్తున్నారు. కొత్త విధానంలో భాగంగా టికెట్‌పై రైలు పేరు ప్రింట్ చేయాలనే ప్రతిపాదనలున్నాయి. ఇది ప్రయాణికులు విభిన్న రైళ్లలో మారకుండా పరిమితం చేస్తుంది. నిర్దిష్ట రైళ్లలో రద్దీని నివారించడం, మెరుగైన నిర్వహణ కోసం ఈ మార్పు అవసరమని భావిస్తున్నారు.
జనరల్ టికెట్ వాలిడిటీ.. సాధారణ టికెట్ కొనుగోలు చేసినప్పటి నుంచి మూడు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందని చాలా మంది ప్రయాణికులకు తెలియదు. ఈ గడువులోగా ప్రయాణం చేయకపోతే టికెట్ చెల్లదు. ఈ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.
మార్పు ఎందుకు అవసరం?
రద్దీని నివారించడానికి ఈ మార్పులు ఎంతో అవసరమని అధికారులు భావిస్తున్నారు. రద్దీగా ఉండే జనరల్ కంపార్ట్‌మెంట్లలో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. రద్దీ కారణంగా గాయాలపాలవుతున్నారు. సాధారణ టికెట్లపై రైలు పేర్లను కేటాయించడంతో ప్రయాణికులను నియంత్రించవచ్చని అధికారులు చెబుతున్నారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ కారణంగా జరిగిన తోపులాటలో గతంలో 18 మంది మరణించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నియమాలు సవరించాలని అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: ట్రంప్‌ను కలిసిన యాపిల్ సీఈఓ
ప్రయాణికులపై ప్రభావం ఇలా..
ప్రయాణికులకు వారు ఏ రైలులో ప్రయాణించాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. కొత్త విధానం ద్వారా వివిధ రైళ్లలో ప్రయాణికుల రద్దీను నియంత్రించవచ్చు. తొక్కిసలాటలు, ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది. ఈ విధానం వల్ల లాభాలతోపాటు నష్టాలూ ఉంటాయని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణికులు ఏ రైలులో అయినా ప్రయాణించవచ్చు. కానీ కొత్తగా మార్పులు చేస్తే వారికి కేటాయించిన రైలులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు తనకు కేటాయించిన రైలు మిస్ అయితే కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment