USA
-
అమెరికాలో తెలుగు విద్యార్థిని మృతి
-
విమానం హైజాక్‌కు యత్నం.. నిందితుడ్ని కాల్చి చంపిన తోటి ప్రయాణికుడు
బెల్మోపాన్: అమెరికా ఈశాన్య తీర దేశమైన బెలిజ్‌లో విమానం హైజాక్ (Hijack Plane) కలకలం రేపింది. గురువారం (స్థానిక సమయం) బెలిజ్‌లో ఓ అమెరికన్ పౌరుడు గాల్లో ఉండగా ఓ చిన్న ట్రాఫిక్ ఎయిర్ విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనలో నిందితుడు తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత నిందితుణ్ని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. బెలిజ్ పోలీస్ కమిషనర్ చెస్టర్ విలియమ్స్ ప్రకారం..49ఏళ్ల అమెరికా పౌరుడు అకిన్యేలా సావా టేలర్ (Akinyela Sawa Taylor) గాలిలో ఉండగా శాన్ పెడ్రోకు వెళ్తున్న విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులపై కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన తోటి ప్రయాణికుడు గన్నుతో నిందితుణ్ని కాల్చి చంపారు. ఈ సందర్భంగా టేలర్‌ను కాల్చి చంపిన ప్రయాణీకుడిని హీరో అంటూ కమిషనర్ విలియమ్స్ ప్రశంసించారు.కాగా,టేలర్ విమానంలోకి కత్తిని ఎలా తీసుకురాగలిగాడో అస్పష్టంగా ఉందని అధికారులు తెలిపారు.ఈ సంఘటనపై జరుగుతున్న దర్యాప్తులో సహాయం కోసం బెలిజియన్ అధికారులు అమెరికా రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. -
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
మెలోనీతో భేటీ.. సుంకాలపై మెత్తబడ్డ ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో కాస్త మెత్తబడ్డారు. సుంకాలపై పలు దేశాలు అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అమెరికా అధినేతతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఆయన సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈయూ దేశాలపై అమెరికా 20 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దాని అమలును 90 రోజులపాటు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిణామాల నడుమ.. ట్రంప్‌ను కలిసిన తొలి యూరప్ దేశపు నేత మెలోనీనే కావడం గమనార్హం. ఐరోపా సమాఖ్య(European Union)తో పాటు ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందం అంశంపై వీరు చర్చలు జరిపారు. అయితే ఈయూతో సుంకాలపై ఒప్పందం నూటికి నూరు శాతం కుదురుతుందని ట్రంప్ భరోసా ఇచ్చారు. ఈ డీల్ విషయంలో మాత్రం తాను తొందర పడటం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రతీ ఒక్కరూ అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఒకవేళ అలా వాళ్లు అనుకోకుంటే గనుక మేమే వాళ్లతో ఒప్పందానికి దిగి వస్తాం అంటూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఇక.. మరోవైపు ఈ భేటీలో మెలోనీని ట్రంప్ ఆకాశానికెత్తారు. ఆమె ఓ అద్భుతమైన నేత అంటూ పొగడ్తలు గుప్పించారు. మరోవైపు.. పశ్చిమాన్ని గొప్పగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, కలిసికట్టుగా ఆ పని చేయగలమని అనుకుంటున్నా’ అని ఓవల్ ఆఫీసులో రిపోర్టర్లతో మెలోనీ మాట్లాడారు. ట్రంప్‌ను రోమ్ను ఆహ్వానించిన మెలోనీ.. అక్కడ ఈయూ దేశాల ప్రతినిధులతో సుంకాల అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. Rendiamo l’Occidente di nuovo grande - Make the West Great Again pic.twitter.com/Z499ZRGx85— Giorgia Meloni (@GiorgiaMeloni) April 17, 2025 -
అమెరికా టారిఫ్‌లతో డిఫాల్ట్ రిస్కులు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల వల్ల రుణాలకు సంబంధించిన పరిస్థితులు మరింతగా దిగజారవచ్చని, తక్కువ రేటింగ్, స్పెక్యులేటివ్ రేటింగ్ ఉన్న కార్పొరేట్లు డిఫాల్ట్ అయ్యే రిస్కులు పెరగవచ్చని మూడీస్ రేటింగ్స్ వెల్లడించింది. గ్లోబల్ వృద్ధి నెమ్మదించి, మాంద్యం వచ్చే అవకాశాలు పెరగవచ్చని ఓ నివేదికలో వివరించింది.‘ఫైనాన్షియల్ మార్కెట్లను టారిఫ్‌లు షాక్‌కు గురిచేశాయి. దీంతో అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం వచ్చే రిస్కులు పెరుగుతున్నాయి. అనిశ్చితి కొనసాగడం వల్ల వ్యాపార ప్రణాళికలకు అవరోధంగా మారుతుంది. పెట్టుబడులు నిల్చిపోతాయి. వినియోగదారుల విశ్వాసం సన్నగిల్లుతుంది‘ అని మూడీస్ రేటింగ్స్ తెలిపింది.టారిఫ్‌ల అమలుకు తాత్కాలికంగా విరామం ఇవ్వడం వల్ల వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తి, కొనుగోళ్లను సర్దుబాటు చేసుకోవడానికి కాస్త సమయం లభించినప్పటికీ, 90 రోజుల తర్వాత టారిఫ్‌ల పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో వ్యాపార ప్రణాళికలకు సమస్యలు తలెత్తవచ్చని వివరించింది. గత నెల రోజులుగా రుణ సంబంధ పరిస్థితులు (రుణాల లభ్యత, వడ్డీ రేట్లు, రుణ గ్రహీతలు చెల్లించే సామర్థ్యాలు మొదలైనవి) గణనీయంగా దిగజారినట్లు మూడీస్ రేటింగ్స్ వివరించింది. అమెరికా జీడీపీపైనా ప్రభావం.. ఇక అమెరికా ఎకానమీ మీద కూడా టారిఫ్‌ల ప్రభావం ఉంటుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది. అగ్రరాజ్యం జీడీపీ వృద్ధి కనీసం ఒక పర్సెంటేజీ పాయింట్ మేర తగ్గొచ్చని, అమెరికన్ వినియోగదారులు.. వ్యాపార సంస్థలకు ధరలు గణనీయంగా పెరిగిపోవచ్చని మూడీస్ తెలిపింది. టారిఫ్‌ల భారాన్ని నెమ్మదిగా బదలాయించినా, అంతిమంగా దాన్ని మోయాల్సింది అమెరికన్ వినియోగదారులేనని తెలిపింది.సుంకాల వల్ల కొనుగోలు శక్తి తగ్గుతుందని, పలు సంస్థల లాభాల మార్జిన్లు పడిపోతాయని వివరించింది. అటు చైనా విషయానికొస్తే వాణిజ్య యుద్ధంపరమైన ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకానమీ మందగమనం వల్ల ఎగుమతుల రంగంతో పాటు మొత్తం ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొనాల్సి వస్తుందని మూడీస్ రేటింగ్స్ పేర్కొంది.ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పట్టినా అమెరికా–చైనా సంబంధాలు వివాదాస్పదంగానే కొనసాగవచ్చని, దీనితో వ్యాపారవర్గాలు.. వినియోగదారుల సెంటిమెంటుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వివరించింది. ఫలితంగా దేశీయంగా వినియోగాన్ని పెంచేందుకు, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలు ఏర్పడొచ్చని తెలిపింది. -
FSU: అమెరికా యూనివర్సిటీలో కాల్పులు.. ఇద్దరి మృతి
సాక్రమెంటో: అగ్రరాజ్యం మరోసారి కాల్పుల ఘటనతో ఉలిక్కి పడింది. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ(Florida state University)లో ఓ సాయుధుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాల్పులకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది.తొలుత.. తల్లహస్సి క్యాంపస్‌లోని స్టూడెంట్ యూనియన్‌లో యాక్టివ్ షూటర్ ఉన్నట్లు తొలుత సమాచారం రావడంతో యూనివర్సిటీ వెంటనే అలర్ట్ జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది వెంటనే యూనివర్సిటీని వీడాలని, సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని హెచ్చరించింది. అనంతరం పోలీసులు, ఇతర ఏజెన్సీలు కాల్పులు చోటుచేసుకున్న ప్రాంతానికి వచ్చి సహాయ చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో క్యాంపస్ లాక్డౌన్(Lock Down)లోకి వెళ్లింది. ఈ రోజు జరగాల్సిన క్లాస్‌లు, స్పోర్ట్స్ ఈవెంట్స్, ఇతర కార్యక్రమాలను రద్దు చేశారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తల్లహస్సి మెమోరియల్ హెల్త్‌కేర్ ప్రతినిధి తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు ఈ విషయాన్ని అధికారులు చేరవేశారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదొక భయంకర సంఘటన అని ట్రంప్ పేర్కొన్నారు. ఓ యువకుడు తుపాకీతో కాల్పులు జరుపుతున్నట్లుగా ఫుటేజీ ఒకటి వెలుగులోకి వచ్చింది. నిందితుడు యూనివర్సిటీ విద్యార్థిగానే తెలియగా.. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. మరోవైపు.. ఐదుగురు మృతి చెందినట్లు కథనాలు వెలువడుతున్నప్పటికీ అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది. #Shooting at American universityMedia report that over 30 shots were fired on the campus of #Florida State #University.At least 5 people were killed and 4 others injured in the incident. pic.twitter.com/49nBiC6SLv— Tamadon News - English (@TamadonTV_EN) April 18, 2025 -
వచ్చే వారం అమెరికాకు రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వచ్చే వారం అమెరికాకు వెళ్లనున్నారు. పర్యటన సందర్భంగా రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపక సిబ్బందితో జరిగే ముఖాముఖిలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ మీడియా పబ్లిసిటీ విభాగం చీఫ్ పవన్ ఖేరా గురువారం ఈ విషయం తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుందన్నారు. అదేవిధంగా, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆఫీసు బేరర్లు, సభ్యులతో సమావేశమవుతారు. -
ఇంటర్వ్యూ స్లాట్లు అదృశ్యం
న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలని కలలుగంటున్న భారతీ య విద్యార్థులకు మరిన్ని షాక్‌లు తగులుతున్నాయి. అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ స్లాట్లు ఆన్లైన్ నుంచి హఠాత్తుగా అదృశ్యమైపోతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. గత 20–25 రోజుల నుంచి వీసా అపాయింట్మెంట్ స్లాట్లు దొరకడం గగనంగా మారిందని అంటున్నారు. ఇండియా నుంచి అమెరికా వెళ్లడానికి వేలాది మంది విద్యార్థులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు అమెరికా విద్యా సంస్థల్లో అడ్మిషన్ల సీజన్ డెడ్‌లైన్‌కు గడువు ముంచుకొస్తోంది. నిర్దేశిత గడువులోగా వీసాలు దొరక్కపోతే అడ్మిషన్‌పై ప్రభావం పడనుంది. అమెరికా వీసా కావాలంటే ఇండియాలోని యూఎస్ ఎంబసీలు లేదా కాన్సులేట్లలో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూల కోసం ముందుగానే ఆన్లైన్లో నగదు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. ఏప్రిల్ నెలకు సంబంధించిన స్లాట్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. మే, జూన్‌కు సంబంధించిన స్లాట్లు అందుబాటులో లేవని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఆన్లైన్లో కనిపించడం లేదని చెబుతున్నారు. కారణం ఏమిటో తెలియక అయోమయానికి గురవుతున్నారు. వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ స్లాట్ల కోసం నిత్యం వందలాది మంది ప్రయత్నిస్తున్నారు. కానీ, నిరాశే ఎదురవుతోంది. అమెరికా ఎంబసీ వీసా స్లాట్ల వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తోందని, అందుకే ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీసా స్లాట్ల వ్యవస్థను ఎవరూ దుర్వినియోగం చేయకుండా, అనధికారిక వ్యక్తులు ఇందులోకి ప్రవేశించకుండా పటిష్టమైన చర్యలు చేపడుతోందని తెలిపారు. త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కానీ, దీనిపై అమెరికా ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం పట్ల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు వీసాలు దొరకడం కష్టం కావడంతో అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు వాయిదా వేసుకోవాలని కొందరు విద్యార్థులు భావిస్తున్నట్లు తెలిసింది.భారతీయ విద్యార్థులకు సహకరిస్తాం: రణధీర్ జైశ్వాల్ అమెరికాలో భారతీయుల వీసాలు హఠాత్తుగా రద్దు చేస్తుండడం, భారతీయ పర్యాటకులను అడ్డుకోవడం, హెచ్–1బీ వీసా ఉన్నవారికి ప్రవేశం నిరాకరిస్తుండడం వంటి సమస్యలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ గురువారం స్పందించారు. ఎఫ్–1 వీసాలను రద్దు చేస్తున్నామంటూ భారతీయ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం నుంచి సమాచారం వస్తున్నట్లు తమకు తెలిసిందని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అసవరం లేదని, తగిన సహకారం అందిస్తామని చెప్పారు. అమెరికాలోని భారతీయ ఎంబీసీలు, కాన్సులేట్లు మన విద్యార్థులకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. -
నరుడా.. ఓ నరుడా.. డోనరుడా..!
ఎలాన్ మస్క్.. ఈ పేరు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు అధిపతి. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఆవిష్కరణ వేత్తగా కూడా పేరు సంపాదించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు మస్క్. అయితే తన వారసత్వం తనతో ఆగిపోకూడదనే తపన కూడా ఆయనలో ఎక్కువగానే ఉంది. ప్రపంచానికి తనలాంటి మేధావులు మళ్లీ మళ్లీ పరిచయం కావాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా ఆయనకు ఎప్పుడో వచ్చిందట. దీనిలో భాగంగా తన తర్వాత తరాన్ని తయారు చేసే పనిలో పడ్డారట ఎలాన్ మస్క్. ప్రపంచ జనాభా పెంచే పనిలో మస్క్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్యాబినెట్ లో కీలక పదవిలో ఉన్న ఎలాన్ మస్క్.. తన వీర్యాన్ని దానం చేసే పనిలో ఉన్నారని తాజా కథనాల సారాంశం. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ తన కాస్ట్ కటింగ్ లతో ప్రపంచానికి నిద్రపట్టనివ్వకుండా చేస్తుంటే.. మస్క్ మాత్రం తన వీర్యాన్ని పంచి ప్రపంచ జనాభాను పెంచే పనిలో ఉన్నారట. దీనికి సంబంధించి అమెరికన్ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. మస్క్ కు బాగా తెలిసిన వాళ్లకు ఈ ఆఫర్ చేస్తూ ఉంటాడని, ఒకవేళ తెలియక పోయినా వారితో పరిచయం పెంచుకుని మరీ వారికి దగ్గరవుతూ ఉంటాడట. మేధావి వర్గం అనేది తర్వాత తరాలకు కూడా అందుబాటులో ఉండాలనే పదునైన సంకల్పంతో ఉన్న మస్క్ దీనికి పూనుకున్నట్లు పేర్కొంది. ’ఎక్స్’లో మహిళలకు దగ్గరవుతూ వారిని పిల్లల్ని కనమని ఆఫర్లు ఇస్తున్నాడని స్పష్టం చేసింది. ఇలా మస్క్ పిల్లల సంఖ్య పెరుగుతూ పోతూ ఉందని తెలిపింది. జనాభా సమతుల్యతను కాపాడే పనిలో..ఇప్పటికే 14 మంది పిల్లలకు తండ్రిగా ఉన్న ఎలాన్ మస్క్.. తన వారసత్వ సంపదగా ఒక దండునే తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నాడని డబ్యూఎస్జే తెలిపింది. తగ్గిపోతున్న జనన రేట్ల మానవ నాగరికతను అస్తిత్వంలో పడేస్తాయని మస్క్ బలంగా నమ్ముతున్నాడని, ఇది కూడా తన వీర్యాన్ని దానం చేస్తూ జనాభా సమతుల్యతను కాపాడుకునే క్రమంలో సాధ్యమైనంత మేర తన వంతు ప్రయత్నం చేస్తున్నాడనేది ఆ కథనం సారాంశం. ఇప్పటికే ఎంతోమంది మహిళలకు తన వీర్యాన్ని డోనర్ రూపంలో దానం చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి వ్యవహారాలపై సీక్రెట్ ఒప్పందాలు మస్క్ చేసుకున్నట్లు ప్రచురించింది. జపనీస్ మహిళను ఇలా కలిసి..?క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లూయెన్సర్ అయిన జపాన్ మహిళ టిఫనీ ఫాంగ్ కు కూడా మస్క్ నేరుగా మెస్సేజ్ చేసి తన బిడ్డ (వీర్యం దానం చేయడం ద్వారా) కావాలా అని అడిగినట్టు డబ్యూఎస్ జే పేర్కొంది. ఇది జరిగి ఏడాది అవుతుందని, మస్క్ ఆమెను ఎక్స్ లో ఫాలో అవ్వడం మొదలైన తర్వాత ఈ ఆఫర్ ఇచ్చాడట. ఆమెను మస్క్ ఫాలో అవ్వడంతో టిఫనీ ఫాంగ్ కు ఫాలోవర్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగి రెండు వారాల్లోనే 21 వేల డాలర్లను సంపాదించినట్లు ఆ కథనంలోని మరొక విషయం. అయితే మస్క్ ఆఫర్ ను టిఫనీ ఫాంగ్ తిరస్కరించిందని, ఆమెకు అప్పటికే ఉన్న పిల్లల ఫోటోలను కూడా చూపించిందట.ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలుఇటీవల రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్.. మస్క్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డకు మస్క్ తండ్రి అంటూ సోషల్ మీడియాలో వేదికగా పోస్టు పెట్టారు. ఆమె పోస్టుపై మస్క్ సమాధానం ఇస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.ఆ చిన్నారికి తండ్రి మస్క్ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. తన బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తమ బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని, మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ కామెంట్స్ చేశారు.గతేడాది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. తనకు పుట్టిన పిల్లలను, మాజీ భాగస్వామ్యులు ఉండేందుందుకు 14 వేల 400 స్క్వేర్ ఫీట్ కాంపౌడ్ లో ఒక పెద్ద భవనాన్ని నిర్మించి వారు బాగోగులు చూస్తున్నట్లు కూడా పేర్కొంది. ఆ ఇంటిని నిర్మించడం కోసం సుమారు 300 కోట్ల రూపాయిలు అయినట్లు తెలిపింది. ఏం లేదు.. అంతా గాసిప్: మస్క్‌జపాన్ మహిళకు వీర్యం ఆఫర్ చేసినట్టు వచ్చిన కథనాల్ని మస్క్ కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని అంటున్నారు. డబ్యూఎస్జే వెబ్సైట్ అనేది ఒక గాసిప్ వెబ్ సైట్ అని, అందులో గాసిప్ తప్పితే ఏమీ ఉండదని అంటున్నారు. అయితే స్పెర్మ్ డోనర్ అనే అంశం చాలా సీక్రెట్‌గానే ఉంచుతారు. మరి అటవంటప్పుడు మస్క్ ఎవరికైనా వీర్యాన్ని దానం చేసినా దానిని బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉండదు. ఇటీవల కాలంలో తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ బహిరంగంగా పలువురు వ్యాఖ్యానించిన క్రమంలోనే ఈ వార్తను డబ్యూఎస్జే పరిశోధానాత్మక కోణంలో ప్రచురించినట్లు తెలుస్తోంది. -
భారత్‌లోకి వెల్లువలా చైనా ఉత్పత్తులు?
న్యూఢిల్లీ: అమెరికాలో టారిఫ్‌ల విధింపుతో చైనా ఉత్పత్తులు భారత్‌లోకి వెల్లువెత్తే అవకాశాలున్న నేపథ్యంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి అంతర్–మంత్రిత్వ శాఖల మానిటరింగ్ సెల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అటు అగ్రరాజ్యంపై చైనా ప్రతీకార టారిఫ్‌ల వల్ల అమెరికా వ్యవసాయోత్పత్తులు కూడా భారత్‌లోకి భారీగా వచ్చి పడే అవకాశాలు ఉన్నట్లు అంచనాలు నెలకొన్నాయి.ఈ నేపథ్యంలో దిగుమతుల్లో అసాధారణ ధోరణులేమైనా కనిపించిన పక్షంలో దేశీ పరిశ్రమల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా యాంటీ–డంపింగ్ సుంకాల్లాంటివి విధించవచ్చని వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్ సత్య శ్రీనివాస్ చెప్పారు. కమోడిటీలు, దేశాలవారీగా ట్రెండ్స్‌ను మానిటరింగ్ గ్రూప్ ప్రతి వారం సమీక్షిస్తున్నట్లు తెలిపారు.ఇందులో వాణిజ్య శాఖ, డీజీఎఫ్టీ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్), సీబీఐసీ (పరోక్ష పన్నులు, కస్టమ్స్ కేంద్రీయ బోర్డు), పరిశ్రమలు .. అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) మొదలైన విభాగాల నుంచి ప్రతినిధులు ఉన్నారు. -
ఎవరీ రేష్మా కేవల్రమణి..? ఏకైక భారత సంతతి మహిళగా టైమ్స్‌లో చోటు..
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. అందులో ఈసారి భారతీయులెవరకీ చోటు దక్కలేదు. కానీ భారత సంతతి మహిళగా అమెరికన్ బయోటక్ దిగ్గజం కేవల్ రమణి చోటు దక్కించుకుని ఆ లోటుని భర్తిచేశారని చెప్పొచ్చు. అమెరికన్ పౌరురాలే అయినా భారత మూలలున్న అమ్మాయే కేవల్ రమణి. ఆమె నేపథ్యం ఏంటీ..?ఎలా అత్యంత ప్రతిష్టాత్మకమైన టైమ్స్ జాబితాలో స్థానం దక్కించుకోగలిగింది అంటే..2020ల టైంలో ఇలానే రేష్మా కేవల్రమణి వార్తల్లో నిలిచారు. ఆ ఏడాది యునైటెడ్ స్టేట్స్లో ఒక ప్రధాన బయోటెక్ సంస్థకు నాయకత్వం వహించిన తొలి మహిళగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థ అయిన US-ఆధారిత వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో రేష్మ కేవల్రమణి. ఆమె ఈ ఏడాది టైమ్ మ్యగజైన్ వందమంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అంతేగాదు ఈ ఏడాది ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారత సంతతి వ్యక్తిగా నిలిచారామె. అలాగే ఆమె జన్యు వైద్యంలో సంచలనాత్మక ఆవిష్కరణలతో కంపెనీని ముందంజలో నిలిపింది. పైగా ఆమె నాయకత్వంలోనే వెర్టెక్స్ మొట్టమొదటి CRISPR-ఆధారిత చికిత్సకు FDA ఆమోదం పొంది గణనీయమైన పురోగతిని అందుకోవడం తోపాటు అందరి దృష్టిని ఆకర్షించింది. నిజానికి ఇది సికిల్ సెల్ వ్యాధికి విప్లవాత్మక చికిత్స. ఆ ఔషధం ఆ పరిస్థితికి ప్రధానమైన DNA ఉత్పరివర్తనలను సరిచేస్తుంది. టైమ్ ప్రోఫైల్ కూడా దీన్నే హైలెట్ చేస్తూ..ఆమెను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు ఇచ్చి.. మరీ గౌరవించింది. అలాగే జింగో బయోవర్క్స్ వ్యవస్థాపకుడు జాసన్ కెల్లీ..రేష్మా దూరదృష్టి విధానాన్ని కొనియాడారు. మన శరీరాలు డీఎన్ఏ భాషను మాట్లాడతాయి. రానున్నకాలంలో అత్యంత శక్తివంతమైనవి ఆ మందులేనని, అవి అదే భాషను తిరిగి మాట్లాడతాయని, పైగా మరిన్ని రుగ్మతలను నివారిస్తాయని అన్నారు కెల్లీ.రేష్మా విద్యా నేపథ్యం..ముంబైలో జన్మించిన రేష్మా 1988లో యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. అక్కడే ఆమె వైద్య వృత్తిని కొనసాగించింది. బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసింది. తదనంతరం మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో ఫెలోషిప్ పొందింది. ఆ తర్వాత 2015లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో జనరల్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసింది. ఆమె 2017లో వెర్టెక్స్‌లో చేరి త్వరితగతిన అంచెలంచెలుగా ఎదిగి.. 2018లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా, అక్కడ నుంచి రెండేళ్లకే సీఈవో స్థాయికి చేరుకున్న ప్రతిభావంతురాలామె.(చదవండి: World Hemophilia Day: చిన్న గాయమైన రక్తంధారగా పోతుందా..? తస్మాత్ జాగ్రత్త..!) -
ఉత్తరకొరియా మరో సంచలనం.. కిమ్ ప్లాన్‌తో ప్రపంచానికే హెచ్చరిక!
పాంగ్య్యాంగ్: ఉత్తరకొరియా తన శత్రు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిత్యం క్షిపణి పరీక్షలతో కవ్వించే కిమ్.. ఇప్పుడు అత్యాధునిక యుద్ధనౌకను తయారుచేసే పనిలో స్పీడ్ పెంచారు. మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు తీసిన చిత్రాల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉత్తర కొరియా నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.వివరాల ప్రకారం.. కిమ్ అధికారం చేపట్టాక సైనిక దళాలను అత్యంత వేగంగా ఆధునికీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా నౌకాదళం ఓ అతిపెద్ద నౌకను తయారుచేసే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆ యుద్ధ నౌకపై ఆయుధ, అంతర్గత వ్యవస్థలను నిర్మిస్తున్నారు. దీని పనులు ఆ దేశ ఉత్తర తీరంలో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు పసిగట్టాయి. ప్రస్తుతం ఆ దేశ నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉందని సమాచారం. దీని పొడవు సుమారు 140 మీటర్లుగా అంచనా వేశారు. దీని నిర్మాణానికి అవసరమైన టెక్నాలజీ మాస్కో నుంచి అంది ఉంటుందని దక్షిణ కొరియా నిపుణులు చెబుతున్నారు.***UPDATE***New warship revealed by #NorthKorea hints at VLS and phased array radars. #OSINT pic.twitter.com/2pzm01QcLr— H I Sutton (@CovertShores) December 29, 2024ఇదిలా ఉండగా.. అమెరికాకు చేరే స్థాయి ఖండాంతర క్షిపణులను ఇప్పటికే ఉత్తర కొరియా సమకూర్చుకొంది. ఈ ఆయుధాల తయారీకి అవసరమైన టెక్నాలజీ, పరికరాలను ఎవరూ ఉత్తరకొరియాకు విక్రయించకుండా ఐరాస ఆంక్షలు విధించింది. రష్యాతో మంచి సంబంధాలు ఉండటంతో ఆంక్షల ప్రభావం లేకుండా చూసుకొంది. మొత్తానికి ఈ భారీ నౌక నిర్మాణం ఉత్తర కొరియా సైనిక శక్తిని మెరుగుపరిచే మరో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. దీంతో, అమెరికా.. ఈ విషయంపై ఫోకస్ పెంచే అవకాశం ఉంది.🇰🇵🛳️ North Korea is building the largest warship in its arsenal, measuring 140 meters long, — CNN.❗️The missile frigate is said to have vertical launchers for missiles at air and ground targets. DPRK receiving military technology from Russia, as it is under strict sanctions. pic.twitter.com/ivEEVwmQAY— MAKS 24 🇺🇦👀 (@Maks_NAFO_FELLA) April 14, 2025 -
కెనడా వర్సిటీల వైపు అమెరికా విద్యార్థుల చూపు
అమెరికాలో విద్యార్థులు ఇప్పుడు కెనడా వైపు దృష్టి సారించారు. ట్రంప్ విధానాల నేపథ్యంలో కెనడియన్ విశ్వవిద్యాలయా లు అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేయ డం, యూనివర్సిటీ నిధులను తగ్గించడంవంటి చర్యల ఫలితంగా.. యూనివ ర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొ లంబియా (యూబీసీ), యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్శిటీ ఆఫ్ వాటర్లూ వంటి కెనడియన్ విశ్వవిద్యాలయాలకు అమెరికా విద్యార్థుల దరఖాస్తులు పెరిగాయి. వాంకోవర్‌లో ఉన్న యూబీసీ క్యాంపస్‌లో 2024తో పోలిస్తే మార్చి1 నాటికి యూఎస్ పౌరుల నుంచి గ్రాడ్యుయేషన్ దరఖాస్తుల్లో 27% పెరుగుదల నమోదైంది. ఈ సంస్థ కొన్ని ప్రోగ్రామ్స్ కోసం అడ్మిషన్లను ఈవారం కూ డా తిరిగి తెరిచింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్ 2025 నాటికి యూఎస్ విద్యార్థుల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని భావిస్తున్నారు. టొరంటో విశ్వవిద్యాలయానికి కూడా సాధారణం కంటే ఎక్కువ సంఖ్యలో యూఎస్ నుంచి దరఖాస్తులు వచ్చాయి. వాటర్లూ విశ్వవిద్యాలయంలో, సెపె్టంబర్ 2024 నుంచి యూఎస్ వెబ్ ట్రాఫిక్ 15% పెరిగింది. ఎక్కువ మంది అమెరికన్ విద్యార్థులు క్యాంపస్‌ను వ్యక్తిగతంగా సందర్శిస్తున్నారని కూడా నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకర్షణకు కారణాలు.. ట్రంప్ ప్రభుత్వం హఠాత్తుగా వీసాలను రద్దు చేయడం, విదేశీ విద్యార్థుల సోష ల్ మీడియా కార్యకలాపాలను పర్యవేక్షించడం, కాలేజీలకు ఫెడరల్ ఫండింగ్ తగ్గించడం ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ పలువురు విద్యార్థులు, కుటుంబాల్లో భవిష్యత్తుపై భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. స్టూడెంట్ వీసాలు, యూనివర్సిటీ ఫండింగ్పై అమెరికాలో నిరసనలు, దావాలు ఎదుర్కొంటున్న సమయంలో కెనడా విద్యకు మరింత స్థిరమైన, స్నేహపూర్వక గమ్యస్థానంగా కనిపిస్తోంది. అయితే ఇక్కడా కొన్ని పరిమితులున్నాయి. తమ దేశంలోకి ప్రవేశించే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై కెనడా ప్రభుత్వం కూడా పరిమితి విధించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ పెరిగిన క్యాంపస్ టూర్లు.. యూబీసీలో యూఎస నుంచి అండర్ గ్రాడ్యుయేయేషన్ అప్లికేషన్లు కేవలం 2% మాత్రమే పెరిగినా, అమెరి కన్–నిర్దేశిత క్యాంపస్ టూర్లు మాత్రం 20% పెరిగాయి. ఆసక్తి పెరుగుతోందని, ఎక్కువ మంది విద్యార్థులు కెనడియన్ విశ్వవిద్యాలయాలను వాస్తవ అవకాశంగా చూస్తున్నారని ఇది సూచిస్తుంది. తమ క్యాంపస్‌లకు అంతర్జాతీయ విద్యార్థులను పంపే మొదటి మూడు దేశాల్లో అమెరికా ఇప్పటికే ఒకటి అని యూబీసీ వార్షిక నివేదిక పేర్కొంది. ఇప్పటికే సుమారు 1,500 మంది యూఎస్ విద్యార్థులు యూబీసీలో గ్రాడ్యుయేషన్, అండర్‌గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. -
స్టైòపెండ్తో పాటు విమాన టికెట్
వాషింగ్టన్: అమెరికాలోని అక్రమ వలసదారుల పట్ల కఠిన వైఖరి ఆవలంబిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్తంత మెత్తబడ్డారు. ‘సెల్ఫ్–డిపోర్ట్’ఆప్షన్ ఎంచుకునే వలసదారులకు విమాన టికెట్లు కొనివ్వడంతోపాటు స్టైఫండ్‌గా కొంత డబ్బు కూడా అందజేయాలనే యోచన ఉన్నట్లు ట్రంప్ తెలిపారు. ఇది అన్ని దేశాల వలసదారులకూ వర్తిస్తుందన్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ విషయం వెల్లడించారు. ప్రస్తుతం హంతకులను మాత్రమే దేశం నుంచి పంపించివేస్తున్నామంటూనే ఆయన.. అక్రమంగా ఉంటున్న ఇతరులకు సాయప డేందుకు ‘సెల్ఫ్–డిపోర్టేషన్ ప్రోగ్రామ్’ను అమలు చేయనున్నామన్నారు. సొంత దేశాలకు వెళ్లాక వీరిలో సత్ప్రవర్తన కలిగి ఉన్న వారిని తిరిగి అమెరికాకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. అయితే, ఈ పథకాన్ని ఎప్పటి నుంచి వర్తింపజేస్తారు, ఇతర వివరాలను ఆయన వెల్లడించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ట్రంప్ జనవరిలో అధ్యక్ష బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులను నిర్బంధించి, వారిని బలవంతంగా సొంత దేశాలకు పంపిస్తున్న విషయం తెల్సిందే. ఇంటర్వ్యూ సందర్భంగా ఫాక్స్ న్యూస్ యాంకర్ రాచెల్ కంపోస్–డఫీ మెక్సికో వాసి వీడియో క్లిప్‌ను ప్రదర్శించారు. ‘నేను ట్రంప్‌కు ఓటేయలేదు. అయినప్పటికీ నా మద్దతు ట్రంప్‌కే. నేరాలకు పాల్పడిన వారిని, నాతో సహా ఎవరినైనా సరే సొంత దేశాలకు పంపించడంలో తప్పులేదు’అని ఆ వ్యక్తి తెలిపాడు. ఇరవయ్యేళ్ల క్రితం వచ్చిన ఈ వ్యక్తి ఇప్పుడు అమెరికా పౌరుడు..భార్య, పిల్లలు కూడా ఉన్నారని యాంకర్ డఫీ వివరించారు. ఇది చూసిన ట్రంప్..తమకు కావల్సింది ఇలాంటి వాళ్లేనన్నారు. అతడికి డిపోర్టేషన్ ముప్పు ఉన్నట్లు భావించడం లేదన్నారు. అవసరమైన సిబ్బందిని నియమించుకునే అవకాశం ఇవ్వడం ద్వారా హోటళ్లు, వ్యవసాయ క్షేత్రాల యజమానులకు సాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లు సొంత దేశాలకు వెళ్లిపోయి, తిరిగి చట్టబద్ధంగా అమెరికా రావాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ ఆయన వెల్లడించలేదు. -
చైనాపై సుంకాలు 245%
వాషింగ్టన్/బీజింగ్: ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం నానాటికీ భీకరంగా మారుతోంది. బోయింగ్ విమానాల డెలివరీపై నిషేధం విధించినందుకు చైనాపై అమెరికా ప్రభుత్వం వెంటనే ప్రతీకార చర్యలకు దిగారు. చైనా ఉత్పత్తులపై టారిఫ్‌లను ఏకంగా 245 శాతానికి పెంచుతున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఫ్యాక్టషీట్ విడుదల చేసింది. అరుదైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల కోసం విదేశాలపై విపరీతంగా ఆధారపడడం వల్లే తలెత్తే భద్రతాపరమైన ప్రమాదాలపై విచారణకు ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారని వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరోసారి అత్యున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ‘అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీ’ని మొదటి రోజే ప్రారంభించారని గుర్తుచేసింది. నూతన వాణిజ్య ఒప్పందాలు, సుంకాలపై 75కు పైగా దేశాలు అమెరికాతో చర్చలకు ముందుకొచ్చాయని పేర్కొంది. అందుకే ఆయా దేశాలపై సుంకాలను వాయిదా వేసినట్లు వెల్లడించింది. చైనాపై మాత్రం ప్రతీకార సుంకాలు కొనసాగుతాయని తేల్చిచెప్పింది. చైనా ఉత్పత్తులను ఇకపై అమెరికాలో విక్రయించాలంటే 245 శాతం సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ఫ్యాక్ట్‌షీట్‌లో స్పష్టంచేసింది. చైనా–అమెరికా మధ్య కొంతకాలంగా టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చైనా ఉత్ప త్తులపై అమెరికా ఇప్పటికే 145 శాతం టారిఫ్‌లు విధించింది. అమెరికా నుంచి బోయింగ్ విమానాల కొనుగోలుపై నిషేధం విధించిన మరుసటి రోజే టారిఫ్‌లను అదనంగా 100 శాతం పెంచడం గమనార్హం. బోయింగ్ విమానాలు కొనుగోలు చేయవద్దని చైనా నిర్ణయించడం పట్ల డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒప్పందం నుంచి మధ్యలో విరమించుకోవడం సరైంది కాదంటూ మంగళవారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రత్యర్థులతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో అమెరికా ప్రయోజనాలు కచ్చితంగా కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. టారిఫ్ వార్‌ను ముగించే విషయంలో చైనాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఆ అవసరం చైనాకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం బంతి చైనా కోర్టులోనే ఉందని వెల్లడించారు.చర్చల సంధానకర్తగా లీ చెంగాంగ్ నియామకం టారిఫ్ యుద్ధాన్ని విరమించే విషయంలో బంతి చైనా కోర్టులో ఉందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేసిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో చర్చలకు మొగ్గుచూపింది. చర్చల కోసం సంధానకర్తగా లీ చెంగాంగ్‌ను నియమించింది. వాంగ్ షౌవెన్ స్థానంలో లీ చెంగాంగ్‌ను నియమిస్తున్నట్ల చైనా వాణిజ్య శాఖ బుధవారం ప్రకటించింది. 2020లో అమెరికా, చైనా మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో చెంగాంగ్ పాల్గొన్నారు. ఆయన గతంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లో చైనా రాయబారిగా సేవలందించారు. -
హార్వర్డ్ ప్రతిఘటనా స్వరం!
అంతటా ఒక అనిశ్చితి, దాన్ని మించిన సందిగ్ధత అలముకున్నవేళ నిశ్చయంగా, నిర్భయంగా వినబడిన గొంతు ఇప్పుడు అమెరికాలో సర్వత్రా ప్రతిధ్వనిస్తోంది. ఆ గొంతు ప్రపంచంలోనే అత్యుత్తమశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటైన హార్వర్డ్ విశ్వవిద్యాలయానిది. ఆ విశ్వవిద్యాలయం ఇంతవరకూ లక్షలాది విద్యార్థులకు పాఠం చెప్పివుండొచ్చు. కానీ తనతో ఏకీభవించనివారిని ససేమిరా సహించని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వంటి నేతకు పాఠం నేర్పాలని చూస్తే భారీ మూల్యం చెల్లించాల్సివుంటుంది. అది తెలిసి కూడా హార్వర్డ్ దృఢంగా నిలబడటం ఈ కాలంలో అతి పెద్ద వార్త. పాలస్తీనా అనుకూల ఉద్యమకారుల్ని పట్టించి ఇవ్వాలనీ... వైవిధ్యత, సమానత, సమ్మిళిత (డీఈఐ) విధానాల ద్వారా ‘అందరికీ అవకాశాలిచ్చే’ పేరిట ప్రతిభపై వివక్ష ప్రదర్శిస్తున్న వైఖరి విడనాడాలనీ ట్రంప్ కొంతకాలంగా హెచ్చరిస్తున్నారు. ఒప్పుకోకుంటే నిధులు ఆపేస్తామని హుకుం జారీచేశారు. దేశంలోని 60 ప్రధాన విశ్వవిద్యాలయాల్లో చాలా భాగం ఆయన ఆదేశాలకు తలొంచాయి. కానీ హార్వర్డ్ నిర్భయంగా నిలబడింది. ‘మా వ్యవహారాల్లో మీకేం పన’ని ఎదురు ప్రశ్నించింది. వర్త మాన పరిస్థితుల్లో ఈ చర్య చిన్నదేం కాదు. మొన్న జనవరిలో అధికార పగ్గాలు చేపట్టింది మొదలు ట్రంప్ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. కోర్టులనే ధిక్కరిస్తున్నారు. అక్రమ వలసదారుగా పొర బడి, ఒక పౌరుడిని ఎల్‌సాల్వెడార్ జైలుకు పంపిన వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. పొరబడ్డా మని ఒప్పుకుంటూనే అతన్ని వెనక్కితేలేమని కోర్టులో ప్రభుత్వం మొండికేసింది. ఆరు నూరైనా తేవాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించగా మౌనమే జవాబైంది. మర్నాడు అమెరికా సందర్శించిన ఎల్‌సాల్వెడార్ అధ్యక్షుడు ‘అతన్ని అప్పగించేది లేద’ంటూ సాక్షాత్తూ వైట్‌హౌస్‌లో ప్రకటించారు.విశ్వవిద్యాలయాలు కళాశాలల కన్నా భిన్నమైనవి. అవి ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తాయి. కొత్త ఆలోచనల్ని స్వాగతిస్తాయి. భిన్న ధోరణులపై పరిశోధనకు అవకాశమిస్తాయి. అందుకే అవి జ్ఞానకేంద్రాలు. ఎంతమందికి పట్టాలు పంపిణీ చేశామన్నది కాక, ఎటువంటి విశిష్ట వ్యక్తులను సమాజానికి అందించగలిగామన్నది లెక్కేస్తాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా సర్కారు విశ్వ విద్యాలయ పరిశోధనలకూ, సృజనాత్మక ఆవిష్కరణలకూ భారీయెత్తున ఖర్చుచేసింది. ఫలితంగా అపారసంఖ్యలో ఆవిష్కరణలు సాధ్యమయ్యాయి. అనేక కొత్త ఉపకరణాలు అందుబాటులో కొచ్చాయి. చికిత్సకు లొంగని ఎన్నో వ్యాధులు చిత్తగించాయి. ఆయుఃప్రమాణం పెరిగింది. కంప్యూ టర్లు మొదలుకొని రోబోటిక్స్, కృత్రిమ మేధ వరకూ అన్నిటికన్నీ కేవలం ఈ పరిశోధనల పర్యవసానమే. లైబ్రరీలు, లేబొరేటరీలు దాటుకుని పరిశ్రమల్లో పురుడు పోసుకున్న ఉత్పత్తులు ఎన్నెన్నో! వాటివల్ల అసంఖ్యాకంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. పర్యవసానంగా ఇదంతా సమాజ ఆధునికతకు తోడ్పడింది. గత నెలలో విడుదలైన ఒక నివేదిక ప్రకారం జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్ఐహెచ్) నిరుడు పరిశోధనలకు వ్యయం చేసిన 3,690 కోట్ల డాలర్ల సొమ్ము 9,450 కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలకు తోడ్పడింది. సరుకుల తయారీ, పంపిణీ, వినియోగం, ఇతర అనుబంధ సర్వీసులు ఈ కార్యకలాపాల్లో భాగం. 4,08,000 ఉద్యోగాల కల్పన సాధ్యమైంది.కానీ ట్రంప్ సర్కారు దీన్ని అంగీకరించటం లేదు. అవి ఏం చేయాలో, చేయకూడదో నిర్దేశిస్తున్నారు. సాష్టాంగపడమంటున్నారు. అందుకు సిద్ధపడినా కనికరించటంలేదు. పేరుప్రఖ్యాతులున్న కొలంబియా విశ్వవిద్యాలయ దుఃస్థితే అందుకు ఉదాహరణ. ఆ క్యాంపస్‌లో కొంతకాలం క్రితం జరిగిన పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి, వారి అరెస్టుకు సహకరించాలనటంతో మొదలుపెట్టి ప్రభుత్వం అనేక డిమాండ్లు పెట్టింది. మూడు డజన్లమంది ‘ప్రత్యేక అధికారుల’ను తక్షణం నియమించడం అందులో ఒకటి. ఆ ప్రత్యేకాధికారులకు పాలస్తీనా అను కూల విద్యార్థులను గుర్తించి అవసరమైనప్పుడు అరెస్టుచేసే అధికారాలున్నాయి. విశ్వవిద్యాలయంలో ప్రాంతీయ అధ్యయనాల విభాగాన్ని పర్యవేక్షించే అధిపతిని నియమించాలన్న ప్రభుత్వ తాఖీ దును సైతం ఆమోదించింది. ఆ విభాగం సిలబస్‌ను నిశితంగా పరిశీలించి మార్పులు చేర్పులూ సూచిస్తుంది. ఇన్ని చేసినా ఆ విశ్వవిద్యాలయానికి విడుదల చేయాల్సిన 40 కోట్ల డాలర్ల నిధులనూ నిలిపివేసింది. విశ్వవిద్యాలయ తాత్కాలిక అధ్యక్షురాలు కత్రినా ఆర్మ్‌స్ట్రాంగ్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. తాను తీసుకుంటున్న చర్యలను నిరసించిన విశ్వ విద్యాలయ ఆచార్యులకు ఇవి చిన్న చిన్న సర్దుబాట్లు మాత్రమేనని కత్రినా వివరించారు. అయినా నిధుల విడుదల జాడ లేకపోవటంతో కొలంబియా యాజమాన్యం ఆమెకు ఉద్వాసన పలికింది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం సంగతికే వస్తే, తిరుగుబాటుకు తక్షణ మూల్యం 220 కోట్ల డాలర్ల గ్రాంటు, 6 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు నిలిచిపోవటం. ఇవిగాక పన్ను మినహాయింపులు కూడా ఆపేస్తామని సర్కారు బెదిరిస్తోంది. నిజానికి మొదటే ప్రధాన యూనివర్సిటీలన్నీ ప్రభుత్వ బెదిరింపులను ముక్తకంఠంతో నిరసించాల్సింది. కానీ ఇప్పటికి కూడా ఎవరికి వారు ట్రంప్ కంట్లో పడకుంటే చాలన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికీ చాలా సంస్థలు గోడమీది పిల్లివాటంగా ఉంటున్నాయి. విశ్వవిద్యాలయాలపై సర్కారువారి సంపూర్ణ పెత్తనాన్ని అంగీకరించాలన్నది ట్రంప్ ఆంతర్యం. యూదు వ్యతిరేకత, వివక్ష విధానాల అమలు వంటి ఆరోపణలన్నీ పైకి చెబుతున్న కారణాలు. దీన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అమెరికా విశ్వవిద్యాలయాలకు అంత మంచిది. ఇన్నాళ్లూ తాము బోధించిన విలువల కోసం నిలబడితేనే వాటి గౌరవమర్యాదలు కాస్తయినా నిలబడతాయి. -
రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు. -
అమెరికా ఇరాన్ మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు
-
అమెరికాకు ఊహించని షాక్ ఇచ్చిన చైనా
-
ట్రంప్‌కు కీలెరిగి వాత
అరుదైన ఖనిజాల ఎగుమతుల నిలిపివేత ద్వారా అమెరికాను చైనా నేరుగా కుంభస్థలంపైనే కొట్టిందని పరిశీలకులు అంటున్నారు. దీని ప్రభావం అమెరికా రక్షణ శాఖపై భారీగా ఉండనుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైటర్ జెట్లు తదితరాల తయారీని ఇది తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న మొత్తం అరుదైన ఖనిజాల్లో ఏకంగా 70 శాతం వాటా చైనాదే! అమెరికా వాటా 11.4 శాతం.కానీ దేశీయ, ముఖ్యంగా రక్షణ అవసరాలను తీర్చేందుకు ఆ నిల్వలు ఏ మూలకూ చాలవు. మలేసియా, జపాన్ సహా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నా అవి 30 శాతం అవసరాలనే తీర్చగలుగుతున్నాయి. దాంతో మరో దారిలేక అగ్ర రాజ్యం ఇంతకాలంగా చైనా దిగుమతులపైనే ప్రధానంగా ఆధారపడుతూ వస్తోంది. తన అరుదైన ఖనిజ అవసరాల్లో 70 శాతం అక్కడినుంచే దిగుమతి చేసుకుంటోంది. చైనా ఇప్పుడు సరిగ్గా గురి చూసి ఆ కీలకమైన సరఫరా లింకును మొత్తానికే తెగ్గొట్టింది.17 రకాల అరుదైన ఖనిజాల్లో సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం రూపంలో ప్రస్తుతానికి ఏడింటికి ఎగుమతుల నిషేధాన్ని వర్తింపజేసింది. వీటితో పాటు పలు కీలక లోహాలు, అయస్కాంత వస్తువులను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇకపై చైనా కంపెనీలు వీటిని ఎగుమతి చేయాలంటే ప్రత్యేక లైసెన్సులు తీసుకోవాల్సిందే. చైనా నిర్ణయం పలు అమెరికానే గాక చాలా దేశాలనూ ప్రభావితం చేయనుంది. ముఖ్యంగా యూరప్ దేశాలకైతే పిడుగుపాటే. వాటి అరుదైన ఖనిజాల అవసరాల్లో సగటున 46 శాతం దాకా చైనా దిగుమతులపైనే ఆధారపడుతున్నాయి.అనుమానమే నిజమైందిఅత్యంత కీలకమైన ఖనిజ అవసరాల కోసం చైనాపై ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమేనని అమెరికా రక్షణ శాఖ ముందునుంచీ మొత్తుకుంటూనే ఉంది. ఇది జాతీయ భద్రతకే ముప్పని 2024 మార్చి 11న అధ్యక్షునికి పంపిన ఓ నోట్లో స్పష్టంగా పేర్కొంది కూడా. ఈ విషయంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలావరకు చైనామీదే ఆధారపడాల్సి రావడంపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చింది. ఆ భయాలే ఇప్పుడు నిజమయ్యాయి. రక్షణ పాటవం పెంచుకోవడంలో అమెరికా, చైనా కొన్నేళ్లుగా నువ్వా, నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి.కీలక ఖనిజాలపై ఆంక్షలతో ఈ పోటీలో అగ్ర రాజ్యాన్ని దాటి చైనా దూసుకెళ్లేలా కన్పిస్తోంది. ఈ సమస్యను అధిగమించే మార్గాలపై అమెరికా రక్షణ శాఖ కొంతకాలంగా గట్టిగా దృష్టి సారించింది. దేశీయంగా అరుదైన ఖనిజాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇతోధికంగా పెంచుకునేలా ‘మైన్ టు మాగ్నెట్’ పేరిట ఐదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఆలోగా జరిగే అపార నష్టాన్ని భర్తీ చేసుకునే మార్గాంతరాలు కన్పించక ట్రంప్ సర్కారు తలపట్టుకుంటోంది.అన్నింట్లోనూ అవే కీలకంఫైటర్ జెట్లు మొదలుకుని కీలకమైన రక్షణ వ్యవస్థలన్నింట్లోనూ అరుదైన ఖనిజాలది కీలక పాత్ర. ఎఫ్–35 యుద్ధ విమానాలు, వర్జీనియా–కొలంబియా శ్రేణి జలాంతర్గాములు, తోమహాక్ క్షిపణులు, రాడార్ వ్యవస్థలు, ప్రిడేటర్ శ్రేణి మానవరహిత వైమానిక వాహనాలు, మ్యునిషన్ సిరీస్ స్మార్ట్ బాంబులు... ఇలా దేని తయారీకైనా అవి కావాల్సిందేనని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వివరించింది.⇒ ఒక ఎఫ్–35 యుద్ధ విమానం తయారీకి 900 పౌండ్ల (400 కిలోల) మేరకు అరుదైన ఖనిజాలు కావాలి.⇒ అర్లే బ్రూక్ శ్రేణి డీడీజీ–51 డిస్ట్రాయర్ యుద్ధనౌక తయారీకి ఏకంగా 5,200 పౌండ్లు (2,300 కిలోలు) అవసరం.⇒ అదే వర్జీనియా శ్రేణి జలాంతర్గామి నిర్మాణానికి 9,200 పౌండ్ల (4,173 కిలోల) అరుదైన ఖనిజాలు అవసరం.ఆందోళనకరమే⇒ ఖనిజాలపై చైనాతో చర్చిస్తాం ⇒ ట్రంప్ ఆర్థిక సలహాదారువాషింగ్టన్: అరుదైన ఖనిజాలు, కీలక లోహాలు, అయస్కాంత పదార్థాల ఎగుమతులను నిలిపేస్తూ చైనా తీసుకున్న నిర్ణయం అమెరికాను తీవ్ర ఆందోళనకు గురిచేసే అంశమేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక సలహాదారు కెవిన్ హసెట్ అంగీకరించారు. సోమవారం ఆయన వైట్‌హౌస్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఆ అరుదైన ఖనిజాల అవసరం రక్షణ, టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ తదితర రంగాలకు చాలా ఉంటుంది.చైనా నిర్ణయాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఈ విషయమై మాకు అందుబాటులో ఉన్న అన్ని ఇతర అవకాశాలనూ పరిశీలిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. బహుశా డ్రాగన్ దేశంతో తాము చర్చలు జరిపే అవకాశాలు లేకపోలేదన్నారు. చైనా నిర్ణయంతో పలు యూరప్ దేశాల్లో కూడా ఆటోమొబైల్స్, సెమీ కండక్టర్లు తదితర కంపెనీలు తీవ్రంగా ప్రభావితమవుతాయని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల అమెరికా ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుతుందన్న వాదనను హసెట్ తోసిపుచ్చారు. అమెరికా, చైనా మధ్య తీవ్రస్థాయి టారిఫ్‌ల పోరు సాగుతున్న విషయం తెలిసిందే. -
‘అమెరికా విమానాల్ని కొనుగోలు చేయొద్దు’.. జిన్‌పింగ్ ఆదేశాలు
బీజింగ్: అమెరికా-చైనాల మధ్య టారిఫ్ వార్ (China–United States trade war) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే చైనా పలు కీలక ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నిలిపివేసింది. ఆ దేశ ఉత్పత్తుల్ని కొనుగోలు చేయడం మానేసింది. తాజాగా అమెరికాలోని విమానాల తయారీ సంస్థ బోయింగ్‌కు (Boeing) చెందిన విమానాల్ని కొనుగోలు చేయొద్దని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) ఆ దేశ విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. బ్లూమ్‌బర్గ్ సైతం ఇదే విషయాన్ని ధృవీకరించింది.అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా మరియు చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. ఇప్పటికే అమెరికా, చైనా నుంచి దిగుమతులపై 145 శాతం వరకు టారిఫ్‌లు విధించింది. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 125 శాతం కస్టమ్స్ టారిఫ్‌లు విధించింది. ఈ తరుణంలో చైనా, దేశీయ విమానయాన సంస్థలు బోయింగ్ విమానాలను కొనుగోలు చేయకుండా ఆదేశించినట్టు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. అంతేకాకుండా, అమెరికా నుండి విమాన భాగాలు,ఉపకరణాల కొనుగోళ్లను కూడా నిలిపివేయాలని పేర్కొంది. అదే సమయంలో విమానాల లీజు తీసుకునే సంస్థలకు చైనా ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ట్రంప్ విధించిన టారిఫ్‌లు ప్రపంచ మార్కెట్లను గందరగోళంలోకి నెట్టేశాయి. మిత్రదేశాలు, ప్రత్యర్థులతో కూడిన సంబంధాలపై ప్రభావం చూపించాయి. గత వారం ట్రంప్, కొత్త టారిఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేశానని ప్రకటించినా, చైనాకు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. అమెరికా అధికారులు ఇటీవల స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు,సెమీకండక్టర్లు వంటి హైటెక్ ఉత్పత్తులపై టారిఫ్ మినహాయింపులు ప్రకటించారు.🚨🇺🇸🇨🇳China orders its airlines to halt any further deliveries of Boeing $BA jets as the Trade War with the U.S. heats up.$BA stock is down 3% in reaction to the news. pic.twitter.com/7xjCI0Heru— Jesse Cohen (@JesseCohenInv) April 15, 2025 -
డిస్కస్ త్రోలో కొత్త ప్రపంచ రికార్డు
రామోనా (అమెరికా): పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో క్రీడాంశంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. ఒక్లాహోమా త్రోస్ సిరీస్ వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ బ్రాంజ్ లెవెల్ మీట్లో లిథువేనియాకు చెందిన మికోలస్ అలెక్నా (Mykolas Alekna- 75.56 మీటర్లు) ఈ ఘనత సాధించాడు. స్వర్ణ పతకం గెలిచే క్రమంలో 22 ఏళ్ల అలెక్నా తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డును రెండుసార్లు తిరగ రాయడం విశేషం. గత ఏడాది ఇదే మీట్లో అలెక్నా డిస్క్‌ను 74.35 మీటర్ల దూరం విసిరి... 1986 నుంచి జుర్గెన్ షుల్ట్ (జర్మనీ; 74.08 మీటర్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మికోలస్ రజత పతకం గెలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఒక్లాహోమో మీట్లో అలెక్నా తొలి ప్రయత్నంలో డిస్క్‌ను 74.89 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డును సవరించాడు. ఆ తర్వాత ఐదో ప్రయత్నంలో డిస్క్‌ను 75.56 మీటర్ల దూరం విసిరి మరో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా డిస్క్‌ను 75 మీటర్ల దూరం విసిరిన తొలి అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. తండ్రి బాటలోమికోలస్కు ఘనమైన క్రీడా కుటుంబ నేపథ్యం ఉంది. మికోలస్ తండ్రి వర్జిలియస్ అలెక్నా కూడా విఖ్యాత డిస్కస్ త్రోయర్ కావడం విశేషం. 6 అడుగుల 7 అంగుళాల ఎత్తు, 130 కేజీల బరువున్న వర్జిలియస్ 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో స్వర్ణం, 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో సర్ణం, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించాడు. 2003 పారిస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2005 హెల్సింకి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకాలు నెగ్గిన వర్జిలియస్... 1997 ఏథెన్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, 2001 ఎడ్మంటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా తన కెరీర్లో వర్జిలియస్ 12 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు గెలిచాడు. 2014లో రిటైర్మెంట్ ప్రకటించిన 53 ఏళ్ల వర్జిలియస్ రాజకీయాల్లో ప్రవేశించి లిథువేనియా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. -
అమెరికా ఫస్ట్ నినాదం.. ట్రంప్, మస్క్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల పేరుతో ప్రపంచదేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో పలు దేశాలను టార్గెట్ చేసి ఇష్టానుసారం భారీగా సుంకాలు వడ్డీస్తున్నారు. దీంతో, ఇక ప్రపంచీకరణ ముగిసినట్లేనని పలువురు దేశాధినేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, ట్రంప్ మాత్రం.. అమెరికన్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలను కాపాడేందుకు ఇతర దేశాల దిగుమతులపై భారీ సుంకాలను విధిస్తున్నట్టు చెబుతున్నారు.ఇదిలా ఉండగా.. 1991లో సోవియట్ యూనియన్ పతనం తర్వాత ప్రారంభమైన గ్లోబలైజేషన్ ఇక ముగిసినట్టే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. అలాగే, ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తిని పెంచడంపై దేశాలు ఫోకస్ పెడుతున్నాయి. అటు, అమెరికా సైతం స్థానిక వనరులనే వాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా.. ఫన్నీ వీడియోలు షేర్ చేస్తున్నారు.తాజా ఓ నెటిజన్ ట్రంప్, ఎలాన్ మస్క్‌కు చెందిన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ట్రంప్, మస్క్‌లు అమెరికా అభివృద్ధి కోసం ఇప్పుడే పనులు మొదలు పెడుతున్నట్టు ఉంది. ట్రంప్ పొలంలో నాట్లు వేస్తూ.. మస్క్ చీపురుతో ఊడుస్తున్నట్టుగా, జేడీ వాన్స్ షూ తయారు చేస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఇలా.. మెల్లగా పనులు చేస్తే ఎప్పటికి అమెరికా అభివృద్ధి చెందుతుంది అన్నట్టు ఫన్నీ కామెంట్స్ పెట్టారు.A couple new characters introduced in this one. pic.twitter.com/8lO3IaIiFA— MAGA Cult Slayer🦅🇺🇸 (@MAGACult2) April 13, 2025మరో నెటిజన్ ట్రంప్, జిన్‌పింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో చైనా టారిఫ్‌ల దెబ్బకు ట్రంప్ విలవిల్లాడిపోతున్నట్టుగా ఉంది.Trump opens a portal to the Upside Down and finds Xi waiting with a 125% tariff in this Stranger Things parody gone full trade war chaos 😱🌀📉💼🔥👔😂 #StrangerTariffs #UpsideDownEconomics #TrumpVsXi #TradeWarParody #StrangerThingsSpoof #MadeInChina #PoliticalParody… pic.twitter.com/zVmr8jchMB— Julius Dein (@JuliusDein) April 11, 2025 Who wore their tariff best? 💃📉🔥 Watch as world leaders strut their stuff in the most ridiculous outfits, proudly flexing their import taxes like it’s Paris Fashion Week for sanctions. 🇺🇸🇨🇳👠 #TariffFashionShow #GlobalDrip #Sanction #CustomsCouture #TradeWarLooks #china… pic.twitter.com/jpxmnmwl9w— Julius Dein (@JuliusDein) April 3, 2025 Trump’s MAGA hat says “Made in China 🇨🇳🧢 and Xi’s somewhere in Beijing cackling like he just won the trade war 😂🤡 #MakeAmericaManufactureAgain #TradeWar #MAGAhat #PoliticalSatire #XiLaughsLast #ManufacturingIrony #MadeInChina #USA🇺🇸 #GlobalLOL pic.twitter.com/3zOSPDR5ax— Julius Dein (@JuliusDein) April 11, 2025Trump and Elon Musk mocked in new AI video showing them as factory workers. pic.twitter.com/wAEXcmlYOK— Daily Mail Online (@MailOnline) April 10, 2025In 2025, AI surpasses all expectations, enabling thousands to become more creative, something that Trump certainly did not anticipate.😂 pic.twitter.com/NTbnGzp8LB— Johannes Maria (@luo_yuehan) April 12, 2025 -
అమెరికాకు ఊహించని ఎదురుదెబ్బ.. జిన్‌పింగ్ ప్లాన్‌తో టెన్షన్లో ట్రంప్!
వాషింగ్టన్: సుంకాల పోరులో అస్సలు తగ్గేది లేదంటూ చైనా, అమెరికా మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు చైనా గట్టి షాకిచ్చింది. పలు అరుదైన కీలక ఖనిజాలు, మాగ్నెట్ల ఎగుమతిని మొత్తంగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గాలిడోనియం, సమారియం, స్కాండియం, టెర్బియం, ఇత్రియం, డైస్పోరియం, లుటేటియం వంటివి నిలిపివేత జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనా నిర్ణయంపై వైట్‌హౌస్ స్పందించారు.తాజాగా ట్రంప్ ముఖ్య ఆర్థిక సలహాదారుల్లో ఒకరైన కెవిన్ హసెట్ మాట్లాడుతూ..‘చైనా అరుదైన ఖనిజాల నిలిపివేత ఆందోళనకరం. టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో వాటి అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ఖనిజాలు లేకపోవడం అమెరికాకు నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ అంశంపై పలు మార్గాలను అన్వేషిస్తున్నామని’ అన్నారు. ఇదే సమయంలో ట్రంప్ తన టారిఫ్ ప్రణాళికలతో ప్రపంచ వాణిజ్యానికి ఆర్థిక మాంద్యం తెచ్చే పరిస్థితులు వందకు వంద శాతం లేవని క్లారిటీ ఇచ్చారు.The chart shows how much the US relies on imports for rare earth metals, what they are used for, and how much of the imports come from China. A good one from JPM-AM. pic.twitter.com/xQalD5ZyH7— Ayesha Tariq, CFA (@AyeshaTariq) April 14, 2025మరోవైపు.. ఇదే అంశంపై యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, చైనా.. పరస్పర సుంకాలపై రెండు దేశాలు బెదిరింపులకు దిగుతున్నప్పటికీ దీనిపై ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు విడిపోవడానికి ఏ కారణం కనిపించడం లేదన్నారు. అలాగే, చైనాతో పెద్ద ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా ఇతర దేశాలతో పోలిస్తే చైనాతో ఒప్పందం కాస్త కష్టమేనని వ్యాఖ్యానించారు. ఎందుకంటే తమ దేశానికి చైనా అతిపెద్ద ఆర్థిక పోటీదారని, సైనిక ప్రత్యర్థి అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. అమెరికా ఈ ఖనిజాలను 90 శాతానికి పైగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. దాంతో అమెరికా రక్షణ, ఏరోస్పేస్, కంప్యూటర్, సాఫ్ట్వేర్ తదితర పరిశ్రమలన్నీ తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఏప్రిల్ రెండు నుంచి చైనా వాటిని నియంత్రణ జాబితాలో చేర్చింది. అమెరికాకు ఒక అరుదైన లోహాలు ఉత్పత్తి చేసే గని కూడా ఉంది. అయినా ఆ దేశ వినియోగంలో ఎక్కువ భాగం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. ఈ ఖనిజాలపైనే కాకుండా అయస్కాంతాల ఎగుమతిని డ్రాగన్ నిలిపివేసింది. దీంతో, ట్రంప్ సర్కార్‌కు ఊహించని షాక్ తగిలింది.BREAKING: Trump Administration’s Kevin Hassett says he’s “100 percent not expecting a recession.”He claims that job numbers are through the roof as the reason why.Does he not realize that Job numbers are from the month of March and Tariffs started in the beginning of April?… pic.twitter.com/DjXuC1vfT9— Ed Krassenstein (@EdKrassen) April 14, 2025ఇక.. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం సుంకం విధించగా.. చైనా కూడా అంతే వేగంగా దూకుడు ప్రదర్శించింది. అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాలు విధించింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య జరుగుతోన్న ట్రేడ్ వార్ ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇక, ఈ టారిఫ్‌ల నుంచి ఏ దేశానికీ మినహాయింపు లేదని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా చైనాకు ఎలాంటి రాయితీ లభించదని తేల్చి చెప్పేశారు. ఆ దేశం తమతో దారుణంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. -
మన రొయ్య...మళ్లీ వెళ్తుందయ్యా
సాక్షి, అమరావతి: దిగుమతి సుంకాల అమలు మూడు నెలల పాటు వాయిదా వేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం రొయ్యల ఎగుమతిదారులకు ఊరటనిచ్చింది. దీంతో రొయ్యలను అమెరికాకు తరలించేందుకు భారతీయ సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతుదారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎగుమతికి సిద్ధంగా 40వేల టన్నులు చైనా మినహా భారత్‌తో సహా మిగిలిన దేశాలపై టారిఫ్ అమలును 3 నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం ఎగుమతిదారులకు కలిసొచ్చింది. దీంతో ఎగుమతికి సిద్ధంగా ఉన్న 2వేల కంటైనర్ల (40వేల టన్నులు) సరుకును పాత టారిఫ్ ప్రకారం అమెరికాకు పంపేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని పరిశ్రమ వర్గాలు సోమవారం తెలిపాయి. ఇదిలా ఉండగా సుంకాల భయాలున్నప్పటికీ ఆర్డర్లు తగ్గలేదని భారతీయ సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతుదారుల సమాఖ్య కార్యదర్శి కేఎన్ రాఘవన్ ప్రకటించారు.భారత్‌కు అతిపెద్ద మార్కెట్ అమెరికారొయ్యల ఎగుమతుల్లో భారత్‌కు అతిపెద్ద మార్కెట్ అమెరికా. అగ్రరాజ్యానికి ఆహార, మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో 42.3%తో భారత్ మొదటి స్థానంలో నిలవగా, 26.9 % తో ఈక్విడార్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండోనేషియా (15.4%), వియత్నాం (7.2 %), థాయిలాండ్(2.4%), అర్జెంటీనా (2.1%) ఉన్నాయి. 2023–24 సీజన్లో అమెరికాకు 2.7 బిలియన్ డాలర్ల విలువైన రొయ్యలను భారత్ ఎగుమతి చేసింది.ట్రంప్ ప్రతీకార నిర్ణయంతో ప్రతికూలతలు ఈ నెల 4న ట్రంప్ ప్రభుత్వం విధించిన ప్రతీకార టారిఫ్ (26 శాతం) దేశీయంగా ఆక్వా రంగాన్ని కుదిపేసింది. ఈ పెంపు ఈ నెల 9 నుంచి అమలులోకి వచ్చి ఉంటే కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ 5.77 శాతం, యాంటీ డంపింగ్ డ్యూటీ 3.88 శాతంతో పాటు తాజాగా విధించిన 26 శాతం కలిపి 34 శాతం సుంకాలు చెల్లించాల్సి వచ్చేది. ఆ మేరకు ఇప్పటికే సిద్ధంగా ఉన్న 2 వేల కంటైనర్లపై సుంకాల భారం రూ.600 కోట్లపైగా పడేది.ఇక కోల్డ్ స్టోరేజ్‌ల్లో ఉన్న మరో 2,500 కంటైనర్ల సరుకుపై పడే భారం కలిపితే రూ.1300 కోట్లకుపైగా ఉండేది. ఈ పరిణామం ఎగుమతిదారులను కలవరానికి గురిచేసింది. ఇదే సమయంలో ట్రంప్ ట్యాక్స్ సాకుతో అమెరికాకు ఎగుమతి కాని కౌంట్ ధరలను కూడా కంపెనీలు తగ్గించడంతో ఆక్వా రైతులు నష్టాల బారిన పడ్డారు. అయితే మరో మూడు నెలలపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఉన్న తక్కువ సమయాన్ని అందిపుచ్చుకునేందుకు ఎగుమతిదారులు ప్రయత్నిస్తున్నారు. -
అమెరికా–ఇరాన్ తదుపరి చర్చా వేదిక రోమ్
రోమ్: ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా–ఇరాన్ మధ్య తదుపరి చర్చలు శనివారం రోమ్‌లో జరగనున్నాయి. ఇరాన్, ఇటలీ అధికారులు ఈ విషయాన్ని సోమవారం ధ్రువీకరించాయి. చర్చలకు మధ్యవర్తిగా ఉన్న ఒమన్ నుంచి అందిన వినతి మేరకు అంగీకరించినట్లు ఇటలీ ప్రధాని ఆంటోనియో టజనీ తెలిపారు. ఒమన్ రాజధాని మస్కట్‌లో శనివారం రెండు దేశాల మధ్య మొదటి రౌండ్ చర్చలు జరగడం తెల్సిందే. కాగా, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ రఫేల్ మరియానో గ్రాస్సీ సోమవారం ఈ విషయమై ఒక ప్రకటన చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చించేందుకు బుధవారం టెహ్రాన్ వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ పరిశీలకుల బృందాన్ని అణు మౌలిక వసతులను సందర్శించేందుకు వీలు కల్పించాలని ఇరాన్ ప్రభుత్వాన్ని కోరే అవకాశముందని సమాచారం. -
వన్ వే రూటు
రుణపత్రాల విపణిలో ఉత్పన్నమైన అనూహ్య పరిణామాలు అమెరికా అధ్యక్షుడికి గుబులు పుట్టించాయి. అమెరికా బాండ్స్‌కు గిరాకీ పెరిగినట్లే పెరిగి వెంటనే తగ్గిపోయింది. డాలర్ ఇండెక్స్ విలువ కూడా క్షీణిస్తోంది. దీంతో కొత్త సుంకాల విధింపు అమలును 90 రోజుల పాటు నిలిపివేశారు. ఇతర ప్రపంచ దేశాల విషయంలో తాత్కాలికంగానే అయినా ఒక మెట్టు దిగిన ట్రంప్ చైనా విషయంలో మాత్రం చాలావరకు బెట్టుగానే ఉన్నారు. ఏమైనా, అమెరికా సృష్టించిన ఈ అల్లకల్లోలం రోడ్డు మ్యాపు లేని వన్ వే రూటు! ట్రంప్ సుంకాల సంక్షోభం మధ్యకాలిక అనిశ్చితిని పెంచుతుంది. ఆర్థిక కార్యకలాపాలు అంచనాల మీద ఆధారపడి ఉంటాయి. అనిశ్చితి అనేది అంచ నాలను మార్చేస్తుంది. వ్యాపార సంస్థలు, కుటుంబాలు నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. ట్రంప్ 90 రోజుల ఊరట నిజానికి ఈ అనిశ్చితి వ్యవధిని పెంచుతుందే తప్ప, అనిశ్చితికి ముగింపు పలకదు. ఆర్థిక కార్యకాలపాల్లో తెగింపు, నిర్ణయ శక్తి కొరవడతాయి. ప్రభుత్వాలు ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ, ప్రపంచ వ్యాప్త ఆర్థిక మందగమనం తప్పదు. సుంకాల వెనుక రెండు లక్ష్యాలువిచ్ఛిన్నకర సుంకాల ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలని ట్రంప్ అనుకుంటున్నారు. అమెరికా వస్తూత్పత్తుల తయారీ వ్యవస్థ ఏనాడో కుప్పకూలింది. దీన్ని పునరుద్ధరించడం మొదటిది. తద్వారా దిగువ స్థాయి ఫ్యాక్టరీ ఉద్యోగాలు విశేషంగా సృష్టి అవుతాయి. ఇక రెండోది, చైనాను శిక్షించడం. ప్రపంచ వాణిజ్య విధానాన్ని అడ్డు పెట్టుకుని అది అనుచిత ప్రయోజనం పొందుతోంది. పాతికేళ్ల క్రితమే అమెరికాలో పాగా వేయ గలిగింది. ఈ రెండో లక్ష్యం కంటే, మొదటిదే ట్రంప్ రాజకీయ మద్దతుదారులకు మరింత ముఖ్య విషయం. దేశీయంగా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కల్పించలేనప్పుడు, ధరలు పెరిగిపోతున్నప్పడు, చైనాను శిక్షించడం వల్ల అమెరికన్లకు ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ ఒక సమస్య ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి మొదటి లక్ష్యాన్ని సాధించడమే... చైనాను దెబ్బ తీయడమనే రెండో లక్ష్యం కంటే కష్టమైన విషయం. చైనా భౌగోళిక ఆర్థిక విస్తరణను అదుపు చేసే వ్యూహాలు ఇప్పటికిప్పుడు రూపొందినవి కాదు. గడచిన రెండు దశాబ్దాలుగా అమెరికాలో వీటి గురించి పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు, పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయో, వీటిని ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధం కావాలో చైనా ప్రభుత్వానికి మంచి అవగాహనే ఉంది. మరి, ట్రేడ్ వార్ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు అమెరికా ఎంతవరకు సన్నద్ధంగా ఉందనేది ప్రశ్న. కర్మాగారాల స్థాపనకు కనీసం రెండేళ్లు పడుతుంది. ట్రంప్ నిరుద్యోగ మద్దతుదారులు అందాకా ఓర్పుతో ఉండగలరా? స్వల్పకాలంలో కష్టాలు, దీర్ఘకాలంలో లాభాలు అనే సూత్రం రాజకీయంగా కుదిరేది కాదు. ట్రంప్ స్వదేశంలోనే మద్దతు కోల్పేతే ఆయన విధానాలకు అంతర్జాతీయంగా స్పందన ఎలా ఉంటుంది?దేశాల స్పందనట్యారిఫ్ సంక్షోభం అనంతర కాలంలో ప్రపంచ దేశాలు అమెరికా మీద విశ్వాసం కోల్పోతాయి. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు తన విధానాలు, (వివాదాస్పద) మాటలు వెనక్కు తీసుకున్నా, ఆయన ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాధిపతులు విశ్వాసంలోకి తీసుకోరు! కెనడా, మెక్సికో, డెన్మార్క్, దక్షిణా ఫ్రికాలను ట్రంప్ బాహాటంగానే టార్గెట్ చేసి మాట్లాడారు. బ్రెజిల్, కొలంబియా, జర్మనీ, ఫ్రాన్స్,సింగపూర్, నమీబియా, ఆస్ట్రేలియా వంటి దేశాల అధినేతలు యూఎస్ అధ్యక్షుడిపై బహిరంగ విమర్శలకు వెనుకాడటం లేదు. యూరోపియన్ యూనియన్ ఈ విషయంలో ఒక్కతాటి మీద లేకున్నా, మెజారిటీ సభ్యదేశాలు అమెరికాను నమ్మే స్థితిలో లేవు. ఈయూ అటు చైనాతోనూ, ఇటు ఇండియా తోనూ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తుంది. బలహీన ప్రధాని నేతృత్వంలోని జపాన్ మాత్రం అమెరికాను ప్రాధేయపడుతున్నట్లు వ్యవహరిస్తోంది. ఏమైనా, అది కూడా చైనాతో వాణిజ్య సంబంధాలు స్థిరీకరించుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇండియా మౌనం వెనుక...ఇక ఇండియా నాయకత్వం అమెరికా ట్రేడ్ పాలసీ పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది. చైనాతో అమీతుమీకి ట్రంప్ సిద్ధపడటం ఇండియాకు ఆనందంగా ఉంది. మరోవంక, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందానికి చర్చలు జరుపుతోంది. అమెరికా నుంచి రక్షణ సామగ్రి, ఇతరత్రా దిగుమతులు పెంచు కునేందుకు సిద్ధపడుతోంది. అయినా కూడా, ట్రంప్ మొదటి విడత పదవీకాలంలో ఆయనతో వ్యవహరించినంత సంతోషంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దఫా ఉన్నారా? ట్రంప్ ఆయనకు చురకలు వేస్తూ మాట్లాడుతున్నారు. అంతగా స్నేహపూర్వకం కాని ధోరణిలో ఇండియా పేరు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎంతో సెల్ఫ్ ఇమేజ్, ఇగో ఉన్న మోదీ ఈ అవమానాలకు లోలోపల కుమిలిపోయే ఉంటారు!ఉభయ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుస్థిరపరచుకోవాలని ఇండియా భావిస్తోంది. అయినా సరే, ఏ భారతీయ నాయకుడూ జపాన్, ఇటలీ మాదిరిగా ట్రంప్ ముందు సాగిలపడేందుకు సిద్ధంగా లేరు. బహుశా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్న నేపథ్యంలో మోదీ మౌనం పాటిస్తూ ఉండొచ్చు. దీంతో, గ్లోబల్ సౌత్ (పేద దేశాలు) తరఫున మాట్లాడేందుకు ఇతరులకు అవకాశం లభించింది. ట్రేడ్ ట్యారిఫ్లను వ్యతిరేకిస్తూ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు చైనా సంఘీభావం ప్రకటిస్తోంది. ఇండియా కూడా కలిసి రావాలని ఆహ్వానిస్తోంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా నాయకులు కూడా ఇతర వర్ధమాన దేశాలకు సంఘీభావం ప్రకటించాయి. ‘గ్లోబల్ సౌత్’ ఇండియా ‘వాయిస్’ కోసం ఎదురు చూస్తోంది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!
ఓ వైపు అమెరికా.. మరోవైపు చైనా.. నువ్వా నేనా అన్నట్లుగా సుంకాలను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ విషయం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు, రెండు దేశాలు ప్రవర్తిస్తున్నాయి. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో.. చైనా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అమెరికాపై విధిస్తున్న సుంకాలను 125 శాతానికి పెంచింది.అమెరికా విధిస్తున్న సుంకాల భారీ నుంచి తప్పించుకోవడం ఎలా అని చాలామంది తలలు పట్టుకుంటున్నారు. దీనికి ఓ మార్గం కూడా ఉంది. సుంకాల భారీ నుంచి తప్పించుకోవాలంటే.. ఇక స్మగ్లింగ్ చేయాలేమో అనే మీకు రావొచ్చు. అలాంటి సాహసాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎలా తప్పించుకోవాలో క్లారిటీగా వెల్లడించే ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.చైనా వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తే 145 శాతం సుంకాలను కట్టాల్సి ఉంటుంది. ఎగుమతి అంటేనే భారీ మొత్తం. కానీ చైనాలో వస్తువు కొని మనవెంట అమెరికాకు తెచ్చుకుంటే.. దానికి ప్రత్యేకంగా టారిఫ్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్ఉదాహరణకు ఒక అమెరికన్.. చైనాలో పర్యటించేటప్పుడు తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వాటిని తనతో పాటు అతని దేశానికి కూడా తీసుకెళ్లవచ్చు. ఇది పూర్తిగా లీగల్.. పర్సనల్ షాపింగ్ సర్వీస్ కిందికి వస్తుంది. అయితే ఎన్ని వస్తువులు కొనాలి?, ఎన్ని వస్తువులను తనతో పాటు తీసుకెళ్లవచ్చు అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని పాటిస్తే.. మీపై టారిఫ్స్ ప్రభావం ఉండదు. ఇది ఒక్క అమెరికన్ ప్రజలకు మాత్రమే కాదు.. ఈ ఫార్ములాతో మీరు ఏ దేశీయులైన.. ఇతర దేశాల్లో వస్తువులను సుంకాలతో పనిలేకుండా హ్యాపీగా కొనేయొచ్చు.China is now providing tariff advice. 🤣 pic.twitter.com/esNxGshMe6— James Wood 武杰士 (@commiepommie) April 13, 2025 -
ఐటీకి అనిశ్చితి కొంతకాలమే: టీసీఎస్ సీఈవో
ముంబై: ప్రపంచ దేశాల మధ్య టారిఫ్‌ల కారణంగా తలెత్తిన అనిశ్చితి స్వల్పకాలమే కొనసాగనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో, ఎండీ కె.కృతివాసన్ పేర్కొన్నారు. వెరసి ఐటీ సేవల పరిశ్రమకు కొంతకాలమే అనిశ్చితి సవాళ్లు సృష్టించనున్నట్లు అభిప్రాయపడ్డారు. కొద్ది నెలల్లోనే పరిష్కారం లభించనున్నట్లు అంచనా వేశారు.39 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీ ఆర్డర్ బుక్ భవిష్యత్ ఆదాయ ఆర్జనకు హామీ ఇస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. డీల్ పైప్‌లైన్ పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులతో కొంతమంది క్లయింట్ల నుంచి విచక్షణ వ్యయాలు నిలిచిపోతున్నట్లు వెల్లడించారు. అయితే ధరల విషయంగా ఒత్తిడిలేదని స్పష్టం చేశారు.నిజానికి వార్షికంగా, త్రైమాసికవారీగా ధరలు స్వల్పంగా మెరుగుపడినట్లు తెలియజేశారు. గతేడాదికి 30 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించిన కంపెనీ విచక్షణ వ్యయాల వాటాపై వివరణ ఇవ్వని సంగతి తెలిసిందే. ఇవి ఆదాయంలో కీలకమే అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావం పడలేదని వివరించారు.యూఎస్‌లో పరిస్థితులు సర్దుకుంటే ఉత్తర అమెరికా బిజినెస్‌లో తిరిగి పురోభివృద్ధి అందుకోగలమని అంచనా వేశారు. సాఫ్ట్వేర్ సేవల ఔట్‌సోర్సింగ్‌కు ప్రపంచంలోనే యూఎస్ అతిపెద్ద మార్కెట్‌కాగా.. ప్రస్తుతం కంపెనీ ఆదాయంలో వాటా 48%కి పరిమితం కావడం గమనార్హం! -
మనువుతో మతిమరుపే!
ఒంటరితనంతో బాధపడేవారు కొన్ని విషయాలనే పదేపదే ఆలోచిస్తూ మిగతా వాటిని మర్చిపోతారనే వాదన ఉంది. కానీ అందులో అస్సలు నిజం లేదని తాజా అధ్యయనం ఒకటి బల్లగుద్ది చెబుతోంది. సోలో బతుకే సో బెటరు అంటోంది. పెళ్లికాని ప్రసాదుల్లో మతిమరుపు లక్షణాలు తక్కువని చెబుతోంది. వైవాహిక బంధానికి బీటలు పడి మళ్లీ ఒంటరయ్యే వాళ్లలో కూడా మతిమరుపు బారిన పడే అవకాశాలు బాగా తగ్గుతున్నట్టు కూడా ఈ పరిశోధనలో వెల్లడైంది.వేల మందిపై అధ్యయనం తర్వాత.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర విశ్వవిద్యాలయం ఈ పరిశోధన జరిపింది. ఇందుకోసం అమెరికాలో 24,000 మందిని ఎంపికచేశారు. వాళ్లందరినీ 18 ఏళ్లపాటు అధ్యయనం చేశారు. పెళ్లయిన వాళ్లు, విడాకులైన వాళ్లు, బ్రహ్మచారులు, జీవితభాగస్వామి అనారోగ్యంతో కన్నుమూసిన వారిని పరిశోధనకు ఎంచుకున్నారు. మతిమరుపు లక్షణాలు లేని వాళ్లను మాత్రమే అధ్యయనం కోసం ఎంపికచేశారు. పెళ్లికాని వాళ్లను మూడు గ్రూప్‌లుగా విభజించి ఆరోగ్య పరిస్థితిని అంచనావేశారు. పెళ్లయిన వాళ్లతో పోలిస్తే వారికి మతిమరుపు ముప్పు తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. పొగ తాగడం, కుంగుబాటు వంటివి ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెప్పారు. పెళ్లయిన వాళ్లతో పోలి స్తే పెళ్లయి విడాకులు తీసుకున్న వాళ్లు, అస్సలు పెళ్లిచేసుకోని వాళ్లలో మతిభ్రంశం ముప్పు తక్కువగా ఉందని బయటపడింది. పెళ్లికాని వ్యక్తుల్లో అల్జీమర్స్ తరహా డిమెన్షియా ముప్పు తక్కువగా ఉంది. అయితే డిమెన్షియాలో అరుదైన రకమైన వాసు్కలర్ చిత్తవైకల్యం ముప్పు వివరాలు వెల్లడికాలేదు.విడాకులు తీసుకున్న వాళ్లలో విడాకులు తీసుకున్న వాళ్లు, అస్సలు పెళ్లిచేసుకోని వాళ్లలో అభిజ్ఞానవికాసం క్షీణించి డిమెన్షియా బారినపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడైంది. అధ్యయనకాలంలో జీవితభాగస్వామి చనిపోవడంతో ఒంటరిగా మారిన వ్యక్తుల్లోనూ మనోభ్రంశం ముప్పు తక్కువగా ఉండటం విశేషం. మెదడు ఆరోగ్యం ముఖ్యం మెదడు పనితీరు ఎంత కీలకమైందో ఈ పరిశోధనలో మరోసారి స్పష్టమైంది. వైవాహిక జీవితంలో ఎదురయ్యే అనూహ్య పరిణా మాలు, కష్టాలు, రాజీపడటం, కీలకమైన నిర్ణయాలు అనేవి మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. పెళ్లిచేసుకుంటే హాయిగా ఉంటాం అనేది నిజం కాదని, పెళ్లాయ్యాక కూడా హాయిగా ఉండగల్గితేనే మెదడు ఆరోగ్యం బాగుంటుందని పరిశోధన పునరుద్ఘాటించింది. జీవితభాగస్వామిని కోల్పోయిన వాళ్లు, విడాకులు తీసుకున్న వాళ్లు ఎంతో వేదనకు గురవుతారన్న అభిప్రాయాన్ని సవాల్ చేసేలా ఈ పరిశోధనా ఫలితాలు రావడం గమనార్హం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రష్యా గ్యాస్ పైప్‌లైన్ మాకిచ్చేయండి
వాషింగ్టన్: ‘మినరల్స్ ఫర్ వెపన్స్’ ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్‌పై మరింత నియంత్రణకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ భూభాగం నుంచి వెళ్లే రష్యా పైప్‌లైన్‌ను తమకు అప్పగించాలనే కొత్త డిమాండ్ ముందుకు తెచ్చింది. అరుదైన ఖనిజాలు, ఆయిల్, గ్యాస్ సహా ఉక్రెయిన్ విస్తారమైన వనరులను అమెరికా కంపెనీలకు అప్పగించాలని.. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అమెరికా వైఖరిని ఉక్రెయిన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్ స్ట్రాటజీకి చెందిన సీనియర్ ఎకనమిస్ట్ వోలోదిమిర్ లాండా తప్పుబట్టారు. ఈ డిమాండ్లు వలసవాద తరహా ఒత్తిడిని తలపిస్తున్నాయని, వాటిని అంగీకరించే అవకాశం లేదని ఆయన చెప్పారు. సోవియట్ కాలం నాటి సహజ వాయువు పైప్‌లైన్ ఉక్రెయిన్ భూభాగం గుండా వెళ్తోంది. పశ్చిమ రష్యాలోని సుడ్జా నుంచి స్లొవేకియా సరిహద్దుకు సమీపంలోని ఉక్రెయిన్ నగరం ఉజ్హోరోడ్ వరకు ఈ పైప్‌లైన్ ఉంది. ఇది యూరప్‌కు రష్యన్ గ్యాసు సరఫరా చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. దీన్ని నియంత్రణలోకి తీసు కోవాలని యూఎస్ ప్రభుత్వ సంస్థ అయిన ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చూస్తోంది. రష్యా ప్రభుత్వ ఇంధన సంస్థ గాజ్‌ప్రోమ్‌తో ఉక్రెయిన్ ఐదేళ్ల ఒప్పందం గడువు ఈ ఏడాది జనవరితో ముగిసింది.బెర్లిన్ తరహాలో విభజిద్దాం... ఉక్రెయిన్ను బెర్లిన్లాగా విభజించవచ్చని అమెరికా ప్రత్యేక రాయబారి కీత్ కెల్లాగ్ సూచించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బెర్లిన్‌లో రష్యన్ జోన్, ఫ్రెంచ్ జోన్, బ్రిటీష్ జోన్, యూఎస్ జోన్ తరహాలో.. ఉక్రెయిన్‌లో యూకే, ఫ్రాన్స్ దళాలు పశ్చిమ ప్రాంతంలో భరోసాగా ఉంటాయన్నారు. ఆక్రమిత తూర్పు ప్రాంతంలో రష్యా సైన్యం ఉండవచ్చని, రెండింటి మధ్య ఉక్రెయిన్ దళాలతో సైనిక రహిత ప్రాంతం ఉంటుందని వెల్లడించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో తన మాటలను వక్రీకరించారన్నారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడటమే తన లక్ష్యమన్నారు. -
ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' తీసుకున్న నోట్‌ప్యాడ్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. టెస్లా సీఈఓ కాన్ఫరెన్స్ టేబుల్ వద్ద కూర్చుని 'ఎలాన్ మస్క్' అని రాసి ఉన్న నేమ్ కార్డ్ కనిపిస్తుంది. అక్కడే ఒక పేపర్ మీద 'టాప్ సీక్రెట్' రాసి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ఫోటోలో ఒక పెన్ను, ఖాళీ గాజు మాత్రమే కాకుండా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడి ముద్ర ఉన్న కోస్టర్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరక్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా వినియోగదారులు మస్క్ నోట్‌ప్యాడ్‌ను జూమ్ చేయడంతో “టాప్ సీక్రెట్” అనే పదాలు కనుగొన్నారు. మీడియాను గందరగోళంలోకి నెట్టడానికి మస్క్ ఈ విధంగా చేసి ఉంటాడని.. ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఎలాన్ నవ్వుతున్న ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చారు.ఇదీ చదవండి: గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..ఒక ట్రిలియన్ నుంచి రెండు ట్రిలియన్ డాలర్ల వరకు.. అమెరికా వ్యయాలను తగ్గిస్తామని ఒకప్పటి నుంచి చెబుతున్న ఎలాన్ మస్క్ ఇప్పుడు మాట మార్చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో.. 150 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించగలమని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ట్రంప్ నేతృత్వంలోని డోజ్ టీమ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని మస్క్ మెచ్చుకున్నారు.😂 https://t.co/0NsNM4yAdR— Elon Musk (@elonmusk) April 12, 2025 -
Jesus Nut: టెక్ సీఈవో ఫ్యామిలీ ప్రాణం తీసిన ‘జీసెస్ నట్’ కథ!
వాషింగ్టన్: జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ (agustin escobar) కుటుంబం మరణానికి ‘జీసెస్ నట్’ (jesus nut) కారణమైందని నిపుణులు భావిస్తున్నారు.గత గురువారం ఆగస్టిన్ ఎస్కోబార్, అతని భార్య, మెర్సి కాంప్రూబి మాంటాల్, వారి ముగ్గురు పిల్లలు (వయస్సు 4, 5, 11), పైలట్‌తో సహా సైట్ సీయింగ్ కోసం బయల్దేరారు. ఇందుకోసం బెల్ 206 అనే సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌ను వినియోగించారు.అయితే, సీఈవో కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాల్ స్ట్రీట్ హెలిపోర్ట్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు టేకాఫ్ అవుతుండగా.. మన్‌హట్టన్ వినువీధిలో .. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దిశగా వెళ్లింది. ఆ సమయంలో గిరిగిరా తిరుగుతూ న్యూయార్క్ నగరంలోని ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ (miracle on the hudson) నదిలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై అందిన ప్రాథమిక సమాచారం మేరకు.. పక్షి ఢీకొట్టడం వల్లే హెలికాఫ్టర్ ప్రమాదం జరిగి ఉంటుందేమోనని అందరూ భావించారు. హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగే సమయంలో స్థానికులు వీడియోలు తీశారు. ఆ వీడియోల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఘోరం జరిగే సమయంలో పక్షుల జాడ ఎక్కడా కనిపించలేదు. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏమై ఉంటుందా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగింది. పలు ఆధారాలు, ఏవియేషన్ రంగ నిపుణులు, ప్రమాదానికి ముందు జరిగిన నిర్లక్ష్యం ఆధారంగా బెల్ 206 హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ‘జీసెస్ నట్’ కారణమనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.ఏంటి ‘జీసెస్ నట్’ జీసెస్ నట్ అనేది హెలికాప్టర్ మెయిన్ రోటర్ మాస్ట్‌పై(mast) అమర్చబడి ఉంటుంది. అంటే ఇది హెలికాప్టర్ రెక్కలు..హెలికాప్టర్ ఇంజిన్‌కు జాయింట్ చేసి ఉంటుంది. ఈ భాగం వద్ద జీసెస్ నట్ ఉంటుంది. అది ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా, ఊడినా హెలికాప్టర్ మొత్తం అదుపు తప్పుతుంది. ఆ నట్టు ఊడి పోతే హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడేయడం పైలెట్ వల్ల కూడా సాధ్యం కాదు. ఆగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లోని ఈ జీసెస్ నట్ ఊడిపోవడం వల్లే విషాదం చోటు చేసుకున్న న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఎఫ్ఏఏ (fedaral viation Administration) విచారణను వేగవంతం చేసింది.‘జీసెస్ నట్’ అంటే ఏమిటి?.. చరిత్ర ఏం చెబుతోందిజీసెస్ నట్ అనే పదం వియత్నాం యుద్ధంలో అమెరికన్ సైనికుల నోట తొలిసారి ఈ పదం వెలుగులోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. 1930, 1940లలో యుద్ధ సమయంలో అమెరికా నేవి ప్రత్యర్థుల్ని మట్టికరింపించేందుకు చిన్న ఎయిర్ క్ట్రాప్ట్లను భారీ సంఖ్యలో డిజైన్ చేయించింది. కాన్సాలిడేటెడ్ మోడల్ 28లో పీబీవై కాటలినా అనే ఎయిర్ క్ట్రాప్ట్లో తొలిసారి ఈ నట్టును వినియోగంలోకి తెచ్చారు. పైన చెప్పుకున్నట్లుగా ఈ నట్టు ఎయిర్ క్ట్రాప్ట్ రెక్కలకు, ఇంజిన్‌కు అనుసంధానం చేసి ఉంటుంది. అయితే వియత్నంతో జరిగే యుద్ధంలో ఈ ఎయిర్ క్ట్రాఫ్ట్లో సైనికులు ప్రయాణిస్తుండగా ఎదైనా ప్రమాదం జరిగితే ఆ నట్టు బిగించిన రూటర్ మాస్ట్ ఊడిపోతే .. జీసెస్‌ను ప్రార్థించడం తప్ప ఏం చేయలేం అని అమెరికా సైనికులు అనేవారంటూ వీకీపీడియా సమాచారం చెబుతోంది.ప్రయాణానికి ముందే అంతేకాదు, ఈ తరహా జీసెస్ నట్ ఉన్న ఎయిర్క్రాప్ట్లలో ప్రయాణించే ముందు నట్టు సరిగ్గా ఉందా? లేదా? అని పరిశీలించాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే ప్రయాల్సి ఉంది. లేదంటే ప్రాణాలు గాల్లోనే కలిసి పోవడం ఖాయం. తాజాగా ‘మిరాకిల్ ఆన్ ది హడ్సన్’ నదిలో చోటు చేసుకున్న సీమెన్స్ స్పెయిన్ విభాగం సీఈవో అగస్టిన్ ఎస్కోబార్ కుటుంబం హెలికాప్టర్ ప్రమాదం ఈ జీసెస్ నట్ పనితీరుపై దృష్టిసారించకపోవడం వల్లే ప్రాణ నష్టం జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. -
ట్రంప్ ప్రభుత్వం ‘30 డేస్’ వార్నింగ్.. మర్యాదగా వెళ్లిపోండి
వాషింగ్టన్: ఇప్పటికే ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం.. మరొక కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడాలని చూసే వారిని మరోసారి హెచ్చరించింది. అక్కడ సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఉండాలని చూస్తే అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అక్రమంగా తమ దేశంలో స్థిరపడాలని చూసే వారిని అప్రమత్తం చేస్తూ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ‘ ఇక్కడ ఉన్న విదేశీ పౌరులు ఎవరైనా సరే 30 రోజులు దాటితే అమెరికా ప్రభుత్వం నమోదు తప్పనిసరి. ఒకవేళ అలా జరగకపోతే భారీ జరిమానాలే కాదు.. జైలు శిక్షను కూడా చూడాల్సి వస్తుంది’అని ట్రంప్ ఆధ్వర్యంలోని హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఎక్స్’లో ఒక ట్వీట్ చేసింది. ‘ దయచేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్లిపోండి. మీకు మీరుగా స్వచ్ఛందంగా అమెరికా నుంచి వైదొలగండి.’ అంటూ స్పష్టం చేసింది.Foreign nationals present in the U.S. longer than 30 days must register with the federal government. Failure to comply is a crime punishable by fines and imprisonment. @POTUS Trump and @Sec_Noem have a clear message to Illegal aliens: LEAVE NOW and self-deport. pic.twitter.com/FrsAQtUA7H— Homeland Security (@DHSgov) April 12, 2025వారికి ఈ నిబంధన వర్తించదు..స్టూడెంట్ పర్మిట్లు , వీసాలు ఉండి యూఎస్ లో ఉన్నవారిని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేసే అవకాశం లేదు. కానీ విదేశీ పౌరులై సరైన అనుమతి లేకుండా యూఎస్ లో ఉండేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అక్రమ వలసల్ని నిరోధించేందుకు కఠిన చర్యల్లో భాగంగా ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయిన సమయంలో కూడా తాజా నిబంధన వర్తించదు. దానికి నిర్దేశించిన గడువు అనే నిబంధన ఇక్కడ వర్తిస్తుంది. విద్యార్థులు, హెచ్ 1 బీ వీసాదారులు యూఎస్ లో ఉండటానికి తప్పనిసరి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. -
గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..
2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు గోల్డ్ రేటు 23 శాతం పెరిగింది. ఏప్రిల్ నెలలో మాత్రమే పసిడి ధర 5 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. శనివారం నాటికి బంగారం ధరలు గరిష్టంగా రూ. 95,670 వద్ద నిలిచాయి.అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు కూడా భారీగా పెరిగాయి. ట్రాయ్ ఔన్సుకు $3,263 రికార్డు గరిష్ట స్థాయిని తాకిన తర్వాత కామెక్స్ గోల్డ్ 2.44 శాతం పెరిగి $3,254.90 వద్ద ముగిసింది. ఇప్పటి వరకు బంగారం ధరలు పెరుగుదల ఆల్ టైమ్ రికార్డ్ అని తెలుస్తోంది.బంగారం రేటు ఎందుకు పెరుగుతోందిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్స్.. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అనేక దేశాలపై విధించిన పరస్పర సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించగా.. చైనాపై సుంకాలను మాత్రం 125 శాతానికి పెంచారు. చైనా కూడా ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా.. అమెరికా వస్తువులపై సుంకాలను 84 శాతం నుంచి 125 శాతానికి పెంచింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వృద్ధి చుట్టూ అనిశ్చితిని పెంచాయి. దీంతో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.స్టాక్ మార్కెట్లలో పెట్టిన పెట్టుబడులకు గ్యారెంటీ లేదు. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెడితే.. అది సురక్షితమైన ఆస్తిగా భావించేవారు సంఖ్య గణనీయంగా పెరగడంతో.. ఎక్కువమంది బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇది గోల్డ్ రేటు పెరగడానికి దోహదపడుతున్నాయి.ఇదీ చదవండి: అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం.. 200 మంది ఉద్యోగులు బయటకుబంగారం ధరలు తగ్గుతాయా?వాణిజ్య యుద్ధం, డాలర్ విలువ తగ్గడం, వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ట్రాయ్ ఔన్సుకు $3,300 నుంచి $3,500 వరకు పెరుగుతాయని చెబుతున్నారు.భారతదేశంలో 2025 చివరి నాటికి 10 గ్రాముల బంగారం రూ. 97,000 కు చేరుకుంటుందని HDFC సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ 'అనుజ్ గుప్తా' అన్నారు. ధరలు పెరుగుదల ఇలాగె కొనసాగే అవకాశం ఉందని.. ఎల్కేపీ సెక్యూరిటీస్ , కమోడిటీ అండ్ కరెన్సీ, వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది కూడా వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తే గోల్డ్ రేటు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు లేదని స్పష్టంగా అర్థమవుతోంది. -
అమెరికాలోని భారతీయులపై ట్రంప్ తెంపరితనం
-
అమెరికా కాలేజీల్లోనూఅక్రమ వలసదారుల వేట!
తలాహస్సీ(యూఎస్): అమెరికా గ్రామాలు, పట్టణాల్లో అనుమానిత ప్రదేశాలు, జనావాస స్థలాల్లో మాత్రమే ఇన్నాళ్లూ అక్రమ వలసదా రుల కోసం ఇమిగ్రేషన్ అధికారుల వేట కొన సాగింది. ఇకపై ‘సున్నిత ప్రదేశాల’ కేటగిరీలో ఉన్న విశ్వవిద్యాలయాల్లోనూ అక్రమ వలస దారుల జాడ కనిపెట్టేందుకు ఇమిగ్రేషన్ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు రంగప్రవేశం చేయ నున్నారు. ప్రస్తుతానికి ఫ్లోరిడా రాష్ట్రంలోని మూడు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోకి ‘ఇమి గ్రేషన్’ తనిఖీలను అనుమతించే అవకాశ ముంది. బోకా రాటన్ నగరంలోని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ, గెయిన్స్‌విల్లేలోని ఫ్లోరిడా వర్సిటీ క్యాంపస్, తంపా సిటీలోని సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలు ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వంతో ఒప్పందానికి ముందుకొ చ్చాయి. తమ విశ్వవిద్యాలయాల అనుబంధ కళాశాలల్లోని స్థానిక పోలీసులను ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ సేవల కోసం వినియోగించుకునేందుకు ఈ మూడు ప్రభుత్వ విశ్వవి ద్యాలయాలు అనుమతి ఇవ్వనున్నాయి. ఫ్లోరిడా రాష్ట్ర గవర్నర్ రోన్ డీశాంటిస్ సైతం తమ రాష్ట్రంలో అక్రమ వలసదారులపై ఉక్కుపా దం మోపేందుకు ట్రంప్ సర్కార్‌కు పూర్తి మద్దతు పలుకుతున్న నేపథ్యంలో ఫ్లోరిడాలో తాజాగా ఈ పరిణామం జరగడం ప్రాధాన్య త సంతరించుకుంది. స్థానిక, రాష్ట్ర పాలనా యంత్రాంగాలు కలిసికట్టుగా ఇమిగ్రేషన్ విభాగానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు ఫిబ్రవరి 19వ తేదీనే సంబంధిత ఒప్పందాలపై సంతకాలు చేశారు. పోలీసులకు తగు శిక్షణఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీలోని పోలీ స్ శాఖ(ఎఫ్ఏయూపీడీ) సిబ్బందికి ఇమిగ్రే షన్ ఎన్ఫోర్స్మెంట్ విభాగ విధులను అప్ప గించనున్నారు. ఇమిగేషన్ సంబంధిత పత్రాల తనిఖీ, ఒకవేళ అక్రమ వలసదారు చిక్కితే నిర్బంధం, అరెస్ట్, అనుసరించాల్సిన విధానాలను ఈ సాధారణ పోలీసులుకు విడమర్చి చెప్పనున్నారు. ఇందుకోసం ఎఫ్ఏ యూపీడీ సిబ్బందికి ‘287(జీ) ప్రోగ్రామ్’ పేరిట తగు శిక్షణ ఇస్తారని ఫ్లోరిడా అట్లాంటిక్ వర్సిటీ అధికార ప్రతినిధి జాషువా గ్లేంజర్ చెప్పారు. ఈ శిక్షణ బాధ్యతలను యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తీసుకోనుంది. వర్సిటీ పోలీసులకు ఇలా ఇమిగ్రేషన్ అధికారాలు దఖలుపడే అవకాశం రావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. శిక్షణ పూర్తయ్యాక వర్సిటీ పోలీసు లు ఆయా విశ్వవిద్యాలయాల ప్రాంగణాలు, క్యాంపస్, కళాశాలల్లో అనుమానితులు, విద్యార్థులు, విదేశీయులను విచారిస్తారు. తనిఖీలు చేస్తారు. అవసరమైతే ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేస్తారు. అయితే వర్సిటీ పాలకమండళ్ల ఈ నిర్ణయాలను విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నాయి. విద్యాలయాలను అక్రమచొరబాట్ల తనిఖీ కేంద్రాలుగా మార్చొద్దని, నిర్ణయాలను వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్‌చేశాయి. ‘‘వర్సిటీల్లో ఉన్న వాళ్లు విద్యార్థు లా కాదా అంటూ పోలీసులు అణువణువునా గాలింపులు మొదలెడితే వర్సిటీల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతింటుంది’’ అని జెనికా ఛార్లెస్ అన్నారు. ఛార్లెస్ హౌతీ నుంచి వలసవచ్చి ఫ్లోరిడా అట్లాంటిక్ వర్సిటీలో రాజనీతిశాస్త్రం చదువుతున్నారు. సురక్షిత, సమ్మిళిత విద్యకు పట్టుగొమ్మల్లాంటి వర్సిటీ ల్లో ఇమిగ్రేషన్ తనిఖీలు, సోదాలను నిరోధించాలని ‘ప్రెసిడెంట్స్ అలయన్స్ ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఇమిగ్రేషన్’ సంస్థ సీఈఓ మిరియం ఫెడ్బ్లమ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సంస్థ విదేశీ విద్యార్థుల సమస్యలపై పోరాడుతోంది. -
అణు కార్యక్రమంపై ముగిసిన ఇరాన్–అమెరికా ప్రతినిధుల భేటీ
మస్కట్: ఇరాన్, అమెరికా ప్రతినిధుల ముఖాముఖి మొదటి విడత చర్చలు శనివారం ఒమన్ రాజధాని మస్కట్‌లో ముగిశాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు జరిపేందుకు వీరు వచ్చే వారం మరోసారి సమావేశం కానున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యాక మొదటి విడత చర్చలు పూర్తయినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు ఇరాన్ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, ఈ నెల 19వ తేదీన తదుపరి విడత పరోక్ష చర్చలు జరుపుతామని అరగ్చి తెలిపారు. ‘ఫలితం లేని ఈ చర్చలతో సమయం వృథా. వీటిపై ఎవరికీ ఆసక్తి లేదు’అని పేర్కొన్నారు. మస్కట్ శివారులోని ఓ భవనంలో సమావేశమైన రెండు దేశాల ప్రతినిధులు రెండు గంటలపాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో చర్చలు ముఖాముఖి జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రతినిధి విట్కాఫ్ తెలపడం గమనార్హం. అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయడమన్నదే తమ లక్ష్యమని ఇరాన్‌కు తెలిపినట్లు విట్కాఫ్ అంటున్నారు. -
అమెరికన్ కంపెనీ కీలక నిర్ణయం: 200 మంది ఉద్యోగులు బయటకు
2025లో కూడా లేఆప్స్ సర్వ సాధారణం అయిపోయాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు సైతం లెక్కలు మించిన ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ జనరల్ మోటార్స్ (GM) చేరింది.జనరల్ మోటార్స్ కంపెనీ.. ఆల్ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ జీరో ప్లాంట్ నుంచి 200 మంది ఉద్యోగులను తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే వీరిని మళ్ళీ ఎప్పుడు ఉద్యోగాల్లోకి తీసుకుంటారు అనే విషయాన్ని సంస్థ వెల్లడించలేదు. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా.. ఉత్పత్తి సర్దుబాటులో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉద్యోగుల తొలగింపుకు.. టారిఫ్‌ల ప్రభావం కాదని సంస్థ స్పష్టం చేసింది.కంపెనీ వెబ్సైట్ ప్రకారం.. ఫ్యాక్టరీ జీరోలో దాదాపు 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్లాంట్‌లో సంస్థ హై ప్రొఫైల్ ఈవీ మోడళ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో చేవ్రొలెట్ సిల్వరాడో, జీఎంసీ సియెర్రా ఈవీ, హమ్మర్ ఈవీ పికప్ వంటి వాటితో పాటు రాబోయే కాడిలాక్ ఎస్కలేడ్ ఐక్యూ ఉన్నాయి.ఇదీ చదవండి: యూపీఐ సేవల్లో అంతరాయం.. స్పందించిన ఎన్పీసీఐ -
పేరుకు ‘కృత్రిమ మేథ’.. పనిచేసేది మనుషులే.. అమెరికాలో మరో మోసం
న్యూయార్క్: ఇటీవలి కాలంలో విస్తృతంగా వినియోగమవుతున్న కృతిమమేథ(Artificial intelligence) మనిషి ఆలోచనలకు సవాల్ విసురుతోంది. ఇటువంటి తరుణంలో అమెరికాలో ఒక వింత మోసం చోటుచేసుకుని, సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫిన్‌టెక్ స్టార్టప్ నిర్వాహకుడు ఆల్బర్ట్ సానిగర్ తన ‘నేట్’ (Nate)షాపింగ్ యాప్ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా నడుస్తున్నదని ప్రచారం చేసి, 50 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 420 కోట్లు) పైగా నిధులు సేకరించాడు. అయితే ఈ యాప్ ఫిలిప్పీన్స్‌లోని ఒక కాల్ సెంటర్లోని సిబ్బంది ద్వారా నడుస్తున్నదని విచారణలో తేలింది. ఈ మోసం బయటపడటంతో, సానిగర్పై అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్.. సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ ఆరోపణలు నమోదు చేసింది. ఈ ఆరోపణలు నిజమైతే ఆల్బర్ట్ సానిగర్కు గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి.నేట్ యాప్‌ను ఆల్బర్ట్ సానిగర్(Albert Saniger) 2018లో రూపొందించాడు. ఈ యాప్ ఒక యూనివర్సల్ షాపింగ్ కార్డ్‌గా ప్రచారం చేశాడు. దీని ద్వారా యూజర్లు ఎలాంటి ఇ-కామర్స్ సైట్ నుంచైనా ఒకే క్లిక్‌తో దేనినైనా కొనుగోలు చేయవచ్చని తెలిపాడు. ఈ యాప్ ఏఐ టెక్నాలజీ ద్వారా షాపింగ్ ప్రక్రియను సులభతరం చేస్తుందని, బిల్లింగ్, షిప్పింగ్ వివరాలను దానికదే నిర్వహిస్తుందని సానిగర్ పేర్కొన్నాడు. ఈ యాప్ కోసం ఆయన కోట్యూ, ఫోర్రన్నర్ వెంచర్స్, రెనెగేడ్ పార్టనర్స్ తదితర వంటి పెట్టుబడిదారుల నుంచి 50 మిలియన్ డాలర్లకుపైగా నిధులు సేకరించాడు.అయితే ఈ యాప్‌లో ఏఐ ఆటోమేషన్(Automation) దాదాపు శూన్యం అని అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ తేల్చింది. యాప్ ద్వారా జరిగే కొనుగోళ్లను ఫిలిప్పీన్స్‌లోని కాల్ సెంటర్‌లోగల వందలాది ‘పర్చేజింగ్ అసిస్టెంట్స్’ నెరవేరుస్తున్నారని తేలింది. ఈ నేపధ్యంలో ఆల్బర్ట్ సానిగర్ ఏఐ టెక్నాలజీ పేరును ఉపయోగించి, తప్పుడు కథనాన్ని సృష్టించాడని డిపార్ట్మెంట్ పేర్కొంది. 2021 హాలిడే షాపింగ్ సీజన్లో యాప్ డిమాండ్‌ను తట్టుకునేందుకు సానిగర్ తన ఇంజనీరింగ్ టీమ్‌ను కొన్ని లావాదేవీలను ఆటోమేట్ చేయడానికి ‘బాట్లు’ అభివృద్ధి చేయాలని ఆదేశించాడు. అయితే ఈ బాట్లు ఏఐ ఆధారితం కాకుండా, మానవ సిబ్బంది ఆధారంగా పనిచేశాయి. ఆల్బర్ట్ సానిగర్ చేసిన మోసం బయటపడటంతో అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) అతనిపై సివిల్ కేసు నమోదు చేసింది. అతనిని ఇకపై ఇలాంటి కంపెనీలలో అధికారిగా పనిచేయకుండా నిషేధించాలని కోరింది. అలాగే పెట్టుబడిదారుల నుంచి సేకరించిన నిధులను సానిగర్ తిరిగి వారికి ఇవ్వాలని ఆదేశించింది. ఇదేవిధంగా గతంలో ప్రెస్టో ఆటోమేషన్ అనే కంపెనీ ఏఐ ఆధారిత డ్రైవ్ త్రూ సేవలను అందిస్తామని చెప్పి, ఫిలిప్పీన్స్‌లోని సిబ్బందితో కార్యకలాపాలు సాగించి మోసానికి పాల్పడింది. ఇది కూడా చదవండి: గంట ప్రయాణం నిమిషంలో.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన -
ఫ్లోరిడాలో రహదారిపై కుప్పకూలిన విమానం
-
అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ట్రంప్ వచ్చాక 12వ ప్రమాదం
ఫ్లోరిడా: అగ్రరాజ్యం అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. శుక్రవారం న్యూయార్క్‌లో హెలికాప్టర్ ప్రమాదం మరువకముందే.. ఈరోజు మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో చిన్న విమానం కూలిపోయిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. అమెరికాలోని ఫ్లోరిడాలో రహదారిపైనే చిన్న విమానం కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా సెస్నా 310 అనే విమానం విమానాశ్రయానికి సమీపంలోని ఇంటర్‌స్టేట్-95 సమీపంలో కూలిపోయింది. బోకా రాటన్ విమానాశ్రయం నుండి బయలుదేరి తల్లాహస్సీ వైపు వెళుతున్న కొద్ది క్షణాల్లోనే విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం సందర్భంగా విమానం నుంచి మంటలు వచ్చి దట్టమైన పొగ చుట్టుపక్కల వ్యాపించింది. ప్రమాదం కారణంగా ముగ్గురు వ్యక్తులు మరణించినట్టు తెలుస్తోంది.another day in the presidency of the clown who only trusts white men as plane pilots, another plane crash, this time in Boca Raton, Florida. 3 dead, one injuredaccidents happen, but is it a coincidence everything in this country is crumbling under Trump?pic.twitter.com/T7BN9kjuhA— 𝕸𝖔𝖓𝖆𝖗𝖈𝖍𝖔 (@_monarcho) April 11, 2025ఒక్కసారిగా గాల్లో నుంచి విమానం.. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారుపై పడిపోయింది. ఈ కారణంగా కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. హైవేపై ప్రమాదం కారణంగా అక్కడి రోడ్లను మూసివేసి సహాయక చర్యలు చేపట్టినట్టు రాటన్ ఫైర్ రెస్క్యూ అసిస్టెంట్ చీఫ్ మైఖేల్ లాసల్లె నివేదించారు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.Son 3 muertos por desplome de #avioneta en #BocaRatón, #FloridaDe acuerdo a autoridades locales, el incidente dejó un saldo de 3 personas fallecidas, una herida y un #incendio que alcanzó al menos un vehículo. Por ahora, autoridades ya investigan el siniestro. pic.twitter.com/AJVaENkCyT— Cuarto Poder (@CuartoPoderMX) April 11, 2025 రెండు రోజులలో రెండు ప్రమాదాలుఈ ఘటనకు ముందు రోజు, న్యూయార్క్‌లో ఓ హెలికాప్టర్ హడ్సన్ నదిలో కూలిపోయిన ఘటన కూడా చర్చనీయాంశంగా మారింది. వరుసగా రెండు రోజులలో రెండు గగనతల ప్రమాదాలు జరగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. విమాన రవాణా భద్రతపై సర్వత్రా ప్రశ్నలు వేగంగా వెల్లివిరుస్తున్నాయి. నిపుణులు ఈ ఘటనలపై విచారణ చేపట్టి, కారణాలు తెలియజేయాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 12వ విమాన ప్రమాదం కావడం గమనార్హం. అమెరికాలో విమాన భద్రత ప్రమాణాలపై పునర్విచారణ చేయాల్సిన అవసరం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు 125 శాతానికి పెంపు... డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతానికి ప్రతీకారంగా చైనా నిర్ణయం
-
ఒమన్‌లో నేడు ఇరాన్–అమెరికా అణు చర్చలు
మస్కట్: ఆకాశహర్మ్యాలు, హంగూ ఆర్భాటాలు కనిపించని ప్రశాంతమైన తీరప్రాంత మస్కట్ నగరం పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో భాగమైన కీలక చర్చలకు మరోసారి వేదికగా మారనుంది. తమ అణు కార్యక్రమంపై ఒమన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ శనివారం అమెరికాతో చర్చలు జరపనుంది. రెండు దేశాల మధ్య అణు కార్యక్రమంపై ఒప్పందం కుదిరే అవకాశాలు పెద్దగా కనిపించకున్నా ఈ చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక అంగీకారానికి రాని పక్షంలో ఇరాన్ అణు కార్యక్రమం లక్ష్యంగా వైమానిక దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేస్తుండటం.. అణ్వాయుధాల తయారీకి అవసరమైన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని మాత్రం ఆపేది లేదని ఇరాన్ కరాఖండిగా చెబుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ సమయంలో రెండు దేశాలకు సన్నిహితంగా ఉండే ఒమన్ కల్పించుకోవాల్సి వచ్చింది. ట్రంప్ కూడా చర్చలకు ఒమన్ మధ్యవర్తిత్వంపై అనూహ్యంగా సానుకూలత ప్రకటించారు. ఒమన్ వైపు మొగ్గు ఎందుకు? ఒమన్ కీలకంగా వ్యవహరించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘గల్ఫ్ స్టేట్ అనాలిటిక్స్’సీఈవో జార్జియో కెఫియెరో అంటున్నారు. దౌత్యపరంగా ఒమన్ పాత్ర ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. చారిత్రకంగా చూసినా ప్రపంచ రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన గత అనుభవం ఒమన్‌కు ఉందని హైడెల్బర్గ్ యూనివర్సిటీ చరిత్ర ప్రొఫెసర్ మార్క్ అంటున్నారు. ఒమన్ ప్రజల్లో అత్యధికులు ఇబాదీ ముస్లింలు. ఇది సున్నీ–షియా విభజనకు ముందు నుంచీ ఉన్న ఉదారవాద ఇస్లాం శాఖ అని వివరించారు. ఇరాన్‌తో వ్యవహరించే విషయంలో గత కొన్నేళ్లుగా అమెరికా ప్రధానంగా ఒమన్పైనే ఆధారపడుతోందని ఆయన అన్నారు. 2015లో ఇరాన్‌తో అణు ఒప్పందం కుదరటానికి అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రహస్య చర్చల్లో ఒమన్ ఎంతో సాయపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే, ఆ దేశం ఎప్పుడూ వార్తల్లో ప్రధానంగా కనిపించేందుకు ప్రయతి్నంచలేదని, కేవలం తెరవెనుక ప్రభావవంతమైన పాత్ర పోషించిందన్నారు.అమెరికాతో నేరుగా చర్చలు జరపం: ఇరాన్ అమెరికాతో తాము నేరుగా చర్చల్లో పాల్గొనేది లేదని ఇరాన్ అంటోంది. అణు కార్యక్రమంపై ఒప్పందం విషయంలో ముందుగా ఒమన్ విదేశాంగ మంత్రితో మాట్లాడుతామని, తమ సందేశాన్ని ఆయనే అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్కు అందజేస్తారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ బద్ర్ తెలిపారు. 2015లో కుదిరిన అణు ఒప్పందం ప్రకారం ఇరాన్ 3.67 శాతం శుద్ధి చేసిన యురేనియంను కొద్ది మొత్తంలో మాత్రమే నిల్వ ఉంచుకునేందుకు అవకాశముంది. అయితే, ఆ దేశం వద్ద ప్రస్తుతం 60 శాతం వరకు శుద్ధి చేసిన యురేనియం పెద్ద మొత్తంలో నిల్వ ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో, ఇరాన్‌తో కుదిరిన ఒప్పందం నుంచి ఏకపక్షంగా బయటికి వస్తూ ట్రంప్ మొదటిసారి అధ్యక్ష పదవిలో ఉండగా ప్రకటించారు. ప్రస్తుతం అణ్వాయుధం తయారీ దిశగా సాంకేతికంగా ఇరాన్ అతి సమీపంలో ఉన్నట్లు లెక్క. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు సదుపాయాలపై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. ఆ దేశంపై ఒత్తిడి తెచ్చే చర్యల్లో భాగంగా హిందూ మహా సముద్రంలోని డీగో గార్సియా మిలటరీ స్థావరానికి ఆరు బీ2 బాంబర్లను తరలించారు. చమురు అన్వేషణ, అణు కార్యక్రమంపై మరిన్ని ఆంక్షలు తప్పవని కూడా ట్రంప్ అంటున్నారు. ఇలాంటి హెచ్చరికలు సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయని, ఐరాస అణు పరిశీలకులను దేశం నుంచి బహిష్కరించడానికి కైనా వెనుకాడబోమని ఇరాన్ అంటోంది. -
ఈ ఏడాది వృద్ధి 6.1 శాతమే
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మూడీస్ అనలైటిక్స్ 0.3 శాతం తగ్గించింది. 2025లో జీడీపీ 6.4 శాతం వృద్ధి చెందుతుందంటూ ఈ ఏడాది మార్చిలో వేసిన అంచనాను 6.1 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా ప్రతీకార సుంకాల వల్ల పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనాలను సవరించింది. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో అమెరికాను ఒకటిగా పేర్కొంటూ.. భారత ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌లు వాణిజ్యానికి అవరోధాలు కల్పిస్తాయని తెలిపింది. రత్నాభరణాలు, వైద్య పరికరాలు, టెక్స్టైల్స్ పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఎగుమతులు భారత జీడీపీలో అతి స్వల్ప వాటాను కలిగి ఉన్నందున.. మొత్తం మీద భారత వృద్ధి రేటు వెలుపలి రిస్‌్కలకు పెద్దగా ప్రభావితం కాబోదని. స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున ఆర్బీఐ రెపో రేటును మరో పావు శాతం మేర తగ్గించొచ్చని.. ఈ ఏడాది చివరికి ఇది 5.75 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. దీనికితోడు బడ్జెట్లో ప్రకటించిన పన్ను మినహాయింపులు దేశీ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తాయని.. దీంతో మొత్తం మీద వృద్ధిపై సుంకాల ప్రతికూల ప్రభావం తక్కువకు పరిమితం అవుతుందని మూడీస్ అనలైటిక్స్ అంచనా వేసింది. అనిశ్చితులు కొనసాగుతాయి.. చైనా మినహా భారత్ సహా ఇతర దేశాలపై ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు అమెరికా వాయిదా వేయడం గమనార్హం. అయినప్పటికీ అనిశ్చితి కొనసాగుతుందని, ఈక్విటీల్లో ఆటుపోట్లు కొనసాగొచ్చని మూడీస్ అనలైటిక్స్ తెలిపింది. ‘‘పెరుగుతున్న అనిశి్చతిని తక్కువగా అంచనా వేయరాదు. గృహ, వ్యాపార సెంటిమెంట్ తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మానిటరీ పాలసీ సులభతరం వల్ల ఒనగూరే ప్రయోజనాల ఫలితం తగ్గొచ్చు. అనిశి్చతుల్లో మరింత ఖర్చుకు గృహస్థులు వెనుకాడొచ్చు. వ్యాపార సంస్థలు సైతం అదనపు పెట్టుబడుల విషయంలో వెనక్కి తగ్గొచ్చు’’అని మూడీస్ అనలైటిక్స్ తన నివేదికలో వివరించింది. టారిఫ్‌లతో వాణిజ్య వ్యయాలు పెరిగిపోతాయని, అది అంతర్జాతీయ వృద్ధిని బలహీనపరుస్తుందని అంచనా వేసింది. -
ఆగ్నేయాసియాపై చైనా దృష్టి
బీజింగ్: అమెరికా టారిఫ్‌ల పోరు నేపథ్యంలో ప్రాంతీయ బంధాలను బలోపేతం చేసుకోవడంపై చైనా దృష్టి పెట్టింది. అధ్యక్షుడు జిన్ పింగ్ వచ్చే వారం మూడు ఆగ్నేయాసియా దేశాల్లో పర్యటించనున్నారు. ఏప్రిల్ 14 నుంచి 15 వరకు వియత్నాంలో, 18 వరకు మలేసియా, కంబోడియాల్లో ఆయన పర్యటిస్తారని చైనా విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. సుంకాల బాదుడు నుంచి ఇతర దేశాలన్నింటికీ 90 రోజుల ఉపశమనం కలి్పంచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మాత్రం టారిఫ్‌లు ఎడాపెడా పెంచేసిన నేపథ్యంలో జిన్‌పింగ్ పర్యటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికా వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కోవడంలో కలిసి రావాల్సిందిగా భారత్‌కు కూడా చైనా విజ్ఞప్తి చేసింది. -
చైనా.. తగ్గేదేలే!
బీజింగ్: అమెరికా, చైనా టారిఫ్ పోరు మరింత ముదిరింది. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరినట్టు అమెరికా గురువారం ప్రకటించడం తెలిసిందే. ఆ మర్నాడే ఆ దేశంపై సుంకాలను 84 నుంచి 125 శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది. అయితే, ‘‘మాపై అమెరికా ఇప్పటికే సుంకాలను అవాస్తవిక రీతిలో పెంచేసింది. ఇంకా పెంచితే ఇక అర్థముండదు. ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఓ నవ్వులాట ఉదంతంగా నిలిచిపోతుంది. అమెరికా ప్రస్తుత టారిఫ్‌లను భరిస్తూ ఆ దేశ దిగుమతులను చైనా మార్కెట్లోకి అనుమతించడం ఇప్పటికే అసాధ్యంగా మారిపోయింది. కనుక మాపై అమెరికా టారిఫ్‌లను ఇంకా పెంచేసినా మేం మాత్రం ఆ దేశంపై అదనపు సుంకాలు విధించబోం’’ అని స్పష్టం చేసింది. ఈ మతిలేని దూకుడు ఎవరికీ మేలు చేయదని చైనా వాణిజ్య శాఖ పేర్కొంది. వాణిజ్య యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని అభిప్రాయపడింది. ‘‘అందుకే టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు ఇప్పటికీ చైనా సిద్ధంగానే ఉంది. మావైపు నుంచి తలుపులు తెరిచే ఉన్నాయి. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకుంటామనే ఆశిస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అయితే ఏ చర్చలైనా సమానత్వం, పరస్పర విశ్వాసాల ప్రాతిపదికన జరగాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. ట్రంప్ టారిఫ్‌లను అమెరికా ప్రజలే విమర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భారత్ సహా ఇతర దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు ట్రంప్ తాత్కాలికంగా పక్కన పెట్టడం తెలిసిందే. చైనాపై మాత్రం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 20 శాతం ఫెంటానిల్ సుంకంతో కలిపి అది 145 శాతానికి చేరినట్టు వైట్‌హౌస్ గురువారం స్పష్టతనిచి్చంది.ఏకాకిగా మిగులుతారు అమెరికాపై జిన్‌పింగ్ ధ్వజం కలసికట్టుగా ఎదుర్కొందాం ఈయూ దేశాలకు పిలుపుఅమెరికా టారిఫ్‌లపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారిగా స్పందించారు. అవి ఫక్తు ఏకపక్ష పోకడలంటూ మండిపడ్డారు. ‘‘టారిఫ్‌ల యుద్ధంలో ఎవరూ గెలిచేదుండదు. ఇలా ప్రపంచం మొత్తానికీ వ్యతిరేకంగా వెళ్తే ఏకాకులు కావడం మినహా ఒరిగేదేమీ ఉండదు’’ అంటూ హితవు పలికారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో శుక్రవారం బీజింగ్‌లో జిన్‌పింగ్ భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడును అడ్డుకోవడంలో తమతో కలిసి రావాల్సిందిగా యూరోపియన్ యూనియన్‌కు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ‘‘ఇది మన అంతర్జాతీయ బాధ్యత కూడా. మన సంయుక్త స్పందన ఇరుపక్షాలకు మాత్రమే గాక మొత్తం అంతర్జాతీయ సమాజానికీ మేలు చేస్తుంది. స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణాన్ని కాపాడుతుంది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘చైనా ఏనాడూ ఇతరుల దయపై ఆధారపడలేదు. 70 ఏళ్లుగా స్వయంసమృద్ధినే, కష్టాన్నే నమ్ముకుంది’’ అని జిన్‌పింగ్ స్పష్టం చేశారు. -
విదేశీ విద్యార్థులపై... ఎందుకీ కత్తి?
విదేశీ విద్యార్థుల వీసాలను ట్రంప్ సర్కారు ఎడాపెడా రద్దు చేస్తుండటాన్ని అమెరికన్లు కూడా హర్షించడం లేదు. ఈ ధోరణి అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టం చేకూరుస్తుందన్న ఆందోళన నానాటికీ తీవ్రతరమవుతున్నాయి. ఈ విషయమై అక్కడి విద్యా సంస్థలే గళమెత్తుతున్నాయి. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ (ఏసీఈ)తో పాటు మరో 15 సంస్థలు బాధిత విదేశీ విద్యార్థుల తరఫున రంగంలోకి దిగాయి. ఏ కారణాలూ చూపకుండా వారి వీసాలను రద్దు చేయడం, సంబంధిత యూనివర్సిటీలకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండానే వారి స్టూడెంట్ ఎక్స్చేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సి స్టం (సెవిస్) రికార్డులను గల్లంతు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. దీనిపై తక్షణం వివరణ ఇవ్వాలంటూ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) వి భాగానికి సంయుక్తంగా ఓ లేఖ రాశాయి. డీహెచ్ఎస్ మంత్రి క్రిస్టీ నోయెమ్‌తో పాటు విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు కూడా లేఖ ప్రతిని పంపాయి. విద్యార్థి వీసాల రద్దుకు సంబంధించి పూర్తి వివరాలు బయట పెట్టాల్సిందేనని ఏసీఈ అధ్యక్షుడు టెడ్ మిషెల్ డిమాండ్ చేశారు. ‘‘స్వీయ డీపో ర్టేషన్ ద్వారా దేశం వీడండంటూ విద్యార్థులకు వస్తున్న ఈ మెయిళ్లు, మెసేజీల ద్వా రా మాత్రమే విషయం తెలుస్తోంది. అందుకు కారణాలైనా చెప్పకపోవడం మరీ దారుణం. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అభ్యంతరకర సోషల్ మీడియా కార్యకలాపాలకు, డాక్యుమెంటేషన్ తప్పిదాలకు, చివరికి ట్రాఫిక్ ఉల్లంఘనలకు కూడా వీసాలు రద్దు చేస్తున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న తప్పిదాలకు కూడా ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం దారుణం’’అంటూ ఆయన ఆక్షేపించారు. ‘‘మీ తీరుతో అమెరికావ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇది మన దేశానికి కూడా మంచిది కాదు’’అని ఆవేదన వెలిబుచ్చారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ జాతీయ భద్రత పేరిట విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. ఇప్పటిదాకా కనీసం 300 మందికి పైగా పాలస్తీనా సానుభూతిపరులైన విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్టు రూబి యో ఇటీవల వెల్లడించారు. గతంలో ఏ కారణంతోనైనా విద్యార్థి వీసాలను రద్దు చేసినా విద్యాభ్యాసం పూర్తయ్యేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుండేది. ఇప్పుడు మాత్రం వీసా రద్దుతో పాటు సెవిస్ రికార్డులను కూడా శాశ్వతంగా తుడిచిపెడుతుండటంతో బాధిత విద్యార్థులు తక్షణం అమెరికాను వీడటం తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. వర్సిటీల్లోనూ ఆందోళన విద్యార్థి వీసాల రద్దు అమెరికా యూనివర్సిటీలను కూడా ఆందోళనకు గురి చేస్తోంది. చాలాసార్లు ఈ ఉదంతాలు తమ దృష్టికి కూడా రావడం లేదని ప్రఖ్యాత హార్వర్డ్ వర్సిటీ పేర్కొంది. ‘‘మేం స్వయంగా పూనుకుని మా విద్యార్థుల రికార్డులను పరిశీలించాల్సి వస్తోంది. మా వర్సిటీకీ చెందిన ముగ్గురు విద్యార్థులతో పాటు ఇటీవలే విద్యాభ్యాసం ముగించుకున్న మరో ఇద్దరి వీసాలను రద్దు చేసినట్టు తెలియగానే వారికి న్యాయ సాయాన్ని సిఫార్సు చేశాం’’అని వెల్లడించింది. అరిజోనా స్టేట్ వర్సిటీలో 50 మంది విదేశీ విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదరైంది. వారి వీసాల రద్దుకు కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. నార్త్ ఈస్టర్న్ వర్సిటీలోనూ 40, కాలిఫోర్నియా వర్సిటీలో 35 మంది విద్యార్థుల వీసాలు కూడా రద్దయ్యాయి. ఇలాంటి పరిస్థితులను గతంలో ఎన్నడూ చూడలేదని మసాచుసెట్స్ వర్సిటీ చాన్స్‌లర్ వాపోయారు. విదేశీ విద్యార్థులే కీలకం అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విదేశీ విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024లో వారినుంచి అమెరికాకు ఏకంగా 4,380 కోట్ల డాలర్ల మేరకు ఆదాయం సమకూరినట్టు ‘ఓపెన్ డోర్స్’నివేదిక పేర్కొంది. అమెరికా వర్సిటీల్లో ఉన్నతవిద్య పూర్తి చేసుకుంటున్న విదేశీ విద్యార్థులను, ముఖ్యంగా భారతీయులను అమెరికా ఐటీ సంస్థలు కళ్లు చెదిరే వేతనాలిచ్చి మరీ తీసుకుంటున్నాయి. కొన్నేళ్లలోనే ఆ సంస్థలకు వాళ్లు వెలకట్టలేని ఆస్తిగా మారుతున్నారు. ‘అమెరికా ఫస్ట్’పేరిట విదేశీ విద్యార్థులపై వేధింపులు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల నుంచి అగ్ర రాజ్యానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న మేధో వలసకు అడ్డుకట్ట పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతిమంగా అమెరికాకే తీవ్ర నష్టమని అక్కడి విద్యా సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డేవిడ్ హెడ్లీని అప్పగించడానికి సముఖంగా లేని యూఎస్ ఎజెన్సీలు
-
ట్రంప్ పన్నులపై చైనా జిన్‌పింగ్ ఫస్ట్ రియాక్షన్.. ఏమన్నారంటే..
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలను ఏకపక్ష బెదిరింపు అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అభివర్ణించారు. ట్రంప్ బెదిరింపులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ తమతో కలిసి రావాలని జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. అలాగే, అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125 శాతానికి పెంచినట్టు చెప్పుకొచ్చారు. చైనాపై అమెరికా భారీగా పన్నులను పెంచిన నేపథ్యలో అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. ఈ సందర్బంగా జిన్‌పింగ్ మాట్లాడుతూ..‘ట్రంప్ విధించిన 145 శాతం సుంకాలు బెదిరింపులతో కూడినవి. ఏకపక్షంగా అమెరికా నిర్ణయాలు తీసుకుంది. ఇది సమంజసం కాదు. ట్రంప్ పన్నులను ప్రతిఘటించడానికి యూరోపియన్ యూనియన్ మాతో కలిసి రావాలని కోరుతున్నాను. యూరప్ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంది. అందరూ కలిసి ఐకమత్యంగా అమెరికాపై పోరాటం చేయాల్సి ఉంది’ అని చెప్పుకొచ్చారు.మరోవైపు.. చైనాపై అమెరికా 145 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో జిన్‌పింగ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు ఆగ్నేయాసియా దేశాల పర్యటనకు అధ్యక్షుడు జిన్‌పింగ్ బయలుదేరి వెళ్లారు. ఏప్రిల్ 14 నుంచి వియత్నాం, మలేసియా, కంబోడియాలో జిన్‌పింగ్ పర్యటించనున్నారు. ఇక, డొనాల్డ్ ట్రంప్.. వియత్నాం, కంబోడియా దేశాలపై కూడా భారీగానే పన్నులు విధించారు. వియత్నాంపై 46 శాతం, కంబోడియాపై 49 శాతం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాలతో జిన్‌పింగ్ చర్చలు జరపనున్నారు.Latest UY | WorldXi Jinping’s Southeast Asia Tour: A Move Amidst U.S. Trade Storm?Chinese President Xi Jinping embarks on a pivotal journey to Vietnam, Malaysia, and Cambodia starting April 14, aiming to fortify bonds with key allies as U.S. tariffs tighten their grip. With… pic.twitter.com/IfsHmtQ4c1— UnreadWhy (@TheUnreadWhy) April 11, 2025జిన్‌పింగ్ చాలా స్మార్ట్: ట్రంప్అంతకుముందు.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జిన్‌పింగ్‌కు ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. దేశం అంటే ఆయనకు ఎంతో ప్రేమ. ఆ విషయం నాకు బాగా తెలుసు. జిన్‌పింగ్ గురించీ తెలుసు. ఆయన సుంకాలపై ఒక ఒప్పందం కుదుర్చుకుంటారని నేను అనుకుంటున్నా. త్వరలోనే దీనిపై చర్చించేందుకు అక్కడి (చైనా) నుంచి మాకు ఫోన్ కాల్ వస్తోందని భావిస్తున్నా. దానికి మేం సిద్ధంగా ఉన్నాం’ అని పేర్కొన్నారు. -
భారతీయులకు అలా జరగాల్సిందే.. హెడ్లీతో రాణా
న్యూఢిల్లీ: ముంబై 26/11 దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులకు పాకిస్తాన్లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే అవార్డు ఇవ్వాలని డేవిడ్ హెడ్లీతో తహవూర్ రాణా జరిపిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. భారత్‌కు రాణా అప్పగింత సమయంలో అమెరికా న్యాయ విభాగం విడుదల చేసిన ఒక ప్రకటన పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ అప్పగింత బాధిత కుటుంబాలకు న్యాయం చేసే కీలక అడుగుగా అభివర్ణించింది.ముంబై దాడుల సమయంలో భారత బలగాల చేతుల్లో మరణించిన తొమ్మిది మంది లష్కరే(LeT) ఉగ్రవాదులకు నిషాన్ ఏ హైదర్(పాక్‌లో వీరమరణం పొందే సైనికులకు ఇచ్చే గౌరవం) ఇవ్వాలి అని దాడుల మాస్టర్ మైండ్ హెడ్లీని రాణా కోరారు. అలాగే.. దాడులకు రెండేళ్లకు ముందు నుంచే హెడ్లీ తరచూ చికాగోకు వెళ్లి రాణాను కలుస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఎల్ఈటీ కదలికల గురించి, ముంబై దాడుల గురించి వీరిరువురూ చర్చించారు.అప్పటికే చికాగోలో ఇమ్మిగ్రేషన్ వ్యాపారంలో ఉన్న రాణా ముంబైలోనూ ఓ కార్యాలయం తెరవాలని చూశాడు. దానికి ఎలాంటి అనుభవం లేకపోయినా హెడ్లీని మేనేజర్‌ను చేయాలనుకున్నాడు. అలాగే ముంబై దాడుల అనంతరమూ ఈ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో జరిగిన నష్టం గురించి హెడ్లీ ప్రస్తావించగా.. భారతీయులకు ఇలా జరగాల్సిందేనంటూ రాణా బదులిచ్చాడు. అంతేకాదు హెడ్లీ ప్రయాణాలకు అవసరమైన తప్పుడు పత్రాలను కూడా రాణానే సృష్టించేవాడు. ముంబై దాడుల్లో భాగస్వాములుడేవిడ్ కోల్మన్ హెడ్లీ(దావూద్ గిలానీ), తహవూర్ హుసేన్ రాణా.. ఈ ఇద్దరూ 2008 ముంబై ఉగ్రదాడుల కేసుల్లో ప్రధాన నిందితులుగానే ఉన్నారు. డేవిడ్ హెడ్లీ ప్రధాన సూత్రధారి కాగా.. రాణా అతనికి సహకరించాడని అభియోగాలు ఉన్నాయి. రెక్కీ నిర్వహించడంతో దాడులకు బ్లూప్రింట్ రూపకల్పన తదితర అంశాలను రాణానే దగ్గరుండి చూసుకున్నట్లు నేరారోపణలు ఉన్నాయి. ముంబై దాడులతో పాటు పలు ఉగ్రదాడుల కేసుల్లో 2009 అక్టోబర్‌లో తొలుత హెడ్లీ, ఆపై రాణా అరెస్టయ్యారు. డేవిడ్ హెడ్లీకి అక్కడి కోర్టులు 35 ఏళ్ల కారాగార శిక్ష విధించగా.. అప్రూవర్‌గా మారిపోయి అమెరికా న్యాయ విభాగంతో జరుపుకున్న ఒప్పందం ప్రకారం అతన్ని భారత్‌కు అప్పగించే అవకాశం లేకుండా పోయింది. ఇక.. 2013లో తహవూర్ రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది ఇల్లినాయిస్ కోర్టు. దాదాపు ఏడేళ్ల తర్వాత.. 2020లో తహవూర్ రాణాను తమకు అప్పగించాలని భారత్ అమెరికాకు విజ్ఞప్తి చేసింది. మూడేళ్ల తర్వాత.. సెంట్రల్ డిసస్టట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియా అనుమతించింది. అప్పటి నుంచి అన్నిరకాల కోర్టుల్లో ఊరట కోసం రాణా ప్రయత్నిస్తూ వచ్చాడు. చివరకు అగ్రరాజ్య సుప్రీం కోర్టులోనూ దారులు మూసుకుపోవడంతో.. ఎట్టకేలకు అమెరికా భారత్‌కు అప్పగించింది. -
అదృష్టమంటే ఇదే.. ఒకేసారి రెండు లాటరీలు.. ఊహించనంత డబ్బు!
ఎవరికైనా జీవితంలో ఒకసారి లాటరీ తగిలితేనే వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెబుతారు. అలాంటిది ఒకేసారి రెండు లాటరీలు తగిలితే.. వాళ్ళను ఏమనాలి. ఇలాంటి ఘటన ఎక్కడైనా జరుగుతుందా అని మీరు అనుకోవచ్చు. కానీ అమెరికాలోని నార్త్ కరోలినాలో ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.నార్త్ కరోలినాలోని ఒక వ్యక్తి అప్పటికే గెలుపొందిన లాటరీ బహుమతి రూ. 40 లక్షలు క్లెయిమ్ చేసుకోవడానికి.. గ్రీన్స్బోరో రీజినల్ ఆఫీస్ & క్లెయిమ్ సెంటర్‌కు వచ్చాడు. ఆ సమయంలో తన కుమార్తె.. అతని పుట్టినరోజును గుర్తుగా ఒక కెనో టికెట్ కొనుగోలు చేసింది. లాటరీలో ఆ టికెట్టుకు సుమారు రూ. 86 లక్షలు వచ్చాయి. ఇలా ఒకేరోజు రెండు లాటరీలు తగిలాయి. ఊహకందని డబ్బు చేతికి రావడంతో ఆ వ్యక్తి, అతని కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.ఒక అమెరికన్ వ్యక్తి లాటరీలో భారీ మొత్తంలో డబ్బు గెలుచుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఫిబ్రవరిలో కూడా నార్త్ కరోలినాలోని స్టాన్లీకి చెందిన విజేత రాబర్ట్ హోబన్ అనే వ్యక్తి లాటరీ టికెట్ ద్వారా రూ. 95 లక్షల కంటే ఎక్కువ గెలుచుకున్నాడు. ఇతడు లాటరీ టికెట్ కొనుగోలు చేసిన తరువాత, ఆ రాత్రి లాటరీ గెలుచుకున్నట్లు కలగన్నాడు. ఆ కల ఉదయానికి నిజమైంది. కలలో చూసిన మొత్తానికి అతడు గెలుచుకున్నాడు.గమనిక: లాటరీ టికెట్స్ పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి లాటరీ టికెట్స్ కొనుగోలు చేయాలంటే.. తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. పాఠకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. లేకుంటే మోసపోయే అవకాశం ఉంది. -
రాణా అప్పగింతపై స్పందించిన అమెరికా
26/11 ముంబై ఉగ్రదాడుల కీలక సూత్రధారి తహవూర్ హుసేన్ రాణా.. సుమారు దశాబ్దంన్నర తర్వాత విచారణ ఎదుర్కొనబోతున్నాడు. పాక్ మూలాలు ఉన్న లష్కరే ఉగ్రవాది అయిన రాణాను అమెరికా మార్షల్స్ బుధవారం ప్రత్యేక విమానంలో భారత్‌కు తీసుకొచ్చారు. గురువారం సాయంత్రం ఢిల్లీ పాలెం ఎయిర్‌పోర్టులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అధికారులకు అప్పగించడంతో అధికారిక ప్రక్రియ ముగిసింది. అయితే ఈ పరిణామంపై అమెరికా స్పందించింది. భారత్‌కు అతన్ని అప్పగించడం గర్వకారణంగా ఉందంటూ ప్రకటించింది.‘‘2008 ముంబై ఉగ్రదాడులకు రూపకర్తగా తహవూర్ రాణా(tahawwur rana)పై అభియోగాలు ఉన్నాయి. ఇందుకుగానూ న్యాయస్థానాల్లో విచారణ ఎదుర్కొనేందుకు అతన్ని అమెరికా నుంచి భారత్‌కు తరలించాం’’ అని విదేశాంగ ప్రతినిధి టామీ బ్రూస్ మీడియాకు వెల్లడించారు.. ముంబైలో నాడు జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి చేసింది. కొంతమందికి గుర్తు లేకపోవచ్చు. కానీ, ఒకసారి పరిశీలిస్తే అది ఎంత భయంకరమైందో.. ఈనాటికి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుస్తుంది. ఈ దాడులకు బాధ్యులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు అమెరికా చాలా కాలంగా మద్దతు ఇస్తోంది. ఉగ్రవాదం అనే ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనడానికి భారత్, అమెరికా కలిసి కట్టుగా పని చేస్తుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మొదటి నుంచి చెబుతున్నారు. ఈ విషయంలో ఆయన తన నిబద్ధతను కనబరిచారు. అందుకు మేం గర్వపడుతున్నాం’’ అని టామీ బ్రూస్ ప్రకటించారు.2009 అక్టోబర్‌లో ముంబై ఉగ్రదాడులు సహా పలు కేసులు ఉన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీని అమెరికాలో అరెస్ట్ చేశారు. హెడ్లీ ఇచ్చిన సమాచారంతో ఇల్లినాయిస్ చికాగోలో ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న తహవూర్ రాణాను అక్టోబర్ 18వ తేదీన ఎఫ్‌బీఐ అరెస్ట్ చేసింది. ఆపై అభియోగాలు రుజువు కావడంతో 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే ముంబై ఉగ్రదాడి కేసులో విచారణ ఎదుర్కొనేందుకు తనను భారత్‌కు అప్పగించకుండా నిలువరించాలంటూ ఇన్నేళ్లపాటు దాదాపు అక్కడి అన్ని కోర్టులను ఆశ్రయిస్తూ వచ్చాడు రాణా. అయితే ఊరట మాత్రం దక్కలేదు.ఈలోపు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఆ సమయంలో రాణాను భారత్‌కు అప్పగించే విషయంపై ట్రంప్ స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ (India)కు అప్పగిస్తాం. అలాగే త్వరలో మరింతమంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటాం’’ అని ఆయన ప్రకటించారు. అందుకు తగ్గట్లే పరిణామాలు చకచకా జరిగి రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది.ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 10వ తేదీన భారత్‌లో దిగగానే తహవూర్ రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) అరెస్ట్ చేసింది. ఆపై కోర్టులో ప్రవేశపెట్టగా 18 రోజుల ఎన్ఐఏ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో అతన్ని తీహార్ జైలుకు తరలించారు. 2008 ముంబై ఉగ్రదాడుల కేసుకు సంబంధించి మొత్తం 10 క్రిమినల్ అభియోగాలను రాణా ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
‘గుడ్లు’ తేలేసేలా.. అమెరికాలో డజను కోడిగుడ్లు రూ.536
వాషింగ్టన్: అమెరికాలో కోడి గుడ్లు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. నెల నెలా రేటు పెరుగుతూ కొనుగోలు దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో డజను కోడి గుడ్లు ధర 5.90 డాలర్లు (భారత కరెన్సీలో రూ.508.76) ఉండగా మార్చి నెలలో 6.23 డాలర్లకు (రూ.536) చేరింది. అయితే, అమెరికాలో కోడి గుడ్లు ధరలు ఆకాశాన్ని తాకడం వెనుక బర్డ్ ఫ్లూ ఓ కారణం. బర్డ్ ఫ్లూని అరికట్టేందుకు అమెరికా గుడ్లు పెట్టే కోళ్లను నిర్మూలించింది. ఆ ప్రభావం రిటైల్ మార్కెట్లోని గుడ్ల ధరలపై పడింది. ట్రంప్ వరుస ప్రకటనలు ఫలితంగా గుడ్లు తేలేసేలా.. కొండెక్కిన కోడిగుడ్ల ధరలతో అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళనలపై.. గత కొన్ని వారాలుగా తన పాలనలో గుడ్లు ధరల్ని తగ్గించామంటూ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. తాను రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హోల్‌సేల్ గుడ్ల ధరలు 59శాతం నుంచి చివరికి 79 శాతానికి తగ్గాయని చెప్పారు’ అని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీఇదే విషయంపై వైట్ హౌస్ ప్రతినిధి అన్నా కెల్లి సైతం ప్రస్తావించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు బయోసెక్యూరిటీని బలోపేతం చేసినట్లు, కొత్త నిబంధనలను సడలించి కోడి గుడ్ల సరఫరా పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బర్డ్ ఫ్లూపై మేం తీసుకున్న చర్యలు ఫలితాల్ని ఇస్తున్నాయి’ అని పేర్కొన్నారు. గుడ్ల ధరలపై భిన్నాభిప్రాయాలు అమెరికాలో అమాంతం పెరిగిపోతున్న గుడ్ల ధరలపై ఆర్థిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మిచిగన్ స్టేట్ యూనివర్సిటీ ఆహార ఆర్థిక నిపుణుడు డేవిడ్ ఓర్టెగా మాట్లాడుతూ.. హోల్‌సేల్ ధరలు తగ్గినా, ఆ ప్రభావం రిటైల్ ధరలపై పడేందుకు కొన్ని వారాలు సమయం పడుతుందన్నారు. పాల్ట్రీ ఫారాల్లో బర్డ్ ఫ్లూ తగ్గడం, సరఫరా పెరగడం వల్ల హోల్‌సేల్ ధరలు తగ్గినప్పటికీ.. రిటైల్ ధరలు ఎంత తగ్గుతాయో అంచనా వేయడం కష్టం’ అని కార్నెల్ యూనివర్శిటీకి ఆర్థిక నిపుణుడు క్రిస్టఫర్ బి. బారెట్ చెప్పారు. -
భారత విద్యార్థులపై ట్రంప్ సంచలన నిర్ణయం.. కేంద్రం అలర్ట్
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో భారతీయ విద్యార్థుల ప్రతి కదలికపై ఆ దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడి వెళ్లినా, ఏం చేస్తున్నా నీడలా వెంటాడుతున్నారు. విద్యార్థులు నిజంగానే చదువుతున్నారా? చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాలేమైనా చేస్తున్నారా? వాళ్ల బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? సరైన పత్రాలతోనే వచ్చారా? అనే వివరాలను సేకరిస్తున్నారు. హెచ్–1బీ వీసా పొందిన వారిపైనా నిఘా కొనసాగుతోందని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన వర్సిటీలపై దృష్టిఅమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య రానురాను పెరుగుతోంది. 2022–23లో 2,68,923 మంది వెళ్తే, 2023–24లో 3,31,602 మంది వెళ్లారు. ప్రధానంగా న్యూయార్క్ వర్సిటీ, నార్త్ ఈస్టర్న్ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలోనే లక్షకుపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చాలామంది క్యాంపస్‌ల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారనేది అమెరికా అనుమానం. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్ ఏంజెల్స్ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. తలనొప్పిగా ఓపీటీ అమెరికాలో ఎంఎస్ చేసిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు (ఇవి కూడా స్కిల్డ్ మాత్రమే) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ఇస్తారు. 2023–24 లెక్కల ప్రకారం భారత విద్యార్థులు 97,556 మంది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓపీటీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంత కాలం అమెరికాలో ఉండొచ్చు. ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది. అందుకోసం త్వరలో చట్టం తెస్తానని ట్రంప్ ప్రకటించారు. అదే జరిగితే ఎంఎస్ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వాళ్లు మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా వాళ్లు తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లడం కోసం ఒక్కో విద్యార్థి సగటున రూ.35 లక్షల నుంచి రూ.49 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఉత్త చేతులతో ఇండియాకు తిరిగి వచ్చే పరిస్థితిని తలచుకుంటేనే గుండె పగిలిపోతోందని విద్యార్థులు అంటున్నారు. ఏఐతో పటిష్టమైన డేటా ప్రతి విదేశీ విద్యార్థిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నిఘా పెట్టినట్టు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ ఉన్నాడు? అతని బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? అమెరికా వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు? ఎలా సంపాదించాడు? ఏయే ఉద్యోగాలు చేశాడు? అనే వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఏడాది కాలంగా ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఏయే లొకేషన్స్‌లో ఉన్నాడు? ఆ లొకేషన్స్‌లో మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు ఏం ఉన్నాయి? వాటి నుంచి ఎవరికి డబ్బు చెల్లించారు? ఇందులో విద్యార్థులుగా ఉన్నవారికి ఎంత? ఎందుకు? అనే వివరాలపై దృష్టి పెట్టారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా, ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు. ఇది అమెరికా చట్టాలకు విరుద్ధం కాబట్టి అలాంటి విద్యార్థులకు సమస్యలు తప్పేట్టు లేదు. కన్సల్టెన్సీలపై నిఘా అమెరికా అధికారుల నిఘాపై ఆ దేశంలోని భారత రాయభార కార్యాలయం ఇటీవల భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. విద్య కన్సల్టెన్సీలు విద్యార్థులను అక్రమంగా అమెరికాకు పంపుతున్నాయని ఆక్షేపించింది. ఇప్పటివరకు 5 వేల మందిని ఈ కేటగిరీ కింద గుర్తించినట్టు తెలిపింది. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కన్సల్టెన్సీల వివరాలు ఇవ్వాలని ఇటీవల లేఖ రాసింది. పత్రాలన్నీ చూస్తున్నారు ఇండియా నుంచి విచ్చిన విద్యార్థి ఆర్థిక స్థితిగతులపై అమెరికాలో ఆరా తీస్తున్నారు. చదువు కోసమే వచ్చిన వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించిన వారిని ప్రశ్నించే వీలుంది. – విక్రమ్ శశాంక్, ప్రవాస భారతీయుడు. ఓపీటీ తీసేస్తే పరిస్థితి ఏమిటి? రూ.45 లక్షలు అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్ టైం జాబ్ చేసి కొంత తీర్చాను. ఇప్పుడు ఓపీటీ ఎత్తివేస్తే తిరిగి ఇండియా వెళ్లిపోవాలి. అక్కడ ఉద్యోగం వస్తుందో రాదో చెప్పలేం. అప్పు తీర్చే మార్గం కన్పించడం లేదు. – అఖిలేష్ పూనాటి, అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసిన విద్యార్థి. హెచ్–1బీకీ తిప్పలే ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడివాళ్లకే (అమెరికన్లకు) అనే నినాదం ఊపందుకుంటోంది. ఇండియాతోపాటు ఇతర దేశాలవారినీ ఎందుకు రప్పించాలనే భావనతో ట్రంప్ వెళ్తున్నారు. భవిష్యత్‌లో హెచ్–1బీ వీసాలు ఉండకపోవచ్చు. ఇక్కడే పిల్లలను చదివిద్దామని వచ్చాను. ఇప్పుడు వాళ్లు కూడా ఇబ్బంది పడాల్సిందే. – మంజులా రాయ్, హెచ్–1బీ వీసాపై అమెరికా వెళ్లిన ఎంఎన్సీ ఉద్యోగిని. అమెరికాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులున్న వర్సిటీలు యూనివర్సిటీ ప్రాంతం విద్యార్థుల సంఖ్య న్యూయార్క్ వర్సిటీ న్యూయార్క్ 27,247 నార్త్ ఈస్ట్రన్ వర్సిటీ బోస్టన్ 21,023 కొలంబియా వర్సిటీ న్యూయార్క్ 20,321 అరిజోనా స్టేట్ వర్సిటీ టెంపే 18,430 యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ 17,469. -
టారిఫ్‌ల ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన బంగారం
అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో రక్షణాత్మక పెట్టుబడి సాధనం బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది. కామెక్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం 100 డాలర్లు (3.5%) పైగా పెరిగి 3,180 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లలో దూకుడు కారణంగా దేశీయంగా నేడు స్పాట్ మార్కెట్లో పసిడి పరుగులు పెట్టే వీలుందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎంసీఎక్స్‌లో చురుగ్గా ట్రేడవుతున్న కాంట్రాక్ట్ ధర గురువారం రాత్రి రూ. 2,356 ఎగసి రూ.92,160 వద్ద కదలాడుతోంది. -
ఒక్క గుడ్డు 44 రూపాయలు!
వాషింగ్టన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో స్థానిక చిరువ్యాపారుల వద్ద ఒక కోడిగుడ్డు ధర ఐదారు రూపాయల మధ్యే తిరుగుతుంటుంది. అమెరికాలో మాత్రం ఒక్క గుడ్డు ధర ఏకంగా 44 రూపాయలకు పెరిగింది. అమెరికాలో డజను గుడ్ల ధర 6.23 డాలర్ల(దాదాపు రూ.536)కు చేరుకుంది. మార్చి నెలకు సంబంధించి వినియోగదారుల ధరల సూచీలో గుడ్ల ధరను అమెరికా ప్రభుత్వం గురువారం వెల్లడించడంతో గుడ్ల కొరత అంశం మరోసారి తెరమీదకొచ్చింది. గత కొన్నాళ్లుగా అమెరికాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుండటంతో వ్యాధి వ్యాప్తి కట్టడే లక్ష్యంగా కోట్లకొలదీ కోళ్లను వధించారు. దీంతో గుడ్ల కొరత విపరీతమైంది. అందుకు తగ్గట్లే డజను గుడ్ల ధర కొండెక్కింది. ఫిబ్రరిలో ఒక దశలో డజను గుడ్ల ధర ఏకంగా 7.34 డాలర్లకు పెరిగి మళ్లీ దిగొచ్చింది. ఇప్పుడది మళ్లీ 6 డాలర్లను దాటింది. ఈస్టర్ పండుగ సందర్భంగా గుడ్లకు గిరాకీ ఎక్కువైంది. ఈ ఏడాది ఏప్రిల్ 20వ తేదీన ఈస్టర్ జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ తేదీదాకా ధరల ఉరవడి ఆగకపోవచ్చని తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ భయాలతో జనవరి, ఫిబ్రవరిలో ఏకంగా 3 కోట్లకుపైగా గుడ్లు పెట్టే కోళ్లను వధించడంతో ఈ సమస్య మరింత ఎక్కువైంది. కోళ్లఫారాలను పూర్తిగా శానిటైజ్‌చేసి, కొత్త కోళ్లను సాకుతున్నారు. దీంతో కొత్త కోళ్లతో గుడ్ల దిగుబడి పెరిగితే ధరలు కిందకు దిగొచ్చే వీలుంది. -
ఇజ్రాయెల్‌ను మెచ్చని అమెరికన్లు
వాషింగ్టన్: గాజా భూభాగంలో పాలస్తీనియన్లను పొట్టనబెట్టుకుంటూ, హమాస్ సాయుధులపై సమరభేరి మోగించిన ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తిస్థాయిలో ఆయుధ, ఆర్థికసాయం చేస్తుంటే మరోవైపు అమెరికన్లలో మాత్రం ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేక భావన రోజురోజుకూ పెరుగుతోంది. సంబంధిత వివరాలు ప్యూ రీసెర్చ్ పోల్‌లో వెల్లడయ్యాయి. 2022 మార్చిలో ఇజ్రాయెల్ పట్ల 42 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకత చూపిస్తే ఇప్పుడా వ్యతిరేకత 53 శాతానికి పెరిగింది. మరోవైపు విపక్ష డెమొక్రాట్లలో ఏకంగా 69 శాతం మంది ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత కనబరిచారు. 2022 ఏడాదిలో రిపబ్లికన్ పార్టీ సభ్యుల్లో 27 శాతం మంది ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత చూపగా ఇప్పుడు వారి సంఖ్య మరింత పెరిగింది. 50 ఏళ్లలోపు వయస్సున్న రిపబ్లికన్లలో దాదాపు సగం మంది ఇజ్రాయెల్ వైఖరిపై ధ్వజమెత్తారు. 2022లో డెమొక్రాట్లలో 53 శాతం మంది ఇజ్రాయెల్ పట్ల విముఖత వ్యక్తంచేయగా ఇప్పుడా వ్యతిరేకంగా 69 శాతానికి చేరిందని వ్యూ రీసెర్చ్ పోల్ వెల్లడించింది. ఈవారం అమెరికాలో ట్రంప్‌తో భేటీ కోసం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వాషింగ్టన్కు రావడానికి కొద్దిరోజుల ముందు ఈ సర్వే చేపట్టారు. గాజాను స్వా«దీనం చేసుకోవడంపై... గాజాను స్వా«దీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆలోచనలను అమెరికన్లు ఇష్టపడటం లేదు. ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరించిన తీరుపై అమెరికన్లలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ట్రంప్ వైఖరి ఇజ్రాయెల్‌కు అత్యంత అనుకూలంగా ఉందని 31 శాతం మంది భావిస్తున్నారు. అయితే ఇజ్రాయెల్‌తో ట్రంప్ సమదూరం పాటిస్తున్నారని 29 శాతం మంది చెప్పారు. అయితే పాలస్తీనియన్లకు అనుకూలంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడని కేవలం 3 శాతం మంది మాత్రమే చెప్పడం విశేషం. ఒకసారి స్వా«దీనం చేసుకుంటానని, మరోసా రి స్వా«దీనం చేసుకోబోనని, మరోసారి సుందర పర్యాటక క్షేత్రంగా మారుస్తానంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలనుద్దేశిస్తూ అసలు ట్రంప్ భవిష్యత్ ప్రణాళిక ఏమిటో అర్థంకావట్లేదని 37 శాతం మంది చెప్పారు. గాజా స్ట్రిప్‌ను తన ఆ«దీనంలోకి తీసుకోవాలనే తన మునుపటి ప్రణాళికను ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ ఆలోచనను మెజారిటీ అమెరికన్లు స్వాగతించలేదు. 62 శాతం మంది అమెరికన్లు గాజాను అమెరికా స్వా«దీనం చేసుకోవాలనే ఆలోచనను చెత్తపనిగా అభివర్ణించారు. స్వా«దీనం చేసుకోవాలనే ట్రంప్ నిర్ణయాన్ని 49% మంది తీవ్రంగా వ్యతిరేకించారు. పాలస్తీనా ను దేశంగా ప్రకటిస్తే బాగుంటుందని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యవహారాలకు సంబంధించి నెతన్యాహు సరైన నిర్ణయాలే తీసుకుంటారన్న విశ్వాసం తమకు అస్సలు లేదని 52% మంది అమెరికన్లు చెప్పారు. అమెరికన్ యూదుల్లో 53% మంది సైతం ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. యూదు అమెరికన్ల భిన్న మనస్తత్వం గత కొంతకాలంగా అమెరికన్ యూదులు ఇజ్రాయెల్ ధోరణిని బాగా తప్పుబడుతున్నారు. ఇజ్రాయెల్ న్యాయవ్యవస్థలో బెంజమిన్ నెతన్యాహూ ప్రభుత్వం కల్గజేసుకోవడాన్ని అమెరికన్ యూదులు విబేధిస్తున్నారు. న్యాయనియామకాల్లో ఇజ్రాయెల్ ప్రభుత్వ జోక్యం అనవసరమని వాళ్లు చెబుతున్నారు. అయితే గాజాలో హమాస్‌తో యుద్ధం విషయానికి వచ్చేసరికి ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మెజారిటీ యూదు అమెరికన్లు మద్దతు పలుకుతున్నారు. ఏకంగా 73 శాతం మంది అమెరికన్ యూదులు ఇజ్రాయెల్ పట్ల సానుకూల దృక్పథం కనబరిచారు. ఇక క్రైస్తవుల్లో లెక్కిస్తే 53 శాతం మంది అమెరికన్ క్యాథలిక్‌లు ఇజ్రాయెల్‌కు మద్దతు పలకట్లేరు. శ్వేతవర్ణ ప్రొటెస్టాంట్లలో సైతం సగం మంది ఇజ్రాయెల్‌ను విమర్శిస్తున్నారు. అమెరికన్ ముస్లింలలో ఏకంగా 81 శాతం మంది ఇజ్రాయెల్ దండయాత్రను తీవ్రంగా తప్పుబట్టారు. -
వ్యతిరేక పోస్టులుంటే నో వీసా, నో పర్మిట్
వాషింగ్టన్: సోషల్ మీడియా ఖాతా చూస్తే వ్యక్తుల గురించి తెలిసిపోతుంది. అందుకే.. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ఇప్పుడు దానిపై దృష్టి పెట్టారు. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన తరువాతే వీసాలు, నివాస అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా, యెమెన్‌కు చెందిన హౌతీలతో సహా ఉగ్రవాదులుగా అమెరికా వర్గీకరించిన గ్రూపులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులుంటే వారికి అమెరికాలోకి ప్రవేశం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టులుంటే వీసాలు, నివాస అనుమతులు నిరాకరిస్తామని తెలిపారు. ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏజెన్సీ అయిన యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. అమెరికాలో ఉండేందుకు పర్మనెంట్ రెసిడెంట్ ‘గ్రీన్ కార్డుల’ కోసం దరఖాస్తు చేసేవారికీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. విదేశీ ఉగ్రవాదాన్ని, యాంటీసెమిటిక్ ఉగ్రవాద సంస్థలు లేదా ఇతర యాంటీసెమిటిక్ కార్యకలాపాలను సమర్థించడం, ప్రోత్సహించడం లేదా మద్దతు ఇచ్చేవిగా సోషల్ మీడియా కంటెంట్ ఉంటే.. యూఎస్ ప్రతికూల అంశంగా పరిగణిస్తుందని ఏజెన్సీ తెలిపింది. ప్రపంచంలోని ఉగ్రవాద సానుభూతిపరులకు అమెరికాలో చోటు లేదని డీహెచ్ఎస్ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసాయ మెక్లాఫ్లిన్ అన్నారు. మరోఅడుగు ముందుకేసి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో.. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనే విద్యార్థులను ఉన్మాదులుగా అభివర్ణించారు. -
అమెరికాపై ప్రతీకార సుంకాలు 90 రోజులు వాయిదా
బ్రస్సెల్స్: అమెరికా ఉత్పత్తులపై ప్రతీకార సుంకాల అమలును 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్లు యూరోపియన్ యూనియన్(ఈయూ) ఎగ్జిక్యూటివ్ కమిషన్ గురువారం వెల్లడించింది. తమ ఉత్పత్తులపై విధించిన టారిఫ్‌లను 90 రోజులు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తాము సైతం ఆయన బాటలో నడవనున్నట్లు ప్రకటించింది. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ గురువారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. 23.25 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తూ ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని చెప్పారు. అమెరికాలో చర్చలకు ఒక అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్ఘాటించారు. చర్చలు సంతృప్తికరంగా సాగకపోతే అమెరికాపై ప్రతీకార సుంకాలు కచ్చితంగా అమల్లోకి వస్తాయని స్పష్టంచేశారు. ఈయూ నుంచి దిగుమతి అయ్యే స్టీల్, అల్యూమినియంపై ట్రంప్ తొలుత 25 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. దీన్ని 90 రోజులపాటు ఆయన నిలిపివేశారు. -
మా తలుపులు తెరిచే ఉన్నాయి
బీజింగ్/వాషింగ్టన్: టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు తమ తలుపులు తెరిచే ఉన్నాయని చైనా వాణిజ్య శాఖ ప్రతినిధి హీ యోంగ్కియాన్ గురువారం చెప్పారు. తాము ఘర్షణ కోరుకోవడం లేదని అన్నారు. చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందన్నారు. ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని సూచించారు. అమెరికాతో చర్చలు పరస్పర గౌరవం, సమానత్వం ప్రాతిపదికన జరగాలని ఆకాంక్షించారు. కానీ, ఒత్తిళ్లకు, బెదిరింపులకు గురిచేయడం, బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడడం వంటి చర్యలకు దిగితే సహించబోమని హెచ్చరించారు. చైనాతో డీల్ చేసే విధానం అది కాదని అన్నారు. ఒకవేళ వాణిజ్య యుద్ధాన్ని అమెరికా మరింత ముందుకు తీసుకెళ్తే తాము చివరి వరకూ పోరాడుతామని తేల్చిచెప్పారు. జిన్‌పింగ్ తెలివైన నాయకుడు: ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చాలా తెలివైన నాయకుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఎప్పుడేం చేయాలో జిన్‌పింగ్‌కు బాగా తెలుసని అన్నారు. టారిఫ్‌ల విషయంలో చైనా పాలకులు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై చర్చించడానికి జిన్‌పింగ్ నుంచి త్వరలోనే తనకు ఫోన్‌కాల్ వస్తుందని భావిస్తున్నానని చెప్పారు. చైనాలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్ స్పష్టంచేశారు. చైనాపై 145 శాతం బాదుడు చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించగా, మరో 20 శాతం సుంకాలను కూడా దీనికి జతచేసినట్లు శ్వేతసౌధం తాజాగా స్పష్టంచేసింది. చైనా నుంచి ఫెంటనిల్ అక్రమ రవాణాకు సంబంధించి గతంలో విధించిన 20 శాతం సుంకాలకు ఈ 125 శాతం సుంకాలు అదనమని తెలియజేసింది. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరుకున్నట్లు నిర్ధారించింది. మరోవైపు అమెరికా ఉత్పత్తులపై చైనాలో సుంకాలు 84 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.ఇండియాపై 26 శాతం అదనపు టారిఫ్ జూలై 9 దాకా రద్దు ఇండియాపై విధించిన 26 శాతం అదనపు టారిఫ్‌ను 90 రోజులపాటు రద్దు చేస్తున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది. ఈ ఏడాది జూలై 9 దాకా ఈ అదనపు సుంకాలు అమల్లో ఉండవని పేర్కొంది. -
ధ్వంసరచన
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూసిన వాణిజ్య సుంకాల కత్తి పోట్లకు ఇండియా సహా ప్రపంచ స్టాక్ మార్కెట్స్ నెత్తురోడాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ అకస్మాత్తుగా అనిశ్చితి ఊబిలో కూరుకుపోయింది. చైనా, కెనడా వెంటవెంటనే తొలివిడత ప్రతీకార సుంకాలను ప్రకటించాయి. దీంతో ట్రేడ్ వార్ అనివార్యం అనిపిస్తోంది. ఈ యుద్ధరంగంలో దూకేందుకు తామూ సిద్ధమేనంటూ యూరోపియన్ యూనియన్ హెచ్చరిక జారీ చేసింది. ఇతర దేశాలు అమెరికా నూతన విధానం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ఈ వాణిజ్య ఉద్రిక్తతల తక్షణ ప్రభావంతో నాస్డాక్ ఇండెక్స్ కుప్పకూలింది. ఇతర ఏషియన్ సూచీలూ పతనమయ్యాయి. చమురు ధర బ్యారెల్ 64 డాలర్లకు దిగివచ్చింది.ఆభరణాలకు దెబ్బ – వస్త్రాలకు మేలుఇండియా ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. దీనిక్కారణం, ఇప్పటికే ద్వైపా క్షిక వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు ప్రారంభమై ఉండటమే. గతంలో ప్రపంచ వాణిజ్యసంస్థ (డబ్ల్యూటీవో) వేదికపై ధనిక దేశాల ఒత్తి ళ్లను అధిగమించి ఇండియా వ్యవసాయ రంగం కోసం రాయితీలను సాధించింది. ఇప్పుడూ అమె రికాతో విజయవంతంగా ఒప్పందం కుదురుతుందని నిపుణుల అంచనా. అలాగే, ఇక్కడ తయారు కాని వస్తువులపై విధించే నిర్హేతుకమైన అధిక సుంకాలకు ఒప్పందంలో అంగీకరించవచ్చు. బదులుగా, ప్రాసెస్డ్ ఫుడ్స్, సాగర ఉత్పత్తుల ఎగు మతిపై నాన్–ట్యారిఫ్ ఆంక్షలు సరళీకరించాలని కోరుతుంది. స్థానిక సర్వర్లలో డేటా నిల్వ (డేటా లోకలైజేషన్), మేధాసంపత్తి హక్కులు వంటి అంశాలు అంత తేలిగ్గా పరిష్కారం కావు. రాజీ ఫార్ములాలే శరణ్యం అవుతాయి. ఇండియా వాణిజ్యపరంగా తన పరిశ్రమ లను, వ్యవసాయాన్ని కాపాడుకునేందుకు స్వీయ రక్షణ విధానాలను అవలంబిస్తోందని ట్రంప్ పదే పదే విమర్శిస్తున్నప్పటికీ, ఆయన హయాంలో ఉభయ దేశాల నడుమ వ్యూహాత్మక సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశం ఉంది. రక్షణ బంధం బలపరచుకోడానికి రెండు దేశాలూ సిద్ధంగా ఉన్నాయి. ఏమైనప్పటికీ, కొత్త సుంకాలు కొన్ని భారతీయ పరిశ్రమలకు స్వల్ప కాలంలో అశని పాతంగా పరిణమిస్తాయి. వజ్రాలు – ఆభ రణాల పరిశ్రమనే తీసుకుందాం. ఇది 2023–24 ఆర్థిక సంవత్సరంలో 33 బిలియన్ డాలర్ల ఎగు మతులు చేయగా, అందులో మూడో వంతు ఒక్క అమెరికాకే సరఫరా అయ్యాయి. ఈ పరిశ్రమ ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థలతో కూడుకుని ఉంది. దాదాపు 50 లక్షల మంది (పూర్తి నైపుణ్యం ఉన్న, ఒకమాదిరి నైపుణ్యం ఉన్న) కార్మి కులు జీవనోపాధి కోసం వీటిపై ఆధారపడు తున్నారు. కోవిడ్–19 మహమ్మారి సృష్టించిన సంక్షోభ కాలంలో వీరు ఉపాధి కోల్పోయి గ్రామా లకు తరలి పోయారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఆర్డర్లు తగ్గిపోయి అలాంటి దుఃస్థితి పునరావృతం అవుతుందన్న భయాలు వ్యాపిస్తున్నాయి.అయితే, అమెరికా వాణిజ్య సుంకాల పెంపు వల్ల ఇండియాకు అంతా ప్రతికూలమే అనుకో నక్కర్లేదు. మారిన పరిస్థితుల్లో ఇండియా దుస్తుల ఎగుమతి ధరలు పోటీ దేశాల్లో కంటే తక్కువగా ఉంటాయని వస్త్ర ఉత్పత్తుల కేంద్రమైన తిరుప్పూరు (తమిళనాడు) నుంచి వార్తలు వస్తున్నాయి. దీంతో కొనుగోలు దారులు ఇప్పటికే ఇండియా మీద దృష్టి సారించారు. కాబట్టి, భారతీయ వస్త్ర ఉత్పత్తులకు ఆర్డర్లు భారీగా పెరిగే వీలుంది. అమెరికాకే నష్టంసుంకాల పెంపు సంక్షోభం ఫలితంగా ఇతర ప్రపంచ దేశాల కంటే యూఎస్ ఆర్థిక వ్యవస్థే అధికంగా నష్టపోతుంది. అమెరికాలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన తీరు రానున్న దుర్భర స్థితికి సంకేతం. అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని ఇంతకు ముందునుంచే అంటున్నారు. సుంకాల పెంపు వల్ల ఈ రిస్కు అనూహ్యంగా పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. జేపీ మోర్గాన్ ప్రకారం, ‘అమెరికా విచ్ఛిన్నకర రాజకీయాల’ ఫలితంగా అక్కడ ఆర్థిక మాంద్యం రిస్కు 40 నుంచి 60 శాతానికి పెరిగింది. కొత్త సుంకాల వల్ల యూఎస్ ఆర్థిక వ్యవస్థపై 700 బిలియన్ డాలర్ల భారం పడుతుంది. ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ లెక్కలు చైనా 34 శాతం ప్రతీకార సుంకాలు విధించక ముందు వేసినవి! ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోతే అది ఇండియా సహా అన్ని దేశా లకూ దుర్వార్తే! దీంతో, దేశం గడచిన సంవత్సరాల్లో సాధించిన వృద్ధి తగ్గిపోతుంది. 2025–26కి ఇండియా వృద్ధిరేటు 6.3 నుంచి 6.1కి క్షీణిస్తుందని ‘గోల్డ్‌మన్ సాక్స్’ ఇప్పటికే అంచనాలు సవరించింది.అంతర్జాతీయంగా వాణిజ్య సుంకాలను హేతుబద్ధీకరించడానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసి నప్పటి నుంచీ ప్రయత్నాలు మొదలై, దశాబ్దాల పాటు సంప్రతింపులు, చర్చలు జరిగి ఎట్టకేలకు ఒక బహుళ పక్ష వేదిక ఏర్పడింది. ఈ ప్రపంచ ఆర్థిక పాలనలో పేద దేశాల మాటకు విలువ కల్పించిన ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఇప్పుడు విధ్వంసమైపోతోంది. ట్రేడ్ వార్ ప్రభావం ఇండియాపై అనుకున్న దానికంటే తీవ్రంగానే ఉంటుంది. మరి దీనికి పరి ష్కారం ఏమిటి? యూరోపియన్ యూనియన్ వంటి బడా వాణిజ్య భాగస్వాములతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. అదే సమయంలో, ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఏ దేశాలు ఎగుమతులకు అనువైనవో గుర్తించాలి. ఈ ప్రపంచ వాణిజ్య యుద్ధాల్లో అంతిమంగా ఇండియా నష్టపోతుందా, ప్రయోజనం పొందుతుందా అనేది ఇప్పుడప్పుడే తేలదు. రానున్న రోజుల్లో ఈ గొడవ సద్దుమణిగిన తర్వాతే వాస్తవిక అంచనా సాధ్యమవుతుంది.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్ ‘ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చదువు కోసమే వచ్చారా?
అమెరికాలో భారతీయ విద్యార్థుల ప్రతి కదలికపై ఆ దేశ అధికారులు నిఘా పెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఏం చేస్తున్నా నీడలా వెంటాడుతున్నారు. విద్యార్థులు నిజంగానే చదువుతున్నారా? చట్ట వ్యతిరేకంగా ఉద్యోగాలేమైనా చేస్తున్నారా? వాళ్ల బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? సరైన పత్రాలతోనే వచ్చారా? అనే వివరాలను సేకరిస్తున్నారు. హెచ్–1బీ వీసా పొందిన వారిపైనా నిఘా కొనసాగుతోందని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ప్రధాన వర్సిటీలపై దృష్టి అమెరికా వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య రానురాను పెరుగుతోంది. 2022–23లో 2,68,923 మంది వెళ్తే, 2023–24లో 3,31,602 మంది వెళ్లారు. ప్రధానంగా న్యూయార్క్ వర్సిటీ, నార్త్ ఈస్టర్న్ వర్సిటీ, కొలంబియా వర్సిటీ, అరిజోనా స్టేట్ యూనివ ర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోరి్నయాలోనే లక్షకుపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో చాలామంది క్యాంపస్‌ల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారనేది అమెరికా అనుమానం. వారిని వెతికి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే న్యూయార్క్, బోస్టన్, టెంపే, లాస్ ఏంజెలిస్ ప్రాంతాల్లో నిఘా కొనసాగుతోంది. తలనొప్పిగా ఓపీటీ అమెరికాలో ఎంఎస్ చేసిన తర్వాత తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునేందుకు (ఇవి కూడా స్కిల్డ్ మాత్రమే) ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ఇస్తారు. 2023–24 లెక్కల ప్రకారం భారత విద్యార్థులు 97,556 మంది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఓపీటీ చేసిన తర్వాత ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా మరికొంత కాలం అమెరికాలో ఉండొచ్చు. ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఈ సదుపాయాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉంది.అందుకోసం త్వరలో చట్టం తెస్తానని ట్రంప్ ప్రకటించారు. అదే జరిగితే ఎంఎస్ పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చిన వాళ్లు మాత్రమే అక్కడ ఉంటారు. మిగతా వాళ్లు తిరిగి ఇండియాకు రావాల్సి ఉంటుంది. అమెరికా వెళ్లడం కోసం ఒక్కో విద్యార్థి సగటున రూ.35 లక్షల నుంచి రూ.49 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఉత్త చేతులతో ఇండియాకు తిరిగి వచ్చే పరిస్థితిని తలచుకుంటేనే గుండె పగిలిపోతోందని విద్యార్థులు అంటున్నారు. ఏఐతో పటిష్టమైన డేటా ప్రతి విదేశీ విద్యార్ధిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో నిఘా పెట్టినట్టు ప్రవాస భారతీయులు చెబుతున్నారు. విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ ఉన్నాడు? అతని బ్యాంకు బ్యాలెన్స్ ఎంత? అమెరికా వచ్చిన తర్వాత ఎంత సంపాదించాడు? ఎలా సంపాదించాడు? ఏయే ఉద్యోగాలు చేశాడు? అనే వివరాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఏడాది కాలంగా ఎక్కడెక్కడికి వెళ్లాడు? ఏయే లొకేషన్స్‌లో ఉన్నాడు? ఆ లొకేషన్స్‌లో మాల్స్, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు ఏం ఉన్నాయి? వాటి నుంచి ఎవరికి డబ్బు చెల్లించారు? ఇందులో విద్యార్థులుగా ఉన్నవారికి ఎంత? ఎందుకు? అనే వివరాలపై దృష్టి పెట్టారు. వీటి ఆధారంగా విద్యార్థి చదువు కోసం కాకుండా, ఉపాధి కోసం వచ్చినట్టు గుర్తించే ఆలోచనలో ఉన్నారు. ఇది అమెరికా చట్టాలకు విరుద్ధం కాబట్టి అలాంటి విద్యార్థులకు సమస్యలు తప్పేట్టు లేదు. కన్సల్టెన్సీలపై నిఘా అమెరికా అధికారుల నిఘాపై ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ఇటీవల భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. విద్య కన్సల్టెన్సీలు విద్యార్థులను అక్రమంగా అమెరికాకు పంపుతున్నాయని ఆక్షేపించింది. ఇప్పటివరకు 5 వేల మందిని ఈ కేటగిరీ కింద గుర్తించినట్టు తెలిపింది. దీంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కన్సల్టెన్సీల వివరాలు ఇవ్వాలని ఇటీవల లేఖ రాసింది. పత్రాలన్నీ చూస్తున్నారు ఇండియా నుంచి వచ్చిన విద్యార్థి ఆర్థిక స్థితిగతులపై అమెరికాలో ఆరా తీస్తున్నారు. చదువు కోసమే వచ్చిన వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఇతర మార్గాల్లో డబ్బులు సంపాదించిన వారిని ప్రశ్నించే వీలుంది. – విక్రమ్ శశాంక్, ప్రవాస భారతీయుడు. ఓపీటీ తీసేస్తే పరిస్థితి ఏమిటి? రూ.45 లక్షలు అప్పు చేసి అమెరికా వచ్చాను. పార్ట్ టైం జాబ్ చేసి కొంత తీర్చాను. ఇప్పుడు ఓపీటీ ఎత్తివేస్తే తిరిగి ఇండియా వెళ్లిపోవాలి. అక్కడ ఉద్యోగం వస్తుందో రాదో చెప్పలేం. అప్పు తీర్చే మార్గం కన్పించడం లేదు. – అఖిలేష్ పూనాటి, అమెరికాలో ఎంఎస్ పూర్తిచేసిన విద్యార్ధి. హెచ్–1బీకీ తిప్పలే ఇక్కడి ఉద్యోగాలు ఇక్కడివాళ్లకే (అమెరికన్లకు) అనే నినాదం ఊపందుకుంటోంది. ఇండియాతోపాటు ఇతర దేశాలవారినీ ఎందుకు రప్పించాలనే భావనతో ట్రంప్ వెళ్తున్నారు. భవిష్యత్‌లో హెచ్–1బీ వీసాలు ఉండకపోవచ్చు. ఇక్కడే పిల్లలను చదివిద్దామని వచ్చాను. ఇప్పుడు వాళ్లు కూడా ఇబ్బంది పడాల్సిందే. – మంజులా రాయ్, హెచ్–1బీ వీసాపై అమెరికా వెళ్లిన ఎంఎన్సీ ఉద్యోగిని. -
మూర్ఖత్వం
1. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ మద్దతుదారులలో చాలామంది, బహుశా ట్రంప్ కూడా, అమెరికాకు వస్తువులను ఎగుమతి చేసే దేశాలే అధిక సుంకాలను చెల్లిస్తాయని నమ్ముతున్నట్లుంది. వాస్తవం ఏమిటంటే, సుంకాలను దిగుమతి దారులు చెల్లిస్తారు. వారు ఆ ఖర్చును వినియోగదారులకు, ఈ సందర్భంలో, అమెరికన్ ప్రజలకు బదిలీ చేస్తారు.2. సుంకాల విధింపు అనేది చర్చల వ్యూహంలో భాగమా? ట్రంప్ మొదటి పదవీకాలం విషయంలో అది నిజమే కావచ్చు. ఇప్పుడు అలా చేయడం కష్ట తరమైన ఆలోచన. కొన్ని దేశాలు తమ సుంకాలను తగ్గించుకోవచ్చు. కానీ చాలా దేశాలు ప్రతీకార సుంకాలను విధిస్తున్నాయి. తన మద్దతుదారులకు తాను బలంగా కనిపించాలని ట్రంప్ అనుకుంటున్నట్లుగానే, ఇతర దేశాల నాయకులు కూడా బలహీనంగా కనిపించడానికి ఇష్టపడకపోవచ్చు.3. ట్రంప్ మాంద్యాన్ని పెంచి పోషించడానికీ, తద్వారా అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ను వడ్డీ రేట్లను తగ్గించమని బలవంతం చేయడానికీ ప్రయత్నిస్తు న్నారని కూడా చెబుతున్నారు. తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక వృద్ధిని నడిపిస్తాయి. అలాగే 2026 మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీకి సహాయపడ తాయి. అయితే, ఆర్థిక వ్యవస్థ కారు లాంటిది కాదు. కారు వేగాన్ని యాక్సిలరేటర్తోనూ, బ్రేక్ తోనూ సులభంగా నియంత్రించవచ్చు. ఇది సంక్లి ష్టమైన వ్యవస్థ. అమెరికా సుంకాలు అలాగే ఉంటే, అక్కడ రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుతుంది, వడ్డీ రేటు కోత అవకాశాలను తగ్గిస్తుంది. ఇంకొకటి: ప్రజలు పేదరికాన్ని అనుభూతి చెందుతూ సాధా రణంగా వారు చేసే దానికంటే తక్కువ ఖర్చు చేయడం వల్ల, వినియోగదారుల వ్యయం, ఆర్థిక వృద్ధి మందగిస్తాయి.4. దేశాలేవీ గతంలో సుంకాలను వేయలేదని దీని అర్థం కాదు. అవి వాటిని అస్త్రాలుగా వాడాయి. కానీ సార్వత్రిక సుంకాలు సాధారణంగా బలహీనంగా ఉండే ఆర్థిక ఫలితాలకు దారితీస్తాయి. 1930 జూన్‌లో అమెరికా ఆమోదించిన ట్యారిఫ్ చట్టం (లేదా స్మూట్–హాలీ చట్టం), 1929లో ప్రారంభ మైన మహా మాంద్యం తర్వాత దాని ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ఉద్దేశించబడింది. రక్షణ వాద ప్రభంజన కాలంలో ఈ చట్టం 20,000 పారి శ్రామిక, వ్యవసాయ వస్తువులపై సుంకాలను రికార్డు స్థాయికి పెంచింది. ఇతర దేశాలు తమ సొంత సుంకాలతో స్పందించాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీసి, మాంద్యాన్ని పొడిగించింది. దేశాలు రెండవ ప్రపంచ యుద్ధానికి ఖర్చులతో సిద్ధమై, పోరాడటం ప్రారంభించిన తర్వాత పరిస్థితి మారింది. నాటి ఈ పాఠాన్ని అమెరికా పాలనాయంత్రాంగం మరచిపోయింది. 5. పరస్పర సుంకాల రేట్లను చాలా మోటు సూత్రాన్ని ఉపయోగించి నిర్ణయించినట్లు అనిపి స్తుంది. భారతదేశం విషయంలో, ఈ సుంకం 26 శాతం వేశారు. 2024లో, అమెరికా భారతదేశంతో 45.7 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్య లోటును కలిగి ఉంది. అంటే భారతదేశం నుండి అమెరికా వస్తువుల దిగుమతులు భారతదేశానికి దాని వస్తువుల ఎగుమతుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఇది సూచిస్తుంది. భారతదేశం నుండి అమెరికా సరుకుల దిగుమతులు 87.4 బిలియన్ డాలర్లు. ఈ 87.4 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతుల్లో 45.7 బిలియన్ డాలర్ల అమెరికా లోటు 52 శాతానికి వస్తుంది. ఈ రేటును సగానికి తగ్గించినప్పుడు, 26 శాతం అవుతుంది.ఇక్కడ బహుళ సమస్యలు ఉన్నాయి. సేవల వాణిజ్యాన్ని పరిగణించలేదు. కరెన్సీ తారుమారు, వాణిజ్యేతర అడ్డంకులను పరిగణనలోకి తీసుకోలేదు. ఒక దేశం దాని సుంకాలను తగ్గించాలని నిర్ణయించుకున్నప్పటికీ, ఆ దేశంతో అమెరికా వాణిజ్య లోటు తగ్గకపోవచ్చు. ఎందుకంటే ఆ దేశానికి అమెరికా మరిన్ని ఎగుమతి చేయవలసి ఉంటుంది. మరిన్ని ఎగుమతి చేయడం అంటే తక్కువ సుంకాల రేటు గురించి మాత్రమే కాదు. అమెరికా ముందుగా వస్తువులను ఉత్పత్తి చేయాలి. అది కూడా ఇతర దేశాలకు ఆసక్తి కలిగించే ధరకు ఉత్పత్తి చేయాలి.తనకు తెలియదని తెలియదు!6. ట్రంప్ ఇలా సుంకాలు వేస్తున్నారంటే, తాను దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించే ఉంటారని నమ్మే ఒక ఆలోచనా విధానం కూడా ఉంది. ఇది మన ముందున్న అతిపెద్ద ప్రమాదాన్ని వెల్లడిస్తుంది: ట్రంప్‌కు తనకు తెలియనిది తెలియదని తెలీకపోవచ్చు. ఆయన అందరి దృష్టీ తన వైపు ఉండటాన్ని ఇష్టపడు తున్నట్లు, తనను తాను నిర్ణయాత్మక వ్యక్తిగా చూపించుకుంటున్నట్లు అనిపిస్తుంది.7. విధించిన ఈ సుంకాలు దేశీయ మార్కెట్ కోసం అమెరికాలోనే ఉత్పత్తి చేయమని కంపెనీలపై ఒత్తిడి తెస్తాయనే నమ్మకాన్ని ట్రంప్ మాటలు సూచిస్తున్నాయి. కానీ అది అంత సులభం కాదు.ఎందుకంటే అమెరికాలో ఉత్పత్తి చేయడం ఖరీదైన ప్రతిపాదన కావచ్చు. అసలు అందుకే కంపెనీలు మొదటగా బయటకు వెళ్లాయి. ఇప్పుడు కంపెనీల సరఫరా గొలుసులు చాలా పరిణామం చెందాయి. ఒక ఉత్పత్తి దాని తయారీ ప్రక్రియలో అనేకసార్లు అమెరికా సరిహద్దులను దాటవచ్చు. అందుకే కంపె నీలు ట్రంప్ రెండవ పదవీ కాలం ముగిసేదాకా వేచి ఉండాలని నిర్ణయించుకునే అవకాశం కూడా ఉంది.8. ట్రంప్ ఈ సుంకాల విధింపు వ్యూహాన్ని ద్విగిణీకృతం చేసినట్లయితే, అది దేశాలను అమెరికా నుండి మరింత దూరం చేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్ డాలర్ కేంద్రంగా ఉద్భవించిన ప్రపంచ క్రమాన్ని అది చెదరగొడుతుంది.ఇప్పుడు దానికి మరొక వివరణాత్మక వ్యాసం అవసరం. కానీ ఒకే వాక్యంలో చెప్పాలంటే, గ్రాహమ్ గ్రీన్ 1978లో ప్రచురించిన ‘ది హ్యూమన్ ఫ్యాక్టర్’ నవలలో ఇలా రాశాడు: ‘మనకు చైనీయులు అవసరమయ్యే రోజు రావచ్చు’.వ్యాసకర్త ఆర్థిక అంశాల వ్యాఖ్యత, రచయిత ‘ (‘ద మింట్’ సౌజన్యంతో) -
చైనాకు ట్రంప్ మరో షాక్.. డ్రాగన్‌పై మరోసారి టారిఫ్ విధింపు
వాషింగ్టన్: అమెరికా,చైనా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా చైనాపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకం విధించారు. దీంతో చైనా వస్తువులపై అమెరికా విధించిన టారిఫ్ మొత్తం 145 శాతానికి చేరుకుందని వైట్‌హౌస్ అధికారి అమెరికన్ మీడియా సంస్థ సీఎన్బీసీకి ధృవీకరించారు. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. డ్రాగన్ దిగుమతులపై ఉన్న 20 శాతం సుంకాలకు అదనంగా 34 శాతం విధిస్తున్నట్లు ఇటీవల ట్రంప్ ప్రకటించారు. దీనిపై చైనా దీటుగా స్పందిస్తూ అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించింది. ఇదే విషయంలో ట్రంప్ డ్రాగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాకు డెడ్‌లైన్ పెట్టి.. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే 104 శాతం టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు. తామేం తక్కువ కాదన్నట్లుగా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకం విధించింది. JUST IN: 🇺🇸🇨🇳 White House says total US tariffs on China are now 145% pic.twitter.com/67oyICPVNb— Mastering Crypto 🇺🇲 (@MasteringCrypt) April 10, 2025పట్టు వీడి దిగి రావాల్సింది పోయి అర్థం లేని దూకుడుగా వ్యవహరిస్తుందంటూ చైనాపై మరో 50 శాతం కలిపి మొత్తంగా 125 శాతం టారిఫ్‌ను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ తరుణంలో తాజాగా మరో 20 శాతం టారిఫ్ పెంచారు. దీంతో చైనా దిగుమతులపై అమెరికా విధించిన సుంకం 145శాతానికి చేరినట్లైంది. ఇదే విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు అధికారికంగా ప్రకటించారు. -
అమెరికాకు 600 టన్నుల ఐఫోన్లు.. అదీ చార్టెడ్ ఫ్లైట్లలో..!
విదేశీ దిగుమతులపై ప్రతీకార సుంకాల ప్రకటనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల్లో వాణిజ్య ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులపై భారీ సుంకాలు విధించడంతో అక్కడ తయారీ నిర్వహిస్తున్న కంపెనీలు ఇరుకున పడ్డాయి. ఈ క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ట్రంప్ టారిఫ్‌ల నుంచి బయటపడేందుకు ఉపాయం ఆలోచించింది. భారత్ నుంచి 600 టన్నులు లేదా సుమారు 15 లక్షల ఐఫోన్లను ప్రత్యేక కార్గో విమానాల్లో అమెరికాకు తరలించినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.అమెరికా-చైనాల మధ్య టారిఫ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన అమెరికాలో పాపులర్ ఐఫోన్ల తగినంత స్టాక్‌ను అందుబాటులో ఉంచేందుకు కంపెనీ ఈ రహస్య వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ ఉత్పత్తులకు ప్రధాన తయారీ కేంద్రమైన చైనా నుంచి దిగుమతులపైనే యాపిల్ అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో అమెరికాలో ఐఫోన్ల ధరలు భారీగా పెరగవచ్చని విశ్లేషకులు హెచ్చరించారు. చైనాపై విధించే టారిఫ్ రేటు ప్రస్తుతం 125 శాతంగా ఉంది. ఇక భారత్ నుండి వచ్చే దిగుమతులపై ఈ సుంకం 26 శాతం. అయితే చైనా మినహా ఇతర అన్ని దేశాలపై ఈ సుంకాల అమలును 90 రోజులు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యేక ఏర్పాట్లుభారత్లోని దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ క్లియర్ చేయడానికి అవసరమైన సమయాన్ని 30 గంటల నుండి ఆరు గంటలకు తగ్గించేలా విమానాశ్రయ అధికారులతో కంపెనీ లాబీయింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. "గ్రీన్ కారిడార్" పేరుతో చైనాలోని కొన్ని విమానాశ్రయాలలో చేస్తున్న ప్రత్యేక ఏర్పాటునే చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనూ యాపిల్ చేయించినట్లు తమకు లభించిన సమాచారాన్ని ఉటంకిస్తూ రాయిటర్స్ రిపోర్ట్ చేసింది.మార్చి నెల నుంచి ఇప్పటి వరకూ ఒక్కొక్కటి 100 టన్నుల సామర్థ్యం కలిగిన ఆరు కార్గో జెట్ విమానాలు అమెరికా వెళ్లాయని, వాటిలో ఒకటి ఈ వారంలోనే అంటే కొత్త టారిఫ్‌లు ప్రకటించాకే బయలుదేరిందని ఓ అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది. ఐఫోన్ 14, దాని ఛార్జింగ్ కేబుల్ ప్యాకేజ్డ్ బరువు సుమారు 350 గ్రాములు (12.35 ఔన్స్) ఉంటుందని, ఇలా మొత్తం 600 టన్నుల కార్గోలో సుమారు 15 లక్షల ఐఫోన్లు వెళ్లి ఉంటాయని రాయిటర్స్ అంచనా వేస్తూ రాసుకొచ్చింది. అయితే దీనిపై యాపిల్ సంస్థ గానీ, భారత విమానయాన మంత్రిత్వ శాఖ గానీ స్పందించలేదు. -
తహవూర్ రాణా అరెస్ట్.. తీహార్ జైలుకు తరలించిన ఎన్ఐఏ
న్యూఢిల్లీ, సాక్షి: 26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్ రాణాను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అనంతరం, తీహార్ జైలుకు తరలించింది. తీహార్ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసులు ఎన్ఐఏ కోర్టు ముందు రాణాను ప్రవేశపెట్టనున్నారు. తీహార్‌లోని హై సెక్యూరిటీ జైల్లోనే రాణాను ఎన్ఐఏ విచారణ చేయనుంది. ముంబై దాడుల వెనుక పాకిస్తాన్లో ఎవరెవరున్నారనే కోణంలో ఎన్ఐఏ విచారణ జరుపనుంది.26/11 ముంబై దాడుల కీలక సూత్రధారి, లష్కరే తోయిబా ఉగ్రవాది తహవూర్ రాణా ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నాడు. అమెరికా నుంచి వచ్చిన రాణాను తీసుకు వచ్చిన ప్రత్యేక విమానం ఢిల్లీ పాలం ఎయిర్‌పోర్టులో గురువారం మధ్యాహ్నాం ల్యాండయ్యింది. దీంతో దేశ రాజధాని రీజియన్‌లో హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీలో అడుగుపెట్టిన వెంటనే తహవూర్ రాణాను ఎన్ఐఏ అధికారికంగా అరెస్టు చేసినట్లు సమాచారం. అనంతరం ఎన్ఐఏ కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. అక్కడే ఎన్ఐఏ న్యాయమూర్తి 2008 ముంబై ఉగ్రదాడి కేసు విచారించనున్నారు. విచారణ అనంతరం.. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు తీహార్ జైలుకు తరలిస్తారా? లేదంటే మరోచోట ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. 🚨 BIG BREAKING NEWS26/11 mastermind Tahawwur Rana has ARRIVED in India, following his EXTRADITION from US [Bharti Jain/TOI] 🔥— NIA will take him into custody. pic.twitter.com/ELPwS28L5L— Megh Updates 🚨™ (@MeghUpdates) April 10, 2025తహవూర్ రాణాను విచారణ ఇలా ఉండనుంది26/11 దాడుల నిందితుడు రాణాపై దర్యాప్తు ఎలా జరుగుతుందనే అంశంపై పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తహవూర్ రాణాను ఎన్ఐఏ లేదా సంబంధిత దర్యాప్తు సంస్థలు అతనిని అరెస్ట్ చేస్తాయి. అనంతరం,ఎన్ఐఎలోని 12 మంది సీనియర్ అధికారుల బృందంతో విచారణ చేస్తారు. రాణా నుంచి మరిన్ని వివరాలు రాబట్టడానికి, కోర్టులో పోలీస్ కస్టడీ కోరుతారు. ఈ దశలో అతని పాస్‌పోర్ట్‌లు, డాక్యుమెంట్లు, కమ్యూనికేషన్ పరికరాలను పరిశీలన జరుగుతుంది.అతని సహచరులతో సంబంధాలపై విచారణ చేపడతారు. కుట్రలు,ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయా అనే కోణంలో ప్రశ్నలు ఉంటాయి. పోలీస్ విచారణ ముగిసిన తర్వాత, అతనిని జైల్లో జుడిషియల్ కస్టడీకి తీసుకుంటారు. ఈ దశలో కోర్టులో చార్జ్ షీట్ దాఖలవుతుంది. ప్రతి 14 రోజులకు ఒకసారి రిమాండ్ పొడిగింపు.ఎన్ఐఏ/సీబీఐ వంటి సంస్థలు సేకరించిన ఆధారాల ఆధారంగా యూఏపీఏ, ఐపీసీ, ఆయుధ చట్టాలలోని సెక్షన్ల కింద కోర్టులో చార్జ్‌షీట్ నమోదు చేస్తారు. తహవూర్ రాణాకు శిక్ష పడేది అప్పుడే అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ ఉగ్రవాద సంస్థల నుండి మద్దతు, డబ్బు మార్పిడి లింకులు పరిశీలన ఉంటుంది. చార్జ్ షీట్ కోర్టు ఆమోదించిన తరువాత అభియోగాలపై రాణా తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తారు. ప్రభుత్వ తరఫున ప్రాసిక్యూషన్ ఆధారాలు సమర్పిస్తుంది. తుది తీర్పు రీత్యా శిక్ష అమలవుతుంది. ఆధారాల బలాన్ని బట్టి ఈ మొత్తం ప్రక్రియ నెలల నుంచి సంవత్సరాల వరకూ సాగే అవకాశం ఉంటుంది. ఎవరి తహవూర్ రాణాపాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడైన తహవూర్ రాణా, 2008 ముంబై ఉగ్రవాద దాడుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఆ మరుసటి ఏడాది FBI అతన్ని అరెస్టు చేసింది. రాణాను భారతదేశానికి అప్పగించడానికి అమెరికా సుప్రీంకోర్టు జనవరి 25, 2024న ఆమోదం తెలిపింది. అయితే ఈ కేసులో రాణా తనను తప్పుగా దోషిగా ప్రకటించారని చెప్పి రివ్యూ పిటిషన్ దాఖలు చేశాడు. కానీ కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇక.. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో తహవూర్ రాణా(Tahavur Rana)ను భారత్‌కు అప్పగించడానికి అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించారు. దీంతో ట్రంప్‌కి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే.. ఆ తర్వాత కూడా భారత్‌కు తరలించే అంశంపై రాణా ఊరట కోసం ప్రయత్నించినప్పటికీ.. దారులన్నీ అప్పటికే మూసుకుపోయాయి. -
వెయ్యి రోజులకు పైగా పీరియడ్స్..వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!
సాధారణంగా మహిళలకు రుతుక్రమం నెలలో ప్రతి 27 నుంచి 35 రోజుల్లో వస్తుంది. ఇలా వస్తే ఆరోగ్యంగా ఉన్నట్లుగా పరిణిస్తారు వైద్యులు. కొందరికి హార్మోన్ల ప్రాబ్లం వల్ల రెండు నెలలకొకసారి లేదా ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడతారు. ఇది ప్రస్తుత జీవన విధానం, శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, కాలుష్యం తదితరాల కారణంగా చాలామంది టీనేజర్లు, మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది. ఐతే ఈ మహిళకు మాత్రం మూడేళ్లకు పైగా నిరంతరం రక్తస్రావం(లాంగ్ పీరియడ్ సైకిల్) కొనసాగుతోంది . దాని కారణంగా ఆమె దారుణమైన శారీరక మానసిక సమస్యలతో నరకం అనుభవిస్తోంది. అసలు జీవితంలో ఒక్కసారైనా ఆ ఎరుపురంగుని చూడని రోజు ఉంటుందా..? అని కన్నీరుమున్నీరుగా విలపిస్తోందామె.అమెరికాకు చెందిన టిక్‌టాక్ యూజర్ పాపీ వెయ్యి రోజులకు పైగా కొనసాగిన అసాధారణ సుదీర్ఘ రుతుక్రమం బాధను షేర్ చేసుకున్నారు. తాను వైద్యులను సంప్రదించినప్పటికీ..అది ఓ మిస్టరీలానే మిగిలపోయిందని వాపోయింది. ప్రతి మహిళలకు సాధారణంగా ప్రతి 21 నుంచి 35 రోజులకు ఒకసారి రుతక్రమం వస్తుంది. రెండు నుంచి ఏడు రోజుల వరకే రక్తస్రావం అవుతుంది. కొందరికి జీవనశైలి, ఒత్తిడి, తగిన వ్యాయమాం లేకపోవడం వల్ల ఇర్రెగ్యులర్గా వచ్చిన మహా అయితే ఓ 15 నుంచి 20 రోజుల అవుతుందేమో. అది కూడా కొందరికే. ఇది సాధరణమైన సమస్యే. అయితే వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఏర్పడుతుంది అంతే. కానీ పాపీకు మాత్రం వెయ్యి రోజులకు పైగా ఆ రక్తస్రావం(పీరియడ్) కొనసాగుతోందట. అంటే దగ్గర దగ్గర మూడు సంవత్సరాల రెండు వారాలు కొనసాగుతుందట రక్తస్రావం. వైద్యుల సైతం ఆమె పరిస్థితి చూసి ఖంగుతిన్నారట. ఆమె పలు వైద్య పరీక్షలు చేసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుగొనే యత్నం చేశారు. అండాశయంపై తిత్తులు ఉన్నట్టు గుర్తించారు గానీ, దానివల్ల ఇంతలా రక్తస్రావం జరగదనే చెబుతున్నారు వైద్యులు. మరేంటి కారణం అనేది అంతుపట్టడం లేదు వైద్యులకు. దీనికారణంగా పాపీ ఐరన్ విటమిన్‌ని అధిక స్థాయిలో కోల్పోయి తిమ్మిర్లు, కండరాలు, ఎముకల సమస్యలతో విలవిలలాడుతున్నట్లు తెలిపారు. అయితే ఆమెకు పీసీఓసీ ఉందని నిర్థారణ అయ్యినప్పటికీ..ఇంతలా రక్తస్రావం జరగడానికి ప్రధాన కారణం ఏంటన్నది నిర్థారించలేకపోయారు. చివరికి హిస్టెరోస్కోపీ నిర్వహించారు, గర్భ నిరోధక ఐయూడీని కూడా చొప్పించారు. ఇవేమీ ఆ సమస్యకు ఉపశమనం కలిగించలేదు. ఇలా ఎన్నో వైద్యపరీక్షలు, వివిధ చికిత్సలు, మందులు తీసుకున్నప్పటికీ తీవ్ర రక్తస్రావం సమస్యను అరికట్టలేదు. అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ వంటి స్కానింగ్‌లలో సైతం కారణం ఏంటన్నది చూపించలేకపోయాయి. చివరికి తన టిక్‌టాక్ ఫాలోవర్స్ సాయంతో తన సమస్యకు గల కారణాన్ని తెలుసుకుని నివ్వెరపోయింది.ఇంతకీ ఎందువల్ల అంటే..ఆమెకు బైకార్న్యుయేట్ గర్భాశయం అనే అరుదైన పరిస్థితి ఉందని తెలుసుకుంది. దీన్ని గుండె ఆకారపు గర్భాశయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గర్భాశయం ఒకటి కాకుండా రెండు గదులుగా వేరుచేయబడి ఉంటుంది. ఈ పరిస్థితి.. నూటికి ఒకరో, ఇదరినో ప్రభావితం చేసే అరుదైన సమస్య అట. ఈ పరిస్థితితో ఉన్న చాలా మంది మహిళలకు ఇలానే రక్తస్రావం జరగుతుందా అంటే..ఒక్కొక్కరిలో ఒక్కోలా లక్షణాలు ఉంటాయని ఫాలోవర్ వివరించడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకుంది. ఇన్నాళ్లకీ తన సమస్యకు ప్రధాన కారణం ఏంటన్నది తెలుసుకోగలిగానని సంబరపడింది. ఇన్నాళ్లు దాదాపు 950 రోజులు పీరియడ్స్ ప్యాడ్లలకే డబ్బులు వెచ్చించి విసుగొచ్చేసింది. ఇక ఆ సమస్య ఎందువల్లో తెలుసుకోగలిగాను కాబట్టి..పరిష్కారం దిశగా అగుడులు వేస్తానంటోంది పాపీ. ప్రస్తుతం ఆమె వైద్యులను సంప్రదించి.. తన గుండె ఆకారపు గర్భాశయాన్ని సరిచేసే శక్తచికిత్స గురించి తెలుసుకునే పనిలో ఉంది. అంతేగాదు ఇది గనుక విజయవంతమైతే..ఎరుపు రంగు చూడని స్వర్గం లాంటి రోజులను పొందగలుగుతానంటోందామె. (చదవండి: ఉమెనోపాజ్ అర్థం చేసుకుందాం) -
వ్యభిచార గృహాలతో సంబంధాలు: అమెరికాలో భారత సంతతి సీఈఓ అరెస్ట్
క్లీన్ వాటర్ స్టార్టప్ అయిన 'గ్రాడియంట్' సీఈఓ అనురాగ్ బాజ్‌పేయ్ (Anurag Bajpayee)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉన్నత స్థాయి వ్యభిచార గృహాలతో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలపై ఈయనను అరెస్ట్ చేసినట్లు, బోస్టన్ ఏరియా కోర్టుకు సమర్పించిన పత్రాల్లో అధికారులు వెల్లడించారు.భారత సంతతికి చెందిన అనురాగ్ బాజ్‌పేయ్ మాత్రమే కాకుండా.. వ్యభిచార గృహాల్లో గడిపిన కేసులో వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు మొదలైనవారు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు మహిళలతో గడపడానికి గంటకు 600 డాలర్లు (రూ. 50వేలు కంటే ఎక్కువ) వెచ్చించేవారు. వీరు ఎంచుకునే మహిళలలో ఎక్కువ మంది.. అక్రమ రవాణాకు గురై వ్యభిచార కూపంలో ఇరుక్కున్నవారే అని భావిస్తున్నారు.వ్యభిచార కుంభకోసం కేసులు తమ బాస్ అరెస్ట్ అవ్వడంతో.. కొందరు ఉద్యోగులు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అయితే గ్రాడియంట్ కంపెనీ మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచింది. న్యాయ వ్యవస్థపై విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ.. సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించింది.ఎవరీ అనురాగ్ బాజ్‌పేయ్?అనురాగ్ బాజ్‌పేయి బోస్టన్‌కు చెందిన గ్రేడియంట్ సంస్థకు సహా వ్యవస్థాపకుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఈ కంపెనీ మురుగు నీటిని శుభ్రం చేస్తుంది. భారతదేశంలో జన్మించిన బాజ్‌పేయ్ క్లీన్టెక్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తిగా ఎదిగారు. ఈయన నాయకత్వంలో కంపెనీ సెమీకండక్టర్లు, ఫార్మాస్యూటికల్స్, మైనింగ్, ఫుడ్, డ్రింక్స్ వంటి పరిశ్రమలకు సేవలు అందిస్తోంది. కంపెనీ మొత్తం 25 కంటే ఎక్కువ దేశాలలో 2500 కంటే ఎక్కువ సౌకర్యాలలో కార్యకలాపాలను కొనసాగిస్తోంది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో పాఠశాల విద్యను పూర్తి చేసిన బాజ్‌పేయ్ 2006లో మిస్సోరి కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఆ తరువాత ఎంఐటీలో అడ్వాన్స్డ్ డిగ్రీలు, 2008లో మాస్టర్ ఆఫ్ సైన్స్, 2012లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో PhD పట్టా పొందారు. పరిశోధనల సమయంలో ఈయన పారిశ్రామిక డీశాలినేషన్ & నీటిని శుద్ధి చేయడం వంటి వాటిపై రీసర్చ్ చేశారు. -
Michelle Obama: ఏది మంచిది అనిపిస్తే అదే చేస్తా
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(barack obama) సతీమణి మిషెల్లీ విడాకుల ప్రచారంపై ఎట్టకేలకు పెదవి విప్పారు. గత కొంతకాలంగా దేశ మాజీ ప్రథమ పౌరురాలి హోదాలో ఆమె పలు అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారాన్ని బహిరంగంగా బరాక్ ఖండించినప్పటికీ.. మిషెల్లీ మాత్రం ఎక్కడా స్పందించకపోవడంతో ఆ అనుమానాలు కొనసాగుతూ వచ్చాయి.అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన టైంలో, అంతకు ముందు మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు మిషెల్లీ ఒబామా(michelle obama) గైర్హాజరు అయ్యారు. మాజీ అధ్యక్షులు అయినప్పటికీ సతీసమేతంగా(ఫస్ట్ లేడీ కాబట్టి) హాజరు కావడం అక్కడి ఆనవాయితీ. అయితే బరాక్ ఒబామా ఒంటరిగా ఆ కార్యక్రమాలకు హాజరు కావడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతోందంటూ ప్రచారం నడిచింది. అయితే ఈ ప్రచారాన్ని ఒబామా గత నాలుగు నెలల కాలంలో విడాకుల రూమర్లను(Divorce Rumours) రెండుసార్లు ఖండించారు. ఇప్పుడు మిషెల్లీ ఓ ఇంటర్వ్యూలో ఈ ప్రచారంపై స్పందించారు.నటి సోఫియా బుష్ నిర్వహించే పాడ్‌కాస్ట్‌లో మిషెల్లీ మాట్లాడుతూ.. విడాకుల ప్రచారాన్ని తోసిపుచ్చారు. తన గురించి ఆలోచించే సమయం తనకు ఇప్పటికి దొరికిందని.. అందుకే అధికారిక కార్యక్రమాలకు, రాజకీయపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారామె. ‘‘గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులొచ్చాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. నాకు ఏది మంచో అదే చేయాలనుకుంటున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది చేయడం కాదు’’ అని అన్నారామె.ఇక్కడ.. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించలేకపోయారు. మహిళలుగా మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇవే. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రజలు గ్రహించలేకపోయారు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకున్నారు అని మిషెల్లీ అన్నారు.ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 3వ తేదీన హమిల్టన్ కాలేజీలో ఓ ఈవెంట్‌కు హాజరైన బరాక్ ఒబామా తన వైవాహిక జీవితం గురించి మాట్లాడారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షునిగా పదవిలో కొనసాగిన కాలంలో పని ఒత్తిడి కారణంగా భార్యతో సఖ్యత చెడిందని బరాక్ ఒబామా ఒప్పుకున్నారు. నాటి మనస్పర్ధలను తొలగించుకుంటూ నేడు ఆనందంగా జీవిస్తున్నామన్నారు. -
రాణా ఓ పిల్లకాకి.. అతడి విషయంలోనే దుర్మార్గంగా అమెరికా తీరు: జీకే పిళ్లై
న్యూఢిల్లీ: 26/11 ముంబై ఉగ్రదాడుల కుట్రదారుడు తహవూర్ రాణా(Tahawwur Rana) భారత్‌కు వస్తున్న వేళ.. హోం శాఖ మాజీ కార్యదర్శి జీకే పిళ్లై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల్లో రాణా పాత్ర నిమిత్త మాత్రమేనన్న ఆయన.. అసలు కుట్రదారుడ్ని అప్పగించకుండా అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.తహవూర్ రాణా ఓ పిల్లకాకి. 26/11దాడుల్లో అతని జోక్యం చాలా తక్కువే. అసలు కుట్రదారు డేవిడ్ కోల్మన్ హెడ్లీ(David Coleman Headley). అతను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని అమెరికాకూ తెలుసు. అయినా అతని తరలింపును ఆపేసి దుర్మార్గంగా వ్యవహరించింది అని జీకే పిళ్లై(GK Pillai) అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి, పాకిస్తాన్ ఐఎస్ఐకి డబుల్ ఏజెంట్‌గా వ్యవహరించిన హెడ్లీ.. 26/11 సంఘటన తర్వాత కూడా దాడుల కోసం భారత్‌పై నిఘా కొనసాగించాడు. 2009 అక్టోబర్‌లో చికాగో ఎయిర్‌పోర్టులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆపై ఉగ్ర దాడుల అభియోగాలు రుజువు కావడంతో అతనికి 35 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే.. దర్యాప్తునకు సహకరించి లష్కరే తాయిబా గురించి కీలక సమాచారం అందించేందుకు అతను అంగీకరించాడు. ఈ ఒప్పందం కారణంగా.. అతనితో బేరసారాలు కుదుర్చుకున్న అమెరికా భారత్‌కు అప్పగించకుండా ఉండిపోయింది. దావూద్ సయ్యద్ గిలానీ(డేవిడ్ కోల్మన్ హెడ్లీ) 1960లో వాషింగ్టన్లో జన్మించాడు. అతని తండ్రి సయ్యద్ సలీం గిలానీ పాక్ దౌత్య వేత్త. తల్లి అలైస్ సెర్రిల్ హెడ్లీ వాషింగ్టన్‌లోని పాక్ రాయబార కార్యాలయంలో అమెరికా కార్యదర్శిగా పని చేశారు. పాక్‌లో ఎక్కువ రోజులు గడిపిన హెడ్లీ.. క్రమంగా లష్కరే తాయిబాకు దగ్గరై ఉగ్రదాడులకు పాల్పడ్డాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన 64 ఏళ్ల కెనెడియన్ అయిన రాణా ఇప్పటివరకు లాస్ ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. 2008 నవంబర్ 26న ముంబయిలో ఉగ్రమూకలు జరిపిన భీకర దాడిలో దాదాపు 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తొలుత రైల్వే స్టేషన్లో బీభత్సం సృష్టించిన ముష్కరులు ఆ తర్వాత రెండు లగ్జరీ హోటళ్లపై దాడి చేశారు. ప్రాణాలతో దొరికిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను నవంబర్ 2012లో పూణెలోని యరవాడ జైలులో ఉరి తీశారు. ఈ దాడులకు మాస్టర్‌మైండ్ డేవిడ్ హెడ్లీనే అని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) భావిస్తోంది. అయితే ఇదే కేసులో కీలక నిందితుడిగా లష్కర్ ఉగ్రవాది తహవూర్ రాణా ఉన్నాడు. హెడ్లీకి అత్యంత సన్నిహితుడైన రాణా.. దాడులకు ముందు ఎనిమిదిసార్లు భారత్‌కు వచ్చాడు. రెక్కీ నిర్వహించాక ఏకంగా 231 సార్లు ఫోన్లో మాట్లాడాడు. ముంబై ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూప్రింట్ తయారీ చేసింది కూడా రాణానే. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన వెంటనే రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యక్షంగా విచారించే అవకాశం ఉంది. తద్వారా హెడ్లీ మీద దృష్టిసారించే అవకాశం లేకపోలేదు. -
అమెరికా చైనా మధ్య మరింత ముదిరిన టారిఫ్ వార్
-
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
-
ట్రంప్ దూకుడు.. అమెరికాలోని చైనీయులకు చైనా హెచ్చరిక
బీజింగ్: అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ చైనా మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల పన్నులు విధించు కోవడంలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో తన దేశ పౌరులకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. చైనా విద్యార్థులు, పర్యాటకులు.. అమెరికా వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి.. ప్లాన్ చేసుకోవాలని సూచనలు చేసింది. అమెరికాలో ఎదురయ్యే ముప్పులను ముందుగానే అంచనా వేసుకోవాలని కోరింది.అమెరికా-చైనా మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతున్న సందర్భంగా చైనా పర్యటక శాఖ కీలక ప్రకటన చేసింది. అమెరికా వెళ్లే చైనీయులకు అక్కడ ఎదురయ్యే ముప్పులను ముందుగానే అంచనా వేసుకోవాలని, జాగ్రత్త అంటూ చైనా టూరిజం శాఖ సూచించింది. దీంతోపాటు అమెరికా రాష్ట్రాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా అయా ప్రాంతాల్లో భద్రతా ముప్పును అంచనా వేసుకొని వెళ్లాలని కోరింది. భద్రతా పరిస్థితుల కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లకపోవడమే మంచిదని సూచనలు చేసింది.ఇదే సమయంలో.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాలనుకునే చైనీయుల కోసం విద్యాశాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో చైనీయులకు సంబంధించి ప్రతికూల నిబంధనలు ఉన్నాయని తెలిపింది. భవిష్యత్తులో అక్కడ చదవాలనుకునే వారు స్థానికంగా ఎదురయ్యే సమస్యలను తెలుసుకోవాలని సూచించింది.ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్త ఆర్థిక ప్రకంపనల నేపథ్యంలో ట్రంప్ వెనక్కు తగ్గారు. భారత్‌తో పాటు 75 పై చిలుకు దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను తాత్కాలికంగా పక్కన పెట్టారు. వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే అటకెక్కాయి. కానీ చైనాతో మాత్రం అమెరికా టారిఫ్‌ల పోరు బుధవారం మరింత తీవ్రరూపు దాల్చింది. ఈ దిశగా రోజంతా శరవేగంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే అమెరికాపైనా చైనా అంతే మొత్తం బాదింది.అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు గురువారం నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీనిపై ట్రంప్ తీవ్రంగా కన్నెర్రజేశారు. చైనా ఉత్పత్తులపై ఇప్పటికే 104 శాతానికి చేరిన సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచేశారు. అవి తక్షణం అమల్లోకి వస్తాయని కుండబద్దలు కొట్టారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాపై మళ్లీ సుంకాల కత్తి ఝుళిపించింది. 23 బిలియన్ల విలువైన యూఎస్ ఉత్పత్తులపై దశలవారీగా అదనపు టారిఫ్‌లు విధిస్తున్నట్టు ప్రకటించింది. కెనడా కూడా అమెరికా ఆటో ఉత్పత్తులపై 25 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు పేర్కొంది. -
చైనా మినహా మిగతా దేశాలపై ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన... చైనా ఉత్పత్తులపై 125 శాతం సుంకాలు విధిస్తున్నట్లు స్పష్టీకరణ
-
భారత్‌కు రాణా తరలింపు!
న్యూఢిల్లీ: 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి, పాకిస్తాన్ సంతతి ఉగ్రవాది తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాణాను తీసుకొని భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి బుధవారం రాత్రి 7.10 గంటలకు(భారత కాలమానం ప్రకారం) ప్రత్యేక విమానంలో బయలుదేరారు. గురువారం మధ్యాహ్నంకల్లా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రాణాను అధికారికంగా అరెస్టు చేస్తుంది. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను తీహార్ జైలుకు తరలిస్తారు. రాణా భద్రత కోసం జైలులో ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. జైలు చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ఢిల్లీలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టులో రాణాపై విచారణ ప్రారంభం కానుంది. కేసు విచారణ ఢిల్లీలోనే జరుగుతుంది కాబట్టి రాణాను ముంబైకి తరలించే అవకాశం లేదని అంటున్నారు. అమెరికా నుంచి రాణా తరలింపు ప్రక్రియను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తనను ఇండియాకు అప్పగించకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ రాణా దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలే తిరస్కరించింది. దాంతో అతడిని ఇండియాకు అప్పగించేందుకు అవరోధాలు తొలగిపోయాయి. -
ఇక ఫార్మా వంతు!
వాషింగ్టన్: ఎడాపెడా టా రిఫ్లతో వీరంగం వేస్తున్న అమెరికా అధ్యక్షుని దృష్టి ఇప్పుడు ఫార్మా రంగంపై కూడా పడింది. ఇప్పటిదా కా విధించిన టారిఫ్‌ల నుంచి వాటిని మినహాయించడం తెలిసిందే. కానీ వాటిపైనా అదనపు సుంకాలు వేయనున్నట్టు ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. ‘‘ఫార్మాస్యూటికల్స్ మీద కూడా భారీగా టారిఫ్‌లు వేయనున్నాం. అవి ఎంతన్నది అతి త్వరలో ప్రకటిస్తాం’’ అని మంగళవారం రాత్రి రిపబ్లికన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన వెల్లడించారు. ‘‘ఆ తర్వాత ఫార్మా కంపెనీలన్నీ చైనాను వీడతాయి. మరెన్నో ఇతర దేశాలను కూడా ఉన్నపళంగా వదిలేస్తాయి. రెక్కలు కట్టుకుని మరీ అమెరికాలో వచ్చి వాలతాయి. ఎందుకంటే వాటి ఉత్పత్తులను అమ్ముకోవాలి కదా! వాటికి అతి పెద్ద మార్కెట్ అమెరికాయే. అవన్నీ అమెరికాలోనే ప్లాంటు తెరవాలి. ఇక్కడే ఉత్పత్తి చేపట్టాలి. చైనాలోనో, మరో దేశంలోనో కాదు’’ అని చెప్పుకొచ్చారు. -
వెంటనే వెళ్లిపోండి.. లేదంటే రోజుకు రూ. 86 వేలు కట్టండి
వాషింగ్టన్: దేశంలో తిష్టవేసిన లక్షలాది మంది అక్రమ వలసదారులను వేర్వేరు ప్రభుత్వ శాఖలు, భిన్న దర్యాప్తు సంస్థల ద్వారా గుర్తించి స్వదేశానికి వెనక్కి పంపుతున్న డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వారికి మరో హెచ్చరిక జారీ చేసింది. తామే స్వయంగా గుర్తించి, బలవంతంగా పంపేసేలోపు స్వీయ బహిష్కరణ ద్వారా దేశాన్ని వీడాలని సూచించింది. సున్నితంగా సూచిస్తూ ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెడితే పెద్ద జరిమానా చెల్లించుకోక తప్పదని అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పష్టంచేసింది. ఇప్పటికే దేశ బహిష్కరణ ఆదేశాలను అందుకున్న అక్రమవలసదారులు ఇంకా అమెరికా గడ్డపైనే నివసిస్తుంటే వారికి రోజుకు 998 డాలర్ల(దాదాపు రూ.86,469) చొప్పున జరిమానా విధిస్తామని, పట్టుబడ్డాక వారి నుంచి ఈ మొత్తం నగదును ముక్కుపిండి మరీ వసూలుచేస్తామని హోమ్‌ల్యాండ్ విభాగం ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలచేసింది. చెల్లించకుంటే ఆస్తుల జప్తు బహిష్కరణ నోటీసు అందుకున్న రోజు నుంచి ప్రతిరోజూ 998 డాలర్ల చొప్పున జరిమానా విధించనున్నారు. అంతటి భారీ మొత్తాలను చెల్లించని, చెల్లించలేని అక్రమ వలసదారుల ఆస్తులను జప్తుచేస్తామని సంబంధిత ఈ–మెయిల్స్‌లో ప్రభుత్వం ప్రస్తావించింది. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ జరిమానాలకు సంబంధించి 1996లో తీసుకువచ్చిన చట్టాన్ని తొలిసారిగా అమలు చేశారు. ఇలా బహిష్కరణ నోటీసు అందుకున్నాక అమెరికాలోనే నివసిస్తే వాళ్లకు గరిష్టంగా ఐదు సంవత్సరాలపాటు ఈ జరిమానా విధించే వీలుంది. రోజుకు 998 డాలర్ల చొప్పున జరిమానాను ఎదుర్కొంటే అలాంటి అక్రమవలసదారుడు ఐదేళ్లలో ఏకంగా 10లక్షల డాలర్ల జరిమానాను చెల్లించాల్సి ఉంటుంది. ఇంతటి భారీ మొత్తాలను వాళ్లు ఎలాగూ కట్టలేరుకాబట్టి అలాంటి వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వా«దీనంచేసుకోనుందని ట్రంప్ యంత్రాంగంలోని ఒక సీనియర్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గతంలోనూ పెనాల్టీలు ట్రంప్ తొలిసారిగా అధ్యక్షబాధ్యతలు నిర్వర్తించి కాలంలోనూ కొద్దిమంది అక్రమ వలసదారులపై ఇలా భారీ జరిమానాలు విధించారు. ఆనాడు శరణార్థులుగా వచ్చి చర్చిల్లో రహస్యంగా ఆశ్రయం పొందుతున్న 9 మంది అక్రమవలసదారులపై ట్రంప్ సర్కార్ ఏకంగా లక్షల డాలర్ల పెనాల్టీ విధించింది. తర్వాత కాస్త కనికరం చూపించి నలుగురిపై తలో 60 వేల డాలర్ల జరిమానా విధించింది. అయితే ఈ అంశం కోర్టుల దాకా వెళ్లింది. ఆ తర్వాత అధ్యక్షపగ్గాలు చేబట్టిన జో బైడెన్ వెంటనే జరిమానాల విధింపును రద్దుచేశారు. సంబంధిత విధానపర నిర్ణయాలనూ 2021లో ఉపసంహరించుకున్నారు. కోటికిపైగా అక్రమ వలసదారులు వలసదారుల సలహాల సంస్థ ‘ఎఫ్‌డబ్ల్యూడీ.యూఎస్’ గణాంకాల ప్రకారం అమెరికాలో దాదాపు 1,00,00,000కిపైగా అక్రమ వలసదారులు ఉన్నారు. వీళ్లంతా ఒంటరిగా ఉండట్లేరు. వీళ్ల రక్తసంబం«దీకులు, కుటుంబసభ్యులు, బంధువుల్లో కొందరికి చట్టబద్ధమైన స్థిరనివాస హోదా, పౌరసత్వం ఉన్నాయి. వాళ్లతో కలిసి ఈ అక్రమవలసదారులు జీవిస్తున్నారు. ఇలా ‘మిక్స్డ్ స్టేటస్’ ఉన్న కుటుంబాలు అమెరికాలో లక్షల్లో ఉన్నాయి. వలసదారుల్లో తక్కువ ఆదాయం ఉన్న వాళ్లే ఎక్కువ. -
సుంకాలపై వెనక్కి తగ్గిన అమెరికా
సుంకాల విదింపుపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump) విదిస్తున్న సుంకాలపై ప్రపంచ దేశాలకు ఊరట లభించింది. చైనా మినహా మిగతా దేశాలకు అమెరికా సుంకాల నుంచి ఊరటనిచ్చింది.కానీ చైనాకు మాత్రం 125 శాతానికి సుంకాలు పెంచిన అమెరికా. మొత్తంగా 75 దేశాలపై విదించిన సుంకాలను 90 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది.ఇదిలా ఉంటే అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. ట్రంప్ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. -
అమెరికాకు షాకిచ్చిన చైనా
బీజింగ్: అమెరికా- చైనాల మధ్య ప్రతీకార సుంకాల వార్ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇందులో భాగంగా బుధవారం అమెరికా వస్తువులపై ప్రస్తుతం ఉన్న 34 శాతం టారిఫ్‌ను 84శాతానికి పెంచుతూ చైనా (China Raises Tariffs On US Goods) నిర్ణయం తీసుకుంది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మరో 50 శాతం అదనపు సుంకాలు విధించారు. అమెరికాపై చైనా 34 శాతం ప్రతీకార సుంకాలపై సోమవారం ఆయన మండిపడటం, మంగళవారం మధ్యాహ్నం లోపు వాటిని వెనక్కు తీసుకోవాలని అల్టీమేటం జారీ చేయడం తెలిసిందే. ఆ హెచ్చరికలను డ్రాగన్ దేశం బేఖాతరు చేసింది. బెదిరింపులకు జడిసేది లేదని కుండబద్దలు కొట్టింది. ‘‘మా విషయంలో అమెరికా తప్పులపై తప్పులు చేస్తోంది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగే ప్రసక్తే లేదు. చివరిదాకా పోరాడి తీరతాం.#BREAKING 🇨🇳#CHINA to lift additional tariffs to 84% on ALL imported🇺🇸, effective from April 10th.As I said, don't underestimate China's determination to safeguard its legitimate rights and interesting when facing the U.S. global #tariffs bully. pic.twitter.com/BxlKxCGzXw— Shen Shiwei 沈诗伟 (@shen_shiwei) April 9, 2025 మా ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా వెళ్తాం. 50 శాతం టారిఫ్‌లు విధిస్తే మావైపు నుంచీ అంతకంతా ప్రతీకార చర్యలుంటాయి’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ మంగళవారం ప్రకటించారు. వాణిజ్య, టారిఫ్ యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని హితవు పలికారు. అయినా చైనా ఈ విషయమై తమతో చర్చలకు వస్తుందని ఎదురు చూస్తున్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ‘‘వాళ్లూ ఏదో ఒక ఒప్పందానికి రావాలనే ఆశ పడుతున్నారు. కానీ ఎక్కణ్నుంచి మొదలు పెట్టాలా అని సతమతమవుతున్నారు’’ అన్నారు.కానీ మంగళవారం డెడ్‌లైన్ ముగిసినా చైనా నుంచి అలాంటి సూచనలేవీ రాకపోవడంతో వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ మీడియా ముందుకొచ్చారు.‘చైనాపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నాం. ఈ నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి వస్తుంది’ అని ప్రకటించారు! దాంతో అగ్ర రాజ్యాల టారిఫ్ పోరు ముదురు పాకాన పడింది.చైనాపై మార్చిలోనే అమెరికా 20 శాతం సుంకాలు విధించడం, గత వారమే ట్రంప్ మరో 34 శాతం బాదడం తెలిసిందే. తాజా 50 శాతంతో కలిపి చైనాపై అమెరికా మొత్తం సుంకాలు ఏకంగా 104 (Trump's 104%) శాతానికి చేరాయి! టారిఫ్‌లపై చైనాతో చర్చలకు చాన్సే లేదని సోమవారమే ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధం తప్పేలా లేదు. -
విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు విధిస్తున్న అమెరికా
-
ట్రంప్ సుంకాలపై భారత్- చైనా కలసి పోరాడాలి: చైనా పిలుపు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్కారు చేపట్టిన సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు భారత్- చైనా(India-China)లు కలిసి పోరాడాలని భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో తెలియజేశారు. ‘చైనా-భారత్‌ల ఆర్థిక, వాణిజ్య సంబంధాలు పరస్పర ప్రయోజనాలపై(Mutual benefits) ఆధారపడి ఉన్నాయి. తాజాగా అమెరికా అనుసరిస్తున్న సుంకాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రపంచంలోని రెండు అతిపెద్ద, అభివృద్ధి చెందుతున్న దేశాలు(భారత్-చైనా) కలిసి పోరాడాలని, ఈ కష్టాలను అధిగమించాలని అని యూ జింగ్ పేర్కొన్నారు. చైనా నుంచి వచ్చిన ఈ పిలుపు అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో రావడం విశేషం.అమెరికా అధ్యక్షుడు ట్రంప్(US President Trump) ఏప్రిల్ 7న చైనాపై 104 శాతం సుంకాలను విధిస్తామని ప్రకటించారు. ఇవి ఏప్రిల్ 9 నుండి అమలులోకి రానున్నాయి. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధించింది. ఈ సుంకాల యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా తాజాగా చైనా.. భారత్‌కు ఈ ప్రతిపాదన చేయడానికి కారణం భారతదేశం- చైనా రెండూ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా విధిస్తున్న ఏకపక్ష సుంకాల నుండి రక్షణ పొందేందుకు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చైనా ఈ విజ్ఞప్తి చేసివుండవచ్చు.అయితే భారత్.. చైనా పిలుపుపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. భారతదేశం ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఉంది. ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలకు ప్రతీకార సుంకాలు విధించకూడదని నిర్ణయించిందని తెలుస్తోంది. అలాగే భారతదేశం అమెరికా నుండి వచ్చే 23 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై సుంకాలను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. అయితే చైనా.. భారతదేశాన్ని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాలు ఉన్నప్పటికీ, ఈ సుంకాల సమస్యపై సహకారం ఇరు దేశాలకూ ప్రయోజనం చేకూర్చవచ్చని చైనా వాదిస్తోంది. ఒకవేళ భారత్ ఈ ప్రతిపాదన దిశగా యోచిస్తే, అది ప్రపంచ వాణిజ్య రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చు.ఇది కూడా చదవండి: Dominican Republic: నైట్ క్లబ్ పైకప్పు కూలి 79 మంది మృతి.. 160 మందికి గాయాలు -
ట్రంప్ సంచలన నిర్ణయం.. లక్షలాది మందికి మరణశాసనం
రోమ్: లక్షలాది మందికి ఆహార సాయాన్ని నిలిపేస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పీ) తీవ్రంగా తప్పుబట్టింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆకలితో అలమటిస్తున్న లక్షలాది మంది పాలిన మరణశాసనంగా అభివర్ణించింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సోమవారం విజ్ఞప్తి చేసింది. ప్రాణాలను కాపాడే కార్యక్రమాలకు నిరంతరం మద్దతివ్వాలని కోరేందుకు ట్రంప్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించింది.అఫ్గానిస్తాన్, సిరియా, యెమన్, మరో 11 పేద దేశాల్లో లక్షలాది మంది అన్నార్తులకు సాయపడే యూఎస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అత్యవసర కార్యక్రమాలకు ట్రంప్ ప్రభుత్వం నిధులను నిలిపేయడం తెలిసిందే. ఎలాన్ మస్క్ డోజ్‌లో టాప్ లెఫ్టినెంట్ జెరెమీ లెవిన్ ఆదేశాల మేరకు వాటికి నిధుల కేటాయింపును రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. అత్యవసర ఆహార కార్యక్రమాలకు సాయాన్ని కోతల నుంచి మినహాయిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇతర ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా లాభం లేకపోయింది.ట్రంప్ టార్గెట్ చేసిన కార్యక్రమాలు 13 ఏళ్ల అంతర్యుద్ధం, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు తిరుగుబాటు తర్వాత సిరియా పేదరికం, ఆకలి, అభద్రతతో సతమతమవుతోంది. ఆ దేశానికి తాజాగా 23 కోట్ల డాలర్ల ఒప్పందాలను అమెరికా రద్దు చేసింది. ఇక ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన మానవీయ విపత్తును ఎదుర్కొంటున్న యెమన్‌లో డబ్ల్యూఎఫ్‌పీ ఆహార కార్యక్రమాలకు సాయం నిలిపేసింది. సిరియా శరణార్థులు తీవ్రంగా ప్రభావితమయ్యే లెబనాన్, జోర్డాన్లలో కార్యక్రమాలూ పడకేశాయి.సోమాలియా, అఫ్గాన్, జింబాబ్వేల్లో యుద్ధాలతో నిరాశ్రయులైన వారికి జలకు ఆహారం, నీరు, వైద్య సంరక్షణ, ఆశ్రయం వంటి కార్యక్రమాలు కూడా ప్రభావితమయ్యాయి. అఫ్గాన్‌కు మానవతా సహాయంలో అమెరికా 56 కోట్ల డాలర్లు కోత పెట్టింది. తాలిబన్ ఆంక్షల వల్ల విదేశాల్లో చదువుతున్న అఫ్గాన్ యువతులకు అందించే సాయాన్ని శుక్రవారం నిలిపేసింది. అమెరికా కోతలతో ప్రపంచవ్యాప్తంగా ఇలా సుమారు 1,000కి పైగా కార్యక్రమాలు నిలిచిపోయాయి. 5,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు. డబ్ల్యూఎఫ్‌పీకి గతేడాది అందిన 980 కోట్ల డాలర్ల విరాళాల్లో 450 కోట్లు అమెరికా ఇచ్చినవే! 🚨 US emergency food aid cuts by the Trump administration threaten millions in 14 countries, warns the UN. Despite earlier pledges to protect aid, these cuts put vulnerable communities at risk. 🔵 Calls for urgent action to restore funding. #UN #FoodAid #GlobalCrisis pic.twitter.com/EGLNbz8D8n— Thomas MORE (@ThomaMore) April 8, 2025వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్(డబ్ల్యూఎఫ్‌పీ) 2025 లెక్కల ప్రకారం పలు దేశాల సాయం ఇలా ఉంది. అమెరికా.. మూడు బిలియన్ డాలర్లు కాగా, జర్మనీ.. ఒక్క బిలియన్ డాలర్లు. యూకే, యూరోపియన్ కమిషన్, ప్రైవేటు డోనార్స్ ఉన్నారు. -
అమెరికాలో భారతీయురాలికి చేదు అనుభవం
వాషింగ్టన్: విదేశీ పర్యాటకులతో తరచూ అనుమాన, అవమానకర రీతిలో ప్రవర్తించిన అమెరికా దర్యాప్తు అధికారులు మరోమారు తమ బుద్ధిచూపించారు. వ్యాపార, వ్యక్తిగత పర్యటన నిమిత్తం అమెరికాలో పర్యటిస్తున్న భారతీయ యువపారిశ్రామికవేత్త శ్రుతి చతుర్వేది పట్ల అలాస్కాలోని యాంకరేజ్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా పురుష ఆఫీసర్‌తో ‘వ్యక్తిగత’తనిఖీలు చేయించారు. చలివాతా వరణంలో వెచ్చదనం కోసం ధరించిన అదన పు దుస్తులను విప్పించారు. కనీసం బాత్రూమ్కు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏకధాటిగా 8 గంటలపాటు తమ అ«దీనంలో నిర్బంధించి పలురకాల ప్రశ్నలతో వేధించారు. కనీసం సాయంకోసం ఎవరికీ ఫోన్‌చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఎయిర్‌పోర్ట్‌లో తనకు జరిగిన అవమానాన్ని శ్రుతి తర్వాత భారత్‌కు చేరుకున్నాక ‘ఎక్స్’సామాజిక మాధ్యమంలోని తన ఖాతాలో పోస్ట్‌చేశారు.పవర్ బ్యాంక్‌పై అనుమానంతో.. ‘‘ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినప్పుడు నా హ్యాండ్‌బ్యాగ్‌లో స్మార్ట్‌ఫోన్ పవర్‌బ్యాంక్ ఉంది. అదేదో కొత్తరకం వస్తువు అన్నట్లు దానిని పోలీసులు అనుమానంగా చూశారు. వెంటనే ఎఫ్‌బీఐ అధికారులను రప్పించి తనిఖీలు చేయించారు. తర్వాత నన్ను ఇష్టమొచ్చినట్లు, అర్థంపర్థంలేని ప్రశ్నలతో వేధించారు. వాస్తవానికి మహిళా ఆఫీసర్‌కు తనిఖీలు చేయాల్సిఉన్నా ఒక పురుష అధికారి వచ్చి నన్ను తనిఖీలు చేశాడు. విపరీతమైన చలికారణంగా ధరించిన వెచ్చటి దుస్తులను విప్పించాడు. ఏకధాటిగా 8 గంటలపాటు ఎటూ వెళ్లనివ్వలేదు. కనీసం బాత్రూమ్కు కూడా పోనివ్వలేదు. సాయం కోసం ఎవరికైనా ఫోన్ చేసుకోవడానికి వీల్లేకుండా ఫోన్, మనీ పర్సు లాక్కున్నారు. అన్ని రకాల తనిఖీలు చేసి చివరకు ఏమీ లేవని నిర్ధారించుకుని వదిలేశారు. నా ఖరీదైన లగేజీ బ్యాగ్‌ను వాళ్లే అట్టిపెట్టుకున్నారు. నా వస్తువులను బయటకుతీసి నాసిరకం వేరే బ్యాగులో కుక్కి ఇచ్చారు. భారత్‌కు ఆవల ఉన్నప్పుడు భారతీయులు శక్తిహీనులు అన్నట్లు అమెరికా పోలీసులు, ఎఫ్‌బీఐ అధికారులు ప్రవర్తించారు’’అని శ్రుతి ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు. తన పోస్ట్‌ను భారత విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు. ‘ఇండియా యాక్షన్ ప్రాజెక్ట్’, చర్చా వేదిక అయిన ‘ఛాయ్‌పానీ’లను శ్రుతి స్థాపించారు. మహిళను గంటల తరబడి అమెరికా అధికారులు వేధించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. 🛑 Shruti Chaturvedi, an entrepreneur from India🇮🇳, was held for eight hours at a US airport because of a power bank in her luggage that was deemed suspicious.#Ukraine #ShrutiChaturvedi #USA #Entrepreneur pic.twitter.com/2lrKWXRzPR— Dainik Shamtak Samachar (@DainikShaamTak) April 8, 2025 -
ట్రాఫిక్ ఉల్లంఘనకూ వీసా రద్దు!
