
విద్యుత్ ఆదాపై అవగాహన ఉందా?
అసలే ఎండాకాలం. కాసేపు కరెంట్ పోయినా, ఇష్షోయిష్షోమని నిట్టూర్పులు విడుస్తాం.
అసలే ఎండాకాలం. కాసేపు కరెంట్ పోయినా, ఇష్షోయిష్షోమని నిట్టూర్పులు విడుస్తాం. తీరా కరెంటు బిల్లు కట్టాల్సి వచ్చేసరికి షాక్ కొట్టినట్టుగా ఫీలవుతాం. అలా కాకుండా, విద్యుత్ ఆదా చేసే చిట్కాలు తెలిస్తే చిన్న చిన్న చిల్లర కాసులే శ్రీమహాలక్ష్మి అయినట్లు డబ్బు ఆదా ఆవుతుంది. పర్యావరణానికీ బోలెడంత మేలు. మీరు ఆ చిన్న పనులు చేస్తున్నారేమో చెక్ చేసుకోండి.
1. టీవీ ఆఫ్ చేశాక ఇక ఆరోజుకు చూడం అనుకున్నా టీవీ ప్లగ్ తీసేయరు. ఎప్పుడు టీవీకి పవర్ ఆన్‌లో ఉంచి రిమోట్‌తోనే ఆన్ చేస్తారు.
ఎ. అవును బి. కాదు
2. కంప్యూటర్ ఆన్ చేసే ఉంచి స్క్రీన్ సేవర్‌లో కరెంట్ తక్కువే కాలుతుంది కదా అని అలాగే వదిలేస్తారు.
ఎ. అవును బి. కాదు
3. మొబైల్ ఛార్జ్ చేశాక, ప్లగ్ తీసేయకుండా అలాగే ఉంచేస్తారు.
ఎ. అవును బి. కాదు
4. తక్కువ కరెంటే కదా కాలేది... అని బాత్‌రూమ్‌లో, ఇంటివెనకాల ఉన్న జీరో వాట్ బల్బ్స్ ఆర్పకుండా పొద్దుగూకులూ అలాగే ఉంచేస్తారు.
ఎ. అవును బి. కాదు
5. మీరు ఇంటిలో ఉన్నంతసేపూ ఫ్యాన్, టీవీ, ఏసీ/కూలర్, సిస్టమ్ ఆన్‌లో ఉండాల్సిందే!
ఎ. అవును బి. కాదు
పై వాటిలో మూడింటికి అవును అన్నది మీ సమాధానమైతే విద్యుత్ ఆదా విషయంలో దృష్టిసారించడం లేదని అర్థం. అలా కాకుండా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మీ పర్సుతోపాటు పర్యావరణానికి మేలే!
సెల్ఫ్ చెక్