మొబైల్ నెంబర్లపై కేంద్రానికి కీలక ఆదేశాలు
మొబైల్ నెంబర్లపై కేంద్రానికి కీలక ఆదేశాలు
Published Mon, Feb 6 2017 4:02 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
న్యూఢిల్లీ : మొబైల్ నెంబర్లకు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రతి మొబైల్ యూజర్ గుర్తింపుకు సంబంధించిన వివరాలను ఏడాది లోపు సేకరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం 100 కోట్లకు పైగా మొబైల్ యూజర్లున్నారని, వారందరికీ ఆధార్ను తప్పనిసరి చేయాలని అపెక్స్ కోర్టు పేర్కొంది. వారందరి వివరాలు సేకరించేందుకు సరియైన మెకానిజం ఏర్పాటుచేసుకోవాలని పేర్కొంది.
ప్రీ-పెయిడ్ సిమ్కార్డుల గుర్తింపుకు సంబంధించి కూడా వివరాలు సేకరించాలని తెలిపింది. ఏడాది లోపు మొబైల్ నెంబర్ను ఆధార్తో అనుసంధానం చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదని పేర్కొంది. వెరిఫికేషన్ అనేది ఎంతో ముఖ్యమైనదని, ప్రస్తుతం బ్యాంకింగ్ కార్యకలాపాలకు మొబైల్ ఫోన్లనే వాడుతున్నట్టు బెంచ్ సభ్యులు చెప్పారు. ఎన్జీఓ లోక్నీతి ఫౌండేషన్ దాఖలుచేసిన ఫిర్యాదుపై విచారించిన బెంచ్ సభ్యులు, నియమ, నిబంధనలతో కూడిన విధానాలను ఏడాదిలోపు రూపొందించుకోవాలని సూచించారు. అప్పుడైతేనే సిమ్ కార్డుల దుర్వినియోగాలకు పాల్పడరని చెప్పారు.
Advertisement