Mails
-
బెంగళూరులో మూడు కాలేజీలకు బాంబు బెదిరింపులు
బెంగళూరు: బెంగళూరులో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.బెంగళూరులోని మూడు ప్రముఖ కాలేజీలకు శుక్రవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావటంతో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. బీఎంఎస్ కాలేజీ, ఎంఎస్ రామయ్య కాలేజీ, బీఐటీ కాలేజీలకు బాంబు బెదిరింపులు రావటంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.Bengaluru Bomb Threat: Major Colleges, Including BIT, BMSCE and MSRIT Receive Bomb Threats; Probe Launchedhttps://t.co/BjoVZwox4e#Bengaluru #BIT #BombThreat— LatestLY (@latestly) October 4, 2024క్రెడిట్స్: LatestLYసమాచారం అందిన వెంటనే ఆయా కాలేజీల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్ , ఇతర సంబంధిత బృందాలు సెర్చ్ చేస్తున్నాయి. అవి నిజమైన బెదిరింపులా లేదా ఉత్తుత్తి బెదిరింపులా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. బెదిరింపులకు సంబంధించి.. హనుమంతనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.చదవండి: యూపీలో దారుణం.. నలుగురి కుటుంబ సభ్యుల హత్య -
150 స్కూళ్లకు బాంబు బెదిరింపు
సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాలలను బాంబులతో పేల్చేస్తామంటూ ఆగంతకులు పంపిన హెచ్చరికలు దేశ రాజధాని ఢిల్లీలోని బుధవారం ఉదయం తీవ్ర కలకలానికి కారణమయ్యాయి. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లోని 150 పైచిలుకు స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు మెయిల్స్ పంపారు. స్కూళ్లలో బాంబులు పెట్టామంటూ మెయిల్స్ అందడంపై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్యలో తమకు 97 ఫోన్ కాల్స్ వచ్చాయని ఢిల్లీ ఫైర్ సరీ్వస్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. మధ్యాహ్నం తర్వాతా కొన్ని కాల్స్ అందాయన్నారు. తూర్పు ఢిల్లీలోని 24 ప్రైవేట్ స్కూళ్లు, దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని 18 స్కూళ్లు, పశి్చమ ఢిల్లీ ప్రాంతంలోని 21, షాదారాలోని 10 పాఠశాలలకు బెదిరింపులు వచ్చినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో స్కూళ్ల వద్దకు చేరుకుని, తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లడం, పాఠశాలల నిర్వాహకులు మైక్‌ల ద్వారా తల్లిదండ్రులు సూచనలు ఇవ్వడం కనిపించింది. సోదాల్లో 20 బృందాలు ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసు బృందాలు సీపీ రవీందర్ యాదవ్ నేతృత్వంలోని బెదిరింపులు అందిన స్కూళ్లలో ప్రొటోకాల్ ప్రకారం పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కూడిన 20 బృందాలను రంగంలోకి దించారు. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కని పించకపోవడంతో అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని హోం శాఖ ప్రకటించింది.డార్క్‌నెట్ నుంచి మెయిళ్లు ఎటువంటి ఆధారాలు చిక్కకుండా డార్క్‌నెట్‌ను ఉపయోగించుకుని దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ట్చఠ్చీటజీజీఝఃఝ్చజీ . టu. అనే ఈ మెయిల్ ఐడీ నుంచి వచ్చిన ఈ మెయిళ్లన్నిటిలోనూ..