వాషింగ్టన్: దేశం నుంచి బలవంతంగానైనా పంపేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నాక ఆపడం ఎవరితరం కాదనే వాస్తవం ఇప్పుడు అమెరికాలో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. విదేశీ విద్యార్థులు ఏ చిన్న పొరపాటు అనుకోకుండా చేసినా ప్రభుత్వం వారిపై ‘వీసా రద్దు’ కత్తి దింపుతోంది. వెంటనే వీసా గడువును ముగించేసి స్వదేశానికి వెళ్లాలని ఆదేశాలిస్తోంది. చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘన ఉదంతాన్ని సైతం వీసా రద్దుకు సాకుగా చూపుతోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఏ నిమిషంలో వీసా రద్దు ఈ–మెయిల్ వస్తుందోనన్న భయంతో అక్కడి విదేశీ విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.పారిపోయిన, జాడ దొరకని ఉగ్రవాదిని అత్యవసరంగా వెతికిన చందంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వ్యవహరిస్తోంది. దీనిపై ఎంతటి విమర్శలు వెల్లువెత్తుతున్నా విదేశీ విద్యార్థుల బహిష్కరణ పర్వానికి ప్రభుత్వం తెరదించట్లేదు. దీంతో ఇప్పటికే గాజా అనుకూల ర్యాలీలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారు, ఆ కార్యక్రమాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేసినా, షేర్ చేసిన, అనుకూలంగా స్పందించిన విదేశీ విద్యార్థుల కంటిపై కనుకులేకుండా పోయింది. ఏ నిమిషంలో వీసా రద్దవుతుందోనన్న ఆందోళన సంబంధిత విదేశీ విద్యార్థుల్లో ఎక్కువైంది. సంబంధిత వివరాలను అసోసియేటెడ్ ప్రెస్ వార్తాసంస్థ ఒక నివేదిక వెల్లడించింది. మా విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి తమ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల్లో చాలా మంది వీసాలు హఠాత్తుగా రద్దయ్యాయని అమెరికాలోని పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలలు తాజాగా వెల్లడించాయి. ఇలా వీసా రద్దును ఎదుర్కొన్న వారిలో భారతీయ విద్యార్థులూ ఉన్నారు. అయితే పాలస్తీనా అనుకూల ఘటనలతో ఎలాంటి సంబంధం లేని విద్యార్థులకు సైతం వీసా రద్దు ఈ–మెయిల్స్ రావడం గమనార్హం. ఇలాంటి విద్యార్థులను అమెరికాలో గతంలో చిన్నపాటి ట్రాఫిక్ ఉల్లంఘన ఉదంతాలను సాకుగా చూపి దేశ బహిష్కరణ వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇంకొంత మంది విద్యార్థులకు వీసా ఎందుకు రద్దు చేస్తున్నామని కనీస కారణాన్ని కూడా ఇమిగ్రేషన్ అధికారులు పేర్కొనకపోవడం దారుణమని కాలేజీల యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. డేటాబేస్ చూశాకే మాకూ తెలిసొచి్చంది అసలు ఎవరెవరి వీసాలు రద్దయ్యాయని వివరాలు సైతం ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టంగా పేర్కొనట్లేరు. దీనిపై హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, మిషిగన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలెస్, ఒహాయో స్టేట్ వర్సిటీల అధికారులు స్పందించారు. ‘‘ మా కాలేజీల్లోని కొందరు విద్యార్థుల వీసాలు సైతం రద్దయ్యాయి. అమెరికావ్యాప్తంగా స్టూడెంట్ వీసాల గడువును అకస్మాత్తుగా కుదిస్తున్న నేపథ్యంలో ఫెడరల్ ఇమిగ్రేషన్ డేటాబేస్‌ను యథాలాపంగా చెక్‌చేశాం. అందులో మా కాలేజీల విద్యార్థుల పేర్లు కూడా కనిపించడంతో ఆశ్చర్యపోయాం.ఎందుకు రద్దుచేశారని తెల్సుకునేందుకు ప్రయత్నిస్తే ఇమిగ్రేషన్ విభాగం నుంచి సరైన స్పందన కరువైంది’’ అని ప్రముఖ వర్సిటీల అధికారులు వెల్లడించారు. భారతీయ విద్యార్థులు ఎలాంటి గాజా, పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొనకపోయినా కొందరి వీసాల గడువును ప్రభుత్వం పూర్తిగా ముగించేసి స్వదేశానికి వెళ్లిపోవాలని సందేశాలు పంపించింది. అమెరికా వ్యతిరేక భావజాలమున్న విద్యార్థులను ఏరివేసేందుకు ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ఖాతాలను జల్లెడ పడుతోందని యాక్సికోస్ అనే సంస్థ వెల్లడించింది. హమాస్ అనుకూల, ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టులు పెట్టినా, అలాంటి పోస్ట్‌లను లైక్చేసినా, షేర్ చేసినా అలాంటి వారిని గుర్తించే పనిలో ప్రభుత్వం మునిగిపోయిందని యాక్సికోస్ నివేదించింది. -
రూపాయికి ట్రేడ్ వార్ సెగ
డాలర్ మారకంలో రూపాయి విలువ మరో 50 పైసలు బలహీనపడి 86.26 వద్ద ముగిసింది. వాణిజ్య యుద్ధాలతో మాంద్యం పరిస్థితులు తలెత్తవచ్చనే భయాలు దేశీయ కరెన్సీ కోతకు ప్రధాన కారణమయ్యాయి. యువాన్ క్షీణత, క్రూడాయిల్ రికవరీ, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు మరింత ఒత్తిడి పెంచాయి. జనవరి 13 (66 పైసలు క్షీణత) తర్వాత భారత కరెన్సీకిదే అతిపెద్ద పతనం. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 85.89 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 85.82 వద్ద గరిష్టాన్ని, 86.29 వద్ద కనిష్టాన్ని తాకింది. ‘అమెరికా ప్రతీకార సుంకాల ప్రభావం ఫారెక్స్ మార్కెట్‌కు ప్రతికూలంగా మారింది. ఆర్బీఐ పాలసీ వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. రానున్న రోజుల్లో 85.90 – 86.50 శ్రేణిలో ట్రేడవొచ్చు’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ నిపుణులు దిలీప్ పార్మర్ తెలిపారు. -
వ్యవసాయ సుంకాల కాపట్యం
అధిక సబ్సిడీలతో కూడిన అమెరికన్ వ్యవసాయ ఉత్పత్తులకు భారతదేశం తన మార్కెట్‌ను తెరవాలని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చాలా ప్రత్యేకంగా కోరిన ట్లుగా నేను ఇటీవల చదివాను. అది చదివిన ప్పుడు, ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికవేత్త నికోలస్ స్టెర్న్, తన భారతదేశ పర్యటనల సమయంలో క్లుప్తంగా చెప్పింది గుర్తొచ్చింది. ‘అమెరికా రైతులకు అలాంటి సబ్సిడీలను అందించడం తప్పేనని నేను అంగీకరిస్తున్నాను. కానీ అమెరికా ఉత్పత్తులకు భారతదేశం తన తలుపులు తెరవకపోతే అది విపత్తుకు దారితీస్తుంది.’జార్జ్ బుష్ జూనియర్ హయాంలో 2001 నుండి 2005 వరకు పదవిలో ఉన్న యాన్ వెనెమన్ మొదలుకుని, అమెరికా వ్యవసాయ మంత్రులందరూ ఇదే విధమైన కపటత్వాన్ని పదే పదే ప్రదర్శించారు. కొంతకాలం తర్వాత వాషింగ్టన్ డీసీలోని ‘ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ (ఐఎఫ్పీఆర్ఐ)లో మాట్లాడుతూ, భారత వ్యవసాయాన్ని బలవంతంగా తెరవాలన్న ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్త వాదనను ఆమె ఎంత నిస్సిగ్గుగా సమర్థించిందో నాకు గుర్తుంది.అమెరికాలోని కనీసం 14 వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి గ్రూపులు, భారతదేశ ఉత్పత్తి నిర్దిష్ట కనీస మద్దతు ధరపై పరిమితిని కోరుతూ అమెరికన్ ట్రేడ్ రిప్రజెంటేటివ్‌కు లేఖలు రాశాయి. అప్పుడే ఇండియాకు అమెరికా ఎగుమతులు చేయడానికి వీలుంటుంది మరి.చైనా నిలబడిన తీరుఅందువల్ల, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన అవాంఛ నీయ వాణిజ్య యుద్ధం పట్ల నేను పెద్దగా ఆశ్చర్యపోలేదు. అభివృద్ధి చెందుతున్న దేశాలను లొంగదీసుకోవడానికి ట్రంప్ చుట్టూ ఉన్న బిలియనీర్లు ఆయనకు తప్పుడు సలహా ఇస్తున్నారు.అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు అమెరికా పట్ల ధిక్కార వైఖరితో నిలబడటం ప్రారంభించాయి. కాబట్టి భారతదేశాన్ని కాస్త వంగమని మాత్రమే అడిగినప్పుడు, అది సాష్టాంగపడటానికి సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను.ఇక్కడ మరొక కథ చెబుతాను. కొన్నేళ్ల క్రితం, అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ‘చెడ్డ’ మానవ హక్కుల రికార్డు కారణంగా చైనాతో అమెరికా వ్యాపారం చేయదని వ్యాఖ్యానించారు. మరుసటి రోజు, నేను ‘బీబీసీ’ టీవీ ఛానెల్‌ని చూస్తున్నాను. ఒక జర్నలిస్ట్ అప్పటి చైనా అధ్యక్షుడిని అడుగుతున్నారు: ‘చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు చేసిన బెదిరింపునకు మీరు ఎలా స్పందిస్తారు?’ ఆయన సమాధానం కూడా అంతే చిన్నది: ‘యూఎస్‌తో వ్యాపారం చేయడమా? మేము నాలుగు వేల ఏళ్లకు పైగా అమెరికాతో వ్యాపారం చేయలేదు. కాబట్టి అది అంత ముఖ్యమైనదా?’ఈ ప్రకటన తర్వాత, చైనాతో వాణిజ్యాన్ని నిలిపివేయాలని తమ సొంత అధ్యక్షుడు ఇచ్చిన పిలుపును వ్యతిరేకిస్తూ అమెరికా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు తిరగబడ్డాయి. బిల్ క్లింటన్ చివరికి దేశీయ పరిశ్రమ ముందు తల వంచి, మళ్ళీ ఎప్పుడూ ఆ సమస్యను లేవనెత్తలేదు.సుంకాల వాణిజ్య సూత్రాలుకొత్త సుంకాల యుద్ధానికి తిరిగి వస్తే, అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల ప్రవేశాన్ని పరిమితం చేసే విషయంలో ట్రంప్ భారత దేశాన్ని ‘సుంకాల రాజు’ అని విమర్శించవచ్చు. ఎందుకంటే, అమె రికా 5 శాతం సుంకాలను విధిస్తుంటే, భారత్ సగటున 39 శాతం సుంకాలను విధిస్తోంది. అయితే, భారత్ విధించే సుంకాలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. దేశ అభివృద్ధి స్థాయి, వాణిజ్య పుస్తకాలలో పేర్కొన్న ‘ప్రత్యేక, భేదాత్మక వ్యవ హారం’ ఆధారంగా వీటిని విధించారు. భారత్ ఏ దశలోనూ ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలను ఉల్లంఘించలేదని తెలియజేయాలి. భారత్ సాపేక్షంగా విధిస్తున్న అధిక సుంకాలు, అప్పటికే రూపొందించి ఉన్న వాణిజ్య సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. పైగా ఒక వ్యక్తి ఇష్టానిష్టాల ద్వారా వాటిని నియంత్రించడం ఉండదు.మరోవైపు, వ్యవసాయానికి అమెరికా అందించే భారీ సబ్సిడీలే వాస్తవానికి సమస్య. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలు తాము మరిన్ని అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ అమెరికా వ్యవసాయ సబ్సిడీలను కాదు’ అని అప్పటి యూరోపియన్ ట్రేడ్ కమిషనర్ పీటర్ మాండెల్సన్ పేర్కొన్న విషయాన్ని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ (2006 జూలై 21) స్పష్టంగా రాసింది. ‘అమెరికా రైతులతో పోటీ పడటానికి మాకు అభ్యంతరం లేదు, కానీ మేము అమెరికా ఖజానాను ఎదుర్కోలేము’ అని అప్పటి భారత వాణిజ్య మంత్రి కమల్‌నాథ్ చెప్పింది ఆయన ఉటంకించారు.రైతులకు ఎంత ఇస్తున్నారు?గత కొన్ని సంవత్సరాలుగా, అమెరికా తన అధిక సబ్సిడీ వ్యవసాయం చుట్టూ నిర్మించిన రక్షణ కోటను మరింత బలోపేతం చేసుకుంది. అమెరికా వ్యవసాయ శాఖకు చెందిన ఆర్థిక పరిశోధన సేవ నివేదిక ప్రకారం, రైతులు, పశువుల పెంపకందారులకు ప్రత్యక్ష ప్రభుత్వ వ్యవసాయ కార్యక్రమం కింద చెల్లింపులు 2025 నాటికి 42.4 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని అంచనా. నిజానికి 2024 నాటికి 9.3 బిలియన్ డాలర్లకు పెరుగుతాయని అంచనా వేశారు.అంటే ఒక్కో రైతుకు అమెరికా ప్రభుత్వం సాలీనా రూ. 26.8 లక్షలను చెల్లిస్తోంది. ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చలలో వివాదాస్పద అంశంగా మిగిలిపోయిన పత్తిని ఉదాహరణగా తీసుకుందాం. 2021 నాటికి 624.7 హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్న కేవలం 8,103 మంది రైతులకు అమెరికా భారీ సబ్సిడీలను అందిస్తోంది (ఇండియాలో 98.01 లక్షల మంది రైతులు పత్తి సాగులో నిమగ్నమై ఉన్నారు). న్యూఢిల్లీకి చెందిన ‘సెంటర్ ఫర్ డబ్ల్యూటీఓ స్టడీస్’ లెక్కల ప్రకారం, 2021లో అమెరికా పత్తి రైతుకు లభించిన వార్షిక మద్దతు 1,17,494 డాలర్లు కాగా, భారత్ విషయంలో అది కేవలం 27 డాలర్లు.2006లో యూరోపియన్ యూనియన్ పత్తికి 139 శాతం సబ్సిడీ మద్దతును అందించింది. 2001లో అభివృద్ధి చెందిన దేశాల పరిమితి కంటే అమెరికా పత్తికి 74 శాతం అధిక మద్దతును అందించింది. వ్యవసాయ దిగుమతులకు తక్కువ సుంకాలు అని అమెరికా అనడం అంటే, తమ వ్యవసాయం బహిరంగ మార్కెట్ అని చూపించడం కోసమే! కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే, దిగుమతులను నియంత్రించడానికి అమెరికా 9,000 కంటే ఎక్కువ పన్నేతర అడ్డంకులు (ఎన్టీబీలు) విధించింది. దీంతో పోలిస్తే ఇండియా విధించిన ఎన్టీబీలు కేవలం 600. సుంకాలతోనే సుంకాలను అమెరికా సమం చేస్తుందని ట్రంప్ చెబుతున్నారు. భారత్ కూడా తన సొంత వ్యవసా యాన్ని కాపాడుకోవడానికి సరిపోలే పన్నేతర అడ్డంకులని ఉపయో గించడానికి తగినంత అవకాశం ఉంది. భారతపై ట్రంప్ వేసిన తాజా అదనపు 27 శాతం ప్రతిచర్య సుంకాలతో మన రొయ్యలు, బాస్మతేతర బియ్యం, గోదుమల ఎగుమతికి దెబ్బే. అమెరికాతో భారత వాణిజ్యంలో అవే దాదాపు 46 శాతం ఉంటాయి. ఏమైనా, భారత్ తన ఇంటిని క్రమబద్ధీకరించు కోవాలని అమెరికా కోరుకునే బదులు, అమెరికాయే వ్యవసాయరంగం ద్వారాలు తెరవాలని భారత్ అడగాల్సిన అవసరం ఉంది. అమెరికా వ్యవసాయం చుట్టూ ఉన్న అధిక సబ్సిడీ కోటను ముందుగా కూల్చి వేయాలని అడిగితేనే ఇది సాధ్యమవుతుంది.దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ, ఆహార నిపుణులు -
సినిమాని తలపించేలా ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయి లవ్‌స్టోరీ..!
సోషల్ మీడియా ప్రేమకు సరిహద్దులు లేవని ప్రూవ్ చేస్తోంది. ఎక్కడెక్కడ దేశాల వాళ్లని కలుపుతోంది. మనసునే కదిలించే కొంగొత్త ప్రేమ కథలు పుట్టుకొస్తున్నాయి. ఔరా దేశాలు వేరు, సంస్కృతి సంప్రదాయలు వేరైనా ఎలా ఒక్కటవుతున్నారు వీళ్లు అనిపిస్తున్నాయి. చెప్పాలంటే సినిమాని తలిపించే లవ్ స్టోరీలుగా నిలుసున్నాయి. అలాంటి అందమైన ప్రేమ కథే ఈ జంటది. ఇద్దరి దేశాల మధ్య సప్త సముద్రాలు దాటి రావాల్సినంత దూరం. అయినా ఇద్దరూ ఒక్కటయ్యారు. అమెరికా అమ్మాయి ఆంధ్ర అబ్బాయిల మధ్య చిగురించిన ప్రేమ కథ ఇది. అందుకు సంబంధించిన ఘటనను మొత్తం వీడియో డాక్యుమెంట్ రూపంలో షేర్ చేశారు. ఆ వీడియోలో అమెరికా అమ్మాయి జాక్లిన్ ఫోరెరో తాను ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల వ్యక్తితో ఎలా ప్రేమలో పడింది వివరించింది. తాను ఆంద్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన చందన్ అనే వ్యక్తిని ప్రేమించానని, అతడు తనకంటే తొమ్మిది సంవత్సరాలు చిన్నవాడని చెప్పుకొచ్చింది. ఆ వీడియోలో తాము ఇద్దరూ ఎలా కమ్యూనికేట్ చేసుకునేవారో, వీడియో కాల్ ముచ్చట్లతో సహా చూపించింది. దాదాపు 14 నెలలు ఇన్‌స్టాగ్రాంలో ముచ్చంటించుకున్న విధానం, అతడిని కలుసుకుంది మొత్తం ఆ డాక్యుమెంట్లో సవివరంగా వెల్లడించింది. చందన్ కోసం ఆమె అమెరికాను విడిచి వచ్చి మరీ పెళ్లిచేసుకుంది. ప్రస్తుతం ఈ జంట ఒక YouTube ఛానెల్‌ని నిర్వహిస్తోంది. అందులో తమ అందమైన ప్రేమ కథను పంచుకున్నారు. వయస్సు, సంస్కృతి, జాతి, ఆర్థిక స్థితి వంటి సాంస్కృతిక నిబంధనలకు అధిగమించి తామెలా ఒక్కటైంది చెప్పుకొచ్చారు. నెటిజన్లు మాత్రం మీ జంట చాలా బాగుంది, వివాహ జీవితం మంచిగా సాగాలంటూ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు పెట్టారు. కాగా, అమెరికా అమ్మాయి జాక్లిన్ ఫోరెరో ఇది రెండోపెళ్లి కావడం గమనార్హం. View this post on Instagram A post shared by Jaclyn Forero (@jaclyn.forero) (చదవండి: వెయిట్‌లాస్‌కి వ్యాయామం, యోగా కంటే మందులే మంచివా..? బిల్‌గేట్స్ ఏమన్నారంటే..) -
అమెరికాలో తానా స్కామ్.. విరాళాల మోసంపై దర్యాప్తు!
ఢిల్లీ: అమెరికాలో విరాళాల పేరుతో జరిగిన మోసంలో తానా((తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా)) పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. విరాళాల పేరుతో కంపెనీల నిధుల స్వాహా జరగడంతో ఎఫ్ బీఐ రంగంలోకి దిగింది. గత ఐదేళ్లుగా విరాళాల పేరు చెప్పి ఫ్యానీమే, యాపిల్ కంపెనీ నిధులు స్వాహా చేశారని, తెలుగు ఉద్యోగులు తానాతో కుమ్మక్కైనట్లు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.దీనికి గాను సుమారు 700 మంది ఉద్యోగులపై వేటు పడింది. తొలగించిన ఉద్యోగుల్లో తానా ఉపాధ్యాక్షుడు ఉన్నట్లు తెలిసింది. చారిటబుల్ డొనేషన్ మ్యాచింగ్ ప్రోగ్రాం ద్వారా నిధుల దోపిడీకి పాల్పడ్డారు ఉద్యోగులు. విరాళాలిచ్చినట్లు పత్రాలు సృష్టించి...దానికి సమానమైన నిధులను కంపెనీ నుంచి కాజేశరని,. ఎన్జీవోలతో కుమ్మక్కై నిధులను స్వాహా చేసినట్లు జాతీయ ఆంగ్ల పత్రిక టైమ్ ఆఫ్ ఇండియా పేర్కొంది. -
విజేత పెగూలా.. ఎనిమిదో టైటిల్
చార్ల్స్టన్ : అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సికా పెగూలా తన కెరీర్లో ఎనిమిదో సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. చార్ల్స్టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ–500 టోర్నీలో పెగూలా చాంపియన్‌గా అవతరించింది. అమెరికాకే చెందిన సోఫియా కెనిన్‌తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో పెగూలా 6–3, 7–5తో గెలుపొందింది. ఈ సీజన్‌లోని పెగూలాకిది రెండో టైటిల్. ఈ విజయంతో పెగూలా తన కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌ను అందుకుంది. విజేతగా నిలిచిన పెగూలాకు 1,64,000 డాలర్ల (రూ. 1 కోటీ 40 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మెయిన్ ‘డ్రా’కు నగాల్ అర్హత మోంజా (ఇటలీ): భారత పురుషుల టెన్నిస్ సింగిల్స్ నంబర్‌వన్ సుమిత్ నగాల్ మోంజా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టోర్నీలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. ఫెడరికో ఇనాకోన్ (ఇటలీ)తో సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో సుమిత్ నగాల్ 6–4, 6–2తో గెలుపొంది మెయిన్ ‘డ్రా’లో చోటు సంపాదించాడు. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నగాల్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. అంతకుముందు క్వాలిఫయింగ్ తొలి రౌండ్ మ్యాచ్‌లో నగాల్ 5–7, 7–6 (7/2), 6–2తో ఎర్గీ కిర్కిన్ (టర్కీ)పై గెలుపొందాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో ఆస్ట్రియా ప్లేయర్ ఫిలిప్ మిసోలిచ్తో సుమిత్ ఆడతాడు. 28వ ర్యాంక్‌లో యూకీ బాంబ్రీ సోమవారం విడుదల చేసిన ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో యూకీ బాంబ్రీ భారత నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. యూకీ రెండు స్థానాలు పడిపోయి 28వ ర్యాంక్‌లో నిలిచాడు. ఆరేళ్లుగా డబుల్స్‌లో భారత నంబర్‌వన్‌గా ఉన్న రోహన్ బోపన్న గతవారం టాప్ ర్యాంక్‌ను యూకీకి కోల్పోయాడు. ప్రస్తుతం బోపన్న 43వ స్థానంలో ఉన్నాడు. -
నువ్వు బెదిరిస్తే.. బెదిరిపోతామా?.. ట్రంప్ టారిఫ్ డెడ్‌లైన్‌పై చైనా
వాషింగ్టన్: టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన డెడ్ లైన్‌కు తాము భయపడబోమని చైనా స్పష్టం చేసింది. ట్రంప్ ఈ తరహా బెదిరింపులకు పాల్పడడం మంచి పద్దతి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. చైనా -అమెరికా దేశాల మధ్య టారిఫ్‌ల యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై విధించిన 34శాతం ప్రతీకార సుంకాల విధింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేదంటే చైనాపై అదనంగా మరో 50 శాతం టారిఫ్ విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇందుకోసం 48 గంటల సమయం కూడా ఇచ్చారు. బెదిరిస్తే.. బెదిరిపోతామా ఈ తరుణంలో ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై చైనా ధీటుగా స్పందించింది. అగ్రరాజ్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ఈ తరహా ఒత్తిడి, బెదిరింపులు మంచి పద్దతి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలోని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి లియు పెంగ్యు మీడియాకు తెలిపారు.మంచి పద్దతి కాదుట్రంప్ విధించిన 48గంటల డెడ్‌లైన్‌పై అమెరికా మీడియా లియు పెంగ్యుని ప్రశ్నించింది. బదులుగా, పెంగ్యు స్పందిస్తూ.. తమపై ట్రంప్ టారిఫ్ ఒత్తిడి, బెదిరింపులకు లొంగబోము. చైనా మెరుగైన సంబంధాలు కొనసాగించాలంటే ఒత్తిడి,బెదిరింపులకు పాల్పడటం మంచి పద్దని కాదని ఇప్పటికే చెప్పాం. చైనా తన చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాల్ని కాపాడుకుంటుంది’ అని చెప్పారు. మరిన్ని అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్మరోవైపు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ సైతం ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతీకార చర్యకు సిద్ధమైంది. తన సొంత హక్కులను,ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైతే మరిన్ని అమెరికా ఉత్పుత్తులపై టారిఫ్ విధిస్తామని పునరుద్ఘాటించింది. ట్రంప్ టారిఫ్ బెదిరింపులపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. అమెరికా విధిస్తున్న ప్రతీకార సుంకాలు పూర్తిగా అర్ధం లేనివి. ఒక సాధారణ ఏకపక్ష బెదిరింపుగా అభిప్రాయం వ్యక్తం చేసింది. -
ట్రంప్ విధ్వంసం
‘గ్రేట్ డిక్టేటర్’ చిత్రంలో హిట్లర్ పాత్రధారిగా అభినయించిన చార్లీ చాప్లిన్ గ్లోబ్‌తో ఇష్టానుసారం ఆటలాడుకుంటున్న దృశ్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కేవలం రెండేళ్లలో మీరు ప్రపంచానికే చండశాసనుడు కావొచ్చని చెప్పిన సలహాదారును... తనకు కాసేపు ఏకాంతం కావాలని బయటకు పంపి ఆ గ్లోబ్‌తో రకరకాల విన్యాసాలు చేస్తాడు. చివరికది మొహమ్మీదే భళ్లున బద్దలుకావటంతో ఆ ముచ్చట ముగుస్తుంది. జాత్యహంకారం తలకెక్కి ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని కలలుగన్న హిట్లర్‌పై అది తిరుగులేని వ్యంగ్యాస్త్రం. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అలాంటి ఆశలేం లేవుగానీ... వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమరికను తలకిందులు చేయాలన్న సంకల్పం... అందువల్ల అమెరికా భారీగా లాభపడుతుందన్న మూఢ విశ్వాసం ఆవరించినట్టుంది. పర్యవసా నంగా గత గురువారం నుంచి అంతర్జాతీయ మార్కెట్లన్నీ అధోగతిలో పయనిస్తున్నాయి. ట్రంప్ విధించిన ప్రతిచర్య సుంకాలతో మాంద్యం ముప్పు తప్పదన్న భయం వెన్నాడుతుండగా ప్రధాన ఈక్విటీల విచ్చలవిడి అమ్మకాలతో మార్కెట్లు పతనమవుతున్నాయి. మన బీఎస్ఈ, నిఫ్టీల్లో ఒక్క రోజులో రూ. 14 లక్షల కోట్ల సంపద ఆవిరైందని చెబుతున్నారు. ఆఖరి క్షణంలో స్వల్పంగా కోలుకో వటం వల్ల ఇక్కడితో ఆగింది గానీ రేపన్నరోజు బాగుంటుందన్న భరోసా చాలామందికి లేదు. దేన్నయినా తట్టుకోగల సామర్థ్యమున్న మన ఆర్థిక వ్యవస్థవల్ల త్వరలోనే సాధారణ స్థితి ఏర్పడగల దని చెబుతున్న నిపుణులూ ఉన్నారు. అంతర్జాతీయంగా అయితే ఎక్కడా ఆశారేఖ కనబడటం లేదు. డాలర్ బలహీనపడటం, చమురు ధరలు పడిపోవటంలాంటి పరిణామాలన్నీ కేవలం మదుపరుల్లో తాత్కాలికంగా అలుముకున్న నిరాశా నిస్పృహల వల్లే అని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చిత్రమేమంటే... ఇంత జరుగుతున్నా ఈ సంక్షోభాన్ని తాత్కాలికమైనదిగానే ట్రంప్ పరిగణిస్తు న్నారు. తానిచ్చిన డోస్ పనిచేయటం మొదలెట్టాక అమెరికా ఆర్థిక వ్యవస్థ శరవేగంతో ఎదుగుతుందని విశ్వసిస్తున్నారు. ఇదంతా చూస్తూ కూడా అధికార రిపబ్లికన్లు నోరెత్తరు. విపక్ష డెమాక్రాట్లూ మౌనంగానే ఉంటారు. సాధారణ ప్రజానీకం ‘హ్యాండ్సాఫ్ ట్రంప్’ అంటూ వేలాదిగా రోడ్లపైకొస్తున్నారు. మొత్తానికి ప్రపంచీకరణ కళ్లముందు కుప్పకూలుతోంది. ఈ ప్రపంచీకరణలో భాగస్వాములు కావటానికి ససేమిరా అన్న వర్ధమాన దేశాల పాలకులను నయానో భయానో దారికి తెచ్చి అక్కడి వనరులన్నిటినీ అమె రికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎడాపెడా వాడుకున్న అమెరికా... ట్రంప్ ఏలుబడి వచ్చాక దానికి విరుద్ధమైన పోకడలకు పోతోంది. ఇన్నేళ్లుగా అమెరికాను అన్ని దేశాలూ దోచుకున్నాయని ఎదురు ఆరోపిస్తోంది. గతవారం ‘అమెరికా విముక్తి దినం’ రోజున మిత్రులు, ప్రత్యర్థులన్న విచక్షణ కూడా లేకుండా సుంకాల మోత మోగించేందుకు ట్రంప్ అధ్యక్షుడికి వుండే ‘ఎమర్జెన్సీ’ అధికారాలను వినియోగించుకున్నారు. కేవలం యుద్ధ సమయాల్లో వాడుకోవాల్సిన ఈ అధికారాలను రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఆయన చేజిక్కించుకున్నా అమెరికన్ కాంగ్రెస్‌గానీ, ఇన్నాళ్లుగా స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిన రిపబ్లికన్లు గానీ, బహుళజాతి కార్పొరేషన్లు గానీ నోరెత్తక పోవటం ఆశ్చర్యకరం. కేవలం కెనడాపై విధించిన అదనపు సుంకాలను రద్దు చేయటం వంటి పరిమిత చర్య మినహా సెనేట్ మౌనంగా ఉండిపోయింది. ఈమాత్రం చర్యను కూడా ట్రంప్ మద్దతుదారులు సహించలేకపోతున్నారు. మాదకద్రవ్య ముఠాలను అదుపు చేయటా నికి విధిస్తున్న సుంకాలను వ్యతిరేకిస్తారా అంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఈ సుంకాల విధింపు గుడ్డెద్దు చేలో పడిన చందాన ఉన్నదని జనాభా పెద్దగాలేని హెర్డ్ అండ్ మెక్‌డోనాల్డ్ ద్వీపాల వంటి అతి చిన్న ప్రాంతాలను సైతం వదలని తీరు గమనిస్తే తెలుస్తుంది. ప్రపంచంలో అమెరికా స్థానాన్ని కైవసం చేసుకుని, అగ్రగామిగా నిలబడాలని దశాబ్దాలుగా చైనా పథకాలు పన్నుతోంది. ట్రంప్ దాన్ని వేగవంతం చేశారు. సుదీర్ఘకాలం నిర్మించుకున్న అనుబంధం కారణంగా ఇన్నాళ్లూ పాశ్చాత్య ప్రపంచం అమెరికాను సమర్థిస్తూ పోయింది. కెనడా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వంటివన్నీ అమెరికా ఏం చేసినా అది లోకకల్యాణం కోసమే నన్నట్టు వంతపాడాయి. ఇలాంటి అనుకూలతలు లేని కారణంగానే పూర్వపు సోవియెట్ అయినా, ప్రస్తుత రష్యా అయినా, చైనా అయినా దీటుగా నిలబడలేకపోయాయి. కానీ ట్రంప్ దాన్ని కాస్తా మార్చేశారు. కెనడా కొత్త ప్రధాని మార్క్ కేర్నీ మాటల్లో చెప్పాలంటే ‘అమెరికా ఇక విశ్వసించదగ్గ భాగస్వామి కాద’ని తేలిపోయింది. జర్మనీ చాన్సలర్ కాబోతున్న ఫ్రెడరిక్ మెర్జ్ అయితే ఇంకాస్త ముందుకుపోయారు. అమెరికా నుంచి యూరప్ స్వాతంత్య్రాన్ని సాధించాలని పిలుపు నిచ్చారు. ఇదంతా చివరకు ప్రపంచంలో చైనా పలుకుబడి పెరగడానికి దోహదపడుతుందన్న స్పృహ ట్రంప్‌కు లేకుండా పోయింది. నియమాల ఆధారిత ప్రపంచమే ధ్యేయం అంటూ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా క్వాడ్‌ను రూపొందించి అమెరికా మనల్ని అందులో భాగస్వా ముల్ని చేసింది. సందర్భం వేరు కావొచ్చుగానీ ఆర్థికరంగంలో ఇవాళ అన్ని నియమాలనూ ఉల్లంఘిస్తున్న అమెరికాను క్వాడ్ విషయంలో మనం విశ్వసించవచ్చా అన్న సందేహం కలిగితే ఆశ్చర్యమే ముంది? మౌలికంగా మార్కెట్లు కచ్చితమైన అంచనాల ఆధారంగా ముందుకు కదులుతాయి. మదుపుదార్లు స్వేచ్ఛగా, నిర్భయంగా పెట్టుబడులు పెడతారు. సంపద పోగవుతుంది. కానీ ట్రంప్ చర్యలతో అంతా తలకిందులైంది. ఇక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం ఇప్పట్లో సాధ్యమా? -
‘ట్రంప్’ అలజడికి తట్టుకున్న ఒకేఒక్క ఇన్వెస్టర్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన టారిఫ్‌లను తట్టుకోవడానికి చాలా మంది ఇన్వెస్టర్లు ఇబ్బంది పడుతుంటే, వారెన్ బఫెట్ మాత్రం అమెరికా స్టాక్ మార్కెట్లలో జోరు కొనసాగిస్తున్నారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జుకర్ బర్గ్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటి వారు వందల బిలియన్ డాలర్లు నష్టపోయారు. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లలో ట్రిలియన్ డాలర్లు ఆవిరైనా బెర్క్‌షైర్ హాత్వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్ మాత్రం తన కంపెనీలో పెట్టుబడులతో బఫెట్ లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు.ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇప్పటివరకు 184 దేశాలపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా వాల్ స్ట్రీట్ విలువ దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించడంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. గత రెండు రోజుల్లో యూఎస్ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2020 మార్చిలో కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఇదే అత్యంత భారీ పతనం. అయితే ఈ ట్రెండ్ బఫెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ఈ ఏడాది ఆయన తన సంపదకు 12.7 బిలియన్ డాలర్లు జోడించారు. ప్రస్తుతం బఫెట్ సంపద 155 బిలియన్ డాలర్లుగా ఉంది.ముందస్తు ఆలోచనలతోనే.. బఫెట్ పతనం కాకుండా ఉండటానికి కొన్ని గణనాత్మక చర్యలు తీసుకున్నారు. బహుశా మార్కెట్ తిరోగమనం సంభవిస్తుందనే అంచనాతో ఆయన భారీ కొనుగోళ్లలో నగదును మదుపు చేయడం మానేశారు. 2024లో బుల్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్న సమయంలో బఫెట్ కంపెనీ ఈక్విటీల్లో 134 బిలియన్ డాలర్లను విక్రయించి 334 బిలియన్ డాలర్ల నగదుతో ఏడాదిని ముగించింది.తన తోటి ఇన్వెస్టర్లు ఎదురుగాలులతో ఇబ్బందులు పడుతున్నప్పుడే బఫెట్ మెల్లగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి యూఎస్ టెక్ స్టాక్స్‌లో పెట్టుబడులను తగ్గించడం ద్వారా సాహసోపేతమైన చర్య తీసుకున్నారు. మరోవైపు జపాన్ ట్రేడింగ్ దిగ్గజాలపై మాత్రం ఆయన పెట్టుబడులు రెట్టింపు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో బఫెట్ జపాన్‌లోని ఐదు అతిపెద్ద వాణిజ్య సంస్థలైన మిట్సుయి, మిత్సుబిషి, సుమిటోమో, ఇటోచు, మరుబెనిలలో తన వాటాను పెంచుకున్నారు.రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, బెర్క్‌షైర్ ఇప్పుడు మిత్సుయి అండ్ కోలో 9.82 శాతం, మిత్సుబిషి కార్ప్‌లో 9.67 శాతం, సుమిటోమో కార్ప్‌లో 9.29 శాతం, ఇటోచు కార్ప్‌లో 8.53 శాతం, మరుబెని కార్ప్‌లో 9.30 శాతం వాటాలను కలిగి ఉంది. ఈ పెట్టుబడులు బెర్క్ షైర్ హాత్వే మార్కెట్ క్యాప్ ను 1.14 ట్రిలియన్ డాలర్లకు మించి, టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలను అధిగమించేలా చేశాయి. -
టారిఫ్‌లపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) ప్రపంచంలోని పలు దేశాలపై సుంకాల విధింపు నేపథ్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ ఆందోళనలపై ట్రంప్ స్పందించారు. సుంకాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.అమెరికా ప్రపంచ దేశాలపై సుంకాల విధింపుతో గ్లోబల్ స్టాక్ మార్కెట్లో అనిశ్చితి , మాంద్యం భయాలు,అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ప్రపంచ ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ మాత్రం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని భీష్మించుకున్నారు.ఈ తరుణంలో ఎయిర్ ఫోర్స్ వన్‌లో.. ట్రంప్ మీడియాతో మాట్లాడారు. అమెరికా విధించే సుంకాల కారణంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయని నేను అనుకోవడం లేదు. కానీ కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించేందుకు మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అంటే పరోక్షంగా కొన్నిసార్లు ఏదైనా సమస్యను పరిష్కరించడానికి అది ఎంత కష్టంగా ఉన్నా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ నిర్ణయం వల్ల బాధపడినా సరే. వెనక్కి తగ్గకూడదని అన్నారు. 👉ఇదీ చదవండి : ట్రంప్‌కు హ్యాండ్సాఫ్ సెగసోమవారం పునఃప్రారంభం అనంతరం స్టాక్ మార్కెట్లు భారీ క్రాష్ అవుతాయన్న అంచనాల నడుమ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సుంకాల విధింపుపై నెలకొన్న ఆందోళనల్ని తొలగించేందుకు తన అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తోందని చెప్పారు. సుంకాల విధింపు తర్వాత అమెరికాతో వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకోవడానికి 50కి పైగా దేశాలు తమని సంప్రదించాయని వెల్లడించారు. ‘టారిఫ్ విధింపుపై యూరోప్, ఆసియా ఇతర దేశాది నేతలతో మాట్లాడాను. యాభైకి పైగా దేశాలు వ్యాపార, వాణిజ్యం విషయంలో అమెరికా ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. నేను వారికి ఒకటే చెప్పాను. మీ దేశం మా దేశంతో చేసే వాణిజ్యంలో ఎలాంటి లోటు ఉండకూడదు. లోటు ఉంటే మాకు నష్టమే. మేం లాభాల్ని ఆశించడం లేదు. అటు నష్టం, ఇటు లాభం కాకుండా సమతూల్యంగా ఉండాలని అనుకుంటున్నట్లు వారితో చెప్పామని, అందుకు వారు సుముఖత వ్యక్తం చేయడమే కాదు.. టారిఫ్ విధింపు తర్వాత మాతో వ్యాపారం, వాణిజ్యం చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామం అని తెలిపారు. -
మార్కెట్లు పతనబాటలో..
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు అత్యధిక సమయం పతనబాటలో సాగవచ్చని పలువురు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. అయితే రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్ష, యూఎస్ టారిఫ్‌ల ప్రభావం, ఫెడ్ గత పాలసీ మినిట్స్ వెల్లడి తదితర పలు అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు తెలియజేశారు. దీంతో తీవ్ర ఆటుపోట్లకు వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. వివరాలు చూద్దాం..ముంబై: గత వారాంతాన యూఎస్ స్టాక్స్ అత్యంత భారీ పతనాన్ని చవిచూశాయి. నేడు(7న) యూఎస్ స్టాక్ మార్కెట్లకు ‘బ్లాక్‌మండే’ ఎదురుకావచ్చని అక్కడి నిపుణులు అంచనా వేశారు. భారత్‌సహా చైనా, జపాన్ తదితర ప్రధాన దేశాలపై ట్రంప్ ప్రతీకార టారిఫ్‌లను ప్రకటించడంతో అమెరికా ఆరి్ధక వ్యవస్థ దెబ్బతినవచ్చని, మాంద్యంలోకి జారుకోవచ్చని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లలో సైతం అమ్మకాలకు తెరలేచే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2020 తరువాత గత వారం యూఎస్ మార్కెట్లు 6 శాతం పడిపోయాయి. 5 లక్షల కోట్ల డాలర్లకుపైగా మార్కెట్ విలువ ఆవిరైంది. వెరసి ఈ వారం దేశీ మార్కెట్లు పతన బాటలో సాగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా.. గురువారం(10న) శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు. దీంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది.గత వారమిలాప్రపంచ దేశాలపై యూఎస్ టారిఫ్‌ల ఎఫెక్ట్‌తో గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు సైతం డీలా పడ్డాయి. ఆటుపోట్ల మధ్య సెన్సెక్స్ నికరంగా 2,050 పాయింట్లు(2.65 శాతం) పతనమై 75,365 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ 615 పాయింట్లు(2.6 శాతం) కోల్పోయి 22,904 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.5 శాతం క్షీణించి 40,509కు చేరగా.. స్మాల్‌క్యాప్ 1.65 శాతం నీరసించి 45,867 వద్ద నిలిచింది.టీసీఎస్ రెడీగురువారం సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ ఈ ఆర్ధిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసిక(క్యూ4) ఫలితాలు విడుదల చేయనుంది. దీంతో జనవరి–మార్చి(క్యూ4) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. కాగా.. అక్టోబర్ మొదలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మార్చి చివవి వారంలో నికర కొనుగోలుదారులుగా మారినప్పటికీ తిరిగి ఏప్రిల్‌లో అమ్మకాల బాట పట్టడం సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ పేర్కొన్నారు. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ. 10,355 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం గమనార్హం! ఎఫ్‌పీఐలు ఫిబ్రవరిలో దేశీ స్టాక్స్ నుంచి రూ. 34,574 కోట్లు, జనవరిలో మరో రూ. 78,027 కోట్లు చొప్పున పెట్టుబడులు ఉపసంహరించిన సంగతి తెలిసిందే. -
టారిఫ్ టెర్రర్... ఇన్వెస్టర్లకు ఫీవర్!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేల్చిన ‘లిబరేషన్ డే’ టారిఫ్ బాంబ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అల్లకల్లోలం మొదలైంది. ప్రధానంగా భారత్, చైనా వంటి కీలక దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత మందగమనంలోకి జారిపోవచ్చని, దీంతో ప్రపంచ ఎకానమీ గాడి తప్పుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మరోపక్క, చైనా కూడా 34% ప్రతీకార సుంకాలతో విరుచుకుపడింది. ఇతర దేశాలూ ఇదే బాట పట్టి వాణిజ్య యుద్ధం ముదిరితే, అమెరికాతో పాటు యూరప్ కూడా మాంద్యంలోకి జారే ప్రమాదం ఉంది. దీంతో అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లతో పాటు కమోడిటీలు (బంగారం, వెండి, కాపర్, క్రూడ్ ఇతరత్రా) కూడా కుప్పకూలుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత్‌ను పదే పదే టారిఫ్ కింగ్‌గా పేర్కొంటూ వస్తున్న ట్రంప్.. కాస్త కనికరించి 27 శాతం ప్రతీకార సుంకాలతో సరిపెడుతున్నట్లు ప్రకటించారు. కనీసం 10 శాతం నుంచి గరిష్టంగా 50 శాతం దాకా టారిఫ్‌లను వడ్డించడంతో ప్రపంచ దేశాలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. అమెరికాకు కీలక వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్ ఎగుమతులపై సుంకాల పోటు కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అసలే వృద్ధి మందగమనంలో ఉన్న మన జీడీపీకి ఇది మరింత ప్రతికూలాంశంగా చెబుతున్నారు. వృద్ధి రేటుపై కనీసం అర శాతం ప్రభావం ఉండొచ్చనేది (ఈ ఆర్థిక సంవత్సరం 6 శాతానికి పరిమితం కావచ్చు) ఆర్థిక నిపుణుల అభిప్రాయం. మరోపక్క, వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమైతే రూపాయి బలహీనపడొచ్చని.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా పడిపోయే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. అయితే, ఇతర వర్ధమాన దేశాలు, ముఖ్యంగా ఆసియాలో మనకు ప్రధాన పోటీదారులైన చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలపై మన కంటే అధిక సుంకాలు విధించడం అనేది మనకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. ‘ట్రంప్ లిబరేషన్ డే టారిఫ్‌లపై సంబంధిత దేశాలన్నీ ప్రతీకార సుంకాలతో విరుచుకుపడితే, 2008 ఆర్థిక సంక్షోభం, కోవిడ్ తర్వాత అతిపెద్ద ఆర్థిక కుదుపు తప్పదు. టారిఫ్ ప్రభావిత తీవ్ర ఆటుపోట్లు కొన్నాళ్ల పాటు స్టాక్ మార్కెట్లలో కొనసాగవచ్చు’ అని వెస్టెడ్ ఫైనాన్స్ ఫౌండర్, సీఈఓ విరమ్ షా పేర్కొన్నారు. మార్కెట్లో మరింత కరెక్షన్ తప్పదు... టారిఫ్ వార్ దెబ్బకు అమెరికా, యూరప్, ఆసియా వ్యాప్తంగా సూచీలు లిబరేషన్ డే రోజున 3–6% కుప్పకూలగా.. వారాంతంలో మరో 5–6% క్రాష్ అయ్యాయి. వాల్‌స్ట్రీట్‌లో ఇన్వెస్టర్ల సంపద రెండు రోజుల్లో 4 ట్రిలియన్ డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోవడం సుంకాల సునామీకి నిదర్శనం! ట్రేడ్ వార్తో ఎగుమతులు మందగిస్తే, వృద్ధి రేటుకు మరింత సెగ తగులుతుందని, స్వల్పకాలికంగా మార్కెట్లో కరెక్షన్ కొనసాగే అవకాశం ఉందని యాక్సిస్ సెక్యూరిటీస్ పేర్కొంది. ‘టారిఫ్‌ల దెబ్బతో ద్రవ్యోల్బణం ఎగబాకే ముప్పు పొంచి ఉంది. దీంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఇకపై సాధ్యపడకపోవచ్చు. అంతేకాకుండా వాణిజ్యపరమైన అడ్డంకులతో అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారే రిస్క్ పెరుగుతుంది. అంతిమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా కకావికలం అవుతుంది’ అని అభిప్రాయపడింది. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్ పోటీపరంగా కాస్త మెరుగైన స్థితిలోనే ఉన్నప్పటికీ, అమెరికాలో మాంద్యం ముప్పు మన మార్కెట్లకు ప్రతికూలాంశమని ఎడెలీ్వజ్ ఎంఎఫ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (ఈక్విటీస్) త్రిదీప్ భట్టాచార్య పేర్కొన్నారు.ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ‘ట్రంప్ టారిఫ్‌లపై ఇతర దేశాల ప్రతీకార సుంకాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనించాలి. ముఖ్యంగా రక్షణాత్మక రంగాలైన ఎఫ్ఎంసీజీ, యుటిలిటీస్ షేర్లు కాస్త మెరుగైన పనితీరు ప్రదర్శించవచ్చు. సైక్లికల్ రంగాల (ఆటో, మెటల్స్) షేర్లకు ప్రతికూలం. టారిఫ్‌లపై కుదిరే వాణిజ్య ఒప్పందాల ఫలితాలే దీర్ఘకాలింగా మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయి. స్వల్పకాలానికి మాత్రం మన మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు తప్పవు. పెట్టుబడుల విషయాలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి’ అని స్టాక్సా్కర్ట్ సీఈఓ ప్రణయ్ అగర్వాల్ సూచించారు. మార్కెట్లో స్వల్పకాలిక సెంటిమెంట్ చాలా బలహీనంగా ఉన్నప్పటికీ.. దీర్ఘకాలికంగా మన ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని ఆనంద్ రాఠీ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ సుజన్ హజ్రా చెప్పారు. టారిఫ్‌ల దెబ్బతో తక్షణం మార్కెట్లో తీవ్ర కుదుపులు ఉన్నప్పటికీ.. మధ్య, దీర్ఘకాల దృక్పథంతో భారీగా కరెక్షన్కు గురైనప్పుడల్లా పటిష్ట ఫండమెంటల్స్ ఉన్న నాణ్యమైన స్టాక్స్‌లో క్రమానుగతంగా పొజిషన్లను పెంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు. నిఫ్టీ గతేడాది సెప్టెంబర్‌లో 26,277 పాయిట్ల గరిష్టాన్ని తాకగా.. 2025 మార్చిలో 21,964 పాయిట్లకు (దాదాపు 16.6 శాతం) క్షీణించింది. ఎఫ్‌పీఐల దన్నుతో ఆ తర్వాత 7 శాతం బౌన్స్ అయ్యింది. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్ల క్రాష్‌తో పాటు మన సూచీలు కూడా మళ్లీ రివర్స్ గేర్ వేశాయి. ఈ వారంలో 2.5 శాతం పడ్డాయి.డెట్ ఫండ్స్‌కు దన్ను... జీడీపీ వృద్ధి మందగమనానికి తోడు ఇప్పుడు టారిఫ్‌ల పిడుగుతో ఎకానమీకి దన్నుగా ఆర్బీఐ సరళతర పాలసీని కొనసాగించే అవకాశం ఉంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా గత పాలసీ సమీక్షలో రెపో రేటును పావు శాతం తగ్గించడం (6.25 శాతానికి) సంగతి తెలిసిందే. దీంతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య సరఫరా (లిక్విడిటీ) పెంచేందుకు కూడా పలు చర్యలు ప్రకటించింది. ‘వాణిజ్య యుద్ధాలతో పాటు ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నుంచి దేశీ ఫైనాన్షియల్ మార్కెట్లకు రక్షణ కల్పించేందుకు ఆర్బీఐ రానున్న రోజుల్లో వడ్డీరేట్లను మరింత తగ్గించడంతో పాటు సానుకూల లిక్విడిటీ చర్యలను చేపట్టవచ్చు. దీనివల్ల వడ్డీ రేట్లు దిగిరావడం వల్ల ఇప్పటికే ట్రేడవుతున్న అధిక కూపన్ (వడ్డీ) రేటు బాండ్ ధరలు పెరుగుతాయి. ఫలితంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్ నికర అసెట్ విలువ (ఎన్ఏవీ) ఎగబాకేందుకు దోహదం చేస్తుంది. డెట్ ఫండ్సో్ల పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లకు ఇది సానుకూలాంశమని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ట్రంప్‌కు హ్యాండ్సాఫ్ సెగ
వాషింగ్టన్: మేక్ అమెరికా గ్రేట్ ఎగేన్ నినాదంతో అధ్యక్ష పీఠంపై ఆసీనులైన డొనాల్డ్ ట్రంప్ వెనువెంటనే తీసుకున్న అనూహ్య, విపరీత నిర్ణయాలతో అమెరికన్లు విసిగిపోయారు. విదేశాలపై టారిఫ్‌ల బాంబు విసిరితే అది ప్రతీకార టారిఫ్‌ల రూపంలో తిరిగొచ్చి అధిక ధరలు, ద్రవ్యోల్బణానికి బాటలు వేస్తోందన్న ఆగ్రహంతో ప్రజలు నిరసన బాటపట్టారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక దేశవ్యాప్తంగా ఎన్నడూలేనిస్థాయిలో లక్షలాది మంది స్థానిక అమెరికన్లు ముక్తకంఠంతో నినదిస్తూ ఆందోళనకు దిగిన ‘హ్యాండ్సాఫ్’ ఉద్యమం శనివారం భారీస్థాయిలో కొనసాగుతోంది. అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా శనివారం ఉద్యమం మొదలైంది. రాష్ట్రాల అసెంబ్లీలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సామాజిక భద్రత విభాగ ఆఫీస్‌లు, పార్కులు, సిటీ హాళ్ల వద్ద ప్రధానంగా పెద్దస్థాయిలో ర్యాలీలు జరిగాయి. అత్యంత సంపన్నుల చేతుల్లోకి వెళ్లిన పాలనాపగ్గాలను విడిపిస్తామని నినదించారు. ‘‘ మావి ప్రధానంగా మూడు డిమాండ్లు. ప్రభుత్వంపై సంపన్నుల అజమాయిషీ నశించాలి. ప్రభుత్వంలో అవినీతి అంతంకావాలి. మెడికేర్, సోషల్‌సెక్యూరిటీ నిధుల్లో కోత పెట్టొద్దు. వలసదారులు, లింగమార్పిడి వర్గాలు, ఇతరులపై నిర్బంధాల చట్రాలను తొలగించాలి’’ అని ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంఘాల్లో ఒకటైన ఇండివిజిబుల్ ప్రకటించింది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫెడరల్ ఎంప్లాయీస్ సహా చాలా కార్మిక సంఘాల సభ్యులు పలు రాష్ట్రాల్లో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు.50 రాష్ట్రాల్లో 1,400 చోట్ల..50 రాష్ట్రాల్లో పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, ఎల్జీబీటీక్యూ+ మద్దతుదారులు, మాజీ ఫెడరల్ ఉద్యోగులు, మహిళా హక్కుల కార్యకర్తలు, ఎన్నికల సంస్కరణల కార్యకర్తలు, సాధారణ ప్రజానీకం ఈ ఆందోళనలో భాగస్వాములై ట్రంప్ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్రధానంగా 1,400 ప్రాంతాల్లో భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయితే చాలా వరకు ర్యాలీలు శాంతియుతంగానే కొనసాగాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అరెస్ట్‌లు జరగలేదు. మ్యాన్‌హాట్టన్ మిడ్‌టౌన్ మొదలు అలాస్కాలోని యాంకరేజ్దాకా ప్రతి ప్రధాన నగరం, పట్టణంలో జనం వీధుల్లోకి వచ్చి హ్యాండ్సాఫ్ అని రాసి ఉన్న బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని ఆందోళనల్లో పాల్గొన్నారు. వ్యయ నియంత్రణ చర్యలు, సమూల సంస్కరణల పేరుచెప్పి హఠాత్తుగా వేల సంఖ్యలో ఫెడరల్ ఉద్యోగులను విధుల నుంచి తప్పించడం, జీడీపీ తగ్గిపోయేలా ఆర్థికవ్యవస్థను అస్తవ్యస్థం చేయడం, వలసలపై ఉక్కుపాదం మోపడం, మానవ హక్కులను కాలరాయడం వంటి చర్యలతో ట్రంప్, ఎలాన్ మస్క్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. అమెరికాలోనేకాదు బ్రిటన్‌లోని లండన్, ఫ్రాన్స్‌లోని పారిస్, జర్మనీలోని బెర్లిన్ నగరాల్లోనూ అమెరికా ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలు జరిగాయి. ‘‘అమెరికాకు ఏమైంది?. ప్రజలను టారిఫ్‌లను ఇబ్బందులు పెట్టడం ఇకనైనా ఆపండి. ట్రంప్ పెద్ద ఇడియట్’’ అని రాసి ఉన్న ప్లకార్డులను లండన్‌లో ప్రదర్శించారు. నిరసనలపై స్పందించిన శ్వేతసౌధంట్రంప్ వ్యతిరేక ర్యాలీలపై అధ్యక్ష భవనం స్పందించింది. ‘‘ ఇన్నాళ్లూ డెమొక్రాట్ల ప్రభుత్వంలో అక్రమంగా అమెరికాలో చొరబడిన విదేశీయులు, వలసదారులు ప్రభుత్వం నుంచి ఎన్నో పథకాలు, ప్రయోజనాలను అక్రమంగా పొందారు. దాంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. వీళ్ల వల్ల వాస్తవిక లబ్ధిదారులైన సీనియర్ అమెరికన్లు ఎంతో లబ్దిని కోల్పోయారు. ఆ సంస్కృతికి చరమగీతం పాడి నిజమైన అమెరికన్లకే ప్రభుత్వం నుంచి సామాజిక భద్రత, వైద్యసాయం, వైద్యసదుపాయాలు అందిస్తున్నాం’’ అని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. -
ట్రంప్ టారిఫ్ దడ.. షాపింగ్ మాల్స్ ముందు లాక్డౌన్ దృశ్యాలు
వాషింగ్టన్: అమెరికాలోని సూపర్ మార్కెట్లన్నీ వినియోగదారుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన జనమంతా తమకు అందిన వస్తువులన్నింటినీ కొనుగోలు చేసి, తమ ట్రాలీలలో నింపేసుకుని, బయటకు వస్తూ కనిపిస్తున్నారు. దీనిని చూసినవారికి త్వరలో లాక్డౌన్(Lockdown) వస్తుందనే విధంగా అక్కడి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ‘ఇప్పుడే షాపింగ్ చేయండి.. లేదంటే పశ్చాత్తాప పడతారు’ అనే ట్రెండ్ నడుస్తోంది.అమెరికాలోని వినియోగదారులు షాపింగ్ మాల్స్‌కు పరుగులు తీయడం వెనుక ప్రధాన కారణం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ పాలసీ(Donald Trump's new tariff policy). ఏప్రిల్ 2న డోనాల్డ్ ట్రంప్ భారత్, చైనాతో సహా పలు దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాలను విధించారు. దీనిపై అమెరికన్లు కలత చెందుతున్నారు. రాబోయే రోజుల్లో పలు వస్తువులు చాలా ఖరీదైనవిగా మారుతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ భయంతోనే వారంతా ఉప్పు మొదలుకొని టీవీలు, ఫ్రిజ్‌లు.. ఇలా అన్నింటికీ కొనుగోలు చేస్తున్నారు.నిపుణుల అభిప్రాయం ప్రకారం ట్రంప్ ప్రభుత్వ సుంకాల విధానం దిగుమతులపై(imports) ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. ఇది కంపెనీల ఖర్చును పెంచుతుంది. ఫలితంగా ఆ భారం కస్టమర్‌పై పడుతుంది. అయితే డోనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఈ సుంకాలు మేలు చేస్తాయని చెబుతున్నారు. అమెరికన్లు ప్రస్తుతం చేస్తున్న షాపింగ్ తీరు చూస్తుంటే.. వారెవరికీ ట్రంప్ హామీలపై పెద్దగా నమ్మకం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతం అమెరికాలో ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు మైక్రోవేవ్‌లు అత్యధిక సంఖ్యలో అమ్ముడవుతున్నాయి.అమెరికాకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, విడిభాగాలు చైనా తదితర దేశాల నుండి దిగుమతి అవుతాయి. సుంకాల పెరుగుదల కారణంగా భవిష్యత్తులో అవి మరింత ఖరీదైనవిగా మారే అవకాశం ఉంది. సుంకాలు విధించాక ధరలలో 15-20శాతం మేరకు పెరుగుదల తప్పకుండా ఉంటుందని డీలర్లు స్పష్టంగా చెబుతున్నారు. అందుకే అమెరికన్లు వివిధ రకాల షోరూంలకు క్యూ కడుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున జీన్స్, స్పోర్ట్స్ వేర్, వర్క్ వేర్, క్యాజువల్ షూలను కూడా ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కాఫీ, స్నాక్స్, సాస్‌లు, అంతర్జాతీయ కిరాణా వస్తువులు కూడా జోరుగా విక్రయమవుతున్నాయి. బ్లెండర్లు, ఎయిర్ ఫ్రైయర్లు, మసాజ్ కుర్చీలు, ట్రెడ్మిల్స్ కూడా విరివిగా అమ్ముడవుతున్నాయి. ఇది కూడా చదవండి: Sri Rama Navami: బెంగాల్ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్ -
అమెరికాలో ట్విస్ట్.. ట్రంప్, మస్క్‌కు ఝలక్!
వాష్టింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ పరిపాలన, వివాదాస్పద విధానాలపై అమెరికా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు వీధుల్లోకి వచ్చి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. హ్యాండ్స్ ఆఫ్('Hands Off!') పేరుతో నిరసనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు తెలిపారు. హ్యాండ్స్ ఆఫ్ అంటూ 50 రాష్ట్రాలలో 1,200కిపైగా ప్రదేశాల్లో నిరసనలను నిర్వహించారు. ఈ నిరసనలకు పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, LGBTQ+ న్యాయవాదులు, ఎన్నికల కార్యకర్తలు సహా 150కి పైగా సమూహాలు ఈ ర్యాలీలకు మద్దతు ఇచ్చాయి.HAPPENING NOW: A MASSIVE protest is taking place in downtown Chicago for the "Hands Off!" movement against Elon Musk and Donald Trump pic.twitter.com/NVEiTFi8Iy— Marco Foster (@MarcoFoster_) April 5, 2025 ఈ సందర్భంగా ట్రంప్ పరిపాలన విధానాలపై వీరు నిరసనలు తెలిపారు. ముఖ్యంగా సమాఖ్యల తొలగింపులు, సామూహిక బహిష్కరణలు, ఇతర వివాదాస్పద చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచానికే సవాల్ చేస్తున్నారని అన్నారు. వలసదారుల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థల తగ్గింపు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కోతలు, వలసదారుల చికిత్స, లింగమార్పిడి హక్కులపై ఆంక్షలు వంటి విస్తృత శ్రేణి అంశాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక, 2017 తర్వాత అమెరికా ఇంత మంది బయటకు వచ్చి నిరసనలు ఇలా నిరసనలు తెలపడం ఇదే మొదటిసారి. కాగా, వీరి నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.A surprising 300 people showed up at the state Capitol in downtown Jackson, Mississippi as part of the nationwide HANDS OFF! protests of @POTUS, @elonmusk and the work of @DOGE. Rally organizes expected only 30 people to show up. #DOGE #handsoffprotests pic.twitter.com/d9dSIkXkD2— Ross Adams (@radamsWAPT) April 5, 2025BREAKING: Thousands have flooded the streets of Boston for the massive anti-Trump “Hands Off!” rally—one of over 1,200 protests erupting across all 50 states.From coast to coast, Americans are sending a message: Hands off our rights. Hands off our democracy. Hands off our… pic.twitter.com/ZGQWF8fRy3— Brian Allen (@allenanalysis) April 5, 2025Absolutely incredible!Protesters are lining both sides of the street for blocks in the tiny little town of Geneva, Illinois!It's estimated that around 5000 people showed up for the Hands Off! protest.Let's go!!!!! pic.twitter.com/lStDLrtQpp— Art Candee 🍿🥤 (@ArtCandee) April 5, 2025 -
ఇప్పటికే రూ. 600 కోట్లు నష్టం!
సాక్షి, అమరావతి: అమెరికా దిగుమతి సుంకం రాష్ట్ర మత్స్య ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నెల 9వ తేదీ నుంచి భారం ప్రత్యక్షంగా పడనుంది. ఏప్రిల్ మొదటి వారంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేందుకు మత్స్య ఉత్పత్తులతో 2 వేల షిప్మెంట్లు సిద్ధంగా ఉన్నాయి. మరో 2,500 షిప్మెంట్లకు సరిపడా సరుకు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంది. వీటిలో మొత్తంగా దాదాపు 3,500 షిప్మెంట్లు ఏపీకి చెందినవేనని ఎగుమతిదారులు చెబుతున్నారు. కొత్తగా విధించిన దిగుమతి సుంకం ప్రకారం లెక్కిస్తే వీటిపై భారం రూ.600 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మేరకు నష్టపోవడమే తప్ప ఈ భారాన్ని తిరిగి కొనుగోలుదారులపై వెయ్యలేని పరిస్థితి ఉందని ఎగుమతిదారులు చెబుతున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్–అమెరికాల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీల విలువ 6.6 బిలియన్ డాలర్లు. వీటిలో ఎగుమతుల విలువ 5 బిలియన్ డాలర్లు, దిగుమతుల విలువ 1.6 బిలియన్ డాలర్లు. ఎగుమతుల్లో మత్స్య ఉత్పత్తుల విలువ 2.55 బిలియన్ డాలర్లపైమాటే. అమెరికాకు ఆహార, మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశాల్లో 42.3 శాతంతో భారత్ మొదటి స్థానంలో నిలవగా, 26.9 శాతంతో ఈక్విడార్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా ఇండోనేషియా (15.4%), వియత్నాం (7.2 %), థాయిలాండ్ (2.4%), అర్జంటేనియా (2.1%) దేశాలు ఉన్నాయి.భారత్‌ను అధిగమించనున్న ఈక్విడార్ భారత్‌పై 27 శాతం దిగుమతి సుంకం విధించిన అమెరికా.. ఈక్విడార్ నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తులపై కేవలం 10 శాతం మాత్రమే సుంకం విధించింది. ఈ కారణంగా ఈక్విడార్ నుంచి పోటీని తట్టుకోవడం కష్టమేనని, భారత్‌కు వచ్చే ఆర్డర్స్ అన్నీ ఇక ఈక్విడార్‌కు వెళ్లే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. ఇప్పటికే ఏటా 11–12 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో ఈక్విడార్ మన దేశాన్ని రెండవ స్థానానికి నెట్టేసింది. కాగా, రాష్ట్రంలో నిన్నటి వరకు కిలోకు రూ.20–40 మేర కోత పెట్టి కొనుగోలు చేయగా, శనివారం ఏకంగా రూ.30–90 వరకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. మొన్నటి వరకు 30 కౌంట్ (కిలోకు వచ్చే రొయ్యల సంఖ్య) కిలో రూ.470 పలుకగా, శనివారం రూ.380తో.. 50 కౌంట్ అయితే రూ.360– రూ.300కు తగ్గించేశారు. దీంతో కంపెనీల నుంచి స్పష్టత వచ్చే వరకు పట్టుబడులు పట్టకూడదని ఆక్వా రైతు సంఘాలు నిర్ణయించాయి. కనీసం 10–15 రోజుల వరకు పట్టుబడులు పట్టకూడదని రైతులకు సూచిస్తున్నారు.ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి ట్రంప్ టాక్స్ సాకుతో ధరలు తగ్గించడం సరికాదు. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో ఇప్పుడు లభిస్తున్న ధరలే గిట్టుబాటు కావడం లేదు. ఈ ధరలను కూడా మరింత తగ్గిస్తే సమీప భవిష్యత్‌లో పూర్తిగా ఆక్వా సాగుకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి. రైతుల తరఫున ఉద్యమించేందుకు ఫెడరేషన్ సిద్ధంగా ఉంది.– గాదిరాజు వెంకట సుబ్బరాజు (జీకేఎఫ్), ప్రధాన కార్యదర్శి, ఏపీ రొయ్య రైతుల సమాఖ్య -
అమెరికాకు నెలరోజులు ఎగుమతులు బంద్!: జేఎల్ఆర్
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలను విధించిన తరువాత.. టాటా మోటార్స్ కంపెనీకి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్.. బ్రిటన్‌లో తయారయ్యే కార్లను యూఎస్‌కు ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.అమెరికా అధ్యక్షుడు విధించిన 25 శాతం దిగుమతి సుంకం ఖర్చును ఎలా తగ్గించాలో పరిశీలిస్తున్న సమయంలో.. బ్రిటన్‌లోని అతిపెద్ద కార్ల తయారీదారులలో ఒకరైన జేఎల్ఆర్ (JLR) సోమవారం నుంచి ఈ చర్య తీసుకుంటున్నారని ది టైమ్స్ తెలిపింది. బ్రిటన్‌లో ఈ కంపెనీ సుమారు 38000 మందికి ఉపాధి కల్పిస్తోంది.జాగ్వార్ ల్యాండ్ రోవర్.. ట్రంప్ ప్రతీకార సుంకాలను తగ్గించుకోవడంలో భాగంగానే తమ కార్ల ఎగుమతులను ఒక నెల రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే రెండు నెలలకు సరిపోయే కార్లను కంపెనీ ఇప్పటికే అమెరికాకు ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్మార్చి 2024 వరకు 12 నెలల్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 4,30,000 వాహనాలను విక్రయించిందని, వాటిలో దాదాపు నాల్గో వంతు ఉత్తర అమెరికాలో ఉన్నాయని కంపెనీ తన వార్షిక నివేదికలో తెలిపింది. అయితే ట్రంప్ సుంకాలను విధించిన తరువాత.. టాటా మోటార్స్ షేర్లు గణనీయంగా పతనమయ్యాయి. -
చెప్పుకోవడానికే బలమైన దేశం.. చేతల్లో ఏమీ లేదు: జెలెన్ స్కీ
రష్యా ఉక్రెయిన్ ల శాంతి ఒప్పందం(కాల్పుల విరమణ ఒప్పంద) ఇక కార్యరూపం దాల్చేలా లేదు. ఇందుకు అమెరికా చేసిన మధ్యవర్తిత్వం ఇప్పటికే గాడి తప్పింది. ఉక్రెయిన్ తో శాంతి ఒప్పందానికి ససేమేరా అంటున్న రష్యా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పినా దానిని పెడ చెవినే పెట్టింది. ఈ విషయంలో అమెరికా ఇప్పటికే చేతులెత్తేసినట్లే కనబడుతోంది.తాజాగా అమెరికాను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేసిన వ్యాఖ్యలు ఉదాహరణగా చెప్పొచ్చు. అమెరికా చెప్పుకోవడానికే బలమైన.. కానీ చేతల్లో ఏమీ ఉండదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.తమ దేశంపై మళ్లీ రష్యా విరుచుకుపడిన విషయాన్ని ఆమెరికాకు తెలియజేస్తే వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదన్నారు. రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 20 మంది తమ దేశ పౌరులు చనిపోయిన విషయాన్ని యూఎస్ ఎంబాసీకి తెలిపానని, అయితే వారు రష్యా పేరు పలకడానికి కూడా భయపడుతునం్నారని ఎద్దేవా చేశారు. రష్యా చేసిన దాడిలో చాలా వరకూ చిన్న పిల్లలు ఉన్నారని, ఈ విషయాల్ని పలు దేశాల ఎంబాసీలకు తెలిపినట్లు జెలెన్ స్కీ పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే అమెరికాకు కూడా తెలిపితే. రష్యా పదాన్ని వారు పలకడానికి వణుకు పోతున్నారంటూ సెటైర్లు వేశాడు. మనం చెప్పుకోవడానికే బలమైన దేశం.. బలమైన ప్రజలు.. కానీ వారి యాక్షన్ లో మాత్రం ఏమీ పస ఉండదు’ అంటూ దెప్పిపొడిచారు జెలెన్ స్కీ.జపాన్, యూకే, స్విట్జర్లాండ్, జర్మనీ తదితర దేశాల ఎంబాసీలకు తమ దేశంపై మళ్లీ జరిగిన దాడిని చెబితే.. వారి నుంచి సానుకూలమైన స్పందన వచ్చిందని, అదే అమెరికాకు చెబితే చాలా నిరూత్సాహమైన సమాధానం చెప్పారన్నారు. తమ దేశంపై శుక్రవారం రష్యా జరిపిన మిసైళ్ల దాడిలో 11 మంది పెద్దవాళ్లు, 9 మంది చిన్నపిల్లలు ఉన్నారరన్నారు. ఈ ఘటనలో 62 మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారని జెలెన్ స్కీ తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ ద్వారా తెలియజేశారు. -
ఇన్వెస్టర్లు ధనవంతులవుతారు.. ఇదే మంచి సమయం: డొనాల్డ్ ట్రంప్
ఏప్రిల్ 2న అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' సుంకాలను ప్రకటించిన తరువాత.. యూఎస్ మార్కెట్లు కుప్పకూలాయి. రెండు సెషన్లలలోనే ఇన్వెస్టర్లు ఆరు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టపోయారు. కరోనా మహమ్మారి తరువాత స్టాక్ మార్కెట్లు ఇంతలా పతనమవ్వడం ఇదే మొదటిసారి. అయితే ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారు.ట్రంప్ పరస్పర సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలోకి వెళ్తాయనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ జీడీపీ తగ్గుతుందని, ఉద్యోగాలు కూడా ఉండవని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఈ సమయంలో కూడా అమెరికా అధ్యక్షుడు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.అమెరికాలో ఆర్ధిక మాంద్యం వస్తుందని అందరూ భయపడుతుంటే.. ట్రంప్ మాత్రం ఇన్వెస్టర్లు ధనవంతులు అవ్వడానికి ఇదే సరైన సమయమని చెబుతున్నారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది సువర్ణావకాశమని, చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా వారు ధనవంతులు అవుతారని ఆయన అన్నారు.పెద్ద కంపెనీలు లేదా పెద్ద వ్యాపార సంస్థలు ఎప్పుడూ టారీఫ్స్ గురించి ఆందోళన చెందవు. ఎందుకంటే అవి ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. మరింత పెద్ద డీల్స్ మీద ఫోకస్ చేస్తాయి. ఇవే దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిస్తాయి.. సూపర్ ఛార్జ్ మాదిరిగా పనిచేస్తాయని అన్నారు.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉద్యోగాలుండవు'.. నిపుణులు ఎందుకు చెబుతున్నారంటే?విదేశీ వస్తువులను వినియోగించడం తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులపై ఫోకస్ చేయాలనే ఉద్దేశ్యంతో ఈ సుంకాలను ప్రవేశపెట్టారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను మార్చి వేయడం మాత్రమే కాకుండా.. దేశంలో ఉద్యోగాలను సృష్టించడానికి సహాయపడుతుందని డొనాల్డ్ ట్రంప్ విశ్వసిస్తున్నారు. -
'అమెరికాలో ఉద్యోగాలుండవు'
అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ప్రకటించిన కొత్త సుంకాల ప్రభావం వల్ల.. ఈ సంవత్సరం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశిస్తుందని 'జేపీ మోర్గాన్' అంచనా వేసింద. ఈ మాంద్యం వల్ల యూఎస్ఏలో నిరుద్యోగం రేటు 5.3 శాతానికి చేరుతుందని.. మైఖేల్ ఫెరోలి అన్నారు.డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం.. ఉద్యోగాల మీద మాత్రమే కాకుండా, దేశ జీడీపీ మీద కూడా ప్రభావం చూపిస్తుందని జేపీ మోర్గాన్ చీఫ్ యూఎస్ ఆర్థికవేత్త 'మైఖేల్ ఫెరోలి' వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులు కూడా 20 శాతం తగ్గుతాయని ఆర్ధిక నిపుణులు అంచనా వేశారు. దీనివల్ల అగ్రరాజ్యంలో ఉద్యోగాలు ఉండవని చెబుతున్నారు.ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల దిగుమతులు తగ్గుతాయి. జీడీపీలో దిగుమతులు 1986 ముందు స్థాయికి చేరుకుంటుందని.. యూబీఎస్ చీఫ్ యూఎస్ ఆర్థికవేత్త జోనాథన్ పింగిల్ ఒక నోట్లో తెలిపారు. దీనివల్ల ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్ధిక నష్టాన్ని అమెరికా చూడబోతోందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: 'ఇది నీకు సిగ్గుచేటు'.. బిల్‌గేట్స్ ఎదుటే ఉద్యోగుల నిరసన (వీడియో)డొనాల్ట్ ట్రంప్ భారతదేశం మీద మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని చాలా దేశాల మీద సుంకాలను విధించారు. అంతే కాకుండా మనుషులు లేని ఆస్ట్రేలియన్ దీవుల మీద కూడా 10 శాతం సుంకాలను ప్రకటించడం గమనార్హం. భారత్‌పై విధించిన సుంకాలలో 10 శాతం సుంకం ఈ రోజు (ఏప్రిల్ 5) నుంచి అమలులోకి వస్తుంది. మిగిలిన శాతం ఏప్రిల్ 10 నుంచి అమలులోకి రానుంది. -
ట్రంప్ సైలెంట్ బాంబ్! అంతకు మించి..
వాషింగ్టన్: ఒకవైపు ప్రపంచమంతా ట్రంప్ టారిఫ్(Trump Tariffs)ల గురించి చర్చించుకుంటున్న వేళ.. అమెరికా అనూహ్య చర్యలకు దిగింది. గప్‌చుప్‌గా ఆసియా రీజియన్‌లో భారీగా సైన్య మోహరింపునకు దిగింది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్ విమానాలను రంగంలోకి దించడం తీవ్ర చర్చనీయాంశమైంది.బీ-2 స్టెల్త్ బాంబర్లకు ప్రపంచంలోనే అత్యాధునికమైన యుద్ధవిమానాలుగా పేరుంది. అమెరికాలో అలాంటివి 20 ఉండగా.. వాటిలో ఆరింటిని హిందూ మహాసముద్ర రీజియన్‌లోని యూఎస్-బ్రిటన్ మిలిటరీ బేస్ డియాగో గార్సియా రన్‌వేపై మోహరింపజేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే రాడార్ సిగ్నల్స్ కూడా అందకుండా.. షెల్టర్‌లో మరిన్ని బాంబర్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు..ఇండో ఫసిఫిక్ రీజియన్‌లోనూ యుద్ధవిమానాల గస్తీని అమెరికా పెంచాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటిదాకా ఒక విమాన వాహక నౌకతోనే(అరేబియా సముద్రంలో USS Harry S. Truman) గస్తీ నిర్వహిస్తుండగా.. ఆ సంఖ్యను 3కి పెంచే యోచనలో ఉంది. హిందూ మహాసముద్రం రీజియన్‌లో రెండు, దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ దగ్గర ఒక విమాన వాహక నౌకతో గస్తీ ఉంచాలనుకుంటోంది. అంతేకాదు ఈ మోహరింపు మునుముందు మరింత పెరగనుందని అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధృవీకరించింది. అయితే.. ఈ చర్యలను భారీ వ్యూహాత్మక ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు.యూఎస్ఎస్ నిమిట్జ్హఠాత్తుగా ఎందుకంటే..ఆయా రీజియన్లలో అమెరికా రక్షణాత్మక వైఖరిని మెరుగుపరచడానికి ఈ మోహరింపు అని పెంటగాన్ ప్రకటించుకుంది. అదే సమయంలో.. భాగస్వామ్య దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని, ఈ క్రమంలోనే దాడులు, అంతర్యుద్ధాలు, రాజకీయ సంక్షోభాలు.. వాటికి కొనసాగింపుగా చెలరేగే ఉద్రిక్తతలను కట్టడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతోంది.అమెరికా ఏ దేశం, ఏ సంస్థల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ.. మిడిల్ ఈస్ట్, దక్షిణాసియా పరిస్థితుల నేపథ్యంలోనే అమెరికా ఈ చర్యలకు దిగిందన్నది విశ్లేషకుల మాట. ప్రధానంగా ఇరాన్, యెమెన్‌లతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలోనే సైన్యాన్ని రంగంలోకి దించుతోందని భావిస్తున్నారు.హెచ్చరికలతో మొదలైనప్పటికీ..గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగానే హౌతీలకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నౌకలపై దాడులు ఆపకపోతే.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యెమెన్‌ను, మద్ధతుగా నిలిచిన ఇరాన్‌ను హెచ్చరించారాయన. అలాగే.. అణు ఒప్పందం విషయంలోనూ ఇరాన్‌ను హెచ్చరిస్తూ వస్తున్నది చూస్తున్నాం. అయితే రక్షణ రంగ నిపుణులు మాత్రం బీ-2 లాంటి శక్తివంతమైన బాంబర్లను కేవలం హౌతీలు, ఇరాన్ కోసమే మోహరింపజేసి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ముఖ్యంగా యెమెన్‌పై దాడికి ఇది చాలా ఎక్కువనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పనిలో పనిగా ఇరాన్ మిత్రపక్షాలైన చైనా, రష్యాలకు కూడా ట్రంప్ హెచ్చరికల సంకేతాలు పంపిస్తున్నారనే చర్చ మొదలైంది ఇప్పుడు. దక్షిణ చైనా సముద్రానికి దగ్గరగా వెస్ట్రన్ పసిఫిక్ వద్ద యూఎస్ఎస్ నిమిట్జ్ క్యారీయర్‌ను, మిడిల్ ఈస్ట్‌లో యూఎస్ఎస్ కార్ల్ విన్సన్ వాహక నౌకను మోహరింపజేయడమే ఇందుకు ఉదాహరణలుగా చెబుతున్నారు. దీంతో ట్రంప్ ఆలోచన అంతకు మించే ఉందన్న చర్చ నడుస్తోంది. -
Magazine Story: ట్రంప్ టారిఫ్ కొరడా
-
పలు దేశాల్లో భూకంపం.. ఉత్తర భారతంలోనూ భూ ప్రకంపనలు
న్యూఢిల్లీ: నేపాల్‌ను శుక్రవారం సాయంత్రం స్వల్ప భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 5.0 తీవ్రతతో గర్ఖాకోట్‌కు మూడు కి.మీ దూరంలో 20కి.మీ లోతులో భూకంప కేంద్రం రికార్డయ్యింది. ఈ ప్రభావంతో ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించింది.నేపాల్‌లో శుక్రవారం సాయంత్రం 7.52 గంటల సమయంలో ఇది రికార్డయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఆ సమయంలో ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో పలు చోట్ల భూప్రకంపనలు చోటుచేసుకుంది. మరోవైపు జపాన్‌లోనూ గత 24 గంటల్లో నాలుగుసార్లు భూమి కంపించింది. తాజాగా హోక్కాయిడో ఒట్రాడాలో 4.7 తీవ్రతతో భూమి కంపించింది. రెండ్రోజుల కిందట.. కాగోషిమా నిషినూమోటో కేంద్రంగా 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. పపువా న్యూ గినియాలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీమరోవైపు.. పపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.9గా నమోదు అయింది. పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్స్‌లోని కింబే పట్టణానికి 194 కి.మీ దూరంలో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. 10 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీచేసింది.A 5.0 magnitude earthquake struck Nepal at 7:52 PM, with tremors felt across North India. This seismic event comes just days after a catastrophic earthquake in Myanmar, which registered a 7.7 magnitude on March 28. That disaster resulted in over 3,000 deaths, 4,500 injuries, and at least 341 people still missing. No reports of damage in Nepal yet. Stay tuned for updates.ఇదిలా ఉంటే.. మార్చి 28వ తేదీన మయన్మార్, థాయ్‌లాండ్‌లలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక్క మయన్మార్‌లోనే మూడువేల మందికిపైగా చనిపోయారు. వేల సంఖ్యలో గాయపడ్డారు. పలువురు గల్లంతయ్యారు. పలు దేశాల రెస్క్యూ సిబ్బంది సహాయచర్యలు కొనసాగిస్తున్నారు. -
చర్చనీయాంశంగా సుంకాల హేతుబద్ధత
న్యూఢిల్లీ: వివిధ దేశాలపై అమెరికా వడ్డించిన భారీ టారిఫ్‌ల వెనుక హేతుబద్ధత ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏ ప్రాతిపదికన ఈ టారిఫ్‌లను నిర్ణయించారనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. మిగతా దేశాలు తమపై ఎంత టారిఫ్‌లు విధిస్తున్నాయో అదే స్థాయిలో తామూ సుంకాలు విధించామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ వాస్తవానికి లెక్కలు వేరేగా ఉన్నాయి. మిగతా దేశాలతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునే విధంగా టారిఫ్‌లను నిర్ణయించినట్లుగా పరిశీలకులు చెబుతున్నారు. సాధారణంగా పైకి కనిపించే టారిఫ్‌లే కాకుండా తమ ఉత్పత్తులకు నియంత్రణ సంస్థలపరమైన అడ్డంకులు, సాంకేతిక అవరోధాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు తదితర టారిఫ్యేతర అంశాలు కూడా వాణిజ్య లోటుకు కారణమవుతున్నాయని అగ్రరాజ్యం భావిస్తోంది. కాబట్టి వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత రేటును నిర్ణయించింది. ఉదాహరణకు భారత్‌తో అమెరికాకు 46 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందంటే.. దాన్ని సున్నా స్థాయికి తీసుకొచ్చేలా సుంకాలను నిర్ణయించినట్లు పరిశీలకులు పేర్కొన్నారు. అంటే ప్రస్తుతం భారత్‌పై విధించిన 26% రేటు ద్వారా మన దేశంతో ఉన్న వాణిజ్య లోటును పూర్తిగా భర్తీ చేసుకోవచ్చని అమెరికా భావిస్తోంది. ఈ సుంకాల వల్ల భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగి, అమెరికన్లు మన దగ్గర నుంచి దిగుమతులు తగ్గించుకుంటారని, తద్వారా వాణిజ్య లోటు తగ్గుతుందని అమెరికా అభిప్రాయం. లోపభూయిష్టమైన విధానం.. అయితే, ఇది తప్పుల తడక విధానమని విమర్శలు వస్తున్నాయి. వాణిజ్య లోటుకు లేదా మిగులుకు టారిఫ్‌లు, టారిఫ్యేతర అడ్డంకులు, కరెన్సీ హెచ్చుతగ్గుల్లాంటివి కారణమే అయినప్పటికీ.. కేవలం సుంకాల విధింపు ద్వారా దీన్ని పరిష్కరించుకోవడం సాధ్యపడదని విశ్లేషకులు చెబుతున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య లోటుకు కారణాలు అనేకం ఉంటాయని తెలిపారు. ఉదాహరణకు బియ్యం ప్రధాన ఆహారంగా ఉండే దేశానికి .. గోధుమలను భారీగా పండించి, ఎగుమతి చేసే మరో దేశం నుంచి ఎక్కువగా దిగుమతులు ఉండకపోవచ్చు. కానీ తాము దేశీయంగా ఉత్పత్తి చేసుకోలేని పరికరాలు, కంప్యూటర్లను ఎగుమతి చేసే ఇంకో దేశంతో వాణిజ్య లోటు ఉండొచ్చు. అలాగని ఈ వాణిజ్య లోటేమీ అవాంఛనీయమైన లేదా అనుచితమైనదేమీ కాదు. ప్రస్తుతం అమెరికా పాటిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే ఏప్రిల్ 2 నాటి టారిఫ్‌లే అంతిమం కాదని భావించాలి. రేప్పొద్దున్న డాలరు మారకం విలువ పెరిగి, అమెరికాలో మన ఉత్పత్తుల ధరలు పెరగకపోయి, అక్కడి వారు దిగుమతులు చేసుకోవడం కొనసాగిస్తే.. వాణిజ్య లోటు యథాప్రకారం కొనసాగుతుంది. అప్పుడు మళ్లీ వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడానికి మళ్లీ టారిఫ్‌లు పెంచాల్సి వస్తుంది. ఆ విధంగా సుంకాల వడ్డింపు నిరంతర ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉంది. -
ఎల్ఐసీకి ఎలాంటి అనుచిత లబ్ధి అందడం లేదు
న్యూఢిల్లీ: భారత బీమా మార్కెట్లో ఎల్ఐసీ అసమంజసమైన పోటీ ప్రయోజనం పొందుతోందంటూ యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) చేసిన ఆరోపణలను ప్రభుత్వరంగ బీమా సంస్థ తోసిపుచ్చింది. గత 25 ఏళ్లుగా పోటీతో కూడిన మార్కెట్లో 24 ప్రైవేటు బీమా కంపెనీల మాదిరే ఎల్ఐసీ సైతం కార్యకలాపాలు నిర్వహిస్తుస్తోందని స్పష్టం చేసింది. యూఎస్టీఆర్ అభిప్రాయాలు భారత బీమా నియంత్రణలు, ఎల్ఐసీ పనితీరు గురించి సమగ్రంగా అర్థం చేసుకోకుండా చేసినవిగా భావిస్తున్నట్టు పేర్కొంది. ఐఆర్డీఏఐ, సెబీ నియంత్రణల పరిధిలో పనిచేస్తూ ప్రభుత్వం నుంచి కానీ, లేదా ఏ ఇతర నియంత్రణ సంస్థ నుంచి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం పొందలేదని వివరించింది. భారత్‌లో ఆర్థిక సేవల విస్తృతికి, పాలసీదారుల ప్రయోజనం విషయంలో ఎల్ఐసీ చేసిన కృషిపై మరింత తటస్థ, వాస్తవిక ప్రశంసను తాము కోరుకుంటున్నట్టు పేర్కొంది. హామీని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు.. ‘‘ప్రైవేటు బీమా సంస్థల కంటే చాలా మంది కస్టమర్లు ఎల్ఐసీ పాలసీలనే ఎంపిక చేసుకుంటున్నారు. తద్వారా ఎల్ఐసీకి అనుచిత పోటీ ప్రయోజనం లభిస్తోంది’’అని అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ అయిన యూఎస్టీఆర్ తన తాజా నివేదికలో విమర్శించడం గమనార్హం. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన పాలన, సేవలు, కస్టమర్ల విశ్వాసాన్ని కొనసాగించేందుకు ఎల్ఐసీ కట్టుబడి ఉన్నట్టు సంస్థ ఎండీ, సీఈవో సిద్ధార్థ మహంతి ప్రకటించారు. 1956లో ఎల్ఐసీని ఏర్పాటు చేసినప్పు డు ప్రభుత్వం కలి్పంచిన హామీ అన్నది.. జాతీయీకరణ ఆరంభ కాలంలో ప్రజా విశ్వాసాన్ని పొందడం కోసమే. అంతేకానీ దీన్ని ఎప్పుడూ మార్కెటింగ్ సాధనంగా ఎల్ఐసీ ఉపయోగించుకుని ప్రయోజనం పొందలేదని ఎల్ఐసీ తెలిపింది. -
పోటీ దేశాలపై టారిఫ్‌లు.. మనకు మరిన్ని అవకాశాలు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌లతో భారత ఎగుమతులకు సవాళ్లు ఉన్నప్పటికీ, పోటీ దేశాలపై మరింత అధిక స్థాయిలో సుంకాలు విధించడం వల్ల, మన వ్యాపారాన్ని పెంచుకునేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ హార్డ్‌వేర్ సంస్థల సమాఖ్య ఎంఏఐటీ తెలిపింది. భారత్‌తో పోలిస్తే చైనా, వియత్నాంలపై భారీగా సుంకాలు విధించడమనేది మన ఎగుమతులకు సానుకూలాంశమని వివరించింది. ‘భౌగోళిక, రాజకీయ రిస్కులను అధిగమించేందుకు గ్లోబల్ కంపెనీలు తమ తయారీ కార్యకలాపాలను భారత్‌కు మళ్లించే అవకాశం ఉంది. దీంతో మన ఎగుమతులు మరింత పెరగవచ్చు. పోటీ దేశాలతో వ్యాపారం భారీ వ్యయాలతో కూడుకున్నది కావడంతో అంతర్జాతీయంగా కొనుగోలుదారులు భారత ఎగుమతులవైపు మొగ్గు చూపవచ్చు. గ్లోబల్ బ్రాండ్లు తమ తయారీ కేంద్రాలను ఇతర దేశాలకు మళ్లించడంపై దృష్టి పెడతాయి కనుక సరఫరా వ్యవస్థకు సంబంధించి భారత్‌కు మరిన్ని అవకాశాలు లభించవచ్చు‘ అని ఎంఏఐటీ పేర్కొంది. భారత్‌పై 27 శాతం సుంకాలు ప్రకటించిన అమెరికా, మనకు పోటీ దేశాలైన చైనాపై 54 శాతం, వియత్నాంపై 46 శాతం, థాయ్‌లాండ్‌పై 36 శాతం విధించింది. దీనితో ఎల్రక్టానిక్స్, టెలికాం పరికరాలు, ఐటీ హార్డ్‌వేర్ విషయంలో ఆయా దేశాలు మనతో పోటీపడే పరిస్థితి తగ్గుతుందని, మన ఎగుమతులకు డిమాండ్ మెరుగుపడవచ్చని ఎంఏఐటీ తెలిపింది. అమెరికాకు భారత్ సుమారు 7 బిలియన్ డాలర్ల స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేస్తోంది. టారిఫ్‌ల వల్ల వీటిపై ప్రభావం పడనుంది. స్థిరమైన పాలసీలు కావాలి.. పోటీ దేశాలపై టారిఫ్‌లను మనకు అనుకూలంగా మల్చుకోవాలంటే వ్యాపారాల నిర్వహణ సులభతరం చేయడానికి మరింత ప్రాధాన్యతనివ్వాల్సి ఉంటుందని ఎంఏఐటీ తెలిపింది. అలాగే పాలసీలపరంగా స్థిరత్వం ఉండేలా చూడాలని, లాజిస్టిక్స్.. ఇన్ఫ్రాపై భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది. ఇవన్నీ చేయగలిగితే రాబోయే రోజుల్లో ప్రపంచానికి తయారీ, ఎగుమతుల హబ్‌గా భారత్ ఎదగవచ్చని వివరించింది. 2021–22 నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో భారత్‌కు అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిల్చింది. మొత్తం భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు 18 శాతం, దిగుమతుల్లో 6.22 శాతం, ద్వైపాక్షిక వాణిజ్యంలో 10.73 శాతంగా ఉంది. అమెరికాతో మనకు వాణిజ్య మిగులు 2019–20లో 17.26 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023–24లో ఇది 35.32 బిలియన్ డాలర్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్ విషయానికొస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 10 బిలియన్ డాలర్లుగా, దిగుమతులు 3.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
టారిఫ్‌ల భారంపై బేరసారాలు
న్యూఢిల్లీ: భారీ టారిఫ్‌ల విధింపుతో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై ప్రభావం పడనున్న నేపథ్యంలో అమెరికా సంస్థలతో భారతీయ ఎగుమతిదారులు సంప్రదింపులు ప్రారంభించారు. ఈ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొనే మార్గాలపై వారితో చర్చలు జరుపుతున్నట్లు ఎగుమతిదారుల సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. దేశీయంగా ఉక్కు రేట్లు ఇప్పటికే భారీగా ఉన్న తరుణంలో అధిక సుంకాల భారాన్ని ఇంజినీరింగ్ ఉత్పత్తుల పరిశ్రమ భరించే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, టారిఫ్‌లతో అమెరికాలో మన లెదర్ ఉత్పత్తులకు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని ఫుట్‌వేర్ ఎగుమతి సంస్థ ఫరీదా గ్రూప్ చైర్మన్ రఫీక్ అహ్మద్ చెప్పారు. అమెరికాలోని లెదర్ ఉత్పత్తుల దిగుమతిదారులు, టారిఫ్లపరమైన నష్టాల్లో కొంత భరించాలని తమను కోరుతున్నారని తెలిపారు. కొన్నాళ్ల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని కూడా వారు అడిగినట్లు వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే దీర్ఘకాలంలో మన ఎగుమతులకు అమెరికాలో మార్కెట్ గణనీయంగా కుదించుకుపోవచ్చని పేర్కొన్నారు. ఇక, అమెరికా అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉన్నందున అక్కడి నుంచి కొన్ని దిగుమతులపై సుంకాలను తగ్గించడం మనకు కూడా శ్రేయస్కరమని ఎఫ్ఐఈవో వైస్ ప్రెసిడెంట్ రవికాంత్ కపూర్ తెలిపారు. కార్పెట్లు, హోమ్ ఫరి్న షింగ్ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌ల వల్ల పరిశ్రమలో గణనీయంగా ఉద్యోగాలు పోయే ముప్పు ఉందని వివరించారు. బియ్యంపై ప్రభావం తాత్కాలికమే.. దీర్ఘకాలికంగా చూస్తే బియ్యం ఎగుమతులపై సుంకాల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తాత్కాలికంగా ధరలు పెరిగినా, రెండు–మూడు నెలల్లో అంతా సర్దుకోగలదని ఇండియన్ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ఫెడరేషన్ (ఐఆర్ఈఎఫ్) జాతీయ అధ్యక్షుడు ప్రేమ్ గర్గ్ తెలిపారు. వ్యూహాత్మక ప్రణాళికలతో మన పరిశ్రమలను కాపాడుకోవడంతో పాటు అమెరికాలో కార్యకలాపాలను కూడా విస్తరించవచ్చని ఆయన చెప్పారు. టారిఫ్‌లు పెంచినప్పటికీ మిగతా పోటీ దేశాలతో పోలిస్తే ఇప్పటికీ భారత్ వైపే మొగ్గు ఉంటుందని వివరించారు. మరోవైపు, ప్రస్తుత కాంట్రాక్టులను సమీక్షించుకోవాల్సి రావచ్చని, అమెరికా దిగుమతిదారులు మరింత ఎక్కువ కాలం క్రెడిట్ ఇవ్వాలని కోరవచ్చని వ్యాపారవర్గాలు చెప్పాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ 52.4 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతి చేయగా అందులో 2.34 లక్షల టన్నులను అమెరికాకు పంపింది. 2024 ఏప్రిల్–నవంబర్ మధ్య కాలంలో 42 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా 2.04 లక్షల టన్నులుగా ఉంది. బియ్యం ఎగుమతులకు పశి్చమాసియా ప్రధాన గమ్యస్థానంగా ఉంటోంది.టారిఫ్‌ల ఎఫెక్ట్ స్వల్పమే నితి ఆయోగ్ సభ్యులు విర్మాణీ న్యూఢిల్లీ: యూఎస్ విధించిన ప్రతీకార టారిఫ్‌ల ప్రభావం భారత్‌పై స్వల్పమేనని నితి ఆయోగ్ సభ్యులు అరవింద్ విర్మాణీ పేర్కొన్నారు. దేశీ ఆర్థిక వ్యవస్థ విదేశీ వాణిజ్యంపై అతితక్కువగా ఆధారపడుతుండటమే దీనికి కారణమని తెలియజేశారు. మధ్యకాలానికి టారిఫ్‌లతో తలెత్తనున్న ప్రతికూలతలు ప్రతిపాదిత యూఎస్ భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(బీటీఏ) తొలి దశ అమలుతో తొలగిపోనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇక దీర్ఘకాలంలో చూస్తే తుది బీటీఏ కారణంగా రానున్న 5–10ఏళ్లలో లబ్ది పొందేందుకు వీలున్నట్లు తెలియజేశారు. అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొంటూ భారత్‌పై యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తాజాగా 26 శాతం ప్రతీకార టారిఫ్‌లకు తెరతీసిన విషయం విదితమే. అయితే ఆయా దేశాల వాణిజ్య లోటుతోపాటు.. దిగుమతులను పరిగణించి చేసిన మదింపు ద్వారా టారిఫ్‌లు అమలుకానున్నట్లు వివరించారు. -
అంతకు మించి...!
బీజింగ్: తెంపరి ట్రంప్ తెర తీసిన టారిఫ్‌ల యుద్ధం అప్పుడే ముదురు పాకాన పడుతోంది. అమెరికా అధ్యక్షుని సుంకాల బాదుడుపై ప్రపంచ దేశాలు దీటుగా స్పందిస్తున్నాయి. అమెరికా ఆటో ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు కెనడా గురువారమే ప్రకటించడం తెలిసిందే. శుక్రవారం చైనా కూడా అదే బాట పట్టింది. అమెరికాపై 34 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు చైనా ఆర్థిక శాఖ ప్రకటించింది. అగ్ర రాజ్యపు ఉత్పత్తులపై ఇప్పటికే అమల్లో ఉన్న సుంకాలకు ఇవి అదనం. తమ నుంచి చైనా ఏకంగా 54 శాతం సుంకాలు వసూలు చేస్తోందని ట్రంప్ బుధవారం ఆక్షేపించడం తెలిసిందే. అందుకే ఆ దేశంపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అవి ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆలోపే అమెరికాపై తానూ అంతే మొత్తం సుంకాలు విధించడం ద్వారా డ్రాగన్ దేశం దెబ్బకు దెబ్బ తీసింది. టారిఫ్ పోరులో తగ్గేదే లేదని స్పష్టం చేసింది. అంతటితో ఆగలేదు! అమెరికాకు అత్యవసరమైన పలు అరుదైన ఖనిజాల ఎగుమతులపైనా నియంత్రణలు ప్రకటించింది. సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం వంటి పలు ఖనిజాలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనా నిర్ణయంతో అమెరికా రక్షణ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఆయా ఖనిజాల కోసం చైనా దిగుమతులపైనే భారీగా ఆధారపడుతుండటమే ఇందుకు కారణం. వీటికి తోడు 16 అమెరికా కంపెనీలకు పలు ‘డ్యుయల్ యూజ్’ వస్తువుల ఎగుమతులను పూర్తిగా నిలిపేయాలని కూడా చైనా నిర్ణయించింది. చైనాకు ఎలాంటి ఎగుమతులూ చేయకుండా మరో ఆరు అమెరికా కంపెనీలపై నిషేధం విధించింది. అమెరికా, భారత్ నుంచి దిగుమతైన మెడికల్ సీటీ ట్యూబులపై యాంటీ డంపింగ్ దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. తాజా సుంకాలు, ఖనిజ ఎగుమతులపై ఆంక్షలు ఏప్రిల్ 4 నుంచే అమల్లోకి రానున్నట్టు చైనా ప్రకటించింది. దీనిపై ట్రంప్ మండిపడ్డారు. ‘‘చైనాది తొండాట. మా దెబ్బతో వారు గాభరా పడిపోయారు. దాంతో చేయకూడని పనులు చేస్తున్నారు’’ అంటూ ఆక్షేపించారు. అయితే తన నిర్ణయాలు, విధానాలు మారబోవని కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు తన సోషల్‌మీడియా హ్యాండిల్ ట్రూత్‌లో పోస్టులు పెట్టారు.డబ్ల్యూటీఓలో చైనా దావాచైనాపై ట్రంప్ ఇప్పటికే 20 శాతం సుంకాలు విధించడం తెలిసిందే. బుధవారం నాటి వడ్డింపులతో అవి ఏకంగా 54 శాతానికి 64 శాతానికి చేరాయి. దీనిపై చైనా తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థలో దావా వేసింది. -
చైనా భయపడింది.. తప్పు చేసింది: డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: తమ దిగుమతులపై 34 శాతం టారిఫ్ విధిస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. వారు తప్పు చేశారంటూనే దాన్ని చైనా అమలు చేయలేదన్నారు. ఇంకా చైనా భయపడిందంటూ వ్యాఖ్యానించారు ట్రంప్. తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్ లో చైనా విధించిన టారిఫ్ ల పై స్పందించారు ట్రంప్ఏప్రిల్ 10వ తేదీ నుంచి అన్ని యూఎస్ వస్తువులపై 34 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు చైనా పేర్కొన్న నేపథ్యంలో ట్రంప్ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. చైనాతో సహా అనేక దేశాలపై ట్రంప్ సుంకాలను ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత చైనా ఈ చర్యలకు శ్రీకారం చుట్టింది. చైనా వస్తువులపై అదనంగా 34 శాతం సుంకాలను అమెరికా విధించిన నేపథ్యంలో.. చైనా కూడా ప్రతీకార చర్యల్లో భాగంగా అంతే శాతాన్ని అమెరికా వస్తువులపై విధిస్తున్నట్లు ప్రకటించింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కల్గిన దేశాల మధ్య టారిఫ్ వార్..!చైనా నుంచి దిగుమతులపై అదనంగా విధించిన అదే 34 శాతం పన్నును ప్రస్తుతం చైనా.. తిరిగి అమెరికాపై సుంకాలుగా ప్రకటించడంతో ఇది చర్చకు దారి తీసింది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కల్గిన ఈ దేశాల మధ్య ఉద్రిక్త వాతావారణానికి దారితీసినట్లయ్యింది. అమెరికా, చైనాలు ఎవరికి వారే వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది టారిఫ్ లకే పరిమితం అవుతుందా.. లేక విపత్కర పరిస్థితులకు దారి తీస్తుందా అనేది ప్రజల్లో తలెత్తున్న ప్రశ్న. అమెరికా విధిస్తున్న సుంకాలు మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేదిగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ట్రంప్ టారిఫ్‌లు.. ‘ఇండియన్ ఐటీ’కి గట్టి దెబ్బే..
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ప్రతీకార సుంకాలు ప్రపంచ ఆర్థిక కారిడార్లలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వివిధ దేశాల నుంచి దిగుమతయ్యే వస్తువులు, సేవలకు అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలు నిర్ణయించారు. దీని ప్రభావం భారత్‌లోని అనేక రంగాలపై పడనుంది. ముఖ్యంగా 280 బిలియన్ డాలర్ల విలువైన భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సేవల రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకంటే దీనికి యునైటెడ్ స్టేట్స్ కీలకమైన ఆదాయ వనరు.యూఎస్-ఇండియా టెక్ బంధందశాబ్దాలుగా భారతదేశంలో ఐటీ సేవల రంగం అభివృద్ధి చెందింది. యూఎస్ కంపెనీలతో దాని భాగస్వామ్యం, డిజిటల్ పరివర్తనతో నడిచే ప్రాజెక్టుల స్థిరమైన ప్రవాహం ఇందుకు తోడ్పాటు అందిస్తున్నాయి. భారత ఐటీ పరిశ్రమకు ఆదాయంలో దాదాపు 50% అమెరికన్ మార్కెట్ నుంచే వస్తుంది. ఈ నేపథ్యంలో యూస్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాలు అమెరికా-భారత్ టెక్ బంధానికి విఘాతం కలిగిస్తాయన్న ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఈ టారిఫ్‌లు భారతీయ ఐటీ సేవలపై ఆధారపడిన యూఎస్ సంస్థలకు ఖర్చులను పెంచబోతున్నాాయి.తక్షణ పరిణామాలు కొత్త సుంకాలు అమెరికాకు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. కంపెనీలు బడ్జెట్లను కఠినతరం చేయవలసి వస్తుంది. విచక్షణతో కూడిన సాంకేతిక వ్యయంలో వృద్ధి సాధించిన భారత ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి మందగించవచ్చు. 2026 ఆర్థిక సంవత్సరానికి 6-8 శాతం అత్తెసరు వృద్ధి రేటు ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.ఇండస్ట్రీ రెస్పాన్స్..యూఎస్ టారిఫ్‌లకు ప్రతిస్పందనగా, భారతీయ ఐటీ సంస్థలు తమ భౌగోళిక పరిధి, క్లయింట్ స్థావరాలను వైవిధ్యపరచడంపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇంకా, కాస్ట్ ఆప్టిమైజేషన్ వ్యూహాలు, ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ సేవలు వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. ఐరోపా, ఆసియా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో అవకాశాలను అన్వేషిస్తూ అమెరికా నుంచి డిమాండ్ క్షీణతను పూడ్చడమే ఈ చర్యల లక్ష్యం.కొత్త అవకాశాలూ..ఈ కల్లోలం భారత ఐటీ కంపెనీలకు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమం చేస్తుంది. యూఎస్ తయారీ, ఆటోమేషన్ రంగాలకు అనుగుణంగా సృజనాత్మక డిజిటల్ పరిష్కారాలను అందించడం ద్వారా, ఐటీ పరిశ్రమ అమెరికన్ మార్కెట్లో తన ప్రాముఖ్యతను తిరిగి స్థాపించడానికి మార్గాలను కనుగొనవచ్చు.ముందున్న మార్గం తక్షణ సవాళ్లు గణనీయంగా ఉన్నప్పటికీ, భారత ఐటీ సేవల పరిశ్రమ స్థితిస్థాపకతను తక్కువ అంచనా వేయలేము. గతంలో ఆర్థిక మాంద్యం, భౌగోళిక రాజకీయ మార్పుల సమయంలోనూ మన ఐటీ పరిశ్రమ నిలదొక్కుకుంది. అలాగే ప్రస్తుత తుఫానులను కూడా ఎదుర్కోవడమే కాకుండా ఆవిష్కరణ, వైవిధ్యీకరణ ద్వారా మరింత బలంగా ఎదిగే ఈ రంగం సామర్థ్యానికి రాబోయే సంవత్సరాలు పరీక్షగా నిలవనున్నాయి. -
జనాలే లేని ద్వీపంపై పన్నులా? ట్రంప్ సుంకాలపై పెంగ్విన్స్ సెటైర్లు
అమెరికాఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు 1800 దేశాలను టార్గెట్ చేస్తూ పరస్పరం (రెసిప్రోకల్ టారిఫ్స్) పన్నులు విధించడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. అనేక దేశాధినేతలు తమ స్పందన వెల్లడించారు కూడా. దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యబాణాలు వెల్లువెత్తాయి కూడా. మరీ ముఖ్యంగా అయితే జనావాసాలు లేని ఒక ద్వీపంపై ట్రంప్ సుంకాలు విధించిన తీరు మరింత విస్మయ పర్చింది. దీనిపై పెంగ్విన్ మీమ్స్(penguin memes) ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి.సబ్ అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్‌డొనాల్డ్ దీవుల (Heard and McDonald Islands) పై ఎందుకు పన్నులు విధించారు అనేదే పెద్ద ప్రశ్న. మానవ జనాభా లేని బంజరు సబ్-అంటార్కిటిక్ ఆస్ట్రేలియన్ ప్రాంతమైన హర్డ్ , మెక్‌డొనాల్డ్ దీవుల నుండి వచ్చే అన్ని ఎగుమతులపై ట్రంప్ 10శాతం సుంకాలను విధించారు. అయితే ఈ దీవులు ఆస్ట్రేలియా భూభాగం కిందకు వస్తాయి కాబట్టి.. వాటిని టారిఫ్స్ జాబితాలో చేర్చినట్లు వైట్ హౌస్ అధికారి వివరణ ఇచ్చారు.వాస్తవానికి ఈ దీవుల్లో మనుషులు నివసించరు. దాదాపు 80 శాతం మంచుతో కప్పబడిన ఈ ప్రాంతం యునెస్కో వీటిని ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. దీవులు యాక్టివ్ అగ్నిపర్వతాలు, వివిధ సముద్ర జంతువులకు నిలయంగా ఉండటంతో అక్కడ ప్రజలు నివసించటం లేదు. దాదాపు దశాబ్ధకాలం నుంచి ఆ ప్రాంతాన్ని ఎవ్వరూ సందర్శించలేదని తెలుస్తోంది. ఈ ప్రాంతం పెంగ్విన్లు, సీల్స్కు ఆవాస ప్రాంతంగా ఉంది. The penguin wore a suit. But didn’t escape the Trump tarifs on the Heard og McDonald Islands. Maybe it didn’t say thank you? pic.twitter.com/aaPr1ufCr0— Christopher Arzrouni (@CArzrouni) April 3, 2025 ఓవల్ ఆఫీసులో ఉక్రెయిన్ నాయకుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్థానంలో పెంగ్విన్‌ను అమెరికా అధ్యక్షుడు ,ఉపాధ్యక్షుడు వాన్స్‌తో ఇటీవల జరిగిన వివాదాస్పద సమావేశానికి ఉటింకిస్తూ ఒక మీమ్ ఉంది. జెలెన్స్కీ ప్లేస్‌లో పెంగ్విన్‌ను ఉంచారు. మరొక మీమ్ యుఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో స్థానంలో చక్రవర్తి పెంగ్విన్‌ను చూస్తున్నట్లు ఉంది. "పెంగ్విన్లు సంవత్సరాలుగా మనల్ని చీల్చి చెండాడుతున్నాయి" అని మొదిసారి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మాజీ కమ్యూనికేషన్స్ చీఫ్‌గా 11 రోజులు పనిచేసిన ఆంథోనీ స్కారాముచ్చి వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. చమత్కరించారు. ఈ సుంకాల జాబితాలో రష్యా లేదనే వాస్తవాన్ని ప్రస్తావిస్తూ. "ట్రంప్ పుతిన్‌పై కాదు పెంగ్విన్లపై సుంకాలను విధించారు" అంటూ అమెరికా సెనేట్ డెమోక్రటిక్ నాయకుడు చక్ షుమర్ పోస్ట్ చేశారు,Outstanding memes capturing the absurdity of Trump’s tariff on penguin inhabited Heard & McDonald Islands #owngoal #PowerToThePenguins pic.twitter.com/AETymaLFdC— Eddie Lloyd (@worldzonfire) April 4, 2025 ; చదవండి: ట్రంప్ సుంకాల మోత, సోషల్ మీడియాలో మీమ్స్ హోరు మాములుగా లేదు!మరోవైపు ట్రంప్ సుంకాల దెబ్బతో అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. 2020లో కోవిడ్ మహమ్మారి తర్వాత మళ్లీ ఇపుడు స్టాక్స్ తీవ్రంగా నష్టపోతున్నాయి. -
అమెరికా స్టాక్ మార్కెట్లు పతనం
-
టారిఫ్‌ల పెంపు అమెరికా సెల్ఫ్‌గోల్
న్యూఢిల్లీ: అమెరికా 60 దేశాలపై ప్రతీకార సుంకాలు మోపడం అన్నది తనకు తాను నష్టం చేసుకోవడమేనని (సెల్ఫ్ గోల్) ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. వీటి కారణంగా భారత్‌పై స్వల్ప ప్రభావమే ఉంటుందన్నారు. ‘‘స్వల్పకాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడనుంది. ఫుట్‌బాల్ ఆటగాళ్లు చెప్పినట్టు ఇదొక సెల్ఫ్ గోల్ (తన చర్యతో ప్రత్యర్థి టీమ్‌కు పాయింట్ వచ్చేలా చేసేవాడు). భారత ఎగుమతులపై అమెరికా ప్రత్యక్ష టారిఫ్‌లు ప్రభావం చూపిస్తే అది యూఎస్‌లో ధరల పెరుగుదలకు దారితీస్తుంది. దాంతో డిమాండ్ తగ్గుతుంది. అప్పుడు భారత వృద్ధిపైనా ప్రభావం పడుతుంది. అయితే ఇతర దేశాలపైనా అమెరికా టారిఫ్‌లు మోపింది. కనుక ఆయా దేశాల ఉత్పత్తిదారులతో భారత్ పోటీపడుతుంది. కేవలం భారత్‌కు మాత్రమే విధించే టారిఫ్‌లతో పోల్చి చూస్తే ప్రస్తుత నిర్ణయం కారణంగా పడే ప్రభావం తక్కువే’’అని రఘురామ్ రాజన్ వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రాజన్ ప్రస్తుతం ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. అమెరికా ఉత్పత్తిని పెంచాలన్నది ట్రంప్ దీర్ఘకాల ఉద్దేశ్యమని, దీని ఫలితం ఏదైనా దీర్ఘకాలంలోనే కనిపిస్తుందన్నారు. దేశీ వినియోగంతో పోల్చితే ఎగుమతులు తక్కువగానే ఉన్నందున.. అమెరికా ప్రతి సుంకాలు భారత్‌లో ప్రతిద్రవ్యోల్బణాన్ని కలిగించొచ్చన్నారు. అమెరికా మార్కెట్‌కు దారులు మూసుకుపోవడంతో భారత మార్కెట్‌కు ఎగుమతులకు చైనా ప్రయతి్నంచొచ్చని రాజన్ అంచనా వేశారు. ప్రపంచం మరింత రక్షణాత్మకంగా మారుతుండడంతో వాణిజ్యం విషయంలో తెలివిగా వ్యవహరించాలని సూచించారు. చైనాతో మరింత తటస్థ సంబంధాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. సార్క్, పొరుగు దేశాలతోనూ బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
ట్రంప్ సుంకాల జోరు.. దేశాలన్నీ బేజారు
న్యూఢిల్లీ: అమెరికాకు ‘విముక్తి దినం’గా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతూ వచ్చిన ఏప్రిల్ 2 మిగతా ప్రపంచం పాలిట దుర్దినంగా మిగిలిపోయింది. భారత్‌తో పాటు ఏకంగా 60 పై చిలుకు దేశాలపై ఆయన వాణిజ్య కొరడా ఝళిపించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెను కుదుపుకు లోనైంది. వాళ్లూ, వీళ్లూ అని తేడా చూపకుండా అన్ని దేశాల మీదా 10 నుంచి 50 శాతం దాకా సుంకాలు బాదడం ద్వారా ప్రపంచ వాణిజ్య యుద్ధానికి ట్రంప్ తెర తీశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై బుధవారం సంతకం చేశారు. భారత్‌ను తప్పుడు వాణిజ్య విధానాలు అనుసరిస్తున్న ‘దారుణ దేశం’గా ఈ సందర్భంగా అభివర్ణించారు! అన్నిరకాల భారత ఉత్పత్తుల మీదా 26 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించగా, అనంతరం దాన్ని 27 శాతంగా సవరించారు. అమెరికాకు అత్యవసరమైన ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్లు, పలు ఖనిజాలు తదితరాలను మాత్రం సుంకాల బాదుడు నుంచి మినహాయించారు. అమెరికాలోకి ప్రవేశించే అన్ని వస్తూత్పత్తుల మీదా 10 శాతం బేసిక్ టారిఫ్ విధించారు. ఇది ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తున్న భారత్ తదితర దేశాలను వాణిజ్యపరంగా ‘ధూర్త దేశాలు’గా ట్రంప్ ఆక్షేపిస్తుండటం తెలిసిందే. వాటిపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆ లెక్కన భారత ఉత్పత్తులపై 10 శాతం బేస్‌లైన్ టారిఫ్ ఏప్రిల్ 5 నుంచి, 27 శాతం అదనపు సుంకాల వసూలు ఏప్రిల్ 9 నుంచి మొదలవుతాయి. చైనాపై ఇటీవలే 20 శాతం సుంకాలు విధించగా మరో 34 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ తాజాగా ప్రకటించారు! ట్రంప్ నిర్ణయంతో అమెరికా వార్షిక పన్ను వసూళ్లు ఏటా 60 వేల కోట్ల డాలర్ల మేరకు పెరుగుతాయని వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో అంచనా వేశారు. ట్రంప్ ప్రకటనను దేశాలన్నీ దుయ్యబట్టాయి. అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని యూరోపియన్ యూనియన్, చైనా హెచ్చరించాయి. ట్రంప్ పునరాలోచించాలని పలు దేశాలు విజ్ఞప్తి చేశాయి. దీనిపై భారత్ ఆచితూచి స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ‘‘ట్రంప్‌కు అమెరికా ఫస్ట్ అయితే మోదీకి భారతే ఫస్ట్. దీనిపై ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తాం’’ అన్నారు. ట్రంప్ వలలో మోదీ: కాంగ్రెస్ భారత్‌పై అమెరికా తాజా సుంకాల మోతను మోదీ ప్రభుత్వ వైఫల్యంగా కాంగ్రెస్ అభివర్ణించింది. ‘‘మోదీ తన మిత్రుడంటూ ట్రంప్ ఆప్యాయత కనబరుస్తారు. బహిరంగంగా కౌగిలించుకున్నారు. కానీ తాను పక్కా వ్యాపారినని నిరూపించుకుంటూ మోదీపై చాకచక్యంగా వల విసిరారు. మనవాడు అందులో ఇరుక్కుపోయాడు’’ అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. తాజా సుంకా లు భారత ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తా యని లోక్‌సభలో వి పక్ష నేత రాహుల్‌గాంధీ ఆందోళన వెలిబుచ్చా రు. వీటిని ఎలా ఎదుర్కోనున్నదీ కేంద్రం తక్షణం వివరించాలని డిమాండ్ చేశారు.మెరుగ్గా, బలంగా, దృఢంగా: ట్రంప్ప్రపంచ దేశాలపై తాను విధించిన తాజా సుంకాల మీద ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆపరేషన్ ముగిసింది. రోగి బతికాడు. భేషుగ్గా ఉన్నాడు. చక్కగా కోలుకుంటున్నాడు. మునపటి కంటే పెద్దగా, మెరుగ్గా, బలంగా, ఎన్నడూ లేనంత దృఢంగా తయారవుతాడని తేలింది’’ అని ట్రూత్‌సోషల్‌లో కామెంట్ చేశారు.ఇండియాపై ఇరవై ఆరా, ఇరవై ఏడా? ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత్‌తో పాటు పలు దేశాలపై అమెరికా విధించనున్న తాజా టారిఫ్‌లు ఎంతన్న దానిపై సందిగ్ధత నెలకొంది. భారత్‌తో పాటు 14 దేశాలపై ట్రంప్ ప్రకటించిన సుంకాలకు, అనంతరం వైట్‌హౌస్ విడుదల చేసిన వివరాలకు మధ్య తేడా ఉండటమే ఇందుకు కారణం. ట్రంప్ ప్రకటన అనంతరం ఆయా దేశాలపై టారిఫ్‌లను అమెరికా సవరించడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్ వివరించింది. ఆ మేరకు భారత్‌పైనా సుంకం ఒక శాతం పెరిగింది. దాన్ని 26 శాతంగా ట్రంప్ పేర్కొనగా తర్వాత దాన్ని 27 శాతంగా సవరించారు. గురువారం అనుబంధ ప్రకటనలో వైట్‌హౌస్ ఈ మేరకు పేర్కొంది. భారత్‌తో పాటు దక్షిణకొరియ సహా మొత్తం 14 దేశాలపై సుంకాలను సవరించారు. కెనడా ప్రతీకార సుంకాలు అమెరికా చర్యలకు ప్రతీకారం తప్పదని ఇప్పటికే ప్రకటించిన కెనడా అన్నంత పనీ చేసింది. అమెరికాకు చెందిన ఆటో ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీని ప్రభా వం అమె రికా ఆటో రంగంపై తీవ్రంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.కెనడా, మెక్సికోలకు మినహాయింపుఐఈఈపీఏ స్టాండింగ్ ఆర్డరే కారణంఆ దేశాలపై ఇప్పటికే 25 శాతం బాదుడుడొనాల్డ్ ట్రంప్ వడ్డించిన తాజా సుంకాల నుంచి కెనడా, మెక్సికోలకు మినహాయింపు లభించింది. కైనడా, మెక్సికోలపై భారీ సుంకాలు తప్పవని పదేపదే చెబుతూ వచ్చినా తాజా టారిఫ్‌ల జాబితాలో వాటిని చేర్చలేదు. ఫెంటానిల్, వలసలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ (ఐఈఈపీఏ) కింద స్టాండింగ్ ఆర్డర్ల కారణంగా కెనడా, మెక్సికోలకు కొత్త టారిఫ్‌లు వర్తించవని వైట్‌హౌస్ స్పష్టం చేసింది. అమెరికా–మెక్సికో–కెనడా ఒప్పందం (యూఎస్ఎంసీఏ) కింద అమెరికాలోకి ప్రవేశించే వస్తువులకు కూడా కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే చైనాతో పాటుగా కెనడా, మెక్సికోలపై ట్రంప్ ఇటీవలే 25 శాతం సుంకాలు విధించడం తెలిసిందే. కనుక తాజా మినహాయింపు వాటికి పెద్దగా ఉపశమనం కలిగించబోదు. -
కొంత లాభం.. నష్టం
సాక్షి, అమరావతి: మన దేశం నుంచి జరిగే ఎగుమతులపై సుంకాలను భారీగా పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం కొన్ని రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంటే మరికొన్ని రంగాలకు చేటు చేస్తుందని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై సుంకాలను 27 శాతం పెంచుతూ ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేయడంతో దీని ప్రభావం మన రాష్ట్రంపై ఎలా ఉంటుందన్న దానిపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు.రాష్ట్రం నుంచి అత్యధికంగా అమెరికాకు ఎగుమతయ్యే ఆక్వా వంటి సముద్ర ఉత్పత్తులు, టెక్స్టైల్ రంగాలపై ఈ టారిఫ్ పెంపు భారీ ప్రభావం చూపుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో టారిఫ్‌ల పెంపుతో ఎల్రక్టానిక్స్, ఆభరణాలు, ఫార్మా, పౌల్ట్రీ వంటి రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. 2023–24 సంవత్సరంలో రాష్ట్రం నుంచి మొత్తం రూ.1.67 లక్షల కోట్ల ఎగుమతులు జరగ్గా, అందులో సుమారు రూ.35,000 కోట్లు అమెరికాకే జరిగాయి.రాష్ట్ర ఎగుమతిదారులకు అమెరికా అతిపెద్ద మార్కెట్ కావడంతో ట్రంప్ నిర్ణయ ప్రభావం ఏ విధంగా ఉంటుందన్న దానిపై విస్తృత అధ్యయనం మొదలైంది. టారిఫ్‌ల పెంపుపై ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని, ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల తర్వాత ఈ టారిఫ్‌లు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు. రాష్ట్రంలో సముద్ర ఉత్పత్తుల తర్వాత సుమారు రూ.15,000 కోట్ల ఎగుమతులు జరిగే ఫార్మా రంగాన్ని టారిఫ్ పెంపు నుంచి మినహాయించడంపై ఆ రంగ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా టారిఫ్‌ల పెంపుపై వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఎల్రక్టానిక్స్ తయారీ రంగానికి ఊపు పీఎల్ఐ స్కీంతో ఎల్రక్టానిక్స్ తయారీ రంగం రాష్ట్రంలో ఊపందుకుంది. తైవాన్, చైనాలపై అమెరికా అత్యధికంగా టారిఫ్‌లు పెంచడం మనకు కలిసి వచ్చే అంశం. ఇండియాపై 27 శాతం టారిఫ్ విధిస్తే చైనాపై 54 శాతం విధించడంతో ఎల్రక్టానిక్స్ తయారీకి ఇండియా బెస్ట్‌గా మారే అవకాశముంది.– రవీంద్ర సన్నారెడ్డి, ఎండీ, శ్రీసిటీ. ఇదో చక్కటి అవకాశం రాష్ట్రం నుంచి అమెరికాకు పౌల్ట్రీ ఎగుమతులు చాలా తక్కువ. దీంతో టారిఫ్ పెంపు ప్రభావం ఈ రంగంపై అంతగా కనిపించదు. కానీ మన దేశంతో పోలిస్తే పౌల్ట్రీ ఫీడ్‌లో ప్రధానమైన మొక్కజొన్న చాలా చౌక. దీన్ని ఉపయోగించుకుంటూ కేవలం పౌల్ట్రీ ఎగుమతుల కోసం పౌల్ట్రీ ఫీడ్ తెచ్చుకుంటే ఉత్పత్తి వ్యయం 30–40 శాతం తగ్గిపోతుంది. అప్పుడు ఇతర దేశాల పౌల్ట్రీ పరిశ్రమతో మనం పోటీ పడగలం. – సురేష్ చిట్టూరి, వీసీఎండీ, శ్రీనివాస్ ఫామ్స్. ఇంకా అధ్యయనం జరగాలి స్టీల్, మెటల్స్ రంగాలపై టారిఫ్ ప్రభావం ఎంత అన్నది ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి. మన రాష్ట్రం నుంచి అమెరికాకు లోహాల ఎగుమతులు నామమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు వివిధ దేశాలపై చెబుతున్న టారిఫ్ శాతాలపై కొంత గందరగోళం ఉంది. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. – నీరజ్ శర్దా, డిప్యూటీ ఎండీ, శర్ద మెటల్స్ అండ్ అల్లాయిస్ దెబ్బ మీద దెబ్బ పలు దేశాల మధ్య యుద్ధాలు, రాజకీయ అనిశ్చితులతో టెక్స్టైల్ రంగం దెబ్బతింది. అమెరికా టారిఫ్‌ల పెంపుతో ఎగుమతులు పడిపోతాయి. భారత్‌తో పోలిస్తే ఇతర దేశాల్లో పత్తి ధర చాలా తక్కువ. ఇక్కడ పత్తిని కొని ఎగుమతులు చేయలేకపోతున్నాం. పోనీ.. దిగుమతి చేసుకుందామా అంటే భారత్ పత్తి దిగుమతులపై భారీగా సుంకాలను విధిస్తోంది. దీంతో టెక్స్టైల్ పరిశ్రమలు మూతపడే స్థితికి వస్తుంది. – లంకా రఘురామి రెడ్డి, గౌరవాధ్యక్షుడు, ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ -
బుల్లి పేస్ మేకర్
ప్రపంచంలోనే అత్యంత సూక్ష్మమైన, బియ్యం గింజ కంటే కూడా బుల్లి పేస్ మేకర్‌ను అమెరికా పరిశోధకులు అభివృద్ధి పరిచారు. నార్త్వెస్ట్ర్న్ యూ నివర్సిటీకి చెందిన ఇంజనీర్లు గుండెను కృత్రిమంగా పనిచేయించే ఈ చిన్న పరికరాన్ని రూపొందించారు. ఉపయో గం తీరాక శరీరంలోనే కలిసిపోవడం దీని మరో ప్రత్యేకత. శరీరంపై గాటు పెట్టాల్సిన అవసరమేమీ లేకుండా ఇంజెక్షన్ ద్వారానే దీనిని లోపలికి పంపించేయొచ్చు. జర్నల్ నేచర్‌లో ఈ వివరాలు తాజాగా ప్రచురితమయ్యాయి. తాత్కాలిక అవసరాలు కలిగిన శిశువులకు ఇది ఎంతో ఉపయోగకరమని నిపుణులు అంటున్నారు. ‘మేం రూపకల్పన చేసిన ఈ డివైజ్ ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన పేస్ మేకర్‌గా భావిస్తున్నాం’అని నార్త్‌వెస్టర్న్ బయో ఎల్రక్టానిక్స్ నిపుణుడు, బృంద సారథి జాన్ ఎ.రోజెర్స్ చెప్పారు. ‘ముఖ్యంగా పీడియాట్రిక్ గుండె సర్జరీలకు సూక్ష్మంగా ఉండటం ఎంతో కీలకం. పేస్ మేకర్ ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది’అని ఆయన చెప్పారు. చిన్నారులను దృష్టిలో ఉంచుకునే ఈ డివైజ్‌ను రూపొందించామని నార్త్‌వెస్టర్న్ కార్డియాలజిస్ట్ ఇగోర్ ఎఫిమోవ్ చెప్పారు. ‘దాదాపు ఒక శాతం శిశువులు పుట్టుకతోనే గుండె సంబంధ లోపాలతో ఉంటున్నా రు. సర్జరీ తర్వాత వీరికి తాత్కాలిక పేస్ మేకర్ అవసరమవుతుంది. దాదాపు వారం పాటు వీరి గుండెలు సొంతంగా రిపేర్ చేసుకుంటాయి. ఆ కీలకమైన సమయంలో ఈ చిన్న పేస్ మేకర్ వారికి సహాయకారిగా ఉంటుంది. ఆ తర్వాత అది శరీరంలో కలిసిపోతుంది. దీనిని తొలగించడానికి మరో సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు’అని ఎఫిమోవ్ వివరించారు. ఇదెలా పని చేస్తుందంటే..? ఛాతీపైన అమర్చే చాలా చిన్నగా ఉండే ఫ్లెక్సిబుల్, వైర్లెస్ ప్యాచ్‌లో ఈ పేస్ మేకర్ ఉంటుంది. గుండె స్పందనలు క్రమం తప్పినట్లు గుర్తించిన వెంటనే పేస్ మేకర్‌కు ఈ ప్యాచ్ సిగ్నల్ పంపించి, దానిని యాక్టివేట్ చేస్తుంది. ఇది ఇచ్చే సున్నితమైన స్పందనలు శరీరం, కండరాల ద్వారా అంది గుండె లయను క్రమబద్ధం చేస్తాయి. ఇందులోని అత్యంత సూక్ష్మమైన బ్యాటరీ శరీరంలోని ఫ్లూయిడ్లను ఉపయోగించుకుని విద్యుత్ శక్తిని తయారు చేస్తుంది. దీనికి సాధారణంగా ఉండే ఎలాంటి వైర్లు అవసరం లేదు. దీని వల్ల ఇది చాలా సురక్షితంగా ఉంటుంది. సులభంగా పనిచేస్తుంది. ఇప్పటి వరకు తయారైన పేస్ మేకర్లు రేడియో సిగ్నళ్లపై ఆధారపడగా, ఈ కొత్త డివైజ్ కేవలం కాంతిని ఉపయోగించుకుని గుండె లయను నియంత్రించ గలుగుతుందని రోజెర్స్ చెప్పారు. జంతువులపైన, దాతల ద్వారా అందిన గుండెలపైన చేసిన ప్రయోగాలు సత్ఫలితాలనిచ్చాయని చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డోజ్ నుంచి వైదొలగను: మస్క్
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ బాధ్యతల నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) సారథ్యం నుంచి వైదొలగుతున్నట్లు వస్తున్న వార్తలను టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఖండించారు. ‘‘అవన్నీ పుకార్లే. పని పూర్తయ్యేదాకా పదవిలో కొనసాగుతా’’అని ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు. వైట్‌హౌస్ కూడా ఈ వార్తలను ఖండించింది. ‘‘అవన్నీ చెత్త వార్తల. పదవీకాలం పూర్తయ్యాకే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతారు. మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఈ మేరకు గతంలోనే బహిరంగంగా ప్రకటించారు’’అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ అన్నారు. ట్రంప్ అంతర్గత వ్యవహారాల నుంచి మస్క్ పూర్తిగా తప్పుకుంటారని ఎవరైనా అనుకుంటే అది వాళ్లను వాళ్లు మోసగించుకోవడమేనని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరన్నారు. డోజ్ నుంచి మస్క్ కొద్ది వారాల్లో తప్పుకుంటారని ట్రంప్ స్వయంగా కేబినెట్‌కు తెలిపినట్లు పొలిటికో నివేదిక పేర్కొనడం తెలిసిందే. ‘‘ఆయన త్వరలో సొంత వ్యాపారాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. అందుకు ట్రంప్ కూడా అంగీకరించారు. మస్క్ ఇక అనధికారిక సలహాదారు పాత్ర పోషిస్తారు’’అని చెప్పుకొచ్చింది. జనవరిలో డోజ్ బాధ్యతలు చేపట్టిన మస్క్ ఫెడరల్ వ్యయాలను తగ్గింపు, ప్రభుత్వోద్యోగుల ఉద్వాసనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను సమూలంగా మెరుగు పరచడానికి ఈ చర్యలు అవసరమంటున్నారు. ఆయన నాయకత్వంలో డోజ్ ఇప్పటికే ప్రభుత్వ కాంట్రాక్టులు, శ్రామిక శక్తిలో భారీ కోతలు పెట్టింది. ఇవన్నీ అంతిమంగా ప్రభుత్వానికి లక్ష కోట్ల డాలర్ల దాకా ఆదా చేయగలవని పలు నివేదికలు అంచనా వేస్తునఆనయి. ప్రత్యేక ప్రభుత్వోద్యోగిగా మస్క్ పదవీకాలం మే నెలాఖరుతో ముగియనుందని భావిస్తున్నారు. ఆలోగా ఫెడరల్ వ్యయాన్ని లక్ష కోట్ల డాలర్ల మేరకు తగ్గించే పనిని పూర్తి చేయగలనని ఆయన చెబుతున్నారు. -
నోబెల్ గ్రహీత వీసా రద్దు
శాన్‌జోస్: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, కోస్టారికా మాజీ అధ్యక్షుడు ఆస్కార్ అరియాస్ (84) వీసాను అమెరికా రద్దు చేసింది. దీనిపై అరియాస్ ఆశ్చర్యం వెలిబుచ్చారు. రద్దుకు కారణమేమిటో తనకు తెలియదని కోస్టారికా రాజధాని శాన్ జోస్‌లో మీడియాతో అన్నారు. ‘‘వీసా రద్దు చేస్తున్నట్టు అమెరికా అధికారులు మెయిల్ పంపారు. కానీ ఈ విషయమై ఎలాంటి వివరణా ఇవ్వలేదు’’అని చెప్పారు. ‘‘అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును రోమన్ చక్రవర్తితో పోలుస్తూ నేను బహిరంగ విమర్శలు చేశా. నేను అధ్యక్షుడిగా ఉండగా చైనాతో కోస్టారికా దౌత్య బంధాన్ని పునరుద్ధరించా. బహుశా ఇవన్నీ కారణమై ఉంటాయి’’అని అభిప్రాయపడ్డారు. సెంట్రల్ అమెరికాలో ఘర్షణల నివారణకు చేసిన కృషికి అరియాస్కు 1987లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది. ఆయన 1986–1990, 2006–2010 మధ్య ఎనిమిదేళ్లు కోస్టారికా అధ్యక్షుడిగా ఉన్నారు. రెండో పదవీకాలంలో అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రోత్సహించారు. 2007లో తైవాన్‌కు దూరమై చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నారు. కోస్టారికా అధ్యక్షుడు రోడ్రిగో చావెజ్ అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి దేశంలో 5జీ సదుపాయాల అభివృద్ధి పనుల నుంచి చైనా సంస్థలను పక్కన పెట్టారు. దీన్ని వ్యతిరేకించిన ముగ్గురు కోస్టారిక చట్టసభ సభ్యుల వీసాలను అమెరికా రద్దు చేసింది. ఈ పరిణామాలపై అరియాస్ మండిపడ్డారు. అమెరికా ఒత్తిడికి రోడ్రిగో లొంగుతున్నారని సోషల్ మీడియా వేదికగా దుయ్యబట్టారు. ‘‘ఒక చిన్న దేశం అమెరికాతో విభేదించడం సులువు కాదు. అందులోనూ అమెరికా అధ్యక్షుడు రోమన్ చక్రవర్తిలా ప్రవర్తిస్తూ మిగతా ప్రపంచానికి ఏం చేయాలో, ఏం చేయొద్దో పొద్దస్తమానం చెబుతున్నప్పుడు మరింత కష్టం’’అంటూ ఎద్దేవా చేశారు. కోస్టారికాకు చెందిన మరో ప్రతిపక్ష శాసనసభ్యురాలి వీసాను కూడా అమెరికా మంగళవారం రద్దు చేసింది. -
H1B visa: దిగ్గజ టెక్ కంపెనీల హెచ్చరిక.. ఉద్యోగుల గుండెల్లో గుబులు
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా నలబైమూడు దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ కంపెనీలు హెచ్1బీ వీసా ఉద్యోగుల్ని అప్రమత్తం చేశాయి. ట్రంప్ ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలకు భయపడి దేశాన్ని విడిచి వెళతారేమో.. ఆ పనిచేయొద్దని సూచిస్తున్నాయి. అమెరికా వీడే హెచ్1బీ వీసా దారులు భవిష్యత్‌లో తిరిగి ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుందో,రాదోనన్న అనుమానాల్ని వ్యక్తమవుతున్న తరుణంలో ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశాయి. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. అమెరికాలో దిగ్గజ టెక్ కంపెనీలు అమెజాన్, మైక్రోసాఫ్ట్, యాపిల్ ఐటీ కంపెనీలు తమ హెచ్1బీ వీసా ఉద్యోగుల్ని అలెర్ట్ చేశాయి. దేశాన్ని విడిచి వెళ్లే ప్రయత్నం చేయొద్దని సూచించాయి. అమెరికా వదలిసే వారి సొంత దేశాలకు వెళితే.. అలాంటి వారిని అమెరికా ఆహ్వానించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ హైలెట్ చేసింది.అయితే, హెచ్1బీ వీసాల విషయంలో కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు జన్మత: పౌరసత్వాన్ని రద్దు అమలైతే.. వారి పిల్లలకు ఏ దేశంలోనూ పౌరసత్వం లేకుండా పోయే అవకాశం ఉండదనే ఆందోళన చెందుతున్నారు. అమెరికా పౌరసత్వం లేకపోతే అమెరికాలో అక్రమంగా ఉన్నట్లే కదా అని మాట్లాడుతున్నారు. అమెరికా ప్రభుత్వం హెచ్1బీ ప్రోగ్రామ్ కింద ప్రతి ఏడాది లాటరీ సిస్టం ద్వారా 65,000 వీసాలను విదేశీయులకు అందిస్తుంది. ఈ వీసా ఉన్న ఉద్యోగులు అమెరికాలో ఉన్నత ఉద్యోగులు, ఆ దేశం ఆర్థికంగా వృద్ధి సాధించేందుకు దోహదం చేస్తుంటారు. ఈ వీసా ఎక్కువ మంది భారతీయులకు ఇవ్వగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా, కెనడా పౌరులకు అందిస్తుంది. హెచ్1బీ వీసా దారుల్ని అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ యాపిల్ కంపెనీలు నియమించుకోవడంలో ముందంజలో ఉన్నాయి. ట్రంప్ కఠినమైన వీసా నియమాల్ని అమలు చేయడం వల్లే ఏర్పడిన అనిశ్చితితో హెచ్1బీ వీసా దారులు మరిన్ని కష్టాల్ని ఎదుర్కోనున్నట్లు నివేదకలు తెలిపాయి. -
‘మోదీ జీ.. ఇది మీ కారణంగానే సాధ్యమైంది: బీఆర్ఎస్ ఎంపీ
న్యూఢిల్లీ: ఫార్మా ఉత్పత్తులపై కొత్తగా అమల్లోకి రాబోతున్న యూఎస్ టారిఫ్ ల నుంచి మినహాయింపు రావడంపై హెటిరో డ్రగ్స్ అధినేత, బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. యూఎస్ టారిఫ్‌ల నుంచి ఫార్మా ఉత్పత్తులకు మినహాయింపు రావడానికి ప్రధాని మోదీనే కారణమన్నారు. ‘మోదీ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైంది. టారిఫ్ మినహాయింపుల వల్ల ఫార్మా ఎగుమతులు పెరుగుతాయి. దీని వల్ల దేశానికి మరింత లాభం చేకూరుతుంది’ అని లేఖలో పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెప్పుకొచ్చారు ట్రంప్,. అయితే యూఎస్ కు ఫార్మా ఎగుమతులు చేసే దేశాల జాబితాలో ఒక కీలక దేశంగా ఉన్న భారత్ కు ... ఇందులో మినహాయింపు ఇచ్చారు. -
ఎగుమతులకు టారిఫ్‌ల గండం
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార టారిఫ్‌ల ప్రతిపాదనలతో చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) ఎగుమతులకు ప్రతికూలంగా ఉంటుందని ఎగుమతిదారుల్లో ఆందోళన నెలకొంది. దీని వల్ల స్వల్పకాలికంగా ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు.10 శాతం వరకు సుంకాలు ఫర్వాలేదని, అంతకు మించితే మాత్రం ఇబ్బందేనని ఆయన పేర్కొన్నారు. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు డిమాండ్‌పై టారిఫ్‌ల ప్రభావం కచ్చితంగా ఉంటుందన్నారు. దిగుమతి సుంకాలపై అనిశ్చితి వల్ల ఇప్పటికే కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లివ్వకుండా తాత్కాలికంగా ఆపి ఉంచారని రాల్హన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని పరిస్థితిని సరిదిద్దాలని, టారిఫ్‌ల సమస్యను ఎదుర్కొనడంలో ఎగుమతిదార్లకు మద్దతుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. -
ట్రంప్ సుంకాల మోత, సోషల్ మీడియాలో మీమ్స్ హోరు మాములుగా లేదు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు అన్ని దేశాలపై నా టారిఫ్స్ కొరడా ఝుళిపింఆడు. దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై "రెసిప్రోకల్ టారిఫ్స్" (Reciprocal Tariffs) విధించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని.. అయితే కనీసం 10శాతం పన్నులు(Tariffs) చెల్లించాల్సింది ఉంటుందని ప్రకటించారు. భారత్ నుంచి దిగుమతి వస్తువులపై 26శాతం, చైనా నుండి వచ్చే వస్తువులపై 34 శాతం పన్ను విధించారు. దీంతో చైనా మొత్తం పన్నుల శాతం 54 శాతానికి చేరింది. ఇక సౌత్ కొరియాపై 25 శాతం యూరోపియన్ యూనియన్ నుండి వచ్చే వస్తువులపై 20 శాతం పన్ను విధించారు. యూకే వచ్చే వస్తువులపై 10 శాతం పన్ను విధించారు. ట్రంప్ తాజా ప్రకటనపై పలు దేశాధినేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కూడా. మరోవైపు ట్రంప్ వడ్డింపులపై సోషల్‌మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, వృద్ధికోసం దాని మిత్రదేశాలు సహా దాదాపు అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను విధించారు ట్రంప్. ఎవరూ ఆపలేని ఆర్థిక యుద్ధం జరుగుతోందంటూ జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించి, సుంకాలను ప్రకటించిన వెంటనే #TrumpTariffs , #TradeWar ఎక్స్( X)లో ట్రెండింగ్ షురూ అయింది. Happy Liberation Day! Thanks Trump for ensuring that we become liberated from our money. I personally will miss being able to buy food. So when Trump said he was going to make America great again, I guess he meant he was gonna take us back to the Great Depression? #trumptariffs— Meredith (@meralee727) April 2, 2025 చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?"విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు! మన డబ్బు నుండి మనం విముక్తి పొందేలా చేసినందుకు ట్రంప్ ధన్యవాదాలు. ఇకనాకు బువ్వ ఉండదు. అమెరికా గ్రేట్ ఎగైన్ అంటే మనల్ని తిరిగి మహా మాంద్యంలోకి తీసుకెళ్లడం అని అనుకున్నాడనుకుంట’’ అని ఒకరు ట్వీట్ చేశారు. జపాన్ ఎగుమతులపై 24 శాతం సుంకాలు విధించినందుకు ట్రంప్‌ను విమర్శిస్తూ,"సరైన మనస్సు గల జపనీస్ వ్యక్తి అమెరికన్ కారును ఎందుకు కొనుగోలు చేయాలి?" అని ప్రశ్నించారు.Happy Liberation Day! Thanks Trump for ensuring that we become liberated from our money. I personally will miss being able to buy food. So when Trump said he was going to make America great again, I guess he meant he was gonna take us back to the Great Depression? #trumptariffs— Meredith (@meralee727) April 2, 2025 చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఅంతేకాదు ఈ సుంకాల నుండి రష్యాను మినహాయించినందుకు నెటిజన్లు ట్రంప్‌ను కూడా ఎగతాళి చేశారు. "ట్రంప్ రష్యాపై విధించిన సుంకాలు లేదా ఆర్థిక చర్యలు లేవు. నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది" అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నవ్వుతూ ఉన్న జిఫ్‌ను ట్విట్ చేశాడు. "ట్రంప్స్టర్స్ శుభవార్త! మీ కిరాణా సామాగ్రికి ఎంత మిగులుతుందో గుర్తించడం కష్టం.. ఎందుకంటే మిగతాటికి ఖర్చులు మరింత భారం అవుతాయి కనుక’’ అంటూ మరొక యూజర్ ట్రంప్ సుంకాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. -
ట్రంప్ టారిఫ్స్: మనుషుల్లేని దీవులపై 10 శాతం సుంకం
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) దాదాపు అన్ని దేశాలపైన సుంకాలు విధించారు. మనుషులున్న దేశాలు లేదా ప్రాంతాలపై సుంకాలు విధిస్తే సరే అనుకోవచ్చు.. కానీ మనుషులే లేని దీవులపై కూడా సుంకాలు విధించడం చర్చనీయాంశమైంది.ట్రంప్ సుంకాలు విధించిన ప్రాంతాల జాబితాలో.. ఆస్ట్రేలియా ప్రభుత్వం అధీనంలో ఉన్న హియర్డ్ ఐలాండ్, మెక్‌డొనాల్డ్ దీవులు కూడా ఉన్నాయి. నిజానికి ఈ దీవులు పెంగ్విన్ పక్షులు, సీల్స్, వివిధ పక్షి జాతులకు మాత్రమే నిలయం. ఈ దీవులపై ట్రంప్ సుంకాలను విధించారు.. కానీ ఎందుకు విధించారనే సంగతి చెప్పలేదు.ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు సుమారు 4100 కిమీ దూరంలో ఉన్న ఈ హియర్డ్ ఐలాండ్, మెక్‌డొనాల్డ్ దీవులు 1947 నుంచి ఆస్ట్రేలియా భూభాగంగా ఉన్నాయి. భూమిపై అత్యంత మారుమూల ఉన్న ఈ ప్రాంతాల్లో జనావాసం ఉండదు. ఈ దీవులను సముద్రం ద్వారా మాత్రమే చేరుకోవచ్చు. ఆస్ట్రేలియా నుంచి ప్రత్యేక నౌకలను ఉపయోగించి ప్రయాణం చేయడానికి దాదాపు రెండు వారాలు పడుతుంది.ఎవరూ నివసించని దీవులపై ట్రంప్ ప్రభుత్వం 10 శాతం సుంకం విధించడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు పెంగ్విన్ పక్షుల నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారా? అని ఒకరు కామెంట్ చేస్తే.. అమెరికా ఇప్పుడు చేపలపై కూడా సుంకాలు విధిస్తోందని మరొకరు కామెంట్ చేశారు.భారత్‌పై 26 శాతంప్రపంచంలోని చాలా దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్ భారతదేశం మీద కూడా 26 శాతం సుంకం ప్రకటయించారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాలలో తాము సగం మాత్రమే విధిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ మామీద 52 శాతం సుంకం విధించింది. మేము ఇండియాపై 26 శాతం సుంకం విధిస్తున్నామని ఆయన అన్నారు. అమెరికా అత్యధిక సుంకం విధించిన దేశాలలో కంబోడియా (49 శాతం) ఉంది.Trump administration has put a 10 percent tariff on the Heard and McDonald Islands….which has a population of 0 people and is inhabited only by penguins. pic.twitter.com/oSx7LyU0b3— MaineWonk (@TheMaineWonk) April 2, 2025 -
ట్రంప్ మార్క్ ప్రతీకారం.. భారత్‌కు స్వల్ప ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్టుగానే ప్రపంచ దేశాలకు షాకిచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల బాంబు పేల్చారు. విదేశీ ఉత్పత్తులపై భారీగా సుంకాలు వడ్డించారు. భారతదేశ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ వసూలు చేయనున్నట్లు ప్రకటించారు. అన్ని దేశాల నుంచి దిగుమతి అయ్యే అటోమొబైల్స్‌పై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తేల్చిచెప్పారు. ప్రతీకార సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీ గురించి ట్రంప్ ప్రస్తావించారు. తనకు మోదీ గొప్ప స్నేహితుడని చెబుతూనే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదన్నారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని ట్రంప్ అన్నారు. అయితే, పలు దేశాలపై ప్రతీకార సుంకాలను విధించిన ట్రంప్.. రష్యా, ఉత్తర కొరియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఈ రెండు దేశాలపై ఎలాంటి సుంకాలు విధించలేదు. ఏప్రిల్ 2వ తేదీని అమెరికా ‘విముక్తి దినం’గా ప్రకటించిన ట్రంప్ బుధవారం వాషింగ్టన్లో మీడియాతో మాట్లాడారు. వైట్‌హౌస్‌లోని రోజ్ గార్డెన్లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడుతూ..‘ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా వ్యాపారం ఈరోజు పునర్జన్మించినట్లు అయింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా గుర్తుండబోతుంది. సుంకాల పేరుతో అమెరికాను చాలా ఏళ్లుగా మోసగాళ్లు ఉపయోగించుకున్నారు. ఇక అది జరగదు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తాం. అమెరికాకు ఈ రోజు నిజమైన ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చింది.🚨 It’s official. Donald Trump has signed 25% tariffs on our closest trade partners and allies. Friendly reminder that tariffs were a contributing factor for the Great Depression. pic.twitter.com/hlBNCcwyMu— CALL TO ACTIVISM (@CalltoActivism) April 2, 2025ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చింది. సుంకాల ప్రకటనతో అమెరికాలో మళ్లీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు తిరిగి వెనక్కి వస్తాయి. విదేశీ మార్కెట్లకు ద్వారాలు తెరుస్తాం. అమెరికాలో పోటీతత్వం పెరిగి సరసమైన ధరల్లో వస్తువులు లభిస్తాయి. దీంతో అమెరికా స్వర్ణయుగమవుతుంది. దశాబ్దాలుగా వాణిజ్య అడ్డంకులను అమెరికా తొలగిస్తూ వచ్చింది. కానీ పలు దేశాలు అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలను విధిస్తూ వచ్చాయి. పలు దేశాలు అన్యాయమైన నియమాలను అవలంభించాయి.US President Donald Trump announced 26% import duty on India… India 26%National interest first, friendship....#TrumpTariffs pic.twitter.com/ySlvRkIYzs— Equilibrium (@abatiyaashii) April 3, 2025అమెరికాలో దిగుమతి అవుతున్న మోటారు సైకిళ్లపై కేవలం 2.4 శాతమే పన్నులు విధిస్తున్నారు. అదే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ద్విచక్రవాహనాలపై 60 శాతం, భారత్ 70 శాతం, వియత్నాం 75 శాతం సుంకాలు విధిస్తున్నాయి. వాణిజ్య విషయానికి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడు సైతం శత్రువు కంటే ప్రమాదకరం. అందుకే అన్ని విదేశీ తయారీ ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి విధించనున్నాం. అమెరికాలో ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలపై ఎలాంటి పన్నులు వసూలు చేయం.అమెరికా ప్రతీకార సుంకాలు ఇలా..భారత్: 26 శాతంయూకే: 10 శాతంఆస్ట్రేలియా: 10 శాతంకొలంబియా: 10 శాతంచిలి: 10 శాతంబ్రెజిల్: 10 శాతంసింగపూర్: 10 శాతంటర్కీ: 10 శాతంఇజ్రాయెల్: 17 శాతంపిలిఫ్ఫీన్స్: 17 శాతంఈయూ: 20 శాతంమలేషియా: 24 శాతంజపాన్: 24 శాతం దక్షిణ కొరియా: 25 శాతంపాకిస్థాన్: 29 శాతం దక్షిణాఫ్రికా: 30 శాతంస్విట్జర్లాండ్: 31 శాతంఇండోనేషియా: 32 శాతంతైవాన్: 32 శాతంచైనా: 34 శాతంథాయిలాండ్: 36 శాతంబంగ్లాదేశ్ 37 శాతంశ్రీలంక: 44 శాతంకంబోడియా: 49 శాతంఈ కార్యక్రమానికి కేబినెట్ సభ్యులతో పాటు స్టీల్, ఆటోమొబైల్ కార్మికులను ట్రంప్ ఆహ్వానించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందన్నారు. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. ఆయా దేశాలపై జాలితోనే ఇలా సగం సుంకాలు ప్రకటించినట్లు తెలిపారు. వీటిని రాయితీ టారిఫ్‌లుగా ట్రంప్ పేర్కొన్నారు.México , México ,México Aquí buscándolo en la lista de aranceles de Donald Trump pic.twitter.com/nouS1sMg7j— Carlos Suárez E (@Caloshhh) April 2, 2025 -
సుంకాల మోత మోగించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
-
ఇరాన్ ను నాశనం చేసే అస్త్రం అమెరికా ప్రయోగించనుందా?
-
ఇంకాస్త శుద్ధి చేస్తే చాలు.. అర డజన్ అణుబాంబులు!
అమెరికాతో చర్చలకు ఇరాన్ రాని పక్షంలో.. ఒకవేళ మంతనాలకు ఇరాన్ వచ్చినా చర్చలు విఫలమయ్యే పక్షంలో.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపేందుకు ఇరాన్ భూభాగంపై లక్ష్యాలుగా ఎంచుకునే మూడు కీలక అణు స్థావరాలు.. నతాంజ్, ఫర్దో, ఇస్ఫహాన్. ఒక చోట అని కాకుండా ఇరాన్ గడ్డపై పలు ప్రాంతాల్లో అణు కార్యక్రమం కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ నుంచి వైమానిక దాడుల ముప్పు పొంచివున్న నేపథ్యంలో రక్షణ కోసం కొన్ని అణు స్థావరాలను భూగర్భంలో ఇరాన్ నిర్మించుకుంది. అంతర్జాతీయ ఆంక్షల నుంచి ఉపశమనం కోసం ఇరాన్ 2015లో పీ5 (పర్మినెంట్5/ఐరాసలో శాశ్వత సభ్యత్వం గల) దేశాలతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం అణు కార్యక్రమాన్ని చాలావరకు నిలిపివేసేందుకు ఇరాన్ ఒప్పుకుంది. అంతేకాకుండా తమ అణు స్థావరాల్లో అంతర్జాతీయ తనిఖీలను అనుమతించేందుకు అంగీకరించింది. ఒప్పందం అమల్లో ఉన్నా ఇరాన్ అణు కార్యక్రమానికి బ్రేక్ పడలేదన్న కారణంతో ట్రంప్ తొలి హయాంలో 2018లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇదే అదనుగా ఇరాన్ కూడా తమ అణు కార్యక్రమంపై ఆయా దేశాలు విధించిన ఆంక్షలను ఆ మరుసటి ఏడాది నుంచి విస్మరించడం ఆరంభించింది. అలా ఒప్పందం విచ్ఛిన్నమవడంతో యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్ విస్తరించింది. భారీ అణుశక్తి..2015 నాటి ఒప్పందం అమలైతే ఇరాన్ అణుబాంబు తయారీకి కావాల్సిన వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి కనీసం సంవత్సర కాలం పట్టేది. ఎప్పుడైతే ఒప్పందం విఫలమైందో ఆ వెంటనే యురేనియం శుద్ధిని ఇరాన్ వేగవంతం చేసింది. ఫలితంగా వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తి కాలాన్ని ఏడాది నుంచి కొన్ని రోజులు లేదా కొన్ని వారాల వ్యవధికి ఇరాన్ గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇరాన్ ప్రస్తుతం రెండు ప్రదేశాల్లో యురేనియంను 60% ఫిజైల్ ప్యూరిటీ వరకు శుద్ధి చేస్తోంది. దీని అర్థం 90% వెపన్స్ గ్రేడ్ యురేనియం ఉత్పత్తికి ఇరాన్ చేరువైనట్టే. శుద్ధితో యురేనియం స్వచ్ఛత పెరిగేకొద్దీ కేంద్రక విచ్ఛిత్తి (విస్ఫోటన) సామర్థ్యం అధికమవుతుంది. సైద్ధాంతికంగా చూస్తే.. యురేనియం శుద్ధిని మరింత కొనసాగిస్తే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లెక్కల్లో చెప్పాలంటే.. ఇప్పుడు ఇరాన్ దగ్గరున్న యురేనియంతో ఆరు అణుబాంబులు రెడీ అవుతాయి!.నతాంజ్.. భూగర్భంలో మూడంతస్తులు! రాజధాని టెహ్రాన్ నగరానికి దక్షిణంగా నతాంజ్ వద్ద భూగర్భంలో ఒకటి (ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్), భూమి ఉపరితలంపై ఒకటి (పైలట్ ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్) చొప్పున రెండు యురేనియం శుద్ధి ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో భూగర్భ ప్లాంటులో ప్రస్తుతం 16 వేల సెంట్రీఫ్యూజెస్ ఉండగా 13 వేల సెంట్రీఫ్యూజెస్ పనిచేస్తున్నాయి. ఇవి యురేనియంను 5% స్వచ్ఛత వరకు శుద్ధి చేస్తున్నాయి. భూగర్భంలో మూడు అంతస్తుల్లో ఈ ప్లాంట్ ఉంది. ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఈ భూగర్భ స్థావరాన్ని ఎంతవరకు నాశనం చేయగలవనేది ప్రశ్నార్థకం. ఇక భూ ఉపరితలంపై ఉన్న ప్లాంటులో వందల సెంట్రీఫ్యూజెస్ మాత్రమే ఉన్నప్పటికీ 60% స్వచ్ఛత వరకు యురేనియంను ఇరాన్ శుద్ధి చేస్తోంది. ఏమిటీ సెంట్రీఫ్యూజెస్? యురేనియం శుద్ధి ప్రక్రియలో సెంట్రీఫ్యూజెస్ పాత్ర కీలకం. సహజ యురేనియంలో యురేనియం-238 అధికంగా, యురేనియం-235 స్వల్పంగా (0.7%) ఉంటాయి. అణు ఇంధనం తయారీకి ఎక్కువ గాఢతతో కూడిన యురేనియం-235 కావాలి. యురేనియం-238 నుంచి యురేనియం-235ను వేరుచేయడానికి అపకేంద్ర బలాన్ని సెంట్రీఫ్యూజెస్ ఉపయోగించుకుంటాయి. సెంట్రీఫ్యూజెస్ నిమిషానికి 50 వేల రౌండ్లు తిరుగుతాయి. ఈ ప్రక్రియలో భార అణువులు కేంద్రానికి దూరంగా తోసివేయబడితే, తేలికపాటి అణువులు కేంద్రానికి దగ్గరగా వస్తాయి. యురేనియంను వాయువు (యూఎఫ్6)గా మార్చి వేగంగా తిరిగే సిలిండర్ల (సెంట్రీఫ్యూజెస్)లోకి పంపుతారు. అధిక సాంద్రతతో కూడిన యురేనియం-238 గల భార యూఎఫ్6 అణువులు ఆ సిలిండర్ల వెలుపలి అంచుల వద్దకు, అల్ప సాంద్రతతో కూడిన యురేనియం-235 గల తేలికపాటి యూఎఫ్6 అణువులు కేంద్రం వద్దకు చేరతాయి. అలా యురేనియం-235ను వేరుచేసి తర్వాత దశకు పంపుతారు. బాగా శుద్ధి అయిన (హైలీ ఎన్రిచ్ద్) యురేనియంను అణ్వాయుధాల తయారీలోనూ, అల్ప శుద్ధి (లో ఎన్రిచ్ద్) యురేనియంను అణు రియాక్టర్లలో వినియోగిస్తారు. Telegraph: Current US bombs not enough to penetrate Iran's nuclear facilities!The American B-2 bomber can penetrate to a depth of 61 meters, but the Natanz and Fordow nuclear facilities in Iran are built at a depth of 80 to 100 meters.In addition, Iran's facilities are… pic.twitter.com/lcDi8GMKAN— Sprinter Observer (@SprinterObserve) December 24, 2024ఫర్దో.. పర్వతగర్భంలో! భద్రత పరంగా నతాంజ్ భూగర్భ ప్లాంటు కంటే ఫర్దోలోని యురేనియం శుద్ధి కేంద్రం ఉత్తమమైనది. ఎందుకంటే దీన్ని పర్వతాన్ని తొలిచి నిర్మించారు. ఇక్కడ రెండు వేల దాకా సెంట్రీఫ్యూజెస్ పనిచేస్తున్నాయి. వీటిలో ఎక్కువగా మూడో తరానికి చెందిన అత్యాధునిక ఐఆర్-6 సెంట్రీఫ్యూజ్ యంత్రాలను వినియోగిస్తుండటం విశేషం. ఇస్ఫహాన్.. శుద్ధి చేసిన యురేనియం నిల్వ! దేశంలో రెండో అతి పెద్ద నగరం ఇస్ఫహాన్. ఇరాన్ ఇక్కడ భారీ న్యూక్లియర్ టెక్నాలజీ కేంద్రాన్ని నెలకొల్పింది. ఫ్యూయెల్ ప్లేట్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్, యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ ఉన్నాయి. ఈ ఫెసిలిటీలో యురేనియంను ‘యురేనియం హెక్సాఫ్లోరైడ్ (యూఎఫ్6)గా మార్చి సెంట్రీఫ్యూజెస్ యంత్రాల్లోకి పంపుతారు. శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ ఇక్కడే నిల్వ చేస్తుంది.-జమ్ముల శ్రీకాంత్.Natanz for uranium enrichment. Underground enrichment facility of this center is protected by a concrete shield with a thickness of approximately 7.6 meters📍33°43'29.8"N 51°43'33.9" pic.twitter.com/jHffMnchWE— 𝓂𝒶𝓇𝒾𝑜🇱🇧🇬🇧🇦🇪 (@MarioLeb79) March 31, 2025 -
‘విముక్తి’ తీరుతెన్నులెలా?!
‘అమెరికా విముక్తి దినం’గా ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన రోజు రానేవచ్చింది. ఇన్నాళ్లూ ‘అన్యాయమైన సుంకాల’తో ‘అధ్వాన్నమైపోయిన’ అమెరికాకు ఏప్రిల్ 2 (బుధవారం) నుంచి విముక్తి లభించి, లక్షల కోట్ల డాలర్లు ఆర్జించి పెట్టగల ప్రతి సుంకాల మోత మోగబోతున్నదని దేశ ప్రజలను ఆయన ఊరిస్తున్నారు. విలక్షణమైన ప్రకటనలతో ఏకకాలంలో తన భక్త గణాన్నీ, ప్రత్యర్థులనూ రంజింపజేయటం ట్రంప్ ప్రత్యేకత. అయితే ఆయన విధించబోయే సుంకాల రంగు, రుచి, వాసన ఆ రెండు వర్గాలకూ అంతుబట్టడం మాట అటుంచి... కొమ్ములు తిరిగిన ఆర్థికవేత్తల అవగాహనకే అందటం లేదు. ట్రంప్ చర్య వల్ల ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుందని మాత్రం ఆర్థికవేత్తలు జోస్యం చెబుతున్నారు. ఆడం స్మిత్, డేవిడ్ రికార్డో వంటి 18, 19 శతాబ్దాల నాటి స్వేచ్ఛా మార్కెట్ ఆర్థికవేత్తల ఆలోచనల్నించి బయటికొస్తేనే ట్రంప్ అర్థమవుతారని ఆర్థిక నిపుణులు కొందరి వాదన. ట్రంప్ ఒక మాట మీదవుంటే కాస్తయినా అర్థమయ్యే వారు. కానీ ఆయన రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఒకసారి మిత్ర దేశాలకైనా, వేరే దేశాలకైనా ఒకటే నిబంధన అంటారు. మరోసారి తద్విరుద్ధంగా మిత్ర దేశాలతో చర్చించి పరిష్కరించుకుంటామంటారు. ఆ మాటెలావున్నా తొలిసారి అధ్యక్షుడైనప్పుడు 2018–19 మధ్య ట్రంప్ చైనాపై విధించిన ప్రతి సుంకాల ప్రభావం ద్రవ్యోల్బణంపై పెద్దగా లేదుగనుక, ఇప్పుడూ ఉండకపోవచ్చని కొందరి మాట.ట్రంప్ ప్రకటించబోయే ప్రతి సుంకాల తీరుతెన్నులెలావుంటాయో ఆయన సన్నిహిత సలహా దారులకు సైతం ఇంతవరకూ తెలియదు. ప్రతి సుంకాలు మధ్యస్థంగా, పరస్పరం చర్చించి పరిష్క రించుకునే విధంగా ఉంటాయని అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్ గత నెలలో తెలిపారు. కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలతో విడివిడిగా చర్చించి ఒప్పందానికొస్తామని అన్నారు. మన వంతుగా ఎలాంటి చర్యలుంటాయో ప్రభుత్వం ఇంతవరకూ వెల్లడించలేదు. కానీ భారత్ తరఫున ట్రంప్ ఇప్పటికే ఒకటి రెండు ప్రకటనలు చేశారు. అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించటానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ పక్షం రోజులనాడు చెబితే దానిపై విపక్షాలు పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఇంతవరకూ ఆ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, అమెరికాకు చెప్పింది కూడా లేదని ప్రభుత్వం వివరించింది. మంగళవారం మరోసారి ఆయన అదే తరహాలో మాట్లాడారు. భారత్ గణనీయంగా సుంకాలు తగ్గించబోతున్నట్టు ‘కొద్దిసేపటి క్రితమే’ తనకు సమాచారం అందిందన్నారు. దీనిపై మన ప్రభుత్వం స్పందించలేదు. కానీ యూరప్ నుంచి అమెరికాకు పెను సవాల్ ఎదురుకాబోతున్నదని యూరోపియన్ యూనియన్ (ఈయూ) చేసిన ప్రకటన సూచిస్తోంది. ‘అమెరికా ప్రతి సుంకాలు ఏ స్థాయిలోవున్నాయో తెలిసిన వెంటనే ఏం చేయాలన్న అంశంలో పకడ్బందీ ప్రణాళిక సిద్ధమైంద’ని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ తెలియజేశారు. యూరప్ నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 2,800 కోట్ల డాలర్ల మేర సుంకాలు విధించినట్టు గత నెలలో ట్రంప్ ప్రకటించిన వెంటనే, ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే మోటార్ సైకిళ్లు, బోట్లు, మద్యం వగైరాలపై ఈయూ సైతం భారీ సుంకాలు విధించింది. అయితే అదే సమయంలో అమెరికా నుంచి వచ్చే కార్లపై 2.5 శాతం మేర సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికా– ఈయూల మధ్య వార్షిక వాణిజ్యం లక్షన్నర కోట్ల డాలర్లు. యూరప్‌తో సాగుతున్న వాణిజ్యంపై అమెరికాలో 10 లక్షల ఉద్యోగాలు ఆధారపడివున్నాయి.ఈ ‘విముక్తి’ సుంకాల రగడ పర్యవసానంగా మనతోపాటు అమెరికా, యూరప్, లండన్, జపాన్, హాంకాంగ్ తదితర ప్రపంచమార్కెట్లన్నీ పల్టీలు కొడుతున్నాయి. అన్నిచోట్లా అమెరికా షేర్లు పతనమవుతున్నాయి. చాలామంది ఈ సుంకాలెలా ఉండబోతున్నాయో తెలిసేవరకూ వేచి చూసే ధోరణిలో ఉండబట్టి కొంత నిలకడ కనబడుతోంది. కానీ ట్రంప్ అన్నంతపనీ చేస్తే ప్రపంచ మార్కె ట్లకు బుధవారం శాపగ్రస్త దినం కావడం ఖాయం. సుంకాలు పెంచటంవల్ల అమెరికాకు దిగుమ తయ్యే సరుకుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఏటా అమెరికా 3 లక్షల కోట్ల డాలర్ల సరుకును దిగు మతి చేసుకుంటుంది. సరుకుతో నిమిత్తం లేకుండా అన్నిటిపైనా 20 శాతం అదనంగా సుంకం విధి స్తామని ట్రంప్ చెబుతున్నారు. ఈ లెక్కన ఏటా 60,000 కోట్ల డాలర్ల ఆదాయం లభిస్తుంది. కానీ ఈ భారాన్ని చివరకు దేశ పౌరులే మోయాల్సివుంటుందని, అది భారమవుతుందని ట్రంప్ గ్రహించటం లేదు. ఇప్పటికే జీవనవ్యయం పెరిగి, బ్యాంకుఖాతాలు ఖాళీ అవుతూ, ఉద్యోగాలు కోల్పోయే స్థితి వుండగా, ప్రతి సుంకాలతో ఇది మరింత విషమిస్తుంది. మాంద్యం ముంచుకొస్తుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను సుస్థిరపరుస్తానని, ఉద్యోగాల విషయంలో శ్వేతజాతి అమెరికన్ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దుతానని ట్రంప్ ఇచ్చిన హామీని నమ్మి జనం ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ అందుకు విరుద్ధంగా అమలులో ఉన్న అంతర్జాతీయ అమరి కను ధ్వంసం చేసే పనిలో ట్రంప్ బిజీగా ఉన్నారు. ఆయన చర్యలు దేశాన్ని 1930నాటి ఆర్థిక మాంద్యం రోజులకు తీసుకెళ్లినా ఆశ్చర్యం లేదని పలువురి మాట. 1930 జూలైలో నాటి అధ్యక్షుడు హెర్బర్ట్ హూవర్ స్మూట్–హాలీ ట్యారిఫ్ చట్టాన్ని తీసుకురావటంతో అమెరికా దిగుమతులు 67 శాతం పడిపోయి ఆ దేశ ఆర్థికవ్యవస్థ కళ్లు తేలేసింది. ఇప్పుడు ట్రంప్ అలాంటి దుస్సాహసానికి దిగబోతున్నారు. పర్యవసానాలెలావుంటాయో చూడటం తప్ప ప్రపంచంలో దీన్ని నివారించగల వారెవరూ లేరు. -
అవివేక మార్గంలో అగ్రరాజ్యం
1990లలో, న్యూయార్క్‌లోని బ్రాడ్వేలో పర్యటిస్తున్న చైనా ప్రతినిధి బృందం గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ ఒక నివేదికను ప్రచురించింది. ఇతిహాసాల రంగస్థల, సంగీత, వినోద ప్రదర్శన క్షేత్రాల కూడలిగా ప్రసిద్ధి చెందిన ‘బ్రాడ్వే’ అభివృద్ధి, నిర్వహణల గురించి అధ్యయనం చేసి షాంఘై లేదా బీజింగ్‌లో సరిగ్గా అటువంటి సాంస్కృతిక బహుళస్థలిని ఎలా వృద్ధి చేయవచ్చో తెలుసు కోవడమే ఆ సందర్శకుల లక్ష్యం. అమెరికా శక్తి... దాని సైన్యంలో మాత్రమే కాదు, దాని శక్తిమంతమైన సంస్కృతిలో కూడా ఉందని చైనీయులు బాగా అర్థం చేసుకున్నారు. ఒక దేశ ‘శక్తి’కి ప్రామాణికమైన లక్షణం ఏమిటంటే, ఇతర దేశాలు తనను అనుకరించేలా స్వీయ విధానాలను రూపొందించు కోగలిగిన సామర్థ్యమే. అది సైనిక శక్తి కావచ్చు, ఆర్థికపరమైన దృఢ శక్తి కావచ్చు. సంస్కృతి, విలువలు, భావజాలంతో ఆ దేశం ప్రతిఫలించే సమ్మోహన శక్తి ద్వారా ఆ అనుకరణ మరింత సులభంగా జరుగుతుంది.రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నాలుగేళ్లపాటు, అమెరికా అణ్వాయుధాలపై గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది. అదే సమయంలో యూరప్ పునరుజ్జీవనానికి ‘మార్షల్ ప్లాన్ ’ను ప్రారంభించింది. పైగా తన ప్రపంచ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి నాటో సైనిక కూటమిని సృష్టించింది. అదే మార్షల్ ప్లాన్... ఆర్థిక, ఆరోగ్య, వాణిజ్య రంగాలలో ప్రజోపయోగ వస్తుసేవలను అందుబాటులోకి తెచ్చి ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించటానికి వీలుగా ఐక్య రాజ్యసమితిని, ప్రపంచ బ్యాంకును, అంతర్జాతీయ ద్రవ్య నిధిసంస్థను, ప్రపంచ ఆరోగ్య సంస్థను, వాణిజ్య సుంకాలపై సాధారణ ఒప్పందాన్ని(గాట్) నెలకొల్పేందుకు కూడా అమెరికాకు తోడ్పడింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా సాంస్కృతిక ఆకర్షణ విస్తృతం అవుతున్న కొద్దీ ఈ అంతర్జాతీయ సంస్థలు అమెరికా శక్తికి మరింత బలం చేకూర్చే సాధనాలుగా మారాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు అమెరికా తన ప్రధాన దాతృత్వ సంస్థ అయిన ‘యుఎస్ ఎయిడ్’ని మూసి వేయడం ద్వారా, ఇప్పటివరకు తన శక్తిని వినియోగించుకుని అభివృద్ధి చేసుకున్న ఆధిపత్యాన్ని తానే దెబ్బతీసుకోబోతున్నట్లు కనిపిస్తోంది. ‘యుఎస్ ఎయిడ్’ ప్రపంచంలోనే అభివృద్ధి సహాయానికి సంబంధించి అతి పెద్ద దాతృత్వ సంస్థ. ఆ సంస్థ ఏటా అందించే 70 బిలియన్ డాలర్లను ఉక్రెయిన్, జోర్డాన్, పాలస్తీనా వంటి వ్యూహా త్మక ప్రయోజనాలు కలిగిన దేశాలకు, అలాగే తను మానవతా సహాయం అందించిన (సూడాన్, యెమెన్, దక్షిణ సూడాన్, ఆఫ్ఘనిస్తాన్) దేశాలకు అమెరికా పంపిణీ చేసింది.ఆధిక్యశక్తి (హార్డ్ పవర్) స్థానంలో ఔదార్య శక్తి (సాఫ్ట్ పవర్)ని ప్రయోగించటం అమెరికా స్థిరమైన వ్యూహం. ఈ విధానాన్ని భారత్‌తో సహా ఇతర దేశాలు అనుసరించడానికి ప్రయత్నించాయి. 1950లు, 60లలో ఆరోగ్య, వ్యవసాయ, ఆహార, విద్యారంగాలలో భారత అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో యుఎస్ ఎయిడ్ ముఖ్య పాత్ర పోషించింది. అదే సమయంలో పాక్‌ను ఆయుధీకరించే తన విధానం నుండి ఉత్పన్నమయ్యే భారతీయ అసంతృప్తిని మళ్లించ టానికి యుఎస్ ఎయిడ్‌ను అమెరికా తెలివైన మార్గంగా చేసుకుంది. అమెరికా తన సాఫ్ట్ పవర్‌ను విదేశీ సహాయ నగదు నిధుల ద్వారా మాత్రమే కాక, నాలుగు ప్రధాన అంశాల ద్వారా కూడా ప్రయోగించింది. మొదటిది – వినోదం, మీడియా, పరిశ్రమలు, విద్యా వ్యవస్థ. రెండవది – ప్రజాస్వామ్యం, సమానత్వం, మానవ హక్కుల పట్ల, అలాగే శక్తివంతమైన పౌర సమాజం పట్ల తన నిబద్ధత. మూడవది – ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకులు మొద లైనవి. నాల్గవది – తన చురుకైన వినియోగదారీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. వీటన్నిటితో కూడిన ‘సాఫ్ట్ పవర్’తో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా తన హోదాను నిలుపుకొంది. విద్యార్థులు, పరిశోధకులు, అవకాశాల కోసం చూస్తున్న వ్యాపారవేత్తలు, కళాకారులు, ప్రదర్శకులు; అలాగే చట్టబద్ధమైన లేదా చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా పెద్ద సంఖ్యలో అమెరికాకు తరలివచ్చిన కార్మికులలో అమెరికాకు ఉన్న ఈ ‘సాఫ్ట్ పవర్’ ఎంతో ఆకర్షణను కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా, అమెరికా ఒక గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థగా, సంక్షేమ రాజ్యంగా, సాంకేతిక విజ్ఞానంలో లీడర్‌గా ప్రశంసలు అందుకుంది. తద్వారా అమెరికా సంస్కృతికి, ఫ్యాషన్లకు విస్తృతంగా అనుకరణలు ప్రారంభం అయ్యాయి. ఈ కారణంగా ఇతర అగ్ర రాజ్యాల విధానాలలో లేని పరోపకార ధోరణి అమెరికా విధానాలలో ఉందనే అభిప్రాయం కూడా ఏర్పడింది.కానీ నేడు ఇవన్నీ తిరగబడుతున్నాయి. ట్రంప్ పాలనలోని ‘అమెరికా ఫస్ట్’ విధానం అమెరికా ప్రయోజనాలనే అన్నింటికంటే ముందు ఉంచడానికి ప్రయత్నిస్తుంది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల తీర్పును రద్దు చేయడానికి లేదా కళంకం లేని న్యాయ వ్యవస్థపై దాడి చేయడానికి అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రయత్నం ప్రజా స్వామ్యంలోని ముఖ్యమైన వ్యవస్థలను దుర్బలం చేసింది. అమెరికాలో విశ్వవిద్యాలయాలు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా తోపాటు చర్చిలు కూడా నేడు దాడికి గురవుతున్నాయి. ఇవన్నీ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా) ఉద్యమం డిమాండ్లకు అనుగుణంగా ఉండాలన్న సంకేతాలను ఆయన పంపుతున్నారు. వైట్ హౌస్ ఆదేశాల ఉల్లంఘనలకు గాను విశ్వవిద్యాలయాలు డబ్బును తిరిగి చెల్లించాలని ట్రంప్ బెదిరించడం అమెరికన్ సంస్కృతిని వర్ణించే మేధా పరమైన స్వేచ్ఛను దెబ్బతీస్తుంది. నిజంగా ఉన్నాయో, లేవో తెలియని గ్రహాంతరవాసుల మాదిరిగా ట్రంప్ పరిపాలన విదేశీయులు, వీసా హోల్డర్లు, పర్యాటకులు, శాశ్వత నివాసితులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ల జీవితాన్ని కష్టతరం చేస్తోంది. ఈ చర్యలు అమెరికన్ ‘సాఫ్ట్ పవర్’ గుండెకాయపైనే దాడి చేస్తాయి.అమెరికా సాఫ్ట్ పవర్‌ను చూసి ప్రపంచం అసూయ చెందేది. కానీ నేడు, షాంఘై, బీజింగ్‌లు కూడా ‘బ్రాడ్వే’ తరహా సాంస్కృతిక కేంద్రాలను కలిగి ఉన్నాయి. సంస్కృతితో పాటు కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్లు, స్కాలర్‌షిప్‌ల ద్వారా చైనీస్ భాషను ప్రోత్సహించ డానికి విద్యార్థులను చైనా ఆకర్షిస్తోంది. ఇది సాఫ్ట్ పవర్ మరొక లక్షణం. భారతదేశం సంక్లిష్టమైన విదేశాంగ విధాన సవాళ్లను అధిగ మించడానికి సాఫ్ట్, హార్డ్ పవర్ మిశ్రమాన్ని ఉపయోగిస్తోంది.దాంతో భారత్ విదేశీ విద్యార్థులకు ప్రధాన గమ్యస్థానం అయింది.ఈ హైపర్–రియలిస్ట్ యుగంలో సాఫ్ట్ పవర్ ఏమంత ముఖ్యం కాదని చెప్పడం సులభమే. కానీ వాస్తవం ఏమిటంటే, హార్డ్ పవర్ దానికదిగా... సాఫ్ట్, హార్డ్‌లు కలిసిన ‘స్మార్ట్ పవర్‘ సాధించగల సామర్థ్యాన్ని పొందలేదు. లేకుంటే, చైనా లేదా రష్యా... ప్రపంచంలో అత్యంత వాంఛనీయమైన దేశాలుగా పరిగణన పొందేవి. నిజానికి ధనిక దేశాలకు, లేదా మధ్య ఆదాయ దేశాలకు, అమెరికా ఇష్టమైన ఎంపిక! ఎందుకంటే తమ జీవితాలను మెరుగుపరచుకోవాలని కోరుకునే లక్షలాది వలసదారులకు అమెరికానే అనువుగా ఉంది. ట్రంప్ అధికారంలో ఉన్నప్పటికీ సినిమాలు, సంగీతం, సాంకేతికత ద్వారా అమెరికా ప్రపంచవ్యాప్తంగా తన ప్రాధాన్యాన్ని నిలుపుకొనే అవకాశం ఉంది. కానీ మిత్రదేశాల విశ్వాసాన్ని తక్కువగా అంచనా వేయడం అగ్రరాజ్యానికే దెబ్బ. అలాగే, అమెరికా విలువలు, లక్ష్యాల పట్ల ప్రపంచానికి ఉన్న అభిప్రాయాన్ని మార్చడం కూడా ఆ దేశానికే నష్టదాయకం. వీటన్నిటి వల్ల ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ విధానం ప్రపంచంలో అమెరికాకు ఉన్న ఇమేజ్ను దెబ్బతీస్తుంది. దాని దీర్ఘకాలిక ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.మనోజ్ జోషీ వ్యాసకర్త డిస్టింగ్విష్డ్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ -
టారిఫ్‌లకు వేళాయె
న్యూయార్క్/వాషింగ్టన్/రోమ్/టోక్యో: ప్రపంచ వాణిజ్య యుద్ధానికి వేళైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొప్పగా ప్రకటించుకుంటూ వస్తున్న ‘విముక్తి దినం’ రానే వచ్చింది. ప్రపంచ దేశాలపై అగ్ర రాజ్యం ప్రతీకార సుంకాల బాదుడు బుధవారం నుంచే మొదలవనుంది. ఈ పరిణామం ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతోంది. అమెరికాతో పాటు చాలా దేశాల్లో స్టాక్‌మార్కెట్లు నేలచూపులు చూస్తున్నాయి. భారత్‌కు కూడా భారీ వడ్డింపులు తప్పవని వైట్‌హౌస్ తాజాగా స్పష్టం చేసింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘అమెరికా వ్యవసాయోత్పత్తులు తదితరాలపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తోంది. మా పాడి ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ దేశాలు 50 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తున్నాయి. జపాన్ అయితే మా బియ్యంపై ఏకంగా 700 శాతం టారిఫ్‌లు విధించింది. మా బటర్, చీజ్ తదితరాలపై కెనడా 300 శాతం టారిఫ్‌లు వడ్డిస్తోంది. ఈ దేశాలన్నీ నడ్డి విరిచే టారిఫ్‌లతో అమెరికాను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఆయా దేశాలకు మా ఎగుమతులను అసాధ్యంగా మార్చేశాయి’’ అంటూ ఆక్షేపించారు. ‘‘ఇక ప్రతీకారానికి వేళైంది. వాళ్లకు అంతకు అంతా వడ్డించబోతున్నాం.అమెరికా ప్రజల సంక్షేమం దిశగా అధ్యక్షుడు తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం బుధవారం నుంచే అమల్లోకి రానుంది’’ అని పునరుద్ఘాటించారు. ఏయే దేశాలపై ఏ రంగంలో ఎంత సుంకాలు విధించబోయేదీ అధ్యక్షుడే స్వయంగా ప్రకటిస్తారని ఆమె తెలిపారు. ఈ టారిఫ్‌లు ఆరంభం మాత్రమేనని, వాటిని త్వరలో భారీగా పెంచుతామని ట్రంప్ ఇప్పటికే పేర్కొనడం తెలిసిందే. ‘‘అమెరికాపై టారిఫ్‌లను భారత్ భారీగా తగ్గిస్తోంది. చాలా దేశాలు కూడా అదే బాటన నడుస్తున్నాయి’’ అని సోమవారం ఆయన మీడియాతో చెప్పుకొచ్చారు. మా ప్లాన్లు మాకున్నాయి: ఈయూ అమెరికా టారిఫ్‌లకు బెదిరేది లేదని యూరోపియన్ యూనియన్ స్పష్టం చేసింది. వాటిని ఎదుర్కోవడానికి తమ వద్ద గట్టి ప్రణాళికలున్నాయని ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాండెర్ లెయన్ చెప్పారు. మంగళవారం ఆమె ఈయూ పార్లమెంటులో మాట్లాడారు. అమెరికావి తప్పుడు చర్యలని ఆక్షేపించారు. ‘‘మేం మొదలు పెట్టిన యుద్ధం కాదిది. అగ్ర రాజ్యానికి దీటుగా బదులిస్తాం. టారిఫ్‌ల బారినుంచి మా ప్రజలను, ఆర్థిక వ్యవస్థలను అన్నివిధాలా కాపాడుకుని తీరతాం’’ అని ప్రకటించారు. ‘‘మేం ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్.ఎలాంటి బేరసారాలకైనా కావాల్సినన్ని శక్తియుక్తులు మాకున్నాయి’’ అన్నారు. ‘‘కొన్ని అంశాల్లో అమెరికాకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ భావిస్తుంటే, పలు అంశాల్లో మా విషయంలోనూ అదే జరుగుతోందన్నది మా అభిప్రాయం. వీటిపై చర్చలకు మేం సిద్ధమే. ఎందుకంటే టారిఫ్‌ల రగడ అంతిమంగా ప్రజలపైనే భారం వేస్తుంది. వారి జీవన వ్యయం పెరుగుతుంది’’ అని చెప్పారు. టారిఫ్ బాదుడు నుంచి జపాన్ను మినహాయించాలని ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబా మరోసారి ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే వాషింగ్టన్ వెళ్లి ఆయనతో చర్చించేందుకు కూడా సిద్ధమన్నారు.దేశీయ మార్కెట్ల పరిరక్షణకే టారిఫ్‌లపై కేంద్రం ప్రకటనన్యూఢిల్లీ: భారత్‌కు అమెరికాయే అతి పెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ నేపథ్యంలో టారిఫ్‌ల పెంపుతో పడే ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య శాఖ నిశితంగా గమనిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. వాణిజ్య నియంత్రణ, దేశీయ మార్కెట్ల పరిరక్షణే లక్ష్యంగా భారత్ సుంకాలు విధిస్తుందని స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం లోక్‌సభలో ఈ మేరకు ప్రకటన చేశారు.హెచ్చు టారిఫ్‌లు దేశానికి మేలు చేయడం లేదని, ఆర్థిక వృద్ధి కోసం వాటిని తగ్గించడం తప్పనిసరని నీతీ ఆయోగ్ ఇటీవల చేసిన ప్రకటనపై ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. ఆర్థిక వృద్ధికి మరింత ఊతమివ్వడం ద్వారా ప్రపంచ మార్కెట్లో భారత్‌ను ప్రబల శక్తిగా తీర్చిదిద్దాలన్నది తమ దీర్ఘకాలిక లక్ష్యమని వెల్లడించారు. ‘‘పలు దేశాలతో టారిఫ్‌ల సమతుల్యత సాధించే దిశగా కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం పలు దేశాలతో ఇప్పటికే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి’’ అని గుర్తు చేశారు. ప్రస్తుతం 13 దేశాలతో భారత్ ఎఫ్‌టీఏలు చేసుకుంది. అమెరికా, ఈయూ, బ్రిటన్, న్యూజిలాండ్, ఒమన్, పెరు వంటి దేశాలతో ఎఫ్‌టీఏపై చర్చలు జరుగుతున్నాయి.ఇదీ పరిస్థితి!అమెరికా వస్తువులు, ఉత్పత్తులపై భారత్ ప్రస్తుతం సగటున 18 శాతం టారిఫ్‌లు వసూలు చేస్తోంది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా టారిఫ్‌లు సగటున 2.8 శాతం మాత్రమే. భారత వ్యవసాయ ఎగుమతులపై అమెరికా 5.3 శాతం సుంకాలు విధిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వ్యవసాయోత్పత్తులపై మాత్రం భారత్ 37.7 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. ఇరు దేశాల మధ్య దాదాపు 30 రంగాల్లో వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నాయి. దాదాపుగా ప్రతి రంగంలోనూ భారతే అమెరికాపై హెచ్చు సుంకాలు విధిస్తోంది.దాంతో ఇరు దేశాల మధ్య టారిఫ్‌ల అంతరం ఆటోమొబైల్స్ రంగంలో 23.1 శాతం, వజ్రాలు, బంగారం, ఆభరణాల్లో 13.3, కెమికల్, పార్మా రంగంలో 8.6, ఎలక్ట్రానిక్స్‌పై 7.2, ప్లాస్టిక్స్‌పై 5.6, కంప్యూటర్లు, యంత్రాలపై 5.3, ఇనుము, స్టీల్‌పై 2.5, టెక్స్టైల్స్, క్లా్లతింగ్లో 1.4 శాతంగా ఉంది. భారత మొత్తం ఎగుమతుల్లో అమెరికాదే 18 శాతం వాటా. ఆ దేశం నుంచి మాత్రం దిగుమతులు 6.22 శాతమే. ద్వైపాక్షిక వాణిజ్యంలో ఈ 10.73 శాతం లోటుపైనా అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
ఫార్మాకు చేదు మందు?
సాక్షి బిజినెస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ హెచ్చరికలపై ఇతరత్రా రంగాల్లాగే భారత ఫార్మా కంపెనీలకూ టెన్షన్‌గానే ఉంది. ఎందుకంటే మన ఫార్మా కంపెనీల ఎగుమతుల్లో దాదాపు మూడో వంతు వాటా అమెరికాదే ఉంటోంది. గత ఆర్థిక సంవత్సరం ఆ దేశానికి భారత ఫార్మా ఎగుమతులు 16 శాతం పెరిగి దాదాపు 9 బిలియన్ డాలర్లకు చేరాయి. అక్కడి నుంచి దిగుమతయ్యే ఔషధాలు సుమారు 800 మిలియన్ డాలర్లే. అమెరికాకు మన చౌక ఔషధాల అవసరం ఎంత ఉందో, మనకూ కీలకమైన అమెరికా మార్కెట్ అవసరం అంతగానూ ఉందని పరిశీలకులు చెబుతున్నారు.దీంతో సుంకాల వడ్డింపనేది ఎవరికి లాభదాయకం, ఎవరికి నష్టదాయకమనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గతంలోలాగే ఫార్మా మీద టారిఫ్‌పై ఇరు దేశాలు మళ్లీ సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు. అమెరికా హెల్త్‌కేర్ వ్యవస్థలో మన జనరిక్స్‌కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మినహాయింపుల కోసం భారత్ ప్రయత్నించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశాయి. సవాళ్ల మధ్య అవకాశాలు.. వాస్తవానికి చైనాలాంటి దేశాలపై ప్రధాన దృష్టితో టారిఫ్‌లను ప్రతిపాదించినప్పటికీ అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న మన ఫార్మాపైనా ప్రభావం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా నుంచి ఔషధాల దిగుమతులపై భారత్ 10% సుంకాల వరకు విధిస్తుండగా, మన ఎగుమతులపై అక్కడ టారిఫ్‌లు లేవు. ఒకవేళ ప్రతీకారంగా మనలాగే టారిఫ్ విధించినా సుమారు 10% స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు.గ్లాండ్ ఫార్మా, అరబిందో, డాక్టర్ రెడ్డీస్, జైడస్, లుపిన్లాంటి ఫార్మా కంపెనీల ఆదాయాల్లో అమెరికా వాటా సుమారు 50–37% వరకు ఉండటంతో వాటిపై టారిఫ్‌ల ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఒకవేళ భారాన్ని కస్టమర్లకు బదలాయించకపోతే వివిధ కంపెనీల స్థూల లాభంపై సుమారు 12% వరకు ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అదే 50% బదలాయిస్తే, ఇది 7% దాకా ఉండొచ్చు. మొత్తం మీద ఆదాయనష్టంతో పాటు మిగతా దేశాలతో పోటీపడి మార్కెట్‌ను నిలబెట్టుకోవడం కష్టంగా మారుతుంది. దేశీ ఫార్మాకు కాస్త కలిసి వచ్చే అంశాలూ ఉన్నాయి. అమెరికా మీదే ఆధారపడకుండా మన కంపెనీలు ఇతర మార్కెట్లకూ విస్తరించవచ్చు. అలాగే, అంతర్జాతీయంగా ఇతర దేశాల కంపెనీలతో దీటుగా పోటీపడేలా ఆర్అండ్డీ సామర్థ్యాలను పెంచుకోవచ్చు. అమెరికాపై ఎఫెక్ట్ .. ఫార్మా దిగుమతులపై టారిఫ్‌లతో అమెరికాకూ కొన్ని ప్రతికూలతలు తప్పవు. భారతీయ జనరిక్స్‌పై సుంకాల వడ్డింపు వల్ల, ఫార్మా కంపెనీలు ఔషధాల రేట్లను పెంచితే, అమెరికా వినియోగదారులకు మందుల ఖర్చులు పెరిగిపోతాయి. ఇక, మన ఫార్మాపై అమెరికా భారీగానే ఆధారపడుతోంది. టారిఫ్‌లతో సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడి, ఔషధాలకు కొరత నెలకొనవచ్చు. ఫలితంగా పేషెంట్లకు చికిత్స విషయంలో సమస్యలు ఏర్పడవచ్చు. అటు అమెరికాకూ కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. టారిఫ్‌తో ఇతర దేశాల ఫార్మా కంపెనీలు అమెరికాలోనూ తయారీ కార్యకలాపాలు చేపట్టే పరిస్థితి ఏర్పడవచ్చు. దీంతో, దేశీయంగా తయారీకి, ఉపాధి కల్పనకు ఊతమిస్తుంది. అలాగే దిగుమతి చేసుకునే ఔషధాల నాణ్యతపరమైన సవాళ్లకు చెక్ పెట్టేలా, దేశీయంగా తయారీ ప్రమాణాలపై అమెరికా మరింత నియంత్రణ సాధించవచ్చు. -
సుంకాల మోత వేళ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: ప్రతీకార సుంకాల విధింపు వేళ(reciprocal tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కీలక ప్రకటన చేసే సమయంలో వాణిజ్య భాగస్వాముల పట్ల తాను మరింత దయతో వ్యవహరిస్తానని ప్రకటించారాయన. అయితే కచ్చితంగా ఎలాంటి పరస్పర సుంకాలు విధించబడతాయనేది మాత్రం మంగళవారం రాత్రికల్లా లేదంటే బుధవారం పొద్దునే ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.జనవరిలో అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ తన అధికారాన్ని ఇష్టానుసారం ఉపయోగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో వాణిజ్య ఒప్పందాలపై సంప్రదింపులు జరిపే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాల విధింపు(Tariffs) తప్పదని, ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ ప్రకటించిన ఆ ప్రతీకార టారిఫ్‌ల డెడ్‌లైన్ ఏప్రిల్ 2 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి సంస్థల్లో గుబులు, గందరగోళం నెలకొన్నాయి. ఏయే రంగాలపై ఎంతెంత వేస్తారు, ఏయే రంగాలను వదిలేస్తారు అనే అంశాలపై చర్చ నడుస్తోంది. అయితే..తాజాగా.. ‘‘మీరు రెండు రోజుల్లో చూడబోతున్నారు.. మేం చాలా దయతో ఉంటాం’’ అని ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. కొన్ని దేశాలకు ఊరట దక్కుతుందా? అనే చర్చ మొదలైంది. మరోవైపు టారిఫ్‌లపై బేరసారాలు చేసేందుకు అవకాశం దొరకవచ్చని, కొన్నాళ్లయినా సుంకాలు వాయిదా పడొచ్చేమోనని భారత్ ఇంతకాలం భావిస్తూ వచ్చింది. కానీ, సుంకాల ప్రకటన అనుకున్న తేదీకే ఉంటుందని ట్రంప్ చెప్పడంతో ఆ ఆశలు ఆవిరయ్యాయి. అయితే.. భారత్‌ను ఆయన ప్రత్యేక మిత్రపక్షంగా భావిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌కు ప్రత్యేక ఊరట ఏమైనా దక్కుతుందేమో చూడాలి. అయితే.. ఇదీ చదవండి: భారత ఎగుమతులపై ప్రతీకార టారిఫ్‌లు ఏ స్థాయిలో ఉండొచ్చంటే..పరస్పర సుంకాల విషయంలో ఎలాంటి మినహాయింపు ఉండదని వైట్‌హౌజ్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ అంటున్నారు. అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు విధిస్తున్న సుంకాలను ప్రస్తావిస్తూ.. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు నిలిపివేయాల్సిన అవసరం ఉందని లీవిట్ అభిప్రాయపడ్డారు.సుంకాల మోత ఎందుకంటే.. అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై ఇతర దేశాలు భారీగా సుంకాలు విధిస్తున్నాయని, అవరోధాలు ఏర్పరుస్తున్నాయనేది ట్రంప్ ఆరోపణ. దీని వల్ల 1 లక్ష కోట్ల డాలర్ల మేర వాణిజ్య లోటు ఉంటోందని, దీనితో అమెరికన్ పరిశ్రమలు, వర్కర్లపైనా ప్రతికూల ప్రభావం పడుతోందనేది ఆయన వాదన. అందుకే ప్రతీకార సుంకాల విధింపు తప్పదని అంటున్నారు.ట్రంప్ ప్రకటన కంటే ముందే..మరోవైపు ట్రంప్ నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా చైనా, కెనడా, యూరోపియన్ యూనియన్ నుంచి ప్రతిఘటన తప్పదని అంటున్నారు. మరోవైపు.. ట్రంప్ సుంకాల ప్రకటన చేయకముందే ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. టారిఫ్ వార్‌ను ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు ఒక అడుగు ముందుకు వేశాయి. దక్షిణ కొరియా-జపాన్-చైనా దేశాలు ప్రాంతీయ వాణిజ్యం ప్రొత్సాహం దిశగా ఒక ఒప్పందం కుదుర్చుకోవడం కోసం ఆదివారం చర్చలు జరిపాయి. -
ట్రంప్ మూడో ముచ్చట తీరేనా?
‘మూడోసారి కూడా అధ్యక్షుడు కావాలనుకుంటున్నా. నేనేమీ జోక్ చేయడం లేదు. సీరియస్‌గానే చెప్తున్నా. నన్ను మూడోసారి కూడా అధ్యక్షునిగా చూడాలని అమెరికన్లలో చాలామంది కోరుకుంటున్నారు’ – రెండోసారి అధ్యక్షుడై మూడు నెలలైనా నిండకముందే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మూడో టర్ము గురించిన ఆకాంక్షలను వెలిబుచ్చడం ఆయనకు ఇది తొలిసారేమీ కాదు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం గత జనవరిలో కూడా, ‘ఒకట్రెండు సార్లు మాత్రమే కాదు, మూడు, ఇంకా చెప్పాలంటే నాలుగుసార్లు కూడా దేశానికి సేవ చేయడం నాకు అత్యంత గౌరవప్రదమైన విషయం’అని చెప్పుకొచ్చారు. రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతించదని తెలిసీ ట్రంప్ ఎందుకిలాంటి ప్రకటన చేశారన్నది ఆసక్తికరం. మనసుంటే మార్గముంటుందన్నట్టు, ‘మూడో’ముచ్చట తీర్చుకునేందుకు ట్రంప్‌కు అవకాశముందని అభిమానులు చెబుతున్నారు. అందుకే అంత బాహాటంగా ఆ ప్రకటన చేశారంటున్నారు. అదెంతవరకు సాధ్యమన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. అంతేగాక ట్రంప్ యోచనకు అనుకూలంగా, వ్యతిరేకంగా కూడా పలు వాదనలు తెరపైకి వస్తున్నాయి. అవేమిటంటే...రాజ్యాంగాన్ని సవరించాలి అమెరికా రాజ్యాంగానికి చేసిన 22వ సవరణ ప్రకారం ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టడానికి వీల్లేదు. అంతేకాదు. ఏ కారణాలతోనైనా రెండేళ్లు, అంతకంటే ఎక్కువకాలం అధ్యక్షునిగా చేసినా సరే, ఈ సవరణ ప్రకారం వారు మరొక్కసారి మాత్రమే తిరిగి ఎన్నిక కావచ్చు. ఈ లెక్కన ట్రంప్ కోరిక నెరవేరాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. కానీ అది అత్యంత కష్టసాధ్యం. ఎందుకంటే ఆ సవరణను కాంగ్రెస్ ఉభయ సభలూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదించాలి. ఆ మీదట మూడొంతుల రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదముద్ర వేయాలి. కానీ అధికార రిపబ్లికన్లకు కాంగ్రెస్‌లో అంతæ మెజారిటీ లేదు. పైగా 50 రాష్ట్రాల్లో 18 విపక్ష డెమొక్రాట్ల చేతుల్లోనే ఉన్నాయి.‘ఉపాధ్యక్ష’దారిలో... అధ్యక్ష పదవికి రెండుకంటే ఎక్కువసార్లు ‘ఎన్నిక’కావడాన్ని మాత్రమే 22వ సవరణ నిషేధిస్తోంది. వారసత్వంగా ఆ పదవిని పొందే విషయంపై మాత్రం అందులో ఎలాంటి ప్రస్తావనా లేదు. దీన్ని ట్రంప్ తనకు అనుకూలంగా వాడుకోనున్నట్టు ఆయన మద్దతుదారులు చెబుతున్నారు! ‘‘ఏ కారణంతోనైనా అధ్యక్షుడు రాజీనామా చేస్తే నిబంధనల ప్రకారం ఆ పదవి ఉపాధ్యక్షునికే దక్కుతుంది. కనుక 2028లో ట్రంప్ ఉపాధ్యక్ష బరిలో దిగుతారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తారు. గెలిస్తే వెంటనే రాజీనామా చేస్తారు. తద్వారా ట్రంప్ ఆటోమేటిగ్గా మూడోసారి అధ్యక్షుడైపోతారు’’అంటున్నారు. ఈ ఆలోచన తన మనసులో ఉందని ట్రంప్ అంగీకరించారు కూడా. కానీ దీనిపై భిన్న వాదనలున్నాయి. ఇది అసాధ్యమని యూనివర్సిటీ ఆఫ్ నోర్టెడామ్లో ఎన్నికల నిబంధనల నిపుణుడైన ప్రొఫెసర్ డెరెక్ ముల్లర్ చెబుతున్నారు. ‘‘అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అర్హత లేని వ్యక్తి ఉపాధ్యక్ష పదవికి కూడా పోటీ పడేందుకు కూడా అనర్హుడేనని 12వ రాజ్యాంగ సవరణ స్పష్టం చేస్తోంది. 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ట్రంప్ అనర్హుడు గనుక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కూడా అనర్హుడే అవుతారు’’అని ఆయన స్పష్టం చేశారు. ఇవన్నీ కాకుండా ఒకవ్యక్తి మూడుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అనుమతిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని రిపబ్లికన్ నేత ఆండీ ఓగ్లెస్ గత జనవరిలో ప్రతిపాదించారు. అంతగా అయితే ఆ మూడుసార్లు వరుసగా కాకుంటే చాలంటూ ఓ నిబంధన విధిస్తే సరిపోతుందని సూచించారు.9 మంది గెలవకుండానే అధ్యక్ష పీఠమెక్కారుఅమెరికా చరిత్రలో ఏకంగా 9 మంది ఉపాధ్యక్షులు ఎన్నికల పోరులో గెలవకుండానే అత్యున్నత పీఠమెక్కారు. అధ్యక్షుని మరణం, లేదా రాజీనామా వల్ల తాము అధ్యక్షులయ్యారు. వయసు అనుమతించేనా? మూడోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు వయసు కూడా ట్రంప్‌కు అడ్డంకిగానే మారేలా కన్పి స్తోంది. ఆయనకిప్పటికే 78 ఏళ్లు. ఆ లెక్కన ఈ పదవీ కాలం ముగిసేసరికి 82 ఏళ్లకు చేరుకుంటారు. ఆ వయసులో తిరిగి ఎన్నికల బరిలో దిగాల్సి ఉంటుంది. అదెంత వరకు సాధ్యమన్నది కాలం గడిస్తే గానీ తేలదు.వద్దే వద్దు: డెమొక్రాట్లు ట్రంప్ మూడో టర్ము వ్యాఖ్యలను విపక్ష డెమొక్రాటిక్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ‘‘ఇటువంటి ఆలోచనలతో ప్రజాస్వామ్యానికి ఆయన మరింతగా తూట్లు పొడుస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైతేనే ప్రపంచమంతటినీ ఇంతటి గందరగోళంలోకి నెట్టేస్తున్న ఆయన మూడోసారి గద్దెనెక్కేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు. కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ ప్రతినిధులకు రాజ్యాంగంపై ఏమాత్రం విశ్వాసమున్నా ట్రంప్ మతిలేని మూడో టర్ము ఆకాంక్షలను తక్షణం బాహాటంగా ఖండించాలి’’అని డిమాండ్ చేసింది. రిపబ్లికన్లలో కూడా కొందరు మూడో టర్ము సరైన యోచన కాదంటున్నారు. ఈ ఆలోచనకు తానసలే మద్దతివ్వబోనని ఓక్లహామీ సెనేటర్ మార్కవైన్ ములిన్ ఇటీవలే చెప్పారు.రూజ్వెల్ట్ నాలుగుసార్లు! రెండు కంటే ఎక్కువసార్లు అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన ఏకైక నేతగా ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ నిలిచిపోయారు. 32వ అధ్యక్షునిగా 1933లో తొలిసారి గద్దెనెక్కిన ఆయన 1945లో మరణించేదాకా పదవిలోనే కొనసాగారు! అత్యధిక కాలం పాటు అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా ఆయనదే. అధ్యక్ష పదవిని రెండుసార్లకు మించి చేపట్టరాదన్న సంప్రదాయాన్ని అమెరికా మొదటినుంచీ పాటిస్తోంది. దీనికి బాటలు వేసింది తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టనే. ఆయన వరుసగా రెండుసార్లు గెలిచారు. మూడోసారీ అధ్యక్షుడు కావాలని దేశమంతా కోరినా సున్నితంగా నిరాకరించి తప్పుకున్నారు. అప్పటినుంచి అందరు అధ్యక్షులూ అనుసరిస్తూ వస్తున్న ఆ సంప్రదాయాన్ని రూజ్వెల్ట్ మాత్రం అతిక్రమించారు. రెండో ప్రపంచ యుద్ధాన్ని, హిట్లర్ సారథ్యంలో నాజీల దూకుడును బూచిగా చూపిస్తూ 1940, 1944 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా మరో రెండుసార్లు పోటీ చేసి గెలిచారు. అయితే 1944లో నాలుగోసారి బరిలో దిగేనాటికే రూజ్వెల్ట్ ఆరోగ్యం క్షీణించింది. 1945లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే మరణించారు. అనంతరం రెండుసార్లకు మించి అధ్యక్ష పదవి చేపట్టకుండా 1951లో 22వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచి్చంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓ పెద్ద మనిషి.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. నిన్ను ఎవరు బాధించారు?
వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడు బ్రియాన్ జాన్సన్‌పై భారత వైద్యుడు సంచలన ఆరోపణలు చేశారు. ‘ది లివర్ డాక్' అనే ఇంటర్నెట్ పేరుతో ప్రసిద్ధి చెందిన కేరళకు చెందిన వైద్యుడు సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు . బ్రియాన్ చెప్పేదంతా అబద్ధమని, ఇది ప్రజల్ని మోసగించే చర్య అంటూ ధ్వజమెత్తారు.‘ప్రజలు దానివైపు వెళ్లొద్దు. అదొక భయానకమైన విధానమే కాదు.. మోసపూరితం కూడా. అత్యంత ఖరీదైనదే కాదు.. ఉపయోగం లేనిది కూడా. బ్లూ ప్రింట్ పేరుతో బ్రయాన్ చేస్తున్నదంతా పచ్చి మోసం. ప్రమాదకరమైన స్నేక్ ఆయిల్స్ ను తన ప్రయోగాల్లో బ్రయాన్ జాన్సన్ వాడుతున్నాడు’ అంటూ ఫైరయ్యాడు.తన రక్త పరీక్ష సంస్థ థెరానోస్ కు సంబంధించిన కేసులో దోషిగా తేలిన అమెరికన్ బయోటెక్నాలజీ పారిశ్రామికవేత్త ఎలిజబెత్ ఏన్ హోమ్స్, ఆస్ట్రేలియన్ ఇన్ ఫ్లూయెన్సర్ బెల్లె గిబ్సన్లతో బ్రయాన్ జాన్సన్ ను పోల్చాడు అబ్బీ ఫిలిప్స్. నిన్న(ఆదివారం) అబ్బీ ఫిలిప్ప్ ఈ ఆరోపణలు చేయగా, తాజాగా బ్రయాన్ జాన్సన్ మాత్రం సుతిమెత్తాగా స్పందించాడు. అబ్బీ ఫిలిప్స్ చేసిన ఆరోపణలకు సమాధానాలు ఇవ్వకుండా.. ‘ నీకు ఏమైంది.. ఎందుకు కోపంగా ఉన్నావ్.. ఎవరు నిన్ను బాధించింది?’ అంటూ రిప్లే ఇచ్చారు బ్రయాన్ జాన్సన్.అసలు బ్రయాన్ జాన్సన్ కథేంటి..?వృద్ధాప్య ఛాయలను దరిచేరనీయకుండా నిత్యం యవ్వన కాంతులీనడమే ధ్యేయంగా ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న అమెరికన్ వ్యాపారవేత్త, అత్యంత సంపన్నుడే బ్రియాన్ జాన్సన్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో వార్తల్లో నిలిచిన వ్యక్తి. దీని కోసం కోట్లక్దొదీ డబ్బుని ఖర్చు చేస్తున్న వ్యక్తిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అతడు ఆ ప్రయోగాల్లో సక్సెస్ అందుకుంటాడో లేదా గానీ బ్రయాన్ తనపై చేసుకునే ప్రయోగాలు ఊహకందని విధంగా భయానకంగా ఉంటాయి. ఇంతకుముందు ప్లాస్మా, తన కొడుకు రక్తం ఎక్కించుకోవడం వంటి వాటితో హడలెత్తించాడు. ఇప్పుడు స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో ఆరోగ్యం తోపాటు వృద్ధాప్యాన్ని తిప్పికొట్టేలా ఏకంగా తన కార్యాలయాన్నే హైపర్బారిక్ ఆక్సిజన్ చాంబర్‌గా మార్చేశారు. ఇలా ప్రయోగాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు బ్రయాన్ జాన్సన్. It is terrifying that people do not see Bryan Johnson as actually a well-evolved masculine form of fraudsters Elizabeth Holmes and Belle Gibson, selling both expensive and utterly useless investigations and peddling potentially dangerous snake oil supplements in the name of… pic.twitter.com/qjts5KKXTF— TheLiverDoc (@theliverdr) March 30, 2025 Cyriac why are you so angry? Who hurt you?Blueprint offers extra virgin olive oil, proteins, nuts, and nutrients which have independent and robust scientific evidence. They are third party tested. The certificates of analysis are publicly available. They are affordably priced.— Bryan Johnson (@bryan_johnson) March 30, 2025 -
నా పిల్లలు భారత్‌లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్‌గా అమెరికన్ తల్లి పోస్ట్
అందాల అమెరికా అంటే మన భారత యువతకు ఓ బ్యూటీఫుల్ డ్రీమ్. ఆ కల సాకారం చేసుకోవడానికి తల్లిదండ్రులను కష్టపెట్టడమే కాకుండా తమన తాము ఇబ్బందుల్లోకి నెట్టుకుని మరీ తిప్పలు పడతారు. ఇలా ఏటా వేలాదిమంది యువత అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ఎన్నో పాట్లుపడుతున్నారు. మనం ఇంతలా ప్రయాస పడుతుంటే ఓ అమెరికన్ అమ్మ మాత్రం సింపుల్‌గా అసలైన ఆనందం భారత్‌లోనే ఉందని మన దేశాన్ని ఆకాశానికి ఎత్తేసేలా కీర్తించింది. అంతేకాదండోయ్ సంపాదన పరంగా అమెరికా బెస్ట్ ఏమో కానీ సంతోషం మాత్రం భారత్‌లోనే దొరకుతుందని దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది ఆ తల్లి. అదెలాగో ఆమె మాటల్లోనే విందామా..! గత నాలుగు సంత్సరాలు ఢిల్లీలో నివశిస్తున్న అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ తన పిల్లలు యునైటెడ్ స్టేట్స్ వద్దని భారత్‌లోనే ఎందుకు పెంచాలనుకుంటుందో షేర్ చేసుకుంది. స్కైఫిష్ డెవలప్మెంట్ కంటెంట్ క్రియేటర్ అయిన క్రిస్టెన్ ముగ్గురు పిల్లల తల్లి. ఆమె తన పిల్లలు భారతదేశంలోనే పెరిగితేనే ప్రయోజకులు అవుతారని విశ్వసిస్తున్నా అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేవారు. అదెలాగో కూడా సవివరంగా వెల్లడించింది. అమెరికాలో కంటే వారి బాల్యం భారత్‌లోనే గడిస్తేనే ఎందుకు మంచిదో.. ఎనిమిది కారణాలను వివరించారామె. అవేంటంటే.. భావోద్వేగాలను హ్యాండిల్ చేయడం: భారతదేశంలో నివశిస్తే తన పిల్లలు విభిన్న వ్యక్తులు, వారి సంస్కృతులను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. దీనివల్ల సామజిక నైపుణ్యాలు మెరగవ్వడమే కాకుండా సానుభూతిగా వ్యవహరించడం ఎలాగో తెలుస్తుంది. స్ట్రాంగ్ రిలేషన్స్: భారతీయుల కుటుంబాల్లో బలమైన సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తమ పిల్లలే అన్న భావనతో కూడిన ఐక్యత ఉంటుంది. ఇది వారికి భావోద్వేగ మద్దతును అందిస్తుంది. అందువల్ల వాళ్లు ఈ వాతావరణంలో పెరిగితే గనుక అమెరికాలోని వ్యక్తిగత సంస్కృతికి భిన్నంగా లోతైన సంబంధాలు ఎలా ఏర్పరుచుకోవాలో తెలుసుకుంటారు.కృతజ్ఞత, సద్దుకుపోవడం: సంపద, పేదరికం మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు ఉండే కొన్ని ప్రాంతాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా బతకడం, సర్దుకుపోవడం వంటివి తెలుసుకుంటారు. ఆ పరిస్థితుల మద్య వాళ్లు కృతజ్ఞుడుగా ఉండటం, అవతలి వాళ్లని మనస్ఫూర్తిగా అభినందించడం వంటివి తెలుసుకుంటారు. గ్లోబల్ నెట్వర్క్ కనెక్షన్: అంతేగాదు ఇక్కడ పెరిగితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్లు స్నేహితులవుతారు. ఇది వారికి ప్రపంచ నెట్‌వర్క్‌ను నిర్మించడంలో సహయపడతుంది. ఈ సంబంధాలు పిల్లలకు భవిష్యత్తులో మంచి కెరీర్‌కు నిర్మించుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇలా ఆ ఆమెరికన్ తల్లి క్రిస్టెన్ ఫిషర్ ఇక్కడే తన పిల్లలు పెరిగితే గొప్పవాళ్లు అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతానంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అంతేగాదు అమెరికాను వ్యక్తిత్వం కలిగిన దేశంగా, సామాజికంగా ఒంటరిగా ఉన్న దేశంగా అభివర్ణించింది. అయితే భారతదేశం అందర్నీ స్వాగతిస్తూ సంబంధాలను నెరుపుతూ ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పిస్తుంది.పైగా ఒకరికొకరు సహాయ చేసుకోవడం అంటే ఏంటో నేర్పిస్తుంది. అందువ్లల తన పిల్లలు ఈ వాతావరణంలో పెరిగితే దినదినాభివృద్ధి చెందుతారని నమ్మకంగా చెప్పారు క్రిస్టిన్. కాగా, ఆమె గతేడాది అమెరికాని వీడుతూ భారత్‌లోనే ఎందుకు నివశించాలనుకుంటుందో వివరిస్తూ ఓ వీడియోని షేర్ చేశారామె. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: స్ట్రోక్ బారినపడిన జెరోధా సీఈవో నితిన్ కామత్..ఏకంగా 14 నెలలు..!) -
రాజకీయ ప్రకంపనలు.. మూడోసారి అధికారంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడంపై తాను జోక్ చేయడం లేదంటూ మాట్లాడారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. దీంతో, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో కొత్త చర్చకు దారి తీశాయి.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి అవకాశం, మార్గాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఓ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో చాలా మంది ప్రజలు.. నన్ను మూడోసారి ఎన్నిక కావాలని కోరుతున్నారు. నాకు పనిచేయడం అంటే ఇష్టం. అమెరికా ప్రజలు కోసం ఎంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడను. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాను. ఇప్పుడు చేయాల్సింది చాలా మిగిలి ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు.రెండు మార్గాలు.. ఇదిలా ఉండగా.. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడు వంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది వ్యాఖ్యలు చేసినంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అమెరికాలో 2028లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
ట్రంప్‌కు షాకిచ్చిన ఇరాన్
దుబాయ్: అణు కార్యక్రమంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ సుప్రీం నేత ఖొమైనీకి రాసిన లేఖపై ఈ మేరకు అధికారికంగా స్పందించింది. అమెరికాతో చర్చల నుంచి తప్పించుకోవడం లేదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ స్పష్టం చేశారు. అలాగే, ట్రంప్ బాంబు దాడులు చేస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ క్షిపణులు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా మసూద్..‘ఎన్నో వాగ్దానాలను అమెరికా కాలరాసింది. దీనిపైనే మాకు భేదాభిప్రాయాలున్నాయి. ముందుగా ఆ దేశం మాకు నమ్మకం కలిగించాలి’ అని పేర్కొన్నారు. దీనిద్వారా పరోక్ష చర్చలు మాత్రమే సాధ్యమని చెప్పారు. పెజెష్కియాన్ స్పందనపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. ‘అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో చాలా స్పష్టతతో ఉన్నారు. ముందుగా ఆయన చర్చలకు దారి తెరిచారు. కాదన్న పక్షంలో ఇరాన్ అణు కార్యక్రమమే లక్ష్యంగా సైనిక చర్య చేపట్టే ప్రమాదం ఉంది’ అంటూ వ్యాఖ్యానించింది.మరోవైపు.. ఇరాన్‌ను అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అణు ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో.. ఆ దేశంపై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. ఈ క్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఒకవేళ అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు టెహ్రాన్ నిరాకరిస్తే.. బాంబు దాడులు తప్పవు. ఆ దేశం మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఇవి జరుగుతాయి. అదేవిధంగా మరో విడత ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ స్పష్టం చేశారు.ఇక, ట్రంప్ మొదటి హయాంలో ఇరాన్‌తో సంబంధాలు అంతంత మాత్రంగానే సాగాయి. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. టెహ్రాన్‌పై ఆంక్షలు విధించింది. అప్పటినుంచి అనేక ఏళ్లుగా పరోక్ష చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే మరోసారి అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ ఇటీవల సంసిద్ధత వ్యక్తం చేశారు. ‘ఇరాన్‌తో ఒప్పందానికే ప్రాధాన్యం ఇస్తా. ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయాలనుకోవడం లేదు. చర్చలకు వస్తారని ఆశిస్తున్నా. అలా చేయడమే వారికి ప్రయోజనకరం’ అని తెలిపారు. -
మార్కెట్‌కు గణాంకాలే కీలకం
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్ ఈ వారం ప్రధానంగా గణాంకాలపై ఆధారపడనుంది. దేశ, విదేశీ తయారీ, సర్వీసు రంగ గణాంకాలు ఈ వారంలో విడుదలకానున్నాయి. దీనికితోడు పలు దేశాలపై యూఎస్ ప్రభుత్వ తాజా టారిఫ్‌లు బుధవారం(2)నుంచి అమల్లోకి రానున్నాయి. వెరసి ఈ వారం మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా నేడు(31న) స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఇతర వివరాలు చూద్దాం.జీడీపీ ఎఫెక్ట్ గత కేలండర్ ఏడాది(2024) చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో యూఎస్ జీడీపీ అంచనాలకు అనుగుణంగా నెమ్మదించింది. తుది అంచనాల ప్రకారం వార్షిక ప్రాతిపదికన వృద్ధి 3.1 శాతం నుంచి 2.4 శాతానికి మందగించింది. అయితే కొత్త ప్రెసిడెంట్ ట్రంప్ తెరతీస్తున్న టారిఫ్‌లు ఆర్థిక వ్యవస్థకు మరిన్ని సవాళ్లు విసరనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బిజినెస్ ప్రణాళికలు, కన్జూమర్ వినియోగం తదితరాలపై ప్రతికూల ప్రభావం చూపే వీలున్నట్లు పేర్కొన్నారు. వెరసి ఈ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ప్రసరించనున్నట్లు అభిప్రాయపడ్డారు. సుంకాలపై కన్ను ఈ వారం అమల్లోకిరానున్న ట్రంప్ సుంకాల(టారిఫ్‌లు)పై ప్రపంచవ్తాప్తంగా ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ సీనియర్ వీపీ ప్రశాంత్ తాప్సే పేర్కొన్నారు. వీటితోపాటు గణాంకాలను సైతం పరిగణనలోకి తీసుకోనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలియజేశారు. మార్కెట్ ప్రభావిత అంశాలు కరవుకావడంతో గణాంకాలు, కీలక వాణిజ్య దేశాలపై యూఎస్ టారిఫ్‌లకు ప్రాధాన్యత ఏర్పడినట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా సైతం వివరించారు. అయితే గతేడాది క్యూ4 జీడీపీ నీరసించిన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం టారిఫ్‌లపై కఠినంగా వ్యవహరించకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. హెచ్ఎస్బీసీ పీఎంఐ బుధవారం మార్చి నెలకు హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పీఎంఐ గణాంకాలు వెల్లడికానున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం 56.3 నుంచి 57.6కు బలపడింది. అయితే శుక్రవారం(4న) విడుదలకానున్న మార్చి సర్వీసుల రంగ ఇండెక్స్ తొలి అంచనాలలో 59 నుంచి 57.7కు బలహీనపడింది. కాంపోజిటల్ పీఎంఐ సైతం 58.8 నుంచి 58.6కు స్వల్పంగా వెనకడుగు వేసింది. ఇక విదేశీ మారక నిల్వల వివరాలు సైతం 4న వెల్లడికానున్నాయి. ఇక ప్రపంచ దేశాలలో చైనా ఎన్బీఎస్, కైగ్జిన్ తయారీ గణాంకాలు మార్చి నెలకు సోమవారం(నేడు), మంగళవారం(1న) విడుదలకానున్నాయి. ఈ బాటలో ఫిబవ్రరి నెలకు యూరో దేశాల రిటైల్ ధరల ద్రవ్యోల్బణ రేటు 1న వెల్లడికానుంది. ఫిబ్రవరిలో కన్జూమర్ ధరల రేటు తొలి అంచనాల ప్రకారం 2.3 శాతంగా నమోదైంది. ఇదేరోజు యూఎస్ ఫిబ్రవరి ఐఎస్ఎం తయారీ ఇండెక్స్, ఉపాధి కల్పన గణాంకాలు విడుదలకానున్నాయి. 3న యూఎస్ ఐఎస్ఎం సర్వీసుల పీఎంఐ వెల్లడికానుంది. వారాంతాన(4న) వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు వెల్లడికానున్నాయి. ఇతర అంశాలు టారిఫ్‌లు, గణాంకాలతోపాటు.. ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో పలు ఇతర అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు వివరించారు. గతేడాది(2024) అక్టోబర్ నుంచీ అమ్మకాల యూటర్న్ తీసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఉన్నట్టుండి గత వారం నికర పెట్టుబడిదారులుగా స్టాక్స్ కొనుగోలు చేశారు. అయితే వారాంతాన(28న) తిరిగి భారీగా అమ్మకాలు చేపట్టారు. దీంతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు లేదా అమ్మకాలకు ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఇదేసమయంలో డాలరు ఇండెక్స్ బలహీనపడటం, దేశీ కరెన్సీ ఒక్కసారిగా బలపడటం మార్కెట్లకు జోష్నిచి్చనట్లు పేర్కొన్నారు. దిగుమతుల బిల్లుపై ప్రభావం చూపే ముడిచమురు ధరలు వెనకడుగు వేస్తున్నప్పటికీ బంగారం ధరలు మెరుస్తుండటం కొంత ప్రతికూలమేనని తెలియజేశారు.గత వారమిలా.. గత వారం(24–28) దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య నికరంగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 509 పాయింట్లు(0.7 శాతం) పుంజుకుని 77,415 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 169 పాయింట్లు(0.7%) బలపడి 23,519 వద్ద నిలిచింది. అయితే తిరిగి చిన్న షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం నీరసించింది. స్మాల్‌క్యాప్ మరింత అధికంగా 1.4% క్షీణించింది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2024–25)లో సెన్సెక్స్ 3,764 పాయింట్లు (5.1%) ర్యాలీ చేయగా.. నిఫ్టీ 1,192 పాయింట్లు (5.3 శాతం) లాభపడింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్‌క్యాప్ 5.6%, స్మాల్ క్యాప్ 8 శాతం చొప్పున ఎగశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 25,90,547 కోట్లు పెరిగి 4,12,87,647 కోట్ల(4.82 లక్షల కోట్ల డాలర్లు)కు చేరింది.ఎఫ్‌పీఐల కొనుగోళ్లుకొద్ది నెలుగా అమ్మకాలకే అధికంగా ఆసక్తి చూపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల పెట్టుబడులవైపు దృష్టి మరల్చారు. వెరసి గత ఆరు సెషన్లలో నికరంగా రూ. 31,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. పలు కంపెనీల షేర్లు అందుబాటు ధరల్లోకి రావడంతో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఇటీవల మార్కెట్లు భారీ నష్టాల నుంచి బయటపడి 6 శాతం పుంజుకోడం గమనార్హం. కాగా.. తాజా పెట్టుబడుల ప్రభావంతో మార్చి నెలలో ఎఫ్‌పీఐల నికర అమ్మకాలు రూ. 3,973 కోట్లకు పరిమితమయ్యాయి! ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, జనవరిలో మరింత అధికంగా రూ. 78,027 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్న విషయం విదితమే. -
ఒప్పందానికి రాకపోతే అమెరికా ‘బాంబు’ రుచి చూపిస్తాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమ న్యూక్లియర్ డీల్(అణు ఒప్పందం) కు ఇరాన్ అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ తమతో అణు ఒప్పందానికి దూరంగా ఉంటే మాత్రం అమెరికా బాంబు రుచి చూపిస్తామని ట్రంప్ ఘాటుగా స్పందిచారు. ఓ టెలివిజన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల క్రితం మీకు చేతనైంది చేసుకోండి అంటూ ట్రంప్ కు వీడియో సందేశాన్ని పంపిన ఇరాన్ కు మరోసారి అల్టిమేటం జారీ చేశారు. తాను నాలుగేళ్ల క్రితం ఏదైతే చేశానో దాన్ని ఇరాన్ మళ్లీ రుచి చూడాల్సి వస్తుందన్నారు.మీ ఇష్టమొచ్చింది చేసుకోండి.. ఇరాన్ఇరాన్తో అణు ఒప్పందం చేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెబుతూనే ఆ దేశం చర్చలకు రావాలని కొన్ని రోజుల క్రితం ఆహ్వానించారు ట్రంప్. అందుకు సుమారు రెండు నెలల డెడ్‌లైన్ విధిస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖపై ఇరాన్ అధ్యక్షుడు స్పందిస్తూ.. ట్రంప్‌తో చర్చలు జరిపేందుకు తాము సిద్ధం లేమని, ఆయనకు ఇష్టమొచ్చింది చేసుకోవచ్చు’అని పేర్కొన్నారు. అయితే అణు ఒప్పందం అనేది కేవలం అమెరికాతో సరిపోదనేది ఇరాన్ వాదన.2018లో ఇరాన్ తో ఒప్పందం రద్దుట్రంప్ తన మొదటి 2017-21 పదవీకాలంలో అంతక్రితం ఒమామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని కాస్తా రద్దు చేశారు. 2018 ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు ట్రంప్.కేవలం అమెరికా, ఇరాన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం కాదు కాబట్టి దాన్ని ట్రంప్ రద్దు చేశారు. వియన్నాలో 2015 జూలై 14న కుదిరిన ఆ ఒప్పందంపై భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాల(అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్)తో పాటు జర్మనీ, యూరప్ యూనియన్(ఈయూ)లు, ఇటు ఇరాన్ సంతకాలు చేయడంతో అమెరికా వైదొలిగింది.ఆ సమయంలో కారాలూ మిరియాలూ నూరిన రిపబ్లికన్లు తాము అధికారంలోకొస్తే ఒప్పందాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. ఇజ్రాయెల్ సైతం ఒప్పందాన్ని చారిత్రక తప్పిదంగా అభివర్ణించింది. ట్రంప్ ఏక పక్షంగా ఒప్పందం నుంచి వైదొలగినప్పుడు తమతో ఎందుకు చర్చించలేదని భాగస్వామ్య పక్షాలు ప్రశ్నించాయి. తాము మాత్రం ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ప్రకటించాయి. మరి ఇప్పుడు ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు ఏమాత్రం బెదరని ఇరాన్.. ఎలా స్పందిస్తుందో అనే దానిపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఇరాన్ దిగి వచ్చి.. అమెరికాతో అణుఒప్పందాన్ని చేసుకుటుందా.. లేక ‘సైనిక చర్యలకు సిద్ధంగా ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే. -
విదేశీ విద్యార్ధులపై అమెరికా మరో బాంబు
-
వీసా రద్దు చేశాం.. తక్షణం వెళ్లిపోండి
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక విధానాలను సమరి్థంచే వాళ్లెవరూ ఇక్కడ ఉండొద్దని, తక్షణం వెళ్లిపోవాలంటూ వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం హఠాత్తుగా రద్దుచేసింది. వీసా రద్దయిన నేపథ్యంలో కస్టమ్స్, అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) యాప్ లో నమోదుచేసుకుని స్వీయబహిష్కరణ ద్వారా అమెరికాను వదిలివెళ్లాలంటూ ఆయా వి ద్యార్థులకు ఈ–మెయిళ్లు, టెక్ట్స్ సందేశాలను పంపించింది. ఇలా బహిష్కరణ సందేశాలను అందుకున్న వారిలో భారతీయ విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న లక్షలాది భారతీయ విద్యార్థుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగాయి. గాజా యుద్ధంలో హమాస్‌కు, పాలస్తీనియన్లకు మద్దతు పలకడం, ఇజ్రాయెల్‌ను విమర్శించడం, యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ సంబంధిత సోషల్ మీడియా పోస్ట్‌లను సోషల్ మీడియా ఖాతాల్లో లైక్ చేయడం, షేర్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారి వీసాలను రద్దుచేశామని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్(డీఓఎస్) ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్–1 వీసాను రద్దుచేస్తూ సంబంధిత విద్యార్థులకు ఈమెయిల్ పంపించింది. ఈ సందర్బంగా ‘‘అమెరికా శరణార్థి, జాతీయత చట్టంలోని సెక్షన్ 221(ఐ) ప్రకారం మీ ఎఫ్–1 వీసా గడువును తక్షణం ముగిస్తున్నాం. అమెరికాను వీడటానికి ముందు కచ్చితతంగా అమెరికా ఎంబసీ/కాన్సులేట్‌లో మీ పాస్‌పోర్ట్‌ను చూపించండి. వాళ్లు మీ వీసాను స్వయంగా రద్దు చేస్తారు. ఆ తర్వాత సీబీపీ యాప్ సాయంతో స్వీయబహిష్కరణ విధానాన్ని వాడుకుని అమెరికాను వీడండి. అలా వెళ్లకపోతే మీమే మిమ్మల్ని బలవంతంగా బహిష్కరిస్తాం. మేం పంపితే మీ స్వదేశానికే పంపకపోవచ్చు. మా వీలును బట్టి మాకు అనువైన మరేదైనా దేశానికి తరలించే వీలుంది’’ అని ఈ–మెయిల్ సందేశంలో ప్రభుత్వం పేర్కొంది. 2023–24 ఏడాదికి విదేశీ విద్యార్థులకు సంబంధించిన ‘ఓపెన్ డోర్స్’నివేదిక ప్రకారం అమెరికాలో 11 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. వారిలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులే. -
విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు
వాషింగ్టన్: అమెరికాలో విదేశీ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో బాంబు వేసింది. వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ రాత్రికి రాత్రే వీసా రద్దు మెయిల్స్ పంపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీసాలు రద్దయిన విద్యార్థులు తక్షణమే దేశాన్ని వీడాలని లేదంటే బలవంతంగా తరలిస్తామని ఆ మెయిల్స్‌లో హెచ్చరించింది. వీసాలు రద్దైన వాళ్లలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. యూనివర్సిటీలలో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ మెయిల్స్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ‘బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ వీసా’ నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్ పంపింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన విద్యార్థులకు.. ఆఖరికి ఆ పోస్టులకు లైకులు కొట్టినవాళ్లకు కూడా ఈ హెచ్చరికలు పంపించింది.‘‘యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయచట్టంలోని సెక్షన్ 221(జీ) ప్రకారం.. మీ వీసా రద్దయింది. ఈ మేరకు స్టూడెంట్ ఎక్చ్సేంజ్ విజిటర్ ప్రోగ్రామ్‌కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్లింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు’’హెచ్చరిక సందేశాలు వచ్చినవారు.. తమ స్వదేశాలకు వెళ్లేందుకు సీబీపీ హోమ్ యాప్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ చర్యతో.. ఆన్లైన్లో యాక్టివ్‌గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది. -
అమెరికా తిప్పి పంపిన అక్రమ వలసదారులు 636 మంది
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 636 మంది భారతీయులను అమెరికా వెనక్కి పంపించింది. వీరిలో 341 మంది చార్టెర్డ్ విమానాల్లో, 55 మంది పనామా నుంచి వాణిజ్య విమానాల్లో, మిగతా 240 మంది వేర్వేరు వాణిజ్య విమానాల్లో చేరుకున్నారని లోక్‌సభలో విదేశాంగ శాఖసహాయ మంత్రి కృతి వర్దన్ సింగ్ ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అమెరికాలో ఉంటున్న 18 వేల మంది భారతీయ అక్రమ వలసదారులను వాపసు తీసుకునేందుకు కేంద్రం అంగీకరించిందంటూ వచ్చిన వార్తలపై టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ ప్రశ్నించగా..విదేశాల్లో ఉండే అక్రమ వలసదారులను వెనక్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత సంబంధిత దేశాలదేనని మంత్రి చెప్పారు. భారత్ ఒక్కటే కాదు..అంతర్జాతీయ సంబంధాల్లో అందరూ అంగీకరించిన సూత్రమని చెప్పారు. తమ నిర్బంధంలో ఉన్న మరో 295 మంది వ్యక్తుల సమాచారాన్ని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మన అధికారులకు అందజేసిందని మంత్రి చెప్పారు. వీరు మన జాతీయులేనా అనే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. అమెరికా ప్రభుత్వం తిప్పి పంపేవారికి అవసరమైన సాయాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. -
అమెరికాతో పాతబంధం ముగిసింది.. ప్రతిచర్య తప్పదు: మార్క్ కార్నీ
ఒట్టావా: అమెరికా-కెనడా మధ్య ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందంటున్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Mark Carney). ఆటో ఉత్పత్తులపై సుంకాలు విధింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలోనే కార్నీ ఇలా ఘాటుగా వ్యాఖ్యానించారు.ఆటో ఉత్పత్తులపై 25శాతం సుంకాలు విధిస్తానంటూ ట్రంప్(Trump Tariffs) తాజాగా వ్యాఖ్యానించారు. వచ్చే వారం నుంచి ఇది అమల్లోకి రానుండగా.. ఈ నిర్ణయం ఐదు లక్షల మంది ఉద్యోగులు పని చేసే కెనడా ఆటో పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో తన ఎన్నికల ప్రచారాన్ని సైతం పక్కన పెట్టి మరీ కార్నీ ఒట్టావా చేరుకుని కేబినెట్ భేటీ నిర్వహించారు. ట్రంప్ ఆటో టారిఫ్‌లను అన్యాయంగా అభివర్ణించిన కార్నీ.. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. అలాగే.. ట్రంప్ ఆటో టారిఫ్‌లకు కెనడా ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీ కెనడాకు ప్రధాని అయ్యారు. సాధారణంగా కెనడా ప్రధాని బాధ్యతలు చేపట్టాక అగ్రరాజ్య అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడడం ఆనవాయితీగా వచ్చేది. అయితే కార్నీ దానిని బ్రేక్ వేశారు. ఇప్పటిదాకా ఆయన ట్రంప్‌తో మాట్లాడకపోవడం గమనార్హం. ట్రంప్‌తో మాట్లాడడానికి తనకేమీ అభ్యంతరాలు లేవని.. అయితే తన దేశానికి తగిన గౌరవం ఇస్తేనే అది జరుగుతుందని కార్నీ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రాబోయే రెండు, మూడో రోజుల్లో ఇరు దేశాల అధినేతలు మాట్లాడుకోవచ్చని వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి.ఇదీ చదవండి: కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. అసలు ఎవరీయన? -
ఇంతటి ద్రోహాన్ని ఊహించలేదు: రంజినీ శ్రీనివాసన్
న్యూఢిల్లీ: తన వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేయడంతో తనకు తాను అమెరికాను వీడిన భారత్‌కు చెందిన పీహెచ్డీ విద్యార్థిని రంజినీ శ్రీనివాస్.. కొలంబియా యూనివర్శిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు పాటు పని చేసినందుకు తనకు ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొలంబియా యూనివర్శిటీ నుంచి ఈ తరహా ఉద్వాసన ఊహించలేదని, కానీ అది జరిగిందంటూ ఆమె అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈనెల రెండో వారంలో ఆమెపై పలు ఆరోపణలతో అమెరికా వీసా రద్దు చేయడంతో,.. స్వచ్ఛందంగా అమెరికాను వీడారు. గత డిసెంబర్ లో ఆమె వీసా రెన్యువల్ అయిన నెలల వ్యవధిలోనే దాన్ని రద్దు చేయడంపై ఆమె కలత చెందారు. అదే సమయంలో కెనడాకు వెళ్లిపోయారు రంజినీ శ్రీనివాసన్. దీనిలో భాగంగా తాజాగా ఆమె మాట్లాడుతూ..ఊహించలేదు.. కానీ జరిగింది.. ‘కొలంబియా యూనివర్శిటీలో ఐదేళ్లు ఉన్నాను. అక్కడ పని చేస్తూ నా పీహెచ్ డీని పూర్తి చేసే పనిలో ఉన్నా. కానీ ఇలా జరిగింది. నేను దీన్ని ఊహించలేదు. కొన్నిసార్లు అక్కడ వారానికి వంద గంటలు పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతటి ద్రోహాన్ని అస్సలు ఊహించనే లేదు’ అని అంతర్జాతీయ మీడియా ఏఐ జజీరాకుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే పీహెచ్ డీ పూర్తి కావడానికి సంబంధించిన తతంగాన్ని కొలంబియా యూనివర్శిటీ పూర్తి చేస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. యూఎస్ కు మళ్లీ వెళ్లే అవసరం లేదన్న రంజినీ శ్రీనివాసన్.. ఆ సంస్థ తనకు అర్హత ఇవ్వడం ఇప్పుడు ఒక లాంఛనప్రాయం మాత్రమే అని పేర్కొంది.నేను అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు..‘నా పీహెచ్‌డీకి సంబంధించిన అన్ని అర్హతలు పూర్తయ్యాయి, ఇంకా మిగిలి ఉన్నవి, దాని కోసం నేను అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు" అని ఆమె చెప్పింది, దీన్ని కొలంబియా పూర్తి చేయాలని, ఈ విషయాన్ని సదరు యూనివర్శిటీకి చెప్పడానికి యత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు.పాలస్తీనాకు మద్దతిచ్చారనే వీసా రద్దుకాగా, భారత పౌరురాలు, కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని రంజినీ శ్రీనివాసన్ వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆమె పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై వీసాను రద్దు చేశారు. అయితే, రంజినీ శ్రీనివాసన్ హింసకు మద్దతు ఇచ్చారనేందుకు వారి వద్ద ఏ ఆధారాలు ఉన్నాయో అధికారులు మాత్రం చెప్పలేదు.ఇదిలా ఉండగా.. గతేదాడి పాలస్తీనా-ఇజ్రాయెల్ దాడుల సందర్బంగా పాలస్తీనాకు అనుకూలంగా కొలంబియా యూనివర్సిటీలో నిరసనలు చేపట్టిన విదేశీయులపై ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వారిని అమెరికా నుంచి బహిష్కరించాలని, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ నివేదించింది. ఇందులో భాగంగానే పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. -
అమెరికా ఎంబసీ షాక్.. భారత్‌లో 2 వేల వీసా దరఖాస్తులు రద్దు
భారత్‌లోని యూఎస్ ఎంబసీ ఇటీవల వేల సంఖ్యలో వీసా దరఖాస్తులను రద్దు చేసింది. మోసపూరిత కార్యకలాపాలను నిరోధించే చర్యల్లో సుమారు 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రెండు నెలల క్రితం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమెరికా కొత్త ప్రభుత్వం కఠినమైన ఇమ్మిగ్రేషన్, వీసా విధానాన్ని చేపట్టింది. కారణం ఇదే.. వీసా అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్‌లో అవకతవకలపై యూస్ ఎంబసీ దృష్టి పెట్టింది. అందులో భాగంగా "బ్యాడ్ యాక్టర్స్" (అక్రమార్కలు) లేదా బాట్స్ (మెషీన్లు) ద్వారా అపాయింట్మెంట్ సిస్టమ్‌లో జరుగుతున్న ఉల్లంఘనల గుర్తించిన రాయబార కార్యాలయం ఆయా ఖాతాలను సస్పెండ్ చేసింది. ఇలా చేసిన సుమారు 2,000 వీసా అపాయింట్మెంట్లను రద్దు చేసింది. తమ షెడ్యూలింగ్ విధానాలను ఉల్లంఘించే ఏజెంట్లు, ఫిక్సర్ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తామని అమెరికా రాయబార కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. తక్షణమే ఈ నియామకాలను రద్దు చేస్తున్నామని, అనుబంధ ఖాతాల షెడ్యూలింగ్ అధికారాలను నిలిపివేస్తున్నామని పేర్కొంది.భారతీయులే ఎక్కువవిద్య, ఉద్యోగం, పర్యాటకం.. ఇలా వివిధ పనుల కోసం యునైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించే అతి ఎక్కువ మందిలో భారతీయులు ప్రముఖంగా ఉంటున్నారు. భారత్ లో అమెరికా వీసా దరఖాస్తులు గణనీయంగా బ్యాక్ లాగ్ లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా బీ1, బీ2 దరఖాస్తుదారుల్లో జాప్యం ఎక్కువ ఉంటోంది. ఈ వీసాలు వ్యాపారం, పర్యాటకం కోసం ఉద్దేశించినవి. 2022-23లో దరఖాస్తు చేసుకున్నవారు 800 నుంచి 1000 రోజుల వరకు వేచి ఉండాల్సి వచ్చింది.ఇలాంటి సుదీర్ఘ నిరీక్షణ సమయాన్ని ఎదుర్కోవడానికి, జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్, థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో భారతీయ దరఖాస్తుదారులకు అమెరికా వీసా అపాయింట్మెంట్లను తెరిచింది. వీసా వెయిటింగ్ టైమ్ గురించి భారత ప్రభుత్వం ఎప్పకప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది. 2022లో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో వీసా జాప్యంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని అప్పటి బైడెన్ ప్రభుత్వం పేర్కొంది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఇటీవల జనవరిలో వాషింగ్టన్ వెళ్లిన జైశంకర్ కొత్త విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మరోసారి ఈ అంశాన్ని లేవనెత్తారు.