న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం అందరినీ కలవరపెడుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధానంలోని నాల్గవ దశ అమలువుతోంది.
గ్రాప్ విధానంలోని ఫేజ్-4 అమలును పర్యవేక్షించేందుకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం రాత్రి నరేలా-సింగు సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. గ్రేప్- 4లో ఢిల్లీలో రిజిస్టర్డ్ బీఎస్- ఫోర్, డీజిల్ పవర్డ్ మీడియం గూడ్స్ వెహికల్స్ (ఎంజీవీలు)నడవవు. ఈ సందర్భంగా గోపాల్ రాయ్ మాట్లాడుతూ ఢిల్లీలో కాలుష్య స్థాయిని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గ్రాప్ 4 అమలు చేసి, కాలుష్యం కలిగించే వాహనాల రాకపోకలపై నిషేధం విధించామని, అయితే ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అందుకే తాము తనిఖీలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
#WATCH | Delhi Environment Minister Gopal Rai says, "AAP govt is continuously working to mitigate the level of pollution in Delhi. Entry has been banned for those vehicles which cause pollution, as Grap 4 is implemented. Today, we have received several complaints that vehicles… https://t.co/Y5mm2frQYN pic.twitter.com/2DZEbtsuFV
— ANI (@ANI) November 22, 2024
రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు కళ్ల మంటలతో బాధపడుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 393గా నమోదైంది. గురువారంతో పోలిస్తే 22 ఇండెక్స్ పాయింట్లు పెరిగాయి. శని, ఆదివారాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణుల అంచనా. రాత్రి సమయంలో పొగమంచు కురిసే అవకాశాలున్నాయి.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తెలిపిన వివరాల(ఐఐటీఎం) ప్రకారం శుక్రవారం పశ్చిమ దిశ నుంచి గాలులు వీచాయి. ఈ సమయంలో గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వరకు ఉంది. సాయంత్రం ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇది కాలుష్య కారకాలు, ఘనీభవనానికి కారణమైంది. దీంతో ప్రజలు పొగమంచుతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఇది కూడా చదవండి: UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్ సూచనలు
Comments
Please login to add a commentAdd a comment