‘మీరు ఎక్కడ కలుసుకున్నా వారిని చంపండి, వారు మిమ్మల్ని తరిమికొట్టిన ప్రదేశాల నుంచి వారినీ తరిమికొట్టండి. స్కూల్లో చాలా పేలుడు పదార్థాలున్నాయి..’అనే విషయమే ఉందని వెల్లడించింది. ఇందులోని సవరిమ్ అనే అరబిక్ పదాన్ని ఉగ్ర సంస్థ ఐఎస్ తరచూ వాడుతుంటుందని ఓ అధికారి తెలిపారు. బెదిరింపుల్లో పవిత్ర ఖురాన్‌ను కూడా ఉటంకించారని చెప్పారు. ఎన్నికల వేళ ప్రజల్లో భయాందోళనలను సృష్టించడానికి ఉగ్ర సంస్థలు పన్నిన కుట్రగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా భావిస్తూ లోతుగా దర్యాప్తు చేపడతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. విచారణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొంది. -
హై అలర్ట్: ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: దేశంలోని పలు ఎయిర్‌పోర్టులకు సోమవారం బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. జైపూర్, కాన్పూర్, గోవా ఎయిర్‌పోర్టులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్‌పోర్టుల్లో భద్రత పెంచారు. బాంబుల కోసం తనిఖీలు చేపట్టారు. అయితే బాంబు బెదిరింపు మెయిల్స్ ఉత్తుత్తివే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం పలు ఎయిర్‌పోర్టులకు ఈ తరహాలోనే బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్స్ ఉత్తుత్తివేనని పోలీసులు ఇప్పటికే తేల్చారు. -
చంచల
కంపెనీకారు వచ్చేసిందమ్మా.. నేను వెళ్లొస్తా అమ్మా... అంటూ బయటికి వేగంగా నడిచింది చంచల.కారు డోర్ తీసి కూర్చున్న చంచల.. కాస్త ఆశ్చర్యంగా.. ‘నీ పేరు?’ అంది.‘‘అప్పల్రాజు మేడం’’‘‘మరి సింహాద్రీ?’’‘‘ఆడు మా బావకొడుకు మేడం... ఆడికి నిన్న రాత్రి నుంచీ జ్వరం. అందుకని నేనొచ్చేను మేడం’’ అన్నాడు అప్పల్రాజు.చంచల ఫోన్లోనే ఆఫీస్ మెయిల్స్ చెక్ చూసుకుంటుంది. అప్పల్రాజు కారును సీతమ్మధార వద్దున్న వెంకటేశ్వర ఆలయం ముందు ఆపేడు.‘‘ఈయాల.. శనివారం కదా మేడం.. వెంకన్న బాబును చూసి వేగంగా వచ్చేస్తాను’’ అంటూ కదిలాడు అప్పల్రాజు.కాసేపటికి ‘‘మేడం.. ప్రసాదం తీసుకోండి!’’ అని చంచలకు పులిహోర ఉన్న డొప్పను అందించాడు అప్పల్రాజు. పులిహోర డొప్పను అందుకున్న చంచల.. కళ్లకు అద్దుకుని తినసాగింది.పదినిమిషాలు అయ్యాక అప్పల్రాజు కారును స్లో చేసి... వెనక్కి తిరిగి చూశాడు. చంచల ఓ పక్కకి వాలిపోయి ఉండటాన్ని చూసి నవ్వుతూ జేబులోని ఫోన్ అందుకున్నాడు.‘‘ఆ.. నేనే.. పని ఫినిష్ అయ్యింది. పావుగంటలో నీ ముందుంట. పిట్టను తీసుకో.. నాకు సొమ్ము ఇచ్చుకో..’’ అని ఫోన్ కట్‌చేసి కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. చంచల భారంగా కళ్లు తెరచింది. పరిసరాలను పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయింది. ఉన్న చోటు నుంచి కదిలేందుకు ప్రయత్నించి విఫలమైంది. అప్పల్రాజు ఇచ్చిన ప్రసాదంలో మత్తు మందు ఉందనీ.. తనను తెలివిగా కిడ్నాప్ చేశారని గ్రహించింది.అంతలో తలుపులు తెరుచుకున్నాయి.‘హలో.. నువ్వు క్షేమంగానే ఉన్నావ్!’ అంటూ దగ్గరకు వచ్చి నోటికి ఉన్న గుడ్డను విప్పేశాడు ఓ గడ్డం వ్యక్తి.‘ఎవరు నువ్వు... నన్నెందుకు తీసుకొచ్చావ్?’‘నా పేరు గురుపాదం, అందాన్ని వేటాడ్డమే నా పని’ అన్నాడావ్యక్తి నిర్లక్ష్యంగా తన గడ్డాన్ని సవరించుకుంటూ...‘నీకేం కావాలి?’‘లాభం! అందంతో వచ్చే లాభం! నువ్వు ఇక తిరిగి ఇంటికి వెళ్లే ఆశలు వదులుకో.. త్వరలోనే నిన్ను అరబ్ షేకులకు బేరం పెడతా. లక్షలు.. లక్షలు పట్టేస్తా!! ఇప్పటిదాకా చాలా మంది అమ్మాయిలని నీలానే కిడ్నాప్ చేసి అమ్మేశా. కాదంటే ఈ గదిలోనే చంపేస్తా.’ అన్నాడు గురుపాదం.గుండెల్లో పిడుగు పడినట్లు అయ్యింది చంచలకు...‘హెల్ప్.. హెల్ప్..’ అంటూ గట్టిగా అరిచింది.ఆమె అరుపులకు ఫక్కున నవ్విన గురుపాదం.. ఆమె చేతికి కాళ్లకి ఉన్న కట్లును కూడా విప్పేస్తూ.. ‘‘నువ్వు తప్పించుకోలేవ్.. పాపా! ఎందుకంటే నువ్వు శివారుల్లో ఉన్న రాజావారి తోట బంగళాలో ఉన్నావ్ నీ అరుపు కనీసం ఈ గది గోడలను కూడా దాటదు. తప్పించుకునే ప్రయత్నాలు మాని.. మెప్పించే ప్రయత్నం చెయ్యి!’’ అంటూ గది తలుపులు వేసి వెళ్లిపోయాడు గురుపాదం. ‘‘గురుపాదం.. నీకు లోను శాంక్షన్ అయ్యిందయ్యా... ఇదిగో కాగితాలు, లోన్ సెక్షన్‌కి వెళ్లి చెక్కు తీసుకో... మరి... నీ వంతు లాంఛనం....?’ అంటూ నసిగాడు బ్యాంక్ మేనేజర్.‘అది అలా వుంచండి సార్.. లేత పిట్ట వచ్చింది. ఈ రాత్రికి.. మీరొస్తే.... బాగుంటుంది. మళ్లా రెండు రోజుల్లో అరబ్ షేక్‌లు పట్టుకుపోతారు...’ అన్నాడు గురుపాదం చాలా చనువుగా.. అంగీకారంగా తలూపాడు బ్యాంక్ మేనేజర్. ఆ రోజు రాత్రి... బ్యాంక్ మేనేజర్ చంచల ముందు మైకంలో తూలుతున్నాడు. చంచల పరిస్థితిని అర్థం చేసుకుంది. ఈ ముసలివాడిని మందులో ముంచి తప్పించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా.. ఎదురుగా ఉన్న విస్కీ బాటిల్ తీసుకుని అతని చేతిలో ఉన్న గ్లాస్లో పోసి.. అతడి నోటికి అందించింది. అతడు ఆమెను చూస్తూ.. గ్లాస్ మీద గ్లాస్ ఖాళీ చేసి మత్తుగా మంచం మీదకు ఒరిగిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చెయ్యని చంచల.. బ్యాంక్ మేనేజర్ జేబులోంచి సెల్ ఫోన్ బయటకు తీసి.. పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసింది సహాయం కోరింది. అలికిడి కావడంతో ఖాళీ విస్కీ బాటిల్ అందుకున్న చంచల.. తలుపు వెనక దాక్కుంది. గదిలోపల కొచ్చిన గురుపాదం తల పగలగొట్టింది. కానీ, బయట తలుపులు తీసేందుకు ప్రయత్నించిన చంచలకు.. కిటికీలోంచి ఇంటి చుట్టూ ఉన్న గూండాలు కనిపించారు. దాంతో తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యకుండా పోలీసుల రాకకోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది.పోలీస్ సైరన్ విన్న గూండాలు పారిపోగా.. ఎస్సై గిరి.. కానిస్టేబుళ్లతో కలిసి తలుపు తీసుకుని వేగంగా లోనికొచ్చాడు. రక్తపు మడుగులో కదల్లేని స్థితిలో పడి ఉన్న గురుపాదాన్ని, మత్తులో తూలుతున్న బ్యాంక్ మేనేజర్ని కస్టడీలోకి తీసుకుంటూ.. చంచల సమయస్పూర్తిని అభినందించాడు. - మోహనారుద్ర -
బ్లాక్‘మెయిల్స్’తో హడల్
* వైద్య, ఆరోగ్యశాఖలో బ్లాక్ ‘మెయిల్’ రాజకీయాలు * అధికారులను బెంబేలెత్తిస్తున్న ఆ నలుగురు.. * అధికారిక సమాచారం చేరవేస్తూ అడ్డంగా దొరికిపోయిన వైద్యుడు * అర్బన్ ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు సాక్షి, గుంటూరు: వైద్య ఆరోగ్యశాఖలో ఆ నలుగురి దెబ్బకు ఉద్యోగులు, అధికారులు సైతం హడలిపోతున్నారు. జిల్లాస్థాయి అధికారులు మొదలుకొని రీజనల్ అధికారుల వరకూ అందరిపై ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. వీరికి అనుకూలంగా వ్యవహరించకపోతే బ్లాక్ ‘మెయిల్’ చేస్తూ బెదిరిస్తారు. నిత్యం 548 మంది అధికారులకు మెయిల్స్ ద్వారా ఫిర్యాదులు చేస్తుంటారు. వైద్య, ఆరోగ్యశాఖ రీజనల్, జిల్లా కార్యాలయాల్లో ప్రధానమైన పోస్టుల్లో ఏడుగురు మహిళా అధికారులు ఉన్నారు. బ్లాక్ మెయిలర్స్ బెదిరింపులకు వారు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా ఇదే తంతు... వైద్య ఆరోగ్యశాఖలో సుమారు నాలుగేళ్లుగా ఆ నలుగురు ఉద్యోగులు నిత్యం జిల్లా, జోనల్ వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాల్లో సమాచారం కావాలంటూ దరఖాస్తు చేస్తున్నారు. వారికి సంబంధించిన సమాచారం అడగకుండా ఇతర ఉద్యోగుల వివరాలన్నీ కోరుతున్నారు. అధికారులు ఇచ్చిన సమాచారంతో సంతృప్తి చెందక సమాచారాన్ని దాస్తున్నారని అధికారులపై సైతం ఫిర్యాదులు చేస్తున్నారు. రోజుకు 548 మంది మెయిల్‌కు ఫిర్యాదులు చేస్తుండడంతో ఏదో తప్పు చేయకపోతే మీపై ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఆ నలుగురిలో ఇద్దరు వైద్యులు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్న ఆ నలుగురిలో ఇద్దరు వైద్యులు సైతం ఉండడం గమనార్హం. నలుగురు ఉద్యోగులు ఓ ప్రైవేట్ వ్యక్తి మెయిల్‌కు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారాన్ని అందజేస్తున్నారు. కిందిస్థాయి ఉద్యోగులు జిల్లా అధికారుల వద్ద ఆ నలుగురి బెదిరింపుల గురించి మొరపెట్టుకుంటున్నారు. జిల్లా అధికారులు జోనల్ అధికారుల వద్ద, జోనల్ అధికారులు రాష్ట్ర స్థాయి అధికారుల వద్ద మొరపెట్టుకోవడమే తప్ప వారిపై చర్యలను తీసుకునే సాహసం ఎవరూ చేయడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌కు వెళ్లిన జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పద్మజారాణితో పాటు పలువురు జోనల్, జిల్లాస్థాయి అధికారులు ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు సైతం వీరు బ్లాక్ మెయిలర్స్పై ఫిర్యాదులు చేశారు. వ్యక్తిగత విషయాలపై ఆరా... వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఉద్యోగుల వ్యక్తిగత విషయాలను బయటపెట్టి బ్లాక్‌మెయిల్స్‌కు పాల్పడుతున్నట్లు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో జిల్లా అధికారులు పేర్కొన్నారు. వ్యక్తిగత విషయాలు బయటకు తెలిస్తే పరువుపోతుందనే భయంతో పలువురు అధికారులు వారికి ఎంతో కొంత డబ్బులను ముట్టజెప్పి మిన్నకుండిపోతున్నారు. వ్యక్తిగత విషయాలను చెప్పకుండా ఉండేందుకు అధిక మొత్తంలోనే డబ్బులను డిమాండ్ చేసి తీసుకుంటున్నట్లు తెలిసింది. కార్యాలయం పనులు పక్కనబెట్టి వారు అడిగిన సమాచారానికే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని వాపోతున్నారు. బ్లాక్ మెయిలర్స్పై విచారణ.. వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆదేశించినట్టు తెలిసింది. అధికారులను ఫోన్లలో బెదిరించిన ఫోన్ రికార్డులు సైతం పోలీసులు సేకరించినట్టు సమాచారం. వైద్య, ఆరోగ్యశాఖ సైట్ ద్వారా ప్రైవేట్ వ్యక్తుల మెయిల్స్‌కు సమాచారం అందిస్తూ ఓ వైద్యుడు ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోవడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా నాలుగేళ్లుగా వైద్య, ఆరోగ్యశాఖను కుదిపేస్తున్న బ్లాక్ మెయిలర్స్కు పోలీసులు చెక్ పెట్టనుండడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.