ఇటు పాత రూ.కోట్లు అటు నకిలీ నోట్లు
ఎండాడ చెక్‌పోస్టు వద్ద రూ.కోటి పాత నోట్లు పట్టివేత
సరైన ఆధారాలు చూపకపోవడంతో ఇద్దరిపై కేసు నమోదు
వుడా కాలనీ మురుగునీటిలో నకిలీ నోట్ల బస్తాలు
ఏరుకోవడానికి ఎగబడిన జనం రంగంలోకి ఐటీ అధికారులు
విశాఖపట్నం/పీఎం పాలెం/మధురవాడ : అర్ధరాత్రి వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తే పోలీసుల కళ్లు చెదిరిపోయారుు. కోటి రూపాయల నగదు చూసి నోరెళ్లబెట్టారు. వెంటనే డబ్బు తరలిస్తున్న వాహనాన్ని, డ్రైవర్‌ను, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో సంఘటనలో డబ్బుల బస్తాలు మురుగు కాలువలో దర్శనమిచ్చారుు. వాటిని గమనించిన స్థానికులు అందినకాడికి పట్టుకుని పరుగుతీశారు. ఇంకా ఏమైనా మిగిలిపోయాయోమోనని కొందరు మురుగుకాలువలో దేవులాడారు. చివరికి కేవలం ఐదు నోట్లు దొరికారుు. అవి కూడా నకిలీవని తెలిసి అవాక్కయ్యారు. నగరంలో బుధవారం జరిగిన ఈ రెండు సంఘటనలు పెద్ద నోట్ల రద్దుతో ’నల్ల’ పాములు బయటకొస్తున్నాయనడానికి నిదర్శనంగా నిలవడంతో పాటు నగరంలో నకిలీ నోట్ల చెలామణీకి అద్దం పట్టారుు.
రాత్రివేళ వాహనంలో తరలింపు
ఒడిశాకు చెందిన ప్రీతమ్‌కుమార్ బారిక్, తమిళనాడుకు చెందిన వెంకటపతి ఒ.డి.5 09ఇ-1199 నంబరు గల బొలోరా వాహనంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారి మీదుగా రూ. కోటి రూపాయలు పాతనోట్లు తమ వెంట తీసుకెళ్తున్నారు. అదే సమయంలో ఆనందపురం ఎస్‌ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఎండాడ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అక్కడకు చేరుకున్న బొలోరా వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 200 బండెల్స్ పాత ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు (వాటి విలువ రూ. కోటి) కనిపించారుు. వెంటనే కారు డ్రైవర్‌ను, అతనితో ప్రయాణిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం నగరమంతా దావానలంలా వ్యాపించింది. కానీ పోలీసులు మాత్రం అత్యంత గోప్యత పాటించారు. రాత్రి వరకూ వివరాలు వెల్లడించలేదు. కాగా పట్టుబడిన వారు పోలీసుల విచారణలో తాము త్రివేణీ ఎర్త్ అనే ప్రైవేటు సంస్థ ప్రతినిధులమని మెకానికల్, డీజిల్ ఫైర్ పార్టులకు చెల్లింపుల కోసం ఈ సొమ్ము తరలిస్తున్నామని వారిలో ఒకరు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన విషయంలో ఈ నగదు చెల్లించాల్సి వచ్చిందని మరో వ్యక్తి పోలీసులకు వివరించారు.
వారిద్దరూ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం మరింత పెరిగింది. ఇంత పెద్ద మొత్తంలో నగదు రూపేణా లావాదేవీలు జరగడం అంటూ ఉండదని, చెక్కు, డీడీ రూపంలో చెల్లింపులు ఉంటాయనే కోణంలో రికార్డులు చూపమని పోలీసులు వారిని అడిగారు. చూపిస్తామంటూ సాయంత్రం వరకూ కాలం గడిపినా సరైన ఆధారాలు ఇవ్వలేకపోయారు. నగదుకు సంబంధించి వారు సరైన ఆధారాలు చూపలేకపోయారని, దాంతో కేసు నమోదు చేశామని పీఎం పాలెం సీఐ లక్ష్మణమూర్తి తెలిపారు. నిందితులను రిమాండుకు తరలించామన్నారు. మరోవైపు ఐటీ ప్రతినిధులు ఈ ఉదంతంపై ఆరా తీశారు. తదుపరి చర్యల నిమిత్తం నివేదికను సీఐ వారికి అందజేశారు.
మురుగు కాలువలో నకిలీ నోట్లు
జీవీఎంసీ 5వ వార్డు మధురవాడ మిథిలాపురి వుడా కాలనీ రోడ్డులో బుధవారం ఉదయం దొంగనోట్లు కలకలం రేపారుు. ఉదయం 6గంటల సమయంలో మిథిలాపురి ఉడాకాలనీ రోడ్డులో లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ సమీపంలో ఉన్న ఓ కల్వర్టు వద్ద మురుగునీటి కాల్వలో గుర్తు తెలియని వ్యక్తులు బస్తాలతో రు.500 నోట్లు పడేసి పరారయ్యారు. ఈ విషయం అందరికీ తెలియడంతో ఏరుకోవడానికి జనం పరుగులు తీశారు. మోకాలు లోతు నీటిలో సైతం నోట్ల కోసం వెతికారు.
అవి దొంగనోట్లు అని తెలిసినా వెతుకులాట ఆపలేదు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇవి చెల్లని నోట్లు అని అందరినీ చెదరగొట్టారు. అరుుతే సుమారు కోటి రూపాయలు విలువ చేసే నోట్లు బస్తాలతో పడేశారని, కొందరు వీటిని పట్టుకెళ్లిపోయారని, చాలా నోట్లు ఈ కాలువలో కొట్టుకు పోయాయని పుకార్లు షికారు చేశారుు. ఈ విషయంమై పీఎంపాలెం సీఐ లక్ష్మణమూర్తి వివరణ కోరగా నోట్లు ఎవరు పడేశారో, ఎంత మొత్తం అనే విషయాలు తెలియదన్నారు. అరుుతే అవి దొంగనోట్లు అని భావిస్తున్నామని తెలిపారు.