ఒక్క క్లిక్‌తో ఆధార్‌ సెంటర్‌ లొకేషన్‌ తెలుసుకోండిలా | How to Find Aadhaar Centre via Bhuvan Aadhaar Portal | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో ఆధార్‌ సెంటర్‌ లొకేషన్‌ తెలుసుకోండిలా

Published Thu, Aug 22 2024 9:51 AM | Last Updated on Thu, Aug 22 2024 10:14 AM

How to Find Aadhaar Centre via Bhuvan Aadhaar Portal

మీకు దగ్గరలో ఆధార్‌ కేంద్రం ఎక్కడ ఉందో  తెలియక ఇబ్బంది పడుతున్నారా? గూగుల్‌ మ్యాప్‌లో ఆధార్‌ సెంటర్‌ లొకేషన్‌ కనిపించడం లేదా? అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం లభించింది. గూగుల్‌ మ్యాప్‌ నావిగేష్‌ను తలదన్నేలాంటి టెక్నాలజీ మనముందుకొచ్చింది. దీనిని యూనిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) రూపొందించింది. దీని సాయంతో ఒక్క క్లిక్‌తో సమీపంలో ఆధార్‌ కేంద్రం ఎక్కడుందో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్‌కు ‘భువన్‌ ఆధార్‌’ అని పేరు పెట్టారు.

దీనిని యూఐడీఏఐ డివైన్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆఫ్ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో(ఎన్‌ఆర్‌ఎస్‌సీ) సహాయంతో రూపొందించింది. ఇది వెబ్ ఆధారిత పోర్టల్. ఇది ఆధార్ వినియోగదారులకు  ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నదని యూఐడీఏఐ చెబుతోంది.

సాధారణంగా వినియోగదారులు సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని గుర్తించేందుకు గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుంటారు. అయితే అన్ని సమయాల్లోనూ గూగుల్‌ మ్యాప్‌ ఖచ్చితమైన సమాచారం అందించలేదు. లేదా అప్‌డేట్‌ను అందించదు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే యూఐడీఏఐ ‘భువన్‌ ఆధార్‌’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో వినియోగదారులు ఆధార్‌ కేంద్రాన్ని సులభంగా గుర్తించవచ్చు. ఈ పోర్టల్‌ను ప్రతీ 15 రోజులకు అప్‌డేట్‌ చేస్తుంటామని యూఐడీఏఐ తెలిపింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement