
రైల్వే జీఎంకు ఘన స్వాగతం
దక్షిణ మధ్య రైల్వే జీఎం పీకే శ్రీవాస్తవకు రైల్వే ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
విజయవాడ : దక్షిణ మధ్య రైల్వే జీఎం పీకే శ్రీవాస్తవకు రైల్వే ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. గూడూరు నుంచి తెనాలి వరకు ఉన్న ముఖ్యమైన స్టేషన్లను జీఎం శుక్రవారం తనిఖీ చేశారు. ప్రయాణికులకు కల్పిస్తున్న సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ రైల్వేస్టేషన్‌లో కొద్దిసేపు ఆగి విలేకరులతో మాట్లాడారు. స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి జీఎంకు డీఆర్‌ఎం ప్రదీప్‌కుమార్ వివరించారు. జీఎం రాకను పురస్కరించుకుని పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు.
రైల్వే జీఎంకు స్వాగతం పలికిన వారిలో ఏడీఆర్‌ఎం ఎన్‌ఎస్‌ఆర్ ప్రసాద్, సీనియర్ డీసీఎం ఎన్‌వీ సత్యనారాయణ, వివిధ విభాగాల అధికారులు ఉన్నారు. జీఎంతోపాటు ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్ ఎస్‌ఎన్ సింగ్, చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఎస్‌కే ఝా, చీఫ్ కమర్షియల్ మేనేజర్ జి.లక్ష్మినారాయణ, చీఫ్ ఎలక్రికల్ ఇంజినీర్ జేఎన్‌పీ సింగ్, చీఫ్ మెకానిల్ ఇంజినీర్ కబీర్ అహ్మద్, చీఫ్ సిగ్నలింగ్ ఇంజినీర్ మబూబ్ ఆలీ వచ్చారు.