delhi pollution
-
ఇంకా ఆందోళనకరంగానే పరిస్థితి!
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం తిరిగి ఆందోళనకర స్థాయికి చేరింది. కలుషిత గాలి కారణంగా జనం కళ్ల మంటలతో పాటు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ 450కి పైగా నమోదైంది. బవానాలో అత్యధిక ఏక్యూఐ స్థాయి 475 వద్ద నమోదైంది. ఇది చాలా తీవ్రమైన విభాగంలోకి వస్తుంది.నిర్మాణ పనుల నిలిపివేతడిసెంబర్ 16 నుంచి ఢిల్లీలో గ్రాప్ -4 నిబంధనలు అమలులో ఉన్నాయి. అయినప్పటికీ ఢిల్లీ గాలి నాణ్యతలో ఎలాంటి మెరుగుదల కనిపించడం లేదు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 400 దాటింది. సొమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని 25 కాలుష్య పర్యవేక్షణ కేంద్రాలలో గాలి నాణ్యత సూచిక 400 కంటే అధికంగా నమోదైంది. గ్రాప్-4 నిబంధనల అమలుతో ఢిల్లీలో నిర్మాణ పనులను పూర్తిగా నిషేధించారు. పాఠశాలలను కూడా హైబ్రిడ్ విధానంలో నడుపుతున్నారు.ఏడు ప్రాంతాల్లో 450 దాటిన ఏక్యూఐ ఢిల్లీలోని బవానాలో 475, రోహిణిలో 468, వజీర్‌పూర్‌లో 464, అశోక్ విహార్‌లో 460, సోనియా విహార్‌లో 456, జహంగీర్‌పురిలో453గా ఏక్యూఐ స్థాయి నమోదయ్యింది. ఇది ఢిల్లీవాసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఈరోజు(సోమవారం) ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఢిల్లీలో కాలుష్యంతో పాటు చలి కూడా అధికంగానే ఉంది. సోమవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 20 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మరో రెండు రోజుల పాటు ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: Year Ender 2024: కుటుంబం మెచ్చిన 10 అందమైన ప్రదేశాలు -
‘ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే!’
న్యూఢిల్లీ, సాక్షి: నానాటికీ పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీన్నొక పాన్ ఇండియా సమస్యగా అభివర్ణిస్తూ.. సోమవారం కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ మాత్రమే కాదు.. దేశంలో ఏయే నగరాల్లో అత్యధిక కాలుష్యం నమోదు అవుతుందో ఓ జాబితా అందించాలని ఆ ఆదేశాల్లో కేంద్రానికి స్పష్టం చేసింది.‘‘వాయుకాలుష్యం ఏయే నగరాల్లో తీవ్రంగా ఉందో ఓ జాబితా ఇవ్వండి. ఇది ముమ్మాటికీ పాన్ ఇండియా సమస్యే. కేవలం ఢిల్లీకి మాత్రమే మేం ఈ అంశాన్ని పరిమితం చేయాలని అనుకోవడం లేదు. అలా గనుక విచారణ జరిపితే జనాల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుంది. అందుకే ఈ ఆదేశాలిస్తున్నాం’’ అని ఢిల్లీ కాలుష్యంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ జరుపుతున్న జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో కాలుష్య నియంత్రణకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(CAQM) ఎలా ఉందో.. కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్న నగరాల్లో అలాంటి వ్యవస్థలు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఇతర రాష్ట్రాల్లో అలాంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కేంద్రానికి స్పష్టం చేసింది.దేశ రాజధానిలో కాలుష్యం తగ్గుముఖం పట్టడం కోసం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారు. అయితే.. ఎన్సీఆర్ పరిధి వెలుపల నగరాలు ఈ విధానం పాటించడం లేదని, పంటలను తగలబెట్టడం ఇతర రాష్ట్రాలకూ ప్రధాన సమస్యగా ఉందని కోర్టు కమిషనర్లు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో.. పిల్ పరిధిని పెంచుతూ సుప్రీం కోర్టు తాజా ఆదేశాలిచ్చింది. గత నెలలో.. ఢిల్లీలో కాలుష్యం ప్రమాద స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయుకాలుష్యాన్ని నవంబర్ 18వ తేదీ నుంచి సుప్రీం కోర్టు పర్యవేక్షిస్తోంది. అలాగే.. సీఏక్యూఎం ఆదేశాలు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో పరిశీలిస్తోంది. ఢిల్లీలో మళ్లీ GRAP-3ఢిల్లీలో సోమవారం వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో.. GRAP-3 విధానం కఠినంగా అమలు చేయాలని సీఏక్యూఎం ఆదేశించింది. ఈ విధానం ప్రకారం.. విద్యాసంస్థల తరగతులు హైబ్రిడ్ విధానంలో అమలు కానున్నాయి. అంటే.. ప్రాథమిక తరగతుల క్లాసులు ఆన్లైన్లో జరగనున్నాయి. ఇక.. నిత్యావసర వస్తువులకు చెందని డిజీల్ వాహనాలపై నిషేధం అమలు చేస్తారు.చదవండి👉🏼: అమిత్ షాజీ.. రాజధాని ఎలా మారిందో చూడండి! -
Delhi: ఆంక్షల సడలింపునకు సుప్రీంకోర్టు నిరాకరణ..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య నియంత్రణకు విధించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (జీఆర్ఏపీ-4) నిబంధనలను సడలించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం దేశ రాజధానిలో గాలి నాణ్యత సూచి చాలా పేలవమైన కేటగిరిలో కొనసాగుతోందని.. ఇది మరింత స్థాయికి చేరినప్పుడు మాత్రమే నిబంధనలను సడలించేందుకు అనుమతిస్తామ తెలిపింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఒకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఢిల్లీ కాలుష్యంపై విచారణ చేపట్టింది.ఢిల్లీలో జీఆర్‌పీఏ నిబంధనల కారణంగా ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు పరిహారం చెల్లించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఢిల్లీ, హర్యాణ, రాజస్థాన్, యూపీ రాష్ట్రాలకు చెందిన ఆయా విభాగాల ప్రధాన కార్యదర్శలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిసెంబర్ 5న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.‘భవన నిర్మాణ కార్మికులకు పరిహారం చెల్లించాలన్న మా ఆదేశాలను ఎన్సీఆర్ రాష్ట్రాలు ఏవీ పాటించలేదని మేము గుర్తించాము. పైసా చెల్లించినట్లు కూడా రుజువు చూపలేదు. ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు(వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాలని ఆదేశిస్తున్నా. వారికి సమన్లు జారీ చేస్తేనే వారు సీరియస్‌గా తీసుకుంటారు,’అని ధర్మాసనం పేర్కొంది. -
Delhi Pollution: ఊపిరి సలపనివ్వని కాలుష్యం .. 300కు తగ్గని వైనం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్య స్థాయి ఒకరోజు పెరుగుతూ, మరోరోజు తగ్గుతూ వస్తోంది. ఈరోజు (గురువారం) ఉదయం మరోసారి ఢిల్లీలో కాలుష్య స్థాయి 300కి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత చాలా తక్కువ కేటగిరీలో ఉంది. ఇండియా గేట్ వద్ద భారీగా పొగమంచు కమ్ముకుంది. కాళింది కుంజ్‌లోని యమునా నదిలో విషపు నురుగు తేలియాడుతోంది.వాయు కాలుష్యం కారణంగా కంటి నొప్పులు, గొంతు సమస్యలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు బాధితులు చెబుతున్నారు. ఢిల్లీ-ఎన్సీఆర్లో కురుస్తున్న పొగమంచు.. ప్రజలపై సూర్యుని వేడి పడకుండా చేస్తోంది. ఫలితంగా శరీరంలోని ఎముకలు బలహీనంగా మారుతున్నాయి. ఎయిమ్స్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. సూర్యకాంతి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు శరీరంలో 90 శాతం విటమిన్ డి3 ఉత్పత్తికి మూలకారణంగా నిలుస్తున్నాయి. భారీగా కురుస్తున్న పొగమంచు శీతాకాలంలో సూర్యరశ్మి నేరుగా భూమిని చేరుకోకుండా అడ్డుకుంటోంది.ఎయిమ్స్ నిపుణులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలో పలువురిపై నిర్వహించిన అధ్యయనంలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలో పొగమంచు కారణంగా ప్రజలపై సూర్యరశ్మి తక్కువగా పడిందని, దీంతో చాలామంది విటమిన్ డి లోపానికి గురైనట్లు అధ్యయనంలో తేలింది. ఢిల్లీలో అంతకంతకూ కాలుష్య స్థాయి పెరుగుతోంది. పొగమంచు సమస్య తీవ్రతరమయ్యింది. ఈరోజు రాజధానిలో దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలున్నాయని చెబుతూ వాతావారణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.ఇది కూడా చదవండి; నేటి పార్లమెంట్లో.. ముచ్చటగా ముగ్గురు ‘గాంధీ’ ఎంపీలు -
ఢిల్లీలో హైబ్రీడ్ మోడ్‌లో పాఠశాల తరగతులు
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో పాఠశాలల నిర్వహణలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ మునిసిపల్ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను ‘హైబ్రిడ్ మోడ్’లో అంటే ఆన్లైన్, ఆఫ్లైన్లలో నడపాలని ఆదేశించింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో గాలి నాణ్యతలో కాస్త మెరుగుదల ఏర్పడిన దరిమిలా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) సడలింపులను ప్రకటించిన తర్వాత ప్రభుత్వం పాఠశాలల నిర్వహణలో ఈ నిర్ణయం తీసుకుంది.ఢిల్లీ ఎన్సీఆర్లోని అన్ని పాఠశాలలను అక్టోబర్ 18 నుండి ఆన్లైన్ మోడ్‌లో నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా గాలి నాణ్యత చాలా తక్కువ వర్గానికి చేరుకుంది. ఈ నేపధ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో తరగతులను పునఃప్రారంభించాలని సీఏక్యూఎం సుప్రీంకోర్టును కోరింది. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఢిల్లీ ఎన్సీఆర్లోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో హైబ్రిడ్ మోడ్‌లో విద్యాబోధన కొసాగనుంది. దీని ప్రకారం పాఠశాల తరగతులను అటు ఆన్లైన్లో, ఇటు అఫ్లైన్లోనూ నిర్వహించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తారు. ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన -
Delhi Pollution: డ్రోన్ల సాయంతో కాలుష్యకారక పరిశ్రమల గుర్తింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం హద్దులు దాటి ప్రజలకు ఊపిరి అందనివ్వకుండా చేస్తోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యం నియంత్రణ దిశగా నడుంబిగించింది. రాజధానిలోని నివాస ప్రాంతాల్లో అక్రమంగా నడుస్తూ, కాలుష్యాన్ని వ్యాప్తిచేస్తున్న జీన్స్ డైయింగ్ ఫ్యాక్టరీలు, రెడీ-మిక్స్ కాంక్రీట్ (ఆర్ఎంసీ) ప్లాంట్లు, ఎలక్ట్రోప్లేటింగ్ యూనిట్లపై దృష్టి సారించింది.అక్రమ ఫ్యాక్టరీలు, యూనిట్లపై డ్రోన్‌తో నిఘా చేపట్టేందుకు ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) సిద్ధమైంది. పారిశ్రామిక కాలుష్యానికి కారణమయ్యే యూనిట్లను గుర్తించి, వాటిపై చర్యలు చేపట్టి, వాటిని మూసివేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తుఖ్మీర్‌పూర్, కరవాల్ నగర్, గోకుల్‌పురి, ఘాజీపూర్, అలీ విహార్, మిథాపూర్ పరిసర ప్రాంతాలతో సహా 17 ప్రధాన కాలుష్య హాట్స్పాట్లలో డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. ఇక్కడ అక్రమంగా రంగులు వేసే యూనిట్లు, జీన్స్ వాషింగ్ యూనిట్లను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది.ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా 15 రోజుల పాటు ఈ డ్రోన్ సర్వే నిర్వహించనున్నారు. డ్రోన్ ఆధారిత ఆర్థో-రెక్టిఫైడ్ ఇమేజరీ (ఓఆర్ఐ)ని ఇందుకోసం వినియోగించనున్నారు. ఇది కాలుష్య యూనిట్లకు ఫోటోలు తీస్తుంది. ఈ సర్వేలో ఉపయోగించే డ్రోన్ దాదాపు 45-60 నిమిషాల పాటు గాలిలో ఎగురుతుంది. దీని విజిబిలిటీ పరిధి 3-5 కి.మీ ఉంటుంది. ఇది 750 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది. ఈ సర్వే కోసం 17 డ్రోన్లను ఉపయోగించనున్నారు. ఇందుకోసం డీపీసీసీ టెండర్లు జారీ చేసింది. ఆసక్తి గల ఏజెన్సీలు నిర్ణీత గడువులోగా తమ ప్రతిపాదనలో డ్రోన్ ప్లాన్, డ్రాఫ్ట్ స్క్రిప్ట్, యాక్షన్ ప్లాన్, డ్రాఫ్ట్ డిజైన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.ఇది కూడా చదవండి: ఒద్దికగా సర్దుకుంటే.. ఇల్లే కదా స్వర్గసీమ! -
Delhi air pollution: ‘గ్రాప్-4’ అమలును పర్యవేక్షించిన మంత్రి.. అధికారులకు సూచనలు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో కాలుష్యం అందరినీ కలవరపెడుతోంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ సర్కారు కాలుష్యాన్ని నియంత్రించేందుకు పలు చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగానే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విధానంలోని నాల్గవ దశ అమలువుతోంది.గ్రాప్ విధానంలోని ఫేజ్-4 అమలును పర్యవేక్షించేందుకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ శుక్రవారం రాత్రి నరేలా-సింగు సరిహద్దు ప్రాంతంలో పర్యటించారు. గ్రేప్- 4లో ఢిల్లీలో రిజిస్టర్డ్ బీఎస్- ఫోర్, డీజిల్ పవర్డ్ మీడియం గూడ్స్ వెహికల్స్ (ఎంజీవీలు)నడవవు. ఈ సందర్భంగా గోపాల్ రాయ్ మాట్లాడుతూ ఢిల్లీలో కాలుష్య స్థాయిని తగ్గించేందుకు ఆప్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. గ్రాప్ 4 అమలు చేసి, కాలుష్యం కలిగించే వాహనాల రాకపోకలపై నిషేధం విధించామని, అయితే ఈ విషయంలో నిబంధనలు ఉల్లంఘన జరుగుతున్నదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అందుకే తాము తనిఖీలు నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. #WATCH | Delhi Environment Minister Gopal Rai says, "AAP govt is continuously working to mitigate the level of pollution in Delhi. Entry has been banned for those vehicles which cause pollution, as Grap 4 is implemented. Today, we have received several complaints that vehicles… https://t.co/Y5mm2frQYN pic.twitter.com/2DZEbtsuFV— ANI (@ANI) November 22, 2024రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు కళ్ల మంటలతో బాధపడుతున్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 393గా నమోదైంది. గురువారంతో పోలిస్తే 22 ఇండెక్స్ పాయింట్లు పెరిగాయి. శని, ఆదివారాల వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నిపుణుల అంచనా. రాత్రి సమయంలో పొగమంచు కురిసే అవకాశాలున్నాయి.ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ తెలిపిన వివరాల(ఐఐటీఎం) ప్రకారం శుక్రవారం పశ్చిమ దిశ నుంచి గాలులు వీచాయి. ఈ సమయంలో గాలి వేగం గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వరకు ఉంది. సాయంత్రం ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఇది కాలుష్య కారకాలు, ఘనీభవనానికి కారణమైంది. దీంతో ప్రజలు పొగమంచుతో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇది కూడా చదవండి: UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్ సూచనలు -
ఢిల్లీ కాలుష్యంపై కాప్-29లో చర్చ
బాకు: దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లోని వాయు కాలుష్యం ఇక్కడి ప్రజలను ఇబ్బందుల పాలు చేయడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో చర్చకు కూడా దారితీసింది. అజర్బైజాన్ రాజధాని బాకులో పర్యావరణంపై జరిగిన కాప్-29 శిఖరాగ్ర సదస్సులో ఢిల్లీ కాలుష్యంపై చర్చ జరిగింది.కాప్-29 సదస్సులో పాల్గొన్న నిపుణులు వాయు కాలుష్యంతో వచ్చే అనారోగ్య సమస్యల గురించి హెచ్చరించారు. క్లైమేట్ ట్రెండ్స్ డైరెక్టర్ ఆర్తీ ఖోస్లా మాట్లాడుతూ ఢిల్లీలోని ఏక్యూఐ ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని, కొన్ని ప్రాంతాల్లో క్యూబిక్ మీటర్‌కు 1,000 మైక్రోగ్రాముల కంటే అధికస్థాయి కాలుష్యం నమోదవుతున్నదన్నారు. బ్లాక్ కార్బన్, ఓజోన్, శిలాజ ఇంధనాల దహనం, ఫీల్డ్ మంటలు వంటి అనేక కారణాలతో కాలుష్యం ఏర్పడుతున్నదని తెలిపారు. వీటన్నింటిని ఎదుర్కొనే పరిష్కార మార్గాలను తక్షణం అమలు చేయాల్సివున్నదన్నారు.ఢిల్లీలోని గాలి అత్యంత విషపూరితంగా మారిందని, అక్కడి ప్రజలు ప్రతిరోజూ 49 సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తున్నారన్నాని ఖోస్లా పేర్కొన్నారు. తక్కువ గాలి వేగం గాలిలో కాలుష్య కారకాలను బంధిస్తుందని, ఇటువంటి పరిస్థితి మరింత దిగజారుతోందన్నారు.గ్లోబల్ క్లైమేట్ అండ్ హెల్త్ అలయన్స్ వైస్ ప్రెసిడెంట్ కోర్ట్నీ హోవార్డ్ కెనడాలో జరిగిన ఉదంతాన్ని ఉదహరిస్తూ 2023లో అడవిలో కార్చిచ్చు కారణంగా, వాయు కాలుష్యం ఏర్పడి 70 శాతం జనాభా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయవలసి వచ్చిందని అన్నారు. ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేందుకు పేద దేశాలకు సంపన్న దేశాలు ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రీత్ మంగోలియా సహ వ్యవస్థాపకుడు ఎంఖున్ బైయాంబాడోర్జ్ తమ దేశంలోని తీవ్రమైన వాయు కాలుష్య సమస్యను గురించి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలతో పోలిస్తే నగరాల్లో నివసించే పిల్లల ఊపిరితిత్తుల సామర్థ్యం 40 శాతం తక్కువగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: తాజ్ మహల్ మాయం.. పొద్దున్నే షాకింగ్ దృశ్యం -
తాజ్ మహల్ మాయం.. పొద్దున్నే షాకింగ్ దృశ్యం
ఆగ్రా: ప్రపంచ అద్భుతాలతో ఒకటైన తాజ్ మహల్ మాయమవడం ఏంటి? ఇది పచ్చి అబద్ధం అని అనుకుంటున్నారా? కాదు.. కాదు.. ఇది నిజం.. ఇటీవలికాలంలో తాజ్ మహల్ మాయమైపోతోంది. ఇది ఉదయం వేళల్లో జరుగుతోంది. దీనివెనకగల కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.దేశరాజధాని ఢిల్లీలో మాదిరిగానే ఇప్పుడు యూపీలోని ఆగ్రా నగరంలోనూ కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఆగ్రావాసులు ఊపిరి తీసుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. విపరీతమైన కాలుష్యం కమ్మేసిన కారణంగా ఆగ్రాలో 48 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తాజ్ మహల్ సమీపంలో తొలిసారిగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా నమోదయ్యింది. ఈ నేపధ్యంలో ఏర్పడిన పొగమంచు తాజ్ మహల్‌ను కప్పేస్తోంది. దీంతో ఉదయం వేళ తాజ్ అందాలు చూడాలనుకున్న పర్యాటకులు నిరాశకు గురవుతున్నారు.ఢిల్లీ గ్యాస్ చాంబర్‌గా మారిపోయింది. ఎన్సీఆర్ చుట్టుపక్కల ప్రాంతాలలో గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) 500కి చేరుకుంది. అదే సమయంలో ఢిల్లీకి పక్కనే ఉన్న ఆగ్రా కాలుష్యం బారిన పడింది. ఇక్కడ వాయు కాలుష్యం స్థాయి అంతకంతకూ పెరుగుతోంది. ఫలితంగా ఇక్కడి ప్రజలు, రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఏక్యూఐ ప్రమాదకర స్థాయిని దృష్టిలో ఉంచుకుని, ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రాబోయే 48 గంటలపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. బుధవారం ఉదయానికి వాయు కాలుష్య స్థాయి తగ్గకపోతే మొదటి, రెండో దశల గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్)ను అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది.ఆగ్రాలో పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నవారు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరితో ఆగ్రాలోని పలు ఆస్పత్రులు నిండిపోతున్నాయి. కాలుష్యం పెరుగుతున్నందున ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని, ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్క్‌ను వినియోగించాలని సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఊపిరాడని మరోరోజు.. 500 వద్ద ఏక్యూఐ -
Delhi Pollution: ఢిల్లీలో వరస్ట్ మార్నింగ్
దేశ రాజధానిలో కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతూ.. డేంజర్ లెవల్‌ను దాటిపోయింది. ఈ ఉదయం నగరంలో వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ) 450 severe-plus దాటింది. దీంతో ఈ సీజన్‌కే వరెస్ట్ పరిస్థితి నెలకొంది. మరోవైపు పొగమంచు కమ్మేయడం అన్నీ రవాణా వ్యవస్థలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే పలు ఆంక్షలు విధించగా.. ఈ ఉదయం నుంచి మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ఈ ఉదయం నుంచి ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ)- 4’ కింద మరిన్ని నిబంధనలను అమల్లోకిచ్చాయి. ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం విధించారు. నిత్యావసరాలు అందించే ట్రక్కులకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అలాగే.. ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్, బీఎస్-4 డీజిల్ ట్రక్కులనే తిరగనిస్తారు.మరోవైపు కాలుష్యానికి దట్టమైన పొగమంచు తోడైంది. విమాన ప్రయాణాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఉదయం ఐదు గంటలకు విజిబిలిటీ 150 మీటర్ల దూరానికి పడిపోయింది. ఈ ఉదయం ఏడుగంటలకు.. ఏక్యూఐ 481గా నమోదైంది. 👉ఏక్యూఐ 0-50 మద్య ఉంటే గుడ్, 👉51-100 ఉంటే సంతృప్తికరం, 👉101-200 మధ్య ఉంటే ఓ మోస్తరు కాలుష్యం, 👉201-300 నుంచి పూర్, 👉301 నుంచి 400 మధ్య ఉంటే వెరీ పూర్, 👉401 నుంచి 450 ఉంటే సివియర్, 👉450 పైనే ఉంటే వెరీ సివియర్ ఈ స్థాయిలో ఢిల్లీ కాలుష్యం పెరగడంపై ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్నిరకాల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్లు, పైపులైన్లు.. ఇలా ఎలాంటి నిర్మాణ సంబంధిత ప్రాజెక్టులైనా సరే ఆపేయాలని స్పష్టం చేసింది. అలాగే.. సరి-బేసి వాహన నిబంధనలు అమలు చేయడంపై నిర్ణయం తీసుకోవాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ సూచించింది.కాలుష్యానికి తోడు దట్టమైన పొగమంచు పేరుకుపోయి కనీసం వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఆదివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు విమానాలను రద్దు చేయగా.. మరో 107 విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.సీఏక్యూఎం సూచన మేరకు.. ఇప్పటికే 1 నుంచి ఐదో తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. తాజాగా 6 నుంచి 9, 11 తరగతుల విద్యార్థులకు వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అన్ని పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖను ఢిల్లీ సీఎం ఆతిశీ ఆదేశించారు.ప్రైవేట్ ఆఫీసులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చర్యలు చేపట్టాలని, మిగతావాళ్లను వర్క్‌ఫ్రమ్ హోం ద్వారా పని చేయించుకోవాలని అధికార యంత్రాగానికి సీఏక్యూఎం సిఫారసు చేసింది.ఇదీ చదవండి: మందు పార్టీ లేదా సీఎం సాబ్? -
Delhi: నాలుగు సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తూ..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో తల్లడిల్లిపోతోంది. అక్కడి ప్రజలు సవ్యంగా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీని చుట్టుముట్టిన కలుషిత గాలి జనాన్ని అనారోగ్యం బారిన పడేలా చేస్తోంది.నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్ర స్థాయిలో ఉంది. ఇక్కడి ప్రజలు నాలుగు సిగరెట్లకు సమానమైన పొగను పీలుస్తున్నారని, ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నదని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్) వైద్యులు చెబుతున్నారు. జిమ్స్ ఆస్పత్రికి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ వస్తున్న రోగుల సంఖ్య పెరిగిందన్నారు.చెడు గాలి మరింతగా శరీరంలోనికి చొరబడకుండా ఉండేందుకు మాస్క్‌ని ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఊపిరితిత్తులకు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు కలుషిత గాలికి తీవ్రంగా ప్రభావితమవుతున్నారన్నారు. చెడు గాలి కారణంగా గొంతు, శ్వాసకోశ సమస్యలు వచ్చిన వారు కొన్ని సూచనలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం దట్టంగా పొగమంచు ఉన్నప్పుడు వాకింగ్‌కు వెళ్లకపోవడమే ఉత్తమమని, ఉదయాన్నే గోరు వెచ్చటి నీరు తాగాలని సూచించారు. దుమ్ము, ధూళితో కూడిన ప్రదేశాలకు వెళ్లడాన్ని నివారించాలని, అలాగే నిర్మాణ పనులు చేపట్టకపోవడం మంచిదని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మరింత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: Medical College Fire: చిన్నారుల మృతి హృదయవిదారకం: ప్రధాని మోదీ -
పొగబారిన ఉత్తరాది.. 50 రైళ్లు, పలు విమానాలపై ప్రభావం
ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా ఉత్తర భారతదేశమంతా గత రెండు రోజులుగా తెల్లటి పొగమంచు కింద తలదాచుకుంటోంది. ఈరోజు (శుక్రవారం) మూడో రోజు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. పెరిగిన చలికి తోడు పొగమంచు కారణంగా పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. పొగమంచు దట్టంగా అలముకోవడంతో రవాణా సమస్య తీవ్రమయ్యింది. ఉత్తర భారతదేశంలోని పలు నగరాల్లో పొగమంచు కారణంగా ఉదయం 9 గంటలకు వరకూ కూడా విజిబులిటీ సరిగ్గా లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. రైళ్లు, విమానాలపై కూడా పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ రోజు కూడా అమృత్సర్, చండీగఢ్, ఢిల్లీల నుండి పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రన్‌వేపై చాలా తక్కువ విజిబులిటీ కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. పొగమంచు కారణంగా లక్నో, చండీగఢ్‌లకు వచ్చే విమానాలను జైపూర్‌కు మళ్లించారు.ఇక రైళ్ల విషయానికొస్తే ఢిల్లీలోని వివిధ స్టేషన్లలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీకి వచ్చే 30కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లోని 50కి పైగా రైళ్లపై పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. న్యూఢిల్లీకి వచ్చే 30కి పైగా రైళ్లు, ఆనంద్ విహార్‌కు వచ్చే 10 రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎన్సీఆర్లోని 50కి పైగా రైళ్లపై పొగమంచు ప్రభావం కనిపిస్తోంది. ఈ రైళ్లన్నీ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది కూడా చదవండి: Delhi Pollution: గ్యాస్ ఛాంబర్ కన్నా ఘోరం.. బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! -
Delhi Pollution: గ్యాస్ ఛాంబర్ కన్నా ఘోరం.. బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు!
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత క్షీణ స్థాయికి చేరింది. ఢిల్లీ ఏక్యూఐ స్థాయి గురువారం 400 దాటింది. ఈ స్థాయి కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ గ్రాప్- 3ని నవంబర్ 15 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.గ్రాప్- 3 నిబంధనల ప్రకారం కాలుష్యం అదుపులోకి వచ్చే వరకు నిర్మాణ సంబంధిత పనులను నిలిపివేయనున్నారు. భవనాల కూల్చివేతలు, మైనింగ్‌కు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు నిలిపివేయనున్నారు. ప్రాథమిక పాఠశాలలకు ఆన్లైన్ తరగతులు నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. గత రెండు రోజులుగా ఢిల్లీలో కాలుష్య స్థాయి అత్యంత పేలవమైన స్థాయి నుంచి తీవ్ర స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ వార్ రూమ్‌లో పర్యావరణ శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించింది. అనంతరం పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్.. కాలుష్య నివారణకు చేపడుతున్న మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.రాజధాని ఢిల్లీ గాలి పీల్చడం ఇప్పుడు ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారింది. పంజాబ్-హర్యానాలలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చే పొగ కారణంగా, రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్‌గా మారింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తాజా డేటా ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక అంటే ఏక్యూఐ 452కి చేరింది. సైన్స్ మ్యాగజైన్ లాన్సెట్ న్యూరాలజీ జర్నల్‌లో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం కారణంగా సబ్రాక్నోయిడ్ హెమరేజ్(బ్రెయిన్ స్ట్రోక్-ఎస్ఏహెచ్) కేసులు పెరుగుతున్నాయి. తీవ్రమైన వాయు కాలుష్యంఅంగ వైకల్యానికి, అనేక సందర్భాల్లో గుండె వైఫల్యానికి కారణంగా నిలుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: డయాబెటిస్ వాట్సాప్ చానల్ -
ఉత్తరాదిపై పొగమంచు దుప్పటి.. గ్యాస్ ఛాంబర్‌గా రాజధాని!
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెడుతున్న కారణంగా ఢిల్లీతో పాటు, పలు ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు దట్టంగా కమ్మేసింది. గాలి విషపూరితంగా మారింది. వాయు నాణ్యత కనిష్టానికి చేరింది. దీంతో ఉత్తరాది రాష్ట్రాలలోని జనం ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వాతావరణశాఖ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలలో ఉత్తర భారతదేశం అంతటా దట్టమైన తెల్లటి పొగమంచు కమ్మేసినట్లు కనిపిస్తోంది. మహారాష్టలోనూ ఇదే స్థితి కనిపిస్తోంది. మొన్నటి దీపావళికి స్వల్పంగా కనిపించిన ఈ పొగమంచు దుప్పటి డిసెంబర్ చివరి నాటికి తీవ్రంగా మారుతుందని, ఇది జనవరి వరకూ కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నాటి శాటిలైట్ చిత్రాలను పరిశీలించినప్పుడు ఇదే స్పష్టమవుతోంది. కొరియన్ జియో కాంప్శాట్ 2ఎ ఉపగ్రహం పంపిన రెండు చిత్రాలను పోల్చి చూసినప్పుడు ఇది తేలింది. తాజా చిత్రాలను చూస్తే ఢిల్లీపై పొగమంచు దట్టంగా అలముకున్నట్లు కనిపిస్తోంది. గాలి నాణ్యత ‘తీవ్రమైన’ వర్గానికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్కును దాటింది. Today, Delhi’s daily average AQI clocked 418 as per the 4 PM AQI Bulletin by CPCB. The CAQM Sub-Committee on GRAP accordingly took stock of the air quality scenario and the AQI forecast, including for the meteorological conditions as made by IMD/ IITM.Cont. (1/5)— Commission for Air Quality Management (@CAQM_Official) November 13, 2024గ్యాస్ ఛాంబర్‌గా రాజధానిదేశరాజధాని ఢిల్లీలోని ప్రజలు ఇప్పుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి కాలుష్యపూరిత గాలి ఆరోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో తీవ్ర స్థాయి వాయు కాలుష్యం కేటగిరీగా ప్రకటించింది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(కేంద్ర కాలుష్య నియంత్ర మండలి). పంట వ్యర్ధాల దహనం, వాహన కాలుష్యం, గాలి వేగం మందగించడంతో కాలుష్యం పెరగడానికి కారణంగా గుర్తించారు.సీపీసీబీ తాజా డేటా ప్రకారం ఢిల్లీలో సగటు గాలి నాణ్యత సూచిక(ఏక్యూఐ)432కి చేరుకుంది. అంటే ఢిల్లీలో గాలి ‘వెరీ సీరియస్ కేటగిరీ’లో ఉంది. ఢిల్లీలోని వివిధ ప్రాంతాల వాయు నాణ్యత సూచికను సీపీసీబీ విడుదల చేసింది. దీని ప్రకారం నజఫ్గఢ్లోని గాలి అత్యంత కలుషితంగా మారింది. ఏక్యూఐ 482గా నమోదయ్యింది. ఇదేవిధంగా ఏక్యూఐ 480తో నెహ్రూ నగర్ రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో ఆనంద్ విహార్ ఉంది. ఈ నేపథ్యంలో గ్రాప్ - 3 నియంత్రణల అమలుపై నేడు నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం.ఇది కూడా చదవండి: రిజర్వేషన్ల రద్దుకు ‘యువరాజు’ కుట్రలు: మోదీ -
Delhi Pollution: కమ్మేసిన పొగమంచు.. ప్రమాదస్థాయిలో కాలుష్యం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేసింది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఈరోజు(బుధవారం) ఉదయం 5 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 339గా నమోదైంది. దీనికితోడు చలి వాతావరణం నెలకొంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో పొగమంచు కారణంగా విజిబులిటీ తగ్గింది.ఢిల్లీ ఎన్సీఆర్లో గాలి నాణ్యత నిరంతరం క్షీణిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం దేశ రాజధానిలో గాలి నాణ్యత బుధవారం కూడా ‘చాలా పేలవమైన’ కేటగిరీలో ఉంది. గాలి నాణ్యత 301 నుండి 400 మధ్య ఉన్నప్పుడు జనం శ్వాసకోశ వ్యాధులకు లోనవుతారు. ఇదేవిధంగా ఏక్యూఐ 401 నుండి 500 మధ్య ఉన్నప్పుడు తీవ్రమైన కాలుష్యం కమ్మేసినట్లు పరిగణిస్తారు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే పలు వ్యాధులతో బాధపడుతున్న వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది.సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో మంగళవారం ఉదయం 7:30 గంటలకు సగటు గాలి నాణ్యత సూచిక 355గా నమోదైంది. ఇది చాలా పేలవమైన కేటగిరీలోకి వస్తుంది. సోమవారం ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచీ 347గా నమోదైంది. ఇదిలావుండగా ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ఢిల్లీ సెక్రటేరియట్లో నైట్ షిఫ్ట్ ఉద్యోగులకు హీటర్లను పంపిణీ చేశారు. చలి మంటలను వేస్తే కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం హీటర్లను పంపిణీ చేసిదని తెలిపారు. ఇది కూడా చదవండి: రాష్ట్రంలో రిలయన్స్ ఎనర్జీ బయోగ్యాస్ ప్లాంట్లు -
ఢిల్లీ కాలుష్యం: కేంద్రంపై సుప్రీం అసహనం
ఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం పెరిగి గాలి నాణ్యత క్షిణించటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యానికి దారితీసే పొరుగు రాష్ట్రాల్లో భారీగా పంట వ్యర్థాలను తగులబెట్టటంపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని సవరణల ద్వారా పళ్లు లేని చట్టంగా మార్చడంపై కేంద్రాన్ని నిలదీసింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఐశ్వర్య భాటి స్పందిస్తూ.. 10 రోజుల్లో నిబంధనలను ఖరారు చేస్తామని, చట్టం అమలులోకి వస్తుందని కోర్టుకు తెలిపారు.‘‘మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతున్నాం. ఈ అంశంలో కేంద్రం ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు. పర్యావరణ పరిరక్షణ చట్టం శక్తిలేని చట్టంగా మార్చారు. శిక్ష నుంచి విముక్తి పొందటం కోసం సెక్షన్ 15 తీసుకువచ్చారు. పెనాల్టీ విధింటం కూడా కేంద్ర పభుత్వానికి సాధ్యం కావటం లేదు’’ సుప్రీంకోర్టు అహనం వ్యక్తం చేసింది.Air Pollution: Supreme Court takes strong exception on Punjab and Haryana governments not taking any action against people for stubble burning.Supreme Court says if these governments are really interested in implementing the law there will have been at least one prosecution.… pic.twitter.com/ykmhWlza4g— ANI (@ANI) October 23, 2024 పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల కార్యదర్శి (పర్యావరణ), అదనపు ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం)కి షోకాజ్ నోటీసులు అందజేశామని ఏఎస్జీ తెలిపారు. 10 రోజుల్లో, సెక్షన్ 15 పూర్తిగా అమలు చేయబడుతుందని అన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం పర్యావరణాన్ని పరిరక్షించడానికి సిద్ధంగా ఉంటే.. సెక్షన్ 15కి సవరణకు ముందే చర్యలు తీసుకునేవాళ్లు. కానీ, ఇదంతా రాజకీయం కోసమే చేస్తున్నారు తప్ప మరేమీ చేసిందేమీ లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. -
కాలుష్య కోరల్లో ఢిల్లీ.. నియంత్రణకు అధికారుల ఆంక్షలు
ఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం మళ్లీ తీవ్ర స్థాయిలో పెరిగింది. పొగమంచుకు గాలి కాలుష్యం తోడవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి అధికారులు ఆంక్షలు విధించారు. ఆదివారం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 మార్క్‌ను దాటింది. గాలి నాణ్యతా ప్రమాణాలు తీవ్రమైన ప్రమాదానికి చేరాయి. దేశ రాజధానిలో కాలుష్యం తీవ్ర స్థాయిలో పెరగడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ (CAQM) నియంత్రణ చర్యలకు పూనుకుంది. దేశ రాజధాని ప్రాంతంలో అనవసరమైన నిర్మాణ పనులను నిలిపివేశారు. BS-III, BS-IV డీజిల్ వాహనాల వాడకాన్ని నిషేధించింది. కాలుష్యం నేపథ్యంలో 5వ తరగతి వరకు తరగతులను నిలిపివేయడంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర కమిషన్ సూచించింది. "శనివారం సాయంత్రం నుండి దేశ రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత అకస్మాత్తుగా క్షీణించింది. దీంతో కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ కార్యాచరణ కమిటీ ఈ రోజు ఉదయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాలుష్య నియంత్రణకు ప్రణాళికను అమలు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఢిల్లీ పరిసర ప్రాంతంలో తక్షణమే ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.” అని కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. రోడ్లు, కాలుష్యం తీవ్రంగా ఉండే ప్రదేశాల్లో నీటిని చిలకరించేలా చూడండి ప్రజా రావాణా సేవలను ఎక్కువగా ఉపయోగించుకోండి. వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించండి అత్యవసరమైన ప్రాజెక్టులు మినహా.. నిర్మాణ, కూల్చివేత కార్యకలాపాలను తగ్గించండి. స్టోన్ క్రషర్స్ ఆపరేషన్‌ను మూసివేయండి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని నిలిపివేయండి BS-III పెట్రోల్, BS-IV డీజిల్ LMVలపై కఠినమైన పరిమితులను విధించండి. నాల్గవ తరగతి వరకు పిల్లలకు భౌతిక తరగతులను నిర్వహించకండి. ఆన్లైన్లో బోధించండి. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు.. -
రైతులను విలన్లుగా చూపొద్దు.. పంజాబ్ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
ఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి రైతులను విలన్లుగా చేయడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పంట వ్యర్థాలను వారు కాల్చడానికి చాలా కారణాలు ఉండొచ్చు.. కానీ దానిని అరికట్టడానికి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని పంజాబ్ ప్రభుత్వంపై మండిపడింది. ప్రతియేటా శీతాకాలం ఢిల్లీలో కాలుష్యం పెరగడాన్ని అరికట్టాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. పంట వ్యర్థాలపై పంజాబ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై ఇలా స్పందించింది. 'రైతులను విలన్లుగా చూపొద్దు. యంత్రాల ఉపయోగం వంటి అనేక కారణాలు వారికి ఉండొచ్చు. పంటవ్యర్థాలు కాల్చడాన్ని అరికట్టాల్సింది ప్రభుత్వాలే. ప్రభుత్వమే ప్రోత్సహకాలు ప్రకటించవచ్చు కదా..? పంజాబ్‌లో మొత్తంలో కేవలం 20 శాతం కేసుల్లో మాత్రమే జరిమానా విధించారు. జరిమానాతో పాటు ఎఫ్ఐఆర్ వంటి చర్యలను తీసుకోవచ్చు. వరి పెంపకం వల్ల పంజాబ్ నేలల్లో తేమశాతం తగ్గిపోతుంది.' అని సుప్రీంకోర్టు మండిపడింది. ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించడానికి పొరుగు రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది. గతంతో పోలిస్తే ఈ నవంబరులో దిల్లీ మరింత కాలుష్య నగరంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాల కాల్చివేతల ఘటనలపై నివేదిక ఇవ్వాలని దిల్లీ, యూపీ ప్రభుత్వాలకు కోర్టు ఆదేశాలిచ్చింది. అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబరు 5కు వాయిదా వేసింది. ఇదీ చదవండి: ముంబయి 26/11 దాడులకు 15 ఏళ్లు.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం -
దీపావళి పండుగ కారణంగా ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
-
Delhi's Air Pollution: కాలుష్యం కోరల్లో ఢిల్లీ ప్రజలు (ఫొటోలు)
-
ఢిల్లీ కాలుష్యం తగ్గించడానికి కృత్రిమ వర్షం?
ఢిల్లీ: ఢిల్లీలో వాయు నాణ్యత అడుగంటిపోతోంది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన ఉద్గారాల వల్ల గత ఏడు రోజులుగా కాలుష్య స్థాయిలు విషమంగానే కొనసాగుతున్నాయి. గాలి నాణ్యత పెంచడానికి తక్షణ ఉపాయం ఆలోచించాలని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది. నవంబర్ 20-21లో రెండు రోజుల పాటు ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించాలని యోచిస్తోంది. ఐఐటీ కాన్పూర్ బృందంతో ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్, ఆర్థిక మంత్రి అతిషి సమావేశమయ్యారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి కృత్రిమ వర్షం కురిపించవచ్చని ప్రతిపాదించారు. కృత్రిమ వర్షానికి సంబంధించిన ప్రణాళికను ఢిల్లీ ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ నిపుణులను కోరింది. ఈ ప్రణాళికను సుప్రీంకోర్టులో శుక్రవారం సమర్పించనుంది. ఢిల్లీలో కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. సర్వోన్నత న్యాయస్థానం ఆమోదముద్ర వేస్తే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం ఈ పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాయి. "కృత్రిమ వర్షం కురిపించాలంటే కనీసం 40 శాతం మేఘాలు కమ్ముకోవాలి. నవంబర్ 20-21 తేదీల్లో మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. కృత్రిమ వర్షం ప్రణాళికను అమలు చేసేందుకు అనుమతి లభిస్తే అధ్యయనాన్ని నిర్వహిస్తాం' అని ఐఐటీ కాన్పూర్ నిపుణులు తెలిపారు. దేశ రాజధానిలో గాలి కాలుష్యం రాజకీయ వివాదంగా పరిణమించకూడదని సుప్రీంకోర్టు ఇటీవల హెచ్చరించింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో పంట వ్యర్థాల దహనాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. కాలుష్య సమస్యను ఢిల్లీ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని కోరింది. కృత్రిమ వర్షం అంటే? కరువుల ప్రభావాన్ని తగ్గించడం, అటవీ మంటలను నివారించడం, గాలి నాణ్యతను పెంచడానికి సాధారణంగా ఉపయోగించే కృత్రిమ పద్ధతి. వివిధ రసాయనిక పదార్థాలను మేఘాలలోకి ప్రవేశపెట్టడం ద్వారా వర్షపాతాన్ని కలిగిస్తారు. సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాలను హెలికాప్టర్ల ద్వారా మేఘాలలోకి విడుదల చేస్తారు. ఈ రసాయనాలు నీటి ఆవిరిని మేఘాలుగా ఏర్పర్చి వర్షం కురిసేలా చేస్తాయి. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యానికి రీజనరేటివ్ వ్యవసాయమే విరుగుడు..? అసలేంటది..? -
ఢిల్లీ కాలుష్యానికి రీజనరేటివ్ వ్యవసాయమే విరుగుడు..? అసలేంటది..?
ఢిల్లీ: ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోవడంతో ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో కాలుష్యం తీవ్రతరమౌతోందని సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొనాలని ఆదేశించింది. ఇదే క్రమంలో ఆనంద్ మహీంద్రా రీజనరేటివ్ అగ్రికల్చర్(పునరుత్పత్తి వ్యవసాయం) సరైన ప్రత్యామ్నాయ మార్గమని ఎక్స్‌లో షేర్ చేశారు. ఇంతకీ ఈ పునరుత్పత్తి వ్యవసాయం అంటే ఏంటీ..? పునరుత్పత్తి వ్యవసాయం అనేది వ్యవసాయం చేసే విధానాల్లో ఓ పద్ధతి. పురుగు మందులు, ఎరువులు, భారీ పనిముట్లు వాడకుండా ప్రకృతికి అనుగుణంగా నేలసారాన్ని పెంచుతూ సాగు చేసే విధానం. గ్రీన్ హౌజ్ ఉద్గారాలను తగ్గించే విధానాలను ఎంచుకుంటూ జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తారు. పర్యావరణ అనుకూలమైన వ్యవసాయ విధానాలను అనుసరిస్తారు. పంట కోతలను కాల్చివేయకుండా వాటినే ఎరువుగా వాడుకునే విధానాలను అనుసరిస్తారు. ఇదీ చదవండి: వాయు కాలుష్యం ఎఫెక్ట్‌తో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం ఇందులో అనుసరించే కొన్ని పద్ధతులు.. నేల సహజ నిర్మాణాన్ని భంగపరచకుండా సాగు చేస్తారు. ఇందుకు నేలను భారీ యంత్రాలతో కాకుండా పశువులతో దున్నుతారు. అతిగా దున్నడం వల్ల నేల నుంచి వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ విడుదల అవుతుంది. పంట మార్పిడి విధానాన్ని అనుసరించాలి. ఓకేసారి వివిధ రకాల పంటలను వేస్తారు. దీని వల్ల పోషకాలతో నేల సారవంతమౌతుంది. కలుపు మొక్కలను నిరోధిస్తుంది. కంపోస్టు ఎరువును వినియోగిస్తారు. నేలలో నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని ఈ విధానం పెంచుతుంది. అంతేకాకుండా సూక్ష్మజీవుల కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. రసాయనిక ఎరువులు ఉపయోగించడం వల్ల నేలను సారవంతం చేసే సూక్ష్మజీవులు అంతం అవుతాయి. పశువుల ఎరువును మాత్రమే పంటలకు ఉపయోగిస్తారు. దీనివల్ల మొక్కలు ఏపుగా పెరగడమే కాకుండా నేల సారాన్ని పెంచుతాయి. తెగుళ్లను కూడా నియంత్రిస్తాయి. వ్యవసాయంలో ఉత్పాదకతతో పాటు పోషక విలువల్ని పెంచే పంటలను ఎంచుకోవాలి. పునరుత్పత్తి వ్యవసాయం పర్యావరణానికి మాత్రమే కాదు, రైతులకు, వినియోగదారులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రైతుల ఆదాయాన్ని, అలాగే ఆహార నాణ్యత, పరిమాణాన్ని మెరుగుపరుస్తుంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా వాతావరణ మార్పులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇదీ చదవండి: ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా చక్కని ఉపాయం -
ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆనంద్ మహీంద్రా చక్కని ఉపాయం
ఢిల్లీ: దేశ రాజధానిలో ప్రజలు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంతో సమస్య తీవ్రతరమౌతోంది. గాలిలో కాలుష్య స్థాయిలు పెరగడంతో సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని మందలించింది. కాలుష్యాన్ని తగ్గించడానికి వెంటనే ఏదైనా పరిష్కారాన్ని కనుగొనాలను సూచించింది. ఇదే క్రమంలో కాలుష్యాన్ని తగ్గించడానికి చక్కటి పరిష్కారం ఉందని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్(ఎక్స్) లో పేర్కొన్నారు. ఢిల్లీలో కాలుష్యాన్ని రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానంతో తగ్గించవచ్చని చెప్పారు. " ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానం ఉపయోగపడుతుంది. పంటవ్యర్థాల దహనానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఈ పద్ధతి సూచిస్తుంది. అంతేకాకుండా నేలసారం కూడా పెరుగుతుంది.' అంటూ ఇందుకు సహకరించేవారి పేర్లను కూడా ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. To heal Delhi’s pollution, Regenerative Agriculture MUST be given a chance. It provides a remunerative alternative to stubble burning while simultaneously increasing soil productivity. @VikashAbraham of @naandi_india stands ready to help. Let’s do it! pic.twitter.com/XvMPAghgdQ — anand mahindra (@anandmahindra) November 7, 2023 ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. గాలి పూర్తిగా కలుషితం కావడంతో దేశ రాజధానిలో నవంబర్ 10 వరకు పాఠశాలలకు సెలవులు కూడా ఇచ్చారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 13 నుంచి 20 వరకు వాహనాలకు సరి-భేసి విధానాన్ని కూడా అమలుపరచనుంది. ప్రస్తుతం పంజాబ్‌లో పంట కోతలు అయిపోయి.. ఆ వ్యర్ధాలను దహనం చేసే సమయం కావడం వల్ల ఢిల్లీలో పరిస్థితి తీవ్రతరమౌతోంది. పునరుత్పత్తి వ్యవసాయం(Regenerative Agriculture) : పునరుత్పత్తి వ్యవసాయం అనేది వ్యవసాయం చేసే విధానాల్లో ఓ పద్ధతి. పురుగు మందులు, ఎరువులు, భారీ పనిముట్లు వాడకుండా సాగు చేస్తారు. గ్రీన్ హౌజ్ ఉద్గారాలను తగ్గించే విధానాలను ఎంచుకుంటారు. జీవవైవిధ్యాన్ని పెంపొందిస్తూ పర్యావరణ అనుకూలంగా వ్యవసాయం చేస్తారు. పంట కోతలను కాల్చివేయకుండా వాటినే ఎరువుగా వాడుకునే విధానాలను అనుసరిస్తారు. ఢిల్లీ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ పద్ధతినే ప్రస్తుతం ఆనంద్ మహీంద్రా సూచించారు. ఇదీ చదవండి: కాలుష్యంపై మీకు ఏం పట్టింపు లేదా..? -
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరం ఢిల్లీ అని ఓ అధ్యయనం చెబుతోంది. తీవ్ర కాలుష్యం బారిన పడుతున్న ఢిల్లీ వాసులు తమ ఆయుర్దాయంలో అత్యధికంగా 11.9 ఏళ్లు కోల్పోతున్నారని పేర్కొంది. జాతీయ వాయు నాణ్యత ప్రమాణం ప్రకారం చూసినా దేశ రాజధాని వాసులు సగటు కన్నా 8.5 ఏళ్లు నష్ట పోతున్నారని తెలిపింది. భారత్‌లో ప్రజల ఆరోగ్యానికి కాలుష్యం పెనుముప్పుగా తయారైందని యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్‌ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే భారత్‌లో చాలా ఎక్కువ కాలుష్యం ఉందని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం పర్టిక్యులేట్ మాటర్ (పీఎం) 2.5 ఐదు మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్‌గా కాలుష్యం ఉండాల్సి ఉంది. కాలుష్య తీవ్రతలు ఇలానే కొనసాగితే భారతీయుల సగటు ఆయుర్దాయం కన్నా 5.3 ఏళ్లు తగ్గుతుందని తెలిపింది. దేశంలోని మొత్తం 130 కోట్ల మందికి పైగా ప్రజలు వార్షిక సగటు కాలుష్య స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. చదవండి: చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే! జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్లకు మించి కాలుష్యం ఉండే ప్రాంతాల్లో 67.4 శాతం మంది నివసిస్తున్నారని నివేదిక తెలిపింది. సగటు భారతీయుడి ఆయుర్దాయం కాలుష్యం కారుణంగా 5.3 ఏళ్లు తక్కువగా ఉంటోందని వివరించింది. 2021లో భారత్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరి్టక్యులేట్ మాటర్ (పీఎం) 2.5 నమోదు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగటు కన్నా 2.6 ఏళ్లు, తెలంగాణ ప్రజలు సగటు కన్నా 3.2 ఏళ్లు కోల్పోతున్నారని తెలిపింది. జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్ల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆయుష్షు ముప్పు లేదని తెలిపింది. దేశంలో హృదయ సంబంధ వ్యాధులతో 4.5 ఏళ్లు, తల్లీ పిల్లల పోషకాహార లోపంతో 1.8 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నట్లు నివేదిక పేర్కొంది. 2013– 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కాలుష్యంలో భారత్ వాటా 59.1 శాతమని తెలిపింది. సగటు కంటే ఎక్కువగా ఆయుర్దాయం కోల్పోతున్న అత్యధిక జనాభా కలిగిన 10 రాష్ట్రాలు వరసగా.. యూపీ, బిహార్, బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయని తెలిపింది. -
ఢిల్లీలో మళ్లీ తీవ్రస్థాయికి వాయు కాలుష్యం
-
ఢిల్లీలో మూతపడనున్న పాఠశాలలు
Schools To Remain Shut From Tomorrow Till Further Orders: రేపటి నుంచి ఢిల్లీలో పాఠశాలలు మూతపడనున్నాయి. వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉండటంతో స్కూళ్లను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు పాఠశాలలను మూసివేయనున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖామంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. కాగా, ఆన్లైన్ క్లాసులు జరుగుతాయని స్పష్టం చేశారు. (భారత్‌లో ఒమిక్రాన్ కలకలం) ఇక పరీక్షలు సైతం యథావిథిగా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. వాయు కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో పాఠశాలలను ఏ విధంగా తెరుస్తారని ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలలను మూసివేసి, ఆన్లైన్ క్లాస్‌లను నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం మొగ్గుచూపింది. -
మ్యాగజైన్ స్టోరీ 16 November 2021
-
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తారాస్థాయికి చేరడంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ వాయు కాలుష్యంపై సోమవారం వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఢిల్లీ అంతటా ఎయిర్ ప్యూరిఫైయర్ టవర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్యూరిఫైయర్ టవర్స్ ఏర్పాటుపై పది రోజుల్లోగా ప్రణాళిక ఖరారు చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని తగ్గించాలని.. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విభేదాలు పక్కనపెట్టి కలిసి పని చేయాలని హితవు పలికింది. ఢిల్లీలో విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వెళ్లగక్కింది. తీవ్రమైన కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, గ్యాస్ చాంబర్లలో జనం చస్తూ బతుకుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పొగలో నివసించలేక పోతున్నామని అక్కడి జనాలు గగ్గోలుపెడుతున్నారని.. భయాందోళనకు గురవుతున్న నగరవాసులను ఒకేసారి చంపేయండి అని చీవాట్లు పెట్టింది. ఢిల్లీలో మనుగడ సాగించడం నరకం కంటే భయంకరంగా ఉంటుందంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాక ఢిల్లీ జల కాలుష్యాన్ని సైతం తనిఖీ చేస్తామని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
‘ఎంపీలు ఢిల్లీ కాలుష్యాన్ని పెద్దగా పట్టించుకోరు’
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ హేమమాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నవంబర్ 15న జరిగిన పార్లమెంట్ ప్యానెల్ సమావేశానికి పలువురు ఎంపీలు డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఆ లిస్టులో నటి హేమమాలిని కూడా ఉన్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు హేమమాలిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో నివసించని ఎంపీలే సమావేశానికి హాజరు కాలేదన్నారు. ఎందుకంటే ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో నివసించేవారికి వాయు కాలుష్య నివారణపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. కానీ కాలుష్య తీవ్రత తక్కువగా ఉండే ముంబై వంటి నగరాల్లో నివసించేవారికి ఢిల్లీ కాలుష్యం గురించి పెద్దగా ఆసక్తి ఉండదన్నారు. అందుకే వారు సమావేశానికి హాజరు కాలేదని పేర్కొన్నారు. బాధ్యత గల ఎంపీగా ఉండి ఢిల్లీ కాలుష్య నియంత్రణ సమావేశానికి గైర్హాజరవడమే కాక పట్టింపు లేనట్లుగా మాట్లాడటంపై ఢిల్లీవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే సమావేశానికి గైర్హాజరైన తూర్పు ఢిల్లీ ఎంపీ, క్రికెటర్ గౌతమ్ గంభీర్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం హేమమాలిని ఇంతటి తీవ్రమైన సమస్యను తేలికగా తీసిపారేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అలా అయితే జిలేబీలు తినడమే మానేస్తా : గంభీర్
సాక్షి, న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్య అంశంపై ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకాకపోడంతో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై గౌతమ్ గంభీర్ సోమవారం తనదైన శైలీలో స్పందించారు. తాను జిలేబీలు తినడం వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుదంటే అవి తినడమే మానేస్తానని చెప్పారు. అసలు ఏం జరిగిందంటే.. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం అంశంపై పార్లమెంట్ ప్యానెల్ గత శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి గంభీర్ డుమ్మా కొట్టి, ఇండోర్‌లో జరిగిన భారత్, బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్‌కి వెళ్లాడు. అక్కడ వీవీఎస్ లక్ష్మణ్, జతిన్ సప్రూలతో జిలేబీ తింటూ ఆహ్లాదంగా గడిపాడు. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై ఆమ్ఆద్మీ శ్రేణులు మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు కాలుష్యంతో అల్లాడిపోతుంటే గంభీర్ మాత్రం ఇండోర్‌కి వెళ్లి జిలేబీలు తింటూ ఎంజాయ్ చేస్తున్నాడని విమర్శించారు. ఎంజాయ్ చేయడం ఆపి వాయు కాలుష్యంపై జరిగే సమావేశాల్లో హాజరుకావాలంటూ చురకలు అంటించారు. ఆదివారం మరో అడుగు ముందుకేసి ‘గౌతమ్ గంభీర్ కనిపించడం లేదు’ అంటూ పోస్టర్లు వేయించారు. . ‘మీరు ఈ వ్యక్తిని చూశారా? చివరిసారిగా ఇండోర్‌లో స్నేహితులతో కలిసి జిలేబీలు తింటూ కనిపించాడు. ఢిల్లీ మొత్తం అతని కోసం వెతుకుతోంది’ అని రాసి ఉన్న పోస్టర్లు, బ్యానర్లు రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఉంచారు. దీనిపై గౌతమ్ స్పందిస్తూ..‘ ఒకవేళ నేను జిలేబీలు తినడం వల్లే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందని భావిస్తే.. ఈ క్షణం నుంచే అవి తినడం మానేస్తా. నన్ను ట్రోల్ చేయడానికి కేటాయించే సమయాన్ని కాలుష్య నివారణ అంశాలపై కేటాయిస్తే ఇప్పుడు మనం స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేవాళ్లం’ అని పరోక్షంగా ఆప్ నేతలను విమర్శించారు. -
ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ : రాజధానిలో వాయు కాలుష్యం పెరగడంపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బుధవారం ఢిల్లీ వాయు కాలుష్యంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్.. హైడ్రోజన్ ఇంధన ఆధారత వాహానాల టెక్నాలజీని ఉపయోగించాలని ఆదేశించారు. అంతేగాక వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై డిసెంబర్ 3 నాటికి నివేదిక ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కాగా ఢిల్లీలో విపరీతంగా పెరిగిన వాయు కాలుష్యంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. -
ఊపిరి తీసుకోవడమే కష్టం.. ఇంకా షూటింగా
న్యూఢిల్లీ: తీవ్రమైన కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించాలని, ఆ పొగలో తాము నివసించలేకపోతున్నామని నగర ప్రజలు మొత్తుకుంటున్నారు. ఇక కాలుష్యం కష్టాలు సినిమా వాళ్లను కూడా ఇబ్బందుల్లోకి నెట్టాయి. కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్, లక్ష్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దోస్తానా 2’. షూటింగ్ షెడ్యూల్లో భాగంగా ఢిల్లీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశ రాజధానిలో ఆవరించి ఉన్న తెల్లటి దట్టమైన పొగతో ఎదుటివాళ్లు సైతం సరిగా కనిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సినిమా చిత్రీకరణ కష్టమని భావించిన యూనిట్.. షూటింగ్ రద్దు చేసుకుంది. కనీసం ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండటంతో వాతావరణం తిరిగి సాధారణ స్థితికి వచ్చేవరకు షూటింగ్‌ను నిలిపివేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. కాగా 2008లో ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దోస్తానా’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి ‘దోస్తానా 2’ సీక్వెల్‌గా రానుంది. -
ముంచుకొస్తున్నది పర్యావరణ ప్రళయం
ఢిల్లీని జాతీయ రాజధానిగా ప్రేమిస్తాం. అది కాలుష్యానికి రాజధాని. ఇక్కడ ఇంధన వనరుల వినియోగం, విపరీతంగా పెరిగిపోతున్న జనసంఖ్య, చెట్లను ధ్వంసం చేసి నేలను చదునుచేసి, కార్బన్ విసర్జన పరిమాణాన్ని నిరంతరం పెంచే దుర్భర కార్యక్రమం జరుగుతున్న దారుణమైన ప్రదేశం ఢిల్లీ. వాతావరణ అత్యవసర పరిస్థితి ప్రపంచం వ్యాప్తమై ఉందని 11 వేల మంది శాస్త్రజ్ఞులు 153 దేశాల నుంచి మనందరినీ హెచ్చరిస్తున్నారు. మన నవ నాగరిక జీవనానికి ఊపిరులూదుతున్న ఆక్సిజన్‌ను హరించి, హరిత హరణ విసర్జనలతో పర్యావరణాన్ని ఊహాతీతంగా పతనం చెందిస్తున్న మానవ దైనందిన కార్యక్రమాలలో సమూలమైన మార్పులు రాకపోతే మన సంగతి ఇంతే అని శాస్త్రజు్ఞలు వివరిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు 11,258 మంది ఈ వాతావరణ సూచిక మీద హెచ్చరిక సంతకాలు చేశారు. వారిలో 69 మంది మన భారతీయులు. మనం ఏం చేస్తే బాగుంటుందో కూడా వివరించారు. మనం ఏ విధంగా బ్రతకాలో నిర్ణయించుకునే దాన్ని బట్టి మన నిలకడైన భవిష్యత్తు నిర్ధారణ అవుతుంది. మన ప్రపంచ సమాజం సహజ పర్యావరణ పరిసరాలతో ఏ విధంగా వ్యవహరిస్తుందో ఎంత త్వరగా తన వ్యవహార ధోరణి మార్చుకుంటుందో దాన్ని బట్టి మన మనుగడ ఆధారపడి ఉంటుంది. మనకు గడువు లేదు. పర్యా వరణ సంక్షోభం అంతకంతకూ మరింత సంక్లిష్ట మవుతున్నది. పతనం ప్రమాదకరవేగంతో సమీపిస్తున్నది. అనుకున్నదానికన్నా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. 1979లో మొదటి ప్రపంచ పర్యావరణ సమావేశం జెనీవాలో జరిగింది. ఆ సభ నలభైవ వార్షికోత్సవ సందర్భంగా బయో సైన్స్ జర్నల్‌లో వారు ఈ ప్రకటన చేశారు. ఈ ప్రమాదాన్ని తట్టుకోవడానికి వారు ప్రతిపాదించిన మొదటి అంశం జనాబా పెరుగుదల రేటును వెంటనే పూర్తిగా అరికట్టడం. ఇది ముఖ్యంగా భారత్, చైనా దేశాలు గుర్తించి ఆచరణాత్మక పథకాలు అమలు చేయవలసి ఉంది. రెండోది భూగర్భ ఇంధనాలను భూమిలో మిగల్చడం. శరవేగంగా సాగుతున్న అడవుల నరికివేతను వెంటనే ఆపాలి. అంతేకాదు మాంసం తినడాన్ని కూడా చాలావరకు తగ్గించాలి. విపరీతంగా పర్యావరణంలో వస్తున్న మార్పులను చూసి ఈ హెచ్చరిక చేయాలనే నిర్ణయానికి వచి్చనట్టు ప్రొఫెసర్ విలియం రిపిల్ వివరించారు. పర్యావరణం ఈ విధంగా విచి్ఛన్నమవుతున్న విషయం జనులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన జారీ చేయవలసి వచ్చిందని ఓరేగావ్ రాష్ట్ర యూని వర్సిటీకి చెందిన రిపిల్ అన్నారు. భూ ఉపరితల, సముద్ర ఉపరితల వాతావరణం వేడెక్కుతున్నది. సముద్రమట్టం పెరగడం, తీవ్ర ప్రమాదకరం. మనం నలభై సంవత్సరాలుగా ఈ అంశాలను చర్చిస్తున్నాం. కాని చాలా మటుకు ఈ ప్రమాదాన్ని పసి గట్టి నివారించడంలో విఫలమయ్యాం. ఏవో కొన్ని చిన్న చిన్న విజయాలు తప్ప భారీ పరాజయాలే దాదాపు అంతటా ఎదురయ్యాయి. పర్యావరణంలో ఉపసంహరించడానికి వీల్లేని మార్పులు జరుగుతున్నాయి. మనం ఆ పరిస్థితులను మార్చలేం. ఎకో విధానాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి. మామూలు ప్రజలను, విధాన విధాతలయిన రాజకీయ నాయకులను హెచ్చరిం చడానికి ఈ ప్రకటన చేయకతప్పడం లేదని శాస్త్రజు్ఞలు అంటున్నారు. ముందు ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి ప్రయతి్నంచండి. ప్రగతి నిజంగా జరుగుతన్నదో లేదో పరిశీలించండి అని శాస్త్రవేత్తలు నెత్తి నోరూ బాదుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జననాల రేట్లు తగ్గుతున్నట్టు కనిపిస్తున్నాయి. భూగర్భ ఇంధనాల బదులు సౌరశక్తి, వాయుశక్తికి మళ్లుతున్నారు. మనం వెంటనే చేయవలసిన పనులను కూడా శాస్త్రవేత్తలు సూచించారు. ఇంధనాన్ని చాలా అరుదైన సమ యాల్లోనే వాడడం అలవాటు చేసు కోవాలి. భూగర్భ ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు వాటిమీద భారీ పన్నులు వేయాలి. అమ్మాయిలకు సుదీర్ఘకాలం చదువు చెప్పించడం మంచి వ్యూహమంటున్నారు. అడవుల నరికివేతను ఆపి, మడ అడవులు పెంచి కార్బన్ డై ఆక్సైడ్‌ను విలీనంచేసుకునే అవకాశాలు పెంచాలి. ఆకు కూరలు ఎక్కువగా తింటూ మాంసాహారాన్ని తగ్గించాలి. వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
ఎన్నాళ్లీ ఉదాసీనత?
మాటలే తప్ప చేతలు కనబడని స్థితిలో దేశ రాజధాని నగరంలో కాలుష్యం తన పని తాను చేసుకు పోతోంది. ప్రాణాలు కొంచెం కొంచెం తోడేస్తూ నగర పౌరులను బెంబేలెత్తిస్తోంది. రెండు రోజుల పాటు నగరంలో కాలుష్యం స్థాయి ‘తీవ్రంగా’ ఉన్నదని వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) వెల్లడిం చాక ఆ నగరాన్ని ‘ఎమర్జెన్సీ జోన్’గా ప్రకటించారు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు లెక్కల ప్రకారం గత ఆదివారం ఏక్యూఐ రీడింగ్ 495గా, ఆ మరుసటి రోజు 407గా నమోదైంది. 2016 తర్వాత ఈ స్థాయిలో వాయు నాణ్యత క్షీణించడం ఇదే ప్రథమం. అయితే మంగళవారానికి పరిస్థితి మారింది. నిన్నటికి అది మరింత మెరుగైంది. కానీ 24 గంటలు గడవకుండానే మళ్లీ అందరినీ అక్కడి వాతావరణం ఆందోళనపరుస్తోంది. వాయు కాలుష్యం ఇంతగా విజృంభించడానికి ఢిల్లీ చుట్టుపట్ల ఉన్న పంజాబ్, హరియాణా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో రైతులు పంట వ్యర్థాలను తగల బెట్ట డమే కారణమని నిపుణులు చెబుతుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు దీన్ని నిరోధిం చాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడంతోపాటు కటువైన వ్యాఖ్యలు చేసింది. జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహించింది. పంటలు కోత కొచ్చే సమయంలో చేసే ప్రయత్నాల వల్ల ఫలితం ఉండదని ప్రభుత్వాలకు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏటా ఇదే తంతు నడు స్తోంది. పంట వ్యర్థాలను తగలబెట్టరాదని చాలా ముందుగానే రైతుల్లో ప్రచారం చేయడం, ఆ వ్యర్థా లను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం వంటి చర్యలు ఎంతో కొంత ఫలితాన్నిస్తాయి. సుప్రీంకోర్టు చెప్పినట్టు వ్యర్థాలను తగలబెట్టని రైతులకు క్వింటాల్‌కు రూ. 100 చొప్పున ఇవ్వడం కూడా మంచి ఆలోచన. ఇటువంటి ప్రయత్నాలు ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేసిన దాఖలా లేదు. రైతుల జోలికెళ్తే ఓటుబ్యాంకుకు ముప్పు కలుగుతుందని భయపడి మౌనంగా ఉండిపోవడం, సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చునన్న ధోరణి ప్రభుత్వాల్లో పెరుగుతోంది. కేవలం పంజాబ్, హరియాణాల్లో ఏడు వేల ప్రాంతాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టారని కాలుష్య నియంత్రణ బోర్డు చెబుతోంది. ప్రభుత్వాల నిర్వాకం ఎలా ఉందో దీన్నిబట్టే అర్థమవుతోంది. వాయు కాలుష్యంపై బ్రిటిష్ వలసపాలకుల హయాంలో 1905లో బెంగాల్ పొగ పీడ చట్టం వచ్చింది. అప్పట్లో కలకత్తా, హౌరా వంటి ప్రాంతాల్లోని ఫర్నేస్‌ల వల్ల జనం ఆరోగ్యం పాడవు తోందని వారు ఈ చట్టం తీసుకొచ్చారు. అటు తర్వాత 1912లో బొంబాయిలోనూ ఇదే తరహా చట్టం వచ్చింది. ఢిల్లీ గాలుల్లో ధూళి కణాలు బాగా ఉన్నాయని తొలిసారి 1952లో గమనించారు. అయితే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి 1981లో తొలిసారి చట్టం తీసుకురాగా, వాతావరణ పరిరక్షణ చట్టం 1986లో వచ్చింది. రాజస్తాన్ ఎడారి ప్రాంతం నుంచి వచ్చే పడమటి గాలుల కారణంగా ఢిల్లీ వాతావరణంలో ధూళి కణాలు బాగా పెరుగుతున్నాయని 1950లోనే గుర్తించారు. అటువైపు దట్టంగా చెట్లుంటే దీన్ని నివారించడం వీలవుతుందని భావించారు. కానీ అనంతరకాలంలో తీసుకున్న చర్య లేమీ లేవు. సరిగదా అప్పటితో పోలిస్తే కాలుష్యాన్ని పెంచే కార్యకలాపాలే అధికమయ్యాయి. కర్మాగా రాల సంఖ్య, వాహనాల వినియోగం వందలరెట్లు పెరిగింది. అభివృద్ధి పేరు చెప్పి వృక్ష సంహారం సరేసరి. వాయు కాలుష్యం గురించిన భావనకు మన దేశంలో దాదాపు నూట పదిహేనేళ్ల చరిత్ర ఉన్నా దాన్ని నియంత్రించాలన్న జ్ఞానం కలగలేదంటే ఎవరిని నిందించాలి? రెండురోజులపాటు ఢిల్లీలో వాయు నాణ్యత కాస్త మెరుగైందని వెల్లడయ్యేసరికి అందరూ సంబరాలు చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇది తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితమని ప్రకటించారు. కానీ గాలుల తీవ్రత అంతక్రితంతో పోలిస్తే పెరగడం, ఆకాశంలో మేఘాల జాడ లేకపోవడం వగైరా కారణాల వల్లనే పరిస్థితి కాస్త మెరుగైందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. కాలుష్యానికి కారణం మీరంటే మీరని రాజకీయ నాయకులు ఒకరినొకరు నిందించుకోవడం ఈమధ్యకాలంలో ఎక్కువైంది. ఇప్పుడది అవధులు దాటింది. ఎంతసేపూ ఇక్కడ పరస్పరం నిందించుకోవడం కంటే పాకిస్తాన్‌నూ, చైనానూ ఇందులో ఇరికిస్తే మేలని అనుకున్నట్టున్నారు. బీజేపీ నాయకుడు వినీత్ అగర్వాల్ ఆ రెండు దేశాలూ ‘విషవాయువుల’ను విడిచిపెడుతున్నాయని ఆరోపించారు. కాలు ష్యంపై మన నేతల అవగాహన ఇంత అధ్వాన్నంగా ఉన్నప్పుడు, ఇక నియంత్రణ గురించి ఏం ఆశించగలం? వాయు కాలుష్యం వల్ల బాధితులుగా మారేది వ్యక్తులు మాత్రమే కాదు. దాని వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థే దెబ్బతింటుంది. భారత్‌లో వాయు కాలుష్యం ఏటా మూడు వేల కోట్ల డాలర్లను హరిం చేస్తున్నదని ప్రపంచబ్యాంకు ఆమధ్య హెచ్చరించింది. వాతావరణంలోని నైట్రేట్, సల్ఫేట్, కార్బన్, కాడ్మియం, పాదరసం వగైరా అణువులు మనిషిని ఆపాదమస్తకమూ పీల్చిపిప్పి చేస్తాయి. పొగ, దుమ్ము వగైరాల్లో కేన్సర్ కారక కార్సినోజెన్లు విశేషంగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చి చెప్పారు. ప్రపంచ కాలుష్య భరిత నగరాల్లో 14 మన దేశంలోనే ఉన్నాయని నిరుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చూస్తే అర్థమవుతుంది. ఇందులో ఢిల్లీతోపాటు ఉత్తరాది నగరాలు అనేకం ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నగరాల్లో కూడా గాలిలో సూక్ష్మ ధూళి కణాలు పరిమితికి మించి ఉన్నాయని, తగిన చర్యలు తీసుకోనట్టయితే అవి కూడా కాలుష్య భరిత నగరాలుగా మారడం ఎంతో దూరంలో లేదని ఆ నివేదిక హెచ్చరించింది. బయో సైన్స్ జర్న ల్లో ఈమధ్య వివిధ దేశాల్లోని భిన్నరంగాలకు చెందిన 11,000మంది శాస్త్రవేత్తలు విడుదల చేసిన లేఖ అందరి కళ్లూ తెరిపించాలి. వాయు కాలుష్యంతోపాటు అనేకానేక కాలుష్యాలు భూగోళానికి ముప్పు తెచ్చే ప్రమాదం అంతకంతకు పెరుగుతోందని ఆ లేఖ హెచ్చరించింది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉదాసీనతను విడనాడి పకడ్బందీ చర్యలకు ఉపక్రమించవలసి ఉంది. -
బంగ్లాదేశ్ క్రికెటర్లకు వాంతులు!
న్యూఢిల్లీ: కాలుష్య కోరల్లో చిక్కి విలవిల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం టీమిండియాతో జరిగిన మొదటి టి20 మ్యాచ్‌లో ఇద్దరు బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇబ్బంది పడినట్టు వెల్లడైంది. కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన బంగ్లా సీనియర్ బ్యాట్స్‌మన్ సౌమ్య సర్కార్, మరో ఆటగాడు వాంతులు చేసుకున్నట్టు ‘ఈఎస్పీఎన్’ వెల్లడించింది. ఆందోళనలు పట్టించుకోకుండా ఢిల్లీలో మ్యాచ్ నిర్వహించడంతో బీసీసీఐపై పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మ్యాచ్‌ను రద్దు చేయాలని కోరినప్పటికీ బీసీసీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో రద్దు చేయడం కుదరదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తేల్చిచెప్పారు. కాలుష్యాన్ని లెక్కచేయకుండా క్లిష్ట పరిస్థితుల్లో ఆడిన రెండు జట్లను మ్యాచ్ ముగిసిన తర్వాత ట్విటర్ ద్వారా ఆయన అభినందించారు. అయితే ఢిల్లీ కాలుష్యం తనను ఇబ్బంది పెట్టలేదని కీలక ఇన్నింగ్స్ ఆడిన బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీం తెలిపాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మాట్లాడుతూ.. ‘వ్యక్తిగతంగా చెప్పాలంటే ఈ వాయు కాలుష్యం నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. నేను ఎవరి బౌలింగ్‌లో ఆడుతున్నా అనే దానిపైనే దృష్టి పెట్టాను. అతిపెద్ద ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి మేము ఇక్కడకు వచ్చాం కాబట్టి మిగతా విషయాలను పట్టించుకోమ’ని అతడు పేర్కొన్నాడు. భారత్‌తో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్ గురువారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. (చదవండి: అప్పుడు శ్రీలంక.. ఇప్పుడు బంగ్లాదేశ్) -
ఢిల్లీ కాలుష్యం: వాహనదారుల విన్నపాలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. దీంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంతో ఢిల్లీలో నివసించేందుకు జనాలు బెంబేలెత్తుతున్నారు. కాలుష్య పొగలు కమ్ముకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 5 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ సర్కార్ సరి-బేసి విధానాన్ని తిరిగి అమలు చేస్తోంది. ఈ పద్ధతిని వాహనదారులు సైతం స్వాగతిస్తున్నారు. అయినప్పటికీ కాలుష్యం ఏమాత్రం తగ్గడం లేదు. ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడం ఆపేయాలని వాహనదారులు ఇప్పటికే విఙ్ఞప్తి చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా చుట్టుపక్కల రాష్ట్రాలతోనే ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కుకుందని ఆరోపించారు. అయితే, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. చర్యలు చేపట్టడం చేతకాక తమపై నిందలు వేస్తున్నారని పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణ, రాజస్థాన్ నేతలు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకుండా పరస్పర నిందారోపణలతో కాలయాపన చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వాళ్ల పరిస్థితి ఎలా ఉందో: ప్రియాంక
న్యూఢిల్లీ : కాలుష్యం కారణంగా షూటింగ్లో పాల్గొనడం చాలా కష్టంగా ఉందని గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అన్నారు. ప్రస్తుతం ఆమె ‘ది వైట్ టైగర్ ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత అరవింద్ అడిగా రచించిన ‘ది వైట్ టైగర్’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఢిల్లీలో ప్రారంభమైంది. షూటింగ్లో పాల్గొన్న ప్రియాంక.. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి మాస్క్, కళ్లద్దాలు ధరించి సెట్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్స్టాగ్రాం వేదికగా పంచుకున్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్ధాయికి చేరిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఢిల్లీలో వాయు కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ కాలుష్యం కారణంగా షూటింగ్లో పాల్గొనడం చాలా కష్టంగా ఉంది. ఇక ఇక్కడ నివసిస్తున్నవారి పరిస్థితి తలచుకుంటే చాలా భయంగా ఉంది. కాలుష్య కోరల నుంచి కాపాడుకోవడానికి మనకి మనకి మాస్క్‌లు ఉన్నాయి. కానీ ఇల్లు లేని నిరాశ్రయులు అష్టకష్టాలు పడుతూ రోడ్ల మీద నివసిస్తూ...ఈ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రార్థించండి’ అని ప్రియాంక పేర్కొన్నారు. ఇక ‘ది వైట్ టైగర్’ సినిమా నవలా ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. 2008లో అరవింద్ అడిగా రచించిన ‘ ది వైట్ టైగర్ ’ నవల అదే సంవత్సరంలో బుకర్ ప్రైజ్‌ని సొంతం చేసుకుంది. ఓ గ్రామంలో టీ కొట్టులో పనిచేసే వ్యక్తి...సక్సెస్ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా ఎలా ఎదిగాడు అన్న నేపథ్యంలో రచించిన కథ ఇది. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో ప్రియాంకతో పాటు ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. View this post on Instagram Shoot days for #thewhitetiger. It’s so hard to shoot here right now that I can’t even imagine what it must be like to live here under these conditions. We r blessed with air purifiers and masks. Pray for the homeless. Be safe everyone. #airpollution #delhipollution😷 #weneedsolutions #righttobreathe A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on Nov 3, 2019 at 8:52am PST -
‘హైదరాబాద్‌లో ఉండడానికి కారణమిదే’
సాక్షి, హైదరాబాద్: ‘ఢిల్లీలో వాయు నాణ్యతా సూచీ 401తో తీవ్ర ప్రమాదకరంగా ఉంది. హైదరాబాద్‌లో సూచీ 39తో మంచి నాణ్యతను కలిగి ఉంది. ఢిల్లీతో పోల్చితే హైదరాబాద్‌లో ఉండడానికే నేను ఇష్టపడడానికి మరో కారణమిదే’ అని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ‘అయితే, కేంద్రం నుంచి వచ్చిన డిప్యుటేషన్ ఆఫర్‌ను మీరు తిరస్కరించినట్లు నేను భావించవచ్చా?’అని రీట్వీట్ చేస్తూ ఆదివారం సరదాగా వ్యాఖ్యానించారు. ‘ఢిల్లీ నుంచి మరో గంటలో నేను ఇంటికి (హైదరాబాద్) వచ్చేందుకు విమానం ఎక్కబోతున్నాను. తిరిగి వచ్చాక నా ఆనందానికి ఇదే కారణం (ఢిల్లీలోని కాలుష్యం) కాబోతోంది’అని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బ్రిటిష్ రాయబారి ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా మరో రీట్వీట్ చేశారు. కాలుష్యం విషయాన్ని పక్కనబెడితే రోడ్ల విషయంలో హైదరాబాద్ అధ్వానంగా తయారైందని, ఢిల్లీ స్థాయిలో నగరంలోని రోడ్లను అభివృద్ధిపరచాలని పలువురు నెటిజన్లు రాష్ట్ర అధికారులకు సూచించారు. Yet another reason why I love being in #Hyderabad vis-a-vis #Delhi (Am being mean 😷) pic.twitter.com/lCwdR4kL01 — Arvind Kumar (@arvindkumar_ias) November 1, 2019 -
ప్రతికూలమే...కానీ ప్రాణాలేం పోవులే
న్యూఢిల్లీ: తీవ్రమైన వాయు కాలుష్యంతో విలవిల్లాడుతున్న ఢిల్లీ నగరంలో మ్యాచ్ నిర్వహణకు వచ్చే ముప్పేమీ లేదని బంగ్లాదేశ్ కోచ్ రసెల్ డొమింగో అన్నారు. ‘వాతావరణం ప్రతికూలమే అయినా... ప్రాణాలు పోయేంత కష్టమేమీ లేదు. ఇది కేవలం మూడు గంటల ఆటే. మ్యాచ్ సజావుగానే జరుగుతుంది. కళ్లకు, గొంతుకు కాస్త ఇబ్బంది కలగొచ్చేమో కానీ అంతకుమించిన ముప్పేమీ ఉండదు’ అని అన్నారు. గతంలో ఇక్కడ శ్రీలంకకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందన్న సంగతి తెలుసని, బంగ్లాదేశ్‌లోనూ వాతావరణ కాలుష్యం ఉంటుందని చెప్పారు. ఇదేమీ తీవ్రంగా పరిశీలించాల్సిన అంశం కానేకాదని... ఆటగాళ్లు మ్యాచ్‌పై దృష్టి పెడితే సరిపోతుందని అన్నారు. షకీబ్ సస్పెన్షన్ ఉదంతం జట్టుపై ప్రభావం చూపుతుందని కోచ్ అంగీకరించారు. స్టార్ ఆటగాడు కీలకమైన సిరీస్‌కు లేకపోవడం లోటేనన్నారు. -
కాలుష్యానికి ఓట్లకు లింకేమిటీ?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటన్న విషయం తెల్సిందే. శీతాకాలంలో వచ్చే దీపావళి సందర్భంగా కాల్చే టపాసుల వల్ల నగర కాలుష్యం మరింత పెరుగుతుందన్న విషయమూ తెల్సిందే. అందుకనే తక్కువ కాలుష్యాన్ని వెదజల్లే ‘గ్రీన్’గా పేర్కొన్న టపాసులే కాల్చాలని, అది ఆరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల మధ్య కాల్చాలని సుప్రీం కోర్టు సూచించడం, ఆ సూచనలను నగర వాసులు పాటించకపోవడం, వారిపై నగర పోలీసులు చర్యలు తీసుకోకపోవడమూ తెల్సిందే. ఫలితంగా ఏం జరిగిందీ? దీపావళికి ముందు రోజు నగరంలోని పలు ప్రాంతాల్లో నమోదైన కాలుష్యం 400, 500 మార్కు నుంచి దీపావళి మరుసటి రోజుకు 999 మార్కుకు చేరుకుంది. కాలుష్యం కొలమానం సూచికలో కాలుష్యం 400 దాటితే ప్రమాదకరంగాను, 500 దాటితే అత్యంత ప్రమాదరకంగాను పేర్కొంటారు. అలాంటి దీపావళి మరుసటి రోజు నగరంలో పలు ప్రాంతాల్లో 999 మార్కును చేరుకుందంటే ఎంత ప్రమాదరకమో! ఊహించవచ్చు. అయినా ఈ విషయం పాలకులకుగానీ, ప్రజలకుగానీ అంతగా ఎందుకు పట్టడం లేదు? 2016లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం భారత్‌లో ప్రతి ఏటా ఇంటి లోపల, ఇంటి వెలుపల ఉండే వాయు కాలుష్యం వల్ల లక్ష మందికిపైగా ఐదేళ్ల పిల్లలు మరణిస్తున్నారు. ఏటా లక్ష మందిలో 66.6 శాతం పిల్లలు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. బాలికల విషయంలో ఇది మరింత ప్రమాదరకరంగా మారింది. ప్రతి లక్ష మంది బాలికల్లో 74. 3 శాతం మంది మృత్యువాత పడుతున్నారు. పామాయిల్ ఫ్లాంటేషన్ కోసం అడవులను అడ్డంగా నరికి తగులబెడుతున్న ఇండోనేషియాలో కూడా కాలుష్యానికి ఇంత మంది బలవడం లేదు. ఆ దేశంలో ప్రతి ఏటా లక్ష మందిలో 35.6 శాతం ఐదేళ్లలోపు బాలికలు మరణిస్తుంటే ఐదేళ్లలోపు బాలలు 35.2 శాతం మంది మరణిస్తున్నారు. చైనాలో ప్రతి లక్ష మంది ఐదేళ్లలోపు బాలికల్లో 12.5 శాతం మరణిస్తుంటే 13.8 శాతం బాలలు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. ఇక ఐదేళ్ల నుంచి 14 ఏళ్ల బాలికల్లో భారత్‌లో ప్రతి లక్ష మందికి 3.4 శాతం మంది బాలకులు, 2.3 శాతం బాలలు మరణిస్తున్నారు. కాలుష్యం అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల జెనీవాలో నిర్వహించిన సదస్సులో భారత్‌కున్న ముప్పుపై తీవ్రంగా హెచ్చరించింది. పిల్లల్లో నిమోనియా, అస్తమా, క్యాన్సర్‌కు కూడా కాలుష్యమే కారణమవుతోందని చెప్పింది. రోగాల తర్వాత ఎక్కువ మంది కాలుష్యం కారణంగానే మరణిస్తున్నారని పేర్కొంది. గర్బిణీ స్త్రీలపై కూడా కాలుష్యం ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది. కాలుష్యం రాజకీయ అంశం కాకపోవడం వల్ల దేశంలో ఏ ప్రభుత్వం కూడా కాలుష్యం నియంత్రణకు సరైన చర్యలు తీసుకోలేక పోతోంది. మరో విధంగా ఇది రాజకీయ అంశమేనని చెప్పవచ్చు. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలు, ప్యాక్టరీ చిమ్నీల నుంచి వెలువడే పొగ, నిర్మాణా నుంచి వెలువడే దుమ్ము, వరి దుబ్బులను తగులబెట్టడంతో వెలువడే పొగ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి వాడుతున్న వంట చెరకు కాలుష్యానికి ప్రధాన కారకాలు. వీటి నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటే కాలుష్యానికి కారణమవుతున్న ఇన్ని వర్గాల ప్రజల ఓట్లు దూరం అవుతాయన్నది రాజకీయ పార్టీల బెంగ. అది ఒక విధంగా ఓట్ల రాజకీయమే గదా! 2019లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున అప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కాలుష్యం గురించి పెద్దగా మాట్లాడదు. -
జనం చస్తూంటే.. ఆయనకు మాత్రం..
సాక్షి, న్యూఢిల్లీ : మితిమీరిన వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగ ఒకవైపు, పక్క రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో వరి దుబ్బును కాల్చడంతో వెలువడే పొగ మరోవైపు దేశ రాజధానికి ఊపిరి సలపనివ్వడం లేదు. కాలుష్య కారకాలు వాతావరణంలో మితిమీరిపోవడం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్యదిద్దేందుకు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విదేశీ పర్యటన చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. గత రెండేళ్లుగా విషవాయువులకు నిలయంగా మారిన ఢిల్లీని పట్టించుకోకుండా వదిలేశారని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి ముఖ్యమంత్రి దుబాయ్ వెళ్లారని ఆప్ సభ్యుడొకరు చెప్పడంతో.. ‘జనం చస్తూంటే.. ఆయనకు మాత్రం ఫ్రెష్ ఎయిర్ కావాలా’ అంటూ కేజ్రీవాల్‌పై సోషల్ మీడియా వేదికగా కామెంట్ల వర్షం కురుస్తోంది. నియమాలున్నాయి.. ఆచరణే కావాలి..! ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కాలుష్య నివారణకు అనేక నియమ నిబంధనలు రూపొందించామనీ, వాటి ఆచరణే సరిగా లేదని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమితరాయ్ చౌదరి వ్యాఖ్యానించారు. కాగా, నగరవ్యాప్తంగా ఎటువంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఢిల్లీ కాలుష్య నియంత్రణ బోర్డు శనివారం ఆదేశాలు జారీ చేసింది. దుమ్మూధూళి గాల్లో చేరకుండా స్ప్లింకర్లతో నీళ్లు పట్టాలని తెలిపింది. దీపావళి రోజు టపాసులు పేలలేదు.. బుధవారం దీపావళి పండుగ నేపథ్యంలో ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. కాలుష్య అధికమవడంతో వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) పడిపోయి 423గా నమోదవగా.. శనివారం ఈ సంఖ్య 401కి తగ్గడం గమనార్హం. దివాళి రోజున కేవలం రెండు గంటలు మాత్రమే బాణాసంచా కాల్చాలని సుప్రీం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. -
ఢిల్లీని ముంచింది అదే..
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు, కాలుష్యానికి గల్ఫ్ తీరంలో రేగిన అలజడికి సంబంధం ఉందని తాజా అథ్యయనం తేల్చింది. గల్ఫ్ తుపాన్ తాకిడితో వేల కిలోమీటర్లు దాటి దుమ్ము,ధూళి ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతంలోకి చొచ్చుకువచ్చాయని, ఫలితంగా నవంబర్ 7 నుంచి ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్ధాయిలకు చేరిందని ప్రభుత్వ వాయు నాణ్యతా పరిశోధన సంస్థ సఫర్ విశ్లేషణ పేర్కొంది. ఢిల్లీని కప్పిన పొగమంచులో 40 శాతం కాలుష్య కారకాల్లో గల్ఫ్ నుంచి వచ్చిన డస్ట్ ఉండగా, పంజాబ్, హర్యానాల్లో తగులబెట్టిన పంట వ్యర్థాలు 25 శాతం కారణమని, ఇక 35 శాతం ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో ఉత్పత్తయ్యే కాలుష్యం పరిస్థితి తీవ్రతకు దారితీసిందని సఫర్ విశ్లేషించింది. ఉధృతంగా వీచిన గాలుల ప్రభావంతో గల్ఫ్ నుంచి వ్యర్థ రేణువులు రాజధానికి రాగా, పొరుగు రాష్ర్టాల్లో పంట వ్యర్ధాలు తగులబెట్టడం వంటి కారణాలతో ఢిల్లీ వాసులకు కాలుష్యం చుక్కలు చూపిందని పేర్కొంది.నవంబర్ 6 నుంచి నవంబర్ 10 వరకూ ఇవన్నీకాలుష్య ముప్పు పరాకాష్టకు చేరేందుకు దోహదపడ్డాయని సఫర్ చీఫ్ గుఫ్రాన్ బేగ్ స్పష్టం చేశారు. నవంబర్ 7 సాయంత్రం 5 గంటలకు వాయు నాణ్యత ఎన్నడూ లేని విధంగా ఆందోళనకర స్ధాయిలకు పడిపోయిందని పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి చేపట్టిన చర్యలతో కాలుష్య స్ధాయిలు 15 శాతం తగ్గాయని ఈ విశ్లేషణ తెలిపింది. -
పిల్లలకు బహుమతిగా ఇచ్చేవి అవేనా..?
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రమాదకరంగా మారిన కాలుష్యంపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్రంగా స్పందించింది. పిల్లలకు ఇన్ఫెక్షన్ బారిన పడ్డ ఊపిరితిత్తులను బహుమతిగా ఇస్తారా అని ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలదీసింది. వాయుకాలుష్యం తీవ్రమై పీఎం 2.5, పీఎం 10 స్ధాయిలు ఆందోళనకరంగా ఉన్న క్రమంలో అత్యవసర చర్యలు చేపట్టాలని కేజ్రీవాల్ సర్కార్‌ను ఆదేశించింది. ఢిల్లీ నగరంతో పాటు జాతీయ రాజధాని ప్రాంతంలో గత వారం కాలుష్య స్ధాయిలు అత్యంత ప్రమాదకర స్ధాయికి చేరుకున్న విషయం తెలిసిందే. పరిస్థితి తీవ్రంగా ఉన్నా వాయు కాలుష్యాన్ని అరికట్టే సమర్ధవంతమైన చర్యలను ప్రభుత్వం ఇంతవరకూ చేపట్టలేదని పర్యావరణ నిపుణులు ఆరోపిస్తున్నారు. సరి బేసి పద్ధతి నుంచి ద్విచక్ర వాహనాలను మినహాయించాలన్న రివ్యూ పిటిషన్ విచారణ సందర్భంగా కేజ్రీవాల్ సర్కార్‌పై ఎన్జీటీ మండిపడింది. పొగమంచుతో పాటు విపరీతమైన కాలుష్యం ముంచెత్తడంతో ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల పాఠశాలలకు సెలవు ఇచ్చింది. ఇక మూతపడిన స్కూళ్లు మళ్లీ తెరుచుకోవడంతో మాస్క్‌లు ధరించి చిన్నారులు పాఠశాలలకు వెళుతున్నారు. -
పగబట్టిన పొగమంచు
-
వెర్రి చేష్టలే పరిష్కారాలా?
ఢిల్లీ వాయు కాలుష్యం సమస్యకు పరిష్కారాలు లేకపోలేదు. కాకపోతే, ఇంతవరకు అందరు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయని గుర్తించాలి. ఉదాహరణకు, ఈ సమస్యతో సంబంధం ఉన్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేయమని ప్రధానిని కోరండి. వరి గడ్డి చెత్తను కాలబెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని చెల్లించడా నికి డీజెల్ పైన, ట్రక్కులపైన వసూలు చేస్తున్న వందల కోట్ల సెస్‌లో కొంత భాగాన్ని మళ్లించవచ్చు. అంతేగానీ ఢిల్లీ కాలుష్యపు పొగలను తమాషాలతో పరిష్కారం చేయలేరు. మాకు టెడ్డీ అనే లాసా జాతి టిబెటన్ బొచ్చు కుక్క ఉండేది. అదెన్నడూ ఆహారం కోసం వెతుక్కునేది కాదు. అలమారా దిగువ అరల్లోని పుస్తకాలకు తప్ప మరెవరికీ హాని చేసేది కాదు. ఒకరోజు సాయంత్రం ఓ ఎలుక దారి తప్పి మా వంట గదిలోకి చొరబడింది. అది చూసిన వెంటనే టెడ్డీ దాని వెంట పడింది. బెంబేలెత్తిపోయిన ఎలుక వంటగ్యాస్ సిలిండర్‌కు వెనుక ఇరుక్కు పోయింది. మొట్టమొదటిసారిగా తను వేటాడిన జంతువును మా టెడ్డీ కొద్ది సేపు పట్టుకుని చూసింది. ఆ తర్వాత దాన్ని అది వదిలిపెట్టేసింది. భయంతో ఎలుక పరుగు తీసింది. అది దానికి అవమానకరం అని మాకు అనిపించింది. మొదట్లో మా అతిథులకు వినోదం కల్పించడం కోసం మేం ‘ఎలుక’ అని అరిస్తే చాలు... మా ‘వేటగాడు’ పరుగందుకుని తక్షణమే గ్యాస్ సిలిండర్ వెనక్కు వెళ్లేవాడు. ఆ తర్వాత క్రమంగా అది ఓ కథగా మాత్రమే మిగిలి పోయింది. ఎప్పుడు ఎవరు అలాంటి మూర్ఖపు, అమాయకపు స్వాభావిక స్పందనలను కనబర చినా మేం ఇప్పుడు... ఒకసారి ఎలుక కనిపించిందని అక్కడే ప్రతిసారీ వెతక్కు అంటుంటాం. ఆత్మవంచన, పరవంచనే పరిష్కారమా? ఢిల్లీ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం, సరి–బేసి పథకాన్ని మన మీద రుద్ది, మొట్టమొద టిసారిగా వంటింటి ఎలుకను పట్టడానికి కృషి చేసింది. అందులో సైతం అది విజయవంతం కాలేకపోయింది. ఈ పద్ధతి వల్ల ఢిల్లీ గాలి నాణ్యతలో చెప్పు కోదగిన మెరుగుదలేమీ కనబడలేదని గణాంకాలన్నీ తేల్చాయి. అయితేనేం అది రాజకీయంగా విజయవంతమైంది. చాలా మంది ఢిల్లీ పౌరులు, ప్రత్యే కించి సంపన్న పౌరులు (పలు వాహనాల యజమానులు) కనీసం ఈ సమస్య గురించి ఏదో ఒకటి చేస్తున్నారని, అందులో తాము కూడా భాగస్వా ములం అవుతున్నామని నమ్మేట్టు చేస్తోంది. అంతకు ముందు దీపావళి టపాసుల నిషేధపు ప్రహసనాన్ని కూడా ఇలాగే ప్రదర్శించారు. ఈ చర్యల పట్ల మైత్రీ పూర్వకంగా ఉండే టీవీ చానళ్లు వాటికి మద్దతుగా నిలిచాయి. గొప్ప ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం మన వాయు నాణ్యతను మెరుగుపరుస్తు న్నదని ఊపిరి సలపకుండా ప్రశంసించాయి. హైబ్రిడ్ కార్లు, ఇంటిలో వాడే ఎయిర్–ప్యూరిఫయర్ల తయారీదారుల నుంచి ఈ ప్రశంసా కార్యక్రమాన్ని నిర్విరామంగా ప్రసారం చేయడానికి స్పాన్సర్షిప్లను సైతం అది సంపా దించి పెట్టింది. ఆ కార్లను, ప్యూరిఫయర్లను కొనగలిగేది సంపన్న వంతులే. రెండు చలి కాలాల తర్వాత, ఆప్ ప్రభుత్వం వంటింటి ఎలుక వెంటబడి తిరిగి పరుగులు తీస్తూనే ఉంది. మమతా బెనర్జీతో పోటీపడుతూ ఆమ్ ఆద్మీ మన దేశంలోకెల్లా అత్యంత ప్రజాకర్షక పార్టీగా మారింది. అయితే జనాకర్షక నిరంకుశ పార్టీలకు భిన్నంగా ఆ పార్టీలో అభిప్రాయాలలో, వివేకంలో వైవి«ధ్యానికి తావు ఉంది. ఇక దాని బలహీనతకు వస్తే, అది ఈ వారం ఆ పార్టీ పంజాబ్ నేత సుఖ్‌పాల్ సింగ్ ఖైరా నోటి నుంచి వెలువడింది. గడ్డిని కాలబెట్టే ‘కార్యక్రమాని’కి అధ్యక్షత వహిస్తూ ఆయన... గడ్డిని స్వయంగా కోసి శుభ్రం చేయడానికి ప్రభుత్వం రైతులకు నెలకు రూ. 5,000 చెల్లించే వరకు దీన్ని కొనసాగించాల్సిందేనని బోధించారు. ఇందుకు మీరు నవ్వండి, ఏడ్వండి, కోపగించండి. లేదంటే, మీ అతిశయాన్ని దింగమింగి, ఆ ఇన్హేలర్ను అందుకుని, అందులోంచి వచ్చే ఆ దరిద్రగొట్టు కార్టిసోన్‌ను పీల్చండి. ఢిల్లీ గాలి మాత్రమే కలుషితమై పోయిందా? అనేది మంచి ప్రశ్న. లేదు, దేశమంతటా గాలి కలుషితం అయిపోయిందనేదే సమాధానం. మరి ఢిల్లీ వాయు కాలుష్యం గురించే ఎందుకీ వెర్రి? వాయుకాలుష్యం ఢిల్లీకే పరిమితమా? మంచి ప్రశ్న. ప్రధాని సహా దేశంలోకెల్లా అత్యంత శక్తివంతులైన రాజకీయ వేత్తలు, పర్యావరణ శాఖ కార్యదర్శి సహా ఉన్నత ప్రభుత్వాధికారులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, పార్లమెంటు సభ్యులు, దౌత్యవేత్తలు, మీడియా దాదాలు అంతా ఉండేది అక్కడే. వారు తమ కలుషితమైన గాలి, మరణిస్తున్న నదులు, కాలుష్యంతో నురగలు కక్కుతున్న సరస్సులు, కూలుతున్న పర్వతాల సమస్యనే పరిష్కరించుకోలేకపోతే... ఇక మిగతా దేశం గురించి ఏమైనా చేసే అవకాశం ఏం ఉంటుంది? వారంతా ఏమీ ప్రయ త్నించడం లేదని కాదు. కాకపోతే, మా చిన్నారి లాసాలాగా ఆ ఎలుక కోసం వంటగదిలో వెతకడం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనమంతా నవ్వు కోవాల్సి వస్తోంది. ఇకపోతే గౌరవనీయులైన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఉంది. వారు ఢిల్లీ నగరం పట్ల చూపుతున్న ఉద్వేగాన్ని, దాని కోసం చేస్తున్న కృషిని, నగర కాలుష్యంపై ప్రదర్శిస్తున్న ఆగ్రహాన్ని చూస్తుంటే... దాని పేరును దేశ రాజధాని ప్రాంత హరిత ట్రిబ్యునల్‌గా మారిస్తే బావుంటుందని మనవి చేసుకుంటున్నాను. అది భారీ ఎత్తున జారీ చేసే ఫర్మానాలను (ఆదేశాలు) చూసి తుగ్లక్ ఎంతగానో గర్విస్తాడు. కాబట్టి ఆ సంస్థకు ఓ భవనాన్ని కేటాయించి, దానికి తుగ్లక్ భవన్ అని పేరు పెట్టాలని సూచిస్తున్నాను. ప్రజల అసమ్మతి ప్రాంతంగా ఉండే జంతర్ మంతర్‌లోని ఓ చిన్న ప్రాంతాన్ని.. పాలకుల చెవులకు మీ గోల విన రాకుండా, సుదూరంలోని మరో ప్రాంతానికి తరలించాలని అది తాజాగా మరో ఫర్మానాను జారీ చేసింది. నిరసన తెలపడం ఉద్దేశమే పాలకులకు మీ మాట వినిపించేట్టు చేయడం. అయితేనేం, ఢిల్లీ నగరంలోని ఆ సామ్రాజ్యాధికారానికి వ్యతిరేకంగా వాదించే వారు, ప్రత్యేకించి సదుద్దేశాలతో వాదించే వారు ఎవరున్నారు? ఢిల్లీలో భవన నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ ఎన్జీటీ తాజాగా పతాక శీర్షికలకు ఎక్కింది. మంచి ఆలోచన అంటారు మీరు. ఆర్థిక కార్య కలాపాల్ని నిలిపివేయడం కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాడే పద్ధతి కాలేదు నిజమే. పైగా, ఈ ఆదేశం వల్ల నిర్మాణ పనులు ఆగిపోతాయిగానీ, కాంట్రా క్టర్లు కార్మికులకు వేతనాలను చెల్లిస్తూనే ఉండాలి. ఈ ఆదేశాన్ని అమలుపరచే ఒక్క కాంట్రాక్టర్‌ను చూపండి, ఎన్జీటీ అంతకు ముందు ఆదేశించినట్టు గడ్డిని కాల్చడం ఆపేసిన రైతును చూపిస్తా. జాతీయ మానవ హక్కుల కమి షన్ సైతం బోలెడు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ సహకారంతో దుష్కృ త్యాలకు పాల్పడుతున్న గో రక్షకుల వెంట పడటం కంటే ఈ పని సురక్షిత మైనది. ఇకపోతే సుప్రీం కోర్టు, ఢిల్లీ వాయు నాణ్యత అధ్వానంగా మార డంతో ఆ సమస్య పరిష్కారానికి భూరేలాల్ కమిషన్‌ను నియమించింది. ఆ కమిటీ తొలి రోజుల్లో గణనీయమైన తేడాను తేగలిగింది. రాజధానిలోని ప్రజా రవాణా వ్యవస్థను అది సీఎన్జీకి పరివర్తన చెందించింది. కాలుష్యానికి ప్రధాన కారణమైన డీజెల్పైనా, ట్రక్కులపైనా కూడా పడతారని ఆశించారు. కానీ ఇçప్పుడున్న ఉపద్రవకరమైన పరిస్థితుల్లో సైతం ప్రతి ప్రముఖ వ్యక్తి వంటింట్లోనూ ఎలుక (డీజెల్ వాహనాలు) ఉంది. కాబట్టి అది జరగలేదు. పరిష్కారాలు లేకపోలేదు కానీ... రంకెలు వేయడం పరిష్కారం కాదు. కానీ కొన్ని పరిష్కారాలు లేక పోలేదు. కాకపోతే, దీపావళి నుంచి మొదలయ్యే రెండు నెలల పతాక శీర్షికల కాలాన్ని వదులుకోవాలి. మిగతా పది నెలలపై దృష్టిని కేంద్రీకరించాలి. ఒకటి, అసలు సమస్యంటూ గుర్తించాలి. రెండు, రాజకీయవేత్తలు, న్యాయమూర్తులు, కార్య కర్తలు ఇలా ప్రతి ఒక్కరు ప్రయత్నించిన పరిష్కారాలూ పని చేయడం లేదు. మూడు, వెక్కిరింతలకు లేదా రాజకీయం చేయడానికి దిగకూడదు. అప్పుడు వాస్తవాలను తిరగేయండి. వాటిలో మొదటిది ఆప్ నేత అతిషి మార్లెనా తయారు చేసిన ఉత్తర భారత కాలుష్యపు పొగ మేఘాల మ్యాప్. దాన్ని పరి శీలిస్తే ఇది కేవలం ఢిల్లీ సమస్య మాత్రమే కాదని, మొత్తం ఆ ప్రాంతమంతా కాలుష్యంతో ఊపిరి సలపకుండా ఉందని అర్థమౌతుంది. ఈ కాలుష్యం పొగ కాలంలో వెలువడ్డ మొట్టమొదటి అర్థవంతమైన ప్రకటన ఇది. ఈ మ్యాప్‌ను మీరు మరింత పశ్చిమానికి విస్తరిస్తే, పాకిస్తాన్‌లోని విశాల ప్రాంతాలు కూడా అలాగే కనిపిస్తాయి. కశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే వరకు పాకిస్తాన్ విషయంలో ఏమీ చేయలేని మాట నిజమే. కానీ ఈ సమస్యతో సంబంధం ఉన్న ఢిల్లీ, హరి యాణా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ముఖ్యమంత్రులు నలుగురితో సమావేశాన్ని ఏర్పాటు చేయమని ప్రధానిని కోరవచ్చు. బాధ్యతను వేరొకరి మీదకు నెట్టే యడం అనే వెటకారాన్ని ఇక మర్చిపోండి. వరి గడ్డి చెత్తను కాలబెట్టకుండా రైతులకు నష్ట పరిహారాన్ని చెల్లించే మార్గాన్ని అన్వేషించండి. సుప్రీంకోర్టు, ఎన్జీటీల ఆదేశాల ప్రకారం డీజిల్, ట్రక్కుల మీద వందల కోట్ల సెస్‌ను వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేస్తున్న నిధులలో కొంత భాగాన్ని ఇందుకు మళ్లించేలా అంతా కూర్చుని నిర్ణయం చేయవచ్చు. బ్రాంకి యోటిస్ వల్ల వచ్చే దగ్గు తెరలకు పరిష్కారంగా మింట్ మాత్రలను చప్పరించడం లేదా అగర్బత్తీలను వెలిగించుకోవడం.. అవి పతంజలి తయారీవే అయినా.. ఎలాగో, అలాగే ఢిల్లీ కాలుష్యపు పొగలను తమాషాలతో పోరాడాలని అను కోవడం కూడా అంతే భ్రమాత్మకమైనది. ఇప్పుడిక సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పడ్డ ఈపీసీఏ నివేదికలను చూడండి. ఢిల్లీలోని కాలుష్యపు తెరలకు దుమ్ము 38 శాతం కారణం. పై నుంచి నీళ్లు చల్లడం లేదా ఫైర్ బ్రిగేడ్లతో చెట్లకు స్నానం చేయించడంలాంటి వెర్రి ఆలోచనలను మరచిపోండి. 2016లో వాగ్దానం చేసినట్టుగా ఢిల్లీ రోడ్లను శుభ్రం చేయడానికి వాక్యూం స్వీపింగ్ మిషన్లను కొనమని ఢిల్లీ ప్రభుత్వంపై ఒత్తిడి చేయండి. కనీసం వందల కొద్దీ మరణావస్థలో ఉన్న పాత డీటీసీ బస్సుల స్థానంలో కొత్త వాటిని కొనమనండి. ప్రభుత్వం వద్ద డబ్బు లేదం టారా? ఢిల్లీ ఓటర్లకు సబ్సిడీకి విద్యుత్తును, ఉచితంగా తాగునీటిని పంచి పెట్టడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఉండాల్సింది. ఈ చర్యలేవీ, బేసి–సరి పద్ధతి కంటే లేదా నిషేధాల కంటే ఆకర్షణీ యమైనవిగా ఉండవు. కానీ ఉపయోగపడేవి. ఈ పొగ కాలంలో చేసిన మిగతా పనులన్నీ హాస్యాస్పదమైనవి మాత్రమే కాదు. మనలో కోట్లాదిమం దిని సామూహికంగా వంచించి చేసిన అఘాయిత్యం. సినిమా వాళ్లకు ఉండే స్వాతంత్య్రం పాత్రికేయులకు ఉండదు. కాబట్టి, ఇష్కియా సినిమాలో విద్యా బాలన్ అతి తరచుగా వాడిన మూర్ఖత్వం అనే అర్థాన్నిచ్చే ఆ ముతక మాటను వాడలేను. కాబట్టి దీన్ని సరి–బేసి గంధక ధూమం అంటాను. - శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
సరి-బేసి విధానంతో రె'ఢీ'
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి వెళ్లిపోయాయి. గత మూడు రోజులుగా నగరంలో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. దీనికి తోడు వాహనాలు విడుదల చేసే కాలుష్య కారకాలు గాలిలో కలవడంతో చిన్నారులు, వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడే స్థాయికి వాయుకాలుష్యం చేరుకుంది. దీంతో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని ప్రవేశపెట్టబోతుంది. నవంబర్ 13 నుంచి నవంబర్ 17 వరకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అధికారిక ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో ఈ విధానాన్ని అమలు చేయడం ఇది మూడో సారి. అంతకముందు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పుడు కాలుష్య స్థాయిలు కొంతమేర తగ్గిన సంగతి తెలిసిందే. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలకు చేరుకోవడంతో, ఢిల్లీ హైకోర్టు ఎమర్జెన్సీని కూడా ప్రకటించింది. ఒకవేళ అవసరమైతే నేడు, రేపు కూడా ఈ సరి-బేసి విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. సరి-బేసి విధానంతో ఢిల్లీలో వాహన ట్రాఫిక్ సగం మేర తగ్గుతోంది. డిల్లీ మెట్రో నెట్వర్క్ ఉన్నప్పటికీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు తక్కువగా ఉండటం ఈ విధానాన్ని అమలు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. కానీ కాలుష్య స్థాయిలు తగ్గించే లక్ష్యంతో కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కమర్షియల్ ట్రక్కులకు నగరంలోకి అనుమతి లేదని పేర్కొంది. నిర్మాణ కార్యకలాపాలు ఆపివేయాలని తెలిపింది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును వాడుకునేలా కారు పార్కింగ్ ఛార్జీలను నాలుగు రెట్లు పెంచింది. -
‘సిగ్గు పడాల్సిన విషయం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న వాతావరణ కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ, కేంద్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ పరిస్థితులకు అన్ని పార్టీలు, ప్రభుత్వాలు బాధ్యత వహించాలని పేర్కొంది. భవిష్యత్ తరాలను ఇటువంటి వాతావరణాన్ని అందిస్తున్నందుకు అందరూ సిగ్గు పడాలని స్పష్టం చేసింది. శీతాకాలంలో ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయన్న సంకేతాలు ఉన్నపుడు చర్యలు ఎందుకు తీసుకోలదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శవదహనాలు, భారీ నిర్మాణాలను చేపట్టే సమయంలో సరైన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదని ఎన్జీటీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48 ప్రకారం వాతావరణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా పంచుకోవాల్సిన బాధ్యత ప్రజలు, ప్రభుత్వాల మీదే ఉందని ఎన్జీటీ స్పష్టం చేసింది. ఢిల్లీలోని వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు తగు తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. -
ఢిల్లీ కాలుష్యానికి ఇవే కారణాలు
-
ఢిల్లీని చుట్టేసిన పొగమంచు
-
‘ఎమర్జెన్సీ జోన్లోకి ఢిల్లీ’
సాక్షి,న్యూఢిల్లీ: తీవ్ర కాలుష్య కోరల్లో చిక్కిన దేశ రాజధాని దీపావళి సందర్భంగా అక్కడక్కడా పేలే బాణాసంచాతో మరింత ప్రమాదంలో పడనుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దివాళీ నేపథ్యంలో వాయు కాలుష్యం పీక్స్‌కు చేరి ఢిల్లీ ఎమర్జెన్సీ జోన్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.ఢిల్లీలో బుధవారం ఎయిర్ క్వాలిటీ అత్యంత పేలవ స్థాయికి చేరగా, మంగళవారం అదే స్థాయిలో ఉండటంతో ఢిల్లీ అంతటా డీజిల్ జనరేటర్లపై నిషేధం విధించారు. వాయుకాలుష్యానికి అడ్డుకట్టవేసేందుకు అంతకుముందు ఢిల్లీ,ఎన్సీఆర్లో టపాసుల అమ్మకాన్నీ సుప్రీం కోర్టు తాత్కాలికంగా నిషేధించిన విషయం తెలిసిందే. మరోవైపు డీజిల్ జనరేటర్ల వాడకంతో పాటు భద్రాపూర్ పవర్ ప్లాంట్‌ను మార్చి 15 వరకూ నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. నిషేధం నుంచి ఆస్పత్రులు, మెట్రో సర్వీసులను మినహాయించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా పెరగడం వల్ల పలు దుష్పరిణామాలు ఎదురవనున్నాయని శాస్త్రవేత్తలు, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ)కు చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రమాణాల ప్రకారం వాయుకాలుష్యాన్ని తెలిపే పీఎం 2.5 స్థాయి (పర్టిక్యులేట్ మ్యాటర్) 60ని మించకూడదు. అంతకుమించిన పీఎం 2.5 స్థాయి పెరిగితే ఆ గాలిని పీల్చినప్పుడు అది ఊపిరితిత్తులు, రక్త కణాల్లో చేరి శరీరాన్ని కబళించే పెను ప్రమాదం ఉంది. అయితే బుధవారం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పీఎం 2.5 స్ధాయి అత్యంత గరిష్టస్థాయిలకు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆనంద్ విహార్‌లో ఇది 244.85గా ఉండగా, ఢిల్లీ టెక్నలాజికల్ వర్సిటీ వద్ద 218, షాదీపుర్ వద్ద 214, ఎన్ఎస్ఐటీ ద్వారకా 185, పంజాబి బాగ్ 163, మందిర్ మార్గ్ వద్ద 175గా నమోదైంది.ఢిల్లీలో వాయుకాలుష్యం ఇప్పటికే ప్రమాదకర స్థాయిలో ఉంటే బాణాసంచా పేల్చడంతో అది మరింత క్షీణించే అవకాశం ఉందని సీనియర్ సైంటిస్ట్, క్లీన్ ఎయిర్ క్యాంపెయిన్ ప్రాజెక్ట్ మేనేజర్ వివేక్ ఛటోపాథ్యాయ ఆందోళన వ్యక్తం చేశారు. -
ఢిల్లీ కాలుష్యంతో హిమచల్ కు కాసుల పంట
-
ఏం చేస్తారో 48 గంటల్లో చెప్పండి!
దేశ రాజధాని న్యూఢిల్లీలో నెలకొన్న వాతావరణకాలుష్య తీవ్రతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో అత్యంత భయానకంగా, తీవ్ర విపత్కరస్థాయిలో వాతావరణ కాలుష్యం తాండవిస్తోందని వ్యాఖ్యానించింది. ఈ కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఎలాంటి విధానపరమైన చర్యలు చేపడుతారో 48 గంటల్లోగా చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదేవిధంగా ఢిల్లీలో ప్రస్తుతమున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు సునీతా నాయర్, వాతావరణ కాలుష్య నియంత్రణ సంస్థ (ఈపీసీఏ) పేర్కొన్న సూచనలను సర్వోన్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకున్నది. హస్తినలో ప్రస్తుత పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొనేందుకు కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌ను 48 గంటల్లో తమకు తెలుపాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీపావళి పండుగ తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత గణనీయంగా తగ్గి.. తీవ్ర కాలుష్యం ఆవరించుకున్న సంగతి తెలిసిందే. కాలుష్యం తీవ్రస్థాయిలో ఉండటంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. 48 గంటల్లో ఈ విషయమై కేంద్రం ఇచ్చే ప్రతిస్పందన ఆధారంగా న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులను వెలువరించే అవకాశముంది. -
మహిళలకూ మినహాయింపు వద్దు
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించాలంటే సరి-బేసి పద్ధతి నుంచి మహిళలకు, ద్విచక్ర వాహనదారులకు కూడా మినహాయింపు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తెలిపింది. ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో దాన్ని అరికట్టేందుకు మూడోసారి సరి-బేసి పద్ధతిని అవలంబించాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం భావిస్ఓతంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నియమించిన పర్యావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ (ఈపీసీఏ) పలు సూచనలు చేసింది. ఏమాత్రం మినహాయింపులు లేకుండా సరి బేసి పద్ధతిని ఢిల్లీ ప్రభుత్వం అవలంబించాలని తెలిపింది. ఢిల్లీలో రవాణా వ్యవస్థ కారణంగా వచ్చే కాలుష్యంలో 32 శాతం బైకులు, స్కూటర్ల వల్లే వస్తోందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అయితే, కేవలం కార్లకే తప్ప బైకులకు, స్కూటర్లకు సరి-బేసి విధానం అమలుకాదు. దాంతోపాటు కేవలం మహిళలు మాత్రమే వెళ్లే కార్లను, సీఎన్జీ వాహనాలను కూడా ఈ నిబంధన నుంచి మినహాయించారు. ఈ అంశంపై మరోసారి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని ఈపీసీఏలో సభ్య సంస్థ అయిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుమితా రాయ్ చౌధురి తెలిపారు. త్వరలోనే సరి-బేసి పద్ధతికి సంబంధించిన నియమాలన్నింటినీ చూసి, మరోసారి ఈ విధానాన్ని అమలుచేస్తే తప్ప కాలుష్యం అదుపులోకి రాదని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అన్నారు. రాష్ట్ర రవాణా వ్యవస్థపై కూడా ఆంక్షలు ఉండటం వల్లే ద్విచక్ర వాహనాలను అనుమతించామని ఆయన చెప్పారు. ఢిల్లీలో రోజూ 40 లక్షల మంది బైకులపైనే వెళ్తారని.. వాటిపై కూడా ఆంక్షలు విధిస్తే దాదాపు 20 లక్షల మంది బస్సులు లేదా మెట్రోరైళ్లలో వెళ్లాల్సి ఉంటుందని, కానీ ఇప్పటికిప్పుడు అంత సామర్థ్యం వాటికి లేదని తెలిపారు. తగిన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటేనే బైకులపై కూడా ఆంక్షలు విధించగలమని ఆయన అన్నారు. -
ఢిల్లీ కాలుష్యంతో హిమచల్ కు కాసుల పంట
సిమ్లా: ఢిల్లీ కాలుష్యం హిమచల్ ప్రదేశ్ కాసులు పండిస్తోంది. ఇదేంటి అనుకుంటున్నారా. ఇది అక్షరాల నిజం. కాలుష్య కాసారంగా మారిన దేశ రాజధాని నుంచి హిమచల్ కు పర్యాటకులు పోటెత్తుతున్నారు. స్వచ్ఛమైన గాలికోసం సిమ్లా, ధర్మశాలకు తరలివస్తున్నారు. హస్తినలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడంతో టూరిస్టులు ఢిల్లీవైపు చూసేందుకు జంకుతున్నారు. ఢిల్లీవాసులు కూడా కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు శీతల ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో హిమచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు సిమ్లా, ధర్మశాల టూరిస్టులతో కిటకిటలాడుతున్నాయి. కాలుష్యం నుంచి ఉపశమనం కోసం ఇక్కడకు వచ్చామని సిమ్లాకు పర్యటనకు వచ్చిన ఢిల్లీవాసి ఒకరు చెప్పారు. కాలుష్యంతో ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నామని ధర్మశాలకు వచ్చిన మహిళా టూరిస్ట్ ఒకరు వెల్లడించారు. గతవారం ఢిల్లీ పర్యటించిన తనకు కాలుష్యంతో కూడిన పొగమంచు కారణంగా గొంతు నొప్పి మొదలైందని విదేశీ మహిళ తెలిపారు. పర్యాటకులు పెరగడంతో అథితి గృహాలకు డిమాండ్ పెరిగిందని హిమచల్ ప్రదేశ్ టూరిజం హోటల్స్ బుకింగ్ ఇంచార్జి ధర్మశాలలో చెప్పారు. -
ఢిల్లీని దడ దడ లాడిస్తున్న కాలుష్యం
-
ఢిల్లీ కాలుష్య నియంత్రణకు టెరీ ప్రణాళిక
న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో కాలుష్య నివారణకు ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ (టెరీ) సోమవారం పది సూత్రాల అత్యవసర ప్రణాళికను ప్రకటించింది. ఇందులో... పంట దహనాన్ని తగ్గించడం, ఢిల్లీ–ఎన్ సీఆర్‌లో పదేళ్లకు పైబడిన డీజిల్ వాహనాలపై నిషేధం విధించడం లాంటివి ఉన్నాయి. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు ఈ ప్రణాళికను సమర్పిస్తూ దీన్ని సత్వరమే అమల్లోకి తేవాలని సిఫార్సు చేసింది. ఢిల్లీ కాలుష్యంపై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్(సీఎస్ఈ) సమర్పించిన నివేదికపై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. -
ఇంత దారుణంగా ఉంటే మీరేం చేస్తున్నారు?
-
ఇంత దారుణంగా ఉంటే మీరేం చేస్తున్నారు?
ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. పీఎం2.5 రేణువులు అత్యధికంగా ఉన్నాయి. దాంతో కళ్ల ముందు ఏముందో కూడా కనపడని పరిస్థితి. ఈ కారణంగా పాఠశాలలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాల ప్రభుత్వాలపై మండిపడింది. ఢిల్లీ కాలుష్యం అంశంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే అధ్యక్షతన సమావేశం జరిగింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ప్రభుత్వాలు ఢిల్లీ కాలుష్యానికి కారణమని ఎన్జీటీ విమర్శించింది. ఇప్పటివరకు కాలుష్య నియంత్రణకు మీరేం చేశారని కేంద్రంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్జీటీ ప్రశ్నించింది. రోడ్ల మీద దుమ్మును తగ్గించడానికి నీళ్లు చల్లడం మొదలుపెట్టారా లేదా అని, హెలికాప్టర్ల ద్వారా నీళ్లు చల్లాలన్న ప్రతిపాదన ఏమైందని ప్రశ్నలు సంధించింది. ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకోడానికి ఏం చేశారని నిలదీసింది. పంజాబ్‌లో 70% భూముల్లో పంటలు కాల్చేస్తుంటే ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తోందని అడిగింది. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా.. కార్పొరేషన్లు ఏం చేస్తున్నాయని ప్రశ్నించింది. ఇంతకుముందు రోడ్లను శుభ్రం చేయడానికి మిషన్లు వాడాలని చెప్పిన విషయాన్ని గుర్తుచేసి, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని తెలిపింది. ఢిల్లీలో కాలుష్యానికి ప్రధాన కారణం దుమ్మేనని, రాష్ట్రాల వారీగా పర్యావరణ పరిరక్షణ క్యాలెండర్లను రూపొందించాల్సి ఉందిన కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ దవే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించే వరకు ఏ సమస్య అయినా పరిష్కారం కాదని, ఎప్పటికప్పుడు రోడ్లపై నీళ్లు చల్లించడం లాంటి చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పారు. ఈ విషయంలో ఒకరిపై ఒకరు తప్పులు తోసుకోవడం సరికాదని, ప్రజలు ఊపిరి పీల్పచుకునేందుకు వీలుగా గాలి కాలుష్యం లేకుండా చూడాలని దవే తెలిపారు. ఢిల్లీ కాలుష్యంలో 80 శాతం వరకు ఇక్కడే తయారవుతోందని, మిగిలిన 20 శాతం మాత్రమే పొరుగు రాష్ట్రాలలో పంటలు కాల్చడం వల్ల వస్తోందని స్పష్టం చేశారు. -
మరో మూడు రోజులు నరకం తప్పదు
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యభూతం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. రాబోయే మూడు రోజులలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచిన 17 ఏళ్లలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా కాలుష్య మేఘాలు కమ్ముకుంటున్నాయని, ఢిల్లీలో బయటి గాలి అసలు పీల్చుకోడానికి ఏమాత్రం వీలు లేకుండా ఉందని చెబుతున్నారు. శీతాకాలం వాతావరణంలో కాలుష్యమేఘాలు మరింత తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. దాంతో ఇప్పటి పరిస్థితుల దృష్ట్యా రాబోయే మూడు రోజుల పాటు పాఠశాలలన్నింటికీ సెలవులు ఇచ్చేశారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. దేశ రాజధాని 'గ్యాస్ ఛాంబర్'లా మారిపోయిందనపి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రస్తుత పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో పీఎం 2.5, పీఎం 10 చాలా ఎక్కువ స్థాయిలో ఉండబోతున్నాయని హెచ్చరించింది. దానివల్ల బయటి గాలిని పీల్చుకోవడం ప్రజలకు తీవ్ర అనారోగ్యకరం అవుతుందని తెలిపింది. 2.5 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ధూళి రేణువులను పీఎం2.5గా (పర్టిక్యులేట్ మేటర్ 2.5) వ్యవహరిస్తారు. ఇవి కళ్లలోకి, గొంతు, ఊపిరితిత్తుల్లోకి కూడా వెళ్లిపోయి తీవ్రమైన ఇబ్బంది కలిగిస్తాయి. అదే పీఎం 10 అయితే మాత్రం దీనికంటే కొంత పర్వాలేదు. 10 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువ ఉన్న ఈ ధూళి రేణువుల వల్ల దీర్ఘకాలిక, శాశ్వత ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రస్తుతం పీఎం 2.5, పీఎం 10 రెండూ అత్యధిక స్థాయిలో ఉంటున్నాయి కాబట్టి వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావొద్దని.. అప్పుడు కూడా మాస్కులు ధరించి, ఇతర జాగ్రత్తలు తీసుకుని మాత్రమే రావాలని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. -
కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
-
కాలుష్యంతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి
ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం 1,800 స్కూళ్లకు సెలవు కేంద్ర, ఢిల్లీ ప్రభుత్వాలపై ఎన్జీటీ ఆగ్రహం న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో విలవిల్లాడుతోంది. ఢిల్లీలో వాహనాలు వెదజల్లుతున్న వాయువులతోపాటు నగరం చుట్టుపక్కలున్న పరిశ్రమలనుంచి వస్తున్న కాలుష్యంతో హస్తినలో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొంతకాలంగా ప్రపంచ కాలుష్యనగరాల్లో ప్రధానంగా నిలిచిన ఢిల్లీలో.. గత మూడ్రోజులుగా పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారాయి. కాలుష్యాన్ని కొలిచే పరికరాలు, గాల్లో దుమ్ము, ధూళి, పొగ, రసాయనాలు ప్రమాదస్థాయిని మించిపోయినట్లు సూచించాయి. గాలి నాణ్యత, వాతావరణ అంచనా, పరిశోధన వ్యవస్థ (సఫర్) వెల్లడించిన వివరాల ప్రకారం.. 10 పర్టికులేట్ మ్యాటర్ (కాలుష్య స్థాయి) ఉండాల్సిన కాలుష్యం 500 మార్కును చేరింది. భారీ ఎత్తున కురుస్తున్న పొగమంచు, నగరంలో కాలుష్యం పెరిగిపోవటంతో.. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. శనివారం తన పరిధిలోని 1800 స్కూళ్లకు సెలవు ఇస్తున్నట్లు ఎమ్సీడీ (మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ) ప్రకటించింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు శుక్రవారం కూడా సెలవు ప్రకటించాయి. మరికొన్ని స్కూళ్లు ఆవరణలో జరిగే ప్రార్థన, క్రీడల తరగతులను రద్దుచేశాయి. గుర్గావ్, ఢిల్లీలో శాఖలున్న శ్రీరామ్ స్కూలు సోమవారందాకా సెలవు ప్రకటించింది. 10, 12వ తరగతి విద్యార్థులలే హాజరుకావాలంది. భావితరానికి భయంకరమే! దేశరాజధానిలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆందోళన వ్యక్తం చేసింది. రోజురోజుకూ తీవ్రమవుతున్న కాలుష్య సమస్య నివారణకు కేంద్రం, ఆప్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడింది. ఢిల్లీలో 17 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కాలుష్యం పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మన పిల్లలకు ఎలాంటి భయంకరమైన భవిష్యత్‌ను ఇవ్వబోతున్నామో ఆలోచించుకోవాలనింది. ‘మీ కోసమో (అధికారులు), ప్రజల కోసమో కాదు. మనకోసం కాలుష్యాన్ని నివారించాలి. మనం ఏదైనా సాధించగలం. ప్రస్తుత పరిస్థితి ఎమర్జెన్సీని తలపిస్తోంది’ అని ఎన్జీటీ చైర్పర్సన్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ప్రమాదకర వాయు కాలుష్యం, ప్రజల ఆరోగ్యంపై ఢిల్లీ ప్రభుత్వం, కేంద్రం, అధికారులు ఏ మాత్రం బాధపడకుండా.. ఒకరినొకరు నిందించుకుంటున్నారని ఎన్జీటీ మండిపడింది. కాలుష్యం ఇంతగా పెరిగిపోతున్న నేపథ్యంలో పదేళ్లు దాటిన డీజిల్ వాహనాలను రోడ్లపై తిరగనివ్వొద్దంటూ మళ్లీ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులు అమలుకాకపోడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. -
సరి-బేసితో ప్రజలకు ఇబ్బంది: హైకోర్టు
దేశ రాజధానిలో కాలుష్యం సమస్యకు పరిష్కారంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రారంభించిన సరి-బేసి కార్ల విధానానికి ఢిల్లీ హైకోర్టు నుంచి ఊహించని విధంగా చుక్కెదురైంది. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు తలెత్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ట్రయల్ రన్‌ను 15 రోజులకు బదులు వారం రోజులకే ఎందుకు పరిమితం చేయకూడదని ప్రశ్నించింది. ప్రజలకు సరిపడ స్థాయిలో ప్రజా రవాణా వ్యవస్థ లేకుండానే ఇలాంటి పథకం చేపట్టినట్లు ప్రభుత్వం అంగీకరించి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కాలుష్యం లెక్కలు ఎలా ఉన్నాయో కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. -
'మండే టెస్ట్' పాస్.. ఢిల్లీవాలా రిలీఫ్!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేజ్రీవాల్ సర్కార్ అమల్లోకి తెచ్చిన 'సరి-బేసి' అంకెల విధానం 'మండే టెస్ట్'లో దాదాపు పాస్ అయినట్టు కనిపిస్తోంది. 'సరి-బేసి' వాహన నెంబర్ ప్లేట్ల విధానం జనవరి 1 తేదీన అమల్లోకి వచ్చినప్పటికీ, ఈ మూడురోజులు వారాంతపు సెలవులు కావడంతో దీని ప్రభావం ప్రధానంగా సోమవారం తెలుస్తోందని సర్వత్రా భావించారు. అంతా అనుకున్నట్టే సోమవారం 'సరిసంఖ్య' నెంబర్ కలిగిన వాహనాలు మాత్రమే రోడ్లు ఎక్కాయి. సరిసంఖ్య వాహనం లేనివాళ్లు ప్రజారవాణా వ్యవస్థపై ఆధారపడ్డారు. దీంతో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయి కనిపించాయి. కొన్నిచోట్ల ఈ విధానాన్ని ఉల్లంఘిస్తూ 'బేసి' సంఖ్య కలిగిన వాహనాలు రోడ్లు ఎక్కడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు దాదాపు 200 మందికి జరిమానా విధించారు. ఈ విధానం అమలు విషయంలో ప్రముఖులకు కూడా ఎలాంటి మినహాయింపు ఉండదని ఢిల్లీ పోలీసు స్పెషల్ కమిషనర్ ముక్తేశ్ చందర్ తెలిపారు. ఈ విధానాన్ని ఉల్లంఘించిన ఓ వీఐపీకి ఆయన స్వయంగా చలాన్ విధించారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ట్రాఫిక్ విధానానికి అనుగుణంగా తన కారును పక్కనబెట్టారు. రవాణాశాఖ మంత్రి గోపాల్ రాయ్ టాటా నానో కారులో ఆయనతోపాటు కలిసి కేజ్రీవాల్ సెక్రటేరియట్ కు పయనమయ్యారు. ట్రాఫిక్ చిక్కులు తప్పడంతో రిలీఫ్ ఢిల్లీ రోడ్ల మీద సాధారణంగా భారీ ట్రాఫిక్ ఉంటుంది. అందుకు భిన్నంగా సోమవారం దర్శనమిచ్చింది. సహజంగా ట్రాఫిక్ ఉండే జంక్షన్లు కూడా 'సరి-బేసి' విధానం కారణంగా సాధారణంగా కనిపించాయి. నూతన విధానం వల్ల భారీ సంఖ్యలో కార్లు రోడెక్కకపోవడంతో హస్తినలో పెద్దగా ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాలేదంటూ ఢిల్లీ వాసులు ట్విట్టర్ లో ఆనందం వ్యక్తం చేశారు. 'సరి-బేసి' నెంబర్ ప్లేట్ల ఆధారంగా దినం తప్పించి దినం కార్లను రోడ్లకు మీదకు అనుమతిస్తూ కేజ్రీవాల్ సర్కార్ తెచ్చిన ఈ విధానంపై కొందరు సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోవడానికి ప్రైవేటు వాహనదారులు ప్రయత్నిస్తున్నారని, ముఖ్యంగా క్యాబ్‌ల చార్జీలను విపరీతంగా పెంచారని మరికొందరు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘సరి-బేసి’తో కాలుష్యం ఎందుకు పెరిగింది?
న్యూఢిల్లీ: నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు శుక్రవారం నుంచి ఆప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సరి-బేసి’ వాహనాల నియంత్రణ విధానం బేస్ అంటూ సోషల్ మీడియా ప్రశంసించినా, ఈ విధానం తొలిరోజు బ్రహ్మాండంగా సక్సెస్ అయిందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చంకలు గుద్దుకున్నా నగరంలో కాలుష్యం శాతం ఎందుకు తగ్గలేదు. రోడ్లపైనా కార్ల రాకపోకలను చెప్పుకోతగ్గ స్థాయిలో నియంత్రించగలిగినా, కొత్త సంవత్సరం సందర్భంగా ప్రైవేటు కంపెనీలు ఉద్యోగులకు సెలవుదినం ప్రకటించినప్పటికీ కాలుష్యం ఏమాత్రం ఎందుకు తగ్గలేదు. వాస్తవానికి గత వారం కన్నా శుక్రవారం ఎక్కువుందని, ఆ మాటకొస్తే దీపావళి తర్వాత ఎక్కువ కాలుష్యం నగరంలో నమోదైందని నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆరు ఇండికేటర్లే కాకుండా, పుణెలోని ఐఐటిఎం సీనియర్ సైంటిస్ట్ గుఫ్రాన్ బేగ్ తెలిపారు. ఉదయం పూట ఎనిమిది గంటల వరకు కాలుష్యం తగ్గిందని, ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకల్లా నార్మల్ రేంజ్‌కన్నా ఐదింతల కాలుష్యం పెరిగిందని ఆయన వివరించారు. వాతావరణ మార్పులు కూడా ఇందుకు కారణం కావచ్చని ఆ విషయమై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. కార్ల నియంత్రణా విధానం నుంచి మహిళలను మినహాయించడం, వారు నడిపే కార్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల సరి-బేసి విధానంలో ఆశించిన మేరకు కార్ల రాకపోకలను నియంత్రించలేక పోయారని, అంతకుమించి టూ వీలర్ల రాకపోకల సంఖ్య పెరగడం వల్ల కాలుష్యం తగ్గకపోగా పెరిగిందని ‘సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్’ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుమిత రాయ్ చౌదరి చెప్పారు. ఆయన వాదనతోని పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా ఏకీభవిస్తున్నారు. వాస్తవానికి కార్లకన్నా ద్విచక్ర వాహనాల వల్లనే ఎక్కువ కాలుష్యం ఏర్పడుతోందని, కొన్ని కార్లను నియంత్రించడం వల్ల వారు ద్విచక్ర వాహనాలను ఆశ్రయించారని వారంటున్నారు. ఢిల్లీలో ద్విచక్ర వాహనాలు 55 లక్షలు ఉన్నాయి. నగరంలో కాలుష్య స్థాయిని ఎప్పటికప్పుడు తెలియజేసే చార్ట్ బోర్డును సెక్రటేరియట్ వద్ద ఏర్పాటుచేసి మరీ ఎప్పటికప్పుడు వివరాలను మీడియాకు తెలియజేసిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా శుక్రవారం నగరంలో కాలుష్యం స్థాయి పెరిగిన విషయాన్ని అంగీకరించారు. మూడు, నాలుగు రెట్లు పెరిగిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. ఐదడుగుల లోతు కాలుష్యం నీటిలో ఐదడుగుల ఎత్తు మనిషి నిలబడి కాలుష్యం హెచ్చు తగ్గుల గురించి చెప్పవచ్చని, 15 అడుగుల కాలుష్య కాసారంలో ఐదడుగుల వ్యక్తి నిలబడి ఏమీ చెప్పలేడంటూ తనకు తోచిన పోలికతో సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. డిసెంబర్ నెలలో సరి సంఖ్య, బేసి సంఖ్య (ఫ్యాన్సీ నెంబర్లు మినహా)లకు డిమాండ్ బాగా పెరిగిందని ఆర్టీయే వర్గాలు తెలిపాయి. ఒక్కో నెంబర్‌కు 21వేల రూపాయల చార్జీని విధించగా ఒక్క డిసెంబర్ నెలలోనే తమ సంస్థకు 64 లక్షల రూపాయలు వసూలయ్యాయని వెల్లడించాయి. ఏడాది మొత్తంలో డిసెంబర్ నెలలోనే కార్ల అమ్మకాలు బాగా పెరిగాయని ఆటోమొబైల్ వర్గాలు తెలిపాయి. సాధారంగా ఆఫర్ల కారణంగా డిసెంబర్ నెలలోనే సేల్స్ ఎక్కువ ఉంటాయని, అయితే ఈ సారి రెండో కారు కొనేందుకు వచ్చినవారు పది శాతం మంది ఉన్నారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశాలు దేనికి కొలమానం? కారు వాడకాన్ని తగ్గించుకోవాలనే ఉద్దేశం కారు వాడకందారుల్లో కనిపించడం లేదు. సరి-బేసి సంఖ్య కారులు కలిగి ఏరోజుకు ఏది అవసరమో దానిపై ప్రయాణించాలనుకుంటున్నారన్న విషయం సుస్పష్టం. అందుకని ఆప్ ప్రభుత్వం ఈ సరి-బేసి సంఖ్య విధానంపై ఎక్కువ కాలం ఆధారపడకుండా ప్రత్యామ్మాయ మార్గాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలన్నది విజ్ఞుల అభిప్రాయం. -
తొలి రోజు కలెక్షన్ 4 లక్షలు!
దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడానికి చేపట్టిన సరి-బేసి కార్ల ప్రయోగంలో తొలిరోజు 203 మంది ఉల్లంఘనులకు జరిమానా విధించారు. వాళ్ల నుంచి రూ. 4.06 లక్షల జరిమానా వసూలు చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ నిబంధన ఉండగా, మొదటి అరగంటకే ఉల్లంఘన మొదలైంది. 8.33 సమయంలో ఐటీఓ జంక్షన్ వద్ద ఒక వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి ఆపి.. జరిమానా విధించారు. పరీ చౌక్‌లోని తన ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లడానికి మరే ఇతర రవాణా సదుపాయం లేదని, అందుకే తప్పనిసరిగా కారు తీశానని సదరు ప్రయాణికుడు చెప్పాడు. 138 మందిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకోగా, మరో 65 మందిని ఢిల్లీ రవాణాశాఖ అధికారులు పట్టుకున్నారు. ఆటోవాలాలకూ జరిమానా సరి-బేసి కార్ల ప్రయోగం సమయంలో ప్రయాణికులను మీటర్ చార్జీ మీద ఎక్కించుకోడానికి నిరాకరించిన 76 మంది ఆటోడ్రైవర్లకు కూడా జరిమానాలు పడ్డాయి. సరిసంఖ్య ఉన్న కార్లను ఇళ్లవద్దే వదిలిపెట్టాల్సి రావడంతో కొంతమంది ఆటోల్లో వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఇదే చాన్సని ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్న ఆటోవాలాలకు అధికారులు ఫైన్ వేశారు. -
ఢిల్లీలో కార్ల నియంత్రణ సక్సెస్ అవుతుందా?
న్యూఢిల్లీ: ప్రపంచ కాలుష్య నగరాల్లో ఒకటైన ఢిల్లీ నగరంలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు శుక్రవారం నుంచి ‘సరి-బేసి’ నెంబర్ కార్ల అనుమతి విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెల్సిందే. ఇది విజయవంతమవుతుందా, ఆశించిన ఫలితాలు సాధిస్తామా ? అన్నది ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నే. నగరంలోని ధనవంతులకు ఇప్పటికే ఒకటికి మించిన కార్లు ఉన్నాయి. ఒక రోజు సరి సంఖ్య మరో రోజు బేస్ సంఖ్య కార్లను తీసుకపోరా? రెండో కారు లేనివారు సెకండ్ హ్యాండ్ కారైనా కొనరా? సరి-బేసి సంఖ్య నెంబర్ ప్లేట్ ఉండేలా జాగ్రత్త పడలేరా? ఇంతవరకు కారు ప్రయాణానికి అలవాటు పడిన వారు రైలో, బస్సో ఎక్కి ప్రయాణం చేయగలరా? ప్రపంచంలోని పలు దేశాల నగరాల్లో ఇప్పటికే ఈ వాహనాల నియంత్రణ విధానం అమలులో ఉంది. అక్కడ ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందా? ఇస్తే అందుకు కారణాలు ఏమిటీ? అన్న అంశాన్ని ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైనాతోపాటు పలు యూరప్ నగరాలు, ల్యాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఈ వాహనాల నియంత్రణ విధానం అమలు జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య దేశాల్లో బీజింగ్ నగరం మొదటి స్థానంలో ఉంది. అక్కడి రోడ్లపై కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 20 అత్యంత కాలుష్య నగరాల్లో అందులో మన దేశంలోనే 13 నగరాలు ఉన్నాయి. మెక్సికో సిటీ, యూరప్ నగరాల్లో ఈ నియంత్రణ విధానం సక్సెస్ అవడానికి సంబంధిత కారణాలు అనేకం ఉన్నాయి. ఢిల్లీలో ప్రతి వెయ్యిమందికి 157 కార్లు ఉన్నాయి. సింగపూర్‌లో ప్రతి వెయ్యిమందికి 38 కార్లు, హాంకాంగ్‌లో 25 కార్లు ఉన్నాయి. దీన్నిబట్టి ఢిల్లీలో కార్లను నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రపంచ దేశాలు ఎన్నో మార్గాలను అనుసరిస్తున్నాయి. అందులో నిర్దేశించిన ప్రాంతాల్లోకి ఎలాంటి వాహనాలను అనుమతించక పోవడం, ఆ ప్రాంతంలోకి దారితీసే ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ స్లాట్లను ఏర్పాటు చేయడం, పార్కింగ్ చార్జీలను పెంచడం, రద్దీ వేళల్లో ‘రద్దీ చార్జీలు’ విధించడం, మెరుగైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయడం, సైకిల్ లేదా కాలి నడకన వెళ్లడాన్ని ప్రోత్సహించడం లాంటి చర్యలు తీసుకుంటున్నారు. నగరాల్లో డీజిల్ కార్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించిన దేశాలు కూడా ఉన్నాయి. ఒకే కుటంబానికి ఒకే కారు కొనే నియంత్రణలు కూడా కొన్ని నగరాల్లో కచ్చితంగా అమలు చేస్తున్నారు. ప్రతి ఆరు నెలలకోసారి ప్రతి వాహనం కాలుష్యాన్ని కచ్చితంగా చెక్‌చేసే విధానాలను కూడా అమలు చేస్తున్నారు. నగరంలోని మురకివాడల్లో నివసిస్తున్న నాలుగున్నర లక్షల మంది ఆక్రమిస్తున్న స్థలం మొత్తం నగరం విస్తీర్ణంలో కేవలం మూడు శాతంకాగా, కార్లు ఆక్రమిస్తున్న స్థలం పదిశాతమని ఢిల్లీలోని ‘సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ సంస్థ అంచనావేసింది. పార్కింగ్ స్లాట్లకు మొత్తంగా 23 నుంచి 27 చదరపు కిలోమీటర్ల స్థలం అవసరమని అభిప్రాయపడింది. ఇలాంటి స్థితిలో ఢిల్లీలో కార్ల రాకపోకలను తగ్గించాలంటే రైలు, బస్సు రవాణాను మెరుగుపర్చాలి. అంటే నగరంలోని ప్రతి మూలకు కనెక్టివిటీ ఉండాలి. విదేశాల్లోలాగా ‘బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ను అమలు చేయాలి. అంటే బస్సులను మాత్రమే అనుమతించే ప్రత్యేకమైన ‘స్పీడ్ ట్రాక్’లు ఉండాలి. ఇంటి ముందు రోడ్డుపై కార్ల పార్కింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరాదు. పార్కింగ్ స్థలాన్ని చూపిస్తేనే కారు కొనేందుకు అనుమతివ్వాలి. రద్దీ చార్జీలు విధించాలి. ఆటోమొబైల్ లాబీ ఎక్కువగా ఉండే భారత్ లాంటి దేశాల్లో ఈ నిబంధనలను అమలు చేయడం అంత సులభం కాదు. టోల్గేట్లకు వ్యతిరేకంగా ముంబైలో జరుగుతున్న ఆందోళన వెనక ఆటోమొబైల్ లాబీ ఉన్న విషయం తెల్సిందే. ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా కార్లను నియంత్రించడానికి ముందే ప్రజా రవాణా వ్యవస్థను ముఖ్యమంత్రి కేజ్రివాల్ మెరగుపర్చి ఉండాల్సింది. ఢిల్లీలోని మెట్రో రైళ్లలో ప్రస్తుతం రోజుకు 30 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇక ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కు చెందిన 4,500 బస్సుల్లో నాలుగు లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇది వరకు ఆరువేల బస్సుల్లో ఐదున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నారు. జనాభాకు అనుగుణంగా బస్సులు సంఖ్య పెరగాల్సింది తగ్గుతూ వచ్చింది. -
సగం జీతమే వస్తుంది.. మా గతేంటి?
-
'సరి-బేసి' సూపర్ సక్సెస్: కేజ్రీవాల్
-
సగం జీతమే వస్తుంది.. మా గతేంటి?
దేశ రాజధానిలో కాలుష్యాన్ని అరికట్టడానికి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేపట్టిన సరి-బేసి వాహనాల విధానం డ్రైవర్ల పొట్ట కొట్టేలా ఉంది. ఇప్పటివరకు ఈ కోణం వెలుగులోకి రాకపోయినా.. తాజాగా ఢిల్లీలో శుక్రవారం నాడు బయటకు వచ్చిన వాహనాల డ్రైవర్లను 'సాక్షి' పలకరించినప్పుడు ఈ విషయం బయటపడింది. కొత్త చట్టం కారణంగా తాము సగం రోజులు మాత్రమే కార్లు బయటకు తీయాల్సి ఉంటుందని, యజమానులు కూడా ఆ లెక్కన సగం జీతమే ఇస్తామని అంటున్నారని, తమ గతేం కానని ఓ కారు డ్రైవర్ ప్రశ్నించాడు. ఒక యజమానికి రెండు కార్లుండి, వాటిలో ఒకటి సరిసంఖ్యతోను, మరొకటి బేసి సంఖ్యతోను ముగిసేటట్లయితే కొంతవరకు పర్వాలేదు. అప్పుడు కూడా ఇద్దరు డ్రైవర్లలో ఒకరికి ఉద్వాసన తప్పదు. ఇలాంటి సమస్య ఒకటి వస్తుందని స్వయంగా కేజ్రీవాల్ కూడా ఊహించి ఉండరు. తొలి ఫైన్ కట్టారు.. మృదుల్ యాదవ్.. నిన్నటి వరకు ఆయన ఓ మామూలు సర్వసాధారణ ఢిల్లీ పౌరుడు. కానీ ఈ రోజు ఉన్నట్టుండి సెలబ్రిటీ అయిపోయారు. దేశ రాజధానిలో బేసి సంఖ్యతో ముగిసే నెంబర్ ఉన్న కార్లు మాత్రమే శుక్రవారం నాడు రోడ్డుమీదకు రావాలని నిబంధన ఉన్నా, సరిసంఖ్యతో ముగిసే నెంబరున్న తన కారులో బయటకు వచ్చాడు. ట్రాఫిక్ పోలీసులు గుర్తించి, అతడిని ఆపి.. రూ. 2 వేల జరిమానా విధించారు. కొత్త చట్టం అమలు అవుతున్న విషయం తనకు తెలుసని, కానీ అర్జంటుగా వెళ్లాల్సి వస్తోందని మృదుల్ అన్నారు. తన వద్ద ఉన్న కార్లన్నింటికీ సరి సంఖ్యలే చివర ఉన్నాయని, తప్పనిసరి కాబట్టి జరిమానా కట్టి వెళ్తాననని ఆయన చెప్పారు. -
'సరి-బేసి' సూపర్ సక్సెస్: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కాలుష్య నియంత్రణకు తాము అమలు చేస్తున్న సరి-బేసి సంఖ్యల విధానానికి అనూహ్య స్పందన లభిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఈ విధానాన్ని ఢిల్లీ ప్రజలు హృదయపూర్వకంగా అంగీకరించారని పేర్కొన్నారు. 'సరి-బేసి విధానానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రోడ్లపై కార్లు తక్కువగా కన్పిస్తున్నాయి. ఈ పథకం తప్పకుండా విజయవంతమవుతుంది. అయితే శాశ్వతంగా సరి-బేసి నిబంధన అమలు చేయడం కుదరదు. భవిష్యత్ లో ఢిల్లీ ...దేశానికి ఆదర్శనంగా నిలుస్తుంది' అని మీడియాతో చెప్పారు. పెద్ద సవాళ్లను అధిగమించగలమని ఢిల్లీ ప్రజలు రుజువు చేశారని ప్రశంసించారు. దేశానికి మార్గసూచిలా నిలిచారని కితాబిచ్చారు. తన కారులో మరో నలుగురితో కలిసి తాను కార్యాలయానికి వెళ్లినట్టు ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇద్దరు మంత్రులు, తన వ్యక్తిగత కార్యదర్శి, సంయుక్త కార్యదర్శిలను కారులో ఎక్కించుకున్నానని తెలిపారు. సరి-బేసి విధానం అమలుపై సానుకూల స్పందన వ్యక్తం కావడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు. -
సైకిళ్లు, బస్సులు ఎక్కనున్న మంత్రులు!
⇒ కార్పూలింగ్లో వెళ్తానన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ⇒ రోజూ 10 లక్షల వాహనాలకు విశ్రాంతి ⇒ సరి-బేసి ప్రయోగంతో తగ్గనున్న ఢిల్లీ కాలుష్యం న్యూఢిల్లీ దేశరాజధాని నగరంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించిన సరి-బేసి కార్ల ప్రయోగంతో దాదాపు పది లక్షల వాహనాలకు విశ్రాంతి లభించనుంది. వీవీఐపీలకు మినహాయింపు ఉన్నా, స్వయంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన మంత్రులు కూడా కార్ల వాడకాన్ని తగ్గించేందుకు కార్ పూలింగ్, ఇతర పద్ధతులు అవలంబిస్తున్నారు. సీఎం కేజ్రీవాల్.. తన సహచర మంత్రులు గోపాల్ రాయ్, సత్యేంద్ర జైన్‌లతో కలిసి ఒకే కారులో వెళ్లారు. సీఎం లైసెన్సు ప్లేటు నెంబరు బేసి సంఖ్యతో ముగుస్తుంది. దాంతో ఆయన తన కారును శుక్రవారం ఉపయోగించుకోవచ్చు. శనివారం మాత్రం ఆ కారు బయటకు తీయకూడదు. మరికొందరు మంత్రులు విభిన్న మార్గాలు అవలంబిస్తూ సచివాలయానికి వెళ్లనున్నారు. సాంస్కృతిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా సైకిల్ మీద వెళ్తానన్నారు. పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్ ఆటోలో ప్రయాణిస్తారు. సాంఘిక శాఖ మంత్రి సందీప్ కుమార్ బస్సులో గమ్యం చేరుకుంటారు. సరి-బేసి ప్రయోగం కారణంగా గమ్యాలకు చేరుకోవడం ఎవరికైనా ఇబ్బంది అయితే ఫోన్ చేసేందుకు రెండు హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేశారు. అవి.. 011-42400400, 011- 41400400. దాంతోపాటు @transportdelhi అనే ఐడీకి ట్విట్టర్ ద్వారా కూడా సందేశం పంపచ్చు. రాబోయే రెండు వారాల పాటు రోజు విడిచి రోజు మాత్రమే కార్లను బయటకు తీయాలి. ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లే మహిళలు, వీవీఐపీలకు మాత్రం దీన్నుంచి మినహాయింపు ఇచ్చారు. వాళ్లు కాక.. తమకు కేటాయించని రోజులో ఎవరైనా వాహనం తీసినట్లు తెలిస్తే.. రూ. 2వేల జరిమానా విధిస్తారు. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసులతో పాటు దాదాపు 7,500 మంది వలంటీర్లు కూడా ట్రాఫిక్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. -
వారిని ఎందుకు మినహాయించారు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు అమలుచేయనున్న సరి, బేసి నంబర్‌ప్లేట్ ఫార్ములా నుంచి ద్విచక్ర వాహనాలను, మహిళలను ఎందుకు మినహాయించారని బుధవారం ఢిల్లీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనిపై సర్కారు ప్రతిస్పందనను కోరుతూ న్యాయస్థానం కేసుపై విచారణను జనవరి 6 తేదీకి వాయిదా వేసింది. అలాగే తమకు కూడా సరి, బేసి ఫార్ములా నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. సరి, బేసి ఫార్ములా నుంచి మినహాయింపు కావాలని లాయర్లతో పాటు డాక్టర్లు, వ్యాపారులు కూడా కోరుతున్నారు. ప్రైవేటు స్కూళ్లకు ఊరట సరి, బేసి ప్రయోగాన్ని విజయవంతంగా అమలుచేసేందుకు ప్రభుత్వానికి బస్సులు ఇవ్వడానికి నిరాకరిస్తున్న ప్రైవేటు స్కూళ్లకు ఢిల్లీ హైకోర్టు నుంచి ఊరట లభించింది. బస్సులు ఇవ్వాల్సిందిగా స్కూళ్లపై ఒత్తిడి తేరాదని న్యాయస్థానం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జనవరి 1 నుంచి 15 వరకు అమలు చేసే సరి, బేసి నంబర్ ప్లేట్ స్కీం కోసం ప్రజా రవాణా చేసేందుకు బస్సులు కేటాయించవలసిందిగా ఢిల్లీ ప్రభుత్వ డెరైక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నగరంలోని ప్రైవేటు స్కూళ్లను ఆదేశించింది. అలాగే ప్రైవేటు సూళ్లు తమ బస్సులను డీటీసీ వద్ద రిజిష్టర్ చేసుకోవాలని విద్యాశాఖ డెరైక్టరేట్ కోరింది. దీనిని వ్యతిరేకిస్తూ పబ్లిక్ స్కూల్స్ అసోసియేషన్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం ప్రాథమిక విచారణ జరిపిన న్యాయస్థానం ఢిల్లీ సర్కారుకు నోటీసు జారీ చేసి ప్రతిస్పందన కోరింది. కేసు విచారణను వాయిదా వేసింది. -
'ఏ సెక్షన్ కింద చలానా రాస్తారు?'
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో ఢిల్లీ ప్రభుత్వం జనవరి 1 నుంచి కార్లకు అమలు చేయనున్న సరి-బేసి సంఖ్యల విధానంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మనీష్ తివారి కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీ వెలుపల నమోదైన వాహనాలను ఎలా నియంత్రిస్తారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించారు. ఆల్ ఇండియా రిజిస్ట్రేషన్ తో దేశ రాజధానిలోకి ప్రవేశించే వాహనాలకు సరి-బేసి విధానాన్ని ఎలా అమలు చేస్తారని అడిగారు. నార్త్ ఇండియా, ఢిల్లీ చుట్టుపక్కల నుంచి చాలా మంది వాహనాల్లో హస్తినకు వస్తుంటారని.. వారందరికీ జరిమానా విధిస్తారా అని ప్రశ్నించారు. మోటారు వాహనాల చట్టంలోని ఏ సెక్షన్ కింద ప్రతిరోజూ చలానా రాస్తారని నిలదీశారు. వాహనాలకు సరి-బేసి సంఖ్యల విధానం అమలు చేసేముందు బాగా ఆలోచించాలని ఆయన సూచించారు. -
'టూవీలర్స్ కూ వర్తింపజేయండి'
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాలకు సరి-బేసి సంఖ్యల విధానం అమలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు ఆదర్శ్ శాస్త్రి అభిప్రాయపడ్డారు. ప్రయాణికులకు సరిపడినన్ని బస్సులు ఉంటే టూవీలర్స్ ను సరి-బేసి పాలసీలో చేర్చవచ్చని చెప్పారు. దిచక్ర వాహనదారులకు ప్రత్యామ్నాయం చూపిస్తే ఈ పథకం విజయవంతం అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సరి-బేసి సంఖ్య విధానం అమలుచేసిన వారం రోజుల్లో దీన్ని సమీక్షించి ద్విచక్ర వాహనాలకు వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పిన విషయాన్ని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. సరి-బేసి విధానం అమల్లోకి వచ్చిన వారం తర్వాత టూవీలర్స్ కు దీన్ని వర్తింపజేయడం సాధ్యమేనని శాస్త్రి పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న 85 లక్షల వాహనాల్లో 55 లక్షల వరకు ద్విచక్ర వాహనాలున్నాయి. ఢిల్లీలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు జనవరి 1 నుంచి కార్లకు సరి-బేసి సంఖ్యల విధానం అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. -
డీజిల్ కార్ల అమ్మకాలపై సుప్రీంకోర్టు కొరడా
కాలుష్యభూతం కోరలు చాస్తున్న దేశ రాజధాని ఢిల్లీలో లగ్జరీ డీజిల్ కార్ల అమ్మకాలపై సుప్రీంకోర్టు కొరడా ఝళిపించింది. 2000 సీసీ దాటిన డీజిల్ ఎస్‌యూవీలు, కార్ల అమ్మకాలపై మార్చి 31వ తేదీ వరకు నిషేధం విధిస్తూ నిర్ణయం వెలువరించింది. దీనివల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని స్పష్టం చేసింది. ఢిల్లీలో ఇకమీదట అసలు కొత్త డీజిల్ వాహనాలను రిజిస్టర్ చేయకూడదని ఇంతకుముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఢిల్లీలో డీజిల్ కార్ల కొనుగోళ్లు ఆపాలని ఎన్జీటీ తెలిపింది. జనవరి 6వ తేదీన తదుపరి విచారణ జరిగేవరకు ఇవి తాత్కాలిక ఉత్తర్వులుగా ఉంటాయని చెప్పింది. సుప్రీంకోర్టు కూడా ఢిల్లీ కాలుష్యంపై స్పందించింది. 2005 కంటే ముందుగా రిజస్టర్ అయిన ట్రక్కులను ఢిల్లీ పరిసరాల్లోకి ప్రవేశించకుండా నిషేధించేందుకు సుప్రీం అనుమతించింది. అలాగే, అసలు దేశ రాజధానిలోకి వచ్చే ట్రక్కుల మీద గ్రీన్ టాక్స్‌ను కూడా రెట్టింపు చేసింది. సరి - బేసి సంఖ్యల కోడ్ ఆధారంగా రోజూ రోడ్డుమీదకు వచ్చే కార్ల సంఖ్యను సగానికి తగ్గించాలన్న ఢిల్లీ సర్కారు నిర్ణయం ఫలితాన్నిస్తుందని తాము అనుకోవట్లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే తాము దాన్ని ఆపబోమని, కావాలంటే కొనసాగించుకోవచ్చని చెప్పింది. అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ ఇప్పటికే చెడ్డపేరు తెచ్చుకుందని, దేశ రాజధానిలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని ఇంతకుముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ అన్నారు. కోర్టు ప్రాంగణంలో కూడా ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న మొత్తం కార్లలో 23 శాతం డీజిల్ కార్లే ఉన్నాయి. పెట్రోలు కార్ల కంటే వీటినుంచి ఏడున్నర రెట్లు ఎక్కువగా కలుషిత పదార్థాలు బయటకు వస్తాయి. డీజిల్ పొగ కేన్సర్ కారకం అవుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఇంతకుముందు హెచ్చరించింది. -
'డీజిల్ కార్లకు రిజిస్ట్రేషన్లు చేయొద్దు'
న్యూఢిల్లీ: కాలుష్యం కోరల్లో చిక్కుకున్న దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా డీజిల్ వాహనాలను అనుమతించొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్ జీటీ) సూచించింది. డీజిల్ వాహనాలకు రిజిస్టేషన్లు చేయొద్దని ప్రతిపాదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగుల కోసం డీజిల్ వాహనాలు కొనొద్దని ఆదేశించింది. కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం తెస్తున్న సరి-బేసి సంఖ్య పాలసీపై పలు ప్రశ్నలు సంధించింది. ఈ విధానంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేమన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. వాహనాలకు అమలు చేయాలనుకుంటున్న సరి-బేసి సంఖ్యా విధానం.. ఒక్కొక్కరూ రెండేసి కార్లు కోనేందుకు పురికొల్పేలా ఉందని ఎన్ జీటీ వ్యాఖ్యానించింది. -
'మంత్రులు, అధికారులకూ మినహాయింపు లేదు'
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించేందుకు తాము చేపట్టనున్న చర్యలకు సహకరిస్తామని కేంద్రం హామీయిచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఆయన కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నెలలో 15 రోజులు మాత్రమే ప్రైవేటు వాహనాలను అనుమతించేందుకు తాము చేపట్టనున్న చర్యలకు సహకరిస్తామని రాజ్ నాథ్ హామీయిచ్చారని చెప్పారు. మంత్రులకు, ప్రభుత్వ అధికారులకు కూడా మినహాయింపు ఇవ్వబోమని ఆయన స్పష్టం చేశారు. సింగిల్ వుమెన్ డ్రైవర్స్, రోగులను తరలించే వాహనాలకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన కాలుష్యాన్ని తగ్గించేందుకు జనవరి 1 నుంచి వాహనాల రాకపోకలను నియంత్రించాలని కేజ్రీవాల్ సర్కారు నిర్ణయించింది. -
'ఏదోటి చేయండి లేదా చావుకు సిద్ధపడండి'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగిపోవడం పట్ల ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాబ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హస్తినలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిచేరుకుందని, దీన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టకుంటే చావడానికి సిద్ధంగా ఉండాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 'కాలుష్యాన్ని అరికట్టేందుకు చేపట్టే ఏ చర్యనైనా స్వాగతించాల్సిందే. మంచి పనులు చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. వీటిని భరించకపోతే కాలుష్యం బారిన పడి చనిపోడం ఖాయం. పొగమంచుతో ప్రాణాలు పోతాయి' అని రాహుల్ బజాజ్ అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు జనవరి 1 నుంచి ప్రైవేటు వాహనాలను నెలలో 15 రోజులు మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆయన మద్దతు పలికారు. కేజ్రీవాల్ మంచి ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన చేశారని అన్నారు. 'కారు పూల్'ను ప్రోత్సహించాలన్నారు. 'కారు యజమానులు సైకిల్ పై వెళ్లమని లేదా బస్సులో వెళ్లాలని నేను చెప్పడం లేదన్నారు. మీరు ఆఫీసుకు వెళ్లేటప్పుడు మీ స్నేహితుడిని కారులో తీసుకెళ్లండి లేదా మిమ్మల్ని పికప్ చేసుకోమని మీ స్నేహితులకు చెప్పండి. ఒక రోజు మీ కారులో, మరొక రోజు మీ స్నేహితుడి కారులో వెళ్లండి' అని రాహుల్ బజాజ్ సూచించారు. -
అక్కడుంటే గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లే: హైకోర్టు
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. దీనిపై అక్కడి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలో ఉంటే గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లేనని వ్యాఖ్యానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడి వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు ఏం చేస్తున్నాయో డిసెంబర్ 21న జరిగే తదుపరి విచారణ నాటికల్లా ప్రణాళికలు ఇవ్వాలని ఆదేశించింది. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర పర్యావరణ శాఖలు ఇచ్చిన నివేదికలు సమగ్రంగా లేవని, ఎవరు ఏం చేస్తామన్న బాధ్యతలేవీ అందులో చెప్పలేదని జస్టిస్ బదర్ దుర్రేజ్ అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రాంగణంలో ఒక ఎయిర్ ప్యూరిఫయర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పర్టిక్యులేట్ మేటర్ పి.ఎం. 2.5 స్థాయి ఏకంగా 60 పాయింట్లను దాటిపోయిందని, అయినా దాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఎందుకు ఏమీ చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. పి.ఎం. 2.5 అంటే 2.5 మైక్రాన్ల మందం ఉన్న కాలుష్యం. ఇది అన్నింటికంఏట అత్యంత చిన్నది, ప్రమాదకరమైనదని చెబుతారు. ఇంతకుముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఢిల్లీ సర్కారుకు వాయు కాలుష్యంపై తలంటింది.