Check
-
వాటర్ ఫిల్టర్ నీళ్లలో స్వచ్ఛత ఎంత? ఎలా ఎంచుకోవాలి?
ఈ రోజుల్లో శుద్ధమైన నీటిని తాగడమూ కొంత ప్రయాసతో కూడిన అంశంగా మారింది. భూగర్భ, నదీ జలాల కాలుష్యం, కొన్నాళ్ల పాటు నిల్వ ఉంచే వాటర్ ట్యాంకుల వల్ల స్వచ్ఛమైన నీటి కోసం వెతుకులాట తప్పడం లేదు. దీంతో చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్లను ఎంచుకుంటున్నారు. మార్కెట్లో లభించే రకరకాల వాటర్ ప్యూరిఫైయర్లలో కొన్ని నీటిని వడకట్టేవి, మరికొన్ని నీటి నుంచి పోషకాలు పోకుండా కాపాడేవి, ఇంకొన్ని మోతాదులో పోషకాలు కలిపేవి లభిస్తున్నాయి. ప్రకృతి సిద్ధంగా లభించే నీటిలోఉండే స్వచ్ఛత తెలుసుకోవడానికి అవగాహనే ప్రధానమైనది.ఎంపిక చేసుకున్న ప్యూరిఫైయర్ని ఆపరేటర్లు ఇంట్లో అమర్చాక టిడిఎస్ ఎంత ఉందో నాణ్యత చూపించి, మరీ వాటి గురించి వివరిస్తుంటారు. వరప్రదాయినిగా లభించే నీటిలోపోషకాలు ఏంటి, టిడిఎస్ ఏంటి.. అంటూ కొంత ఆందోళన పడుతుంటాం. ఖనిజాలు, లవణాలు, లోహాలతో సహా నీటిలో కరిగిన పదార్థాల మొత్తాన్ని కొలవడమే టిడిఎస్ (టోటల్ డిసాల్వ్డ్ సాలిడ్స్).నీటిలో టిడిఎస్ స్థాయి ఎంత మేరకు ఉండాలంటే...0-50 పిపిఎమ్ (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటే... దీనిని స్వేదనజలం అంటారు. అవసరమైన ఖనిజాలు,పోషకాలు లేకపోవడం వల్ల ఈ నీటిని తాగడానికి ఉపయోగించలేం 50-150 పిపిఎమ్ ఉంటే అవసరమైన ఖనిజాలు,పోషకాలు ఉన్నాయని, తాగడానికి మేలైనదని గుర్తించాలి 150 - 300 పిపిఎమ్ ఉంటే తాగడానికి మేలైనది300 - 500 పిపిఎమ్ ఉంటే ఆ నీరు ఆరోగ్య సమస్యలను తగ్గిస్తాయి 500-600 పిపిఎమ్ కంటే ఎక్కువ ఉంటే తాగడానికి మేలైనది కాదు.నీటి శుద్ధి యంత్రాల రకాలు: ఆర్వో (రివర్స్ ఓస్మోసిస్):అధిక టిడిఎస్ (300 పిపిఎమ్ కంటే ఎక్కువ)కు ఆర్వో ఉత్తమమైనది. ఇది, నీటిలో భార లోహాలు, రసాయనాలు, అదనపు లవణాలను తొలగిస్తుంది. అయితే, ముఖ్యమైన ఖనిజాలను కూడా తొలగించవచ్చు, కాబట్టి దీనిలోనూ మినరలైజర్ ఉన్న మోడల్‌ను ఎంచుకోవడం మేలు.యూవీ (అతినీలలోహిత) ఫిల్టర్: బ్యాక్టీరియా, వైరస్‌లకు వ్యతిరేకంగా, ప్రభావవంతంగా పనిచేస్తుంది. నీటిలో తక్కువ టిడిఎస్ ఉన్నప్పుడు యువి మోడల్ మంచిది.యూఎఫ్ అతినీలలోహిత ఫిల్టర్: ఈ మోడల్ వాటర్ ఫిల్టర్ యూవీ లాగానే ఉంటుంది. కానీ సస్పెండ్ చేయబడిన కణాలను కూడా యుఎఫ్ మోడల్ తొలగిస్తుంది. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు: రుచిని మెరుగుపరచడానికి, క్లోరిన్, సేంద్రీయ మలినాలను తొలగించడానికి ఈ ఫిల్టర్ బాగా ఉపయోగపడుతుంది. సరైన ప్యూరిఫైయర్‌ను ఎంచుకోవడం: అధిక టిడిఎస్ కోసం (300 పిపిఎమ్)RO లేదా RO+UV/UF ఎంచుకోవచ్చు తక్కువ టిడిఎస్ (300 పిపిఎమ్ లోపల ) కోసం UV+UF లేదా గురుత్వాకర్షణ ఆధారిత ప్యూరిఫైయర్లు సరిపోతాయి.మున్సిపల్ నీటి కోసం సాధారణ టిడిఎస్, యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్లు బాగా పనిచేస్తా.బోర్వెల్/హార్డ్ వాటర్‌లో అధిక టిడిఎస్ స్థాయిలు ఉంటాయి కాబట్టి ఆర్వో ఫిల్టర్ బాగా పనిచేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను తిరిగి కలపడానికి మినరలైజర్/టిడిఎస్ కంట్రోలర్ వంటి కొన్ని ఆర్వో ప్యూరిఫైయర్లు ఉన్నాయి ఇంట్లో వాడే వాటర్ ఫిల్టర్ ఎంపికను బట్టి టిడిఎస్ స్థాయిని కొలవడానికి మీరు టిడిఎస్ మీటర్‌ను ఉపయోగిస్తూ ఉండాలి. ఏవైనా మార్పులు కనిపిస్తే సంబంధిత ఆపరేటర్‌కు తెలియజేసి, ఫిల్టర్‌ను మార్చుకోవాలి. చదవండి: మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!శుద్ధమైన నీటిని తాగితే చాలు...గతంలో సంప్రదాయ పద్ధతిలో మరిగించడం అనేది ఒక పద్ధతిగా ఉండేది. దీని వల్ల కూడా కొన్ని పోషకాలు పోతున్నాయి అని గ్రహించారు. వాటర్ క్వాలిటీ కోసం టిడిఎస్‌ను చెక్ చేస్తాం. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని అవలంబిస్తుంది. ఆర్వో సిస్టమ్ అయితే సురక్షితం అనుకుంటాం. ఫిల్టర్ వరకు పర్వాలేదు. కానీ, వీటి ద్వారా కూడా నీటిలో కొన్ని పోషకాలు పోతుంటాయి. 100 శాతం క్లోరిన్, కాలుష్య శుద్ధి చేసి, నీటి నుంచి మనకు కావల్సిన పోషకాలు లభిస్తే చాలు. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ తాగితే చాలా ప్రయోజనాలు అని చెబుతుంటారు. వాటికి సంబంధించిన ఫిల్టర్లు కూడా వస్తున్నాయి. నీటిలో ప్రధానంగా ఉండే పొటాషియం, మెగ్నిషియమ్, ఐరన్ వంటివి ఉంటే చాలు. ఎక్కువ ΄ోషకాలు కలిపి మరీ తీసుకోవాల్సిన అవసరం లేదు. – సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్ -
Delhi air pollution: ‘గ్రాప్-4’ అమలును పర్యవేక్షించిన మంత్రి.. అధికారులకు సూచనలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం అందరినీ కలవరపెడుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధానంలోని నాల్గవ దశ అమలువుతోంది.గ్రాప్ విధానంలోని ఫేజ్-4 అమలును పర్యవేక్షించేందుకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం రాత్రి నరేలా-సింగు సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. గ్రేప్- 4లో ఢిల్లీలో రిజిస్టర్డ్ బీఎస్- ఫోర్, డీజిల్ పవర్డ్ మీడియం గూడ్స్ వెహికల్స్ (ఎంజీవీలు)నడవవు. ఈ సందర్భంగా గోపాల్ రాయ్ మాట్లాడుతూ ఢిల్లీలో కాలుష్య స్థాయిని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గ్రాప్ 4 అమలు చేసి, కాలుష్యం కలిగించే వాహనాల రాకపోకలపై నిషేధం విధించామని, అయితే ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అందుకే తాము తనిఖీలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. #WATCH | Delhi Environment Minister Gopal Rai says, "AAP govt is continuously working to mitigate the level of pollution in Delhi. Entry has been banned for those vehicles which cause pollution, as Grap 4 is implemented. Today, we have received several complaints that vehicles… https://t.co/Y5mm2frQYN pic.twitter.com/2DZEbtsuFV— ANI (@ANI) November 22, 2024రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు కళ్ల మంటలతో బాధపడుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 393గా నమోదైంది. గురువారంతో పోలిస్తే 22 ఇండెక్స్ పాయింట్లు పెరిగాయి. శని, ఆదివారాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణుల అంచనా. రాత్రి సమయంలో పొగమంచు కురిసే అవకాశాలున్నాయి.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తెలిపిన వివరాల(ఐఐటీఎం) ప్రకారం శుక్రవారం పశ్చిమ దిశ నుంచి గాలులు వీచాయి. ఈ సమయంలో గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వరకు ఉంది. సాయంత్రం ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇది కాలుష్య కారకాలు, ఘనీభవనానికి కారణమైంది. దీంతో ప్రజలు పొగమంచుతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇది కూడా చదవండి: UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్ సూచనలు -
ఒక్క క్లిక్‌తో ఆధార్ సెంటర్ లొకేషన్ తెలుసుకోండిలా
మీకు దగ్గరలో ఆధార్ కేంద్రం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారా? గూగుల్ మ్యాప్‌లో ఆధార్ సెంటర్ లొకేషన్ కనిపించడం లేదా? అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం లభించింది. గూగుల్ మ్యాప్ నావిగేష్ను తలదన్నేలాంటి టెక్నాలజీ మనముందుకొచ్చింది. దీనిని యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) రూపొందించింది. దీని సాయంతో ఒక్క క్లిక్‌తో సమీపంలో ఆధార్ కేంద్రం ఎక్కడుందో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్‌కు ‘భువన్ ఆధార్’ అని పేరు పెట్టారు.దీనిని యూఐడీఏఐ డివైన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆఫ్ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో(ఎన్ఆర్ఎస్సీ) సహాయంతో రూపొందించింది. ఇది వెబ్ ఆధారిత పోర్టల్. ఇది ఆధార్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నదని యూఐడీఏఐ చెబుతోంది.సాధారణంగా వినియోగదారులు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని గుర్తించేందుకు గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుంటారు. అయితే అన్ని సమయాల్లోనూ గూగుల్ మ్యాప్ ఖచ్చితమైన సమాచారం అందించలేదు. లేదా అప్డేట్ను అందించదు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే యూఐడీఏఐ ‘భువన్ ఆధార్’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో వినియోగదారులు ఆధార్ కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఈ పోర్టల్‌ను ప్రతీ 15 రోజులకు అప్డేట్ చేస్తుంటామని యూఐడీఏఐ తెలిపింది. #BhuvanAadhaarPortal #EaseOfLivingBhuvan Aadhaar Portal is facilitating Ease of Living by routing easy navigation to your nearest #authorized #Aadhaar Centre.To locate your nearest #AadhaarCentre visit: https://t.co/3Kkp70Kl23 pic.twitter.com/e7wEar5WXi— Aadhaar (@UIDAI) August 21, 2024 -
కళ్లు చెదిరే చీర అందాలు... ప్రేమమ్ బ్యూటీ (ఫొటోలు)
-
పిల్లులకు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇల్లు, తిండి ఫ్రీ!
పిల్లులను చాలామంది ఎంతో ప్రేమగా పెంచుకుంటుంటారు. అయితే పిల్లులను ప్రభుత్వ విధుల్లో వినియోగించే దేశమొకటుందని మీకు తెలుసా? ఇంతకీ ఆ దేశంలో పిల్లులు ఏ పనులు చేస్తాయి? ఈ వివరాలు మీ కోసం.. పిల్లులను ప్రభుత్వ కార్యకాలాపాల్లో వినియోగించే దేశం ఇజ్రాయెల్. ఇక్కడి రైల్వే స్టేషన్లలో పిల్లులు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నాయి. ఇజ్రాయిల్‌లో పిల్లుల జనాభా 20 లక్షలకు పైగానే ఉంది. జనాభాలో మనుషులతో పోటీ పడుతున్న పిల్లులకు ఉపాధి కల్పించాలని అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ నేపధ్యంలో వాటిని రైల్వే స్టేషన్ విధులలో నియమించింది. ఈ పిల్లులు ప్రయాణికుల టిక్కెట్లను తనిఖీ చేస్తుంటాయి. మీడియా కథనాల ప్రకారం ప్రభుత్వం ఈ పిల్లులకు టిక్కెట్లను తనిఖీ చేయడంపై శిక్షణ ఇస్తుంది. ఎవరైనా టికెట్ చూపించడానికి ఇష్టపడకపోతే, ఆ పిల్లులు వారికి ఎదురుతిరుగుతాయి. ఈ పిల్లులకు ఆహారంతోపాటు అవి ఉండేందుకు ప్రత్యేక స్థలం కూడా కేటాయిస్తారు. రైల్వే స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఈ పిల్లులను చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోతుంటారు. ఇజ్రాయెల్‌లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే అక్కడి ప్రభుత్వం పిల్లులను రైల్వేశాఖ విధుల్లో వినియోగిస్తోంది. దీనివలన ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం తగ్గుతోంది. శిక్షణ పూర్తయిన పిల్లులను విధుల్లో నియమిస్తారు. ఈ పిల్లులకు టిక్కెట్ చూపకుండా ఏ ప్రయాణికుడు కూడా రైల్వే ప్లాట్ఫారందాటి బయటకు వెళ్లలేరని రైల్వే అధికారులు చెబుతున్నారు. -
ఈ ప్రదర్శనను ఆపండి...!
న్యూఢిల్లీ: ఒక వైపు కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న ఓ మాతృమూర్తి..పరిహారం చెక్కు ఇస్తూ ఫొటో తీయించుకోవాలనే మంత్రి యావను చూసి అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రదర్శనను ఆపండి’ అంటూ అక్కడున్న వారిని వేడుకున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంత్రి తీరును ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఎండగట్టారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో యూపీలోని ఆగ్రాకు చెందిన కెప్టెన్ శుభమ్ గుప్తా అసువులు బాశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కు అందజేసేందుకు మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ శుక్రవారం ఆయన కుటుంబాన్ని కలుసుకున్నారు. తీవ్ర శోకంలో ఉన్న కెప్టెన్ శుభమ్ గుప్తా తల్లితో మంత్రి మాట్లాడారు. అనంతరం పరిహారం చెక్కు ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నించగా ఆమె తీసుకోలేదు. ‘నాకు ఏమీ వద్దు, ఈ ఎగ్జిబిషన్(ప్రదర్శని మత్ లగావో)ను ఇక ఆపండి’ అంటూ వేడుకున్నా చెక్కును అలాగే పట్టుకుని ఫొటో తీయించుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో రికార్డయింది. -
ఆన్‌లైన్‌లోకి ఇంజనీరింగ్ యాజమాన్య కోటా!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల బేరానికి చెక్ పడబోతోంది. దీనిపై నియంత్రణాధికారాన్ని ఉన్నత విద్యామండలి పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ నేతృత్వంలో మండలి ఉన్నతాధికారులు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యల మధ్య కీలక భేటీ జరిగింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తేవాలనే యోచనలో అధికారులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.10 లక్షల ఇంజనీరింగ్ సీట్లలో 70 శాతం కన్వినర్ కోటా కింద, మిగిలిన 30 శాతం సీట్లలో 15 శాతం ‘బీ’ కేటగిరీ కింద భర్తీ చేస్తున్నారు. మరో 15 శాతం సీట్లను ఎన్ఆర్ఐ కోటా కింద నింపుతున్నారు. నిబంధనల ప్రకారం బీ–కేటగిరీ కింద జేఈఈ ర్యాంకర్లకు ముందుగా సీటివ్వాలి. ఆ తర్వాత ఎంసెట్ ర్యాంకులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇంకా సీట్లు ఉంటే ఇంటర్ మార్కులు ఎక్కువగా వచ్చిన వారికి సీట్లివ్వాలి. ఈ కేటగిరీ సీట్లకు ప్రభుత్వం నిర్ణయించిన వార్షిక ఫీజు వర్తిస్తుంది. నిబంధనలకు యాజమాన్యాల తిలోదకాలు... అయితే ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ర్యాంకులు, మార్కుల ప్రామాణికత పాటించకుండా, ఎక్కువ డబ్బులిచ్చిన వారికే సీట్లు ఇస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇలాంటి ఫిర్యాదులు 40 వరకూ వచ్చాయి. ఒక్కో సీటునూ రూ. 18 లక్షల వరకూ కాలేజీలు అమ్ముకుంటున్నాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు సైతం చేశాయి. బీ–కేటగిరీ కింద దరఖాస్తు చేశామని చెప్పుకొనే ఆధారాలు లేకపోవడంతో మండలి అధికారులూ చర్యలు తీసుకోలేకపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నీట్ తరహాలో బీ–కేటగిరీ సీట్లనూ ఆన్లైన్ పరిధిలోకి తేవడం ద్వారా మెరిట్ ఉన్నవారికే సీట్లు వచ్చే వీలుందని భావిస్తున్నారు. అయితే ఎన్ఆర్ఐ కోటా సీట్లపై ఇంతవరకూ ఎలాంటి చర్చ జరగలేదు. ఫీజులపైనే పేచీ... ఇటీవల జరిగిన సమావేశంలో ప్రైవేటు కాలేజీలు ఫీజుల అంశాన్ని తెరమీదకు తెచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుకన్నా మూడు రెట్లు అదనంగా వసూలు చేసుకొనేందుకు అనుమతించాలని, అప్పుడే ఆన్లైన్ విధానానికి అనుమతిస్తామని పట్టుబట్టాయి. ఒక కాలేజీలో కన్వినర్ కోటా సీటు రూ. లక్ష ఉంటే బీ–కేటగిరీ సీటుకు ఏటా రూ. 3 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఎన్ఐసీ కొత్త డిమాండ్ ఇంజనీరింగ్ కన్వినర్ కోటా సీట్ల భర్తీ వ్యవహారానికి సాంకేతిక నిర్వహణ నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ చూస్తుంది. దీనికోసం ఏటా రూ. 60 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు బీ–కేటగిరీ సీట్ల విషయంలో అవసరమైన సాఫ్ట్వేర్ రూపొందించడంపై అధికారులు ఎన్ఐసీ సహకారం కోరారు. కేవలం ఇదొక్కటే చేయలేమని, దోస్త్ ద్వారా నిర్వహించే డిగ్రీ సీట్ల భర్తీని కూడా తమ పరిధిలోకి తేవాలని ఎన్ఐసీ మండలి ముందు కొత్త డిమాండ్ పెట్టింది. తలనొప్పి తగ్గుతుంది యాజమాన్య కోటా సీట్ల భర్తీ ఆన్లైన్లో చేపట్టడం వల్ల కాలేజీలు సీట్లు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలను దూరం చేయవచ్చు. పారదర్శకత కూడా పెరుగుతుంది. దీనిపై కాలేజీలను ఒప్పించేందుకు కృషి చేస్తున్నాం. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, చైర్మన్, ఉన్నత విద్యామండలి ఎన్ఆర్ఐ కోటానూ చేర్చాలి.. ఎన్ఆర్ఐ కోటా సీట్ల భర్తీని కూడా ఆన్లైన్ ద్వారా చేపడితే బాగుంటుంది. మూడు రెట్లు ఫీజులుంటే సీట్లు మిగిలిపోయే అవకాశం కూడా ఉండొచ్చు. అందువల్ల దీనిపైనా స్పష్టత ఇస్తేనే ఆన్లైన్ విధానం సంక్రమంగా ఉంటుంది. – ఎస్జీఎస్ మూర్తి, ఎంవీఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వైఎస్ ప్రిన్సిపల్ -
రూ.4.55 కోట్ల బంగారం పట్టివేత
జహీరాబాద్/సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సరిహద్దులో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నట్లు చిరాగ్పల్లి ఎస్ఐ నరేష్ తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి గ్రామ శివారులో 65వ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టు వద్ద కేంద్ర బలగాలతో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న స్కార్పియో వాహనంలో 6,986 గ్రాముల బంగారు నగలను స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.55 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు, హైదరాబాద్‌లో శుక్రవారం చేసిన తనిఖీల్లో రూ. 2,56,84,671 నగదును సీజ్ చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఒక ప్రకటనలో తెలిపారు. -
రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆటకట్టు
సాక్షి, అమరావతి: పేదల బియ్యాన్ని బొక్కే అక్రమార్కులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. పటిష్ట చర్యలతో బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్ధవంతంగా నిర్వహిస్తోంది. చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే నిత్యావసరాలను దారిమళ్లించడం, దుర్వినియోగానికి పాల్పడిన వారిపై 6ఏ కేసులతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తోంది. ఇప్పుడు దీర్ఘకాలికంగా బియ్యాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ, తరచూ పట్టుబడిన వ్యక్తులపై పీడీ యాక్టును ప్రయోగిస్తోంది. ప్రత్యేక కార్యాచరణతో సత్ఫలితాలు గతంలో రేషన్ బియ్యం విచ్చలవిడిగా అక్రమ రవాణా జరిగేది. వందల టన్నుల బియ్యం సరిహద్దులు దాటేసేది. మరోపక్క పేదలు తినే బియ్యంపై కొందరు అసత్య ప్రచారం చేసి, వాటిని తక్కువ రేటుకు కొని, తిరిగి పాలిష్ పట్టి మార్కెట్లోకి తెచ్చి అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేవారు. లారీలతో లోడ్లు తరలిపోతున్నా కేసులే నమోదయ్యేవి కావు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి అక్రమార్కుల ఆట కట్టిస్తోంది. రేషన్ బియ్యం రవాణాపై నిఘాను పటిష్టం చేసింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు, మండల నిల్వ పాయింట్లు, చౌక దుకాణాలు, ఎండీయూ వాహనాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నిరంతర నిఘా పెట్టడంతో చాలా వరకు అక్రమ రవాణా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు 743 మందిని అరెస్టు చేసింది. నిత్యావసర వస్తువుల చట్టం – 1955 సెక్షన్ 6ఏ ప్రకారం అక్రమ రవాణాలో పట్టుబడిన సరకులు, వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తోంది. ఈ కేసులు సత్వరం పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొని, అక్రమార్కులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తోంది. పట్టుబడిన బియ్యాన్ని వెంటనే తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తెస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. జిల్లాల్లో బియ్యం అక్రమరవాణాలో పట్టుబడ్డ సరుకు నిల్వల విలువ రూ.50 లక్షల లోపు ఉంటే జేసీలు, అంతకు పైబడి ఉంటే కలెక్టర్లకు కేసుల పరిష్కార బాధ్యతలను అప్పగించింది. ఫలితంగా ఏళ్లు తరబడి సీజ్ చేసిన సరుకు ముక్కిపోయి, పురుగులు పట్టి పాడవకుండా బహిరంగ వేలం ద్వారా వెంటనే తిరిగి మార్కెట్లోకి తెస్తోంది. ఇలా గడిచిన నాలుగేళ్లలో 6ఏ కేసులు 8,696 నమోదు చేస్తే, వాటిల్లో 4,565 కేసులను పరిష్కరించింది. మొత్తం 4.70లక్షల క్వింటాళ్ల స్టాక్‌ను స్వాధీనం చేసుకోగా, 2.82 లక్షల క్వింటాళ్ల బియ్యాన్ని తిరిగి పీడీఎస్, మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్ టైం మానిటరింగ్ 6ఏ కేసుల స్థితిగతులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే సీజ్ చేసిన స్టాక్ వివరాలను ఇందులో అప్లోడ్ చేస్తారు. జిల్లాలు, తేదీలు, నెలలవారీగా నమోదైన కేసులు, పరిష్కరించినవి, సీజ్ చేసిన స్టాకు, బయటకు విడుదల చేసిన స్టాక్ వివరాలను రియల్ టైమ్ మానిటరింగ్ చేసేలా ప్రత్యేక వ్యవస్థను రూపొందించారు. పీడీఎస్ బియ్యాన్ని దారి మళ్లించి, వాటిని రీసైక్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద చూపించడం, పాలిష్ పట్టి కొత్త ప్యాకింగ్‌లో మార్కెట్లో విక్రయించడాన్ని సంపూర్ణంగా నిరోధించే ప్రయత్నం చేస్తోంది. పటిష్ట నిఘాతో అక్రమ రవాణా కట్టడి ఇప్పటి వరకు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ బియ్యాన్ని సీజ్ చేసి పక్కన పెట్టేవారు. వాటిని పట్టించుకోకపోవడంతో తినడానికి పనికిరాకుండా పాడయ్యేవి. ఈ క్రమంలోనే మేము 6ఏ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాం. కేసులు వేగంగా పరిష్కారమయ్యేలా పర్యవేక్షిస్తున్నాం. దీనికి తోడు బ్లాక్ మార్కెట్ దందాకు పాల్పడే వారిని పీడీ యాక్టులో పెడుతున్నాం. పటిష్ట నిఘా ఉంది కాబట్టే కేసులు నమోదవుతున్నాయి. అంతేగానీ అక్రమ రవాణా జరిగిపోతున్నట్టు కాదు. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
TS: టికెట్ దక్కని సిట్టింగ్‌లకు ‘పవర్’ కట్
సాక్షి, హైదరాబాద్: ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించి నెల రోజులు కావస్తోంది. మరో నాలుగు నియోజకవ ర్గాలు జనగామ, నర్సాపూర్, గోషామహల్, నాంపల్లిలో అభ్యర్థుల ఎంపికను వాయిదా వేశారు. మల్కాజిగిరి స్థానం నుంచి టికెట్ ఇచ్చినా సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పార్టీకి రాజీ నామా చేయడంతో కొత్త అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో టికెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేల అధికారాలకు కత్తెర వేస్తూ, ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్న పార్టీ అభ్యర్థులను బలోపేతం చేసే దిశగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పావులు కదుపుతున్నారు. టికెట్ దక్కని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు (ఆసిఫాబాద్), రాథోడ్ బాపూరావు (బోథ్), భేతి సుభాష్‌రెడ్డి (ఉప్పల్), తాటికొండ రాజయ్య (స్టేషన్ ఘన్పూర్), రాములు నాయక్ (వైరా), చెన్నమనేని రమేశ్ బాబు (వేములవాడ), గంప గోవర్ధన్ (కామారెడ్డి) టికెట్ దక్కకున్నా పార్టీలోనే కొనసాగుతున్నారు. వారి రాజకీయ భవిష్యత్తుకు కేసీఆర్ భరోసా ఇవ్వడంతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటనలు చేశారు. కామారెడ్డిలో స్వయంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తుండటంతో గంప గోవర్ధన్ పార్టీ కేడర్‌ను సమన్వయం చేస్తున్నారు. అధికారాలకు కత్తెర సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తూ ఇతరులకు అవకాశం ఇచ్చిన నియోజ కవర్గాల్లో పార్టీ అభ్యర్థుల పనితీరును సీఎం కె.చంద్రశేఖర్‌రావు మదింపు చేశారు. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు పార్టీ అభ్యర్థి ఇద్దరూ క్షేత్రస్థాయి లో పర్యటనలు చేస్తుండటంతో పార్టీ కేడర్ అయోమయా నికి గురవు తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఇన్నాళ్లూ కలిసి పనిచేసిన నేతలు పార్టీ అభ్యర్థుల వెంట తిరిగేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితి పార్టీకి నష్టం చేస్తుందనే అంచనాకు వచ్చిన సీఎం కేసీఆర్ పార్టీ అధికారిక అభ్యర్థితో కలిసి పనిచేసేందుకు అనువైన వాతావరణం కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులోభాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల నుంచి అందే ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవద్దనే సంకేతాలు స్థానిక నేతలకు వెళ్లాయి. మరోవైపు అధికారిక యంత్రాంగానికి కూడా ఇదే తరహా సంకేతాలు అందినట్లు తెలిసింది. దీంతో నియోజకవర్గ స్థాయిలో టికెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సహాయ నిరాకరణ ఎదురవు తోంది. స్థానిక నేతలు, పార్టీ కేడర్ ఒకరొకరుగా అధికారిక అభ్యర్థికి చేరువవుతుండగా, అధికార కార్యకలా పాల్లో వీరి పాత్ర నామమాత్రంగా మారు తోంది. దీంతో తమను అధికార కార్యకలాపాలకు దూరంగా పెట్టడంపై టికెట్ దక్కని సిట్టింగులు అసంతృప్తికి లోనవుతున్నారు. వేములవాడ చెన్న మనేని రమేశ్ బాబును వ్యవసాయ రంగ ప్రధాన సలహా దారుగా నియమించడంతో ఆయన నియోజకవర్గానికి ఇప్పటికే దూరంగా ఉంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కకపోయినా ఆయన నియోజకవర్గంలో విస్తృ తంగా పర్యటించగా తాజాగా పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరితో రాజీ కుదిరింది. రాజయ్యకు ఇప్పటికే నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కేడర్ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుండగా, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కూడా ఇప్పటికే పార్టీ కీలక నేతలు దూరం పాటిస్తున్నారు. -
ఈ నెలలో ఇప్పటి వరకు 85 బాల్య వివాహాలకు చెక్
సాక్షి, అమరావతి: బాల్య వివాహాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి ప్రత్యేక దృష్టి సారించడం ఫలితాలనిస్తోంది. గత నెలలో 159 బాల్య వివాహాలను నివారించిన ప్రభుత్వ యంత్రాంగం.. ఈ నెలలో ఇప్పటి వరకు 85 బాల్య వివాహాలను నివారించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాల వారీగా బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే హాట్స్పాట్లను గుర్తించి అక్కడ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని, అక్షయ తృతీయ, శ్రావణ, మాఘ మాసాలు మొదలైన శుభ సందర్భాల్లో బాల్య వివాహాలు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాల నివారణకు జారీచేసిన మార్గదర్శకాలపై సంబంధిత సిబ్బందికి, అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. 15–18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలను, 15–21 సంవత్సరాల వయస్సు గల బాలురను గుర్తించి వారిని ఓపెన్ స్కూల్స్, ఇంటర్, ఇతర దూరవిద్య కార్యక్రమాల్లో చేర్పించాలని సీఎస్ ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలల బయట ఉన్న కౌమార బాలికలను గుర్తించి వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇప్పించాలని చెప్పారు. బాల్య వివాహాల నిషేధ అధికారులు ప్రతి మూడు నెలలకోసారి సమీక్షలు నిర్వహించాలని, బాల్య వివాహాల నివారణతో పాటు బాలల హక్కులు, బాలల రక్షణ సమస్యలపై స్కూల్స్, జూనియర్ కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. -
గోనె సంచుల సమస్యకు చెక్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 ధాన్యం సేకరణకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల ద్వారా 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం అవుతోంది. ఇందులో 5 లక్షల టన్నుల వరకు బాయిల్డ్ రకాలను కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించింది. ముఖ్యంగా ధాన్యం తరలింపులో గోనె సంచుల సమస్యను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌక దుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులను సేకరించి.. ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు తరలిస్తోంది. ఇక్కడ మిల్లులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చేసిన ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూరకంగా మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. వినియోగ చార్జీలు చెల్లింపు కేంద్ర ప్రభుత్వ నిబంధల ప్రకారం గోనె సంచుల (ఇప్పటికే ఒకసారి వినియోగించినవి) వినియోగానికి అయ్యే చార్జీలను సైతం మిల్లర్లకు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిల్లర్లు ఇచ్చే గోనె సంచుల నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వాటిని ధాన్యం నింపడానికి వినియోగించనున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సబ్ కలెక్టర్/ఆర్డీవోలు తమ పరిధిలోని మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ, రైస్ మిల్లర్ల నుంచి గోనె సంచుల సేకరణను పర్యవేక్షించనున్నారు. ఆయా సీజన్లలో కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మిల్లర్లు సరఫరా చేసిన గోనె సంచులను తిరిగి అప్పగించనున్నారు. -
భార్య చెక్కులతో తమాషాలా?
కర్ణాటక: భార్యకు చెప్పకుండా బ్లాంక్ చెక్కు ఉపయోగించి రుణం పొందడం ఆమెను మానసిక ంగా హింసించడంతో సమానమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ అంశం ఆధారంగా దంపతుల కు కింది కోర్టు మంజూరు చేసిన విడాకులను ఎత్తి చూపింది. గతంలో కుటుంబ న్యాయస్థానం భార్య పిటిషన్ మీద విడాకులు మంజూరు చేయడాన్ని ప్రశ్నిస్తూ మండ్య జిల్లా హొనగానహళ్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌కుమార్ ఏ.పాటిల్ ధర్మాసనం ఈ కేసును విచారించింది, భార్యను ఆమె భర్త బలిచ్చే గొర్రెగా చేశారని అభిప్రాయపడింది. అతని పిటిషన్‌ను సస్పెండ్ చేయాలని ఆదేశించింది. భార్యను భర్త మానసిక హింసకు గురిచేశారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. భార్యకు చెందిన చెక్కులను దుర్వినియోగం చేయడంపై పిటిషనర్ స్పందించడం లేదు. ఇదంతా కూడా భార్యను ఇబ్బంది పెట్టడం అని అర్థమవుతుంది. ఆ చెక్కుల ద్వారా అప్పులు చేయడం క్రిమినల్ కేసులతో కూడిన బెదిరింపులను మహిళ ఎదుర్కోవాల్సి వచ్చిందని న్యాయస్థానం తన తీర్పులో వెల్లడించింది. అంతేకాకుండా భర్త నడవడికతో భార్య అవమానం, మానసిక హింసను అనుభవించారు. ఈ అంశాన్ని కుటుంబ న్యాయస్థానం కూలంకుషంగా పరిశీలించి తీర్పును ప్రకటించిందని ధర్మాసనం పేర్కొంది. కుటుంబ న్యాయస్థానం అన్ని ఆధారాలను పరిశీలించి న్యాయసమ్మతమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల్లో ఎలాంటి లోపదోషాలు కనిపించలేదని న్యాయస్థానం తెలియజేసి, పిటిషన్ సస్పెండ్ చేయాలని ఆదేశించింది. -
సరిహద్దుపై నిఘా ఏర్పాటు చేయాలి
మంచిర్యాల:రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా ముందస్తుగా సరిహద్దు పోలీసు అధికారులు ఇప్పటి నుంచే సరికొత్త విధానంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని రామగుండం పోలీసు కమిషనర్ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం సరిహద్దు ప్రాంతాలకు చెందిన ఆరు జి ల్లాల ఎస్పీలతో రామగుండం పోలీసు కమిషనరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదకద్రవ్యాలు, మద్యం అమ్మకాలు, ఆయుధాలు, ఇతర అక్రమ రవాణా నియంత్రణపై దృష్టి సారించాలని అన్నారు. అంతర్జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు ప్రాంతాల గుర్తింపు, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా, ఉమ్మడి కూంబింగ్ ఆపరేషన్ ఏరియా డామినేషన్ తదితర 13రకాల అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పెద్దపెల్లి జిల్లా డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్, కుమురంభీమ్ జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్, జగి త్యాల ఎస్పీ భాస్కర్, భూపాలపల్లి జ్లిల్లా ఎస్పీ కర్ణాకర్, కరీంనగర్ రూరల్ ఏసీపీ టీ.కర్ణాకర్‌రావు, సరి హద్దు ప్రాంతాల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
మానవీయ కోణంలో సంక్షేమానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అన్నివర్గాలను పేదరికం నుంచి బయటపడేసేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. శనివారం ఎల్బీ స్టేడియంలో మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ ముస్లిం, క్రైస్తవ మైనారిటీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో మైనారిటీల సంక్షేమం కోసం సుమారు రూ.15 వేల కోట్లను ఖర్చు చేశామని తెలిపారు. మైనారిటీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి వంద శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధి దారుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఈ పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 27 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల మందికి రూ.లక్ష చొప్పున అందిస్తున్నామని తెలిపారు. మైనారిటీలకు కార్పొరేట్ స్థాయి విద్య.. మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సుమారు 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ విద్య అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం లక్షకు పైగా విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నామని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు అబ్దుల్ అహ్మద్ బిన్ బలాలా, జాఫర్ హుస్సేన్, కాలేరు వెంకటేశ్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘ప్రతిరోజూ నా అండర్వేర్ చెక్ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్‌కు వింత సమస్య!
ఎక్కడైనా ప్రేమికుడు లేదా భర్త తన భాగస్వామితో ‘నువ్వు కోరుకుంటే కొండ మీద కోతిని తెమ్మన్నా తెస్తానని’ అంటాడు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్ దీనికి భిన్నమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. అతని ఎనిమిదిమంది భార్యలు అతనిని సిక్స్ ప్యాక్‌లో చూడాలని కోరుకుంటున్నారు. జిమ్‌లో చెమటలు చిందిస్తూ.. తాజాగా బ్రెజీలియన్ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్థర్ ఓ ఉర్సో వార్తల్లోకి ఎక్కాడు. అతని 8 మంది భార్యలు సామూహికంగా తన ముందు ఒక విచిత్రమైన డిమాండ్ ఉంచారని, దానితో తనకు తలనొప్పులు ఎదురయ్యాయని ఆర్థర్ చెప్పుకొచ్చాడు. తన ఎనమండుగురు భార్యలు తనను సిక్స్‌ప్యాక్‌లో చూడాలని కోరుకుంటున్నారని, దీంతో తాను జిమ్‌లో చెమటలు చిందించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనితో పాటు ఆర్థర్ తన వైవాహిక జీవితం గురించి కూడా వెల్లడించాడు. తన భార్యలు ప్రతిరోజూ తన అండర్వేర్ చెక్ చేస్తారని తెలిపాడు. ఇందుకు వారికున్న ప్రత్యేక శ్రద్ధనే కారణమని తెలిపాడు. ఒకరితో విడాకులు 2022లో ఆర్థర్ 9 మంది యువతులను వివాహం చేసుకున్నప్పుడు వార్తల్లో నిలిచాడు. అయితే వీరిలో ఒక మహిళ అతని నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పడు ఆర్థర్ తన 8 మంది భార్యల డిమాండ్ మేరకు సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అలాగే శరీరంపై టాటూలు వేయించుకున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు ఆర్థర్ తనను తాను జిమ్‌కు సమర్పించుకున్నాడు. తన శరీరపు కొలతల్లో మార్పు వచ్చిదోలేదో తెలుసుకునేందుకు తన భార్యలు ప్రతీరోజూ తన అండర్‌వేర్‌ను కొలుస్తుంటారని ఆర్థర్ వెల్లడించాడు. ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ రూల్ వివాదాస్పదం సిక్స్‌ప్యాక్ కోసం ఆర్థర్ తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినడం మానివేశాడు. చివరికి బ్రెడ్, పాస్తా కూడా తినడంలేదని తెలిపాడు. ఒలింపిక్ ఎథలెట్స్ కోసం డిజైన్ చేసిన వ్యాయామాలను ఆర్థర్ అనుసరిస్తున్నాడు. కాగా ఆర్థర్ 9 మంది భార్యలతో ఉన్నప్పుడు తాను పిల్లలను కనాలనుకుంటే ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ రూల్ పాటిస్తానని తెలిపాడు. అప్పట్లో ఆర్థర్ చేసిన ఈ వ్యాఖ్యానం పెద్ద దుమారమే రేపింది. ఇది కూడా చదవండి: శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే! -
ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా: హాట్ టాపిక్‌గా ఆ చెక్
బిలియనీర్ ఇన్వెస్టర్ 'వారెన్ బఫెట్ ఆఫ్ ఇండియా'గా పాపులర్ అయిన బిలియనీర్ రాకేష్ ఝన్‌ఝన్‌వాలా కన్నుమూసి నేటితో సంవత్సరం. ఇప్పటికీ ఇప్పటికీ, దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులకు ఆయనంటే ఎనలేని ప్రేమ, అభిమానం. అంతేకాదు మార్కెట్ నిపుణులు అతని పెట్టుబడి సూత్రాలను, సక్సెస్‌మంత్రాను కథలు కథలుగా గుర్తు చేసుకుంటారు. ముఖ్యంగా మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసిన సమయంలో కూడా ఆయన బుల్లిష్‌గా ఉన్నారు. స్టాక్మార్కెట్లో షేర్ల కొనడం, అమ్మడం అనేది తెలివికి సంబంధించిన చర్యలు కాదు జ్ఞానానికి సంబంధించి అంటారాయన. తాజాగా ఆయనకు సంబంధించి ఒక విషయం విశేషంగా మారింది. రాకేశ్ ఝన్‌ఝన్ వాలా రాసిచ్చిన అతిపెద్ద చెక్ ఇపుడు హాట్‌టాపిక్‌గా మారింది. రేర్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ ఉత్పల్ షేత్ ప్రకారం, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కోకి రూ.1,500 కోట్ల చెక్కును రాసిచ్చారట.. అయితే ఇది పోర్ట్‌ఫోలియోలో 10శాతం కూడా కాదు ఆయన పెట్టుబడులను వివిధ షేర్లలో పెట్టేవారని కూడా ఆయన చెప్పారు. చార్టర్డ్ అకౌంటెంట్, రాకేష్ ఝన్‌ఝన్‌వాలా తన స్టాక్ మార్కెట్ పెట్టుబడులను 1980ల ప్రారంభించారు. కేవలం రూ. 5,000తో ప్రారంభించి, అద్భుతమైన విశ్లేషణతో పోర్ట్‌ఫోలియోను విస్తరించుకుని భారీ లాభాలను ఆర్జించారు. 2002 తర్వాత దశాబ్దం తర్వాత, ఆయన సంపాదన బిలియన్ల డాలర్లకు చేరింది.బిగ్ బుల్ మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎలా ఎంపిక చేసుకుంటారనే విషయంపై 'ది బిగ్ బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్: హౌ రాకేష్ జున్‌జున్‌వాలా మేడ్ హిస్ ఫార్చ్యూన్' పుస్తకంలో కొన్ని కీలక అంశాలను చర్చించారు. తన అసెట్ మేనేజ్మెంట్ సంస్థ రేర్ (రాకేష్, భార్య రేఖా పేర్లలోని లోని తొలి అక్షరాలను కలిపి) ఎంటర్ప్రైజెస్ ద్వారా ఆగస్ట్ 14, 2022 నాటికి ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం సుమారు రూ. 46,000 కోట్లు పెరిగింది.ఐదు పరిమిత బాధ్యత భాగస్వామ్య సంస్థలతో పాటు రేర్ ఈక్విటీ ప్రైవేట్ లిమిటెడ్, రేర్ ఫ్యామిలీ ఫౌండేషన్ మరియు హోప్ ఫిల్మ్ మేకర్స్ అనే మూడు సంస్థలలో డైరెక్టర్‌గా ఉన్నారు.ఫోర్బ్స్ జాబితా 2022లో 438వ బిలియనీర్‌గా ర్యాంక్‌ను సాధించారు. 2021 జాబితా ప్రకారం అతను భారతదేశంలో 36వ అత్యంత సంపన్నుడు. కాగా 1960 జులై 5న పుట్టిన రాకేష్ ఝన్‌ఝన్‌వాలా 62 ఏళ్ల వయసులో గత ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో కన్నుమూసారు. మరణానంతరం ఆయనకు వాణిజ్యం మరియు పరిశ్రమల రంగానికి చేసిన కృషికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మశ్రీ లభించింది. ఈ అవార్డును రేఖా ఝన్‌ఝన్ వాలా అందుకున్నారు -
నిజాయితీకి నిలువుటద్దం కలాం: ఆ చెక్కను జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి
న్యూఢిల్లీ: ‘ఇతరులు ఇచ్చే కానుకలు, బహుమానాల వెనుక స్వార్థపూరిత కారణం ఉండొచ్చు. మన నుంచి ఏదో ఒకటి ఆశించి ఇలాంటివి ఇస్తుంటారు. అది స్వీకరించే ముందు ఈ విషయం ఆలోచించాలి’.. ప్రఖ్యాత సైంటిస్ట్, భారతరత్న, దివంగత రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బాల్యంలోనే తన తండ్రి వద్ద నేర్చుకున్న పాఠమిది. ఈ పాఠాన్ని జీవితాంతం ఆయన ఆచరించారు. విలువలకు, నిజాయతీకి మారుపేరైన అబ్దుల్ కలాం ఇతరుల నుంచి ఏనాడూ కానుకలు ఆశించలేదు. ఎవరైనా ఇలాంటివి ఇస్తే దాని ధర ఎంతో తెలుసుకొని చెక్కు లేదా డబ్బులు పంపించేవారు. మిస్సైల్ మ్యాన్ కలాం గొప్పతనాన్ని తెలియజేసే మరో సంఘటన వెలుగులోకి వచి్చంది. కలాంకు సంబంధించిన ఈ ఉదంతాన్ని ఐఏఎస్ అధికారి ఎం.వి.రావు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2014లో కలాం ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘సౌభాగ్య వెట్ గ్రైండర్’ అనే సంస్థ ఆయనకు ఒక గ్రైండర్‌ను బహూకరించింది. దాన్ని స్వీకరించడానికి ఆయన తొలుత అంగీకరించలేదు. చివరకు బలవంతం మీద స్వీకరించారు. ఆ మరుసటి రోజే దాని ధర తెలుసుకొనేందుకు తన సహాయకుడిని మార్కెట్‌కు పంపించారు. తర్వాత తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి చెక్కును సౌభాగ్య సంస్థకు పంపారు. చెక్కును ఆ సంస్థ నగదుగా మార్చుకోకపోవచ్చన్న అనుమానం ఆయనకు వచ్చింది. తన బ్యాంకు ఖాతా నుంచి నగదు డెబిట్ అయ్యిందో లేదో కనుక్కున్నారు. కాలేదని తెలిసింది. గడువులోగా నగదుగా మార్చకోకపోతే గ్రైండర్‌ను వెనక్కి ఇచ్చేస్తానని సౌభాగ్య సంస్థకు కలాం సమాచారం పంపారు. ఇక చేసేది లేక ఆ సంస్థ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేసి, డబ్బులు తీసుకుంది. అబ్దుల్ కలాం ఇచ్చిన చెక్కును జిరాక్స్ తీసి, ఫ్రేమ్ కట్టించి భద్రంగా దాచుకుంది. ఎం.వి.రావు షేర్ చేసిన పోస్టుపై నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురిపిస్తున్నారు. కలాం వ్యక్తిత్వాన్ని గుర్తుచేసుకుంటున్నారు. -
బాలింతల్లో రక్తహీనతకు చెక్
సాక్షి, అమరావతి: ప్రసూతి మరణాల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రసవానంతరం చోటు చేసుకుంటున్న మాతృ మరణాల్లో 60 శాతం రక్తహీనత కారణంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలింతల్లో రక్తహీనతకు చెక్ పెట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మధ్యస్థ, తీవ్ర రక్తహీనతతో బాధపడే బాలింతలకు వచ్చే వారం నుంచి ఫెర్రిక్ కార్బాక్సి మాల్టోస్ (ఎఫ్సీఎం) ఇంజెక్షన్లను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. బహిరంగ మార్కెట్లో సుమారు రూ.2 వేలకుపైగా ఉన్న ఈ ఇంజెక్షన్లను ప్రసవానంతరం బాలింతలకు ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఆస్పత్రులకు ఇంజెక్షన్ల సరఫరా రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల ప్రసవాలు నమోదవుతున్నాయి. వీరిలో 28 శాతం మంది వరకు మహిళల్లో రక్తహీనత ఉంటోందని వైద్యశాఖ అంచనా. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో బిడ్డకు జన్మనిచ్చి డిశ్చార్జి అనంతరం ఇంటికి వెళ్లే ముందు బాలింతలకు హిమోగ్లోబిన్ (హెచ్‌బీ) టెస్ట్ నిర్వహిస్తారు. మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఆస్పత్రిలోనే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేసి డిశ్చార్జి చేస్తారు. మూడు వారాల అనంతరం వీరికి మళ్లీ హెచ్‌బీ టెస్ట్ నిర్వహించి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగాయా.. లేదా.. అని పరీక్షిస్తారు. దీని ఫలితం ఆధారంగా అవసరమైతే రెండో డోసు కూడా ఇస్తారు. దుష్ప్రభావాలు ఉండవు.. క్లినికల్ ట్రయల్స్‌లో మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి వెయ్యి ఎంజీ గరిష్ట మోతాదులో ఎఫ్సీఎం ఇంజెక్షన్ వేయగా, మూడు వారాల్లో సుమారు 1.5 శాతం మేర హిమోగ్లోబిన్ పెరిగినట్టు వెల్లడైంది. ఈ ఇంజెక్షన్ ద్వారా ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తేలింది. ప్రసవానంతరం బాలింతలకు ఇంజెక్షన్ వేయడంపై న్యూఢిల్లీ ఎయిమ్స్‌లోని నేషనల్ అనీమియా కంట్రోల్, రీసెర్చ్ విభాగం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ సహా పలు రాష్ట్రాల్లో బాలింతలకు ఎఫ్సీఎం ఇంజెక్షన్లు వేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిశీలన అనంతరం బాలింతలకు ఇంజెక్షన్లు వేయడం సురక్షితమేనని నిర్ధారణకు వచ్చాక మన రాష్ట్రంలోనూ పంపిణీకి చర్యలు చేపట్టారు. మార్గదర్శకాలు జారీ చేశాం రూ.8.46 కోట్ల విలువ చేసే ఎఫ్సీఎం ఇంజెక్షన్ వెయిల్స్‌ను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) సెంట్రల్ డ్రగ్ స్టోర్లకు సరఫరా చేశారు. అక్కడి నుంచి ఆస్పత్రులకు చేరుస్తున్నారు. సోమవారం నుంచి బాలింతలకు ఇంజెక్షన్ల పంపిణీ మొదలుపెడతాం. రక్తహీనత నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఉచితంగా మాత్రలు పంపిణీ చేసినా కొందరు వాడకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి మధ్యస్థ, తీవ్ర రక్తహీనత ఉన్నవారికి ఎఫ్సీఎం ఇంజెక్షన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. బాలింతల్లో రక్తహీనతను నివారించడానికి ఇవి దోహదపడతాయి. – డాక్టర్ కేవీఎన్‌ఎస్ అనిల్‌కుమార్, అదనపు సంచాలకులు, వైద్య శాఖ -
లోదుస్తులు విప్పమన్నారు.. నీట్ విద్యార్థినుల ఆవేదన! ఎలా పరీక్ష రాసేది?
న్యూఢిల్లీ: నీట్ పరీక్ష జరిగిన ప్రతిసారి నేషనల్ టెస్డింగ్ ఏజెన్సీ కఠిన నిబంధనలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈసారి కూడా పలువురు విద్యార్థులు పరీక్ష కేంద్రంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించి కన్నీటి పర్యంతమయ్యారు. తమ బ్రా స్టాప్‌లు చెక్ చేశారని, లో దుస్తులు కూడా విప్పమన్నారని పలువురు అమ్మాయిలు వాపోయారు. పరీక్షకు ముందు సున్నిత విషయాల్లో తమను ఇలా ఇబ్బంది పెడితే ఎగ్జామ్ ప్రశాంతంగా ఎలా రాస్తామని ప్రశ్నిస్తున్నారు. పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థుల దుస్తులను విప్పించి తిప్పి వేసుకోమని సిబ్బంది చెప్పారని పరీక్షకు హాజరైన స్టూడెంట్ తెలిపింది. అలాగే మరికొంత మందిని జీన్స్ ప్యాంట్లు ధరించవద్దని చెబితే వారు వెళ్లి తమ తల్లుల లెగ్గింగ్స్‌ను మార్చుకుని వచ్చారని పేర్కొంది. మరికొందరేమో సమీప దుకాణాల్లోకి వెళ్లి అప్పటికప్పుడు కొత్త దుస్తులు కొనుగోలు చేసి పరీక్ష కేంద్రానికి తిరిగి వచ్చారని వివరించింది. ఎన్టీఏ నిబంధనలకు అనుగుణమైన దుస్తుల కోసం విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పింది. దీంతో ఈ రూల్స్‌పై తల్లిదండ్రులతో పాటు ఇతరుల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. పరీక్షకు ముందు విద్యార్థులను ఇలా మానసికంగా ఇబ్బందిపెట్టడం సరికాదని ఓ డాక్టర్ జంట అసహనం వ్యక్తం చేసింది. విద్యార్థులను ఇలా ట్రీట్ చేయడమేంటని మండిపడింది. అవసరమైతే నిబంధనలు మార్చి వారికి వస్త్రధారణలో ఉపశమనం కల్పించాలని సూచించింది. కాగా.. బెంగాల్‌లోని హెచ్ఎంసీ ఎడ్యుకేషన్ సెంటర్లో కొందరు విద్యార్థులు లోదుస్తుల్లోనే పరీక్ష రాశారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ప్రిన్సిపల్ మాత్రం వీటిని ఖండించారు. అలాంటి ఘటనలేవీ జరగలేదని చెప్పారు. కొంతమంది విద్యార్థులు డ్రస్ కోడ్ పాటించకపోతే మార్చుకొని రావాలని సూచించినట్లు వివరించారు. అయితే నిబంధనలపై సరిగ్గా అవగాహన లేని వారిని సిబ్బందిగా పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తల్లిదండ్రులు తెలిపారు. నీట్ యూజీ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా 499 కేంద్రాల్లో ఈ వైద్య విద్య ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఎంబీబీఎస్ చేయాలనుకునే లక్షలాది మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. చదవండి: హైదరాబాద్‌లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో.. -
సీఎం జగన్ చిత్రపటానికి మహిళల పాలాభిషేకం
-
రెండు ఇష్యూలకు సెబీ చెక్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టే బాటలో రెండు కంపెనీలు దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌లకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా చెక్ పెట్టింది. ఫైనాన్షియల్ రంగ కంపెనీలు బీవీజీ ఇండియా లిమిటెడ్, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా దరఖాస్తులను సెబీ తిప్పి పంపింది. కాగా.. మౌలిక సదుపాయాల రంగ కంపెనీ ఆర్అండ్బీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌కు సెబీ ఈ నెల 3న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి కంపెనీ పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ చేపట్టేందుకు దారి ఏర్పడింది. సమీకృత సర్వీసుల కంపెనీ బీవీజీ ఇండియా 2021 సెప్టెంబర్‌లో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా ప్రమోటర్లు, పీఈ ఇన్వెస్టర్ సంస్థ 3ఐ గ్రూప్.. మరో 71.96 లక్షలకుపైగా షేర్లను ఆఫర్ చేయనున్నారు. అయితే సెబీ ప్రాస్పెక్టస్‌కు చెక్ పెట్టింది. రూ. 1,330 కోట్ల కోసం ఐపీవో ద్వారా రూ. 1,330 కోట్ల సమీకరణకు ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 2021 మే నెలలో సెబీకి ప్రాస్పెక్టస్ దఖలు పరచింది. జులైలో సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇష్యూ చేపట్టలేదు. సెబీ అనుమతి పొందిన తదుపరి ఏడాదిలోగా నిధుల సమీకరణను పూర్తి చేయవలసి ఉన్న సంగతి తెలిసిందే. ఐపీవో చేపట్టేందుకు లభించిన గడువు 2022 జులైలో ముగియడంతో ఆగస్ట్‌లో తిరిగి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. వీటి ప్రకారం రూ. 625 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రమోటర్లు, కంపెనీ ప్రస్తుత వాటాదారులు మరో 1.7 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. అయితే ఈ నెల తొలి వారంలో బీవీజీ ఇండియా, ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ ప్రాస్పెక్టస్‌లను సెబీ తిప్పి పంపింది. ఎయిరాక్స్ నేలచూపు మెడికల్ పరికరాల తయారీ కంపెనీ ఎయిరాక్స్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ ప్రయత్నాలను విరమించుకుంది. ఐపీవో ద్వారా రూ. 750 కోట్ల సమీకరణ కోసం 2022 సెప్టెంబర్‌లో సెబీకి సమర్పించిన ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీ ప్రమోటర్లు సంజయ్ భరత్ కుమార్ జైస్వాల్, ఆషిమా సంజయ్ జైస్వాల్ షేర్లను విక్రయించేందుకు సిద్ధపడ్డారు. పీఎక్స్ఏ ఆక్సిజన్ జనరేటర్ తయారీలో ఉన్న కంపెనీ గత నెలలో ప్రాస్పెక్టస్‌ను వెనక్కి తీసుకుంది. -
నీటి వృథాకు సెన్సర్‌తో చెక్
సాక్షి, హైదరాబాద్: వందల కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి తరలిస్తున్న కృష్ణా, గోదావరి జలాలు వృథా కాకుండా జలమండలి సెన్సర్ సాంకేతికతతో చెక్ పెట్టనుంది. మహానగరం పరిధిలో జలమండలికున్న సుమారు 400 సర్వీసు రిజర్వాయర్లు.. ఓఆర్ఆర్ ఫేజ్–2 పథకం కింద నూతనంగా ఏర్పాటు చేయనున్న మరో వందకు పైగా రిజర్వాయర్లకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేయనున్నారు. ఆయా రిజర్వాయర్ల వద్ద ప్రతి నిత్యం ఏరులై పారుతున్న శుద్ధి చేసిన నీటిని వృథాను కట్టడి చేయనున్నారు. తద్వారా నగరంలో రోజువారీగా 45 శాతం లెక్కలోకి రాని నీటి మొత్తంలో కనీసం పదిశాతం నీటినైనా ఒడిసిపట్టనున్నారు. అలారం మోతతో అప్రమత్తం ఫిల్టర్బెడ్ల నుంచి రిజర్వాయర్లకు శుద్ధి చేసిన జలాలను పంపింగ్ చేయడం ద్వారా నింపుతున్న విషయం విదితమే. ఇదే సమయంలో ఆయా రిజర్వాయర్ల లోపల సెన్సర్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో స్టోరేజి రిజర్వాయర్ నిండుతున్న క్రమంలో పూర్తిస్థాయి నీటిమట్టానికి ఒక అడుగు ఉన్న సమయానికే ఈ సెన్సర్ గ్రహించి అలారానికి సంకేతాలు పంపుతుంది. అలారం పెద్ద శబ్దంతో మోగుతుంది. వెంటనే అక్కడి క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తమై వెంటనే రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించే వాల్వును ఆపేస్తారు. ఒకవేళ అలారం మోగినపుడు సిబ్బంది అందుబాటులో లేనప్పటికీ.. ఐవీఆర్ఎస్ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్) ద్వారా సంబంధిత మేనేజర్‌తోపాటు రిజర్వాయర్ ఇన్చార్జికి సైతం ఫోన్‌కాల్ వెళ్తుంది. రిజర్వాయర్ నిండింది అంటూ వాయిస్‌కాల్ వెళ్తుంది. వెంటనే వారు అప్రమత్తమై వాల్వును ఆపేసే అవకాశం ఉంటుంది. ఈ సాంకేతికతను పర్యవేక్షించేందుకు ప్రతి 5– 6 రిజర్వాయర్లకు ఒక ఇన్చార్జిని జలమండలి నియమించనుంది. అన్ని రిజర్వాయర్లకు ఈ సాంకేతికతను ఏర్పాటు చేసేందుకు సుమారు రూ.కోటి వ్యయం అవుతుందని జలమండలి అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు తెలిపారు. పొంగిపొర్లడం నిత్యకృత్యమే.. నగరంలో జలమండలి స్టోరేజి రిజర్వాయర్లున్న ప్రతీ వీధి, కాలనీలో స్వచ్ఛమైన తాగునీరు పొంగిపొర్లడం స్థానికులకు నిత్యకృత్యమే. క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రతి రిజర్వాయర్ ఓవర్ ఫ్లో అయ్యే వరకు వాల్వ్‌ను నిలిపివేయరు. దీంతో విలువైన తాగునీరు రహదారులు, కాలనీలను ముంచెత్తుతోంది. ఈ పరిస్థితికి సెన్సర్ సాంకేతికతతో చెక్ పెట్టనున్నట్లు జలమండలి తెలిపింది. నీటి వృథాను అరికట్టండి నగరానికి జలమండలి సరఫరా చేస్తున్న నీటి వాటాలో ఎలాంటి కోతలు లేవు. వేసవి కారణంగా వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో వాహనాలు, ఫ్లోర్ క్లీనింగ్, గార్డెనింగ్ అవసరాలకు నల్లా నీటిని వినియోగించవద్దు. తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వాడుకోవాలి. నీటి పొదుపుపై అన్ని వర్గాలు అవగాహన పెంపొందించుకోవాలి. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ (చదవండి: ఆ చిరునవ్వులిక కానరావు) -
'చెక్కు' చోరుడు
కందుకూరు: కొరియర్ సర్వీసుల్లో వచ్చే బ్యాంకు చెక్కులు, ఏటీఎం కార్డులు, డీడీలు వంటివి దొంగిలించడం, వాటిని మాన్యుపులేట్ చేసి బ్యాంకుల నుంచి రూ.లక్షల్లో నగదు కొట్టేయడం అలవాటుగా చేసుకున్న మోసగాడు చివరికి కటకటాల పాలయ్యాడు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాసం ఉంటున్న తిరుపతికి చెందిన గాలి చేతన్చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. కందుకూరుకు చెందిన రమాదేవి అనే మహిళ తనకు తెలిసిన వి.వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి కెనరా బ్యాంకు చెక్‌బుక్ నుంచి రూ.2 లక్షలకు చెక్కు రాసి ఇచ్చింది. ఈ చెక్కును వెంకటేశ్వర్లు తన యూనియన్ బ్యాంకు అకౌంట్ ద్వారా మార్చుకునేందుకు స్థానిక బ్యాంకులో ఇచ్చాడు. ఆ చెక్కును వెరిఫికేషన్ చేసి పాస్ చేసేందుకు కందుకూరు బ్రాంచ్ అధికారులు ఒంగోలు బ్రాంచ్‌కు ప్రొఫెషనల్ కొరియర్ సర్వీస్ ద్వారా గత నెల 28న పంపారు. కొరియర్ బాయ్ డెలివరీ చేసే సమయంలో చేతన్ చౌదరి ఆ చెక్కును దొంగిలించాడు. చెక్కులో వి.వెంకటేశ్వర్లు పేరును మిస్టర్ వెంకటేశ్వర్లుగా మార్పు చేశాడు. తర్వాత తనకు తెలిసిన అల్లరి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చేత ఒంగోలు కెనరా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయించి, రూ.2 లక్షల చెక్కును మార్చి నగదు డ్రా చేసుకున్నాడు. మరోవైపు వి.వెంకటేశ్వర్లు యూనియన్ బ్యాంకులో తాను చెక్కు ఇచ్చి పది రోజులైనా తన అకౌంట్లో డబ్బులు పడకపోవడంతో బ్యాంకు అధికారులను ప్రశ్నించాడు. దీంతో మేలుకున్న బ్యాంకు అధికారులు ఈ నెల 14న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కూపీ లాగడంతో చేతన్చౌదరి మోసాలు వెలుగుచూశాయి. చేతన్‌ను అరెస్ట్ చేసి, అతని నుంచి రూ.40 వేల నగదు, పెద్ద ఎత్తున చెక్కుబుక్‌లు, డీడీలు, ఏటీఎం కార్డులు, ఆధార్ కార్డులు, పాన్‌కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో చేతన్ గత రెండేళ్లలో చెన్నై, కోయంబత్తూరు, హైదరాబాద్, ఒంగోలులలో మోసాలకు పాల్పడి దాదాపు రూ.50 లక్షల వరకు బ్యాంకుల నుంచి కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
పన్ను కట్టే విధమెట్టిదనిన...
ఈ కాలంలో అందరూ మాట్లాడుకునేది కేవలం ఆదాయపు పన్ను గురించే.. దీన్ని ఎలా చెల్లించాలి అంటే .. ఇప్పుడు నగదు చెల్లింపులు లేవు. అన్నీ బ్యాంకు ద్వారా చేయడమే. చలాన్ సరిగ్గా నింపి మీకు ఏ బ్యాంకులో అకౌంటు ఉందో అందులో ‘యువర్–సెల్ఫ్‘ అని మీ చెక్ రాసి ఇస్తే, బ్యాంకు వాళ్లు అప్పటికప్పుడో లేదా ఆ తర్వాతో మీకు చలాన్ ఇస్తారు. ఆన్లైన్ విధానంలోనూ చెల్లించవచ్చు. తగిన జాగ్రత్తలు వహించి చేయాలి. పేమెంట్ పూర్తయిన తర్వాత ఆటోమేటిక్‌గా చలాన్ జనరేట్ అవుతుంది. ఈ చలాన్లను జాగ్రత్తగా భద్రపర్చుకోండి. మీ పేరు, పాన్, అసెస్మెంట్ సంవత్సరం మొదలైనవన్నీ జాగ్రత్తగా రాయండి. ప్రస్తుతం అందరూ రిటర్నులు వేస్తున్నారు. పన్ను భారాన్ని లెక్కించి, అందులోనుంచి అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్ మినహాయించగా ఇంకా భారం చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలి. ఇలాంటి మొత్తాన్ని చెల్లించడాన్ని ‘సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్‘ అంటారు. దీనితో సాధారణ పరిస్థితుల్లో ఎటువంటి తేడాలు, తప్పులు, తడకలు లేకపోతే పన్నుభారం ఏర్పడదు. టైప్ ఆఫ్ పేమెంట్ దగ్గర ’300’ నంబర్ దగ్గర టిక్ చేయాలి. రిటర్నులను ఫైల్ చేసిన తర్వాత అధికారులు వాటిని చెక్ చేస్తారు. దీనినే మదింపు లేదా అసెస్మెంట్ అని అంటారు. ఈ అసెస్మెంట్ వలన ఆదాయం మారవచ్చు. డిడక్షన్లు మారవచ్చు. మినహాయింపు మారవచ్చు. ఫలితంగా పన్నుభారం మారవచ్చు. ఇంకా పన్ను చెల్లించాల్సి ఉంటే ’డిమాండ్’ అని చెప్తారు ఆర్డర్లో. ఆ మొత్తం చెల్లించేటప్పుడు ’400’ అనే కాలం దగ్గర టిక్ చేయాలి. దీనిని ’ట్యాక్స్ ఆన్ రెగ్యులర్ అసెస్మెంట్’ అని అంటారు. ఒకవేళ రిఫండ్ ఉంటే దాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు. స్థిరాస్తి అమ్మకం మీద టీడీఎస్ చెల్లించేటప్పుడు కాలం ’800’ దగ్గర టిక్ చేయాలి. మరో ముఖ్యమైన పద్ధతి.. అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం. ఈ మొత్తాన్ని చెల్లించేటప్పుడు కాలం ’100’ దగ్గర టిక్ చేయాలి. మీకు తెలిసే ఉంటుంది. మీరు చెల్లించాల్సిన పన్ను భారాన్ని ముందుగానే లెక్కించి, టీడీఎస్ మొత్తాన్ని తీసివేయగా.. మిగిలిన మొత్తం రూ. 10,000 (పది వేల రూపాయలు) దాటితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. ఇలాంటి మొత్తాన్ని నాలుగు వాయిదాలలో చెల్లించాలి. మొదటి విడతలో 15 శాతం (జూన్ 15 లోగా), రెండో విడత 30 శాతం (సెప్టెంబర్ 15 లోగా), మూడో విడత 30 శాతం (డిసెంబర్ 15 లోగా), చివరి విడత 25 శాతం (మార్చి 15 లోగా) కట్టాలి. దీనికి సంబంధించి జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో గడువు తేదీలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఈ ప్రకారం చెల్లించినప్పుడు సరిగ్గా వివరాలు రాయండి. ఈ విధంగా ఒక అసెసీ తన పన్ను భారాన్ని అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్, టీసీఎస్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఏ అసెస్మెంట్ సంవత్సరం, ఏ టైప్ అన్నది జాగ్రత్తగా చూసుకోవాలి. తదనుగుణంగా పన్ను భారం చెల్లించాలి. -
సైదాబాద్ ఘటన: రూ. 20 లక్షలు చెక్కును తిరస్కరించిన బాధిత కుటుంబం
హైదరాబాద్: సైదాబాద్ బాలిక ఘటన పట్ల రోజురోజుకు ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. చిన్నారిని హత్య చేసిన దుర్మార్గుడి కోసం పోలీసులు తెలంగాణ వ్యాప్తంగా జల్లెడ పడుతున్న విషయం తెలిసిందే. కాగా, బాధిత కుటుంబానికి తెలంగాణ హోంశాఖ మంత్రి మహమ్ముద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్‌లు గురువారం రూ. 20 లక్షల చెక్కును ఇచ్చారు. అయితే, మంత్రులు ఇచ్చిన చెక్కును బాధిత కుటుంబం తిరస్కరించింది. ‘మాకు చెక్ వద్దు.. ఆ దుర్మార్గుడిని ఉరితీయాలని’ వేడుకున్నారు. మంత్రులు ఇచ్చిన చెక్కును మీడియా ముఖంగా తిరిగి ఇచ్చేస్తామని బాలిక తండ్రి తెలిపారు. దీనిపై చిన్నారి తండ్రి.. తాము చెక్ తీసుకోలేదు.. బల్లపై పేట్టేసి వెళ్లారని తెలిపారు. ఆ చెక్కు మాకోద్దు.. దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని కన్నీటి పర్యంతమయ్యారు. చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు: పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు -
అనంతపురంలో కబ్జాదారులకు చెక్
-
పాము విషంతో కరోనాకు చెక్!?
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఇండియాలో రెండో దశలో కరోనా మహమ్మారి వేలమందిని బలితీసుకుంది. అటు మూడో వేవ్ తప్పదన్న నిపుణుల హెచ్చరికలు ఆందోళన పుట్టిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఓ పాము విషంతో కరోనాకు చెక్ పెట్టొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ప్రారంభ దశలోనే కరోనాకు చెక్ పెట్టవచ్చని బ్రెజిల్‌లోని పరిశోధకుల బృందం తేల్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్రెజిల్ అడవుల్లో కనిపించే సర్పం జరారాకుసోకు చెందిన విషంతో కోవిడ్19ను అంతం చేయవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైంటిఫిక్ జర్నల్ మాలిక్యూల్స్మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం అణువులు జరారాకుసు పిట్ విషం ద్వారా ఉత్పత్తైన అణువు కోతి కణాలలో వైరస్ సామర్థ్యాన్ని 75శాతం నిరోధించింది. జరారాకుసో విషంలో ఉండే పెప్టైడ్ అణువులు వైరస్‌లో రెట్టింపవుతున్న ముఖ్యమైన ప్రోటీన్‌ను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని సావోపౌలో బుటాంటన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాఫేల్ గైడో రాయిటర్స్‌తో చెప్పారు. అంతేకాదు ఈ పెప్టైడ్ అణువులను ల్యాబ్‌ల్లోనూ అభివృద్ధి చేయవచ్చని గైడో తెలిపారు. బ్రెజిల్ అడవుల్లో జరరాకుసోను వేటాడటానికి బయలుదేరిన వ్యక్తుల పట్ల ఆయన అందోళన వ్యక్తం చేశారు. వారు ప్రపంచాన్ని కాపాడాలని అనుకుంటున్నారు కానీ పద్ధతి ఇది కాదనీ, కేవలం విషంతోనే కరోనాను నయం చేయలేమనేది గుర్తించాలన్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయన దశలోనే ఉన్నారు. కాగా బ్రెజిల్లో కనిపించే అతిపెద్ద సర్పంగా జరారాకుసోకు సుమారు రెండు మీటర్ల పొడవు ఉంటాయి. అట్లాంటిక్ తీర ప్రాంత అడవులతో పాటు బొలివియా, పరాగ్వే, అర్జెంటీనా దేశాల్లో ఈ సర్పాలు సంచరిస్తుంటాయి. -
ఉప సర్పంచ్ వేధిస్తున్నారు.. సీఎం సభలో ఆత్మహత్య చేసుకుంటా
సాక్షి, హుజూరాబాద్ (కరీంనగర్): గ్రామంలో అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై ఉప సర్పంచ్ గుజ్జ జయసుధ సంతకం చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని హుజూరాబాద్ మండలంలోని చెల్పూర్ సర్పంచ్ నేరెళ్ల మహేందర్‌గౌడ్ ఆరోపించారు. సోమవారం గ్రామంలో మీడియాతో ఆయన గోడు వెళ్లబోసుకున్నారు. అప్పులు తెచ్చి, గ్రామంలో అభివృద్ధి పనులను పూర్తి చేశామని, 10 నెలలవుతున్నా చెక్కులపై ఉప సర్పంచ్ సంతకాలు పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల డీఎల్పీవో విచారణ జరిపి వెళ్లినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. ఆర్థికంగా చితికిపోయిన తనకు ఈ సమస్య పరిష్కారం కాకపోతే చావే శరణ్యమని అన్నారు. పురుగు మందు డబ్బా చూపిస్తూ సోమవారం సీఎం కేసీఆర్ సభలో ఆత్మహత్య చేసుకుంటానని మహేందర్‌గౌడ్ పేర్కొన్నారు. -
OTT: ఐదు సినిమాలు నేడే విడుదల!
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడిపోయేవి. జనాలు కూడా కొత్త చిత్రాలు ఏమేం రిలీజ్ అవుతున్నాయా? అని ఈ రోజు కోసం తెగ ఎదురుచూసేవాళ్లేవారు. కానీ కరోనా పుణ్యమా అని అన్ని రోజులూ ఆదివారాలే అయిపోయాయి. థియేటర్లకు కూడా హాలీడేస్ వచ్చేశాయి. కానీ ప్రేక్షకుడికి అందించే వినోదానికి మాత్రం బ్రేక్ రాలేదు. సినిమాలు కాకపోతే వెబ్ సిరీస్‌లు, థియేటర్లు కాకపోతే ఓటీటీలు.. ఇలా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించేందుకు కొత్త దారుల్లో పయనిస్తోంది చిత్ర పరిశ్రమ. ఈ క్రమంలో నేడు(మే 14) ఐదు సినిమాలు ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయ్యాయి. అవేంటో చదివేయండి.. విజయ్ సేతుపతి తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విజయ్ సేతుపతి. తెలుగులో విలన్, సహాయక పాత్రల్లో మాత్రమే కనిపించిన సేతుపతి ఇందులో హీరోగా సందడి చేయనున్నాడు. విజయ్ చందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీఖన్నా, నివేదా పేతురాజ్ హీరోయిన్లు. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నేటి నుంచి ప్రసారం కానుంది. కర్ణన్ తమిళ హీరో ధనుష్ నటించిన కర్ణన్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి ప్రసారం కానుంది. ఏప్రిల్ 9న థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపించిన ఈ సినిమా ఓటీటీని ఎలా షేక్ చేస్తుందో చూడాలి. సినిమా బండి ప్రవీణ్ కండ్రిగుల దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం సినిమా బండి. ఇటీవల రిలీజైన ట్రైలర్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయగా నేటి నుంచి ప్రసారం చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. చెక్ యంగ్ హీరో నితిన్ ఖైదీగా, ప్రియా వారియర్ అతడి ప్రేయసిగా నటించిన చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్ లాయర్‌గా కనిపించింది. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైంది. తాజాగా ఓటీటీ బాట పట్టిన ఈ మూవీ నేటి నుంచి సన్ నెక్స్ట్ యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది. బట్టల రామస్వామి బయోపిక్కు అల్తాఫ్ హాసన్, శాంతి రావు, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బట్టల రామస్వామి బయెపిక్కు. రామ్ నారాయణ్ డైరెక్షన్ చేయగా సెవెన్ హిల్స్ సతీష్ కుమార్, ఐ మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా జీ 5లో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఇక రామ్‌గోపాల్ వర్మ డీ కంపెనీ సినిమా కూడా ఓటీటీలో వస్తోంది. వ్యాపారవేత్త సాగర్ మచనూరు ఆరంభించిన స్పార్క్ ఓటీటీ ప్లాట్ఫామ్లో మే 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక రాధే సినిమా నిన్నటి నుంచే జీ 5లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. -
Its Official: చెక్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..
గతేడాది భీష్మతో హిట్టు కొట్టిన యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది చెక్‌తో అభిమానుల ముందుకొచ్చాడు. కానీ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి అందించిన డిఫరెంట్ కాన్సెప్ట్ జనాలకు కొత్తదనాన్ని పంచింది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా వసూళ్లు కురిపించనప్పటికీ మంచి ప్రశంసలైతే దక్కాయి. ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. మే 14 నుంచి సన్ నెక్స్ట్లో ప్రసారం కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తన తెలివితేటలతో చిన్నచిన్న దొంగతనాలు చేసే హీరో ఉగ్రదాడి కేసులో ఎలా ఇరుక్కున్నాడనేది కథ. కాగా ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో ప్రేయసిగా, రకుల్ ప్రీత్ సింగ్ న్యాయవాదిగా నటించారు. సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో కనిపించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. కల్యాణీ మాలిక్ సంగీతం అందించాడు. ఏదేమైనా కోవిడ్ భయంతో థియేటర్లో చూడలేని వాళ్లు, లేదా ఇంకోసారి చూడాలనుకునేవాళ్లు ఇప్పుడు హాయిగా ఇంట్లోనే సన్ నెక్స్ట్ యాప్‌లో చూసేయొచ్చు. Youth Star @actor_nithiin 's #Check ♟️ will be Streaming on @sunnxt from May 14th. A @yeletics' s Film.#CheckOnSunnxt @Rakulpreet #PriyaPrakashVarrier @kalyanimalik31 @ShakthisreeG @HaricharanMusic @ShreeLyricist @BhavyaCreations @adityamusic pic.twitter.com/k2Ok60xjll — BARaju (@baraju_SuperHit) May 12, 2021 చదవండి: ‘చెక్’ మూవీ రివ్యూ -
హర్ట్ అయిన రకుల్.. ప్రమోషన్లకు దూరం!
టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చెక్. ఈ సినిమా నేడు(ఫిబ్రవరి26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతానికైతే జనాల్లో పర్వాలేదనే టాక్ తెచ్చుకుంటోంది. కల్యాణీ మాలిక్ సంగీతం ఈ సినిమా ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించారు. సినిమాల్లో రకుల్ చాలా సన్నివేశాల్లో కనిపించినా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనిపిస్తోంది. అదే ప్రియ విషయానికొస్తే చేసింది చిన్న క్యారెక్టర్ అయినా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఢిల్లీ భామ(రకుల్) హర్ట్ అయినట్లు తెలుస్తోంది. చెక్‌లో తన పాత్ర కన్నా ప్రియా ప్రకాశ్ పాత్ర ఎక్కువ ఉండటం రకుల్‌కు నచ్చలేదట. అంతేగాక నితిన్, ప్రియ మధ్య ఎలాంటి పాటలు ఉండవని చెప్పి చివరికి వీరిద్దరి కలయికలో ఓ పాట కూడా చిత్రీకరించడంతో ఈ భామ హర్ట్ అయ్యిందటా. ఇంకేముంది సినిమా డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటిపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చెక్కు సంబంధించిన ఏ ప్రమోషన్లలో కూడా ఆమె కనిపించలేదు. రిలీజ్‌కు ముందు చెక్ టీం ఓ ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో రకుల్ కనిపించలేదు. కానీ మరో కథానాయికగా నటిస్తున్న మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ మాత్రం మెరిసింది. అంతేగాక రకుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తుందేమో అనుకున్నారు. కానీ ఆ రోజు కూడా రకుల్ దర్శనమివ్వకపోవడంతో అభిమానులు ఆశ్యర్యం వక్తం చేశారు. సినిమా రిలీజ్ తరువాత కూడా ప్రియనే హైలెట్ అవుతోంది. దీంతో సినిమాకు సంబంధించి ఎదో మొక్కుబడిగా ఒకటి రెండు ట్వీట్లు చేసింది తప్ప ఈ సినిమా చేసినందుకు రకుల్ సంతోషంగా ఉన్నట్లు కనిపించడం లేదు. చదవండి: ‘చెక్’ మూవీ రివ్యూ రకుల్‌ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్ -
‘చెక్’ మూవీ రివ్యూ
టైటిల్ : చెక్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్, సంపత్ రాజ్, సాయిచంద్, పోసాని కృష్ణమురళి, మురళి శర్మ తదితరులు నిర్మాణ సంస్థ : భవ్య క్రియేషన్స్ నిర్మాత : వి. ఆనంద ప్రసాద్ దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి సంగీతం : కల్యాణీ మాలిక్ సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటర్ : అనల్ అనిరుద్దన్ విడుదల తేది : ఫిబ్రవరి 26, 2021 చాలా కాలం తర్వాత గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘భీష్మ’తో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో. భీష్మ కంటే ముందు నితిన్ చేసిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.దీంతో కొంత గ్యాప్ తీసుకొన్న నితిన్.. ఒకేసారి రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి భీష్మ అయితే మరొకటి చెక్. భీష్మతో పాటు చెక్ కూడా గతేడాదిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్డౌన్ వల్లనిలిచిపోయింది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత శుక్రవారం రోజు (ఫిబ్రవరి 26) చెక్ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. వైవిధ్యభరిత చిత్రాలను తెరకెక్కించడంలో సిద్దహస్తుడైన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.వైవిధ్యమైన ఇతివృత్తంతో వచ్చిన ‘చెక్’పై నితిన్ కూడా ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమాతో నితిన్ మరో హిట్ కొట్టాడా? పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన ‘చెక్’ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథ ఆదిత్య ఒక తెలివైన యువకుడు. తన తెలివితేటలన్నింటిని చోరకళ(దొంగతనం) కోసం ఉపయోగిస్తాడు. పేర్లు మార్చుకుంటూ చిన్న చిన్న మోసాలు చేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఈ క్రమంలో అతనికి యాత్ర ( ప్రియా ప్రకాశ్ వారియర్) పరిచమతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు. కట్ చేస్తే... భారత్‌లో ఉగ్రదాడి జరిగి 40 మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ కేసులో ఆదిత్య ఉరిశిక్ష పడుతోంది. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న ఆదిత్యకు జైలులో శ్రీమన్నారాయణ(సాయిచంద్)అనే ఖైదీ పరిచయమై చెస్ ఆటను నేర్పిస్తాడు. ఆదిత్య తెలివికి నేషనల్ చెస్ చాంపియన్ షిప్ గెలుస్తాడని బలంగా నమ్మిన శ్రీమన్నారాయణ.. తనకు ఉన్న పలుకుడిబడితో ఆదిత్యను చెస్ గేమ్ ఆడేలా ఒప్పిస్తాడు. ఇదిలా ఉంటే ఆదిత్యకు క్షమాభిక్ష లభించేలా చేసేందుకు జూనియర్ లాయర్ మానస(రకుల్ ప్రీత్ సింగ్) ప్రయత్నిస్తుంది. చెస్‌లో ఆరితేరిన ఆదిత్యకు ఆ గేమే క్షమాభిక్ష పెట్టాలా చేస్తుందని బలంగా నమ్మి ఆ రకంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ఎస్పీ నరసింహారెడ్డి(సంపత్ రాజ్) ఆదిత్యకు క్షమాభిక్ష లభించకుండా చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇంతకి ఆదిత్యకు క్షమాభిక్ష లభించిందా లేదా? అసలు ఉగ్రదాడి కేసులో ఆదిత్య ఎలా బుక్ అయ్యాడు? యాత్ర ఎవరు? చెస్ గేమ్ ఆదిత్యకు ఎలా ఉపయోగపడింది? ఎస్పీ నరసింహారెడ్డికి ఆదిత్య అంటే ఎందుకు కోపం? చివరకు జైలు నుంచి ఆదిత్య ఎలా తప్పించుకున్నాడు అనేదే మిగతా కథ నటీనటులు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న ఆదిత్య పాత్రలో నితిన్ ఒదిగిపోయాడు. ఒక చెస్ చాంపియన్ ఎలా ఆడగలడో, ఏ రకంగా ఎత్తుకు పై ఎత్తులు వేయగలడో అచ్చుగుద్దినట్లు నితిన్ నటన ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ కూడా చాలా చక్కగా చేశాడు. ఇక లాయర్ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ చక్కగా నటించింది. గత చిత్రాలకు బిన్నంగా ఇందులో గ్లామర్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా నటనతో మెప్పించింది. లాయర్ మానస పాత్రలో హవాభావాలు అద్భుతంగా పండించింది. ఇక నితిన్ తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర సాయిచంద్‌ది. చేయని తప్పుకు జైలుపాలైన శ్రీమన్నారాయణ పాత్రలో సాయిచంద్ ఒదిగిపోయాడు. అతని సంభాషణలు, ఎక్స్ప్రెషన్స్ సినిమాకే హైలెట్. ఇక మరో హీరోయిన్ ప్రియ ప్రకాశ్ వారియర్‌కు ఇది తొలి తెలుగు సినిమా. ఆమె పాత్ర నిడివి కొద్దిసేపే అయినప్పటికీ సినిమాకు ఆమె సన్నివేశాలే కీలకం. యాత్ర పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. ఎస్పీ పాత్రలో సంపత్ రాజ్, రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి పాత్రలో పోసాని, జైలర్‌గా మురళి శర్మ తమ పరిధి మేరకు నటించారు. విశ్లేషణ వైవిధ్యభరిత కథా చిత్రాలను తెరకెక్కించడంలో చంద్రశేఖర్ యేలేటి సిద్ధహస్తుడు. ఆయన కథలు జీవితాల్లో నుంచి పుడతాయి. ఆ జీవితాల చుట్టూనే తిరుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలోను కొన్ని సంఘటనలు.. అవి అందించే ఎమోషన్లు ఉంటాయి. అలాంటి కథలను తీసుకుని.. అనుభూతి ప్రధానంగా తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. చెక్ సినిమా కూడా అంతే. గత సినిమాలే మాదిరే మైండ్ గేమ్‌కి పెద్ద పీట వేశాడు. క్షమా భిక్ష, చెస్ గేమ్ నేపథ్యంలో కథనంతా నడిపించాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా ఎలాంటి ట్విస్ట్‌లను రివీల్ చేయకుండా నార్మల్‌గా నడిపించాడు. అసలు హీరో ఈ కేసులో ఎలా ఇరికాడో చెప్పకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీని పెంచాడు. కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం ప్రేక్షకుడికి బోర్ కొట్టిస్తాయి. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ట్విస్ట్‌లన్నీ సెకండాఫ్‌లోనే ఉంటాయి. కానీ ఎక్కువ సన్నివేశాలు జైలులోనే కనిపించడం కాస్త బోర్ కొట్టించే అంశం. ఇక నేషనల్ చెస్ చాంపియన్ విజేతగా హీరో నిలిచే సన్నివేశాలు కూడా అంతగా రక్తి కట్టించవు. అలాగే లాయర్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఇలా వచ్చి అలా వేళ్తున్నట్లు అనిపిస్తోంది. ఇక క్లైమాక్స్ కూడా ప్రేక్షకులను అంతగా మెప్పించదు. ఇక్కడా దర్శకుడు యేలేటి తన మార్క్‌ను చూపించాడు. కానీ అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తోంది. అయితే హీరో ఎలా బయటపడ్డాడో చెప్పే విశ్లేషణ మాత్రం బాగుంటుంది. అలాగే సీక్వెల్ ఉంటుందని చెప్పకనే చెబుతూ కథను ముగించాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే బాగుంది. ఇక కల్యాణీ మాలిక్ సంగీతం ఈ సినిమాకు చాలా ప్లస్ పాయింట్. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఉన్న ఒక్క పాట పర్వాలేదనిపిస్తోంది. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రాఫి బాగుంది. జైలు సన్నివేశాలను చక్కగా తెరకెక్కించాడు. అనల్ అనిరుద్దన్ తన కత్తెరకు కాస్త పని చెప్పాల్సింది.నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి ప్లస్ పాయింట్స్ కథా, కథనాలు నితిన్, సాయిచంద్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లో కొన్ని సాగతీత సీన్లు క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
షూటింగ్లో నితిన్పైకెక్కి కింద పడ్డ ప్రియా ప్రకాశ్
కన్ను గీటు భామ, కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వరియర్, యంగ్ హీరో నితిన్ నటించిన ‘చెక్’ మూవీ ఇవాళ(ఫిబ్రవరి 26) థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ ‘చెక్’ మూవీ షూటింగ్లో సమయంలో జరిగిన ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. మూవీ షూటింగ్‌లోని ఓ రోమాంటిక్ సన్నివేశం చిత్రీకరణలో నితిన్ నడుచుకుంటూ వస్తుంటాడు. ఆ తర్వాత వెనకాలే ప్రియా ప్రకాశ్ పరుగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా నితిన్ వీపుపైకి ఎగిరి ఎక్కుతుంది. దీంతో పట్టు తప్పి నెలపై వెల్లకిలా పడిపోయింది. ఆమె పడిపోగానే చూట్టు ఉన్న మూవీ యూనిట్ సభ్యులు ఆమె దగ్గరి వచ్చి పైకి లేపారు. అయితే తనకి ఏమి కాలేదు అన్నట్లు ప్రియా సైగ చేసి కొద్ది సమయం తర్వాత తిరిగి షూటింగ్లో పాల్గొంటుంది. దీనికి ‘జీవితంలో కింద పడిపోతున్న ప్రతిసారి నేను విశ్వాసంతో పైకి లేచేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పడానికి ఈ వీడియో ప్రాతినిథ్యం వహిస్తుంది’ అంటూ షేర్ చేసింది. కాగా వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించారు. ఇందులో నితిన్‌కు జోడిగా ప్రియా ప్రకాశ్, రకుల్ ప్రిత్ సింగ్‌లు కథానాయికలుగా నటించారు. View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) చదవండి: రకుల్‌ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్ ట్రైలర్: దేశద్రోహితో చెస్ ఆడిస్తారా?! -
ఆ దర్శకుడికి నేను పెద్ద ఫ్యాన్: జూనియర్ ఎన్టీఆర్
సినిమా హిట్టు కాలేదంటే కథ బాగోలేదని దర్శకుడిని నిందించలేం. ఎందుకంటే ఫ్లాప్ అయిందన్నా, యావరేజ్ టాక్ తెచ్చుకుందన్నా దానికి బోలెడు కారణాలు ఉంటాయి. వైవిధ్య సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరు తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి సినిమాలు కొన్ని పెద్దగా హిట్టవ్వలేదు. దీంతో కొంత నిరుత్సాహపడ్డ ఆయన ఐదేళ్ల విరామం తర్వాత చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నితిన్ హీరోగా, ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని హామీ ఇస్తున్నాడు. ఈ సినిమా రేపు(ఫిబ్రవరి 26న) విడుదల కానుంది. ఈ సందర్భంగా చెక్ యూనిట్‌కు ఆల్‌ద బెస్ట్ చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వినూత్నమైన కథలతో అలరించే చంద్రశేఖర్ యేలేటికి తనెప్పుడూ అభిమానినే అంటూ ట్వీట్ చేశాడు. చెక్ చాలా ఆసక్తికరంగా ఉందని సినిమాపై ప్రశంసలు కురిపించాడు. కాగా చంద్రశేఖర్ చెప్పిన 15 నిమిషాల కథ విని ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నా అని నితిన్ ఆ మధ్య స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ చేసిన సినిమాలు వేరు.. ‘చెక్’ వేరని, ఇందులో తన నటన వినూత్నంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కల్యాణీ మాలిక్ సంగీతం అందించాడు. Always been a fan of Chandu @yeletics 's unique themes and storytelling. #Check looks super interesting. Best wishes to Chandu, @actor_nithiin and the whole team for the release tomorrow pic.twitter.com/RRwtQmSIVk — Jr NTR (@tarak9999) February 25, 2021 చదవండి: 15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా: నితిన్ కాలంతో పాటు వెళ్లడమే మంచిది: చంద్రశేఖర్ యేలేటి -
ఇకపై ఆ తప్పు చేయకూడదనుకుంటున్నా!
‘‘చెక్’ సినిమాకి ముందు చంద్రశేఖర్ యేలేటిగారు ఓ లైన్ చెప్పారు. రెండు నెలలు స్క్రిప్ట్‌పై పని చేశారు కూడా. అయితే అది వర్కవుట్ కాదనిపించింది. ఆ తర్వాత ‘చెక్’ కథతో ముందుకెళ్లాం. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన మార్క్ కనిపిస్తుంది. ‘చెక్’ తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని నితిన్ అన్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘చెక్’. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు. ► వరుసగా మూడు ఫ్లాప్‌లు (లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం) వచ్చాయి. దీంతో తర్వాత చేసే సినిమాల్లో ఒకటి కమర్షియల్, మరొకటి వైవిధ్యమైన చిత్రం అయితే బాగుండు అనుకున్నాను. అందుకే ‘భీష్మ, చెక్’ సినిమాలు ఒప్పుకున్నాను. ‘భీష్మ’ తర్వాత ‘చెక్’ రిలీజ్ చేద్దామనుకున్నాం.. ఈలోపు లాక్డౌన్ వచ్చింది. ► నేనిప్పటివరకూ చేసిన సినిమాలు వేరు.. ‘చెక్’ వేరు. ఈ చిత్రంలో నా నటన చాలా బాగుంటుంది. సినిమా ప్రివ్యూ చూసిన వంద మందిలో అందరూ బాగుందని అభినందించారు. పాటలు, ఫైట్స్, కామెడీ.. ఇలా రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ‘చెక్’ ఉంటుంది. ఒక పాట మినహా మొత్తం కథే ఉంటుంది. ప్రేక్షకులకు మా సినిమా కొత్త అనుభూతినిస్తుంది. ► కల్యాణీ మాలిక్ నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కమర్షియల్ సినిమాల బడ్జెట్‌కి నిర్మాతలు వెనకాడరు. ‘చెక్’లాంటి వైవిధ్యమైన సినిమాకి ఖర్చు పెట్టిన ఆనంద్ ప్రసాద్‌గారు గ్రేట్.. ఈ సినిమా మంచి విజయం సాధించి, ఆయనకి డబ్బులు బాగా రావాలి. ‘నితిన్ ఎప్పుడూ కొత్తగా ట్రై చేస్తాడు’ అని ‘చెక్’ ప్రీ రిలీజ్ వేడుకలో రాజమౌళిగారి నుంచి నాకు కాంప్లిమెంట్ రావడం హ్యాపీ. నా తొలి చిత్రం ‘జయం’ తర్వాత ఎక్కువ టేకులు తీసుకున్నది ‘చెక్’ చిత్రానికే. మొదట్లో ఓ వారంపాటు ఒక్కో సీన్స్ కి 10 నుంచి 15 టేకులు తీసుకున్నాను. ఆ తర్వాత డైరెక్టర్ పల్స్ పట్టుకుని ఆయనకు నచ్చినట్టు చేశా. ► ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అయింది. ఇప్పటికీ లవర్ బోయ్ ట్యాగ్‌లైన్ నాకు నచ్చదు. గతంలో కథల ఎంపికలో తప్పు చేశాను. ఇకపై ఆ తప్పు చేయకూడదనుకుంటున్నాను. ► 2020 చాలామందికి వరస్ట్ అయితే నాకు గుడ్. ‘భీష్మ’ సినిమా హిట్ అయింది. షాలినీతో పెళ్లయింది. యాక్టర్ ఫ్యామిలీకి, డాక్టర్ ఫ్యామిలీకి బాగా సింక్ అయింది. గతంలో జలుబో, దగ్గో, జ్వరమో వస్తే హాస్పిటల్‌కి వెళ్లేవాణ్ణి.. ఇప్పుడేమో మా మావయ్య– అత్తయ్యలకు ఫోన్ చేసి, ఏ మందులు వేసుకోవాలో అడుగుతున్నాను (నవ్వుతూ). ► ‘రంగ్ దే’ సినిమా షూటింగ్ మంగళవారమే పూర్తయింది. మేర్లపాక గాంధీతో ‘అంధా ధున్ ’ రీమేక్ సినిమా చేస్తున్నా. ‘పవర్‌పేట’ సినిమా మేలో స్టార్ట్ అవుతుంది.. డిసెంబరులో మొదటి పార్ట్ విడుదలవుతుంది.. అది హిట్ అయితే రెండో పార్ట్ ఉంటుంది.. లేకుంటే లేదు. నా సినిమాల్లో ‘సై’కి సీక్వెల్ చేయొచ్చు.. ‘చెక్’ సినిమాకి కూడా సీక్వెల్ చేసే అవకాశం ఉంటుంది. పవన్ కల్యాణ్‌గారితో మల్టీస్టారర్ మూవీ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నాను. -
రకుల్‌ను డామినేట్ చేస్తున్న ప్రియా వారియర్
'అనుకోకుండా ఒక రోజు', 'ఒక్కడున్నాడు', 'సాహసం' వంటి వినూత్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం చెక్. ఈ సినిమా టీజర్ చూడగానే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనిపించిందని, కథాంశం అంత వైవిధ్యంగా ఉందని టాప్ డైరెక్టర్ రాజమౌళే కితాబిచ్చారంటే ఈ టీజర్ జనాలను ఎంతగా ఆకర్షించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ చిత్రం నుంచి 'నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను..' పాట ప్రోమో రిలీజ్ చేశారు. ఇందులో తన ప్రియురాలు ప్రియా ప్రకాశ్ వారియర్‌ను చూడలేకుండా ఉండలేకపోతున్నానని పాడుతున్నాడు నితిన్. అక్కడేమో ప్రియా తన అందంతో హీరోనే కాదు కుర్రకారును కూడా తన వెంటపడేలా చేస్తోంది. ఈ సాంగ్ ప్రోమో రిలీజైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో #PriyaPrakashVarrier అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సినిమాలో రకుల్ కన్నా ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ప్రియానే బాగుందంటున్నారు కొందరు నెటిజన్లు. చెక్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెడుతున్న ప్రియా వచ్చీరావడంతోనే రకుల్‌ను డామినేట్ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ అవకముందే ఈ మలయాళీ ముద్దుగుమ్మ అందచందాలు, నటనకు ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు. మరి ఈ సినిమా తర్వాత ప్రియాకు తెలుగులో ఇంకెన్ని అవకాశాలు వస్తాయో చూడాలి! కాగా చెక్ సినిమాలో ప్రియా హొయలను చూడాలన్నా, ఉగ్రవాదిగా నితిన్, లాయర్‌గా రకుల్ ఏ మేరకు మెప్పిస్తారో తెలియాలన్నా ఫిబ్రవరి 26 వరకు ఆగాల్సిందే! చదవండి: కాలంతో పాటు వెళ్లడమే మంచిది: దర్శకుడు హైదరాబాద్‌లో పవన్ షూటింగ్.. భారీ సెట్ -
‘చెక్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
ఆ హద్దుల్ని చెక్ చెరిపేస్తుందనుకుంటున్నాను
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా టీజర్ రిలీజ్ అవగానే థియేటర్‌కి వెళ్లి సినిమా చూసేయాలనిపించింది. కథాంశం వైవిధ్యంగా ఉంది. మాస్ సినిమా, క్లాస్ సినిమాకు ఉన్న హద్దుల్ని ఈ సినిమా చెరిపేస్తుందనుకుంటున్నాను. వైవిధ్యమైన సినిమాను కూడా ప్రేక్షకులు ఓ మాస్ సినిమాలా ఆదరిస్తారనుకుంటున్నాను. నితిన్ అన్ని రకాల సినిమాలు చేయగలడనిపించుకుంటున్నాడు’’ అన్నారు. ‘‘చెక్’ పెద్ద బ్లాక్‌బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. నితిన్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో నా నటన వేరేలా ఉంటుంది. నాకు వచ్చిన నటనను మార్చుకుని కొత్తగా నేర్చుకుని ఈ సినిమా చేశాను. యేలేటిగారు ఈ సినిమాకు చాలా డబ్బులు రావాలి అన్నారు. తప్పకుండా వస్తాయి. ఈ సినిమాకి కల్యాణీ మాలిక్ మ్యూజిక్ పెద్ద బలం’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఎవ్వర్నీ నిరుత్సాహపరచదు’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. ‘‘రెండు సక్సెస్‌ల (ఓ పిట్ట కథ, మిడిల్ క్లాస్ మెలోడీస్) తర్వాత మూడో చిత్రంతో వస్తున్నాం. నితిన్‌కి గుర్తుండిపోయే చిత్రమిది’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో రమా రాజమౌళి, హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్, దర్శకులు గోపీచంద్ మలినేని, వెంకీ కుడుముల, నటుడు సంపత్ మాట్లాడారు. -
కాలంతో పాటు వెళ్లడమే మంచిది
‘‘నేను తీసిన కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచి ఉండొచ్చు. కానీ ‘చెక్’ మాత్రం నిరుత్సాహపరచదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చుతుంది’’ అని దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి అన్నారు. నితిన్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చెక్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చెప్పిన విశేషాలు. ► నితిన్ తో సినిమా చేయాలనుకున్నాం. రెండుమూడు కథలు అనుకున్నా కుదరలేదు. ఫైనల్‌గా ‘చెక్’ బావుంటుందనుకుని చేశాం. నితిన్‌ని మైండ్‌లో పెట్టుకుని ఈ కథ రాయలేదు. కథ పూర్తయ్యాక కలిశాను. తనకి ‘చెక్’ పాత్ర బాగా సూట్ అవుతుందని చేశాం. ఈ సినిమాలో హ్యూమన్ డ్రామా ఆకట్టుకుంటుంది. ► హీరో ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. అయితే బాగా తెలివైనవాడు. క్రెడిట్ కార్డ్స్ ఫ్రాడ్ చేస్తుంటాడు. అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో జైలులో పడితే ఉరిశిక్ష పడుతుంది. అతను క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి దరఖాస్తు పెట్టుకుంటాడు. హీరో చెస్ బాగా ఆడి వరుసగా విజయాలు సాధిస్తున్నాడని అతడిపై సానుభూతి కలిగి, ఉరిశిక్షపై రాష్ట్రపతికి అభిప్రాయం మారొచ్చు. ఆట, క్షమాభిక్ష... ఈ రెండు అంశాల నేపథ్యంలో ‘చెక్’ సన్నివేశాలు ఉంటాయి. ఈ కథలో చదరంగం ఆటకు చాలా ప్రాధాన్యం ఉంది. ► 70 శాతం సినిమా జైలులో సాగుతుంది. కరోనా వల్ల బయటకు వెళ్లలేక జైలు సీక్వెన్సులు కొంచెం పెంచాల్సి వచ్చింది. ‘ఐతే’ తర్వాత నేను, కల్యాణీ మాలిక్ పని చేయాలనుకున్నా పరిస్థితుల వల్ల కుదరలేదు. ఇప్పుడు కుదరడం అదృష్టం అనుకోవాలి. తన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. ఈ చిత్రంలో రకుల్ న్యాయవాదిగా నటించారు. ప్రియా ప్రకాశ్ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. ► ఆనందప్రసాద్ చాలా మంచి నిర్మాత. మొదట కథ వింటారు. కథ నచ్చితే మళ్లీ ఫైనల్ కాపీ చూస్తారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అన్నే రవిగారు వెనుక ఉండి నడిపిస్తుంటారు. ‘ప్రేక్షకుల ఆలోచనల కంటే మీరు అడ్వాన్స్డ్’ అని చాలామంది నన్ను అంటారు.. అడ్వాన్స్ అవ్వడం కూడా తప్పే. కాలం కంటే ముందు, వెనుక ప్రయాణించకూడదు. కాలంతో పాటు ప్రయాణించాలి. ► ‘చెక్’ సినిమాకన్నా ముందే రెండు సినిమాలు ఒప్పుకున్నాను. వాటిలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో ఒకటి, వేరే సంస్థలో మరో సినిమా చేస్తాను. -
15 నిమిషాల కథ విని ఒప్పుకున్నా
‘‘నా కెరీర్లో కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ జానర్ సినిమాలు చాలా ఉన్నాయి. ‘చెక్’ లాంటి యునిక్ కథతో సినిమా చేయడం ఇదే మొదటి సారి. చంద్రశేఖర్ యేలేటిగారు చెప్పిన 15 నిమిషాల కథ విని సినిమా చేసేందుకు ఒప్పుకున్నా’’ అని హీరో నితిన్ అన్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియిర్ హీరోయిన్లు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాలు వేరు.. ‘చెక్’ వేరు. ఈ సినిమా కోసం ఫిజికల్‌గా చాలా కష్టపడ్డా. అవుట్‌పుట్ చూశాక మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందనిపించింది. కల్యాణీ మాలిక్ నేపథ్య సంగీతం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది’’ అన్నారు. చంద్రశేఖర్ యేలేటి మాట్లాడుతూ–‘‘చిన్న పొరపాటు వల్ల జీవితం తారుమారు అయిన ఓ యువకుడు తన తెలివితేటలతో జీవితాన్ని తన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకున్నాడనేది ‘చెక్’ సినిమా కథ. ఇంతకుముందు నితిన్‌తో ఓ కథ అనుకుని సెకండాఫ్ వర్కవుట్ కాక వదిలేశాం. తను లేకపోతే ‘చెక్’ సినిమా లేదు’’ అన్నారు. ‘‘మా సంస్థను మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా ‘చెక్’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. ‘‘ఈ సినిమాలో నటించడం పద్మ అవార్డు అందుకున్నంత సంతోషంగానూ ఉంది’’ అన్నారు నటుడు సాయిచంద్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కల్యాణీ మాలిక్, ప్రియా ప్రకాశ్ వారియర్, అన్నే రవి తదితరులు పాల్గొన్నారు. -
ట్రైలర్: దేశద్రోహితో చెస్ ఆడిస్తారా?!
యంగ్ హీరో నితిన్ ఖైదీగా నటిస్తున్న చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. 'యద్భావం తద్భవతి' అన్న ఉద్బోధతో ట్రైలర్ ప్రారంభమైంది. జైల్లో ఓ పెద్దాయన ఒంటరిగా చెస్ ఆడుతుండటం చూసిన ఆదిత్య(నితిన్) ప్రత్యర్థి ఉంటేనే కిక్కు.. అంటూ ఆటలో దిగాడు. తర్వాత అతడు వేసే ఒక్కో ఎత్తుగడ చూసి ఆశ్చర్యపోవడం పెద్దాయన వంతైంది. అయితే ఆదిత్య ఆటతీరును చూసిన ఆయన చెస్‌లో ఉన్న ఒక్కో పావు గుణగణాలను చెప్తూ దాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తున్నాడు. అలా ఏనుగు, గుర్రం, ఒంటె గురించి చెప్తున్న కొద్దీ దానికి సరిగ్గా సరిపోయే పాత్రలను తెరమీద చూపించారు. మొత్తానికి కటకటాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఆదిత్య చదరంగంలో తోపు అని తెలుస్తోంది. (చదవండి: నితిన్ ‘చెక్’ ఫస్ట్ గింప్స్ వచ్చేసింది) కానీ టెర్రరిస్టుతో చెస్ ఆడిస్తారా? అని నిలదీస్తున్నాడో వ్యక్తి. పైగా అతడిని దేశద్రోహి అని పోలీసులు ఛీ కొడుతున్నారు. దీంతో దేశద్రోహి అన్న ముద్ర చెరిపేసేందుకు ప్రయత్నిస్తోంది లాయర్ రకుల్. ఉరిశిక్ష పడ్డ ఆదిత్యకు క్షమాభిక్ష అవకాశం ఏమైనా ఉందా అని దారులు వెతుకుతోంది. కానీ ఒకానొక సమయంలో ఆ కేసు నుంచి ఎందుకు తప్పుకునేంది ఆసక్తికరంగా మారింది. రాజును ఎదిరించే దమ్ముందా సిపాయికి అన్న వ్యక్తికి 'యుద్ధం మొదలు పెట్టేదే సిపాయి' అని రివర్స్ కౌంటరిస్తున్నాడు ఆదిత్య. సమయం దొరికినప్పుడు తోటి ఖైదీలను చితక్కొడుతున్నాడు కూడా! అసలు నితిన్ దేశద్రోహి ఎందుకయ్యాడు? అతడు ఉరి శిక్షను తప్పించుకుంటాడా? లేదా? అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. ఎత్తులకు పై ఎత్తులతో ఈజీగా చెక్ పెడుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత నితిన్ మరో చిత్రం 'రంగ్‌దే' రిలీజ్ అవుతోంది. (చదవండి: 'ఆర్ఆర్ఆర్’లో నా క్యారెక్టర్ అదే : రామ్‌చరణ్) -
నితిన్ ‘చెక్’ విడుదల తేదీ ఖరారు
యంగ్ హీరో నితిన్... కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో ‘రంగ్ దే’, ‘చెక్’, అంధాధున్ రీమెక్‌లో నటిస్తున్నారు. అయితే వాటిలో మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న ‘రంగ్ దే’ విడుదలవుతుందని ఆ తరవాతే ‘చెక్’ వస్తుందని అందరూ భావించారు. కానీ ప్లాన్ రివర్స్ అయింది. రంగ్ దే( మార్చి 26న విడుదల) కంటే ముందే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘చెక్’ సినిమా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ శుక్రవారం విడుదల తేదీని ప్రకటించింది. ఫిబ్రవరి 19న ‘చెక్’ విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా కనిపిస్తుండటం కూడ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. -
చెక్ మాస్టర్
ఆదిత్య ఓ అద్భుతమైన చెస్ ప్లేయర్. ఎత్తులు పైఎత్తులతో ఈజీగా చెక్ పెట్టగలడు. కానీ ౖజñ ల్లో చిక్కుకున్నాడు. ఈ చెస్ ప్లేయర్ కారాగారంలో ఎలా చిక్కుక్కున్నాడు? అనేది ‘చెక్’ చూసి తెలుసుకోవాలి. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్, ప్రియాప్రకాశ్ వారియర్ కథానాయికలు. వి. ఆనందప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు. చెస్ ప్లేయర్ ఆదిత్య పాత్రలో నితిన్ నటించారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవుట్‌పుట్ బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘చదరంగం నేపథ్యంలో సాగే ఉరిశిక్ష పడ్డ ఖైదీ కథ ఇది’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. ఈ చిత్రానికి సంగీతం: కల్యాణీ మాలిక్, కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అన్నే రవి. -
చెక్ ఫస్ట్ గ్లింప్స్: దేశ ద్రోహిగా మారిన నితిన్
గతేడాది ‘భీష్మ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో నితిన్... కొత్త ఏడాదిలోనూ వరుస సినిమాలను ప్లాన్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం నితిన్ మూడు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ‘రంగ్ దే’ మార్చి 26న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు అంధాధున్ తెలుగు రీమేక్, చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో ‘చెక్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో నితిన్ జంటగా రకుల్ ప్రీత్ సింగ్, మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ నటిస్తున్నారు. తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ‘చెక్’ ఫస్ట్ గింప్స్‌ని ఆదివారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో నితిన్ ఆదిత్య అనే ఖైది పాత్రలో నటిస్తున్నాడు. ‘జైలులో ఆదిత్య అనే ఖైది చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు’ అని ఒక వ్యక్తి చెబుతుంతే.. ‘అద్భుతంగా అంటే? అని మరో వ్యక్తి ప్రశ్నించగా, విశ్వనాథ్ ఆనంద్, కస్పరోవ్ లాగా అని మరో వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఇక పోలీస్ ఆఫీసర్ అయిన సంపత్ రాజ్.. తీవ్రవాది, టెర్రరిస్ట్, దేశద్రోహి ఇది నీ గుర్తింపు అంటూ నితిన్‌ని హేళన చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ చూస్తుంటే.. ఒక తెలివైన వ్యక్తి అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని శిక్ష అనుభవిస్తాడని, దాని నుంచి ఎలా బయటపడ్డారనేది కథలో చూపించనున్నారు. జీవితాన్ని ముడిపెడుతూ, చెస్ లో నైపుణ్యం వున్న ఓ యువకుడి జీవితాన్ని నెరేట్ చేస్తూ అందిస్తున్న సినిమా ఇది. మనమంతా లాంటి ఫీల్ గుడ్, ఎమోషనల్ మూవీ తరువాత చంద్రశేఖర్ యేలేటి చేస్తున్న సినిమా 'చెక్' సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పింస్తుందో చూడాలి మరి. -
చివరి షెడ్యూల్లో చెక్
నితిన్ హీరోగా రకుల్‌ప్రీత్ సింగ్, ప్రియాప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘చెక్’. వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నూతన షెడ్యూల్ ఈ నెల పదో తేదీన హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆనందప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చదరంగం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ‘చెక్’ అని టైటిల్ పెట్టడంతో అన్ని వర్గాల నుండి చక్కని స్పందన వచ్చింది. వచ్చే నెల 5వరకు జరగనున్న ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తవుతుంది. ప్రస్తుతం నితిన్, రకుల్‌ప్రీత్, సంపత్‌రాజ్, సాయిచంద్లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది’’ అన్నారు. -
చెక్ ఎవరికి?
నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘చెక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ను, ప్రీ లుక్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. ఈ సినిమా గురించి ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో నితిన్ విశ్వరూపం చూస్తారు. సినిమాలో ఎవరు ఎవరికి చెక్ పెడతారన్నది సస్పెన్స్’’ అన్నారు. ‘‘ఉరిశిక్ష పడ్డ ఖైదీ పాత్రలో నితిన్ కనిపిస్తారు. చదరంగం నేపథ్యంలో చిత్రకథ ఉంటుంది. చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అన్నారు చంద్రశేఖర్ యేలేటి. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, సాయిచంద్, సంపత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ ఈ నెల 12న ప్రారంభం కానుంది. -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్ : సొమ్ము మాయం
సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు షాకింగ్ న్యూస్. ఎస్బీఐ ఖాతాల్లో డబ్బులు అనూహ్యంగా మాయమైపోతున్నాయన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. నకిలీ (క్లోన్) చెక్కుల ద్వారా కోట్లాది రూపాయలు మోసగాళ్ల చేతుల్లోకి పోతున్నాయి. దేశంలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ బ్యాంకింగ్ మోసానికి గురైంది. దీంతో ఎస్బీఐ వివిధ నగరాల్లోని తన అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. పెద్దమొత్తంలో ఉన్న నాన్ హోం (ఎస్బీఐయేతర) చెక్కుల క్లియరింగ్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎస్బీఐ ఫ్రాడ్ మానిటరింగ్ సెల్ వాట్సాప్ సమాచారాన్ని తన ఉద్యోగులకు అందిస్తోంది. వివరాల్లోకి వెళితే, ఎయిమ్స్ కు చెందిన ఎస్బీఐ రెండు ఖాతాల్లోని 12 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము గల్లంతైనట్టు గుర్తించారు. ఎయిమ్స్ డైరెక్టర్ నిర్వహిస్తున్న ప్రధాన ఖాతా నుంచి రూ .7 కోట్లు, రీసెర్చ్ ఆఫ్ ఎయిమ్స్ డీన్స్‌కు చెందిన మరో ఖాతా నుంచి మరో రూ. 5 కోట్ల నగదు అక్రమంగా తరలిపోయాయి. గత రెండు నెలల్లోనే ఈ మోసం జరిగినట్టు సంస్థ ఆలస్యంగా గుర్తించింది. అధీకృత సంతకాలులేని నకిలీ చెక్కులకు చెల్లింపులు చేయడంలోని వైఫల్యానికి ఆయా శాఖలే కారణమని ఎయిమ్స్ వాదించింది. ప్రోటోకాల్‌ను అనుసరించడంలో ఎస్బీఐ విఫలమైందని, తాము పోగొట్టుకున్ననగదును జమ చేయాలని బ్యాంకును కోరింది. ఈ కుంభకోణంపై దర్యాప్తు కోరుతూ ఏయిమ్స్ వర్గాలు ఇప్పటికే ఢిల్లీలోని ఆర్థిక నేరాల విభాగాన్ని సంప్రదించాయి. దీనికి సంబంధించి ఒక నివేదికను కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఈ మోసం వెలుగులోకి వచ్చిన తరువాత కూడా, గత వారం డెహ్రాడూన్ (రూ .20 కోట్లకు పైగా), ముంబైలో ఎస్బీఐ నాన్-హోమ్ శాఖల నుంచి (రూ.9 కోట్లు) క్లోన్ చెక్కుల ద్వారా రూ .29 కోట్లకు పైగా నగదును అక్రమంగా విత్‌డ్రా చేసుకునే ప్రయత్నాలు జరిగాయని పీటీఐ పేర్కొంది. బ్యాంకు సూచనల మేరకు ఏదైనా నాన్-హోమ్ బ్రాంచ్‌లో నుంచి రూ. 2 లక్షలకుపైగా విలువైన చెక్ వస్తే దాన్ని క్లియర్ చేయడానికి లేదా డబ్బు బదిలీ చేయడానికి ముందు ధృవీకరణ కోసం కస్టమర్‌ను సంప్రదించాలని ఎస్బీఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే రూ. 25 వేలకు పైన లావాదేవీలను కూడా తాము పరిశీలిస్తున్నామన్నారు. అలాగే రూ. 3 కోట్లకు పైగా బ్యాంకు మోసం జరిగినట్లు తెలిస్తే, బ్యాంక్ సీబీఐకి ఫిర్యాదు చేస్తుంది. -
బుల్లెట్‌పై తిరుగుతూ.. చెక్కులు పంచుతూ..
ఎల్లారెడ్డి: పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే జాజాల సురేందర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి అందజేశారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని 20 మంది లబ్ధిదారుల ఇంటింటికీ బుల్లెట్‌పై ఎమ్మెల్యే వెళ్లి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. పట్టణంలో బుల్లెట్‌పై ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లడంతో ఆయనను వింతగా చూశారు. ఎమ్మెల్యే ఏమిటి.. బుల్లెట్‌పై తిరగడమేంటి.. ఇంటింటికీ రావడం ఏమిటని ఒకరిని ఒకరు గుసుగులాడుకున్నారు. లబ్ధిదారులు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా తమ ఇంటికి వచ్చి అందజేయడాన్ని అందరూ చాలా సంతోషించారు. ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కుడుముల సత్యం, ఇమ్రాన్, జలందర్ రెడ్డి, పద్మారావు, రవీందర్, నర్సింలు, సతీష్, శ్రీనివాస్, తిమ్మాపూర్ సర్పంచ్ దామోదర్ ఉన్నారు. -
1.86 కోట్ల నగదు పట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో బుధవారం ఒక్కరోజే రూ.1,86,44,340 డబ్బు పట్టుబడింది. దీంతో ఇప్పటివరకు పట్టుబడ్డ నగదు రూ.9,66,26,006కు చేరింది. డిపాజిట్ చేసిన లైసెన్స్డ్ ఆయుధాల సంఖ్య 8,463కు చేరుకోగా, 39 ఆయుధాల లైసెన్స్‌లను రద్దు చేశారు. స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం విలువ రూ.53 లక్షలకు, ఆభరణాల విలువ రూ.2.66 కోట్లకు చేరింది. -
చెక్కేస్తారా?
-
మా డబ్బులు ఎక్కడ?
ప్రకాశం, కురిచేడు: ఆవులమంద బ్యాంకులో తాము తీసుకున్న రుణాల కిస్తీలు, పొదుపు డబ్బుల కిస్తీలు జమ కాలేదని మండలంలోని పడమరనాయుడుపాలెం, వీవై కాలనీకి చెందిన పలువురు డ్వాక్రా మహిళలు సోమవారం ఆందోళనకు దిగారు. సుమారు 45 గ్రూపులకు చెందిన 400 మంది సభ్యులు బ్యాంకు ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకూ బ్యాంకు నుంచి కదిలేది లేదని హెచ్చరించారు. వివరాలు.. బ్యాంకు పరిధిలోని పడమర నాయుడుపాలెం గ్రామానికి చెందిన పల్లె రవీంద్ర ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో బుజినెస్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాడు. రవీంద్ర గత నెల 30వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 31వ తేదీ ఐనవోలు మేజర్‌లో శవమై తేలాడు. రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి మృతి చెందాడా? లేక ఎవరైనా చంపేసి కాలువలో పేడాశారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్ర బ్యాంకులో బిజినెస్ కరస్పాండెంటుగా పనిచేస్తుండటంతో నాయుడుపాలెం, వల్లేల యానాదికాలనీకి చెందిన మహిళలు డ్వాక్రా రుణాలతో పాటు పొదుపు నగదు తమ ఖాతాల్లో జమ చేయమని నగదు అతనికి ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో రవీంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పలువురు డ్వాక్రా మహిళలు తమ ఖాతాల్లో నగదు జమైంది.. లేంది చెక్ చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లారు. అక్కడ మేనేజర్ డ్వాక్రా మహిళల సూచన మేరకు ఖాతాలు చెక్ చేయడంతో నగదు జమకానట్లు తేలింది. దీంతో నాయుడుపాలెం, వీవై కాలనీ గ్రామాలకు చెందిన డ్వాక్రా గ్రూపుల సభ్యులు బాంకు ఎదుట క్యూ కట్టారు. మేనేజర్ నగదు కోసం మార్కాపురం వెళ్లగా గ్రూపుల సభ్యులు మాత్రం బ్యాంకు ఎదుట బైఠాయించారు. ఎవరికి వారు తాము చెల్లించిన మొత్తాలు నీటిపాలైనట్లేనా? అని ఆందోళనకు దిగారు. బ్యాంకులో తీసుకున్న పొదుపు రుణాలు చెల్లించినట్లు రవీంద్ర తమ తీర్మానాల పుస్తకంలో ఒక వైపు రాసి ఉన్నాడు. కానీ ఆ నగదు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఏయే ఖాతాల్లో ఎంతమేరకు నిధులు జమ కాలేదోనని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేయడం బ్యాంకు సిబ్బందికి సాధ్యం కాలేదు. సుమారు రూ.50 లక్షలకుపైగా నిధులు గోల్‌మాల్‌లై ఉండోచ్చని మహిళలు చెబుతున్నారు. సమగ్ర విచారణ జరిగితేనే వాస్తవాలు బయటపడతాయి. గతంలో కూడా బ్యాంకులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగి ఉండటం, ఆ విషయాన్ని ఖాతాదారులు మరువక ముందే అదే తరహాలో మరో అవినీతి విషయం బయట పడటంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. నగదు వసూలుకు ఎవరినీనియమించలేదు: డ్వాక్రా మహిళల వద్ద రుణాలు, పొదుపు డబ్బులు వసూలు చేసేందుకు ఎవరినీ నియమించలేదు. బిజినెస్ కరస్పాండెంట్‌కు పొదుపు డబ్బులు వసూలు చేసే అధికారం లేదు. ఆ ట్యాబ్‌లో ఆప్షన్ కూడా లేదు. ఓడీ ఖాతాలు కావడంతో ఎన్పీ అయితేనే వాటిని పరిశీలిస్తాం. గేదెల రుణాలు ఎక్కువగా ఎన్పీ అవుతున్నాయి. వాటి వసూలుకే మాకు సమయం సరిపోతోంది.శేషారావు, బ్యాంకు మేనేజర్ -
రుణం చెక్ ఇచ్చే వరకూ నిద్రపోను!
ఒంగోలు టూటౌన్: ఎస్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణం కోసం నెత్తుటి ధారతో ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చిన లబ్ధిదారుడి వ్యవహారం స్థానిక ప్రగతి భవన్లో శుక్రవారం కలకలం రేపింది. కార్యాలయ మెట్లపై నుంచి ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం లోపల వరకు రక్తం ధార పడటంతో ప్రగతి భవన్‌కు వచ్చే ఉద్యోగులు, ప్రజలు ఆందోళన చెందారు. స్థానిక గద్దలగుంటకు చెందిన ఎం.జమదగ్ని 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎస్ఎఫ్డీసీ కింద రుణం మంజూరైంది. లబ్ధిదారుడు శుక్రవారం ఉదయం ఎస్సీ ఈడీ జయరామ్‌ను కలిశాడు. క్యాంపునకు వెళ్లి వచ్చిన తర్వాత డాక్యుమెంటేషన్ పరిశీలించి రుణం చెక్ మంజూరు చేస్తామని ఆయన లబ్ధిదారుడితో చెప్పారు. తనకు తిరిగే ఓపిక లేదని, చెక్ ఇచ్చే వరకూ ఇక్కడి నుంచి కదిలేది లేదని హెచ్చరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి లబ్ధిదారుడిని వారించినా వినిపించుకోలేదు. చేతికి ఉన్న సెలైన్ ప్యానల్‌కు మూత పెట్టుకోకుండా అడ్డం తిరుగుతున్నాడు. కానిస్టేబుల్‌తో పాటు ఎస్సీ కార్పొరేషన్ స్టాఫ్ కూడా అతడిని గంటకుపైగా వారిస్తున్నా వినలేదు. విషయం తెలుసుకున్న గద్దలగుంట యువకులు, బంధువులు వచ్చి జమదగ్నిని బలవంతంగా తీసుకెళ్లడంతో సమస్య సద్దుమణిగింది. -
ఆకతాయిలకు..చెక్
భానుగుడి(కాకినాడ సిటీ): బాలికలు, మహిళలు ధైర్యంతో అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కోరారు. శనివారం స్థానిక భానుగుడి సెంటర్లో కాకినాడ స్మార్ట్‌సిటీలో ఈవ్‌టీజింగ్ నివారణకు జిల్లా పోలీస్ విభాగం షీ టీమ్స్ ఏర్పాటు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. 2కే రన్ ర్యాలీని రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి ప్రారంభించారు. జేఎన్టీయూకే అలుమినీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై షీ టీమ్స్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీసీఎం రాజప్ప మాట్లాడుతూ మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ఇటీవల నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్లో మహిళలకు 30 శాతం ప్రాధాన్యం పాటించామన్నారు. మహిళల గౌరవాన్ని, స్వేచ్ఛను భంగపరిచే అనుచిత ప్రవర్తన, వేధింపులను నిర్మూలించేందుకు షీ టీమ్స్ రక్షణ వ్యవస్థను అమలులోకి తెచ్చిందన్నారు. సీసీటీవీ కెమెరాలు, మఫ్టీలో షీటీమ్‌ల నిఘాలో కాకినాడ నగరంలో మహిళలకు మరింత భద్రతంగా రూపుదిద్దినందుకు ఎస్పీ, పోలీసు యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఎస్పీ విశాల్‌గున్ని మాట్లాడుతూ నగరంలో ఈవ్‌టీజింగ్ జరిగే ప్రదేశాల్లో ఒక మహిళా ఎస్సై, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు, మరో ఇద్దరు పురుష కానిస్టేబుళ్లతో షీ టీమ్ మఫ్టీలో రహస్య నిఘా ఉంచుతాయన్నారు. ఫిర్యాదులను 100 నంబర్‌కు ఫోన్ ద్వారాగానీ, ‘షీటీమ్‌కేడీఏ’ ఫేస్బుక్ అడ్రస్‌కు, వాట్సాప్ నంబర్ 94949 33233కు మెసేజ్ ద్వారా లేదా, కాకినాడ టూటౌన్ పోలీస్‌స్టేషన్ పై అంతస్తులోని డీఎస్పీకి తెలియజేస్తే 24 గంటలలోపు ఆకతాయిలపై చర్య చేపట్టి భద్రత కల్పిస్తామన్నారు. కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ నగరంలో బాలికలు, మహిళలకు ఎదురయ్యే ఆకతాయి వేధింపులను షీ టీమ్స్ అండతో ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. రంపచోడవరం ఏఎస్పీ అజితావేజెండ్ల మాట్లాడుతూ మహిళల రక్షణకోసం ఏర్పాటైన చట్టాల గురించి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలని కోరారు. ఐడియల్ కళాశాల కార్యదర్శి డాక్టర్ పి.చిరంజీవినికుమారి మాట్లాడుతూ మహిళలకు నేనున్నానని ఆత్మస్థైర్యం కల్పిస్తూ పోలీస్ షీటీమ్స్ వ్యవస్థ నిలవడం ముదావహమన్నారు. ముందుగా భానుగుడి సెంటర్ నుంచి జేఎన్టీయూకే ఆడిటోరియం వరకు పెద్ద సంఖ్యలో బాలికలు, మహిళల భాగస్వామ్యంతో 2కే రన్ సాగింది. ఈ రన్లో విజేతలుగా నిలిచిన బాలికలు జి.దివ్య, పుష్పవాణి, మోహితాప్రసన్న, రామలతలకు జేఎన్టీయూకే ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజప్ప బహుమతులు అందజేశారు. ఎస్పీ సతీమణి నేహాగున్ని, డీఎఫ్ఓ డాక్టర్ నందినీ సలారియా, ఏఎస్పీ ఏఆర్ దామోదర్, రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్.మహాలక్ష్మి, డీఎస్పీలు, కళాశాల విద్యార్థినిలు, వివిధ రంగాల మహిళలు పాల్గొన్నారు. -
చంచల
కంపెనీకారు వచ్చేసిందమ్మా.. నేను వెళ్లొస్తా అమ్మా... అంటూ బయటికి వేగంగా నడిచింది చంచల.కారు డోర్ తీసి కూర్చున్న చంచల.. కాస్త ఆశ్చర్యంగా.. ‘నీ పేరు?’ అంది.‘‘అప్పల్రాజు మేడం’’‘‘మరి సింహాద్రీ?’’‘‘ఆడు మా బావకొడుకు మేడం... ఆడికి నిన్న రాత్రి నుంచీ జ్వరం. అందుకని నేనొచ్చేను మేడం’’ అన్నాడు అప్పల్రాజు.చంచల ఫోన్లోనే ఆఫీస్ మెయిల్స్ చెక్ చూసుకుంటుంది. అప్పల్రాజు కారును సీతమ్మధార వద్దున్న వెంకటేశ్వర ఆలయం ముందు ఆపేడు.‘‘ఈయాల.. శనివారం కదా మేడం.. వెంకన్న బాబును చూసి వేగంగా వచ్చేస్తాను’’ అంటూ కదిలాడు అప్పల్రాజు.కాసేపటికి ‘‘మేడం.. ప్రసాదం తీసుకోండి!’’ అని చంచలకు పులిహోర ఉన్న డొప్పను అందించాడు అప్పల్రాజు. పులిహోర డొప్పను అందుకున్న చంచల.. కళ్లకు అద్దుకుని తినసాగింది.పదినిమిషాలు అయ్యాక అప్పల్రాజు కారును స్లో చేసి... వెనక్కి తిరిగి చూశాడు. చంచల ఓ పక్కకి వాలిపోయి ఉండటాన్ని చూసి నవ్వుతూ జేబులోని ఫోన్ అందుకున్నాడు.‘‘ఆ.. నేనే.. పని ఫినిష్ అయ్యింది. పావుగంటలో నీ ముందుంట. పిట్టను తీసుకో.. నాకు సొమ్ము ఇచ్చుకో..’’ అని ఫోన్ కట్‌చేసి కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. చంచల భారంగా కళ్లు తెరచింది. పరిసరాలను పరిశీలనగా చూసి ఆశ్చర్యపోయింది. ఉన్న చోటు నుంచి కదిలేందుకు ప్రయత్నించి విఫలమైంది. అప్పల్రాజు ఇచ్చిన ప్రసాదంలో మత్తు మందు ఉందనీ.. తనను తెలివిగా కిడ్నాప్ చేశారని గ్రహించింది.అంతలో తలుపులు తెరుచుకున్నాయి.‘హలో.. నువ్వు క్షేమంగానే ఉన్నావ్!’ అంటూ దగ్గరకు వచ్చి నోటికి ఉన్న గుడ్డను విప్పేశాడు ఓ గడ్డం వ్యక్తి.‘ఎవరు నువ్వు... నన్నెందుకు తీసుకొచ్చావ్?’‘నా పేరు గురుపాదం, అందాన్ని వేటాడ్డమే నా పని’ అన్నాడావ్యక్తి నిర్లక్ష్యంగా తన గడ్డాన్ని సవరించుకుంటూ...‘నీకేం కావాలి?’‘లాభం! అందంతో వచ్చే లాభం! నువ్వు ఇక తిరిగి ఇంటికి వెళ్లే ఆశలు వదులుకో.. త్వరలోనే నిన్ను అరబ్ షేకులకు బేరం పెడతా. లక్షలు.. లక్షలు పట్టేస్తా!! ఇప్పటిదాకా చాలా మంది అమ్మాయిలని నీలానే కిడ్నాప్ చేసి అమ్మేశా. కాదంటే ఈ గదిలోనే చంపేస్తా.’ అన్నాడు గురుపాదం.గుండెల్లో పిడుగు పడినట్లు అయ్యింది చంచలకు...‘హెల్ప్.. హెల్ప్..’ అంటూ గట్టిగా అరిచింది.ఆమె అరుపులకు ఫక్కున నవ్విన గురుపాదం.. ఆమె చేతికి కాళ్లకి ఉన్న కట్లును కూడా విప్పేస్తూ.. ‘‘నువ్వు తప్పించుకోలేవ్.. పాపా! ఎందుకంటే నువ్వు శివారుల్లో ఉన్న రాజావారి తోట బంగళాలో ఉన్నావ్ నీ అరుపు కనీసం ఈ గది గోడలను కూడా దాటదు. తప్పించుకునే ప్రయత్నాలు మాని.. మెప్పించే ప్రయత్నం చెయ్యి!’’ అంటూ గది తలుపులు వేసి వెళ్లిపోయాడు గురుపాదం. ‘‘గురుపాదం.. నీకు లోను శాంక్షన్ అయ్యిందయ్యా... ఇదిగో కాగితాలు, లోన్ సెక్షన్‌కి వెళ్లి చెక్కు తీసుకో... మరి... నీ వంతు లాంఛనం....?’ అంటూ నసిగాడు బ్యాంక్ మేనేజర్.‘అది అలా వుంచండి సార్.. లేత పిట్ట వచ్చింది. ఈ రాత్రికి.. మీరొస్తే.... బాగుంటుంది. మళ్లా రెండు రోజుల్లో అరబ్ షేక్‌లు పట్టుకుపోతారు...’ అన్నాడు గురుపాదం చాలా చనువుగా.. అంగీకారంగా తలూపాడు బ్యాంక్ మేనేజర్. ఆ రోజు రాత్రి... బ్యాంక్ మేనేజర్ చంచల ముందు మైకంలో తూలుతున్నాడు. చంచల పరిస్థితిని అర్థం చేసుకుంది. ఈ ముసలివాడిని మందులో ముంచి తప్పించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా.. ఎదురుగా ఉన్న విస్కీ బాటిల్ తీసుకుని అతని చేతిలో ఉన్న గ్లాస్లో పోసి.. అతడి నోటికి అందించింది. అతడు ఆమెను చూస్తూ.. గ్లాస్ మీద గ్లాస్ ఖాళీ చేసి మత్తుగా మంచం మీదకు ఒరిగిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చెయ్యని చంచల.. బ్యాంక్ మేనేజర్ జేబులోంచి సెల్ ఫోన్ బయటకు తీసి.. పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసింది సహాయం కోరింది. అలికిడి కావడంతో ఖాళీ విస్కీ బాటిల్ అందుకున్న చంచల.. తలుపు వెనక దాక్కుంది. గదిలోపల కొచ్చిన గురుపాదం తల పగలగొట్టింది. కానీ, బయట తలుపులు తీసేందుకు ప్రయత్నించిన చంచలకు.. కిటికీలోంచి ఇంటి చుట్టూ ఉన్న గూండాలు కనిపించారు. దాంతో తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చెయ్యకుండా పోలీసుల రాకకోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది.పోలీస్ సైరన్ విన్న గూండాలు పారిపోగా.. ఎస్సై గిరి.. కానిస్టేబుళ్లతో కలిసి తలుపు తీసుకుని వేగంగా లోనికొచ్చాడు. రక్తపు మడుగులో కదల్లేని స్థితిలో పడి ఉన్న గురుపాదాన్ని, మత్తులో తూలుతున్న బ్యాంక్ మేనేజర్ని కస్టడీలోకి తీసుకుంటూ.. చంచల సమయస్పూర్తిని అభినందించాడు. - మోహనారుద్ర -
మరో నకిలీ మాస్టర్ అరెస్టు
♦ ఇప్పటి వరకు ఐదుగురు గుర్తింపు ♦ రూ.1.60 కోట్ల మేర కుంభకోణం ♦ మిగిలిన వారిని త్వరలో ♦ పట్టుకుంటాం : విజిలెన్స్ సీఐ పామర్రు : విజిలెన్సు ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించిన తనిఖీల్లో మరో నకిలీ పింఛన్ మాస్టర్ దొరికారని విజిలెన్సు సీఐ ఎన్.శ్రీసాయిఅపర్ణ తెలిపారు. పామర్రుశివాలయం వీధిలో నివసించే నకిలీ మాస్టర్ యండూరి సాయిబాబుని ఆమె గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజిలెన్సు, ఎన్ఫోర్సుమెంట్ ఎస్పీ రవీంద్రనాథ్, డీఎస్పీ పాల్‌తో కూడిన టీమ్ జిల్లాలో ప్రభుత్వ స్కూళ్ల విభాగంలో సర్వీసు చేయకుండా, ఉద్యోగ విరమణ పొందినట్లు డాక్యుమెం ట్లను తయారుచేసి, 15 ఏళ్లుగా పింఛన్‌పొందుతున్న వారి కోసం దాడులు నిర్వహిస్తున్నామని తెలి పారు. పామర్రుకు చెందిన యండూరి సాయిబాబు గతంలో హనుమంతపురంలో ఉండి నాలుగేళ్ల క్రితం నుంచి పామర్రులోని పెదమద్దాలి రోడ్డులోని శివారెడ్డి ఇంట్లో అద్దెకు ఉంటున్నారని తెలిపారు. ఆయన హోమియో వైద్యుడిగా కూడా పనిచేస్తున్నారని వివరించారు. రిటైర్డు హెచ్ఎం కె.రంగరామానుజాచార్యులు 17 ఏళ్ల క్రితం ఆటోలో పరిచయమయ్యాడని, అతనే తన ఇంటికి వచ్చి పెన్షన్ పత్రాలు తయారు చేసి వాటిపై సంతకాలు చేయించి ప్రతినెలా పింఛన్ వచ్చే ఏర్పాటు చేశారని సాయిబాబు తెలిపారని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ సౌకర్యాలు, గ్రాట్యుటీకి సంబంధించిన పెద్ద మొత్తాలను మొవ్వ ట్రజరీ కార్యాలయంలో క్యాషియర్ నుంచి తీసుకునేలా చేశారని, ఇందుకు గానూ రంగరామానుజాచార్యులకు నెలకు పెన్షన్ నుంచి 20 శాతం కమిషన్ ఇస్తున్నట్లు సాయిబాబు తెలిపారని చెప్పారు. సాయిబాబు ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలోని జెడ్పీ హైస్కూల్లో సెంకటరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేసి 2001 అక్టోబర్‌లో ఉద్యోగవిరమణ చేసినట్లు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని, నవంబర్ నుంచి ప్రతి నెలా పింఛన్ సాయిబాబు పొందుతున్నాడని సీఐ తెలిపారు. ఇప్పటి వరకు సాయిబాబు రూ.38 లక్షల వరకు పెన్షన్‌గా తీసుకున్నట్లు తేలిందన్నారు. సాయిబాబు ఇంట్లో సోదాలు నిర్వహించి పెన్షనర్ బుక్, బ్యాంకు అకౌంట్ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నామని, సాయిబాబుకు రూ.31,344 పింఛన్ వస్తోందని పేర్కొన్నారు. ఆర్ఆర్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలి పారు. ఇప్పటి వరకు ఐదుగురు నకిలీ టీచర్లను అదుపులోకి తీసుకున్నామని, ఇప్పటికి రూ.1.60 కోట్ల దుర్వినియోగం జరిగిందని వివరించారు. స్వచ్ఛందంగా ముందుకురావాలి రంగరామానుజాచార్యుల వలలో పడి, అక్రమంగా పింఛన్ పొందుతున్నవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, వివరాలు తెలియజేస్తే తక్కువ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీసాయిఅపర్ణ తెలి పారు. విజయవాడ ఏలూరు రోడ్డు, వినాయక థియేటర్ వద్ద గల విజిలెన్సు ఎస్పీ కార్యాలయంలో వివరాలు తెలపాలని సూచించారు. కార్యాలయం ఫోన్ నంబరు 0866–2453757లో కూడా వివరాలు తెలపొచ్చని పేర్కొన్నారు. రామానుజాచార్యులు కుమార్తె ద్వారా నకిలీ సర్టిఫికెట్‌ట్లు రంగరామానుజాచార్యులు కుమార్తె కె.పద్మలత పామర్రు మండలం నిమ్మకూరు పీహెచ్సీలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తూ అక్రమంగా నకిలీ విశ్రాంత ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను గజిటెడ్ హోదాలో అందజేస్తున్నట్లు సమాచారం ఉన్నదని సీఐ శ్రీసాయిఅపర్ణ తెలిపారు. దాడిలో విజిలెన్సు ఎస్ఐ సత్యనారాయణ, వీఆర్వో లంకపల్లి మీనా తదితరులు పాల్గొన్నారు. -
మీ పాన్ యాక్టివ్‌గా ఉందా? చెక్ చేశారా?
న్యూఢిల్లీ: నకిలీ పాన్ నంబర్ల ఏరివేతలో ప్రభుత్వం, ఆదాయపన్ను శాఖ చురుగ్గా కదులుతున్నాయి. దీంతో ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇప్పటికే దాదాపు 11లక్షలకు పైగా పాన్ కార్డులు రద్దయ్యాయి. జులై 27, 2012 నాటికి 11,44,211 నకిలీ ప్యాన్ కార్డులను క్యాన్సిల్ చేసినట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే ఈ నెలాఖరు నాటికి ఆధార్ తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో మన పాన్ నెంబర్ యాక్టివ్ గా ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు. 1. ఆదాయం పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్-www.incometaxindiaefiling.gov.in ను సందర్శించండి 2. హోమ్ పేజీలో, 'సర్వీసులు' అనే టాబ్ క్రింద, 'నో యువర్ పాన్' క్లిక్ చేయండి. 3. పేరు, జెండర్, మతం, జనన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి 'సబ్ మిట్' అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి. 4. రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఒక-టైమ్ పాస్ వర్డ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి వేలిడేట్ అనే బటన్ క్లిక్ చేయండి. 5. దీంతో పాన్ చెల్లుబాటులో ఉన్నట్లయితే రిమార్క్ కాలంలో 'యాక్టివ్'అన్న సందేశం వస్తుంది. పాన్ ఆధార్ లింకింగ్ విషయానికి వస్తే...ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ ద్వారా చాలా సులువుగా ఆధార్తోను పాన్ లింక్ చేయవచ్చు. incometaxindiaefiling.gov.in. లాగిన్ అయ్యి లేదా డైరెక్టుగా లింక్ ఆధార్ అంటే.. పాప్ అప్ విండో ఒకటి ఓపెన్ అవుతుంది. అక్కడ నిర్దేశిత కాలంలో ఆధార్ నెంబర్, పాన్ నంబర్ ఎంట్రీ చేయాలి. కాప్చాకోడ్ను ఎంటర్ చేసిన లింక్‌ఆధార్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. పుట్టిన తేదీ, ఇంటిపేరు, పేరు, ఆధార్, పాన్‌తో సరిపోలితే వెంటనే ఆధార్‌తో పాన్ విజయవంతంగా అనుసంధాన మైనట్టుగా ఒక మెసేజ్ వస్తుంది. లేదా ఎస్ఎమ్మెస్ ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. UIDPAN స్పేస్ , 12 అంకెల ఆధార్ నంబర్... స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నెంబర్ ఎంటర్ చేసి తే567678 or 56161 నెంబరుకు ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది. దీన్ని నిర్ధారిస్తూ మన మొబైల్‌కు ఒక సందేశం వస్తుంది. దీంతో కీలకమైన ఆధార్‌తో పాన్ అనుసంధానం పూర్తవుతుంది. కాగా ఆదాయ పన్ను దాఖలుకు ఆధార్‌తో పాన్ అనుసంధానం తప్పనిసరి. అలాగే ఆగస్టు 31 లోపు ఆధార్‌తో లింక్ కానీ పాన్ కార్డులు రద్దవుతాయని ఆదాయ పన్ను శాఖ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
కోటి ఎకరాల మాగాణం చారిత్రక కర్తవ్యం
► నీటిపారుదలశాఖ ఇంజనీర్లతో మంత్రి హరీశ్‌రావు ► ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తయ్యేలా కృషి చేయాలి ► తప్పుడు కేసులపై కోర్టులో సమర్థంగా వాదించాలి ► ఉన్నతాధికారులతో 10 గంటలపాటు సమీక్ష సాక్షి, హైదరాబాద్: కోటి ఆశలతో సాధించి తెచ్చుకున్న తెలంగాణను కోటి ఇరవై లక్షల ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దడం ప్రస్తుత ప్రభుత్వం ముందున్న చారిత్రక కర్తవ్యమని నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. ఆ దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో అధికార యంత్రాంగం, అన్ని స్థాయిల సిబ్బంది పునరంకితం కావాలని సూచించారు. నీటిపారుదలశాఖ ముందున్న లక్ష్యాలు, ఎదురవుతున్న ఇబ్బందులు, పనుల పురోగతిపై ఇంజనీర్లతో హరీశ్‌రావు శనివారం సుదీర్ఘంగా సమీక్షించారు. మధ్యాహ్నం 2.30కు ప్రారంభమైన ఈ సమావేశం అర్ధరాత్రి ఒంటి గంట వరకు సుమారు 10 గంటలపాటు సాగింది. సంగారెడ్డి జిల్లాలో సింగూరు ప్రాజెక్టు నుంచి గతేడాది 35 వేల ఎకరాలు సాగులోకి తేవడంతో జరుగుతున్న రివర్స్ వలసలను మంత్రి ప్రస్తావించారు. ఉపాధి కోసం హైదరాబాద్ తదితర నగరాలకు గతంలో కుటుంబాలతోపాటు వలస వెళ్లిన ఆందోల్, పుల్కల్ ప్రాంతాలకు చెందిన 759 మంది రైతులు... సింగూరు నీళ్లు పొలాల్లోకి చేరడంతో తిరిగి సొంత గడ్డకు వాపసు వచ్చేశారన్నారు. ఇంతకు మించిన ఆనందం నీటిపారుదలశాఖకు ఇంకేమి ఉంటుంద న్నారు. దేవాదుల, ఏఎంఆర్పీ, కల్వకుర్తి తదితర ప్రాజెక్టుల్లో పలు చోట్ల పది, ఇరవై ఎకరాల మేర భూసేకరణ సమస్యలు ఉన్నాయని, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల వల్ల వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించలేకపోతున్నామని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు గ్రీన్ ట్రిబ్యునల్‌లో, హైకోర్టులో తప్పుడు కేసులు వేయిస్తున్నా యని తెలిపారు. ఈ కేసులను సమర్థంగా ఎదుర్కోవాలని, ప్రజాప్రయోజనాల గురించి బలంగా వాదించాలని ఇరిగేషన్ లీగల్ టీమ్‌ను ఆదేశించారు. కోర్టు కేసులు పరిష్కరించుకొని త్వరితగతిన ప్రాజెక్టులు పూర్తయ్యేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో ప్రభుత్వ స్పెషల్ సీఎస్ ఎస్కే జోషీ, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, ఈఎన్సీలు మురళీధర్, విజయ ప్రకాశ్, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, అటవీశాఖ కన్సల్టెంట్ సుధాకర్ సహా 15 మంది చీఫ్ ఇంజనీర్లు, లీగల్ సెల్ అధికారులు పాల్గొన్నారు. నాణ్యతలో రాజీ వద్దు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు యుద్ధప్రాతిపదికన జరుగుతున్న సాగునీటి పనులు, భారీ నిర్మాణాలపై నిరంతరం తనిఖీ అవసరమని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇంజనీర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, వివిధ సాగునీటి పనులపై వచ్చే ఆరోపణలు, ఇతర విచారణల కోసం క్వాలిటీ కంట్రోల్ విభాగం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలపై రాజీ పడరాదని క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ఆదేశించారు. అనంతరం ప్రాజెక్టుల నిర్వహణ, డ్యామ్‌ల రక్షణ, భద్రతపై విస్తృతంగా చర్చించారు. డ్యామ్ సేఫ్టీ తదితర అంశాలపై సెంట్రల్ డిజైన్స్ సి.ఈ. నరేందర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. -
ప్రైవేటుకు చెక్
► అనుమతి నిరాకరణ ► వైద్య సీట్ల భర్తీ లేనట్టే ► వందలాదిగా తగ్గనున్న సీట్ల సంఖ్య నాలుగు ప్రైవేటు వైద్య కళాశాలలకు కేంద్ర ఆరోగ్య శాఖ, భారత వైద్య విద్యా కౌన్సిల్ చెక్ పెట్టింది. మూడు కళాశాలలకు రెండేళ్లు, ఓ కళాశాలకు ఓ సంవత్సరం వైద్య సీట్ల భర్తీకి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో వందలాదిగా వైద్య సీట్ల సంఖ్య తగ్గనుంది. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో 22 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి ఈనెల తొమ్మిదో తేదీన పుదుకోట్టైలో ప్రారంభం కానుంది. మొత్తంగా మూడు వేలసీట్లు ఉండగా, పదిహేను శాతం కేంద్ర కోటాకు ఇది వరకు అప్పగించే వాళ్లు. మిగిలిన సీట్లను ప్లస్‌టూ మార్కుల ఆధారంగా వైద్య విద్యా విభాగం కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయడం జరిగేది. అలాగే, ఆరు స్వయం ప్రతిపత్తి హోదా కళాశాలలు, మరికొన్ని ప్రైవేటు కళాశాలల్లోని ప్రభుత్వ కోటా సీట్లు వైద్యవిద్యా విభాగం భర్తీ చేయడం జరిగేది. అయితే, ఈ ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్ష అమల్లోకి వచ్చిన దృష్ట్యా, ఈ సీట్ల భర్తీ పర్వం మీద గందరగోళం బయలు దేరింది. నీట్ వ్యవహారం కోర్టుకు చేరడంతో వైద్య విద్యా సీట్ల భర్తీ మరింత జాప్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నాలుగు ప్రైవేటు కళాశాలలకు చెక్ పెడుతూ, కేంద్ర ఆరోగ్య శాఖ, భారత వైద్య విద్యా కౌన్సిల్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఆయా కళాశాలల్లో మౌలిక వసతుల కరువు, విద్యా బోధనలో నాణ్యత తగ్గుముఖం, పరిశోధనా కేంద్రాలు అంతంత మాత్రమే...ఇలా పలు కారణాలను చూపుతూ ఆ కళాశాలలకు ఈ ఏడాది సీట్ల భర్తీకి అనుమతి నిరాకరిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ అయ్యారు. నాలుగుకు అనుమతి నిరాకరణ : ఇటీవల భారత వైద్య విద్యా కౌన్సిల్ నిర్వహించిన పరిశీలన, తనిఖీల్లో ఆయా కళాశాలల్లో కరువైన వసతులను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలోని నాలుగు ప్రైవేటు కళాశాలలకు చెక్ పెట్టారు. ఇందులో మూడు కళాశాలలు రెండేళ్ల పాటు సీట్ల భర్తీ చేసుకునేందుకు వీలు లేకుండా కొరడా ఝుళిపించారు. ఇక, ఓ కళాశాలకు మాత్రం ఈ ఏడాది బ్రేక్ వేశారు. ఇందులో కాంచీపురంలోని అన్నై వైద్య కళాశాల, మేల్ మరువత్తురు ఆది పరాశక్తి వైద్యకళాశాల, మాత వైద్య కళాశాలలు 2017–18, 2018–19 సంవత్సరాలకు వైద్య సీట్ల భర్తీకి అనుమతి నిరాకరించారు. కోయంబత్తూరులోని కర్పుగం కళాశాలకు ఓ ఏడాది పాటు బ్రేక్ వేశారు. ఒక్కో కళాశాలలో సరాసరిగా రెండు వందల సీట్ల వరకు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రసుత్తం పడ్డ బ్రేక్‌తో రాష్ట్రంలో ఈ ఏడాది 800 వంద వరకు సీట్లు తగ్గే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అసలే నీట్ పుణ్యమా తమ సీట్లు, ఇతరరాష్ట్రాల విద్యార్థులు ఎక్కడ తన్నుకు వెళ్తారోనన్న ఆందోళన విద్యార్థుల్ని వెంటాడుతున్న నేపథ్యంలో, తాజా ఉత్తర్వులతో వందలాదిగా సీట్లు తగ్గడంతో ఆందోళన రెట్టింపు అవుతోంది. -
ఎర్రగడ్డ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శనివారం ఉదయం తనిఖీ చేశారు. ఒక్కో వార్డును, వివిధ విభాగాలను మంత్రి పరిశీలించారు. ఆస్పత్రిలో వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కేటాయించామని, ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
దుగ్గొండి, చెన్నారావుపేట(నర్సంపేట): స్థానిక ఎస్సెస్సీ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భం గా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పరీక్షా కేంద్రాల ఇన్చార్జిలకు సూచించా రు. ఎస్సై భాస్కర్‌రెడ్డి, పరీక్షా కేంద్రం సీఎస్‌లు సాల్మన్, రజాక్ పాల్గొన్నారు. అలాగే, చెన్నారావు పేట మం డలంలోని అమీనాబాద్ మోడల్‌స్కూల్, సిద్ధార్థ హైస్కూల్, జెడ్పీ పాఠశాలల్లోని పరీక్ష కేంద్రాలను డీఈఓ నారాయణరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. డీఈ లక్ష్మీనారాయణ, సీఎస్ కొమ్మాలు, సీసీ రవిచంద్ర, రవికుమార్ పాల్గొన్నారు. -
ఏ అధికారంతో ఈ తనిఖీలు?
హాస్టళ్లలో టీఎన్ఎస్ఎఫ్ హంగామా తమను కలవాలంటూ వార్డెన్లపై ఒత్తిళ్లు ‘చినబాబు’ చెప్పాడంటూ జులుం విశాఖపట్నం: సంక్షేమ హాస్టళ్లపై తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) నేతలు జులుం చెలాయిస్తున్నారు. లేని అధికారాలను అందిపుచ్చు కుని ఏకంగా తనిఖీలకే తెగబడుతున్నారు. చినబాబు (సీఎం తనయుడు లోకేష్) పేరు చెప్పి నానా హంగామా చేస్తున్నారు. వీరంతా ‘చంద్రన్న సంక్షేమ వసతి గృహాల సముద్ధరణ’ పేరుతో హాస్టళ్లకు వెళుతున్నారు. జిల్లాలో పలు బీసీ, ఎస్సీ సంక్షేమ హాస్టళ్లపై పడుతున్నారు. అక్కడ హాస్టల్ వార్డెన్లకు దడ పుట్టిస్తున్నారు. సంక్షేమ హాస్టళ్లలో పరిస్థితులను తెలుసుకుని తనకు నివేదించాలంటూ లోకేష్ టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులను ఆదేశించినట్టు వారు చెబుతున్నారు. దీంతో 26 మంది సభ్యులు గల వీరు జిల్లాలో నాలుగైదు బృందాలుగా ఏర్పడి హాస్టళ్లకు వెళ్తున్నారు. రాత్రి వేళల్లో ఆకస్మిక తనిఖీలంటూ రహస్యంగా వెళ్లి హడావుడి చేస్తున్నారు. తాము వసతి గృహాలు ఎలా ఉన్నాయో పరిశీలించి లోకేష్‌తో పాటు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేస్తామని, అందుకే వచ్చామని చెబుతుండడంతో వార్డెన్లు బెంబేలెత్తిపోతున్నారు. ఆయా హాస్టళ్లలో పరిశుభ్రత, ఆహారం, మెనూ, మరుగుదొడ్లు తదితర సమస్యలపై వీరు ఆరా తీస్తున్నారు. పిల్లలకు పెట్టే ఆహారాన్ని వీరు రుచి చూస్తున్నారు. కొన్నిచోట్ల రాత్రి పూట వారితో సహపంక్తి భోజనాలు చేసి అక్కడే బస చేస్తున్నారు. వారితో ఫొటోలు కూడా దిగుతున్నారు. హాస్టళ్లలో సమస్యలపై ఫొటోలు తీస్తున్నారు. ఆయా హాస్టళ్లలో ఏవో లోపాలుండడం వల్ల వీరు తమ గురించి ఎలాంటి నివేదికలు ఇస్తారోనని వార్డెన్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో వారికి ‘ఘన స్వాగతం’ పలుకుతూ ప్రత్యేక అతిథులుగా రాచమర్యాదలు చేసి పంపిస్తున్నారు. మరోవైపు కొంతమంది హాస్టళ్లకు తాము తనిఖీలకు వస్తున్నట్టు ముందస్తుగా సమాచారాన్ని లీక్ చేస్తున్నారు. దీంతో ఆయా వార్డెన్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచడమేగాక ఆ రోజు విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం పెడుతున్నారు. విద్యార్థులను సమస్యలు చెప్పవద్దని కోరుతున్నారు. వార్డెన్లకు హుకుంలు.. ఎక్కడైనా వీరు తనిఖీలకు వెళ్లినప్పుడు సంబంధిత వసతి గృహం వార్డెన్ అందుబాటులో లేనిపక్షంలో ఉన్నతాధికారులకంటే గట్టిగా బెదిరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ వార్డెన్‌కు ఫోన్ చేసి తమను కలవాలంటూ హుకుం జారీ చేస్తున్నారని చెబుతున్నారు. కొంతమంది టీఎన్ఎస్ఎఫ్ నాయకులైతే హాస్టల్ పిల్లల వద్దకు వెళ్లి వారిని పొంతనలేని ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు నర్సీపట్నం కాలేజీ హాస్టల్లో ఎంపీసీ విద్యార్థుల వద్దకు వెళ్లి మీరు భవిష్యత్‌లో ఏమి కావాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తాము ఇంజినీర్లు కావాలనుకుంటున్నామని చెప్పగా, డాక్టర్లు ఎందుకు కావాలనుకోవడం లేదని ప్రశ్నించేసరికి ఆ విద్యార్థులు నివ్వెరపోయారు. దీనిని బట్టి వీరికి ఎలాంటి అవగాహన ఉందో స్పష్టమవుతోంది. జిల్లాలోని మరోక హాస్టల్‌కు వెళ్లిన బృంద సభ్యులు తనిఖీ చేసి వచ్చారు. ఆ సమయంలో వార్డెన్ లేకపోవడంతో బృందంలోని ఒక సభ్యుడు తరచూ తనను కలవాలంటూ ఫోన్లో ఆదేశాలు జారీ చేస్తున్నాడు. లేనిపక్షంలో మీ గురించి సీఎంకు, లోకేష్‌కు నివేదిక పంపిస్తామని బెదిరిస్తున్నాడు. ఇలా టీఎన్ఎస్ఎఫ్ నాయకుల్లో కొందరు అదుపు తప్పి నానా హంగామా చేస్తున్నారు. ఇప్పటిదాకా తాము జిల్లా, నగరంలోని 25 హాస్టళ్లను తనిఖీ చేసినట్టు ఈ బృందంలోని ఒక సభ్యుడు ‘సాక్షి’కి చెప్పాడు. ఈ హాస్టళ్లలోని పరిస్థితులను కొద్దిరోజుల్లోనే సీఎంతో పాటు లోకేష్‌కు నివేదిస్తామని వివరించాడు. -
చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి జైలు శిక్ష
రంగారెడ్డి : చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నేరం రుజువైనందున సంవత్సరం జైలు శిక్షతోపాటు రూ.85వేల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 8వ స్పెషల్ మెజిస్ట్రేట్ శుక్రవారం తీర్పు చెప్పారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన వనం సత్యనారాయణ అదే ప్రాంతానికి చెందిన మిర్యాల శ్రీహరి పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం 2015 ఏప్రిల్‌లో సత్యనారాయణ నుంచి శ్రీహరి రూ.70 వేలు అప్పుగా తీసుకొని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని ప్రామిసరీ నోటు రాసి ఇచ్చాడు. గడువు ముగిసిన తర్వాత డబ్బు చెల్లించమని శ్రీహరిని కోరగా రూ.70వేలకు ఆంధ్రా బ్యాంక్ చౌటుప్పల్ బ్రాంచ్‌కు చెందిన చెక్కులను సత్యనారాయణ పేరిట జారీ చేశాడు. ఆ చెక్కును లక్ష్మీ విలాస్ బ్యాంక్ కొత్తపేట బ్రాంచ్‌లో జమ చేయగా ఖాతాలో డబ్బులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ శ్రీహరి డబ్బులు చెల్లించకపోవడంతో సత్యనారాయణ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. సాక్ష్యాధారాలను పరిశీలించిన 8వ స్పెషల్ మెజిస్ట్రేట్ పై విధంగా తీర్పు చెప్పారు. -
ఎక్స్పో్లజివ్ గోడౌన్స్ తనిఖీ చేసిన కంట్రోలర్
యెటింక్లయిన్ కాలనీ : జీడీకే–5వ గని సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఎక్స్పో్లజివ్ గోడౌన్ ను కంట్రోలర్ ఆఫ్ ఎక్స్పో్లజివ్ డీకేపాండే గురువారం తనిఖీ చేశారు. ప్రస్తుతం వకీల్‌పల్లిగని సమీపంలోని గోడౌన్ ను నూతనంగా నిర్మిస్తున్న కట్టడాల్లోకి మార్చేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం యాజమాన్యం దరఖాస్తు చేసుకుంది. ఈమేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఎక్స్పో్లజివ్ఆఫ్కంట్రోలర్ నూతన నిర్మాణాలు పరిశీలించారు. కంట్రోలర్ వెంట ఆర్జీ–2 ఎస్‌ఓటూ జీఎం రవీందర్, ఏజీఎం రాజేశ్, సివిల్ ఎస్ఈ శ్రీనివాస్, ఎక్స్పో్లజివ్ స్టోర్స్ ఇన్ చార్జి మూర్తి, సెక్యూరిటీ అధికారి జానకిరాం తదితరులున్నారు. -
మెక్కింది కక్కించరేం!
అక్రమాల పుట్టల ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో అవినీతి తేలినా రికవరీ లేదు రూ.4.08 కోట్లకు రాబట్టింది రూ.1.77 కోట్లే.. పదును లేని ఆయుధంగా రెవెన్యూ రికవరీ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో వలసలు నివారించి.. ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో దశాబ్దకాలం క్రితం ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అవినీతి అధికారులకు కల్పతరువుగా మారింది. పని చేయకున్నా.. చేసినట్లుగా లెక్కలు చూపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఉపాధి పనుల్లో అవినీతి, అక్రమాలు పెరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సామాజిక తనిఖీల్లో రూ. కోట్లలో అవినీతి బయటపడుతున్నా నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు అవినీతికి పాల్పడిన సిబ్బంది వేతనాల్లో కోత విధించడం లేదు. ఫలితంగా ప్రభుత్వానికి చెందాల్సిన రూ.కోట్లు రాకుండా పోతున్నాయి. తొమ్మిది విడతల్లో జరిగిన సామాజిక తనిఖీల ఆధారంగా బయటపడిన అవినీతి, అక్రమాలు, రికవరీపై ’సాక్షి’ ఫోకస్..– వివరాలు 2లోu ఇందూరు : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 721 గ్రామ పంచాయతీల పరిధిలోని 1,302 ఆవాస ప్రాంతాల్లో 4,67,858 మంది ఉపాధి కూలీలకు జాబ్ కార్డులు ఉన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఏటా సగటున రూ.300 కోట్ల పనులు జరుగుతాయి. గడిచిన దశాబ్దకాలంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సామాజిక తనిఖీల్లో రూ.4.08 కోట్ల అవినీతి జరిగిందని అధికారులు తేల్చగా.. ఇప్పటివరకు రూ.1.77 కోట్లు మాత్రమే రికవరీ చేశారు. సామాజిక వనరుల కోసం చేపట్టిన పనుల్లో భారీగా అవినీతి జరగడం, పనుల్లో నాణ్యత లోపించడం, చేయని పనులు చేసినట్లుగా చూపి బిల్లులు పొందడం, ఉపాధి కూలీల సొమ్ము నొక్కెయడం జరిగింది. 2015లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఓ స్వతంత్య్ర పరిశోధన సంస్థ చేపట్టిన సర్వేలో 50 శాతం ఉపాధి హామీ లబ్ధిదారులు తమ వేతనాలు, వసూల్‌కు లంచాలు చెల్లిస్తున్నానే ఆశ్చర్యకర విషయం బయటపడింది. జరగని పనులు జరిగినట్లు, చనిపోయిన వారిని ఉపాధి కూలీలుగా చూపడం, సామాజిక తనిఖీలు సరిగ్గా చేపట్టకపోవడం వంటి కారణాలతో ప్రజాధనం పెద్ద మొత్తంలో దుర్వినియోగం అవుతుంది. ఇదిలా ఉండగా గత దశాబ్దకాలంగా ఉపాధి హామీలో జరిగిన అవినీతి, అక్రమాల్లో పైస్థాయి ఉద్యోగులు ఎవరినీ విధుల నుంచి తొలగించ లేదు. జిల్లాలో ఇప్పటి వరకు 133 మంది విధుల నుంచి తొలగించారు. తొలగించిన వారిలో ఏపీఓ, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, సీఓలు మాత్రమే ఉన్నారు. మండల స్థాయిలో సరిగ్గా పర్యవేక్షణ జరపాల్సిన ఎంపీడీలు.. తప్పు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు 13 మంది ఎంపీడీఓలు తప్పు చేసినా.. వారికి ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఫలితాలు లేని తనిఖీలు ఉపాధి హామీ పథకంలో జరిగిన పనుల పురోగతి నాణ్యత పరిమాణాలు చూడ్డానికి జరుగుతున్న సామాజిక తనిఖీలు తూతూ మంత్రంగా జరుగుతున్నాయి. అన్ని గ్రామాల్లో ఆ ఏడాది చేసిన పనులను పరిశీలించిన తరువాత చివరి రోజు జరిగే ప్రజావేదికకు ప్రజలే లేకుండా పోతున్నారు. అలాగే సామాజిక తనిఖీల ద్వారా జరిగిన అవినీతి కూడా బయటకు రావడం లేదు. 10వ తరగతి, ఇంటర్ చదివిన వారితో తనిఖీలు చేయించడం వల్ల కూడా అక్రమాలు వెలుగులోకి రాకపోవడానికి కారణంగా చెప్పవచ్చు. మరో పక్కా సామాజిక తనిఖీలకు విచ్చల విడిగా ఖర్చు అవుతోంది. అవినీతి సొమ్మును సిబ్బంది నుంచి కక్కించే ప్రయత్నం అధికారులు చేయడం లేదు. రెవెన్యూ రికవరీ చట్టం ఉన్నా అది పదును లేని ఆయుధంగా మారింది. -
భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు నూతన విధానం
అనంతపురం అర్బన్ : భూముల రిజిస్ట్రేషన్లలో వివాదాలకు చెక్ పెట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. రిజిస్ట్రేషన్ కు ముందే భూములను సబ్‌డివిజన్ చేయడం ఇందులో కీలకాంశం. ఈ విధానం అమలుకు తొలిదశగా జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఒక్కొక్క మండలాన్ని ఎంపిక చేశారు. ఈ విధానం ఇక్కడ తీసుకొస్తే రాష్ట్రంలోనే ప్రప్రథమంగా అమలు చేసిన జిల్లాగా అనంతపురం నిలుస్తుంది. రిజిస్ట్రేషన్ కన్నా ముందే సబ్‌డివిజన్ నూతన విధానం కర్ణాటక తరహాలో ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు ముందే రెవెన్యూ యంత్రాంగం భూమికి సంబంధించి సబ్‌డివిజన్ పూర్తి చేస్తుంది. విక్రయదారులు ఇద్దరూ సర్టిఫైడ్ స్కెచ్ పొందిన తరువాతే భూమి రిజిస్ట్రేషన్ అవుతుంది. సర్వే చేయడం ద్వారా విక్రయించే వ్యక్తికి క్షేత్ర స్థాయిలో ఎంత భూమి ఉంది.. తనకు ఉన్నదానినే విక్రయించేందుకు సిద్ధపడ్డాడా, లేదా అనేది స్కెచ్ ద్వారా తెలుస్తుంది. భూమి విస్తీర్ణం, దాని హద్దులు (చెక్బందీ) సర్టిఫైడ్ స్కెచ్‌లో ఉంటాయి. ప్రస్తుతం భూ విస్తీర్ణం, చెక్బందీతో సంబంధం లేకుండా డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. విక్రయదారుడు చూపిన విస్తీర్ణం క్షేత్ర స్థాయిలో లేకపోతే వివాదం తలెత్తుతోంది. ప్రధానంగా భాగపరిష్కార ఆస్తులను లేదా ఉన్న భూమిలో కొంత భాగాన్ని అప్పటికే విక్రయించిన సందర్భాల్లో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొనుగోలు చేసిన వారు క్షేత స్థాయిలోకి వెళ్లి భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఇలాంటి వివాదాలు కోర్టుల పరిధిలో చాలానే ఉన్నాయి. మొదటి విడతగా ఐదు మండలాల్లో... నూతన విధానాన్ని మొదటి విడతగా ఐదు మండలాల్లో ప్రారంభించనున్నారు. అనంతపురం రెవెన్యూ డివిజన్లో శింగనమల మండలం, ధర్మవరం డివిజన్లో చెన్నే కొత్తపల్లి, పెనుకొండ డివిజన్లో మడకశిర, కళ్యాణదుర్గం డివిజన్లో రాయదుర్గం, కదిరి రెవెన్యూ డివిజన్లో బుక్కపట్నం మండలాలను ఎంపిక చేశారు. -
ఇటు పాత రూ.కోట్లు అటు నకిలీ నోట్లు
ఎండాడ చెక్‌పోస్టు వద్ద రూ.కోటి పాత నోట్లు పట్టివేత సరైన ఆధారాలు చూపకపోవడంతో ఇద్దరిపై కేసు నమోదు వుడా కాలనీ మురుగునీటిలో నకిలీ నోట్ల బస్తాలు ఏరుకోవడానికి ఎగబడిన జనం రంగంలోకి ఐటీ అధికారులు విశాఖపట్నం/పీఎం పాలెం/మధురవాడ : అర్ధరాత్రి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తే పోలీసుల కళ్లు చెదిరిపోయారుు. కోటి రూపాయల నగదు చూసి నోరెళ్లబెట్టారు. వెంటనే డబ్బు తరలిస్తున్న వాహనాన్ని, డ్రైవర్‌ను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో సంఘటనలో డబ్బుల బస్తాలు మురుగు కాలువలో దర్శనమిచ్చారుు. వాటిని గమనించిన స్థానికులు అందినకాడికి పట్టుకుని పరుగుతీశారు. ఇంకా ఏమైనా మిగిలిపోయాయోమోనని కొందరు మురుగుకాలువలో దేవులాడారు. చివరికి కేవలం ఐదు నోట్లు దొరికారుు. అవి కూడా నకిలీవని తెలిసి అవాక్కయ్యారు. నగరంలో బుధవారం జరిగిన ఈ రెండు సంఘటనలు పెద్ద నోట్ల రద్దుతో ’నల్ల’ పాములు బయటకొస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలవడంతో పాటు నగరంలో నకిలీ నోట్ల చెలామణీకి అద్దం పట్టారుు. రాత్రివేళ వాహనంలో తరలింపు ఒడిశాకు చెందిన ప్రీతమ్‌కుమార్ బారిక్, తమిళనాడుకు చెందిన వెంకటపతి ఒ.డి.5 09ఇ-1199 నంబరు గల బొలోరా వాహనంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారి మీదుగా రూ. కోటి రూపాయలు పాతనోట్లు తమ వెంట తీసుకెళ్తున్నారు. అదే సమయంలో ఆనందపురం ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఎండాడ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అక్కడకు చేరుకున్న బొలోరా వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 200 బండెల్స్ పాత ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు (వాటి విలువ రూ. కోటి) కనిపించారుు. వెంటనే కారు డ్రైవర్‌ను, అతనితో ప్రయాణిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం నగరమంతా దావానలంలా వ్యాపించింది. కానీ పోలీసులు మాత్రం అత్యంత గోప్యత పాటించారు. రాత్రి వరకూ వివరాలు వెల్లడించలేదు. కాగా పట్టుబడిన వారు పోలీసుల విచారణలో తాము త్రివేణీ ఎర్త్ అనే ప్రైవేటు సంస్థ ప్రతినిధులమని మెకానికల్, డీజిల్ ఫైర్ పార్టులకు చెల్లింపుల కోసం ఈ సొమ్ము తరలిస్తున్నామని వారిలో ఒకరు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన విషయంలో ఈ నగదు చెల్లించాల్సి వచ్చిందని మరో వ్యక్తి పోలీసులకు వివరించారు. వారిద్దరూ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం మరింత పెరిగింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు రూపేణా లావాదేవీలు జరగడం అంటూ ఉండదని, చెక్కు, డీడీ రూపంలో చెల్లింపులు ఉంటాయనే కోణంలో రికార్డులు చూపమని పోలీసులు వారిని అడిగారు. చూపిస్తామంటూ సాయంత్రం వరకూ కాలం గడిపినా సరైన ఆధారాలు ఇవ్వలేకపోయారు. నగదుకు సంబంధించి వారు సరైన ఆధారాలు చూపలేకపోయారని, దాంతో కేసు నమోదు చేశామని పీఎం పాలెం సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించామన్నారు. మరోవైపు ఐటీ ప్రతినిధులు ఈ ఉదంతంపై ఆరా తీశారు. తదుపరి చర్యల నిమిత్తం నివేదికను సీఐ వారికి అందజేశారు. మురుగు కాలువలో నకిలీ నోట్లు జీవీఎంసీ 5వ వార్డు మధురవాడ మిథిలాపురి వుడా కాలనీ రోడ్డులో బుధవారం ఉదయం దొంగనోట్లు కలకలం రేపారుు. ఉదయం 6గంటల సమయంలో మిథిలాపురి ఉడాకాలనీ రోడ్డులో లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ కల్వర్టు వద్ద మురుగునీటి కాల్వలో గుర్తు తెలియని వ్యక్తులు బస్తాలతో రు.500 నోట్లు పడేసి పరారయ్యారు. ఈ విషయం అందరికీ తెలియడంతో ఏరుకోవడానికి జనం పరుగులు తీశారు. మోకాలు లోతు నీటిలో సైతం నోట్ల కోసం వెతికారు. అవి దొంగనోట్లు అని తెలిసినా వెతుకులాట ఆపలేదు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇవి చెల్లని నోట్లు అని అందరినీ చెదరగొట్టారు. అరుుతే సుమారు కోటి రూపాయలు విలువ చేసే నోట్లు బస్తాలతో పడేశారని, కొందరు వీటిని పట్టుకెళ్లిపోయారని, చాలా నోట్లు ఈ కాలువలో కొట్టుకు పోయాయని పుకార్లు షికారు చేశారుు. ఈ విషయంమై పీఎంపాలెం సీఐ లక్ష్మణమూర్తి వివరణ కోరగా నోట్లు ఎవరు పడేశారో, ఎంత మొత్తం అనే విషయాలు తెలియదన్నారు. అరుుతే అవి దొంగనోట్లు అని భావిస్తున్నామని తెలిపారు. -
ఉపాధి హామీలో అవినీతి
► పనులు తక్కువ కొలతలు ఎక్కువ ► ధర్మారంలో రూ.68875, ► సైదాబాద్‌లో రూ.64877 రికవరీ జమ్మికుంట రూరల్ : ఉపాధి పథకంలో చేపట్టిన పలు పనులపై వివిధ గ్రామాల్లో సామాజిక తనిఖీలు నిర్వహించగా సోమవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 9వ, విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక జరిగింది. పలు గ్రామాలలో తక్కువ పనులు చేసి ఎక్కువ ప్రతిపాదనలు చూపిన ఆధారాలను తనిఖీ బృందం బయట పెట్టింది. మండల స్థారుు అధికారుల పర్యవేక్షణ కొరవడడడంతో ఫీల్డు అసిస్టెంట్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నారుు. ధర్మారం గ్రామంలో వరద కాల్వ నిర్మాణ పనుల్లో తక్కువ పనికి ఎక్కువ ప్రతిపాదనలు తయారు చేయడంతో రూ.68875లను,సైదాబాద్‌లో బినామీ పేర్లతో సొమ్మును కాజేయగా రూ.64,877లను రికవరీకి సిద్ధం చేశారు. కనగర్తి గ్రామంలో గ్రామ ఫీల్డు అసిస్టెంట్ తన భర్తకు 84రోజుల పని దినాలు కల్పించి రూ.9991లను పొందినట్లు గుర్తించారు. దగ్గరి బంధువులకు మాత్రమే పని దినాలు కల్పించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వంతడుపుల గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి జాబ్‌కార్డు ఇవ్వడాన్ని, వరద కాల్వ నిర్మాణంలో తక్కువ కొలతలను గుర్తించారు. వావిలాల ఫీల్డు అసిస్టెంట్‌ను తొలగించాలని పలువురు గ్రామస్తులు రాత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును అధికారులకు అందజేశారు. లక్ష్మాజిపల్లి సీఎస్పీ లావణ్య రూ.16 వేలను ఇప్పటికీ కూలీలకు చెల్లించలేదని గుర్తించగా చర్యకు నిర్ణరుుంచారు. ఎంపీడీవో పనితీరుపై డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్రావు అసహనం వ్యక్తం చేశారు. జమ్మికుంట, ఇల్లందకుంట మండలాలలో మొత్తం 32 గ్రామాలు ఉండగా సోమవారం రాత్రి వరకు 15 గ్రామాల పనితీరుపై ప్రజావేదిక జరిగింది. మిగతా గ్రామాల ప్రజావేదిక బుధవారం జరగనుందని అధికారులు తెలిపారు. ఎంపీపీ గంగారపు లత, ఏపీడీ రాంరెడ్డి, ఎంపీడీవో రమేష్, ఏపీవో రాణి, అసిస్టెంట్ విజిలెన్స అధికారి కొమురయ్య, స్టేట్ మానిటరింగ్ అధికారి అశోక్‌కుమార్, ఎస్ఆర్పీలు నవీన్, అనిల్‌కుమార్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. -
‘గ్రూప్-2’ ప్రశాంతం
-
‘గ్రూప్-2’ ప్రశాంతం
‘గ్రేటర్’లో గ్రూప్-2 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగారుు. ఎక్కువ మంది అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకొన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థినీ తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతించారు. కొన్ని చోట్ల అభ్యర్థుల ఐరీస్‌ను తీసుకున్నారు. కొందరి ఐరీస్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యారుు. పరీక్ష సమయం అరుుపోతుండటంతో ఐరీస్ నమోదు ఆపేసి నేరుగా హాల్లోకి పంపేశారు. కొందరు అభ్యర్థినులు తమ పసిబిడ్డలతో పాటు పరీక్ష కేంద్రానికి వచ్చారు. చిన్నారులను తండ్రి, అమ్మమ్మ వంటి వారు ఆడిస్తుండగా తల్లులు పరీక్ష రాసేందుకు వెళ్లారు. ఒకరిద్దరు అభ్యర్థులు పరీక్ష మొదలయ్యే ముందు హడావుడిగా రాగా.. మరికొందరు పరీక్ష ప్రారంభానికి ముందు వరకూ కూడా కేంద్రం పరిసరాల్లో పుస్తకాలతో కుస్తీపడుతూ కనిపించారు. -
ఆదాల, అజీజ్‌కు ఆనం చెక్
ఎస్సీ సబ్‌ప్లాన్ పనులు తమ చేతుల్లోకి తెచ్చుకునే వ్యూహం కాంట్రాక్టర్లతో నేరుగా ఆనం సోదరుల చర్చలు తమ వారినీ రంగంలోకి దించి లెస్‌కు టెండర్లు దాఖలు చేయించేందుకు నిర్ణయం ఈ పనులతో సిటీ, రూరల్ నియోజక వర్గాల్లో పట్టు పెంచుకునే ఎత్తుగడ సాక్షి ప్రతినిధి – నెల్లూరు నెల్లూరు సిటీ, రూరల్ నియోజక వర్గాల్లో తమ పట్టు పెంచుకోవడానికి ఆనం సోదరులు మళ్లీ రంగంలోకి దిగారు. ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ 42 కోట్లతో నిర్మించనున్న పనులను ఆయుధంగా మలుచుకుని తమ ప్రత్యర్థులు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అజీజ్‌కు చెక్ పెట్టడానికి వ్యూహ రచన చేశారు. శాసనసభ ఎన్నికల అనంతరం జిల్లాలో జరిగిన రాజకీయ కుప్పి గంతుల తర్వాత నెల్లూరు టీడీపీలో కొత్త గ్రూపులు తయారయ్యాయి. వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన మేయర్ అబ్దుల్ అజీజ్ నగరంలో తన పట్టు పెంచుకోవడానికి ఉవ్విళ్లూరారు. సామాజక సమీకరణలో వచ్చే సారి తనకు అవకాశం రాకపోదా అనే ఆశతో పనిచేసుకుంటూ వచ్చారు. ఇదే సమయంలో కార్పొరేషన్ మొత్తం పరిధిలో తన వారిని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే రూరల్ నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్‌రెడ్డితో విబేధాలకు దిగారు. ఈ పరిణామాలు నడుస్తున్న తరుణంలోనే ఆనం సోదరులు కాంగ్రెస్ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ పరిణామం నెల్లూరులో అందరికంటే ఎక్కువ అజీజ్‌కే ఆందోళన కలిగించింది. తనను గట్టిగా వ్యతిరేకించే ఆనం కుటుంబం తానున్న పార్టీలోకే వస్తే తనను మడిచేస్తారనే ఆందోళన ఆయనలో వ్యక్తం అయ్యింది. కొంత కాలం పాటు లోలోన ఉన్న విబేధాలు ఇటీవల బహిర్గతం అయ్యాయి. ఆక్రమణల కూల్చి వేత సమయంలో ఆనం వివేకానందరెడ్డి నేరుగా మేయర్ మీద దాడికి దిగారు. అజీజ్ కూడా గట్టిగానే ఎదురు దాడి చేశారు. ఈ వ్యవహారం పార్టీని ఇరుకున పెట్టేలా తయారు కావడంతో హై కమాండ్ రంగంలోకి దిగడంతో వివాదానికి తాత్కాలిక బ్రేక్ పడింది. ఆనంతో ఎప్పకైనా ఇబ్బందే అనే అభిప్రాయంతో మేయర్ అజీజ్ మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డితో స్నేహం ప్రారంభించారు. కార్పొరేషన్ పరిధిలోని రూరల్నియోజక వర్గంలో ఆదాలకు మేయర్, సిటీ నియోజక వర్గంలో మేయర్‌కు ఆదాల సహరించుకునేలా రాజీ ఒప్పందానికి వచ్చారు. ఈ విషయం తెలిసుకున్న ఆనం సోదరులు అటు ఆదాల, ఇటు అజీజ్‌కు ఒకే సారి చెక్ పెట్టడానికి సమయం కోసం ఎదురు చూస్తూ వచ్చారు. రూ 42 కోట్ల పనులతో ఆధిపత్యం కార్పొరేషన్ పరిధిలో 8 ప్యాకేజీల కింద రూ 42 . 21 కోట్లతో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల కింద చేపట్టే పనుల్లో పూర్తిగా తన ముద్రే ఉండాలని మేయర్ అజీజ్ వ్యూహరచన చేశారు. కాల్వలు, సిమెంటు రోడ్లు, తారు రోడ్ల పనులు మొత్తం తాను చెప్పిన వారికే దక్కేలా టెండరు నిబంధనలు తయారు చేయించారనే ప్రచారం జరుగుతోంది. పంచాయతీరాజ్, ఆర్ అండ్బి శాఖలు పెట్టే టెండర్ నిబంధనలను తొలిసారి కార్పొరేషన్ పనుల్లో అమలు చేసి ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా రాజకీయం నడిపారు. ఈ పనులకు ఇటీవలే టెండర్లు పిలిచారు. ఈ నెల 13వ తేదీతో టెండర్ల దాఖలు గడువు ముగియనుంది. సమయం కోసం ఎదురు చూస్తున్న ఆనం సోదరులు తమ మద్దతు దారులైన పెద్ద కాంట్రాక్టర్లను రంగంలోకి దించారు. మేయర్ ప్రతి పనికీ తక్కువతో టెండర్లు దాఖలు కాకుండా ఏర్పాటు చేయించుకున్నందున ప్రతి పనికీ 10 శాతం తక్కువతో టెండర్లు దాఖలు చేయాలని తమ కాంట్రాక్టర్లకు సూచించారు. ఇప్పటికే టెండర్లు దాఖలు చేసిన సుమారు 10 మంది కాంట్రాక్టర్లతో ఆనం సోదరులు నేరుగా మాట్లాడారని సమాచారం. తాము చెప్పిన వారికే పనులు ఇవ్వాలని కాంట్రాక్టర్లకు గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఒక వైపు తమ మద్దతు దారులైన కాంట్రాక్టర్లను రంగంలోకి దించి తక్కువతో టెండర్లు దాఖలు చేయించడం, ఇప్పటికే టెండర్లు దాఖలు చేసిన వారిని తమ దారిలోకి తెచ్చుకుని అజీజ్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు. ఇక పోతే రూరల్ నియోజక వర్గ పనులకు సంబంధించి కూడా కాంట్రాక్టర్లతోనేరుగా మాట్లాడి పనులు తమ చేతుల్లోకి తెచ్చుకుంటే ఆదాల ఆధిపత్యానికి కూడా చెక్ పెట్టే వ్యూహం అమలు చేశారు. తమ నియోజక వర్గంలో చేయబోతున్న పనులకు సంబంధించి ఆనం సోదరులు కాంట్రాక్టర్లతో మాట్లాడటం పట్ల ఆదాల ఆగ్రహంతో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో చేపట్టబోయే పనులు అగ్రవర్ణనేతల మధ్య రాజకీయ పో రాటానికి అస్త్రాలుగా మారడంపై అటు అధికార వర్గాలు, ఇటు టీడీపీ వర్గాల్లో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. -
కార్యాచరణ ప్రాంతాల అభివృద్ధికి కృషి
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) : ఓఎన్జీసీ కృష్ణా–గోదావరి బేసిన్ కార్యాచరణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆ బేసిన్ హెడ్ ఫార్వర్డ్‌బేస్ జనరల్ మేనేజర్ ఏవీవీఎస్ కామరాజు స్పష్టం చేశారు. బేసిన్ మేనేజర్ మేనేజర్ డాక్టర్ పి.చంద్రశేఖరన్ నేతృత్వంలో సామాజికాభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లోని 46 పాఠశాలల్లో మౌలిక వసతులు, ఆర్వో ప్లాంట్ల స్థాపనకు రూ.60 లక్షల చెక్కులను శుక్రవారం బేస్ కాంప్లెక్స్‌లో ప్రధానోపాధ్యాయులకు ఆయన అందించారు. కామరాజు మాట్లాడుతూ నిర్వహణపరమైన సవాళ్లను ఆధునిక సాంకేతికతో ఎదుర్కొంటూ, భద్రతలో రాజీపడకుండా పనిచేస్తున్నామన్నారు. -
గ్యాస్ ‘గమనించండి’
► సిలిండర్ సీల్‌ను తనిఖీ చేయండి ► బరువుందా తెలుసుకునేందుకు తూకం వేయించండి ► అనుమానం ఉంటే ఫిర్యాదు చేయండి కొవ్వూరునగర్‌లో నివాసముంటున్న వెంకటేశ్ ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరి చేసేందుకు బాయ్స్ తీసుకొచ్చారు. దానికి సీల్ లేదు. సీల్ ఎందుకు తొలగించారని బాయ్స్‌ను అడిగితే, వాచర్ లికేజీ ఉందేమోనని చెక్ చేసేందుకు సీల్ తొలగించామని చెప్పి సిలిండర్ ఇచ్చి వెళ్లారు. తీరా చూస్తే సిలిండర్ నిర్ణీత బరువు లేదు. స్పింగ్ త్రాసు బాయ్స్ వెంట తెచ్చుకోకపోవడంతో తూకం వేయించుకోలేక పోయాడు. అనంతపురం అర్బన్ : వంట గ్యాస్ సిలిండర్లకు కంపెనీ వేసిన సీలు ఉందా లేదా..? గ్యాస్ నిర్ణీత బరువు ఉందా లేదా...? అనేది వినియోగదారులు గమనించాలి. ఇటీవల కొందరు డెలివరీ బాయ్స్ సిలిండర్లు సీల్ తొలగించి సరఫరా చేస్తున్నారు. ఈ విషయంలో డెలివరీ బాయ్స్ చేతి వాటం ప్రదర్శిస్తూ సిలిండర్ నుంచి గ్యాస్ తస్కరించే అవకాÔ¶ ం లేకపోలేదు. ప్రధానంగా విద్యావంతులు కాని వారికి ఇలాంటి సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. సీల్ ఉందా లేదో చూసుకోండి గ్యాస్ సిలిండర్ నాబ్‌కు సదరు కంపెనీ సీల్ వేసి పంపుతుంది. అలా సీల్ వేసినవే తీసుకోవాలి. సీల్‌ని ఒకసారి చూడండి. అది ఊడిపోయినట్లు ఉంటే తీసుకోవద్దు. దానికున్న సీల్ తొలగించడం నేరం. అలా డెలివరీ బాయ్స్ తొలగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం అధికారులకు ఉంది. కాబట్టి ఎవరైనా సీల్ తొలగించి సిలిండర్ సరఫరా చేసినట్లయితే తక్షణం అధికారులు ఫిర్యాదు చేయండి. స్రింగ్ త్రాసు తప్పని సరి వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్ వెంట తప్పని సరిగా స్పింగ్ త్రాసు ఉండాలనేది నిబంధన. గహ అవసర సిలిండర్‌లో నికరంగా గ్యాస్ 14.200 కేజీలు, సిలిండర్ బరువు 15.300 కేజీలు మొత్తం 29.500 కేజీలు ఉండాలి. డెలివరీ బాయ్స్ తమ వెంట తెచ్చుకున్న స్రింగ్ త్రాసు ద్వారా తూకం వేసి వినియోగదారునికి దాని బరువును చూపించి ఇవ్వాల్సి ఉంది. మీరు అందజేసిన సిలిండర్ బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వస్తే తక్షణం తూకం వేయించండి. స్ప్రింగ్ త్రాసు లేదని చెబితే ఆ విషయాన్ని అధికారుల దష్టికి తీసుకెళ్లండి. లీకేజి చెక్ చేయించుకోవాలి సిలిండర్‌కు రెగ్యులేటర్ అమర్చే నాబ్లోని వాచర్ కొన్ని సందర్భాల్లో పాడై ఉంటుంది. అలాంటి వాటికి రెగ్యులేటర్ బిగించిన వెంటనే గ్యాస్ లికవుతుంది. సిలిండర్ తీసుకున్న వెంటనే స్వయంగా సీల్ తీసేసి వాచర్ చెక్ చేయించుకోవాలి. గ్యాస్ లికవుతున్నట్లు గుర్తిస్తే తక్షణం వాచర్ వేయించుకోవాలి. ఫిర్యాదు చేయండి కంపెనీ వేసిన సీల్ లేకుండా గ్యాస్ సిలిండర్ సరఫరా చేసినప్పుడు. లేదా తూకం వేసేందుకు డెలివరీ బాయ్స్ నిరాకరించినప్పుడు వెంటనే మీరు జిల్లా పౌర సరఫరాల అధికారి ఫోన్ 8008301418 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. సీల్ తీసి డెలివరీ చేస్తే చర్యలు గ్యాస్ సిలిండర్‌కుS కంపెనీ వేసే సీల్తోనే డెలివరీ చేయాలి. అలా చేయలేదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డెలివరీ బాయ్స్ తప్పని సరిగా తమ వెంట స్పింగ్ త్రాసు ఉంచుకోవాలి. సిలిండర్ డెలివరీ చేసేప్పుడు తూకం వేసి వినియోగదారునికి అందజేయాలి. – ప్రభాకర్‌రావు, డీఎస్ఓ -
బీబీనగర్‌లో సేల్స్‌టాక్స్ అధికారుల తనిఖీలు
బీబీనగర్: మండల కేంద్రంలోని పూసల గోదాములో శనివారం భువనగిరికి చెందిన సేల్స్‌టాక్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పన్ను చెల్లించకుండా ఓç ³రిశ్రమ నుంచి అక్రమంగా ముడి సరుకును తీసుకువచ్చి గోదాములో ఉంచి రవాణా చేస్తున్నారని సమాచారం అందింది. దీంతో అధికారులు గోదాముకు చేరుకొని రెండు గంటలకు పైగా తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లోని రికార్డుల్లో నమోదు చేయకుండా, పన్ను చెల్లించకుండా గోదాముల్లో నిల్వ ఉంచిన అయిల్ తయారీకి ఉపయోగించే 3వేల టన్నుల డీ అయిల్డ్ కిక్ బస్తాలు, 630టన్నుల సన్ప్లై పౌడర్ బస్తాలు, 6లక్షల ఖాళీ గన్నీ బ్యాగులను గుర్తించినట్లు ఏఎస్టీఓ విజయ్‌కుమార్ తెలిపారు. దీంతో స్టాక్ వేసి ఉన్న 3బ్లాక్‌ల గోదాములను సీజ్ చేశామని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అంత వరకు సరుకును తరలించకూడదని సంబంధిత వ్యక్తికి సూచించి గోదాం ఇన్‌చార్జీగా ఉన్న నగేష్‌కు నోటీస్ అందజేశారు. యజమానిపై చర్య తీసుకోవాలి మండలంలోని కొండమడుగు గ్రామ పరిధిలో గల ఆనంద్ సాల్వెక్స్ పరిశ్రమ నుంచి ముడి సరుకును కొనుగోలు చేసి పన్ను చెల్లించకుండా తప్పుడు బిల్లులతో సరుకును తరలించే యత్నం చేస్తున్న సంబంధిత యాజమానిపై చర్యలు తీసుకోవాలని ఆనంద్ సాల్వెక్స్ పరిశ్రమ బాధిత కార్మికులు డిమాండ్ చేశారు. ఆనంద్ సాల్వెక్స్లో పని చేసిన తమకు వేతనాలను చెల్లించకుండా యాజమాన్యం పరిశ్రమను మూసి వేసి ఇతర వ్యక్తులకు ప్రొడక్షన్‌ను విక్రయించిదని, దీంతో వారు పన్ను చెల్లించకుండా స్టాక్‌ను తరలించే యత్నం చేస్తున్నారని అధికారులకు విన్నవించారు. -
25 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
మైదుకూరు టౌన్: మైదుకూరు మండలం వనిపెంట ఫారెస్ట్ పరిధిలోని కండ్రగుండలు సమీపంలో ఆదివారం రాత్రి వనిపెంట రేంజ్ అధికారి స్వామివివేకానంద దాడులు నిర్వహించి 25 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని ఒకరిని అరెస్ట్ చేశారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి స్వామి వివేకానంద తెలిపిన వివరాల మేరకు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నరికి ట్రాక్టర్లో తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలసి తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీలో ట్రాక్టర్‌తో పాటు 25 దుంగలను స్వాధీనం చేసుకొని ట్రాక్టర్ డ్రైవర్ బండి కిషోర్‌ను అరెస్ట్ చేశామన్నారు. మరికొంతమంది నిందితులు పరారైనట్లు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. -
చెల్లని చెక్కు కేసుల్లో నిందితుడికి జైలు
విజయవాడ లీగల్ : చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నిందితుడికి ఆరు నెలల జైలు, రూ.రూ.2,60, 000 జరిమానా విధిస్తూ ఒకటవ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శనివారం తీర్పు చెప్పారు. నగరంలోని రామలిం గేశ్వరనగర్కు చెందిన ఓ వ్యక్తి వద్ద అదే ప్రాంతానికి చెందిన గుర్రాల శ్రీనివాసరెడ్డి 2013, డిసెంబర్ ఒకటో తేదీన రూ.2,50,000 అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చే క్రమం లో శ్రీనివాసరెడ్డి 2014, మే 8వ తేదీన రూ. 2.50లక్షలకు చెక్కు ఇచ్చాడు. అయితే అతని బ్యాంక్ ఖాతాలో నగదు లేకపోవడంతో ఆ చెక్కు చెల్లలేదు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి తన న్యాయవాది ద్వారా కోర్టులో కేసు దాఖలు చేశారు. కోర్టు విచారణలో శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. మరో కేసులోనూ శ్రీనివాసరెడ్డికి శిక్ష మరొకరికి కూడా చెల్లని చెక్కు వచ్చిన కేసులో గుర్రాల శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువుకావడం తో ఆరు నెలలు జైలుశిక్షతోపాటు రూ.2,30, 000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. సూర్యారావుపేటకు చెందిన బి.రాజు వద్ద శ్రీనివాసరెడ్డి 2013, మే 5న రూ.2.50లక్షలు అప్పు తీసుకున్నాడు. అతనికి కూడా చెల్లని చెక్కు ఇచ్చాడు. రాజు కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశాడు. శ్రీనివాసరెడ్డిపై నేరం రుజువైంది. న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. -
పాత కేసులను పరిష్కరించాలి
రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ నౌషద్ అలీ కర్నూలు(లీగల్): పాత కేసులను పరిష్కరించి కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు జస్టీస్ నౌషద్ అలీ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా వినియోగదారుల ఫోరంను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల వివరాలు, వాటి పెండింగ్ కాల పరిమితిని అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో జిల్లా వినియోగదారుల ఫోరం ఇన్చార్జి అధ్యక్షురాలు ఎస్.నజీరున్నిసా పాల్గొన్నారు. కర్నూలులో రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఏర్పాటు చేయాలని జిల్లాలోని వినియోగదారుల సంఘాల నాయకులు, కక్షిదారులు ఆయన విజ్ఞానపత్రం ఇచ్చారు. -
గోదాం నిర్మాణానికి స్థల పరిశీలన
పాన్‌గల్ : మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయం సమీపంలో మార్కెట్ గోదాం నిర్మాణం చేపట్టేందుకు శనివారం మార్కెంటింగ్ శాఖ ఈఈ రామారావు, ఏఈ శ్రీనివాసులు స్థలాన్ని పరిశీలించారు. రూ.3కోట్లతో గోదాం నిర్మాణం చేపట్టనున్నామని, ఇందుకుగాను స్థలాన్ని ఎంపిక చేస్తున్నట్లు వారు తెలిపారు. గుట్ట మాదిరిగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మట్టిని తొలగించి చదును చేసిన తర్వాత పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వారి వెంట కాంట్రాక్టర్ తిరుపతయ్యసాగర్ ఉన్నారు. -
బైనామాల చెక్‌మెమోలు అప్లోడ్ చేయాలి
వీసీలో జేసీ దివ్య ఖమ్మం జెడ్పీసెంటర్ : సాదాబైనామాలకు సంబంధించి ఫీల్డ్ చెక్ మెమోలు వారం రోజుల్లో ఆప్‌లోడ్ చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డి.దివ్య తహసీల్దార్లను ఆదేశించారు. మంగళవారం సాదాబైనామాల ప్రగతి, కల్యాణలక్ష్మి, భూదాన్ల్యాండ్ల ప్రగతిపై తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సాదాబైనామాల కింద వచ్చిన దరఖాస్తుల పరిశీలన, తిరస్కరణ, చెక్ మెమోల ఆన్లైన్ నోటిసుల జారీని వేగవంతం చేయాలని చెప్పారు. గ్రామాలకు వెళ్లి సాదాబైనామాల కింద అందిన దరఖాస్తులను పరిశీలించాలని కోరారు. చెక్ మెమోలను ఆన్లైన్ చేయడంలో అలసత్వం వద్దని, నోటీస్ జనరేట్ చేసిన అనంతరం చెక్‌మెమోను ఆన్లైన్ చేయాలని సూచించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయానికి పంపిన భూముల మ్యుటేషన్లో వారం రోజుల్లోపు ప్రగతి కనబరచాలని ఆదేశించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వెళ్తున్న నిత్యావసర వస్తువులను రేషన్‌దారులు విక్రయిస్తే వారిపై 17బీ, డీలు, అట్టి వస్తువులు కొనుగోలు చేసిన వారిపై 17ఈ, 6ఏ కేసులను బుక్ చేసి, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీపం పథకం నిర్దేశిత లక్ష్యాలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు అక్టోబర్ నుంచి మొదలవుతుందని, రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. వీసీలో ఏజేసీ శివశ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఎయిర్ టెల్ మరో భారీ తగ్గింపు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 4 జీ సేవల ఆవిష్కరణతో ప్రముఖ టెలికాం కంపెనీల గుండెల్లో గుబులు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ టెల్, ఐడియాతోపాటూ, వోడాఫోన్ డేటా చార్జీలను తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే అనేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకనే ప్రయత్నం చేస్తున్న భారతి ఎయిర్ టెల్ తాజాగా మరో భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 4 జీ సేవల ధరను భారీగా తగ్గించేసింది. ఈ స్పెషల్ స్కీం కింద ధరలను 80 శాతం తగ్గించింది. కేవలం రూ.51 కే జీబీ 3జీ లేదా 4జీ డేటా ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికి ఢిల్లీలో ఉన్న ఈ ఆఫర్ ఈనెల (ఆగస్లు) 31 కల్లా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుందనీ, భారతీ ఎయిర్టెల్ డైరెక్టర్ ఆపరేషన్స్ (భారతదేశం మరియు దక్షిణ ఆసియా), అజయ్ పూరి చెప్పారు అయితే దీనికోసం వినియోగారులు ముందుగా రూ.1498 రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా 1 జీబీ 3 జీ లేదా 4జీ డేటా 28 రోజుల వరకు ఉచితంగా వస్తుంది. ఆ తర్వాత రూ. 51కే ఒక జీబీ 3జీ లేదా 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ 12 నెలల వరకు వర్తించనుంది. ఈ కాలంలో ఎన్నిసార్లయినా రూ.51కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. అంతేకాదు రూ.748 రీచార్జ్ చేసుకుంటే ఆరు నెలల వరకు ఎన్నిసార్లయినా రూ.99 కే ఒక జీబీ 4జీ డేటా రీచార్జ్ చేసుకోవచ్చంటూ మరో ఆఫర్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం 28 రోజుల వాలిడిటీతో రూ.259కి ఒక జీబీ 4జీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. -
సీసీ కెమెరాలతో చోరీలకు చెక్
విజయవాడ : జనసమూహం అధికంగా ఉన్న ప్రాంతాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను ఎంచుకుని చోరీలకు పాల్పడే ఘరానా దొంగలు కృష్ణా పుష్కరాలకు వచ్చారు. అయితే ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడి అధికారులు వారికి చెక్ పెట్టారు. ఇందుకు అధికారులకు సీసీ కెమెరాలు చక్కగా ఉపయోగపడ్డాయి. ఎంతోమంది అంతర్రాష్ట్ర దొంగలు, నేరస్తులను అవి పట్టిచ్చాయి. వారి వద్ద ఉన్న ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు. సోమవారం సీసీఎస్ పోలీసులు 27మంది అంతరాష్ట్ర నేరస్తులను పలు కేసుల్లో అరెస్టు చేశారు. చోరీల వివరాలు.. ∙ఒడిశా రాష్ట్రంలో భువనేశ్వర్‌కు చెందిన నిందితులు వసంత, మంజుల, మరేశ్వరి, తారా, గాంధీ వీరందరు ఒక ముఠాగా ఏర్పడి ఈనెల 12న పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఒక మహిళ మెడలో నాంతాడును, 14న అదే ప్రదేశంలో వేరొక మహిళ మెడలో చైనును కట్టర్ సహాయంతో కత్తిరించారు. ∙ఒడిశా రాష్ట్రం బాలేశ్వరానికి చెందిన మీనాక్షి దాస్, దుర్గా దాస్, రాధికా దాస్, సంగీతా దాస్‌లు ముఠాగా ఏర్పడి ఈనెల 15న కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ మెడలో బంగారం చైను కట్టర్ సహాయంతో అపహరించారు. ఇదే ముఠా 17 న పద్మావతి ఘాట్‌లో ఏమరుపాటుగా ఉన్న మహిళ చేతి సంచి లాక్కుని అందులో ఉన్న బంగారం నాంతాడును అపహరించారు. ∙ఒడిస్సా రాష్ట్రం బాలేశ్వరానికి చెందిన ప్రియ దాస్, పార్వతీ దీస్, గాయత్రీ దాస్, గోవింద్ దాస్‌లు వేరొక ముఠాగా ఏర్పడి ఈనెల 13న పద్మావతి ఘాట్‌లో ఒక దొంగతనం, 18 న బస్టాండ్ వద్ద ఒక బ్యాగును దొంగిలించారు. అలాగే 19 న బస్టాండ్ సమీపంలో ఒక మహిళ మెడలో గొలుసును కట్‌చేశారు. ∙ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సవీద్ అక్తర్, షాబద్జీలు ఈనెల 15 న పద్మావతి ఘాట్‌లో ఒక వ్యక్తి బట్టలు విప్పి స్నానానికి వెళ్ళగా బట్టలను అపహరించుకుపోయారు. ∙తెలంగాణా రాష్ట్రం హైదారబాద్‌కు చెందిన ముట్టాబత్తి పుష్ప, పూజ ఈ నెల 14 న కృష్ణవేణి ఘాట్‌లో ఓ యాత్రికుని సెల్‌ఫోన్, రూ.15వేల నగదు అపహరించారు. 18 న బస్టాండ్ సమీపంలో ఒక మహిళ మెడలో గొలుసును కూడా వారు అపహరించారు. ∙మెదక్‌కు చెందిన ఐదాకుల వెంకటమ్మ, తెలుగు లక్ష్మి, గారడి వెంకటేష్ ఒక ముఠాగా ఏర్పడి 14 న పద్మావతి ఘాట్‌లో ఓ మహిళ నుంచి బంగారు ఆభరణాల సంచిని అపహరించారు. వారే 17న బస్టాండ్ వద్ద మరో మహిళ నుంచి సెల్‌ఫోన్, రూ.1000 నగదును చోరీ చేశారు. ∙వైజాVŠ కు చెందిన ఎండీ బాబ్జీ, మానుపాటి శివ, బాలంకి శ్రీను 13న కృష్ణవేణి ఘాట్‌లో, 14న పద్మావతి ఘాట్‌లో, 16న ఒన్‌టౌన్ రాజస్థాన్ స్కూలు సమీపంలో మూడు దొంగతనాలకు పాల్పడి మనీపర్సు, బ్యాగులు అపహరించారు. అదే విదంగా విజయవాడకు చెందిన కూరగంటి హోసన్న, దారుకోటయ్య, వైజాగ్‌కు చెందిన కట్టుమూరి అప్పారావు వేరొక బ్యాచ్‌గా ఏర్పడి 17, 18, 19 మూడు దొంగతనాల్లో మనీపర్సులు, బ్యాగులు అపహరించారు. -
దొంగలకు బ్రేక్
పుష్కరాల్లో తగ్గిన చోరుల బెడద సీపీ సవాంగ్ పక్కా వ్యూహం సీసీ కెమెరాలు, నిఘాతో క్రిమినల్స్‌కు చెక్ విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో క్రిమినల్ గ్యాంగులపై పోలీసులు పంజా విసిరారు. పోలీసు కమిషనర్ డి.గౌతం సవాంగ్ నాయకత్వంలో పోలీసుల దాడులకు ప్రముఖ క్రిమినల్గ్యాంగులు హ్యాండ్సప్ అనక తప్పలేదు. వివరాల్లోకి వెళ్తే వేలాది మంది హాజరయ్యే పుష్కరాల్లో దోపిడీల పర్వానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో 12 రాష్ట్రాల నుంచి 20కిపైగా దొంగల ముఠాలు విజయవాడపైకి దండెత్తాయి. పుష్కరాల ప్రారంభం నుంచే సిటీలోని ఘాట్లు, రద్దీ ప్రదేశాల్లో సంచరిస్తూ భక్తుల సొమ్మును దోచుకోవడంతో కలకలం రేగింది. సవాల్‌గా తీసుకున్న సీపీ సవాంగ్ పక్కా ప్రణాళికతో క్రిమినల్స్‌కు చెక్ పెట్టారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా సీసీ కెమెరాల వ్యవస్థతో పోలీసుల పని సులువైంది. కెమెరాల ద్వారా కదలికలను పసిగడుతూ గత 9రోజుల్లో నగరంలో సీసీఎస్ బలగాలు వివిద రాష్ట్రాలకు చెందిన 115 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 49 మంది మహిళలు ఉన్నారు. తమిళనాడు 2, , ఢిల్లీకి చెందిన 1, తెలంగాణ 2 రాష్ట్రానికి చెందిన 3, , ఒడిశా 3, పశ్చిమ బెంగాల్ నుంచి 4, ఉత్తరప్రదేశ్ నుంచి 1, మహారాష్ట్ర నుంచి 3, మధ్యప్రదేశ్ నుంచి 1 గ్యాంగు పట్టుబడ్డాయి. వీరిలో కొందరు నేరం చేస్తూ దొరికిపోగా,మరికొందరు అనుమానాస్పదంగా తిరుగుతూ పట్టుబడ్డారు. వీరందరూ ఆయా రాష్ట్రాల్లో క్రిమినల్స్‌గా గుర్తింపు ఉన్నట్లు సీపీ సవాంగ్ వివరించారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం 13 కేసులు పెట్టి 11 మంది అంతరాష్ట్ర నేరస్తులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో ఒకరు పూజారి వేషధారణలో ఉండగా, మరొకరు హోంగార్డు వేషంలో దొంగతనం చేయటానికి రావడం గమనార్హం. నగలు దోచుకునేందుకు ఉపయోగించే కట్టర్లను దొంగల వద్ద పోలీసులుస్వాధీనం చేసుకున్నారు. వందలాది మంది మఫ్టీ పోలీసులు దొంగల జాడకోసం నిరంతరం గాలిస్తూనే ఉన్నారు. దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడటం, రసాయనాలు జల్లి, మత్తుమందులు జల్లి చోరీలకు పాల్పడేందుకు వివిధ రాష్ట్రాల దొంగలు పుష్కరాలకు తరలి వచ్చారు. ముందస్తు వ్యూహంతో : సీపీ సవాంగ్ నేరాలు జరగకుండా పకడ్బందీ వ్యూహంతో దొంగతనాలను కట్టడి చేయగలిగామని సీపీ గౌతం సవాంగ్ ‘సాక్షి’కి చెప్పారు. రైల్వేస్టేషన్ బస్టాండ్, స్నానఘట్టాల వద్ద ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన సీసీ పుటేజీల ఆధారంగా క్రిమినల్స్‌ను ముందస్తుగా అదుపులోకి తీసకున్నామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 49 కేసుల్లో రు. 16 లక్షల విలువైన సొత్తు చోరీ అయిందని తెలిపారు. కాగా పోలీసులు రెండు దఫాలుగా 19 మంది నేరగాళ్లను అరెస్టు చేసి రూ. 8.80 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. దొరికిన గ్యాంగులను పూర్తి స్థాయిలో విచారించి వారు నేరాలకు పాల్పడితే కేసులు పెడతామన్నారు. -
నేడు భద్రాద్రిలో ‘పర్యావరణ’ తనిఖీలు
నెలాఖరులోగా తేలనున్న థర్మల్ విద్యుత్ కేంద్రం భవితవ్యం తనిఖీ నివేదిక ఆధారంగా పర్యావరణ అనుమతులపై నిర్ణయం 29, 30వ తేదీల్లో సమావేశం కానున్న నిపుణుల సాధికారిక కమిటీ ఇప్పటికే ప్రాజెక్టుపై రూ.800 కోట్లను వెచ్చించిన జెన్కో హైదరాబాద్: రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) ఖమ్మం జిల్లా మణుగూరులో నిర్మిస్తున్న 1,080 (4X270) మెగావాట్ల భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ గురువారం తనిఖీ చేయనుంది. ఈ తనిఖీల్లో నిర్ధారించే అంశాల ఆధారంగానే ఈ ప్రాజెక్టు భవితవ్యంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఈ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల జారీ కోసం జెన్కో పెట్టుకున్న అభ్యర్థనపై పరిశీలన జరపాలా, వద్దా? అనే అంశంపై 8 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) గత జూలై 11న ఆదేశించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 11తో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో... తనిఖీలు జరుగనున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల సాధికారిక కమిటీ ఈ నెల 29, 30వ తేదీల్లో ఢిల్లీలో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. తనిఖీలు ఎందుకు? ఏవైనా ప్రాజెక్టులు చేపట్టినపుడు.. ఎలాంటి నిర్మాణ పనులు ప్రారంభించక ముందే ఆ స్థలంలో పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేసి కేంద్ర పర్యావరణ శాఖకు నివేదిక సమర్పించాలి. ఆ నివేదిక ఆధారంగా పర్యావరణ అనుమతులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఈ అధ్యయానికి ముందే భద్రాద్రి ప్రాజెక్టు నిర్మాణ పనులను జెన్కో చేపట్టడంతో ప్రాజెక్టు స్థలంలో మార్పులు జరుగుతున్నాయి. దీంతో పర్యావరణ ప్రభావంపై సరైన అధ్యయనం సాధ్యమా? అన్న అంశంపై పరిశీలన జరపాలని ఎన్జీటీ ఆదేశించింది. ఈ మేరకు ప్రొఫెసర్ సీఆర్ బాబు నేతృత్వంలో పర్యావరణ శాస్త్రవేత్తలతో కేంద్ర పర్యావరణ శాఖ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం గురు, శుక్రవారాల్లో ప్రాజెక్టుస్థలంలో తనిఖీలు జరిపి.. ఈ నెల 24లోగా కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రాజెక్టుకు అనుమతులపై కేంద్ర పర్యావరణ శాఖ నిర్ణయం తీసుకోనుంది. అయితే రూ.5,044 కోట్లతో చేపట్టిన భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని 2016లోగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఎన్జీటీ కేసు, పర్యావరణ అనుమతుల జారీలో జాప్యంతో గడువును మరో రెండేళ్లకు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే యంత్రాల కొనుగోళ్లు, ఇతర నిర్మాణ పనుల కోసం రూ.800 కోట్లను జెన్కో ఖర్చు చేసింది. ఒకవేళ పర్యావరణ అనుమతుల జారీపై పరిశీలన జరపవద్దని నిర్ణయిస్తే.. ప్రాజెక్టు నిర్మాణాన్ని విరమించుకునే పరిస్థితి ఉత్పన్నం కానుంది. -
నయీమ్‌కు చెక్ పెట్టేందుకు ‘సెటిల్మెంట్’ మార్గం
► నమ్మిన బంటుతోనే గ్యాంగ్‌స్టర్‌కు రాయబారం ► ‘ఓ డీల్ ఉంది.. చేద్దాం’ అంటూ పక్కా స్కెచ్ ► నయీమ్ రాగానే ‘డీల్’ సెటిల్ చేసిన పోలీసులు ► అధికార పార్టీ నేతలకే నయీమ్ వరుస బెదిరింపులు ► అత్యున్నత రాజకీయ కుటుంబీకులనూ లెక్క చేయని వైనం ► కొన్నేళ్లుగా అతని వ్యవహారాలపై సర్కారు కన్ను ► ఎవరైతే నాకేంటంటూ నయీమ్ చెలరేగడమే చెక్ పెట్టేందుకు తక్షణ కారణం సాక్షి, హైదరాబాద్: నయీమ్ పోలీసు అధికారులతోనే తెరపైకి వచ్చాడు.. వారి తోడ్పాటుతోనే సెటిల్మెంట్లు, దందాలు నడిపాడు.. పోలీసులనే అడ్డుపెట్టుకుని ఎన్నో డీల్స్ చేశాడు.. ఆ రోజున కూడా ఓ డీల్ జరిగింది. నయీమ్‌తో సంబంధాలున్న డీఎస్పీ స్థాయి పోలీసు అధికారే ‘ఓ డీల్ ఉంది.. చేద్దాం’ అని నయీమ్‌ను పిలిచాడు. అలవాటుగానే నయీమ్ సిద్ధమయ్యాడు. ఉదయాన్నే కలుద్దాం రమ్మని ఓ ప్లేస్ చెప్పాడు. సరిగ్గా అనుకున్న సమయానికే కలిశారు.. డీల్ పూర్తయింది.. కానీ ఈసారి డీల్ పూర్తి చేసింది పోలీసులు. ఎన్నో వేల సెటిల్మెంట్లు చేసిన నయీమ్‌కు ఇదే ఆఖరి డీల్ అయింది. పోలీసులు పక్కాగా వేసిన స్కెచ్‌లో ఇరుక్కున్న నయీమ్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. పోలీసుల ‘సహకారం’తో ఎంతో కాలంగా చిక్కకుండానే దర్జాగా తిరుగుతున్న నయీమ్ కథ ఒక్కసారిగా ముగిసిపోవడానికి కారణం... అత్యున్నత రాజకీయ కుటుంబీకులనూ లెక్కచేయకపోవడమేనని సమాచారం. కొన్నేళ్లుగా నయీమ్ ఎంతో మంది ప్రజాప్రతినిధులపైనే నేరుగా బెదిరింపులకు, వసూళ్లకు దిగాడు. తన మాట వినకపోతే ఖతం చేస్తాననీ హెచ్చరించాడు. ఇటీవల అధికార పార్టీ ప్రజాప్రతినిధులనూ టార్గెట్ చేయడంతో నయీమ్ చర్యలకు ఫుల్స్టాప్ పెట్టడంపై సర్కారు దృష్టి పడింది. తాజాగా తాను డబ్బు డిమాండ్ చేసిన వ్యక్తులు తాము అత్యున్నత రాజకీయ కుటుంబీకులకు దగ్గరి వారమని చెప్పినా.. ‘ఎవరైతే నాకేంటి..? నాకు కట్టాల్సిందే’నని నయీమ్ బెదిరించడం సర్కారు నిర్ణయం అమల్లోకి రావడానికి ‘ఆఖరు డీల్’గా మారింది.. విచ్చలవిడిగా బెదిరింపులు దాదాపు పదేళ్లకుపైగా నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చిన నయీం సెటిల్మెంట్లు, రియల్ దందాలు, బెదిరింపులు తెలంగాణ రాష్ట్రం వచ్చాక పెచ్చుమీరాయి. ఒక దశలో ప్రభుత్వానికి సైతం కొరకరాని కొయ్యగా మారాడు. చివరికి రాష్ట్రంలో అత్యున్నత రాజకీయ కుటుంబీకుల పేర్లు చెప్పినా లెక్కచేయని స్థాయికి తెగించాడు. రెండేళ్ల కింద నయీమ్ గ్యాంగ్ చేతిలో హతమైన టీఆర్ఎస్ నేత కోనపురి రాములు కూడా.. హత్యకు ముందు తనకు ప్రాణభయముందని మంత్రులు, ఎమ్మెల్యేలతో కలసి వెళ్లి పలుమార్లు ముఖ్యమంత్రికి గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. రాములు హత్య తర్వాత నల్లగొండ జిల్లాలో కొందరు నేతలకు నయీమ్ అంటే భయం పెరిగింది. తర్వాత ఎమ్మెల్యేలు రామలింగారెడ్డిని, శేఖర్‌రెడ్డిని చంపుతామని నయీమ్ బెదిరించిన విషయాన్ని పార్టీ నాయకులు సందర్భం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ‘అప్రమత్తంగా ఉండండి.. అవసరమైతే కొంతకాలం ఎటైనా వెళ్లండి..’ అంటూ అధికార పార్టీ ముఖ్యులు సర్దిచెప్పినట్లు తెలిసింది. అయినా అధికార పార్టీ నేతలకే బెదిరింపులు రావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అన్నం ఎలా తింటావో చూస్తా! ‘నయీమ్ ఆగడాలు అన్నీ ఇన్నీ కాదు. బయట తిరగలేకపోతున్నాం.. మమ్మల్ని సైతం బెదిరిస్తున్నాడు.. కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంటే వాడికి లెక్క లేదు..’ అని ఉత్తర తెలంగాణకు చెందిన ఒక మంత్రి తెలంగాణ ఏర్పాటైన కొత్తలోనే స్వయంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచే నయీమ్ ఆగడాలపై పోలీసు యంత్రాంగం ఓ కన్నేసి ఉంచింది. ఇక హైదరాబాద్ పరిసరాల్లోని అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీని రూ.25 కోట్లు ఇవ్వాల్సిందిగా నయీమ్ డిమాండ్ చేశాడు. ‘ఇవ్వకపోతే నువ్వు అన్నం ఎలా తింటావో చూస్తా..’ అని బెదిరించాడు. రాష్ట్రంలో ఉన్నత స్థాయి రాజకీయ సంబంధాలున్న మరో పారిశ్రామికవేత్తను రూ.75 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ రెండు ఘటనలు కూడా అధికార పార్టీ నేతల్లో వణుకు పుట్టించాయి. ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రముఖ రాజకీయ నేతలనూ నయీమ్ లెక్కచేయలేదు. ఇలా గత రెండేళ్లలో పదుల సంఖ్యలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నయీమ్ బాధితుల జాబితాలో చేరిపోయారు. నయీమ్ ఆగడాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎవరైతే నాకేంటి? ఇటీవల నిజామాబాద్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీ సభ్యుడిని నయీమ్ ముఠా డబ్బులు డిమాండ్ చేసింది. అదే సమయంలో యాదగిరిగుట్ట ప్రాంతంలో ఓ రియల్టర్‌ను టార్గెట్ చేసి, కోట్లాది రూపాయలు డిమాండ్ చేసింది. ఈ రెండు ఘటనల్లోనూ వారు డబ్బులు చెల్లించకుండా... అత్యున్నత రాజకీయ కుటుంబీకులు తమకు తెలుసని, తమ జోలికి రావద్దని నయీమ్ గ్యాంగ్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో తన హెచ్చరికలను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో స్వయంగా రంగంలోకి దిగిన నయీమ్... ‘ఎవరైతే నాకేంటి.. డబ్బులు కట్టాల్సిందే..’ అని ఫోన్లో బెదిరించినట్లు తెలిసింది. ఈ వ్యవహారం రియల్ వర్గాల్లో హల్చల్ కావడంతో ఏకంగా సీఎం దృష్టికి వెళ్లినట్లు ప్రచారంలో ఉంది. దీంతో నయీమ్‌కు ఫుల్స్టాప్ పెట్టాలని అత్యున్నత స్థాయి నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసు యంత్రాంగం హుటాహుటిన నయీమ్ వేటకు రంగం సిద్ధం చేసింది. పేరుకు అజ్ఞాతంలో ఉంటున్నా నయీమ్ రెండేళ్లుగా హైదరాబాద్‌లోనే నాలుగు వాహనాల కాన్వాయ్‌లో తిరుగుతూ దర్జాగా దందా సాగిస్తున్న తీరు పోలీసు యంత్రాంగానికి సవాలు విసిరింది. అతనికి సహకరిస్తున్న పోలీసులతోనే ఎర వేయించిన అధికారులు.. పథకం ప్రకారం నయీమ్‌ను ఖతం చేశారు. తమకు ఆదేశాలు అందిన 48 గంటల వ్యవధిలోనే ఈ ఆపరేషన్‌ను చక్కబెట్టారు. మరోవైపు నయీమ్ ఎన్కౌంటర్ జరిగిన రోజున అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఆనందంలో మునిగితేలడం గమనార్హం. ‘పీడ విరగడైంది. ఇప్పటికే ఆలస్యమైంది.. ప్రభుత్వం ఇంతకాలం వేచి ఉండాల్సింది కాదు..’ అని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వ్యాఖ్యానించారు. -
మోడల్ స్కూల్లో ఎమ్మెల్సీ తనిఖీ
గీసుకొండ : మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్‌ను ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల విద్యార్థుల కోసం హాస్టల్‌ను ప్రారంభించగా వంటకాలను పరిశీలించారు. స్వయంగా రుచి చూసి సరిగా లేవని, నాణ్యత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుచికరంగా పోషకాలు అందేలా వంటలు వండాలని ప్రిన్సిపాల్ మాధవిని ఆదేశించారు. అనంతరం అదే గ్రామంలో ఉన్న కస్తూరిబా పాఠశాలను సందర్శించి వసతులను పరిశీలించారు. -
కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
colleges, vigilence, check గోదావరిఖని కళాశాలలు, తనిఖీ, విజిలెన్స్ గోదావరిఖనిటౌన్ : పారిశ్రామిక ప్రాంతంలోని పలు ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలను విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీ చేశారు. మార్కండేయకాలనీలోని కృష్ణవేణి వికాస్, చైతన్య ఇతర కళాశాలలో తరగతి గదుల కొలతలు, కళాశాలలను నిర్వహించే హాజరు పట్టిక, స్కాలర్షిప్, ఇతర అంశాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి కళాశాల చెందినవిషయాలు తెలుసుకున్నారు. అసౌకర్యాలు లేకుండా విద్యార్థులకు అన్ని సేవలు అందే విధంగా చూడాలని కళాశాల నిర్వాహకులను కోరారు. కార్యక్రమంలో అధికారులు సత్యానారయణ, కళాశాల డైరెక్టర్ కుమార్, తిరుపతి, ప్రిన్సిపాల్ మాధవరావు తదితరులు పాల్గొన్నారు. -
రేపిస్టుల కాళ్లు, చేతులు నరికేయండి: ఠాక్రే
అహ్మద్ నగర్: మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై 'షరియా' (ఇస్లామిక్) వంటి కఠినచట్టాలను అమలు చేయాలని ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ ఠాక్రే అన్నారు. బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్, హత్య జరగడం నిజంగా ఆందోళనకరమన్నారు. మైనర్లు, మహిళలపై నేరాలకు పాల్పడేవారిని కాళ్లు, చేతులు నరికేయడమే సరైన పద్ధతంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది గ్రామంలో జూలై 13న జరిగిన దారుణ ఘటనపై ఎంఎన్ఎస్ ఛీఫ్ రాజ్ ఠాక్రే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాఛారం చేసి, ఆపై హత్యచేయడం రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయనడానికి నిదర్శనమన్నారు. అందుకే ఇటువంటి తీవ్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈ ఘటనతో గత కాంగ్రెస్ ప్రభుత్వంకంటే బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధ్వాన్న స్థితికి చేరినట్లు నిరూపించుకుందన్నారు. జిల్లా కేంద్రానికి సుమారు 76 కిలోమీటర్ల దూరంలోని కంర్ణత్ తాలూకా కోపర్ది గ్రామం సందర్శించిన రాజ్ ఠాక్రే.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, సంతాపం తెలిపారు. మహిళలు, పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టాలంటే ప్రస్తుత చట్టాలను అత్యవసరంగా మార్చాలని, తీవ్ర నేరాలకు పాల్పడేవారిని, సంఘవ్యతిరేక శక్తులను సమూలంగా నిర్మూలించేందుకు 'షరియా' వంటి కఠిన చట్టాలను అమల్లోకి తేవాలని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సహా అహ్మద్ నగర్ గార్డియన్ మినిస్టర్ రామ్ షిండే సైతం ఆదివారం కోపర్దిలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తమ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. నేరస్థులను ఎట్టిపరిస్థితిలో వదిలి పెట్టేది లేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నేరస్థులకు కఠినంగా శిక్షపడేట్లు చూస్తామని బాధితకుటుంబానికి భరోసా ఇచ్చారు. -
సువెన్ ‘పాశమైలారం’ యూనిట్లో ఎఫ్‌డీఏ తనిఖీ పూర్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫార్మా సంస్థ సువెన్ లైఫ్ సెన్సైస్‌కి చెందిన పాశమైలారం ప్లాంటులో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ తనిఖీ పూర్తయ్యింది. ఈ మేరకు ఎఫ్‌డీఏ నుంచి ప్లాంటు తనిఖీ నివేదిక (ఈఐఆర్) లభించినట్లు సంస్థ తెలిపింది. బల్క్ డ్రగ్స్, ఇంటర్మీడియేట్స్, ఫార్ములేషన్ల తయారీ, సరఫరాకు సంబంధించి పాశమైలారం ప్లాంటులో నాణ్యతా ప్రమాణాలను ఏప్రిల్ 4-14 మధ్య ఎఫ్‌డీఏ పరిశీలించింది. దీన్ని బట్టి తనిఖీ పూర్తయినట్లు ఈ నెల 15న రిపోర్టు ఇచ్చినట్లు సువెన్ పేర్కొంది. -
కల్తీ మద్యానికి చెక్..!
ప్రతి ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు కల్తీ పరీక్షించే కిట్లు.. –తనిఖీలు ముమ్మరం చేసిన అధికారులు మిర్యాలగూడ అర్బన్: రాష్ట్ర ఆదాయంలో సింహభాగం మద్యం అమ్మకాల వల్లే వస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయంపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా కల్తీలేని మద్యం అందించడంపై దృష్టి సారించింది. కొంత మంది మద్యం దుకాణాల నిర్వాహకులు కల్తీ చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తుండడంతో అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా జిల్లాలోని అన్ని ఎక్సైజ్ పోలీస్స్టేషన్లకు కల్తీని కనిపెట్టే కిట్లు సరఫరా చేసింది. దీంతో మద్యం కల్తీకి చెక్ పడే అవకాశం ఉంది. గతంలో ఎక్కడైనా మద్యంలో కల్తీ కనిపెట్టాలంటే బాటిల్ నుంచి సేకరించిన శాంపిల్‌ను హైదరాబాద్‌లోని సంబంధిత ల్యాబ్‌కు పంపి రిపోర్ట్ వచ్చిన తర్వాతే చర్యలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు అలా కాకుండా కిట్ల ద్వారా వెంటనే కల్తీని కనిపెట్టి సదరు మద్యం దుకాణాలపై చర్య తీసుకోవడానికి వీలుంటుంది. జిల్లా వ్యాప్తంగా 15 కిట్లు పంపిణీ.. కల్తీ మద్యం అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలోని 15ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు కల్తీ చెక్ చేసే కిట్లను పంపిణీ చేసింది. మద్యం కల్తీనే కాకుండా కల్లులో కల్తీని గుర్తించేందుకు సైతం కిట్ అదజేశారు. వీటిని ఉపయోగించేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. కల్తీ జరిగినట్లు తేలితే.. టెండర్లు దక్కించుకున్న బార్లు, వైన్స్ షాప్‌ల నిర్వాహకులు పెట్టిన పెట్టుబడిని అతి తక్కువ కాలంలో రాబట్టేందుకు మద్యాన్ని కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల బ్రాండెడ్ మద్యం సీసా మూతను సైతం చాకచక్యంగా తీసి అందులో చౌక మద్యం, నీరు పోసి కల్తీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తతంగం ఎక్కువగా బార్లు, రెస్టారెంట్లలో జరుగుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. కిట్ల ద్వారా పరీక్షించినప్పుడు మద్యం కల్తీ జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వస్తే షాంపిల్స్‌ను తిరిగి వరంగల్ కెమికల్ ల్యాబ్‌కు పంపిస్తారు. ఆ రిపోర్టులో కూడా కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే మెదటిసారి రూ.1.50వేల జరిమానాతో పాటు వారం రోజుల పాటు ఆ దుఖానాన్ని సీజ్ చేస్తారు. సదరు మద్యం షాప్‌లో రెండోసారి కూడా కల్తీ జరిగితే రూ.2లక్షల జరిమానా, నెలరోజుల పాటు షాప్ సీజ్ చేస్తారు. మూడో సారి నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు లైసెన్స్‌ను రద్దు చేస్తారు. వారం వారం తనిఖీలు.. గతంలో మద్యం కల్తీని పరీక్షించేందుకు పరికరాలు లేకపోవడం వల్ల నెల రోజులకు ఒకసారి వైన్స్, బార్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని ఎక్సైజ్ పోలీస్స్టేషన్లకు కల్తీ నిర్ధారణ కిట్లు అందించడంతో ప్రతి వారం తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం కల్తీ ఉన్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలి – బి.సుధాకర్, ఎక్సైజ్ సీఐ, మిర్యాలగూడ కల్లు, వైన్స్, బార్, రెస్టారెంట్లలో మద్యం కల్తీ జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కల్తీ మద్యం సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది. ప్రభుత్వం కల్తీ లేని మద్యం అందించాలనే ఉద్దేశంతో కిట్లను అందజేసింది. ప్రతి మద్యం దుఖానంపై నిఘా ఉంచుతున్నాం. -
డాటా ప్యాక్ లకు సవాల్ విసురుతున్న జియో?
97 రూపాయలకే 10జీబీ 4జీ డేటా అంటూ అటు మొబైల్ వినియోగదారులను తన వైపు తిప్పుకున్న రిలయన్స్ జియో సేవలు ..ఇటు టెలికాం దిగ్గజాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొబైల్ సంస్థలు ప్రకటిస్తున్న ఆఫర్లు మీద ఆఫర్లు దీనికి నిదర్శనం. ఎందుకంటే త్రీజీ టూజీ స్పీడ్, ఫోర్ జీ ... త్రీజీ స్పీడ్ పేరుతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై రేట్లు బాదేస్తున్న కంపెనీలు అకస్మాత్తుగా ఈ చర్యకు పూనుకున్నాయి.. వినియోగదారులనుంచి విపరీతంగా చార్జీలు గుంజుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ... సరికొత్త ఆఫర్ తో జియో సిమ్ లు రంగంలోకి వచ్చాయి . డాటా పాక్ లకు సవాలు విసురుతున్న ఈ సిమ్ ల హవా ఇప్పటికే వీటి ప్రారంభమైనా కమర్షియల్ గా ఈ ఆగస్టులోనే లాంచ్ అయ్యేందుకు రడీ అవుతోంది రిలయన్స్ జియో. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో నుంచి పోటీని తట్టుకోవడానికే మొబైల్ సంస్థలన్నీ ఆఫర్లు మీద ఆఫర్లుమీద ప్రకటిస్తున్నాయి. ప్రీపెయిడ్ వినియోగదారులకు 2జీ, 3జీ, 4జీ డేటా ప్యాక్‌లపై అదనపు డేటా ఇవ్వనున్నట్లు ఎయిర్టెల్, ఐడియా ప్రకటించేశాయి. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ 67శాతం , మరో ప్రముఖ మొబైల్ నెట్వర్క్ ఐడియా సైతం 45 శాతం అదనపు డేటాను అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు జూన్‌లో జీఎస్ఎం వినియోగదార్లు 35 లక్షల మంది జతచేరారని, వీరితో కలిపి మొత్తం కనెక్షన్ల సంఖ్య 77.69 కోట్లకు చేరినట్లు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (కోయ్) తెలిపింది. 6 సంస్థలకు ఈ సంస్థ ప్రాతినిథ్యం వహిస్తున్న కోయ్ తాజా జాబితాను విడుదల చేసింది. ఇందులో భారతీ ఎయిర్‌టెల్‌కు కొత్తగా సమకూరిన 14 లక్షల మందితో కలిసి మొత్తం కనెక్షన్ల సంఖ్య 25.57 కోట్లకు చేరినట్లు పేర్కొంది. ఐడియాకు 6.89 లక్షలు, వొడాఫోన్‌కు 7.02 లక్షలు, ఎయిర్‌సెల్‌కు 6.72 లక్షలు, టెలినార్‌కు 32,256 కనెక్షన్లు కొత్తగా జతచేరినట్టు ప్రకటించింది. అరకొర డాటా తో వినియోగదారుల నుంచి డబ్బులు పిండుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో జీయో సిమ్ లు సంచలనంగా మారాయి. దీనితోపాటుగా జియో నెట్ వర్క్ ఉపయోగించే సిడిఎమ్ వినియోగదారులకు మాత్రమే పరిమితమైన జియో సేవలు తాజాగా శాంసంగ్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి తెచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆయా కంపెనీలకు మరింత గుబులు మొదలైంది. మరి దిగ్గజ కంపెనీలకు సైతం సవాలు విసురుతున్న రిలయన్స్ జియో... వినియోగదారులను ఆకట్టుకుంటుందా? డాటా కష్టాలకు చెక్ పెడుతుందా? వేచి చూడాల్సిందే... -
నిబంధనలు ఉల్లంఘిస్తే తప్పదు జరిమానా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : మోటారు వాహనాలతో రోడ్డుపై వెళ్తున్నప్పుడు వాటిని తనిఖీ కోసం ఆపే అధికారం రవాణా శాఖ అధికారులకు, ట్రాఫిక్ పోలీసులకు ఉంటుంది. ఆ సమయంలో ఆ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలూ సక్రమంగా ఉండి, వాహన చోదకుడు కూడా సరైన స్థితిలో ఉంటే ఎటువంటి జరిమానా చెల్లించనక్కరలేకుండా హాయిగా వెళ్లవచ్చు. ఒకవేళ వాహనంలో అవసరమైన పత్రాలు లేకపోతే మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆర్టీవో, ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే కొన్నిసార్లు తమవద్ద అన్నీ ఉన్నా జరిమానా వేశారంటూ వాహనచోదకులు లబోదిబోమంటూంటారు. సాధారణంగా వివిధ పత్రాలు లేనందుకు, నిబంధనలు ఉల్లంఘించినందుకు కిందివిధంగా జరిమానా విధిస్తూంటారు. అంతకన్నా అధికంగా వసూలు చేస్తే సదరు అధికారులను ప్రశ్నించవచ్చు. * మోటారు వాహనాల చట్టం సెక్షన్ 181 ప్రకారం వాహనం నడిపే వ్యక్తికి లెసైన్స్ లేకుంటే రూ.500 జరిమానా విధిస్తారు. అలాగే సెక్షన్ 180 ప్రకారం వాహనం ఇచ్చినందునకు యజమానికి రూ.1000, వాహనం నడపడం రాని కారణంగా సెక్షన్ 184 కింద రూ.1000 మొత్తం రూ.2500 జరిమానా విధించవచ్చు. * సెక్షన్ 184 ప్రకారం ప్రమాదకరంగా వాహనం నడిపితే రూ.1000 జరిమానా విధిస్తారు. * రెడ్ సిగ్నల్ దాటి వెళ్తే రూ.1000, వాహనం ఇరువైపులా వస్తువులు తీసుకెళ్తే రూ.1000, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.1000 జరిమానా తప్పదు. * సెక్షన్ 190 (2) ప్రకారం పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే రూ.100, నిషేధ ప్రాంతంలో వాహనం పార్కింగ్ చేస్తే రూ.100, ప్రమాదకరంగా వాహనం పార్కింగ్ చేస్తే రూ.100 జరిమానా విధిస్తారు. * సెక్షన్ 192 ప్రకారం వాహనం రిజిస్ట్రేషన్ చేయించకుంటే రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకూ జరిమానా తప్పదు. * సెక్షన్ 196 ప్రకారం వాహనానికి ఇన్సూరెన్స్ చేయించకుంటే రూ.1000 ఫైన్ వేస్తారు. * సెక్షన్ 177 (4) ప్రకారం ట్యాక్సీ, ఆటో డ్రైవర్ యూనిఫాం ధరించకుంటే రూ.100 నుంచి రూ.200 వరకూ జరిమానా విధిస్తారు. * సెక్షన్ 177 (6) ప్రకారం ఆటోలో పరిమితికి మించి {పయాణికులను ఎక్కించుకుంటే రూ.ఒక్కొక్కరికి రూ.100 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. * సెక్షన్ 177 (7) ప్రకారం గూడ్స్ క్యారియర్ డ్రైవర్ యూనిఫాం వేసుకోకుంటే రూ.100 నుంచి రూ.200 ఫైన్ విధిస్తారు. * సెక్షన్ 177 (9) ప్రకారం నంబర్ ప్లేట్ లేకపోయినా, దానిపై ఎటుంటి గుర్తులు ఉన్నా రూ.100 నుంచి రూ.200 జరిమానా వేస్తారు. * సెక్షన్ 177 (19) ప్రకారం హెల్మెట్ ధరించకుంటే రూ.100 నుంచి రూ.200 వరకూ, సెక్షన్ 177 (20) సీట్‌బెల్ట్ ధరించకుంటే రూ.100 ఫైన్ చెల్లించాలి. * సెక్షన్ 177 (21) ప్రకారం ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళితే రూ.100 నుంచి రూ.200 వరకూ జరిమానా విధిస్తారు. * సెక్షన్ 179 (1) ప్రకారం తనిఖీ సమయంలో అధికారులకు ఆటకం కల్పిస్తే రూ.500 జరిమానా చెల్లించాల్సి వస్తుంది. * సెక్షన్ 185 (ఎ) ప్రకారం మద్యం తాగి వాహనం నడిపితే చార్జ్‌షీట్ రాసి కోర్టుకు పంపుతారు. -
అప్రమత్తం
ఎన్ఐఏ తాజా తనిఖీలతో మరోసారి కలకలం ‘ఉగ్ర’ కుట్రల నేపథ్యంలో పోలీసుల ముందస్తు చర్యలు వరుస పండగలతో.. సిటీలో పెరిగిన సందడి సిటీబ్యూరో ఇస్తాంబుల్, బాగ్దాద్... ఆపై హైదరాబాద్ లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఏయూటీ పక్కా స్కెచ్ వేసినట్లు ఆధారాలు లభ్యం కావటంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. మంగళవారం ఎన్ఐఏ నగరంలో చేపట్టిన తనిఖీల్లో మారణహోమాన్ని సృష్టించే వ్యూహం, బుల్లెట్లు బయటపడటంతో సిటీజనుల్లో ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో నగరం నలుమూలలా విస్తృత సోదాలు ప్రారంభించారు. అనుమానిత ప్రాంతాల్లో బాంబు, డాగ్స్క్వాడ్లతో అణవణువూ గాలిస్తున్నారు. రానున్న బోనాలు, ఇతర పండుగల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు పోలీసులు సన్నద్ధమవుతు న్నారు. ప్రజలకు భరోసా కల్పించే పనులు ప్రారంభించారు. మరోవైపు గడిచిన వారాంతంలో భారీ మారణ హోమానికి కుట్రపన్నిన ఐదుగురిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, శుక్రవారం బార్కాస్, తలాబ్‌కట్ట తదితర ప్రాంతాల్లో మరోసారి తనిఖీలు చేసి బుల్లెట్లు, కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు ఇతర పరికరాలను స్వాధీనం చేసుకుంది. గతంలో సిరియా వెళ్లే ప్రయత్నంలో పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో పట్టుబడ్డ వారితో పాటు, ఇటీవలి హైదరాబాద్ విధ్వంసానికి స్లీపర్‌సెల్స్‌గా ఉపయోగపడ్డ వారి గుట్టును సేకరించే పనిలో ఎన్ఐఏ నిమగ్నమైంది. ఆన్లైన్ ద్వారా బాంబు తయారీ అప్రమత్తం నేర్చుకున్న ఉగ్రవాదులు నగరంలోని వివిధ దుకాణాల్లో యూరియా పంచదార, మినరల్ యాసిడ్, హైడ్రోజన్ ఫెరాక్సైడ్తో తదితర ఇంధనాలు కొనుగోలు చేసేందుకు ఎవరు సహకరించారు అన్న వివరాలపై నగర కౌంటర్ ఇంట లిజెన్స్తో పాటు ఎన్ఐఏ కూడా ఆరా తీస్తోంది. ఆలయాలు, ముఖ్య ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చిక్కడపల్లి: బోనాలు, ఇతర పండుగలు సమీపిస్తుండడంతో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా నార్త్ జోన్ బాంబు డిస్పోజల్ టీమ్ సిబ్బంది(బీడీటీమ్) పద్మారావు నగర్‌లోని కంచి కామకోఠి పీఠం, స్కందగిరిలోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ గణపతి, అమ్మవారి, హనుమాన్ దేవాలయాల వద్ద మంగళవారం విస్తృత తనిఖీలు చేశారు. బీడీ టీమ్ ఇన్చార్జి సి.సురేష్, జెనరేష్, శంకరయ్య, మహేందర్‌లు ప్రత్యేక తనిఖీల్లో పాల్గొన్నారు. కాగా సీఎస్ డబ్ల్యూ న్యూ సిటీవింగ్ బృందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నాయని, వీరికి తోడుగా డీసీపీ, ఆర్.ఐ, నలుగురు ఏసీపీలు, అడిషనల్ డీసీపీ, జాయింట్ సీపీలు కలసి ప్రత్యేక బాంబుస్క్వాడ్‌లతో సోదాలు చేస్తున్నాయని అధికారులు వివరించారు. ప్రధానంగా సికిం ద్రాబాద్ రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ గణపతి దేవాలయం, మదీనా, ఆల్ఫా హోటల్, 31 బస్టాప్, అమెరికన్ కాన్సులేట్, బేగంపేట రైల్వే స్టేషన్, తాడ్బంద్ హనుమాన్ దేవాలయం, పాస్‌పోర్ట్ ఆఫీస్, ఉజ్జయిని మహంకాళి దేవాలయం తదితర ముఖ్యమైన ప్రదేశాలపై కూడా నిఘా ఉంచి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. -
మార్కెట్లోకి 'ట్రాయ్' కొత్త యాప్!
మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ను తెలుసుకొనే మరో కొత్త సాధనం మార్కెట్లోకి వస్తోంది. మై స్పీడ్ పేరిట టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) వినియోగదారుల సౌకర్యార్థం కొత్త యాప్ ను ప్రవేశ పెడుతోంది. యూజర్లు తమకు లభిస్తున్న మొబైట్ ఇంటర్నెట్ స్పీడ్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ కొత్త యాప్ సహాయపడుతుందని ట్రాయ్ తెలిపింది. మార్కెట్లోకి మరో కొత్త యాప్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ ను తెలుసుకునేందుకు వీలుగా 'మై స్పీడ్' పేరిట ఈ కొత్త యాప్ ను జూలై 5వ తేదీన లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. ఈ నూతన యాప్ ను మొబైల్ సేవా యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉనట్లు వెల్లడించింది. కవరేజ్, డేటా, స్పీడ్, నెట్వర్క్ ఇన్ఫర్మేషన్, హ్యాండ్ సెట్ వివరాలను కూడ ఈ కొత్త యాప్ వివరిస్తుందని ట్రాయ్... ప్రకటనలో వివరించింది. దేశంలో ఇంటర్నెట్ వాడకం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ట్రాయ్.. వినియోగదారులకు అందుబాటులో మై స్పీడ్ ను తెచ్చే ప్రణాళికలు చేసింది. ఈ కొత్త యాప్ ద్వారా యూజర్లు తమ మొబైల్ స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ స్పీడ్ ను తెలుసుకొని, ట్రాయ్ ఎనలిటిక్స్ పోర్టల్ కు పంపించే అవకాశం ఉన్నట్లు అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కొన్ని నగరాల్లో ఆపరేటర్లు తమ 3G కస్టమర్లకు కూడ ఎక్కువశాతం 2G స్పీడ్ ను అందిస్తున్నట్లు తమ డ్రైవ్ టెస్ట్ లో తెలుసుకున్న అధికారులు.. కస్టమర్లకు సహకరించే విధంగా మై స్పీడ్ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. -
కారున్నా.. పర్యవేక్షణ సున్నా..
కేంద్రాల తనిఖీకి వెళ్లని అధికారులు సొంత పనులకు వాహనాల వినియోగం దుర్వినియోగమవుతున్న ప్రభుత్వ ధనం ఖమ్మం కమాన్‌బజార్ : అంగన్వాడీ కేంద్రాలను నిరంతరం తనిఖీ చేయాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలున్నాయి. కేంద్రాల పర్యవేక్షణ కోసం సమకూర్చిన వాహనాలను సొంతానికి వాడుకుంటూ.. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 3,299 అంగన్వాడీ, 1,006 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా గర్భిణులు, పిల్లలు, తల్లులకు పౌష్టికాహారం, పాలు, గుడ్లు, వన్ ఫుల్ మీల్స్ సకాలంలో అందించాలి. అయితే ఆయా కేంద్రాలకు కాంట్రాక్టర్లు సరుకులు సక్రమంగా చేరవేస్తున్నారా.. అవి గర్భిణులు, బాలింతలు, బాలబాలికలకు సక్రమంగా అందుతున్నాయా.. లేదా.. అనే విషయాలను ఐసీడీఎస్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. కేంద్రాల పర్యవేక్షణ కోసం సూపర్వైజర్లు, వారిపై పర్యవేక్షణ కోసం జిల్లావ్యాప్తంగా 20 ప్రాజెక్టుల పరిధిలో.. 20 మంది సీడీపీఓలు పనిచేస్తున్నారు. వీరు ప్రతీ నెల సెక్టార్ మీటింగ్‌లు నిర్వహించడం.. అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించడం, సూపర్వైజర్ల పనితీరును తెలుసుకోవడం చేయాలి. ఇందుకోసం వారికి ప్రభుత్వం సమకూర్చిన వాహనాలను వినియోగించుకోవాలి. కానీ.. 20 మంది సూపర్ వైజర్లలో ఎక్కువ మంది జిల్లా కేంద్రం, మరికొందరు ఏపీలోని కృష్ణా జిల్లా, మరికొందరు ప్రాజెక్టు పరిధిలో నివాసం ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిలో ఉండే వారు వారి పరిధిలో ఉండే కేంద్రాలను పర్యవేక్షణ చేయగా.. జిల్లా కేంద్రానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారు, పక్క జిల్లాల నుంచి వచ్చిపోయే వారు మాత్రం తూతూ మంత్రంగా ఒకసారి ప్రాజెక్టుకు వెళ్లి సంతకాలు చేసి వస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన వాహనాలను సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. రూ.లక్షలు వృథా.. ప్రతీ సీడీపీఓకు ఒక కారు చొప్పున మొత్తం 20 మందికి 20 కార్లను సమకూర్చారు. ప్రతీ అధికారి నెలకు 2,500 కిలోమీటర్లు ప్రయాణిస్తే.. నెలకు రూ.24వేల బిల్లు చెల్లిస్తారు. ఇలా కారు బిల్లులు ప్రతీ నెలకు రూ.4.8లక్షల చొప్పున చెల్లిస్తారు. కానీ.. పలువురు సీడీపీఓలు మాత్రం వారి ప్రాజెక్టు పరిధిలో పర్యవేక్షించకుండా.. కార్లను సొంత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఏ అధికారి ఎక్కడ పర్యవేక్షిస్తున్నారనే విషయాన్ని చూడాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ డ్యూటీలు సక్రమంగా చేయకుండా.. ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసే అధికారులపై చర్య తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. విచారణ చేస్తాం.. సీడీపీఓలు కొందరు స్థానికంగా ఉండటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. వాహనాలు ఏర్పాటు చేసింది అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షించేందుకే. వాటిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు. ప్రభుత్వ వాహనాలను శాఖాపరమైన కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి. అలా కాకుండా సొంత పనులకు వినియోగించే వారిపై విచారణ చేపడతాం. సీడీపీఓలు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. - జ్యోతిర్మయి, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి -
మారింది స్థావరాలే !
అమ్మకాలు మాత్రం ఆగలేదు.. భారీగా గుట్కా, ఖైనీ విక్రయాలు స్టాక్ పాయింట్లను పట్టించుకోని అధికారులు చిరువ్యాపారులపైనే పోలీసుల దాడులు హన్మకొండ : 2016 జూన్ 20న పరకాలలో గుట్కాలు నిల్వ చేసిన ఇంటిపై పోలీసులు దాడి చేసి రూ.లక్ష విలువైన గుట్కాలు, ఖైనీలు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వా రం వ్యవధిలోనే జూన్ 27న వర్ధన్నపేటలో పోలీసుల దాడి లో రూ. 1.5 లక్షల విలువైన గుట్కాలు లభ్యమయ్యూరుు. ఇ లా పోలీసుల వరుస దాడులు చేపడుతున్నా గుట్కా అమ్మకా లు తగ్గడం లేదు. గుట్కా అక్రమ వ్యాపారంలో పెద్దలను వ దిలి చిరువ్యాపారులపై దాడులు జరుగుతుండటంతో ఆశిం చిన ఫలితం రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుట్కా వ్యాపారానికి స్టాకిస్టు(నిల్వ చేసేవారు) కేంద్ర బిందువులుగా వ్యవహరిస్తున్నారు. గుట్కాలు, ఖైనీలను పెద్ద ఎత్తున నిల్వ చేస్తూ జిల్లా నలుమూలకు సరఫరా చేస్తున్నారు. తనిఖీ చేసే అధికారులు స్టాకిస్టు పాయింట్లపై దృష్టి సారించకుండా చిన్నచిన్న కిరాణ షాపులపై దాడులు చేసి సరిపెడుతున్నారు. దీంతో గుట్కా అమ్మకాలు తగ్గడంలేదు. వరంగల్ కేంద్రంగా.. జిల్లాలో గుట్కా క్రయవిక్రయాలకు వరంగల్ నగరం ప్రధాన కేంద్రంగా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి గుట్కాలను పెద్ద ఎత్తున రాత్రి వేళలో హైదరాబాద్, విజయవాడ నుంచి వరంగల్ నగరానికి చేరుస్తున్నారు. ఇలా చేరిన గుట్కా, ఖైనీ, పాన్మసాలను గతంలో వరంగల్ బీట్బజారు, పిన్నావారి వీధిలో ప్రధానంగా నిల్వ చేసేవారు. పోలీసుల దాడుల నేపథ్యంలో నగరం మధ్య నుంచి శివారు ప్రాంతాల్లో అనుబంధ గోదాములను ఏర్పాటు చేసుకుని అక్కడ నిల్వ చేయడం ఆరంభించారు. ఆ పారుుంట్ల నుంచి జిల్లా నలుమూలలకు ‘మాల్’ను సరఫరా చేస్తున్నారు. ఏ ఒక్క చోట పర్మినెంట్‌గా గుట్కాలను నిల్వ చేయకుండా తరుచుగా అడ్డా మారుస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు కాశిబుగ్గ, ధర్మారం, కరీమాబాద్ ప్రధాన రహదారులకు సమీపంలో గోదాములు ఏర్పాటు చేశారు. గుట్కాలు, ఖైనీలు పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్న గోదాములను వదిలేసి పోలీసులు చిరువ్యాపారులపైనే తమ ప్రతాపం చూపిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. గుట్కా వ్యాపారుల నుంచి పోలీసుశాఖకు నెలవారీ మాముళ్లు అందుతున్న ఫలితంగానే గోదాములపై దాడులు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త అడ్డాలివే.. విజయవాడ వైపు నుంచి రాత్రి వేళ వచ్చే గుట్కాలు, ఖైనీల ను నాయుడు పంపు జంక్షన్, మామూనూరు సమీపంలో జాతీయ రహదారికి పక్కన ఉన్న గోదాములు, ఇళ్లలో తాత్కాలికంగా నిల్వ చేస్తున్నారు.కాజీపేట సమీపంలో సోమిడి వద్ద గతంలో గుట్కా వ్యాపారుల గోదాం ఉండేది. ఈ విషయం బయటకు పొక్కడం, తరచుగా దాడులు జరుగుతుండటంతో వ్యాపారులు ఇటీవలహన్మకొండ, భీమారం సమీపానికి అడ్డాలు మార్చారు. వరంగల్ బీట్బజార్ను అడ్డాగా చేసుకున్న గుట్కా వ్యాపారులు అనుబంధ స్టాక్ పాయింట్‌ను ఎల్లంబజార్‌లో ఏర్పాటు చేశారు. డిమాండ్‌ను బట్టి స్టాక్ తీసుకొచ్చి కిరాణ సరుకులతో కలిపి చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు.ములుగు, భూపాలపల్లి, పరకాల వైపు ట్రాన్స్పోర్ట వాహనాల్లో గుట్కాను సరఫరా చేసే వ్యాపారులు కాశిబుగ్గ ప్రాం తంలో నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. నర్సంపేట, మహబూబాబాద్ వైపు గుట్కాలు సరఫరా చే సే వ్యాపారులు గీసుగొండ మండలం ధర్మారం సమీపం లో కొత్తగా స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నారు. -
డీఎస్పీ కార్యాలయంలో డీఐజీ ఆకస్మిక తనిఖీ
తాండూర్(రంగారెడ్డి): హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ తాండూరు డీఎస్పీ కార్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల విచారణ, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాండూరు సబ్‌డివిజన్‌లో కేసుల విచారణ లోపభూయిష్టంగా ఉందని, రికార్డుల నిర్వహణ కూడా సరగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై డీజీకి రిపోర్టు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీస్ శాఖలో కూడా పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, షాబాద్, శంకర్పల్లి పోలీస్స్టేషన్లను వెస్ట్ సైబరాబాద్ కిందికి తీసుకురానున్నట్లు తెలిపారు. అలాగే, భువనగిరి, యాదగిరిగుట్ట పరిధిలోని 15 పోలీస్స్టేషన్లు కూడా సైబరాబాద్ పరిధిలోకి వస్తాయన్నారు. అనంతరం ఆయన డివిజన్ పరిధిలో శిక్షణ పొందుతున్న 15 మంది ట్రైనీ ఎస్సైలతో సమావేశమయ్యారు. డీఎస్పీ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఆయనతోపాటు జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ కూడా ఉన్నారు. -
నేడు నేను...రేపు నీవు !
వంతుల వారీగా ఉపాధ్యాయుల విధులు ఎంఈఓ, సీఆర్ పీ తనిఖీలో వెలుగుచూసిన వైనం వెంకటాపురం : ఈ రోజు బడికి నేను వెళ్లొస్తా.. రేపు నీవు వెళ్లూ అంటూ ఒకరినొకరు ఉపాధ్యాయులు వంతుళ్ల వారీగా విధులు నిర్వహిస్తూ పాఠశాలకు ఎగనామం పెడుతున్న సంఘటన మండలంలోని రాంనాయక్‌తండా పాఠశాలలో చోటుచేసుకుంది. మండలంలోని రాంనాయక్‌తండా పాఠశాలను గురువారం ఎంఈఓ చాగర్ల అయిలయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. హెచ్ఎం రవితో పాటు ఉపాధ్యాయుడు ప్రవీణ్ విధులకు హాజరు కావాల్సి ఉండగా హెచ్ఎంకు ఎలాంటి సెలవుపత్రం లేకుండానే విధులకు గైర్హాజరవుతూ విధులకు ఆలస్యంగా హాజరయ్యాడు. దీంతో ఎంఈఓ ప్రవీణ్‌ను మందలించి సమయపాలన పాటించాలని లేనట్లయితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. శుక్రవారం అదే పాఠశాలకు సీఆర్పీ రమేష్‌ను ఎంఈఓ పంపించగా ఉపాధ్యాయుడు ప్రవీణ్ ఎలాంటి సెలవుపత్రం లేకుండానే విధులకు డుమ్మా కొట్టగా హెచ్ఎం రవి ఉదయం 10:30 గంటలకు విధులకు హాజరయ్యాడు. దీంతో సీఆర్పీ ఎంఈఓ అయిలయ్యకు ఉపాధ్యాయుల తీరుపై సమాచారం అందించారు. ఇది ఒక్క రాంనాయక్తండాలోనే కాదు మండలంలోని సుమారు 12 పాఠశాలల్లోని ఉపాధ్యాయులు వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్నారని స్వయంగా ఆయా కాంప్లెక్స్‌లకు చెందిన సీఆర్పీలే ఆరోపిస్తున్నారు. సుబ్బక్కపల్లి పాఠశాలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ఇప్పటివరకు గ్రామంలో బడిబాట కార్యక్రమం చేపట్టలేదన్నారు. ఇద్దరిలో ఒక ఉపాధ్యాయుడు ఇప్పటివరకు పాఠశాలకు హాజరుకాలేదని గ్రామస్తులు స్వయంగా ఎంఈఓకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం మూలంగా గత ఏడాది 22 మంది విద్యార్థులకు ప్రస్తుతం ఐదుగురు మాత్రమే హాజరవుతున్నారని వారు పేర్కొంటున్నారు. పాఠశాలలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువవడంతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకుల అండతోనే ఉపాధ్యాయులు విధులకు గైర్హాజరవుతున్నట్లు మండలంలో జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేస్తా పాఠశాల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ వం తుల వారీగా విధులు నిర్వహిస్తున్న రాంనాయక్‌తండాకు చెందిన ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేస్తా. గురువారం పాఠశాలను సందర్శించగా హెచ్ఎం రవి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే విధులకు గైర్హాజరయ్యాడు. శుక్రవారం సీఆర్పీ రమేష్ పాఠశాలను సందర్శించగా ప్రవీణ్ రాలేదు. ఉపాధ్యాయులు సమయపాలన కూడా పాటించడం లేదు. ఇద్దరు ఉపాధ్యాయులపై ఉన్నతాధికారులకు నివేదిస్తా. - చాగర్ల అయిలయ్య, ఎంఈఓ -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను ఎక్సైజ్ అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు...తంజావూరుకు చెందిన ఉమ, మధురైకు చెందిన పొన్నమ్మ కొంతకాలంగా గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి నెల్లూరులో విక్రయిస్తున్నారు. శనివారం నగరంలో తనిఖీలు చేపట్టిన నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం వీరాస్వామి స్టోన్‌హౌస్‌పేట వంతెన వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఉమ, పొన్నమ్మను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు బ్యాగులను తనిఖీ చేయగా, రూ.1.50లక్షలు విలువ చేసే 23 కిలోల గంజాయి పొట్లాలు బయటపడ్డాయి. దీంతో గంజాయిని స్వాధీ నం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు రాఘవయ్య, అనిత, రమణయ్య, హెడ్‌కానిస్టేబుల్ సాయినాథ్, కానిస్టేబుళ్లు వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, ఎస్ రాఘవయ్య, మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు. -
ఛీఛీ రోడ్లు
నాసిరకం మెటీరియల్‌తో సీసీరోడ్ల నిర్మాణం క్వాలిటీ కంట్రోల్ తనిఖీల్లో బట్టబయలు బెర్మ్‌లు, డ్రైన్లు నిర్మించకుండానే నిధులు డ్రా అడ్వాన్స్ రికార్డింగ్ అంటూ పనులు పూర్తి కాకుండానే ఎంబుక్‌ల్లో నమోదు చేసేశారు. మెటీరియల్ పేరుతో నిధులు పక్కదారి పట్టించేశారు. ఆగమేఘాల మీద హడావుడిగా నిర్మించిన సీసీరోడ్ల నిర్మాణంలో డొల్లతనం నెలరోజులు తిరక్కుండానే బయటపడుతోంది. అధికారులు ఏ స్థాయిలోచేతివాటం ప్రదర్శించిందీ అత్యంత లోప భూయిష్టంగా ఉన్న సీసీ రోడ్లను చూస్తే ఇట్టే అర్థమవుతోంది. కనీసం బెర్మ్‌లు, కాలువలు నిర్మించకుండానే నిధులు డ్రా చేసేశారు. క్వాలిటీ కంట్రోల్ అధికారుల పరిశీలనలో నిర్మాణంలో డొల్లతనం బయటపడింది. విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు.14వ ఆర్థిక సంఘం నిధులను జోడించి ఉపాధి హామీ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు మురిగిపోకూడదన్న తలంపుతో మార్చి నెలాఖరులోగా ఆఘమేఘాలమీద బిల్లులు మంజూరయ్యాయి. పనులు పూర్తయినట్టుగా ఎంబుక్‌లో రికార్డు చేసి మమా అనిపించారు. అయినప్పటికీ రూ.159కోట్ల కాంపొనెంట్ నిధులను మాత్రమే ఖర్చుచేయగలిగారు. రూ.40కోట్లు మురిగిపోయాయి. తొలుత 50ః50 నిష్పత్తితో రూ.69.27 కోట్లతో పనులు చేపట్టారు. అయినా కాంపొనెంట్ నిధులు రూ.256 కోట్లు మిగిలిపోవడంతో 90ః10 శాతం నిష్పత్తిలో పనులకు అనుమతి ఇచ్చారు. రూ.199కోట్ల ఉపాధి కాంపొనెంట్ నిధులకు 14వ ఆర్థిక సంఘం నిధులు జోడించి మొత్తం రూ.298 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. మొత్తంగా మూడువందల కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్టుగా అధికారులు ప్రకటించారు. వీటి నాణ్యత మేడిపండు చందంగా ఉంది. 15 రోజులపాటు క్వాలిటీ కంట్రోల్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో వీటి నిర్మాణంలో చోటుచేసుకున్న అవినీతి బయటపడింది. నిబంధనలు ఇలా చెబుతున్నా.. సీసీ రోడ్ల నిర్మాణంలో నిబంధనలు కఠిన తరం చేశారు. ఎం-30 స్టాండర్డ్(ఒకశాతం సిమెంట్, ఒకటిన్నర శాతం పిక్క, మూడు శాతం ఇసుక)లో రోడ్ల నిర్మాణం చేపట్టాలి. కనీసం 28 రోజులు పాటు వేసిన సీసీ రోడ్ లేదా డ్రైన్‌ను వాటరింగ్ చేయాలి. నాణ్యతలో, వాటర్ ప్యూరింగ్‌లో నిబంధనలకు ఉల్లంఘిస్తే రూ.లక్షకు 25వేల చొప్పున కోత పెట్టొచ్చు.. పర్యవేక్షించిన ఏఈ, డీఈలపై క్రమశిక్షణ చర్యలే కాదు తీవ్రతను బట్టి క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అంతా లోపభూయిష్టమే..: నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టలేదని విజిలెన్స్అండ్ మోటనరింగ్ కమిటీతో పాటు క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారుల పరిశీలనలో గుర్తించినట్టు సమాచారం. తొలివిడతలో 50ః50నిష్పత్తిలో చేపట్టిన సీసీ రోడ్లలో నాణ్యత బాగానే ఉన్నప్పటికీ 90ః10నిష్పత్తిలో చేపట్టిన సీసీ రోడ్లలోనే చాలా చోట్ల లోపభూయిష్టంగా ఉంది. నాసిరకం మెటీరియల్‌తో వీటిని నిర్మించినట్టుగా స్పష్టమవుతోంది. దీనికి తోడు జిల్లాలో ఏ ఒక్క సీసీరోడ్కు బెర్మ్‌లు, డ్రైన్లు నిర్మించిన దాఖలాలు లేవు. దీంతో బెర్మ్ల్లేని సీసీరోడ్లపై వెళ్లే వాహన చోదకులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. రెండో విడతలో చేపట్టిన సీసీ రోడ్లలో సుమారు మూడోవంతు నిధులు పక్కదారి పట్టి ఉంటాయని క్వాలిటీ అధికారులే అంచనా వేస్తున్నారు. ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలపై మరో పక్క థర్డ్ పార్టీ ఎంక్వయిరీ కూడా జరుగుతోంది. తమ నివేదికలను నెలాఖరుకు ఉన్నతాధికారులకు అందజేస్తామని క్వాలిటీ కంట్రోల్ అధికారులు చెబుతు న్నారు. -
సినిమా థియేటర్ల తనిఖీ
పలు థియేటర్ల సీజ్ సాక్షి కథనానికి స్పందించిన జేసీ శ్రీకాకుళం పాతబస్టాండ్: సినిమా థియేటర్లపై జాయింట్ కలెక్టర్ వివేక్‌యాదవ్ కొరఢా ఝళిపించారు. గతనెల 26వ తేదీన సాక్షిలో ‘సినీమాయ’ శీర్షికన వచ్చిన కథనానికి స్పందించారు. థియేటర్లలో వసతుల కొరత, అధిక ధరలకు విక్రయాలు, అగ్నిమాపక నిబంధనలు పాటించకపోవడం, ప్రేక్షకుల పడుతున్న ఇబ్బందులపై జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సిబ్బందిచే తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగానే మంగళవారం పట్టణంలోని రెవెన్యూ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ముందుగా ఎస్వీసీ (రామలక్ష్మణ), సరస్వతీ థియేటర్, చంద్రమహాల్, సూర్యమహాల్ థియేటర్లలో డీటీ పి.రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఆయా థియేటర్లకు సంబంధించి బీ ఫారం లెసైన్సు, ఫైర్ సర్టిఫికెట్లు రెన్యువల్లలో ఉందో లేదో పరిశీలించారు. ప్రధానంగా ఈసారి జేసీ భద్రతా పత్రాలపై దృష్టి సారించారు. ఫైర్ సేఫ్టీ లేని థియేటర్లను తక్షణమే సీజ్ చేయూలని ఆదేశించారు. ఈక్రమంలో ఇప్పటికే నరసన్నపేటలో రెండు, టెక్కలిలో రెండు, పొందూరులో ఒకటి, పలాసలో రెండు థియేటర్లు సీజ్ చేశారు. పాలకొండలో రెండో థియేటర్లను తనిఖీ చేశారు. అలాగే, అధిక ధరలకు తినుబండారాలు విక్రరుుంచడం, తదితర అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించనున్నారు. ఒక్కసారిగా తనిఖీలు ప్రారంభం కావడంతో ఇంతవరకు అడ్డగోలుగా థియేటర్లు నడుపుతున్న యాజమాన్యాలు ఉలిక్కిపడ్డాయి. ఇప్పుడు కొందరు రెన్యువల్ కోసం పరుగులు తీస్తుండగా, కొందరు స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అగ్నిమాపక నివారణ చర్యలు తీసుకున్నట్టు ఆ శాఖ ఎన్ఓసీ ఇస్తేగానీ రెవెన్యూ అధికారులు రెన్యువల్ ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు అగ్నిమాపక నివారణ చర్యలు తీసుకోవాలన్నా యూజమాన్యాలకు కష్టమే. ఎప్పటి నుంచో అగ్నిమాపక అధికారులు యూజమాన్యాలకు సూచిస్తున్నా పెడచెవిన పెట్టడంతో ఇప్పుడు పరుగులు తీయూల్సిన పరిస్థితి వచ్చింది. జారుుంట్ కలెక్టర్ తీసుకున్న చర్యల పట్ల ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నాట్కో ఫార్మా... ప్లాంట్లలో యూఎస్ఎఫ్డీఏ తనిఖీలు
హైదరాబాద్: నాట్కో ఫార్మాకు చెందిన రెండు ప్లాంట్లలో అమెరికా ఎఫ్‌డీఏ ఇటీవల తనిఖీలు జరిపింది. చెన్నై సమీపంలోని మనాలిలో ఉన్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ తయారు చేసే ప్లాంట్‌లోనూ, హైదరాబాద్ సమీపంలోని కొత్తూరులోని ఫార్మాస్యూటికల్ ప్లాంట్ల్లో యూఎస్ఎఫ్డీఏ ఈ తనిఖీలు నిర్వహించిందని నాట్కో ఫార్మా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి మార్చిల్లో ఈ తనిఖీలు జరిగాయని పేర్కొంది. ఈ రెండు ప్లాంట్లకు సంబంధించి యూఎస్ఎఫ్డీఏ 483 అభ్యంతరాలను వ్యక్తం చేసిందని, అయితే అవి స్వల్పమైనవేనని వివరించింది. వీటికి తగిన స్పందనను ఎఫ్‌డీఐకి నివేదించామని, ఈ రెండు ప్లాంట్ల ఉత్పత్తులపై భవిష్యత్తులో ఎలాంటి తీవ్రమైన ప్రభావం ఉండబోదని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈలో ఈ షేరు 13 శాతం క్షీణించి రూ. 1,409 వద్ద ముగిసింది. -
బోగస్ రుణాలకు ‘లోన్చార్జ్’తో చెక్
కొత్త విధానాన్ని రూపొందించిన సీసీఎల్ఏ ♦ ఆమోదం తెలిపిన బ్యాంకులు ♦ వచ్చే ఖరీఫ్ నుంచి అమలు సాక్షి, హైదరాబాద్ : బోగస్ పట్టాదారు పుస్తకాలతో అక్రమంగా వ్యవసాయ రుణాలను పొం దుతున్న వారిని నియంత్రించేందుకు రెవెన్యూశాఖ చర్యలు చేపట్టింది. ‘లోన్ చార్జ్’ మోడల్(రుణ ధ్రువీకరణ విధానం) పేరిట భూపరిపాలన ప్రధాన కమిషనర్ రూపొందించిన కొత్త పద్ధతికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో పాటు రిజర్వ్‌బ్యాంక్ ప్రతినిధులు ఆమోదం తెలి పారు. దీంతో వ్యవసాయ రుణాల మంజూరు ప్రక్రియకు..భూ రికార్డుల్లో ఏర్పడుతున్న గందరగోళానికి, ఒకే వ్యక్తి ఒకే పట్టాపై పలు బ్యాం కుల్లో రుణాలు పొందడం, నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాల హల్చల్.. వంటి అక్రమచర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని రెవెన్యూ ఉన్నతాధికారులు అంటున్నారు. రెవెన్యూశాఖ ఇటీవల రూపొందించిన వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా పంట రుణం పొందే పట్టాదారు వివరాలు(పహాణీ, పట్టాదారు..తదితర)ను రెవెన్యూ, వ్యవసాయ అధికారులు గానీ, రుణమిచ్చే బ్యాంకు అధికారులు గానీ ఆన్లైన్లోనే చెక్ చేసుకునేందుకు వీలుకలుగుతుంది. రుణం కోరుతు న్న రైతు రకరకాల ధ్రువీకరణపత్రాలను తీసికెళ్లే పని లేకుండా తన వ్యక్తిగత గుర్తింపు కార్డును బ్యాంకుకు తీసికెళ్తే చాలు, ఆన్లైన్లో వివరాలను పరిశీలించి బ్యాంకు అధికారులు వెంటనే రుణమంజూరు చేసేలా ‘లోన్చార్జ్’ వినియోగపడనుంది. తీసుకున్న రుణం వివరాలు సదరు రైతు పహాణీలోనూ అప్డేట్ అవుతుంది. ఇటీవల జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలోనూ వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఆర్బీఐ అధికారులు ఈ మోడల్ పట్ల సానుకూలతను వ్యక్తం చేశారు. పట్టాదారునిపై లోన్చార్జ్ను రూపొందించడం ద్వారా ప్రభుత్వం నుంచే అందాల్సిన లబ్దిని అర్హులకు మాత్రమే అందించేందుకు వీలవుతుందని ఆర్థిక, వ్యవసాయ శాఖల అధికారులు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. త్వరలోనే పెలైట్ ప్రాజెక్ట్‌ను అమలు చేసి, వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి పూర్తిస్థాయిలో ‘లోన్చార్జ్’ మోడల్‌ను అమలు చేయాలని సీసీఎల్ఏ నిర్ణయించారు. -
ఎక్సైజ్ తీరు ‘మామూళ్లే’!
మద్యం వ్యాపారులు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. వారిని నియంత్రించాల్సిన అధికారులు ‘మామూళ్ల’ పేరిట ప్రోత్సహిస్తుండడంతో దుకాణాల వద్ద నిబంధనలకు తూట్లుపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం విక్రయించడం లేదు. పొరుగు జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ తాను ఎమ్మార్పీకి మించి రూపాయి కూడా అదనంగా అమ్మేది లేదని ఖరాఖండిగా చెప్పేసినా అధికారులు అంగీకరించలేదు. ఎమ్మార్పీపై రూ. ఐదు నుంచి రూ. 10 వరకు విక్రయిస్తేనే దుకాణం ఉంటుందని.. లేకపోతే కేసులు తప్పవని బెదిరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. వ్యాపారులను తమ దారికి తెచ్చుకునేందుకు ఎక్సైజ్ అధికారులు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. దుకాణాలు, బెల్ట్ షాపులు, జాతీయ రహదారిపై ఉన్న దుకాణాలు, బార్ల నుంచి నెలవారీ వసూళ్లకు జిల్లా వ్యాప్తంగా ఒక సీఐని నియమించినట్టు సమాచారం. ఎక్సైజ్‌శాఖ సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నా వారిలో మార్పు కనిపించడం లేదు. ఎవరు ఏమనుకుంటే తమకేమిటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు.దీంతో వ్యాపారులు పెట్రేగిపోతున్నారు. జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుకు ఎన్నికల సమయంలో నిధులు సమకూర్చిన ఓ మద్యం వ్యాపారి జిల్లాలో ఇప్పుడు హవా చలాయిస్తున్నారు. రాజకీయంగా మంత్రి సన్నిహితుడిగా పేరొందిన ఆ వ్యక్తి చక్రం తిప్పుతున్నారు. అందుబాటులో ఉన్న అన్ని దుకాణాలను చేజిక్కించుకొని తాను చెప్పిందే వేదం అంటూ వ్యాపారుల్ని తన దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి చెప్పారు అంటూ తనకు కావాల్సినట్టుగా పనులు చేయించుకున్నట్టు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 238 దుకాణాలతోపాటు 15 బార్లు, సుమారు ఐదు వేల బెల్ట్ దుకాణాలు, జాతీయ రహదారికి సమీపంలో ఉన్న 58 దుకాణాలను లెక్కించి పద్దులు రాసే పనిని ప్రారంభించారు. ఒక్కో దుకాణం నుంచి నెలకు అర్బన్ ప్రాంతాల్లో రూ. 57,500, రూరల్ ప్రాంతాల్లో రూ. 37,500 వసూలు చేసినట్టు తెలిసింది. ఈ మొత్తంలో జిల్లా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతోపాటు జిల్లా మంత్రికి కూడా పంపకాలు చేయాలంటూ ఓ వ్యాపారి సమాచారం పంపిస్తున్నట్టు భోగట్టా. రానున్న జూలైలో మద్యం పాలసీ గడువు ముగుస్తుండడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వ్యాపారులు కూడా అధికారులు చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తోంది. అంతేకాకుండా జిల్లా మంత్రి కూడా తాను మంత్రిగా ఉన్నంతకాలం ధీమాగా ఉండొచ్చని, ఎలాంటి ఇబ్బందులూ రావని చెబుతున్నట్టు తెలిసింది. ఎన్ఫోర్స్మెంట్ ఏదీ?జిల్లాలో అడపాదడపా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ సిబ్బంది దాడులు చేస్తున్నా బయటకు రావడం లేదు. కేసులు ఎక్కడా కనిపించడం లేదు. అధికారులంతా ఏపీ-ఒడిశా సరిహద్దులో నల్లబెల్లం, నాటుసారా తయారీపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల మద్యం దుకాణదారుల నుంచి మామూళ్ల పేరిట రూ. 85 వేలు వసూలు చేసి ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. దీంతో కొన్నాళ్లపాటు స్థబ్దుగా ఉండిపోవాలని అధికారులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అప్పుడప్పుడూ తనిఖీలకు వస్తున్నా ఫలితం లేకుండా పోయింది. స్థానిక సిబ్బంది ముందుగానే అధికారుల రాకను పసిగట్టి మద్యం వ్యాపారులకు సమాచారం ఇచ్చేస్తుండడంతో కేసుల నమోదుపై ప్రభావం పడింది. ఒకవేళ కేసు నమోదు చేసినా రూ. లక్ష అపరాధ రుసుము చెల్లించేస్తే వెంటనే మాఫీ అయిపోతుందన్న ధీమా వ్యాపారుల్లో ఉంది. దీంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ సిబ్బంది జాడ కనిపించకపోవడం, టాస్క్‌ఫోర్స్ సేవలు తగ్గిపోవడం జరుగుతోంది. దీనినే ఆసరాగా తీసుకున్న స్థానిక ఎక్సైజ్ సిబ్బంది మామూళ్లు పెంచేశారని తెలిసింది. వ్యాపారులు తమకు నచ్చినట్టుగా విక్రయాలు చేసుకోవచ్చని మౌకిక ఆదేశాలిచ్చినట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. -
మానవ రహిత విమానాలతో వంతెనల తనిఖీ..!
♦ సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందిస్తున్న వేల్ టెక్ ♦ పరిశోధనకు ఏటా రూ.30 కోట్లు ♦ వేల్ టెక్ యూనివర్సిటీ వీసీ సత్యనారాయణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వంతెనలు, చారిత్రక కట్టడాల నాణ్యతను పరీక్షించేందుకు కొద్ది రోజుల్లో భారత్‌లో మానవ రహిత విమానాలు (యూఏవీ), డ్రోన్లు రంగంలోకి దిగనున్నాయి. ఇండియా-కెనడా ఇంపాక్ట్స్ కార్యక్రమంలో భాగంగా చెన్నైకి చెందిన వేల్ టెక్ యూనివర్సిటీ, కెనడాలోని విక్టోరియా వర్సిటీలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. యూఏవీ, డ్రోన్ల సాయంతో వంతెనలకు పగుళ్లుంటే గుర్తిస్తారు. తరచూ పరీక్షలు జరపడం ద్వారా వంతెన గట్టిదనం, జీవిత కాలం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటారు. తొలి పైలట్ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న వంతెన వేదిక కానుందని వేల్ టెక్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బీల సత్యనారాయణ గురువారమిక్కడ చెప్పారు. అరుదైన కట్టడాల నాణ్యతను తెలుసుకునేందుకూ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తామని మీడియాతో చెప్పారు. ఏడాదిలో తొలి పైలట్ ప్రాజెక్ట్... ప్రాజెక్టుకు అవసరమైన యూఏవీ, డ్రోన్లను వేల్ టెక్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. సెన్సర్లను విక్టోరియా వర్సిటీ రూపొందించింది. సెన్సర్లను యూఏవీ, డ్రోన్లతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతున్నట్లు వేల్ టెక్ ప్రో-వీసీ యు.చంద్రశేఖర్ తెలిపారు. ఏడాదిలో తొలి పైలట్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని విక్టోరియా యూనివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రిషి గుప్త ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. ‘ఈ టెక్నాలజీతో ఫలితాల్లో కచ్చితత్వం ఉంటుంది. ఖర్చు తక్కువ. సమయమూ ఆదా అవుతుంది. వంతెనల కింది భాగంలోకి డ్రోన్లు సులువుగా వెళ్లి తనిఖీ చేస్తాయి. భారతీయ రైల్వేల ఆధ్వర్యంలో 50,000కు పైగా పెద్ద వంతెనలున్నాయి. వీటిలో 100 ఏళ్లకు పైబడ్డవి చాలానే ఉన్నాయి’ అని తెలిపారు. టెక్నాలజీని కెనడాలోనూ వినియోగిస్తామన్నారు. కాగా పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఏటా రూ.30 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్టు వేల్ టెక్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కె.వి.డి.కిషోర్ కుమార్ చెప్పారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ, అనుబంధ పరిశ్రమల కోసం రూ.8 కోట్లతో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌ను నెలకొల్పామని, ఇప్పటికే ఇందులో 20 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. -
24/7తో పక్కాగా వెరిఫై
ఆధునిక సాఫ్ట్వేర్ అందిపుచ్చుకున్న పోలీసులు 19 వేల కోర్టుల్లోని డేటాతో అనుసంధానం మౌస్ క్లిక్‌తో నేరగాళ్ల పూర్తి వివరాలు సైతం పాస్పోర్ట్స్ నుంచి వారెంట్స్ వరకు తనిఖీ మల్టీనేషనల్ కంపెనీలతో పాటు కొన్ని కీలక సంస్థల్లో ఉద్యోగాల్లో చేరే వారికి పోలీసులు జారీ చేసే పరిశీలన పత్రం (వెరిఫికేషన్ సర్టిఫికెట్) ఎంతో కీలకం. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చాల్సి వస్తోంది. ఇది అటు దరఖాస్తుదారుడికి, ఇటు అధికారులకూ ఇబ్బంది కరంగా మారింది. కొందరు అభ్యర్థులు నిర్దేశిత గడువు మీరడంతో ఉద్యోగం నిలుపుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు చెందిన అనేక మంది నగరానికి వలసవస్తున్నారు. వీరిలో కొందరు నేరచరితులూ ఉంటున్నారు. స్థానికంగా గుర్తింపు పత్రాలు పొందుతున్న వీరంతా వాటి ఆధారంగా పాస్పోర్ట్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో వీరికి ఉన్న నేరచరిత్ర ఇక్కడి అధికారులకు తెలియకపోవడంతో పాస్‌పోర్ట్‌లు వచ్చేస్తున్నాయి. అర్దరాత్రి వేళ నగరంలో సంచరిస్తున్న ఓ వ్యక్తిని అనుమానంపై పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. అతడు తన వద్ద ఉన్న గుర్తింపుకార్డులు చూపించి బయటకు వచ్చేస్తాడు. ఇలాంటి వారిలో నేరగాళ్లు ఉండే అవకాశం లేకపోలేదు. ఈ విషయం తెలియాలంటే సదరు అనుమానితుడిని లోతుగా విచారించాలి. ఇది కొన్ని సందర్భాల్లో అమాయకులకు ఇబ్బందికరంగా మారే ప్రమాదమూ ఉంది. ఇకపై ఇలాంటి సమస్య ఎదురుకాకుండా, ఈ తరహా పరిస్థితులు ఉత్పన్నం కాకుండా నగర పోలీసు విభాగం అత్యాధునిక సాఫ్ట్వేర్ టూల్‌ను అభివృద్ధి చేసింది. ‘24/7 వెరిఫై’గా పిలిచే ఈ సాఫ్ట్వేర్ ఎంతో ఉపయుక్తంగా మారింది. ఇది అమలులోకి రావడంతో సిటీ పోలీసు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సెల్ కీలకపాత్ర పోషించింది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా వివరాలు వెరిఫై చేయడమే కాకుండా దానికి సంబంధించిన కొన్ని రికార్డులూ డౌన్లోడ్ చేసుకోవచ్చు. - సాక్షి, సిటీబ్యూరో ఏమిటీ ‘వెరిఫై’? ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ-కోర్ట్స్ విధానం అమలులో ఉంది. వివిధ సివిల్, క్రిమినల్ న్యాయస్థానాల్లో ఉన్న కేసులకు సంబంధించిన సమగ్ర వివరాలను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంట ర్ (ఎన్ఐసీ) క్రోడీకరిస్తోంది. వీటిని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లోకి చేరుస్తూ ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. దీని ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 19 వేల కోర్టులకు సంబంధించిన ఏడున్నర కోట్లకు పైగా రికార్డులతో కూడిన డేటాబేస్ ఏర్పాటైంది. ఆయా న్యాయస్థానాల్లో ట్రయల్ పెండింగ్, ట్రయల్ దశ, వీగిపోయిన, శిక్షపడిన, రాజీ కుదిరిన కేసుల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. దీని ఆధారంగానే ‘వెరిఫై’ సాఫ్ట్‌వేర్‌ను రూపొం దించారు. ఆయా కేసుల్లో నిందితులుగా, పిటిషనర్లుగా ఉన్న వారి పేర్లు, ఇతర వివరాలతో కూడిన ప్రత్యేక డేటాబేస్కు సెర్చ్ ఇంజన్ అనుసంధానించారు. ఓ వ్యక్తి పేరు ఎంటర్ చేసి, సెర్చ్ చేస్తే చాలు... దేశ వ్యాప్తంగా అతడిపై ఉన్న కేసుల వివరాలు, వాటి పూర్వాపరాలు నిమిషాల్లో తెలిసిపోతాయి. ట పోలీసు డేటాతో అనుసంధానం... పోలీసు విభాగానికి పూర్తిస్థాయిలో ఉపయుక్తంగా ఉండాలంటే ఈ వెరిఫై సాఫ్ట్‌వేర్‌లో మరిన్ని వివరాలతో కూడిన డేటాబేస్ అవసరమని నగర పోలీసు విభాగం నిర్ణయించింది. దీనికోసం పోలీసు డేటాతోనూ అనుసంధానం చేయడానికి కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే గడిచిన ఏడేళ్ల గణాంకాలను విశ్లేషించి, క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు క్రిమినల్ డేటాబేస్‌ను ఏర్పాటు చేశారు. రిపీటెడ్ అఫెండర్స్ (పదే పదే నేరాలు చేసే వారు)లో ఒక్కొక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. దీన్నే సాంకేతికంగా మోడెస్ ఆపరెండీ అంటారు. దీని ఆధారంగానూ ప్రాథమిక జాబితాను రూపొందించారు. దీన్నే మరిం తగా విశ్లేషిస్తూ ఆయా నేరగాళ్లలో ఇప్పటి వరకు ఎవరు ఎన్నిసార్లు అరెస్టయ్యారు? ఆ కేసులు ఏ కోర్టులో, ఏ స్థితిలో ఉన్నాయి? అనేవి తయారు చేస్తున్నారు. కేవలం నగరానికి సంబంధించిన వివరాలే ప్రస్తుతం అందుబాటులో ఉండగా... ఈ నేరగాళ్లపై ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేసుల్నీ ఈ సాఫ్ట్వేర్ ద్వారా అప్డేట్ చేయాలని నిర్ణయించారు. ఈ మొత్తం డేటాబేస్‌ను ‘వెరిఫై’తో అనుసంధానిస్తారు. ఇంట్రానెట్ ద్వారా అన్ని ఠాణాలకు... ‘వెరిఫై’ని అన్ని పోలీసుస్టేషన్లకూ కనెక్టివిటీ కలిగి ఉండే ఇంట్రానెట్‌తో అనుసంధానించారు. ఫలి తంగా ప్రస్తుతం ఒకచోట మాత్రమే ఉంటున్న ఈ డేటా డివిజన్, జోనల్, పోలీసుస్టేషన్లతో పాటు ప్రత్యేక విభాగాలకూ అందుబాటులోకి వచ్చిం ది. ప్రస్తుతం నగర పోలీసులు నేరగాళ్లపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగిస్తున్నారు. ఇలా చేయాలంటే సదరు నేరగాడిపై మూడు, అంతకు ఎక్కువ కేసులుండాలి. అయితే నగరంలో చిక్కుతున్న ఇతర రాష్ట్రాల వారి గత చరిత్ర తెలియకపోవడం అనేక మంది తప్పించుకుంటున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఇది సాధ్యమవుతుందని అధికారులు చెప్తున్నారు. ఈ సాఫ్ట్‌వేర్‌తో ఎస్బీ విభాగం పాస్పోర్ట్స్ వెరిఫికేషన్ పక్కాగా చేయడానికి వీలుకలిగింది. వెరిఫికేషన్ సైతం తేలిగ్గా.... పూర్తిస్థాయిలో అప్డేట్ అయిన ‘వెరిఫై’ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వస్తే పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి తక్షణం అవి అం దించే అవకాశం ఏర్పడుతుంది. దీనికంటే ముఖ్యంగా ఎలాంటి లోటుపాట్లకు ఆస్కారం లేకుండా పటిష్టమైన నివేదికలు రూపొందించి దరఖాస్తుదారులకు ఉద్యోగాలు ఇచ్చే వారికి సమర్పించే అవకాశం చిక్కుతుంది. బయటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెక్యూరిటీ గార్డులుగా, పని మనుషులుగా, డ్రైవర్లుగా చేరే వారు పలు నేరాలు చేసిన సందర్భాలున్నాయి. ఇలాంటి వారిలో అత్యధిక శాతం నేర చరిత్ర కలిగిన వారే ఉంటున్నారు. ‘వెరిఫై’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే యజమానులు సైతం పోలీసులను ఆశ్రయించి తమ వద్ద ఉద్యోగాల్లో చేరే వారి వివరాలను సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎన్బీడబ్ల్యూలను ‘దాచలేరు’... క్షేత్రస్థాయిలో ఉండే పోలీసుల పని తీరును కొలవడంలో నాన్-బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీ డబ్ల్యూ) ఎగ్జిక్యూషన్ సైతం ప్రధానమైంది. కోర్టుల్లో కేసుల విచారణ త్వరితగతిన సాగాల న్నా, పెండెన్సీ తగ్గాలన్నా ఎన్బీడబ్ల్యూలు పెండింగ్‌లో లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఈ నేపథ్యంలోనే నిత్యం ఉన్నతాధికారులు వీటి పెండెన్సీని పర్య వేక్షిస్తుంటారు. దీనికోసం ఇప్పటి వరకు ప్రత్యేక సాంకేతిక విధానం అందుబాటులో లేదు. దీంతో పోలీసుస్టేషన్లకు చెందిన అధికారులు చెప్తున్న గణాంకాల పైనే ఆధారపడాల్సి వస్తోం ది. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఐటీ సెల్ ఈ ‘వెరిఫై’లో వారెంట్స్ కోసం ఓ కార్నర్ ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలు తెలియకున్నా... ఎవరి వివరాలైతే తెలుసుకోవాలని పోలీసులు భావి స్తున్నారో వారి పూర్తి పేరు, ఇతర వివరాలు తెలియకున్నా ‘వెరిఫై’ ద్వారా సెర్చ్ చేయవచ్చు. అయితే అతడి పేరుతో కొంత భాగాన్ని మాత్రమే టైప్ చేసి ప్రయత్నిస్తే వచ్చే రికార్డుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. పేరు, చిరునామా, కేసు నమోదైన చట్టాలు, కేసు తరహా, ఫైలింగ్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ల్లో ఏ ఒక్కటి తెలిసినా ఈ సెర్చ్ తేలికై డాక్యుమెంట్లను వీలైనంత త్వరగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాల్లోని కోర్టుల్లో ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల స్థితిగతుల్నీ తెలుసుకునే అవకాశం ఇందులో ఉంది. -
వాట్ అయామ్ సేయింగ్..
గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో పుష్కరయాత్రికుల హడావుడి కన్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హడావుడి ఎక్కువైందట. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీల పేరుతో ఆయన చేసే హడావుడితో అధికారుల మైండ్లు బ్లాంక్ అయ్యాయట. ఇటీవల చంద్రబాబు అర్ధరాత్రి పూట రాజమండ్రిలోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రయాణికులకు సౌకర్యాలు ఎలా అందుతున్నాయో తెలుసుకునేందుకు ఈ తనిఖీని చేపట్టారు. ఆయన బస్టాండులో ఉన్న సమయంలోనే పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోని మైసూరు నుంచి పుష్కరాలకు వచ్చిన యాత్రికులు బస్సులు అందుబాటులో లేక తాము పడుతున్న ఇబ్బందులను కన్నడంలో సీఎంకు వివరించటం ప్రారంభించారు. విషయం అర్థమైన ఒక అధికారి సీఎంకు చెప్పారు. దాంతో సీఎం తన పక్కనే ఉన్న ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరికి వెంటనే మైసూరుకు ప్రత్యేక బస్సు ఒకటి వేయమని ఆర్డర్ వేశారట. మైసూరుకు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుగా అనుమతులున్న బస్సునే వేయాలని, ఏ బస్సు పడితే ఆ బస్సు వేస్తే ఇబ్బందులు వస్తాయని క్షుణ్ణంగా వివరించారట. ఇవేవీ పట్టించుకోని సీఎం నేను చెబితే కనీసం ఒక్క బస్సు కూడా వెయ్యకపోతే ఎలా అని కస్సుబుస్సులాడారట. నిబంధనలన్నీ చెప్పి ఆయన్ను ఒప్పించేందుకు ఆర్టీసీ అధికారులకు ప్రాణం పోయినంత పనైందట. అంతా విన్న తరువాత మరి వీరిని మైసూరుకు ప్రత్యేక బస్సు వేసి పంపిస్తున్నారా అని సీఎం ప్రశ్నించటంతో ఏమి చెప్పాలో అర్థం కాని అధికారులు... ఇప్పటికిప్పుడు మైసూరు బస్సు వేయటం కుదరదు, మాకు ఉన్న అధికారాల ఆధారంగా తిరుపతి వరకూ ప్రత్యేక బస్సు వేస్తాం, అక్కడి నుంచి వారిని బెంగళూరు వెళ్లి, అటు నుంచి మైసూరు వెళ్లమనండని చెప్పి ఆ బస్సులో ఎక్కి పంపించి ఊపిరి పీల్చుకున్నారట. -
బోగస్ రోల్‌పై కలెక్టర్ ఆగ్రహం
చీరాల: కలెక్టర్ సుజాత శర్మ బుధవారం పట్టణంలో పలు ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రీన్‌పార్క్ పనుల పరిశీలనకు చీరాల వచ్చిన ఆమె స్థానిక ఏఆర్ఎం ైెహ స్కూల్‌ను తనిఖీ చేశారు. హాజరు పట్టికలో విద్యార్థుల హాజరు అధికంగా నమోదై ఉండగా..క్లాసు రూంలో మాత్రం విద్యార్థులు లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరులో 50 శాతం వ్యత్యాసం ఉండటంతో తీరు మార్చుకోవాలని ఉపాధ్యాయులను హెచ్చరించారు. అలానే కస్తూరిబా మున్సిపల్ బాలికల పాఠశాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం సుద్దగా ఉండటంతో కుకింగ్ ఏజెన్సీని ప్రశ్నించారు. బియ్యం మంచిగా లేకపోవడం వలన అన్నం సుద్ద అవుతుందన్నారు. కలెక్టర్ విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పారిశుధ్యంపై అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి... చీరాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ పారిశుధ్య నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య కార్మికులు సమ్మెలో ఉన్న కారణంగా పట్టణంలో పారిశుధ్య పనులు ఏవిధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం క్షీణించకుండా అన్ని చర్యలు తీసుకోవాలి సూచించారు. అవసరమైతే కొత్త సిబ్బందిని నియమించుకోవాలన్నారు. డ్రైవర్ల అవసరముంటే ఆర్టీసీ అధికారుల సహకారం తీసుకోవాలన్నారు. కలెక్టర్ వెంటే ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డీఈవో రామలింగేశ్వరరావు, మున్సిపల్ డీఈ మాల్యాద్రి, తహశీల్దార్ సత్యనారాయణ, ఎంఈవో విశాలాక్షి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో విజిలెన్స్ తనిఖీలు
కరీంనగర్ హెల్త్ : కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో వైద్య విధాన పరిషత్ విజిలెన్స్ ప్రత్యేకాధికారి రాజశేఖర్‌బాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ, మౌలిక సౌకర్యాల కొరతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ విభాగం, ఎమర్జెన్సీ విభాగం, క్యాజువాలిటీ, మందుల సబ్ స్టోర్స్, మెటర్నిటీ లేబర్ వార్డు, మెటర్నిటీ వార్డును తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. జగిత్యాలకు చెందిన పత్తి లక్ష్మి అనే గర్భిణిని వైద్యసిబ్బంది పనితీరు, అందుతున్న వైద్యసేవలు, ప్రభుత్వ పథకాల గురించి అడిగారు. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు అయితే ఎన్ని డబ్బులు ఇస్తారో తెలుసా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పథాకాలకు సంబంధించిన వాటి గురించి సిబ్బందిని ప్రశ్నించగా వాటి గురించి తెలియదని చెప్పారు. వైద్య సిబ్బందికే అవగాహన లేకపోతే ప్రజలకు ఎలా వివరిస్తారని, ప్రభుత్వ పథకాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నారు. ఓపీ విభాగంలో ఔట్ పేషెంట్లకు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులోని రెఫరల్ రిజిస్టర్, మందుల స్టాక్ వివరాల రిజిస్టర్‌ను గురించి ప్రశ్నించారు. రిజిస్టర్ చూపించడంలో అందులో ఈ వివరాలు లేకపోవడంతో మండిపడ్డారు. కనీసం రాత్రి వాడిన మందుల వివరాలు ఎక్కడ రాశారో చెప్పాలని కోరగా వాటి వివరాలు రిజిస్టర్లో వెతుకుతూ కాలయాపన చేశారు. మందుల స్టోర్ ఎక్కడుందని అడిగి ఫ్రీజ్ను తనిఖీ చేశారు. ఫ్రీజ్‌లో 361 నెంబర్‌తో ప్లడ్ శాంపిల్ ఉండగా, దానికి సంబంధించిన వివరాలు అడిగితే సిబ్బంది సమాధానం చెప్పలేదు. ప్రైవేటు ఆస్పత్రికి సంబంధించిన శాంపిల్ ఇక్కడ భద్రపర్చినట్లు తెలుస్తోంది. మూతలు ఓపెన్ చేసిన, సగం వరకు మాత్రమే వాడిన మందులు ఉండటాన్ని గమనించి ఎందుకు ఇలా ఉంచారని, ఖర్చుతో కూడిన విలువైన మందులు వృథా చేయడంపై వివరణ కోరారు. ఫ్రీజర్‌లో ఎక్స్పైరీ అరుున మందులు ఉండటంపై వివరణ ఇవ్వాలని కోరారు. లక్షల రూపాయల విలువైన మందులు, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని, నర్సులు బాధ్యతగా పనిచేయడం లేదని, అందుకు ఆర్ఎంఓ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సిబ్బందిపై అధికారుల పర్యవేక్షణ కొరవడినట్లు కనిపిస్తోందని, హోటల్ నిర్వహణ ఇంతకంటే బాగా ఉంటుందని సిబ్బందిని హోటల్ సర్వర్‌తో పోల్చారు. సబ్ స్టోర్‌లో స్టాక్ రిజిస్టర్లో ఎక్కడా ఆర్ఎంఓ సంతకం లేదని, స్టోర్స్‌ను తనిఖీ చేసిన దాఖలాలు కనిపించడం లేదని మండిపడ్డారు. మూడు నెలల నుంచి స్టోర్స్‌లో రికార్డులు రాయకపోతే మీరు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎవరి పనులు వారు చేసుకోవాలని బాధ్యత మరిచి ప్రవ ర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వార్డులోని టాయిలెట్స్‌ను పరిశీలించి రూ.10 బల్బు పెట్టలేని దుస్థితిలో జిల్లా ప్రభుత్వాస్పత్రి ఉందా అంటూ అసహనం వ్యక్తం చేశారు. అత్యవసర ఖర్చుల కోసం లక్షల నిధులు ఉన్నా వాటిని వాడుకోవడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు సిబ్బంది పనితీరు, వసతుల గురించి ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు. సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణలో పూర్తిగా లోపం కనిపిస్తోందన్నారు. ఉద్యోగులు సమయ పాలన పాటించడం లేదని, ఓపీలో కీలకమైన రిజిస్టర్ లేదని పనిష్మెంట్ కంటే సమస్య పరి ష్కారం ముఖ్యమని భావిస్తున్నామని అన్నారు. సిబ్బం ది కొరత ఉంద ని, డ్రైనేజీ నిర్మా ణం సరిగ్గా లేదని, పారిశుధ్యం మరింత మెరుగుపడాలన్నారు. త్వరలోనే మెటర్నిటీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ప్రారంభం అవుతుందన్నారు. దీంతో సిబ్బంది కొరత తీరి మెరుగైన సేవలు అందుతాయన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో అత్యవసర ఖర్చుల కోసం రూ.28 లక్షల 72 వేల నిధులు ఉన్నాయని తెలిపారు. -
ఆ ఇళ్లను తనిఖీ చేయండి
డిప్యూటీ కమిషనర్లకు స్పెషలాఫీసర్ ఆదేశం ఆధార్ అనుసంధానంపై సమీక్ష సిటీబ్యూరో: తాళాలు ఉన్న ఇళ్లను తనిఖీ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 17.91 శాతం ఓటర్ల సమాచారం లేదన్నారు. ఆధార్‌తో ఓటరు కార్డుల అనుసంధానంపై శుక్రవారం డిప్యూటీ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆధార్ అనుసంధానానికి 73.51 లక్షల మంది అర్హులు కాగా... వారిలో 57.75 లక్షల మంది పరిశీలన పూర్తయిందన్నారు. 10.34 లక్షల మందికి సంబంధించి ఇంటికి తాళాలు ఉన్నాయన్నారు. చిరునామా మార్పులు, తాళాలున్న ఇళ్లకు సంబంధించి డిప్యూటీ కమిషనర్లు స్వయంగా తనిఖీలు చేయాలని సూచించారు. అప్పటికీ ఓటర్ల సమాచారం లేనట్లయితే ఆ వివరాలను రాజకీయ పార్టీలకు అందజేయాలని సూచించారు. వీరిని జాబితాలోంచి తొలగించేందుకు నోటీసులు జారీ చేయాలన్నారు. పరిశీలన పూర్తయిన వారిలో కేవలం 20.28 లక్షల మందివి మాత్రమే ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం జరిగిందని చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. దీనిపై అశ్రద్ధ చూపే బూత్‌లెవెల్ అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 17 నుంచి స్వచ్ఛ కమిటీల పర్యటన గ్రేటర్‌లోని 400 యూనిట్లకు ప్రభుత్వం నియమించిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన స్వచ్ఛ కమిటీలు ఈనెల 17వ తేదీ నుంచి స్థానికంగా పర్యటిస్తాయని సోమేశ్‌కుమార్ తెలిపారు. అంతకుముందే సంబంధిత అధికారులు గుర్తించిన సమస్యలను పరిష్కరించాలన్నారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను రోజూ ఉదయం పూట తనిఖీ చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ కమిటీలోకి మరిన్ని అంశాలు స్వచ్ఛ హైదరాబాద్‌కు సంబంధించి ప్రభుత్వ విభాగాల వారీగా ఏర్పాటు చేసిన కమిటీల్లో జీహెచ్ఎంసీ కమిటీని మరింత విస్తరించారు. ఈ కమిటీలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డులకు సంబంధించిన అంశాలున్నాయి. ట్రాఫిక్, ల్యాండ్ రెవెన్యూకు సంబంధించిన అంశాలను కూడా చేర్చారు. ఈమేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం జీవో జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిటీలో ఇప్పటికే ఉన్న ప్రతినిధులతోపాటు అదనంగా ఎమ్మెల్సీ ఎం.డి.సలీం పేరును చేర్చారు. -
విద్యుత్ ఆదాపై అవగాహన ఉందా?
అసలే ఎండాకాలం. కాసేపు కరెంట్ పోయినా, ఇష్షోయిష్షోమని నిట్టూర్పులు విడుస్తాం. తీరా కరెంటు బిల్లు కట్టాల్సి వచ్చేసరికి షాక్ కొట్టినట్టుగా ఫీలవుతాం. అలా కాకుండా, విద్యుత్ ఆదా చేసే చిట్కాలు తెలిస్తే చిన్న చిన్న చిల్లర కాసులే శ్రీమహాలక్ష్మి అయినట్లు డబ్బు ఆదా ఆవుతుంది. పర్యావరణానికీ బోలెడంత మేలు. మీరు ఆ చిన్న పనులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి. 1. టీవీ ఆఫ్ చేశాక ఇక ఆరోజుకు చూడం అనుకున్నా టీవీ ప్లగ్ తీసేయరు. ఎప్పుడు టీవీకి పవర్ ఆన్‌లో ఉంచి రిమోట్‌తోనే ఆన్ చేస్తారు. ఎ. అవును బి. కాదు 2. కంప్యూటర్ ఆన్ చేసే ఉంచి స్క్రీన్ సేవర్‌లో కరెంట్ తక్కువే కాలుతుంది కదా అని అలాగే వదిలేస్తారు. ఎ. అవును బి. కాదు 3. మొబైల్ ఛార్జ్ చేశాక, ప్లగ్ తీసేయకుండా అలాగే ఉంచేస్తారు. ఎ. అవును బి. కాదు 4. తక్కువ కరెంటే కదా కాలేది... అని బాత్రూమ్లో, ఇంటివెనకాల ఉన్న జీరో వాట్ బల్బ్స్ ఆర్పకుండా పొద్దుగూకులూ అలాగే ఉంచేస్తారు. ఎ. అవును బి. కాదు 5. మీరు ఇంటిలో ఉన్నంతసేపూ ఫ్యాన్, టీవీ, ఏసీ/కూలర్, సిస్టమ్ ఆన్‌లో ఉండాల్సిందే! ఎ. అవును బి. కాదు పై వాటిలో మూడింటికి అవును అన్నది మీ సమాధానమైతే విద్యుత్ ఆదా విషయంలో దృష్టిసారించడం లేదని అర్థం. అలా కాకుండా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీ పర్సుతోపాటు పర్యావరణానికి మేలే! సెల్ఫ్ చెక్ -
చీరాల పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఐజీ
ప్రకాశం: ఆకస్మిక తనిఖీల్లో భాగంగా గుంటూరు రేంజ్ ఐజీ సంజయ్ బుధవారం చీరాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహంగా మెలగాలన్నారు. అనంతరం స్టేషన్లో మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ట్యాక్సీకంపెనీల యాప్స్‌కు చెక్
-
రైల్వే జీఎంకు ఘన స్వాగతం
విజయవాడ : దక్షిణ మధ్య రైల్వే జీఎం పీకే శ్రీవాస్తవకు రైల్వే ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గూడూరు నుంచి తెనాలి వరకు ఉన్న ముఖ్యమైన స్టేషన్లను జీఎం శుక్రవారం తనిఖీ చేశారు. ప్రయాణికులకు కల్పిస్తున్న సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ రైల్వేస్టేషన్లో కొద్దిసేపు ఆగి విలేకరులతో మాట్లాడారు. స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి జీఎంకు డీఆర్ఎం ప్రదీప్‌కుమార్ వివరించారు. జీఎం రాకను పురస్కరించుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. రైల్వే జీఎంకు స్వాగతం పలికిన వారిలో ఏడీఆర్ఎం ఎన్ఎస్ఆర్ ప్రసాద్, సీనియర్ డీసీఎం ఎన్వీ సత్యనారాయణ, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. జీఎంతోపాటు ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ ఎస్ఎన్ సింగ్, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎస్కే ఝా, చీఫ్ కమర్షియల్ మేనేజర్ జి.లక్ష్మినారాయణ, చీఫ్ ఎలక్రికల్ ఇంజినీర్ జేఎన్పీ సింగ్, చీఫ్ మెకానిల్ ఇంజినీర్ కబీర్ అహ్మద్, చీఫ్ సిగ్నలింగ్ ఇంజినీర్ మబూబ్ ఆలీ వచ్చారు. -
నగరంపై నజర్
అటు కలెక్టర్... ఇటు కమిషనర్ తనిఖీలతో హడలెత్తించిన ‘బాస్’లు హైరానా పడ్డ బల్దియూ అధికారులు, సిబ్బంది వరంగల్ అర్బన్ : జిల్లా కలెక్టర్, బల్దియా ప్రత్యేకాధికారి వాకాటి కరుణ, కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ నగర సమస్యలపై దృష్టి సారించారు. ఇప్పటికే పలుమార్లు పలు ప్రాంతాలను సందర్శిం చారు. తాజాగా మంగళవారం ఉదయం తనిఖీలతో హడలెత్తించారు. కాలనీల్లో పర్యటనలు చేసి బల్దియా అధికారుల గుండెల్లో గుబులు పుట్టించారు. వారు ఎప్పుడు, ఏ కాలనీని సందర్శిస్తారో తెలియక బల్దియా అధికారులు, సిబ్బంది హైరానా పడ్డారు. హన్మకొండలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్, కాజీపేటలోని పలు కాలనీల్లో కమిషనర్ ప్రజా క్షేత్రంలో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను సావధానంగా విన్నారు. కొన్ని సమస్యలకు అక్కడికకక్కడే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. నిధులతో ముడిపడి ఉన్న అభివృద్ధి పనులను దశల వారీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మురికి కూపాలుగా మారిన ఖాళీ స్థలాలు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, తాగునీటి పైపులైన్ల లీకేజీలు, అధ్వానంగా తయారైన రహదారులు,డ్రెరుునేజీలు, అక్రమ కట్టడాలు, కబ్జాలు, భవనాల అనుమతులు, ఆస్తి పన్ను మదింపు, మంచినీటి సరఫరా తీరుతెన్నులను వారు పరిశీలించి పలు సూచనలు చేశారు. రోడ్డుపై చెత్త వేస్తే రూ.500 జరిమానా : కలెక్టర్ రహదారులపై చెత్త వేస్తే రూ. 500 జరిమానా వసూలు చేయాలని కలెక్టర్ వాకాటి కరుణ అధికారులను అదేశించారు. రెడ్డికాలనీలోని ఓ రోడ్డు మొత్తం చెత్తాచెదారంతో నిండి ఉండడాన్ని గమనించిన ఆమె.. బల్దియూ సిబ్బందితోపాటు స్థానిక ప్రజల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కనీస జ్ఞానం లేకుండా రోడ్డుపై ఇలా చెత్త పోస్తే ఎలా? అంటూ అక్కడ ఉన్న ప్రజలను పిలిచి మందలించారు. రోడ్డుపై, ఖాళీ స్థలాల్లో చెత్త వేస్తే రూ.500 జరిమానా వసూలు చేయాలని బల్దియా ఎంహెచ్ఓ ధన్‌రాజ్‌ను కలెక్టర్ ఆదేశించారు. అంత ర్గత రహదారి పక్కన ఉన్న చేతి పంపు నీరు కాల్వలోకి వెళ్లకుండా చెత్త పేరుకుపోవడంతో మురుగు నీరంతా రోడ్డుపై పారుతుండడాన్ని పరిశీలించిన కలెక్టర్ వెంటనే శుభ్రపర్చాలని సిబ్బందికి సూచించారు.రాంనగర్ టవర్స్ వెనుక వైపు క్రాంతినగర్ కాలనీ వద్ద నిర్మించిన బాక్స్ డ్రెరుునేజీ ఇరుకుగా ఉండడంతో మురుగునీరు నిలుస్తోందంటూ తమ సమస్యలను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. కాలనీ సొసైటీకి చెందిన స్థలాన్ని ఓ రిటైర్డ్ ఉద్యోగి ఆక్రమించుకోవడంతో బాక్స్ డ్రైయినేజి విస్తరణ జరగడం లేదని వివరించారు. ఈ మేరకు విచారణ జరిపి చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. ఖాళీ స్థలాల్లో చెత్త పోయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అక్రమ కట్టడాలను ఉపేక్షించొద్దు : కమిషనర్ విధుల పట్ల అంకిత భావం ఉండాలి. ఏదైనా పని ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు పట్టుదలతో ముందుకు సాగాలి. నగర ప్రజల అదరాభిమానాలను పొందాలి.’ అని నగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులకు క్లాస్ తీసుకున్నారు. ఉదయం ఆయన ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, ప్రజారోగ్యం, అర్బన్ మలేరియా, పన్నులు తదితర విభాగాల అధికారులు,సిబ్బందితో కలిసి కాజీపేట 36వ డివిజన్లోని ప్రశాంత్ నగర్, చైతన్యపురితోపాటు పలు కాలనీలను కలియతిరిగారు. కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త చెదారం, రహదారుల్లో చెత్త కుప్పలు, పూడిక తీయని మురికి కాల్వలు, దోమల సమస్యపై ప్రజలు ఫిర్యాదు చేశారు. పరిశీలనల అనంతరం పజారోగ్యం అధికారులు, సిబ్బందిని కమిషనర్ మందలించారు. మారోమారు ప్రజల నుంచి ఫిర్యాదులు రావద్దని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానికంగా ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించుకుని నిర్మాణాలు చేస్తున్నారని కాలనీవాసి ఫిర్యాదు చేయగా... ఈ విషయంపై టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద సమాచారం తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే కూల్చివేయాలని ఆదేశించారు. అక్రమ కట్టడాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు. కాగా, కాలనీల్లో నెలకొన్న చెత్త ఇతరత్రా సమస్యలకు సంబంధించి కమిషనర్ తన సెల్ ఫోన్లో చిత్రీకరించారు. -
పద్ధతి మార్చుకోండి
అధికారులకు సీఎం హెచ్చరిక నగరంలో చంద్రబాబు మూడు గంటల పర్యటన మున్సిపల్ కమిషనర్, మేయర్‌కు వార్నింగ్ ప్రభుత్వాస్పత్రి అధికారులపై ఆగ్రహం విజయవాడ : ‘నేను నగరంలో ఉన్నప్పుడే ఇలా ఉంది.. లేకపోతే ఇంకెలా ఉంటుందో.. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. ఈ రోజు నుంచి మీరు, మేయర్ ఉదయం ఆరు గంటలకు రోడ్లపైకి వచ్చి నగరంలోని శానిటేషన్‌ను మెరుగుపరచాలి. మీ సిబ్బంది అందరినీ రోడ్లపైకి తీసుకురండి. రాజధాని నగరం ఇలాగేనా ఉండేది.. ఐదారుసార్లు నగరంలో పర్యటించి ప్రక్షాళన చేస్తా..’ అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్, మేయర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు. ‘నేను ఆస్పత్రికి వచ్చినప్పుడు కూడా మీరు ఆలస్యంగా వస్తారా.. ఇప్పటివరకు ఎక్కడ ఉన్నారు.. మీకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తా. మీ భార్యాపిల్లలకు కష్టం వస్తే తెలుస్తుంది.. మర్యాదగా చెబుతున్నా.. మీరు అలవాట్లు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటా..’ అంటూ పాత ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు విభాగం ఆర్ఎంవో డాక్టర్ రవికుమార్, డెప్యూటీ సూప రింటెండెంట్ రమేష్‌లపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి శనివారం ఉదయం సుమారు మూడు గంటలపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. అతిథి గృహం నుంచి బయలుదేరి... ముఖ్యమంత్రి తొలుత రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఓపెన్ టాప్ జీప్‌లో స్క్యూబ్రిడ్జి వద్దకు వెళ్లారు. అనంతరం రామలింగేశ్వరనగర్‌లోని కృష్ణానది కరకట్ట నిర్మించే ప్రాంతాన్ని పరిశీలించారు. కార్పొరేటర్ ఉమ్మడిశెట్టి బహుదూర్, స్థానికులు పంచకర్ల సాయికుమారి, సుధారాణిలతో పాటు పలువురు స్థానికులు చెప్పిన సమస్యలు విని మురుగు నీటి సమస్య పరిష్కారం కోసం రూ.52 కోట్లతో మంచినీటి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాల్వల పరిశీలన. జాతీయ రహదారి మీదుగా బందరు కాల్వ, రైవస్ కాల్వలను సీఎం పరిశీలించారు. నగరంలో కాల్వల ద్వారా జల రవాణా, ఆధునీకరణ తదితర అంశాలను ముఖ్యమంత్రికి మంత్రి దేవినేని ఉమా వివరించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద కాల్వగట్లను పరిశీలించిన చంద్రబాబు చెత్తాచెదారంతో నిండి ఉండటంతో మున్సిపల్ కమిషనర్ హరికిరణ్, మేయర్ కోనేరు శ్రీధర్లపై సీరియస్ అయ్యారు. ‘కాల్వగట్లను ఇలాగేనా ఉంచేది.. నేను వచ్చి చెప్పేదాకా బాగుచేయారా..’ అంటూ నిలదీశారు. ప్రభుత్వాస్పత్రి అధికారులపై ఫైర్ : పాత ప్రభుత్వాస్పత్రిలోని మాతాశిశు విభాగాన్ని సీఎం తనిఖీ చేశారు. నూజివీడు మండలం యనమందల గ్రామానికి చెందిన ముళ్లపూడి శ్రావణి అనే మహిళ తన బిడ్డకు కడుపులో చీము చేరిందని, వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేవని చెప్పగా, రూ.7 వేలు అందజేయాలని కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. తమకు వైద్యం సరిగా అందడం లేదని, ఒకే బెడ్డుపై ఇద్దరు బాలింతలను పడుకోబెడుతున్నారని, డెలివరీ చేస్తే సిబ్బంది రూ.500 డిమాండ్ చేస్తున్నారని, మందులు సరిగా ఇవ్వడం లేదని, కూర్చునేందుకు బెంచీలు కూడా లేవని పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆస్పత్రి డెప్యూటీ సూపరింటెండెంట్, ఆర్‌ఎంవోలపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ప్రసూతి విభాగంలో ప్రసవించి అనారోగ్యంతో ఉన్న పిల్లలకు రూ.5 వేలు చొప్పున అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. టీడీపీ నేత దివి ఉమామహేశ్వరరావు చైర్మన్‌గా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నియమిస్తామని చెప్పారు. కలెక్టర్, ఆస్పత్రి అధికారులు కలిసి అభివృద్ధి చేయాలని, ఇందుకోసం తొలుత రూ.5 కోట్లు ఇస్తానని సీఎం పేర్కొన్నారు. డబ్బులు డిమాండ్ చేసే వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆరు నెలల్లో ఆస్పత్రిలో సమూల మార్పు రావాలన్నారు. వైఎస్సార్ కాలనీని చూడకుండానే.. : అక్కడ నుంచి జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీని సందర్శించాలని అధికారులు నిర్ణయించారు. చిట్టినగర్ వద్దకు చేరుకునేసరికి చంద్రబాబు మనసు మార్చుకున్నారు. దీంతో సమయం లేక పర్యటనను కుదించారని అధికారులు ప్రకటించారు. -
ఐటీఐల్లో ఎమ్మెల్యే తనిఖీ
పోచమ్మమైదాన్ : వరంగల్ ములుగు రోడ్డులోని వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రభుత్వ ఐటీఐలను ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ఐటీఐల్లోని సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. అలాగే, ఆర్‌అండ్‌ఏసీ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేస్తుండగా వారితో కలిసి ఎమ్మెల్యే కాపర్ పైప్ కటింగ్ చేసి కాపర్ ట్యూబ్‌ను షేరింగ్ చేశాడు. ఆ తర్వాత వరంగల్ ఐటీఐ ఆవరణలో ఎన్సీసీ కేడెట్ల శిక్షణ జరుగుతుండగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యేకు కేడెట్లు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా టాయిలెట్లు, తాగునీటికి ఇబ్బంది ఉందని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు స్పం దించిన వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో ఐటీఐ విద్యార్థుల్లో అభద్రతా భావం నెలకొందన్నారు. అయితే, ప్రస్తుత రాష్ర్టప్రభుత్వం త్వరలోనే వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుందని వివరిం చారు. అలాగే, ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు తన నిధులు విడుదల చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఐఓ ఎల్లయ్య, వరంగల్ ఐటీఐ ప్రిన్సిపాల్ సాంబారి సుదర్శన్, హన్మకొండ ఇన్చార్జ ప్రిన్సిపాల్ అశోక్‌కుమార్, టీఎన్జీవోస్ టెక్నికల్ విభాగం అధ్యక్షుడు పీవీ.రావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఓంకార్, శ్రీనివాసచారి, సత్యనారాయణ, సక్రూ, ప్రమోద్‌రెడ్డి, చంద్రశేఖర్, ఉమారాణి పాల్గొన్నారు. -
ఆకతాయిల వేధింపులకు ఇక చెక్!
-
పాలిటెక్నిక్‌లలోనూ ‘టాస్క్‌ఫోర్స్’తనిఖీలు!
174 ఇంజనీరింగ్ కాలేజీల్లో నడుస్తున్న పాలిటెక్నిక్‌లపై దృష్టి బోధన సిబ్బంది, వలిక వసతులపై పరిశీలన హడలిపోతున్న ప్రైవేటు యాజమాన్యాలు హైదరాబాద్: ఇక పాలిటెక్నిక్‌ల పరిస్థితిపై తెలంగాణ సాం కేతిక విద్యాశాఖ దృష్టి సారించింది. ప్రత్యేక ‘టాస్క్‌ఫోర్స్’ను ఏర్పాటు చేసి, అన్ని ప్రైవేటు పాలిటెక్నిక్ లను తనిఖీ చేయాలని అధికారులు యోచిస్తున్నారు. లోపాలున్నాయన్న కారణంతో ఈ ఏడాది 174 ఇంజనీరింగ్ కళాశాలలకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. జేఎన్టీయూహెచ్ అధికారులు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే.. తమ కళాశాలల్లోని పాలిటెక్నిక్‌లలో ‘టాస్క్‌ఫోర్స్’ తనిఖీలకు రానుందని తెలిసి ప్రైవేటు యాజమాన్యాలు హడలిపోతున్నాయి. బోధనా సిబ్బందే కీలకం: రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 467 పాలిటెక్నిక్‌లు ఉండగా, వీటిలో 239 పాలిటెక్నిక్‌లు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో షిప్టు పద్ధతిన నడుస్తున్నాయి. అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు ఏఐసీటీఈ అనుమతులున్నప్పటికీ, విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా బోధనా సిబ్బంది లేకపోవడమే పెద్దలోపంగా అధికారులు భావిస్తున్నారు. 174 కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరత ఉన్నట్లు జేఎన్టీయూహెచ్ గుర్తించి అఫిలియేషన్ నిలిపి వేయడంతో.. వాటిలో నడుస్తున్న పాలిటెక్నిక్‌ల తనిఖీలకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. పరిశీలన అవసరమే:వెంకటేశ్వర్లు, ఎస్బీటీఈటీ కార్యదర్శి పాలిటెక్నిక్‌లకు అఫిలియేషన్ ఇచ్చే సమయంలో ఆయా సంస ్థల్లో వసతులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. ఇంజనీరింగ్ కళాశాలకు ఉండాల్సిన వసతుల్లో సగం ఉన్నా పాలిటెక్నిక్ నిర్వహణకు సరి పోతుంది. అఫిలియేషన్ ఇచ్చే సమయంలో చిన్నచిన్న లోపాలున్నట్లు అధికారులు గుర్తిస్తే, సవరించుకుంటామని యాజమాన్యాల నుంచి హామీ తీసుకుంటాం. ఇటీవల లోపాలున్నాయం టూ కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ నిలిపి వేయడంతో, వాటిలో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్‌లను పరిశీలించాల్సిన అవసరమైతే ఉంది. దీనిపై సాంకేతిక విద్యా కమిషనర్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
పొరపాట్లకు తావు లేకుండా పింఛన్ తనిఖీ
వల్లూరు: సామాజిక పెన్షన్ల తనిఖీ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కేవీ. రమణ పేర్కొన్నారు. వల్లూరులోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగుతున్న సామాజిక పెన్షన్ల తనిఖీ కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తనిఖీని పరిశీలించి , సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఆధార్ కార్డు అను సంధానం చేసి అర్హులందరికీ పెన్షన్ అందేలా చూడాలని చెప్పారు.వయస్సులో తేడాలకుసడలింపు ఇవ్వండి పెన్షన్ దారుల వయస్సు ఒకటి రెండు సంవత్సరాలు తక్కువగా ఉన్నప్పటికీ అర్హులుగా ఆమోదించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ సభ్యుడు అబ్బిరెడ్డిగారి వీరారెడ్డి కలెక్టర్‌ను కోరారు. చాలా మందికి అసలు వయస్సు 65 సంవత్సరాలు పైన ఉన్నప్పటికీ రేషన్ కార్డు, ఆధార్ కార్డులలో నమోదైన వయస్సు తేడాగా ఉండడం వలన అనర్హులుగా మారుతున్నారని ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. అలాగే స్థానిక కస్తూర్బా గురుకుల విద్యాలయానికి రహదారి ఏర్పాటు చేయాలని, పాఠశాలలో తాగునీటి వసతి కల్పించాలని జెడ్పీటీసీతో బాటు ఎంపీపీ తనయుడు శివకుమార్ రెడ్డి కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ అనిల్ కుమార్‌రెడ్డి, తహశీల్దార్ వెంకటేష్, ఎంపీడీవో మొగిలిచెండు సురేష్ , సర్పంచ్ శారద, ఈవోపీఆర్డీ రామాంజనేయులు , కమిటీ సభ్యులు నాగేశ్వరరెడ్డి, ఓబుల్‌రెడ్డి , పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం
ఆదోని టౌన్: అగ్రిగోల్డ్ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆ సంస్థ ఏజెంట్లు, ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేసిన పొదుపు, డిపాజిట్లకు వడ్డీతోపాటు చెల్లించాల్సిన నగదును యాజమాన్యం రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తోందంటూ కార్యాలయ తలుపులు మూసి ఆందోళనకు దిగారు. ఒకానొక దశలో కార్యాలయంలో ఉన్న సీనియర్లపై దాడిచేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఏజెంట్లు, ఖాతాదారులు వీరేష్, చంద్రమ్మ, లక్ష్మన్న, నర్సింహులు, లక్ష్మినారాయణ, సావిత్రి, దస్తగిరి, శరత్‌బాబు, రాము, అంజి, వెంకటేష్, ఈరన్న, పద్మ, రామాంజనేయులు, సురేష్ తదితరులు మాట్లాడుతూ 8నెలలుగా చెక్కులను పట్టుకొని కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలుచేస్తున్నా తమ గోడును పట్టించుకునే నాధుడే లేడన్నారు. ఒక్కో చెక్కు రెండు, మూడు సార్లు బౌన్స్ అయిందని, రెండు, మూడు బ్యాంకులకు ఇచ్చిన చెక్కులు చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ యాజమాన్యం, సీనియర్లు చెప్పే మాటలకు, ప్రస్తుతం జరుగుతున్న దానికి పొంతన లేదని ఆరోపించారు. గంటపాటు ఆందోళన చేసిన ఏజెంట్లు, ఖాతాదారులకు సోమవారం వరకు సమయం ఇవ్వాలని అంతలోగా నగదు చెల్లిస్తామని సీనియర్ల నుంచి ఫోన్లు రావడంతో ఆందోళనను విరమించారు. దాదాపు ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రూ.5కోట్లు మేర డిపాజిట్లు చెల్లించాల్సి ఉన్నట్లు ఖాతాదారులు రామాంజినేయులు, సురేష్, పద్మ, చంద్రమ్మ తెలిపారు. -
‘కాలుష్యం’పై సర్కార్ నిఘా!
సిద్దిపేట జోన్: శాబ్ధ కాలం క్రితం వంద పరిశ్రమలతో పారిశ్రామిక వైభవాన్ని సంతరించుకున్న సిద్దిపేట పరిశ్రమల ప్రతినిధులకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇటీవల పట్టణానికి చెందిన శంకర్‌నగర్ కాలనీ వాసులు సమీప పరిశ్రమల కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామనే ఫిర్యాదుపై డివిజన్ అధికారులు స్పందించారు. ఒక దశలో సిద్దిపేట మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీఓ ముత్యంరెడ్డి ఇటీవల మున్సిపల్ అధికారులకు సంబంధిత పరిశ్రమల సమగ్ర వివరాలపై, కాలుష్య స్థితి గతులపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ ఆదేశాలకు అనుగుణంగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఈ నెల 12న పట్టణంలోని 33 పరిశ్రమలకు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. సుమారు పది అంశాలతో కూడిన సమగ్ర వివరాలపై మున్సిపల్ అధికారులు ఆయా పరిశ్రమల నుంచి నివేదికలు సేకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నిర్ణీత గడువు ముగియనున్న దశలో రెండు మూడు రోజుల్లో సంబంధిత కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో కలిసి అకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే... వ్యాపార, వాణిజ్య రంగంలో వెలుగువెలిగిన సిద్దిపేటలో ఒకప్పుడు వంద పరిశ్రమలు ఉండేవి. కాలక్రమేణా పారిశ్రామికికరంగా సంబంధించిన మార్పులు, విద్యుత్ కోతలు, ప్రభుత్వ విధానాలు, ప్రత్యామ్నాయ మార్గాల నేపథ్యంలో కొన్ని పరిశ్రమలు మూలపడగా ప్రస్తుతం స్వల్ప సంఖ్యలో రైసు మిల్లులు, ఆయిల్, కుంకుమ, దాల్ మిల్లులతో పాటు ఇతర పరిశ్రమలు ఉన్నాయి. గతంలో పట్టణ శివారులో నిర్మించిన ఫ్యాక్టరీలు గత కొంత కాలంగా పెరుగుతున్న పట్టణీకరణతో జనావాసాల్లో కలిసి పోయాయి. ఈ క్రమంలో ఇటీవల శంకర్‌నగర్‌కు చెందిన కాలనీ వాసులు సంబంధిత సమీప పరిశ్రమల ద్వారా వెదజల్లే కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిబంధనలను ఉల్లంఘించారంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు సిద్దిపేట ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో స్పందించిన ఆర్డీఓ ముత్యంరెడ్డి సంబంధిత ఫిర్యాదుపై తక్షణం స్పందించి సమగ్ర వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఈ నెల 10న మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ ప్రత్యేకాధికారి ఆదేశాలతో స్పందించిన మున్సిపాల్టీ తక్షణ చర్యలో భాగంగా పట్టణ శివారులోని 33 పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు. సంబంధిత పరిశ్రమకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి, పరిశ్రమల శాఖ, అగ్ని మాపక శాఖ అనుమతులతో పాటు ఫ్యాక్టరీలో యంత్రాల సామర్థ్యం, పని చేస్తున్న కూలీల, కార్మికుల వివరాలు, ఫ్యాక్టరీ ఫొటో గ్రఫీతో కూడిన ప్లాన్ వివరాలు, మున్సిపల్‌కు వారు చెల్లిస్తున్న ఆస్తి పన్ను వివరాలు, విద్యుత్ బిల్లు వివరాలను తెలియజేసే ధ్రువీకరణ పత్రాలతో సమగ్ర వివరాలను అందజేయాలని ఈ నెల 12న ఎల్ఆర్ నం.ఎఫ్1/1316/2014 ప్రకారం నోటీసులు జారీ చేశారు. గతంలో లేని విధంగా మున్సిపల్ అధికారులు ఒక్క సారిగా పరిశ్రమకు సంబంధించిన నివేదికను అందజేయాలని ఆదేశించడంతో గత వారం రోజులుగా సిద్దిపేటలోని పరిశ్రమల ప్రతినిధులు మున్సిపల్ కార్యాలయం బాట పట్టారు.సంబంధిత వివరాలకు అనుగుణంగా మరో రెండు రోజుల్లో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం పరిశ్రమల్లో కాలుష్యం స్థితి గతులను అకస్మికంగా తనిఖీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
ఉపాధ్యాయులపై డీడీ కొరడా
ఐదుగురి జీతాల నిలిపివేత విధులకు డుమ్మా కొట్టినట్టు ఆకస్మిక తనిఖీలో నిర్ధారణ తదుపరి చర్యలపై పీవోకు సిఫారసు కొయ్యూరు: యూ.చీడిపాలెం పంచాయతీ పలకజీడి ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఐదుగురు ఉపాధ్యాయుల జీతాన్ని నిలిపివేస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ డీడీ మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు రాకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపడం మానేశారన్నారు. మండల కేంద్రానికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆశ్రమ పాఠశాలను శుక్రవారం డీడీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్పటికి ఎనిమిది మంది ఉపాధ్యాయులకు ముగ్గురే ఉన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొందరు ఉపాధ్యాయులు నెలలో ఒక్కసారి కూడా రావడం లేదని గ్రామస్తులు తెలిపారన్నారు. కొయ్యూరుకు చెందిన అశోక్‌కుమార్,పాపారావులు సక్రమంగా రావడం లేదన్నారు. వారి బాటలోనే లమ్మసింగి సింహాచలం,హింది పండిట్ భాస్కరరావు,పీఈటీ సీహెచ్ చంద్రపడాల్లు డుమ్మా కొడుతున్నారన్నారు. దీంతో ప్రస్తుతం 162 మంది విద్యార్థులకు 21 మందే ఉన్నారన్నారు. గ్రామస్తుల మాటలను వీడియో చిత్రీకరించారు. వాటిని విలేకరులకు చూపారు. ఈ వీడియోను పీవోకు అందజేస్తామన్నారు. పీవో ఆదేశం మేరకు తదుపరి చర్యలుంటాయన్నారు. అంతకు ముందు మండల కేంద్రానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మఠం బీమవరం పాఠశాలను సందర్శించారు. -
గో..గో.. తూ.గో.
- ముంపు గ్రామాల విలీనంతో భారీగా విస్తరించనున్న జిల్లా - ఏజెన్సీ వైపు మరో 80 కి.మీ. ముందుకు జరగనున్న సరిహద్దు - అటు ‘పశ్చిమ గోదావరి’తోనూ మారనున్న పొలిమేరలు సాక్షి, రాజమండ్రి : ‘ప్రాంతాలు వేరైనా.. మన అంతరంగమొకటేనన్నా..’ తెలంగాణకు చెందిన సి.నారాయణరెడ్డి (సినారే) కలం నుంచి జాలువారిన తేనెమూటల్లాంటి సినిమా పాటల్లో ఒకానొక గీతంలోని పంక్తి ఇది. ‘తెలుగుజాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనది’ అన్న ఆ పాటలో ఆయన ఆకాంక్షించింది తెలుగువారు ఎన్నటికీ ఒకటిగానే ఉండాలని. కారణాలు ఏవైనా..మూడుసీమల ముప్పేట వంటి రాష్ట్రం రెండు ముక్కలవుతోంది. సినారే పాట బాటలోనే.. ‘రాష్ట్రాలు వేరైనా.. మన రాగబంధం ఒకటేనన్నా’ అని రెండు ప్రాంతాల ప్రజలూ అనుకోగలిగినా సాంకేతికంగా విభజనరేఖలు తప్పవు. నిన్నటి వరకు ‘మన గడ్డ’ అన్న భావనతో స్వేచ్ఛగా తిరిగిన చోటే ఆంక్షలను చ వి చూడకతప్పదు. భద్రాద్రిలో కొలువైన కోదండరాముడు.. మనకు రేపు కూడా అంతే దూరంలో ఉంటా డు. అయితే.. ఆ రఘురాముడిని దర్శించుకోవడానికి ‘రాష్ట్ర సరిహద్దు’ను దాటి వెళ్లక తప్పదు. రాష్ట్ర విభజనతో తూర్పు గోదావరి, ఖమ్మం జిల్లాల మధ్యను న్న ఏజెన్సీ ప్రాంతం అంతర్ రాష్ట్ర సరిహద్దుగా మారి పోతోంది. ముంపు గ్రామాల విలీనం అనంతరం కొత్త సరిహద్దులను నిర్ధారించాల్సి ఉంది. తెలంగాణ అపాయింటెడ్ డే అయిన జూన్ రెండు సమీపిస్తున్నా ఇంకా ఆ కసరత్తు పూర్తికాలేదు. మారేడుమిల్లి నుంచి మరీ ముందుకు.. రాజమండ్రికి 80, కాకినాడకు 113 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారేడుమిల్లి జిల్లాలో చివరి మం డలం. మారేడుమిల్లి తర్వాత 30 కిలోమీటర్ల దూరంలోని తులసిపాకలతో ఖమ్మం జిల్లా చింతూరు మం డలం మొదలవుతుంది. మారేడుమిల్లికి 40 కిలోమీటర్ల దూరంలోని (తులసిపాకలకు 10 కి.మీ. దూ రం) లక్కవరం సెంటర్ వద్ద వై.రామవరం మండ లం డొంకరాయి, మంగంపాడులతో పాటు, విశాఖ జిల్లా సీలేరు ప్రాంతాలకు వెళ్లే క్రాస్ రోడ్డు ఉంటుంది. అసలు గ్రామాలు ఉండని ఈ తావు వరకూ తూర్పుగోదావరి, విశాఖ జిల్లా వాసులే ఎక్కువగా సంచరిస్తుంటారు. ముంపు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో చింతూరు, కూనవరం, వర రామచంద్రపురంలను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు ఆర్డినెన్స్ వచ్చింది. భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా భద్రాచలం మండలాన్ని కూడా తూర్పుగోదారిలో కలిపేస్తున్నందున పాత సరిహద్దులు చెరిగిపోనున్నాయి. మన జిల్లా సరిహద్దులు విస్తరించనున్నాయి. ఇకపై భద్రాచలానికి ముందు తగిలే సీతారాంపురం వరకూ తూర్పుగోదావరి జిల్లా పరిధి ఉంటుంది. మారేడుమిల్లి నుంచి భద్రాచలం 117 కిలోమీటర్లు. ప్రస్తుతం మారేడుమిల్లి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ముగిసిపోయే మన జిల్లా సరిహద్దు భద్రాచలానికి సుమారు ఏడు కిలోమీటర్ల ముందు వరకూ.. మారేడుమిల్లికి 110 కిలోమీటర్ల దూరం వరకూ విస్తరించనుంది. అంటే ఈవైపు మన జిల్లా అదనంగా మరో 80 కిలోమీటర్ల వరకూ విస్తరించనుందన్న మాట. అలాగే ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాల్లో మరికొన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం కానున్నందున ఉభయ గోదావరి జిల్లాల సరిహద్దు కూడా విస్తరించనుంది. అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టు ఎక్కడో? ముంపు గ్రామాల విలీ నంపై ఆర్డినెన్స్ ఆమోదం పొందక ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల సరిహద్దు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు దాటాక వచ్చే తులసిపాకలగా భావించారు. పాలనా సౌలభ్యం, భద్రతల రీత్యా అంతర్ రాష్ట్ర చెక్‌పోస్టును మారేడుమిల్లిలో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించారు. ఇది మన రాష్ట్రం తరపున తెలంగాణ , ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులకు కలిపి ఉమ్మడి చెక్‌పోస్టు కాగలదు. కానీ కొత్త సరిహద్దుల ప్రకారం మన రాష్ట్ర చెక్‌పోస్టు చింతూరుకు మూడు కిలోమీటర్ల దూరంలోని చట్టి సెంటర్ వద్ద ఛత్తీస్‌గఢ్, తెలంగాణ లకు ఉమ్మడిగా ఏర్పాటు చేయాలి. లేదంటే భద్రాచలం సమీపంలోని సీతారాంపురం, గూడాల, కానాపురం గ్రామ శివార్లలో ఏదో ఒక అనువైన ప్రాంతం ఎంచుకుని తనిఖీ కేంద్రం పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్డినెన్స్ ప్రకారం విలీన గ్రామాలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తుది సరిహద్దులు ప్రకటించాల్సి ఉంది. జూన్ రెండున తెలంగాణ అపాయింటెడ్ డే కన్నా ముందే ఈ సరిహద్దులపై ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఇందుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో అందరిలోనూ ఏమవుతుందోనన్న ఆసక్తి నెలకొంది. -
రూ.8.29లక్షలు పట్టివేత
జన్నారం, న్యూస్‌లైన్ : ఎన్నికల నేపథ్యంలో తనిఖీ చేస్తున్న అధికారులు శనివారం పెద్దమొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం లీడర్, డెప్యూటీ తహశీల్దార్ జాడి రాజలింగం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న ఐచర్ వ్యాన్‌ను ఇందన్పల్లి చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేయగా మంథనికి చెందిన డ్రైవర్ మారిశెట్టి కుమార్ వద్ద రూ.3,84,205 లభించాయి. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయ గా డ్రైవర్ నాంపెల్లి ఓదెలు వద్ద రూ.3,44,860 లభించాయి. వీరిని ప్రశ్నించగా ఆదిలాబాద్‌లోని జగదాంబ జిన్నింగ్ మిల్లులో పత్తి అమ్మి డబ్బులు తెస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ నుంచి పెద్దపెల్లికి వెళ్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయగా.. ప్రయాణికుడు సాగర్, సంతోష్‌ల వద్ద రూ.లక్ష లభించాయి. వారు కూడా పత్తి విక్రయించి డబ్బు తెస్తున్నట్లు తెలిపారు. ఆధారాలు చూపిస్తే డబ్బు అప్పగిస్తామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో ఎస్సై బుద్దే స్వామి, ఏఆర్ ఎస్సై ఉత్తం, కానిస్టేబుల్ అశోక్, టీం సభ్యులు ఆత్రం రవీందర్, రాకేశ్, భూమాచారి, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సర్పంచులూ... జర భద్రం
ఇందూరు, న్యూస్‌లైన్ : అభివృద్ధి పనుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే సర్పంచులకు ‘చెక్’ పడనుంది. పనులను పూర్తి చేయడంలో జాప్యం చేసే సర్పంచులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రద్యుమ్న పంచాయతీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో విధులను పట్టించుకోని సర్పంచులు ఎంతమంది ఉన్నారో జాబితాను తయా రు చేసే పనిలో పంచాయతీ అధికారులు ఉన్నారు. జిల్లాలో బీఆర్జీఎఫ్ పనులు విధించిన గడువులోగా పూర్తి కాకపోగా, కొన్ని చోట్ల అసలే ప్రారంభానికి నోచుకోని వైనంపై కలెక్టర్ ఇటీవల జరిగిన సమావేశాల్లో ఎంపీడీఓలను నిలదీశారు. కొంతమంది వివిధ కారణాలు చెప్పగా సర్పంచులు పట్టించుకోవడం లేద ని, చెప్పాపెట్టకుండా పది,పదిహేను రోజులు సెల వుల్లో వెళ్తున్నారని, అందుకే పనులు పెండింగ్ పడిపోయినట్లు ఎక్కువ మంది ఎంపీడీఓలు వివరణ ఇచ్చా రు. కొంతమంది సర్పంచులు విధుల్లో ఉంటున్నప్పటికీ పనులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ విషయాలను కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. సంబంధిత డివిజ నల్ పంచాయతీ అధికారికి, జిల్లా పంచాయతీ అధికారికి కనీస సమాచారం లేకుండా సర్పంచులు సెల వుల్లో వెళ్లడం, ఆ ప్రభావం బీఆర్జీఎఫ్ పనులపై పడుతుండటంతో కలెక్టర్ మండిపడ్డారు. డీపీఓ సురేశ్‌బాబుపై కూడా అసహనం వ్యక్తం చేశారు. జనవరి 10 లోగా రూ. లక్ష లోపు, ఆపైన విలువ చేసే పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సహకరించని సర్పంచులపై క్రమ శిక్షణ చర్య లు తీసుకోవాలని, చెక్‌పవర్‌ను రద్దు చేయాలని సూచించారు. సమాచారం ఇవ్వకుండా సెలవులో వెళ్లిన సర్పంచులకు నోటీసులు జారీ చేయాలన్నారు. ఈ విషయాలను జిల్లాలోని అందరు సర్పంచులకు తెలియజేయాలని ఎంపీడీఓలకు చెప్పారు. -
సర్పంచ్ల హక్కుల కోసం ఉద్యమిస్తాం
ఆర్మూర్‌రూరల్, న్యూస్‌లైన్ :తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ల హక్కుల సాధన కోసం ఉద్యమిస్తామని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాడగొండ సత్యరాజ్ వర్మ అన్నారు. మంగళవారం ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని యాల్లరాములు మెమోరియల్హాల్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఈనెల 2న హైదరాబాద్‌లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డిని కలిసి ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ల డిమాండ్లపై వినతిపత్రాన్ని అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. జాయింట్ చెక్ పవర్లను రద్దు చేసి సర్పంచ్‌లకే చెక్ పవర్‌ను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లున్న గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 10 లక్షలు మంజూరు చేయాలన్నారు. సర్పంచ్‌లు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ. ఐదు లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని, టీఏ, డీఏలను కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లకు గౌరవ వేతనంగా నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని కోరారు. గ్రామపంచాయతీలలో కార్యదర్శుల నియామకాన్ని చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు బండ లక్ష్మణ్, ప్రభాకర్, సత్యనారాయణ, మెట్టు నరేష్, సిరిసిల్ల పుష్ప, నందిపేట్ చిన్నయ్య, కళాశ్రీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
జాయింట్ పవర్‌కు చెక్
సాక్షి, కరీంనగర్ :సర్పంచుల నుంచి వచ్చిన తీవ్ర ప్రతిఘటనతో జాయింట్ చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడిం ది. కార్యదర్శులతో అధికారాన్ని పంచుకోవాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై కొత్తగా ఎన్నికయిన సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసనలను ప్రభుత్వ పెద్దల దృష్టికి వివిధ రూపాల్లో తీసుకెళ్లిన జిల్లా సర్పంచులు ప్రత్యక్ష కార్యచరణకు సిద్ధమవుతున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో తన నిర్ణయాన్ని సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. జిల్లాల వారీగా అధికారులు, సర్పంచులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరిస్తారు. ఆ అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. రెండేళ్ల క్రితమే గ్రామ పంచాయతీ పాలకవర్గాలు దిగిపోగా ఇంతకాలం ప్రత్యేకాధికారులే పాలన సాగించారు. ఎట్టకేలకు ప్రభుత్వం పంచాయతీలకు గత నెల మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించగా ఈ నెల 2న కొత్త సర్పంచులు కొలువుదీరారు. భాద్యతలు తీసుకున్నా అధికారాలు లేక అయోమయస్థితిలో ఉన్న సర్పంచులు అభివృద్ధి పనులు చేసేందుకు చెక్ పవర్ ఇవ్వాలని విన్నపాలు చేయగా ఈనెల 19న 385 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శితో కలిపి జాయింట్ చెక్ పవర్ కల్పించింది. పంచాయతీ జనరల్ ఫండ్ నిధులతో కనీస వసతులు కల్పించేందుకు కూడా సర్పంచులకు అవకాశం ఇవ్వలేదు. ఈ ఉత్తర్వులపై సర్పంచులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజల ద్వారా ఎన్నికలయిన ప్రజాప్రతినిధులను ప్రభుత్వం అవమానించిందన్న ఆగ్రహం వ్యక్తమయ్యింది. నిధులు దారి మళ్లకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు చేసినట్టు అధికారులు చేస్తున్న వాదనపై వారు విరుచుకుపడుతున్నారు. గతంలో పలువురు సర్పంచులు భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు రుజువయ్యింది. కొంతమంది సర్పంచుల నుంచి రికవరీ కూడా చేశారు. ఇంకా రూ.మూడు కోట్ల వరకు రికవరీ కాలేదని అధికారులు చెప్తున్నారు. గతంలో జరిగిన దుర్వినియోగాన్ని సాకుగా చూపి ఇప్పుడు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం సరైందికాదని కొత్త సర్పంచులు అంటున్నారు. జిల్లాలో 1206 పంచాయతీల్లో పాలకవర్గాలు ఉండగా 550 మంది కార్యదర్శులే ఉన్నారు. ఒక కార్యదర్శికి రెండుమూడు పంచాయతీల బాధ్యతలు కేటాయించారు. దీని వల్ల నిధుల వినియోగంలో ఇబ్బందులు తప్పవన్న వాదన వినిపిస్తోంది. గతంలో సర్పంచులతోపాటు ఒక వార్డు సభ్యుడికి చెక్ పవర్ ఉండేది. చెక్ వవర్ సభ్యుడిని వార్డుసభ్యులు ఎన్నుకునేవారు. ఈసారి ఈ విధానానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నిధుల వినియోగంలో తమకు పూర్తి అధికారాన్ని ఇవ్వాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. నిధులు దారి మళ్లకుండా ప్రజావసరాలకే ఖర్చయ్యేలా ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం సర్పంచులకు పూర్తిస్థాయిలో చెక్ పవర్ కల్పించేందుకు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. -
పవర్‌కు ‘చెక్’
ఏలూరు, న్యూస్‌లైన్ :రాష్ట్రంలోని సర్పంచ్‌లు 17 ఏళ్ల క్రితం పోరాటం చేసి చెక్ పవర్ సాధించుకున్నారు. ఆ అధికారాన్ని పంచాయతీ కార్యదర్శులతో కలిసి పంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించటంతో సర్పంచ్‌లు మరోసారి ఆందోళన దిశగా పయనిస్తున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు జిల్లా సర్పంచ్ల చాంబర్ తరఫున ప్రతినిధులు త్వరలో ముఖ్యమంత్రిని కలవనున్నారు. సర్పంచ్ల చెక్‌పవర్‌ను రద్దు చేసే యత్నంలో మొదటి మెట్టుగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు కలిపి చెక్ పవర్ ఇచ్చారనే అనుమానాలు సర్పంచ్‌లకు ఉన్నాయి. సర్పంచ్‌లు అవతవకలకు, అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చినపుడు, అవి రుజువైన సందర్భాల్లో మాత్రమే చెక్‌పవర్‌పై ఆంక్షలు విధించేవారు. పంచాయతీలకు రెండేళ్ల తరువాత ఇటీవలే పాలకవర్గాలు ఏర్పడినందున ప్రభుత్వం నిధులివ్వాల్సిందిపోయి, కొత్త సర్పంచ్‌లను అవమానించేలా ఈ ఆంక్షలేమిటంటూ వారు ప్రభుత్వ తీరును దుయ్యబడుతున్నారు. గ్రామ పాలనపై ప్రతికూల ప్రభావం! రెండేళ్లుగా గ్రామాల్లో పాలకవర్గాలు లేక పాలన కుంటుపడింది. దానిని గాడిలో పెట్టాలంటే ప్రస్తుత వర్షాకాలంలో రోడ్లు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలను సరిదిద్దేందుకు సర్పంచ్‌లు చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇది. మరోవైపు జిల్లాలోని 884 పంచాయతీల్లో సగానికిపైగా కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక్కో కార్యదర్శి మూడేసి గ్రామాల బాధ్యతలు కూడా చూడాల్సి వస్తోంది. వారు ఎప్పుడు ఏ గ్రామంలో ఉండాలనే విషయమై నిర్దిష్టమైన జాబ్‌చార్ట్ అమలు కావడం లేదు. ఈ పరిస్థితుల్లో పంచాయతీలు చేపట్టాల్సిన అత్యవసర సేవలపై సర్పంచ్ సొంత నిర్ణయం తీసుకోవటం సాధ్యమయ్యే వీలు లేదు. చెక్‌పవర్ విషయంలో ఇద్దరి మధ్య సమన్వయం కుదిరే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో గ్రామాల్లో ప్రచ్ఛన్న యుద్ధాలు సాగే ప్రమాదం లేకపోలేదని పలువురి విశ్లేషణ. జాయింట్ చెక్ పవర్‌తో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తే గ్రామాల్లో పాలన కుంటుపడుతుందనేది విశ్లేషకుల భావన. ఎందుకీ కళ్లెం 1996 నుంచి గత పంచాయతీ పాలకవర్గాల వరకు సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఉంది. నాన్చుడు ధోరణి అవలంబిస్తూ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత పంచాయతీ పాలకవార్గలకు ఎన్నికలు నిర్వహించింది. సర్పంచ్‌లు పదవి చేపట్టిన నెలలోనే వారి హక్కులను కాలరాసేలా జాయింట్ చెక్‌పవర్ జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఈ చర్య సర్పంచ్‌లను అవినీతిపరులుగా చిత్రీకరిస్తూ ఉద్యోగుల కనుసన్నల్లోనే వారు ఉండేలా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనన్న వాఖ్యలు వినవస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై పోరాటం సాగించే దిశగా సర్పంచ్‌లు యోచిస్తున్నారు. సర్పంచ్‌లను కించపర్చటమే 1996లో 15వేల మంది సర్పంచ్‌లు అసెంబ్లీని ముట్టడించి చెక్‌పవర్‌ను సాధించాం. అప్పటి నుంచి కొనసాగుతున్న హక్కును కాలరాస్తూ జాయింట్ చెక్‌పవర్ ఇవ్వటం చూస్తుంటే అధికారులను నమ్మి, ప్రజాప్రతినిధులను దొంగలుగా అవమానించడమే అవుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ లాంటింది. దీని ద్వారా ప్రభుత్వం ఏం సాధిస్తుంది. ఈ జీవోను వెనక్కి తీసుకునేలా సెప్టెంబర్ మొదటి వారంలో హైదరాబాద్‌లో సీఎం కిరణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీలను కలసి వివరిస్తాం. - పిల్లి వెంకటసత్తిరాజు, జిల్లా సర్పంచ్ల చాంబర్ గౌరవాధ్యక్షుడు -
కేసీఆర్ దూకుడుకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాలు