రోడ్లపై మంచు గుట్టలు..చిక్కుకుపోయిన టూరిస్టులు | Heavy Snowfall In Himachal Pradesh Tourists Stranded, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

హిమాచల్‌లో భారీగా మంచు..చిక్కుకుపోయిన టూరిస్టులు

Published Tue, Dec 24 2024 7:33 AM | Last Updated on Tue, Dec 24 2024 10:15 AM

Heavy Snowfall In Himachal Pradesh Tourists Stranded

షిమ్లా:హిమాచల్‌ప్రదేశ్‌లో భారీగా మంచు కురుస్తోంది. భారీ మంచు ప్రభావంతో రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపై మంచు గుట్టలుగుట్టలుగా పేరుకుపోవడంతో రోహ్‌తక్‌, సోలాంగ్‌, అటల్‌ టన్నెల్‌ మార్గంలో వెయ్యి వరకు వాహనాలు సోమవారం రాత్రి కొన్ని గంటల పాటు చిక్కుకుపోయాయి.

స్థానిక అధికారులు,పోలీసుల సాయంతో ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. మొత్తం 700 మంది టూరిస్టులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్రిస్‌మస్‌, న్యూఇయర్‌ కావడంతో టూరిస్టుల తాకిడి ఎక్కువవడం ఇదే సమయంలో మంచు భారీగా కురుస్తుండడంతో సమస్యలు ఎదురవుతున్నాయని పోలీసులు చెప్పారు. ఈ సీజన్‌లో ఇక్కడుండే మంచు పర్వతాలను చూడడానికి ఎక్కువ మంది టూరిస్టులు వస్తుండడం గమనార్హం.     

  

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement