
ఓ వైపు అమెరికా.. మరోవైపు చైనా.. నువ్వా నేనా అన్నట్లుగా సుంకాలను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ విషయం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు, రెండు దేశాలు ప్రవర్తిస్తున్నాయి. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో.. చైనా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అమెరికాపై విధిస్తున్న సుంకాలను 125 శాతానికి పెంచింది.
అమెరికా విధిస్తున్న సుంకాల భారీ నుంచి తప్పించుకోవడం ఎలా అని చాలామంది తలలు పట్టుకుంటున్నారు. దీనికి ఓ మార్గం కూడా ఉంది. సుంకాల భారీ నుంచి తప్పించుకోవాలంటే.. ఇక స్మగ్లింగ్ చేయాలేమో అనే మీకు రావొచ్చు. అలాంటి సాహసాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎలా తప్పించుకోవాలో క్లారిటీగా వెల్లడించే ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
చైనా వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తే 145 శాతం సుంకాలను కట్టాల్సి ఉంటుంది. ఎగుమతి అంటేనే భారీ మొత్తం. కానీ చైనాలో వస్తువు కొని మనవెంట అమెరికాకు తెచ్చుకుంటే.. దానికి ప్రత్యేకంగా టారిఫ్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్
ఉదాహరణకు ఒక అమెరికన్.. చైనాలో పర్యటించేటప్పుడు తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వాటిని తనతో పాటు అతని దేశానికి కూడా తీసుకెళ్లవచ్చు. ఇది పూర్తిగా లీగల్.. పర్సనల్ షాపింగ్ సర్వీస్ కిందికి వస్తుంది. అయితే ఎన్ని వస్తువులు కొనాలి?, ఎన్ని వస్తువులను తనతో పాటు తీసుకెళ్లవచ్చు అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని పాటిస్తే.. మీపై టారిఫ్స్ ప్రభావం ఉండదు. ఇది ఒక్క అమెరికన్ ప్రజలకు మాత్రమే కాదు.. ఈ ఫార్ములాతో మీరు ఏ దేశీయులైన.. ఇతర దేశాల్లో వస్తువులను సుంకాలతో పనిలేకుండా హ్యాపీగా కొనేయొచ్చు.
China is now providing tariff advice. 🤣 pic.twitter.com/esNxGshMe6
— James Wood 武杰士 (@commiepommie) April 13, 2025