
ఢిల్లీ కాలుష్యంతో హిమచల్ కు కాసుల పంట
ఢిల్లీ కాలుష్యం హిమచల్ ప్రదేశ్ కాసులు పండిస్తోంది. ఇదేంటి అనుకుంటున్నారా. ఇది అక్షరాల నిజం.
కాలుష్యం నుంచి ఉపశమనం కోసం ఇక్కడకు వచ్చామని సిమ్లాకు పర్యటనకు వచ్చిన ఢిల్లీవాసి ఒకరు చెప్పారు. కాలుష్యంతో ఢిల్లీ పర్యటన వాయిదా వేసుకున్నామని ధర్మశాలకు వచ్చిన మహిళా టూరిస్ట్ ఒకరు వెల్లడించారు. గతవారం ఢిల్లీ పర్యటించిన తనకు కాలుష్యంతో కూడిన పొగమంచు కారణంగా గొంతు నొప్పి మొదలైందని విదేశీ మహిళ తెలిపారు. పర్యాటకులు పెరగడంతో అథితి గృహాలకు డిమాండ్ పెరిగిందని హిమచల్ ప్రదేశ్ టూరిజం హోటల్స్ బుకింగ్ ఇంచార్జి ధర్మశాలలో చెప్పారు.