చంచల | funday crime story | Sakshi
Sakshi News home page

చంచల

Published Sun, Dec 24 2017 1:08 AM | Last Updated on Sun, Dec 24 2017 1:08 AM

funday crime story - Sakshi

కంపెనీకారు వచ్చేసిందమ్మా.. నేను వెళ్లొస్తా అమ్మా... అంటూ బయటికి వేగంగా నడిచింది చంచల.కారు డోర్‌ తీసి కూర్చున్న చంచల.. కాస్త ఆశ్చర్యంగా.. ‘నీ పేరు?’ అంది.‘‘అప్పల్రాజు మేడం’’‘‘మరి సింహాద్రీ?’’‘‘ఆడు మా బావకొడుకు మేడం... ఆడికి నిన్న రాత్రి నుంచీ జ్వరం. అందుకని నేనొచ్చేను మేడం’’ అన్నాడు అప్పల్రాజు.చంచల ఫోన్‌లోనే ఆఫీస్‌ మెయిల్స్‌ చెక్‌ చూసుకుంటుంది. అప్పల్రాజు కారును సీతమ్మధార వద్దున్న వెంకటేశ్వర ఆలయం ముందు ఆపేడు.‘‘ఈయాల.. శనివారం కదా మేడం.. వెంకన్న బాబును చూసి వేగంగా వచ్చేస్తాను’’ అంటూ కదిలాడు అప్పల్రాజు.కాసేపటికి ‘‘మేడం.. ప్రసాదం తీసుకోండి!’’ అని చంచలకు పులిహోర ఉన్న డొప్పను అందించాడు అప్పల్రాజు. పులిహోర డొప్పను అందుకున్న చంచల.. కళ్లకు అద్దుకుని తినసాగింది.పదినిమిషాలు అయ్యాక అప్పల్రాజు కారును స్లో చేసి... వెనక్కి తిరిగి చూశాడు. చంచల ఓ పక్కకి వాలిపోయి ఉండటాన్ని చూసి నవ్వుతూ జేబులోని ఫోన్‌ అందుకున్నాడు.‘‘ఆ.. నేనే.. పని ఫినిష్‌ అయ్యింది. పావుగంటలో నీ ముందుంట. పిట్టను తీసుకో.. నాకు సొమ్ము ఇచ్చుకో..’’ అని ఫోన్‌ కట్‌చేసి కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు.

చంచల భారంగా కళ్లు తెరచింది. పరిసరాలను పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయింది. ఉన్న చోటు నుంచి కదిలేందుకు ప్రయత్నించి విఫలమైంది. అప్పల్రాజు ఇచ్చిన ప్రసాదంలో మత్తు మందు ఉందనీ.. తనను తెలివిగా కిడ్నాప్‌ చేశారని గ్రహించింది.అంతలో తలుపులు తెరుచుకున్నాయి.‘హలో.. నువ్వు క్షేమంగానే ఉన్నావ్‌!’ అంటూ దగ్గరకు వచ్చి నోటికి ఉన్న గుడ్డను విప్పేశాడు ఓ గడ్డం వ్యక్తి.‘ఎవరు నువ్వు... నన్నెందుకు తీసుకొచ్చావ్‌?’‘నా పేరు గురుపాదం, అందాన్ని వేటాడ్డమే నా పని’ అన్నాడావ్యక్తి నిర్లక్ష్యంగా తన గడ్డాన్ని సవరించుకుంటూ...‘నీకేం కావాలి?’‘లాభం! అందంతో వచ్చే లాభం! నువ్వు ఇక తిరిగి ఇంటికి వెళ్లే ఆశలు వదులుకో.. త్వరలోనే నిన్ను అరబ్‌ షేకులకు బేరం పెడతా. లక్షలు.. లక్షలు పట్టేస్తా!! ఇప్పటిదాకా చాలా మంది అమ్మాయిలని నీలానే కిడ్నాప్‌ చేసి అమ్మేశా. కాదంటే ఈ గదిలోనే చంపేస్తా.’ అన్నాడు గురుపాదం.గుండెల్లో పిడుగు పడినట్లు అయ్యింది చంచలకు...‘హెల్ప్‌.. హెల్ప్‌..’ అంటూ గట్టిగా అరిచింది.ఆమె అరుపులకు ఫక్కున నవ్విన గురుపాదం.. ఆమె చేతికి కాళ్లకి ఉన్న కట్లును కూడా విప్పేస్తూ.. ‘‘నువ్వు తప్పించుకోలేవ్‌.. పాపా! ఎందుకంటే నువ్వు శివారుల్లో ఉన్న రాజావారి తోట బంగళాలో ఉన్నావ్‌ నీ అరుపు కనీసం ఈ గది గోడలను కూడా దాటదు. తప్పించుకునే ప్రయత్నాలు మాని.. మెప్పించే ప్రయత్నం చెయ్యి!’’ అంటూ గది తలుపులు వేసి వెళ్లిపోయాడు గురుపాదం.

‘‘గురుపాదం.. నీకు లోను శాంక్షన్‌ అయ్యిందయ్యా... ఇదిగో కాగితాలు, లోన్‌ సెక్షన్‌కి వెళ్లి చెక్కు తీసుకో... మరి... నీ వంతు లాంఛనం....?’ అంటూ నసిగాడు బ్యాంక్‌ మేనేజర్‌.‘అది అలా వుంచండి సార్‌.. లేత పిట్ట వచ్చింది. ఈ రాత్రికి.. మీరొస్తే.... బాగుంటుంది. మళ్లా రెండు రోజుల్లో అరబ్‌ షేక్‌లు పట్టుకుపోతారు...’ అన్నాడు గురుపాదం చాలా చనువుగా.. అంగీకారంగా తలూపాడు బ్యాంక్‌ మేనేజర్‌.

ఆ రోజు రాత్రి...
బ్యాంక్‌ మేనేజర్‌ చంచల ముందు మైకంలో తూలుతున్నాడు. చంచల పరిస్థితిని అర్థం చేసుకుంది. ఈ ముసలివాడిని మందులో ముంచి తప్పించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా.. ఎదురుగా ఉన్న విస్కీ బాటిల్‌ తీసుకుని అతని చేతిలో ఉన్న గ్లాస్‌లో పోసి.. అతడి నోటికి అందించింది. అతడు ఆమెను చూస్తూ.. గ్లాస్‌ మీద గ్లాస్‌ ఖాళీ చేసి మత్తుగా మంచం మీదకు ఒరిగిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చెయ్యని చంచల.. బ్యాంక్‌ మేనేజర్‌ జేబులోంచి సెల్‌ ఫోన్‌ బయటకు తీసి.. పోలీస్‌ స్టేషన్‌కి ఫోన్‌ చేసింది సహాయం కోరింది.

అలికిడి కావడంతో ఖాళీ విస్కీ బాటిల్‌ అందుకున్న చంచల.. తలుపు వెనక దాక్కుంది. గదిలోపల కొచ్చిన గురుపాదం తల పగలగొట్టింది. కానీ, బయట తలుపులు తీసేందుకు ప్రయత్నించిన చంచలకు.. కిటికీలోంచి ఇంటి చుట్టూ ఉన్న గూండాలు కనిపించారు. దాంతో తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యకుండా పోలీసుల రాకకోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది.పోలీస్‌ సైరన్‌ విన్న గూండాలు పారిపోగా.. ఎస్సై గిరి.. కానిస్టేబుళ్లతో కలిసి తలుపు తీసుకుని వేగంగా లోనికొచ్చాడు. రక్తపు మడుగులో కదల్లేని స్థితిలో పడి ఉన్న గురుపాదాన్ని, మత్తులో తూలుతున్న బ్యాంక్‌ మేనేజర్‌ని కస్టడీలోకి తీసుకుంటూ.. చంచల సమయస్పూర్తిని అభినందించాడు. 
- మోహనారుద్ర 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement