ఐటీఐల్లో ఎమ్మెల్యే తనిఖీ
పోచమ్మమైదాన్ : వరంగల్ ములుగు రోడ్డులోని వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రభుత్వ ఐటీఐలను ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ఐటీఐల్లోని సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. అలాగే, ఆర్‌అండ్‌ఏసీ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేస్తుండగా వారితో కలిసి ఎమ్మెల్యే కాపర్ పైప్ కటింగ్ చేసి కాపర్ ట్యూబ్‌ను షేరింగ్ చేశాడు. ఆ తర్వాత వరంగల్ ఐటీఐ ఆవరణలో ఎన్‌సీసీ కేడెట్ల శిక్షణ జరుగుతుండగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యేకు కేడెట్లు గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా టాయిలెట్లు, తాగునీటికి ఇబ్బంది ఉందని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు స్పం దించిన వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో ఐటీఐ విద్యార్థుల్లో అభద్రతా భావం నెలకొందన్నారు. అయితే, ప్రస్తుత రాష్ర్టప్రభుత్వం త్వరలోనే వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుందని వివరిం చారు. అలాగే, ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు తన నిధులు విడుదల చేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో ఆర్ ఐఓ ఎల్లయ్య, వరంగల్ ఐటీఐ ప్రిన్సిపాల్ సాంబారి సుదర్శన్, హన్మకొండ ఇన్‌చార్‌జ ప్రిన్సిపాల్ అశోక్‌కుమార్, టీఎన్జీవోస్ టెక్నికల్ విభాగం అధ్యక్షుడు పీవీ.రావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఓంకార్, శ్రీనివాసచారి, సత్యనారాయణ, సక్రూ, ప్రమోద్‌రెడ్డి, చంద్రశేఖర్, ఉమారాణి పాల్గొన్నారు.