MLA dasyam Vinay Bhaskar
-
వినయ్.. సీఎంవో..
⇒ పార్లమెంటరీ కార్యదర్శి పదవి... సీఎం కార్యాలయంలో విధులు ⇒ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు పార్లమెంటరీ కార్యదర్శి పదవి వరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సహాయ మంత్రి హోదాలో వినయ్‌భాస్కర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధంగా పని చేయనున్నారు. టీఆర్ఎస్కు సంబంధించి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వినయ్‌భాస్కర్‌కు మంత్రి పదవి వస్తుందని భావించారు. రాష్ట్ర వ్యాప్త సమీకరణలతో ఇప్పుడు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ కార్యదర్శి పదవి వచ్చింది. వినయ్‌భాస్కర్ 2009, 2010, 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2006లో వరంగల్ నగరపాలక సంస్థలో కార్పొరేటర్‌గా విజయం సాధించారు. అంతకుముందు 1999, 2004 ఎన్నికల్లో హన్మకొండ(ప్రస్తుతం వరంగల్ పశ్చిమ) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2005 నుంచి టీఆర్ఎస్లో క్రియాశీలంగా పని చేస్తున్నారు. వరంగల్ నగర అధ్యక్షుడిగా ఇటీవలి సాధారణ ఎన్నికల ముందు వరకు పని చేశారు. వినయ్ డిమాండ్లు తీరాయి.. గత ఏడాది కాకతీయ ఉత్సవాల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అప్పటి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదు. ‘తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న కాకతీయుల వారసులను ఉత్సవాలకు ఆహ్వానించాలి. రాణిరుద్రమదేవికి సంబంధించి నల్లగొండ జిల్లాల్లో ఉన్న కట్టడాలకు ప్రాధాన్యత పెం చాలి’ అని వినయ్‌భాస్కర్ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉత్సవాల వేదికపైకి వెళ్లకుండా నిరసన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రావడంతో కాకతీయ ఉత్సవాలను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో చేసిన ప్రతిపాదనలను వినయ్‌భాస్కర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అన్నిం టిపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. వరంగల్ నగరంలో ప్రభుత్వ స్థలాల్లో గడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు 120 గజాల చొప్పును క్రమబద్ధీకరించాలని వినయభాస్కర్ విజ్ఞప్తిని కేసీఆర్ ఆమోదం తెలి పారు. ప్రధానంగా దీన్‌దయాల్‌నగర్‌లో నివసిస్తున్న వారి విషయంలో వినయ్‌భాస్కర్ ఈ ప్రతిపాదనను సీఎంకు వివరించారు. తన విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించడంపై వినయ్‌భాస్కర్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
ఐటీఐల్లో ఎమ్మెల్యే తనిఖీ
పోచమ్మమైదాన్ : వరంగల్ ములుగు రోడ్డులోని వరంగల్, హన్మకొండ, కాజీపేట ప్రభుత్వ ఐటీఐలను ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి ఐటీఐల్లోని సౌకర్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. అలాగే, ఆర్‌అండ్‌ఏసీ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేస్తుండగా వారితో కలిసి ఎమ్మెల్యే కాపర్ పైప్ కటింగ్ చేసి కాపర్ ట్యూబ్‌ను షేరింగ్ చేశాడు. ఆ తర్వాత వరంగల్ ఐటీఐ ఆవరణలో ఎన్సీసీ కేడెట్ల శిక్షణ జరుగుతుండగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యేకు కేడెట్లు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా టాయిలెట్లు, తాగునీటికి ఇబ్బంది ఉందని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు స్పం దించిన వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో ఐటీఐ విద్యార్థుల్లో అభద్రతా భావం నెలకొందన్నారు. అయితే, ప్రస్తుత రాష్ర్టప్రభుత్వం త్వరలోనే వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుందని వివరిం చారు. అలాగే, ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు తన నిధులు విడుదల చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఐఓ ఎల్లయ్య, వరంగల్ ఐటీఐ ప్రిన్సిపాల్ సాంబారి సుదర్శన్, హన్మకొండ ఇన్చార్జ ప్రిన్సిపాల్ అశోక్‌కుమార్, టీఎన్జీవోస్ టెక్నికల్ విభాగం అధ్యక్షుడు పీవీ.రావు, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఓంకార్, శ్రీనివాసచారి, సత్యనారాయణ, సక్రూ, ప్రమోద్‌రెడ్డి, చంద్రశేఖర్, ఉమారాణి పాల్గొన్నారు.