వినయ్.. సీఎంవో.. | MLA dasyam vinay bhaskar as Help Minister Status | Sakshi
Sakshi News home page

వినయ్.. సీఎంవో..

Published Tue, Dec 30 2014 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

వినయ్.. సీఎంవో..

వినయ్.. సీఎంవో..

పార్లమెంటరీ కార్యదర్శి పదవి... సీఎం కార్యాలయంలో విధులు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు పార్లమెంటరీ కార్యదర్శి పదవి వరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సహాయ మంత్రి హోదాలో వినయ్‌భాస్కర్ ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుబంధంగా పని చేయనున్నారు.

టీఆర్‌ఎస్‌కు సంబంధించి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న వినయ్‌భాస్కర్‌కు మంత్రి పదవి వస్తుందని భావించారు. రాష్ట్ర వ్యాప్త సమీకరణలతో ఇప్పుడు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంటరీ కార్యదర్శి పదవి వచ్చింది. వినయ్‌భాస్కర్ 2009, 2010, 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2006లో వరంగల్ నగరపాలక సంస్థలో కార్పొరేటర్‌గా విజయం సాధించారు. అంతకుముందు 1999, 2004 ఎన్నికల్లో హన్మకొండ(ప్రస్తుతం వరంగల్ పశ్చిమ) నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2005 నుంచి టీఆర్‌ఎస్‌లో క్రియాశీలంగా పని చేస్తున్నారు. వరంగల్ నగర అధ్యక్షుడిగా ఇటీవలి సాధారణ ఎన్నికల ముందు వరకు పని చేశారు.
 
వినయ్ డిమాండ్లు తీరాయి..
గత ఏడాది కాకతీయ ఉత్సవాల సందర్భంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ అప్పటి ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదు. ‘తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న కాకతీయుల వారసులను ఉత్సవాలకు ఆహ్వానించాలి. రాణిరుద్రమదేవికి సంబంధించి నల్లగొండ జిల్లాల్లో ఉన్న కట్టడాలకు ప్రాధాన్యత పెం చాలి’ అని వినయ్‌భాస్కర్ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు.

ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉత్సవాల వేదికపైకి వెళ్లకుండా నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడంతో కాకతీయ ఉత్సవాలను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. గతంలో చేసిన ప్రతిపాదనలను వినయ్‌భాస్కర్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అన్నిం టిపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

వరంగల్ నగరంలో ప్రభుత్వ స్థలాల్లో గడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు 120 గజాల చొప్పును క్రమబద్ధీకరించాలని వినయభాస్కర్ విజ్ఞప్తిని కేసీఆర్ ఆమోదం తెలి పారు. ప్రధానంగా దీన్‌దయాల్‌నగర్‌లో నివసిస్తున్న వారి విషయంలో వినయ్‌భాస్కర్ ఈ ప్రతిపాదనను సీఎంకు వివరించారు. తన విజ్ఞప్తులపై సీఎం సానుకూలంగా స్పందించడంపై వినయ్‌భాస్కర్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement