‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు.. | Mehul Choksi arrested in Belgium extradition request from India | Sakshi
Sakshi News home page

‘ఉన్నతాధికారులతో బేరసారాలు’.. వదలని పోలీసులు..

Published Tue, Apr 15 2025 12:35 PM | Last Updated on Tue, Apr 15 2025 1:27 PM

Mehul Choksi arrested in Belgium extradition request from India

త్వరలో భారత్‌కు మెహుల్‌ ఛోక్సీ

భారత సీబీఐ అధికారుల కోరిక మేరకు ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. రూ.13,500 కోట్ల పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మోసం కేసులో మెహుల్‌పై అభియోగాలున్నాయి. దాంతో అతడిని అప్పగించాలని భారత్‌ కోరింది. ఈ నేపథ్యంలోనే తనను అరెస్ట్‌ చేసినట్టు తెలిసింది. ఛోక్సీని తర్వలోనే భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు గతంలో విశ్వప్రయత్నాలు చేసినట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ఈమేరకు భారత్‌లోని ఉన్నతాధికారులకు లంచాలు కూడా ఇచ్చినట్లు గతంలో ఆరోపణలున్నాయి.

ఛోక్సీ లంచాల భాగోతంపై ప్రముఖ రిపోర్టర​్‌ కెన్నెత్‌ రిజోక్‌ తన బ్లాగ్‌ (rijock.blogspot)లో గతంలో ఓ ఆర్టికల్‌ను పోస్ట్‌ చేశారు. ఆ న్యూస్‌ ఆర్టికల్‌లో అప్పట్లో కరేబియన్‌ దేశమైన ఆంటిగ్వాలో ఉంటున్న ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేలా ఉన్నతాధికారులకు లంచాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ఇక్కడ (ఆంటిగ్వాలో) అతనిని అదుపులోకి తీసుకొని భారత్‌కు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్న ఇంటర్‌పోల్ ప్రయత్నాలకు స్థానిక అధికారులు అడ్డుపడుతున్నారని చెప్పారు. అంతేకాదు న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా ఆంటిగ్వా ప్రభుత్వ పెద్దలతో పాటు సీనియర్‌ పోలీస్‌ అధికారి ఆడోనిస్‌ హెన్రీ వంటి అధికారులకు లంచాలు ఇవ్వడం ద్వారా తన అప్పగింతను ఆలస్యం చేస్తున్నట్లు తేల్చారు.  

ఆంటిగ్వాలో వ్యాపారం

భారత్‌లో బ్యాంకుల్ని కొల్లగొట్టిన ఛోక్సీ ఆంటిగ్వాలో పెద్ద ఎత్తున రెస్టారెంట్‌ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. ఆయనకు సొంతమైన జోలీ హార్బర్‌ రెస్టారెంట్‌లో పోలీసు ఉన్నతాధికారి హెన్రీని పలు మార్లు కలిసినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఛీక్సీ హెన్రీని కలవడం మాత్రమే కాదని, లంచం ఇచ్చి న్యాయ విచారణ ఆలస్యంగా జరిగేలా  మేజిస్ట్రేట్ కాన్లిఫ్ క్లార్క్‌ని సైతం ప్రభావితం చేశారని హైలెట్‌ చేశారు. క్లార్క్‌,హెన్రీలు కుట్రపన్ని ఇంటర్‌ పోల్‌ అధికారులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారని, అందుకు తగిన సాక్ష్యాదారాలు తన వద్ద ఉన్నాయని గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి: ఏఐ థెరపిస్టు!

కిడ్నాప్‌ డ్రామా.. విఫలం

అంటిగ్వా నుంచి క్యూబాకు పారిపోవడానికి ఛోక్సీ కిడ్నాప్‌ డ్రామా ఆడి అందులో విఫలమైనట్లు రిజోక్‌ ఆ కథనంలో వివరించారు. 2021లో క్యూబా - భారత్‌ల మధ్య నేరస్థుల అప్పగింత ఒప్పందం లేనందున విచారణ నుంచి తప్పించుకునేందుకు క్యూబా పారిపోవాలని ఛోక్సీ భావించాడని నివేదికలో పేర్కొన్నాడు. మే 2021లో స్మగ్లర్ల సాయంతో పారిపోయే ప్రయత‍్నంలో ఛోక్సీ వారికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వలేదని, అందుకే వాళ్లు డొమినికాలో వదిలేశారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement