విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు | US revoked Hundreds of international students Visas in Overnight Details | Sakshi
Sakshi News home page

విదేశీ విద్యార్థులపై అమెరికా మరో బాంబు

Published Sat, Mar 29 2025 12:33 PM | Last Updated on Sat, Mar 29 2025 5:29 PM

US revoked Hundreds of international students Visas in Overnight Details

వాషింగ్టన్‌: అమెరికాలో విదేశీ విద్యార్థులపై డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం మరో బాంబు వేసింది. వందల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ రాత్రికి రాత్రే వీసా రద్దు మెయిల్స్‌​ పంపినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీసాలు రద్దయిన విద్యార్థులు తక్షణమే దేశాన్ని వీడాలని లేదంటే బలవంతంగా తరలిస్తామని ఆ మెయిల్స్‌లో హెచ్చరించింది.  వీసాలు రద్దైన వాళ్లలో కొందరు భారతీయ విద్యార్థులు కూడా ఉన్నట్లు సమాచారం. 

యూనివర్సిటీలలో జరిగిన వివిధ ఆందోళనల్లో క్రియాశీలంగా వ్యవహరించిన అమెరికాలోని విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ శాఖ మెయిల్స్‌ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ‘బ్యూరో ఆఫ్‌ కాన్సులర్‌ అఫైర్స్‌ వీసా’ నుంచి విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ వెళ్తున్నాయి. స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఈమెయిల్స్‌ పంపింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన విద్యార్థులకు.. ఆఖరికి ఆ పోస్టులకు లైకులు కొట్టినవాళ్లకు కూడా ఈ హెచ్చరికలు పంపించింది.

‘‘యునైటెడ్ స్టేట్స్‌ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయచట్టంలోని సెక్షన్‌ 221(జీ) ప్రకారం.. మీ వీసా రద్దయింది. ఈ మేరకు స్టూడెంట్‌ ఎక్చ్సేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌కు బాధ్యత వహించే అధికారులకు సమాచారం వెళ్లింది. మీ వీసా రద్దు అంశం గురించి సంబంధిత కళాశాల యాజమాన్యానికి వారు తెలియజేయవచ్చు’’

హెచ్చరిక సందేశాలు వచ్చినవారు.. తమ స్వదేశాలకు వెళ్లేందుకు సీబీపీ హోమ్‌ యాప్‌ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ చర్యతో.. ఆన్‌లైన్‌లో యాక్టివ్‌గా ఉండటం వల్ల కలిగే పరిణామాలు, భావ ప్రకటనా స్వేచ్ఛ పరిమితులపై ఆందోళన రేకెత్తుతోంది.

భారతీయ విద్యార్థులకు ట్రంప్ డెడ్ లైన్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement