
ఉత్తరాఖండ్: పర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్(Uttarakhand)లో భారీగా కురుస్తున్న హిమపాతం భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. బద్రీనాథ్‌లోని మానా గ్రామం సమీపంలో సరిహద్దు రోడ్డు సంస్థ (బీఆర్‌ఓ) శిబిరంపై మంచు చరియలు విరిగిపడటంతో 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం సంభవించింది. ఈ దరిమిలా భారత సైన్యం, రెస్క్యూ ఆపరేషన్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. రెస్క్యూ సిబ్బంది మంచు పెళ్లల నుంచి 47 మందిని సురక్షితంగా వెలికి తీసుకువచ్చారు. మరో ఎనిమిదిమందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెండవ రోజున సహాయక చర్యలు తిరిగి ప్రారంభించిన భారత సైన్యం(Indian Army) మంచులో కూరుకుపోయిన మరో 14 మంది సిబ్బందిని రక్షించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారికి వైద్య చికిత్స అందించేందుకు హెలికాప్టర్ల ద్వారా జోషిమఠ్‌కు తరలించామని అధికారులు తెలిపారు. ఇంకా మంచులోనే కూరుకుపోయిన సిబ్బందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నిన్న(శుక్రవారం) రాత్రి చీకటి పడ్డాక సహాయక చర్యలను నిలిపివేశారు.
హిమపాత మరింతగా పెరగడంతో మంచులో కూరుకుపోయిన కార్మికులను కనుగొనడం రెస్క్యూ సిబ్బంది(Rescue crew)కి సవాలుగా మారింది. మొదటి రోజున రెస్క్యూ బృందాలు 33 మంది కార్మికులను రక్షించగలిగాయి. ఈ ప్రాంతంలో ఏడు అడుగుల మేరకు మంచు పేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ కార్యదర్శి వినోద్ కుమార్ సుమన్ తెలిపారు. ఇండో-టిబెట్ సరిహద్దులోని చివరి గ్రామమైన మానా వద్ద మంచును తొలగించే పనిలో నిమగ్నమైన 55 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు.

సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ
ఉత్తరాఖండ్ మంచు చరియల్లో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ముఖ్యమంత్రి పుష్కర్ ధామి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. తాజాగా ఘటనా స్థలంలో కొనసాగుతున్న పనుల గురించి తెలుసుకునేందుకు సీఎం దామికి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో
Comments
Please login to add a commentAdd a comment