snow fall
-
మంచుతో మహేశ్ ఫ్యామిలీ ఆటలు.. ఇంతకీ హీరో ఎక్కడ? (ఫోటోలు)
-
గుల్మార్గ్లో హిమపాతం
గుల్మార్గ్: జమ్మూకశ్మీర్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ను హిమపాతం ముంచెత్తింది. అఫర్వాత్ కొండ ఉన్న ఖిలాన్ మార్గ్ వద్ద సంభవించిన ఈ హిమపాతంలో మంచులో కూరుకుపోయి ఒక రష్యన్ పర్వతారోహకుడు ప్రాణాలు కోల్పోయాడు. హిమపాతాలకు నెలవైన నిషేధిత ఆర్మీ రిడ్జ్ ప్రాంతంలో స్థానిక గైడ్‌తో కలిసి కొందరు రష్యన్లు పర్వతారోహణకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. హిమపాతం జరిగిన వెంటనే పర్యాటక విభాగం గస్తీ, ఆర్మీ, పోలీసులు సహాయక, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి మంచులో కూరుకుపోయిన ఏడుగురిని రక్షించారు. వీరిని ఆస్పత్రిలో చేరి్పంచారు. మృతుడిని మాస్కోవాసి హాంటెన్గా గుర్తించారు. -
వాహ్! ఐస్ టీ వాహ్!
బయట మంచు కురుస్తుంటే లోపల టీ తాగితే బాగుంటుంది. కాని మంచు సెలయేటిలో కూచుని మంచుని కరిగించి టీ కాచుకుంటే? అదీ బాగుంటుందని 78 మిలియన్ల వ్యూస్ చెబుతున్నాయి. కశ్మీర్‌కు షికారుకు వెళ్లిన ముగ్గురు మిత్రులు మంచి పాట వింటూ గుప్పెడు మంచుతో టీ కాచారు. వైరల్ అయ్యారు. చల్లటి ప్రాంతంలో అందరూ తాగే ద్రవం టీ. చలి ముఖాన చరుస్తూ ఉంటే పొగలు గక్కే టీ పెదాలకు అందుతూ ఉంటే ఆ మజాయే వేరు. రాహుల్ యాదవ్ అనే ట్రావెలర్ ఇన్‌స్టాలో ‘ట్రాహులర్’ అనే అకౌంట్లో తన ట్రావెల్ వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. జనవరి 29న అతను తన ఇద్దరు మిత్రులతో ఒక వీడియో పెట్టాడు. అది విపరీతంగా జనానికి నచ్చేసింది. కారణం... కశ్మీర్లో నిర్మానుష్యమైన లోయలో, గడ్డ కట్టిన సెలయేటి మధ్యలో కూచుని ఆ మిత్రులు ‘టీ తయారు చేశారు’. మామూలుగా కాదు. టీ గిన్నెలో అక్కడున్న మంచును వేసి మరీ! క్యాంప్ స్టవ్ మీద ఆ మంచు నిండిన టీ గిన్నె కాసేపటికి వేడి నీరుగా మారింది. అందులో కొంత టెట్రా మిల్క్ వేశారు. ఆ పై టీయాకును, చక్కరను వేస్తే చిక్కటి రంగులో ఘుమఘుమలాడే టీ తయారైంది. ఇటీవల విడుదలైన ‘డంకీ’లోని పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ ఉండగా ఆ ముగ్గురూ మనకు ఈర్ష్య కలిగేలా టీ తాగారు. ఈ వీడియో రెండు వారాల్లో 7 కోట్ల 8 లక్షల మంది చూశారు. ‘మేం కూడా ఎప్పుడో ఒకసారి ఇలా తాగకపోతామా?’ అని కొందరంటే ‘సేఫేనా?’ అని కొందరన్నారు. బ్యాక్టీరియా ఉంటుందేమో అని మరికొందరు సందేహం వెలిబుచ్చారు. బాగా వేడి చేశారు కనుక బ్యాక్టీరియా ఉండకపోవచ్చు. అయినా స్వచ్ఛమైన మంచు టీ తయారు చేసుకుని తాగే ముందు ఈ సందేహాల గోల ఏల? -
ఐదు జాతీయ రహదారులతోపాటు 475 రోడ్లు బంద్
హిమాచల్ ప్రదేశ్‌లో తాజాగా కురుస్తున్న మంచు కారణంగా ఐదు జాతీయ రహదారులతో సహా 475 రహదారులు మూతపడ్డాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలో మంచు కురుస్తున్న కారణంగా 333 విద్యుత్ సరఫరా పథకాలు, 57 నీటి సరఫరా పథకాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హిమపాతం కారణంగా చంబాలో 56, కాంగ్రాలో ఒకటి, కిన్నౌర్‌లో ఆరు, మండిలో 51, సిమ్లాలో 133 రోడ్లు మూసుకుపోయాయని విపత్తు నిర్వహణ విభాగం పేర్కొంది. అంతకుముందు శనివారం రాష్ట్రంలో 504 రహదారులను మూసివేశారు. వీటిలో నాలుగు జాతీయ రహదారులు ఉన్నాయి. అంతేకాకుండా పలు చోట్ల మంచు కురుస్తుండటంతో విద్యుత్ సరఫరా, నీటి సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని లాహౌల్-స్పితిలోని తొమ్మిది ప్రాంతాలలో మంచు తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. లాహౌల్ స్పితి పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్లో జిల్లా వాతావరణం, రహదారి పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేశారు. నూతన సంవత్సరం ప్రారంభమైనది మొదలు హిమాచల్ ప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చే పర్యాటకులు ఇక్కడి వాతావరణ పరిస్థితులను తెలుసుకుని ప్రయాణానికి ప్లాన్ చేసుకోవాలని స్థానిక పోలీసులు సూచిస్తున్నారు. -
ఢిల్లీలో పొగమంచు.. విమానాలు మళ్లింపు
సాక్షి, న్యూఢిల్లీ: పొగ మంచు కమ్మేయడంతో దేశ రాజధాని ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలు దారి మళ్లించారు. విజిబిలిటీ తగ్గిపోవడంతో శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య హైదరాబాద్, బెంగళూరు, ముంబై, విశాఖపట్నం, భువనేశ్వర్, కోల్‌కతా నగరాల నుంచి ఢిల్లీకి వస్తున్న 20 విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్సర్ ఎయిర్‌పోర్టులకు దారి మళ్లించారు. ఢిల్లీ నుంచి లక్నో, జైపూర్, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సిన విమానాలను రన్‌వే పైనే నిలిపివేసినట్లు ఎయిర్పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. -
ఈజిప్టులో పలు వాహనాలు ఢీకొని... 32 మంది మృతి
కైరో: ఈజిప్టులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 32 మంది మృత్యువాతపడ్డారు. కైరో–అలెగ్జిండ్రియా ప్రధాన రహదారిపై బెహీరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొదటగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన వాహనాన్ని ఢీకొట్టింది. ఆ వెనుకే వస్తున్న కార్లు ఒకదానినొకటి ఢీకొట్టి, మంటలు చెలరేగాయి. మొత్తం 29 వాహనాలు ప్రమాదంలో చిక్కుకోగా బస్సు సహా ఆరు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనలో 32 మంది వరకు చనిపోగా మరో 63 మంది గాయపడ్డారు. దట్టంగా కురుస్తున్న మంచు కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. -
సిక్కింలో మంచులో చిక్కిన 900 మంది యాత్రికులు
గ్యాంగ్టాక్: సిక్కింలో పర్యాటకులు తీవ్రమైన మంచులో చిక్కుకున్నారు. నాథులా, టోంగో లేక్ నుంచి రాజధాని గ్యాంగ్టాక్ వైపు శనివారం సాయంత్రం బయలుదేరిన 89 వాహనాలు దట్టమైన మంచులో చిక్కినట్టు అధికారులు చెప్పారు. వీటిలో సుమారు 900 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నారన్నారు. ఆర్మీ సాయంతో వీరిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయన్నారు. అడ్డంకులను తొలగిస్తుండటంతో ఇప్పటికే 15 వాహనాలు గ్యాంగ్టాక్ వైపు బయలుదేరాయని చెప్పారు. కొందరు ప్రయాణికులను దగ్గరల్లోని క్యాంపులకు తీసుకెళ్తామని వెల్లడించారు. -
కశ్మీర్ మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు.. వీడియో వైరల్..
శ్రీనగర్: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీనగర్‌లో సోమవారం ఘనంగా ముగింపు వేడుకలు నిర్వహిస్తోంది కాంగ్రెస్. భారీ సభకు ఏర్పాట్లు చేసింది. అయితే కశ్మీర్లో సోమవారం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి మంచు వర్షం కురుస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం చూసి రాహల్ గాంధీ చిన్నపిల్లాడిలా మారిపోయారు. సోదరి ప్రియాంక గాంధీతో కలిసి మంచులో ఆటలాడుకున్నారు. ఒకరిపై ఒకరు మంచు పెల్లలు విసురుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కూడా రాహుల్ మంచు విసిరి ఆహ్లాదంగా, సంతోషంగా గడిపారు. రాహుల్, ప్రియాంక మళ్లీ చిన్న పిల్లల్లా మారిపోవడం చూసి కార్యకర్తలు మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. शीन मुबारक! 😊pic.twitter.com/V9Y8jCf0MS — Congress (@INCIndia) January 30, 2023 చదవండి: త్రిపుర ఎన్నికల వేళ ఊహించని ట్విస్ట్.. బీజేపీకి కొత్త సవాల్! -
నా 30 ఎముకలు విరిగిపోయాయి.. మీ అందరికీ కృతజ్ఞతలు
మంచు తొలగిస్తూ తీవ్ర గాయాల పాలైన హాలీవుడ్ స్టార్ హీరో జెరెమీ రెన్నర్. ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడు. తాజాగా ఆయన తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఓ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కొత్త ఏడాదిలో తెల్లవారుజామున మంచు ప్రమాదంలో జెరెమీ రెన్నర్ తీవ్రంగా గాయపడ్డారు. జెరెమీ రెన్నర్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'న్యూ ఇయర్ రోజున మంచు గడ్డల కింద నలిగిపోయా. నా 30 ఎముకలు విరిగిపోయాయి. కొత్త ఏడాదిలో రిజల్యూషన్లు అన్నీ ప్రత్యేకంగా ఉండాలని కోరుకున్నా. కానీ నా కుటుంబంలో విషాదం నింపింది. కానీ మీ అందరి ప్రేమతో మళ్లీ కోలుకుంటున్నా. త్వరలోనే బలంగా తిరిగివస్తా' అంటూ ఆసుపత్రి బెడ్లో డాక్టర్ తన కాలును చాచి ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Jeremy Renner (@jeremyrenner) -
రెండు రోజులు.. ఒక్క నిమిషంలో పూర్తైతే..!
వైరల్: కాలం ఎంత వేగంగా గడుస్తుందో కదా. కానీ, రెండు రోజులు ఒక నిమిషంలో పూర్తి చేసుకుంటే ఎలా ఉంటుంది? మరి అంత వేగం భూమ్మీద ఎలాగంటారా? కంగారు పడకండి. అది టైమ్ ల్యాప్స్ ద్వారానే సుమి!. మంచు తుపాన్‌తో అతలాకుతలం అయిన అమెరికా నుంచి ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందమైన ప్రాంతం.. దానికి తగట్లుగా మంచి రోడ్డు, ఆ పక్కన ఇల్లు. ఒక ఇంటి లాన్లో ఉన్న ప్లాస్టిక్ కుర్చీ.. కట్ చేస్తే.. కాలం వేగంగా ముందుకు వెళ్తుంది. అదీ రెండు రోజులపాటు. ఆ ప్రాంతం మొత్తం మంచు కప్పేస్తుంది. జనజీవనం అస్తవ్యస్తం అయ్యేంత పరిస్థితి దాపురిస్తుంది. అయినా ఆ వీడియో ఆగదు. రెండు రోజులపాటుగా పని చేసిన కెమెరా.. అక్కడి దృశ్యాలను రికార్డు చేసింది. ఆ రెండు రోజుల వీడియోనే వేగంగా.. 60 సెకండ్లలో చూపించింది ఆ వీడియో. సోషల్ మీడియాలో వ్యూస్, లైకులు, షేర్లతో దూసుకుపోతున్న ఆ వీడియోను మీరూ చూసేయండి.. 48 hour timelapse of Blizzard in 60 seconds. pic.twitter.com/tPjrUFnmzR — Weird and Terrifying (@weirdterrifying) December 29, 2022 -
యూకేను ఘోరంగా ముంచెత్తిన మంచు (ఫొటోలు)
-
ఘోరమైన వేడి-చల్లదనం.. ఈ ఏడాది అట్లుంది మరి!
లండన్: మునుపెన్నడూ లేనంతంగా వాతావరణంలో విపరీతమైన మార్పులను యూకే చవిచూస్తోంది. ఈ ఏడాదిలోనే యూకే చరిత్రలోనే అత్యంత వేసవి పరిస్థితులను చవిచూసింది. వేడికి ఏకంగా రైలు పట్టాలే కాలి కరిగిపోయి.. సర్వీసులను నిలిపి వేయాల్సి వచ్చింది. వేల మంది మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పుడు చలి వంతు వచ్చింది. మైనస్ 10 నుంచి 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో బ్రిటన్ గజగజ వణికిపోతోంది. ఈ సీజన్లో ఐస్‌ల్యాండ్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలిపులి పంజా విసురుతోంది. విపరీతంగా కురుస్తున్న మంచుతో రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒకదానికొకటి ఢీకొంటున్నాయి. ముందున్న వాహనం కూడా కనిపించని పరిస్థితి. వాహనాలతో రోడ్లపైకి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రయాణాలు మానుకోవాలని చెప్పారు. చాలాచోట్ల యజమానులు తమ కార్లను రహదారుల పక్కన వదిలేసి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాట్స్‌వాల్డ్, బ్రిస్టల్, సౌత్ వేల్స్, హియర్ఫోర్డ్షైర్, కాంబ్రియా, షెఫీల్డ్ తదితర ప్రాంతాల్లో మంచు పెద్ద ఎత్తున పేరుకుపోయింది. కొన్నిచోట్ల పట్టాలపై మంచు కప్పేయడంతో రైళ్లను పాకిక్షంగా రద్దు చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ఇక లండన్‌లోని హిత్రూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం ఏకంగా 48 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. హిత్రూ ఎయిర్‌పోర్ట్‌లో జనం బారులు తీరారు. కెంట్, ఎస్సెక్స్, లండన్‌లో భారీగా మంచు కురిసే అవకా శం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. లండన్ సహా సౌత్, సెంట్రల్ ఇంగ్లాండ్‌లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. స్కాట్లాండ్లో మైనస్ 15 డిగ్రీలు నమోదైంది. దీనికి ఆర్కిటిక్ బ్లాస్టే కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘ధ్రువాల వద్ద తక్కువ పీడనం వల్ల ఇలా జరుగుతుంది. వాతావరణంలో తీవ్ర మార్పులు, ఉష్ణోగ్రతలు హఠాత్తుగా పడిపోవడం ఆర్కిటిక్ బ్లాస్ట్ ప్రభావమే’’ అంటున్నారు. ఇదీ చదవండి: ఆంక్షలను ఎత్తేయడంతో.. అల్లకల్లోలంగా తయారైంది -
కొంపముంచిన మంచు తుపాన్.. ఏకంగా 50 కార్లు ఒకదానిపై మరొకటి.. వీడియో వైరల్
వాషింగ్టన్: అమెరికాలోని పెన్సిల్వేనియా హైవేపై సోమవారం భారీగా మంచు ఏర్పడింది. దీంతో ఆ హైవేపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో మంచు కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు ఢీకొట్టుకున్నాయి. వివరాల ప్రకారం.. హారిస్బర్గ్కు ఈశాన్యంగా 50 మైళ్ల దూరంలో ఉన్న షుయ్కిల్ కౌంటీలోని ఇంటర్‌స్టేట్ 81లో ఉదయం 10:36 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. జీరో విజిబిలిటీతో 50 నుంచి 60 వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో పాటు 12 మందికి పైగా గాయపడ్డారు. ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఘటన సమీపంలో నాలుగు ఆసుపత్రులకు తరలించినట్లు పెన్సిల్వేనియా స్టేట్ పోలీసులు తెలిపారు. ఈ వాహనాల్లో కార్లతోపాటు ట్రక్కులు, ట్రాక్టర్ ట్రాలీలు ఉన్నాయి. హైవేపై ఉన్న మంచును తొలగించేందుకు స్థానిక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక్కడ శీతాకాలం మొదలుకాగానే వాతావరణం మంచుతో కప్పేస్తుండడంతో వాహనదారులకు రోడ్డు సరిగా కనిపించక ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటన జరగడం ఒకే నెలలో ఇది రెండోసారి అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. -
ఆ ప్రాంతాన్ని నల్లటి మంచు కమ్మేస్తోంది.. భయాందోళనలో స్థానికులు
ప్రకృతికి సంబంధించిన ప్రతీది అందంగానూ, మనల్ని సంతోషపెట్టేలాగా ఉంటాయి. అయితే కొందరు స్వలాభం కోసం చేసే కొన్ని పనుల వల్ల ప్రకృతి ప్రకోపాన్ని గురికావాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు పేరిట ప్రతి ఏటా మనం నష్టపోతూనే ఉన్నాం. కొందరు అంటుంటారు.. ప్రకృతితో ఆడుకుంటే అది మనతో ఆడుకుంటుందని. అలాంటి ఘటనే తాజాగా రష్యాలో వెలుగు చూసింది. సైబీరియాలోని మగడాన్ ప్రాంతంలోని ఓంసుచన్‌లో ప్రకృతి కన్నేర్రకు నిదర్శనగా ఆ ప్రాంతమంతా నల్లటి దుప్పటి కప్పినట్లు మంచు కప్పేసింది. అదేంటి మంచు కురవడం సాధారణమే కదా అనిపిస్తుంది. కానీ అక్కడ కురిసే మంచు తెల్లగా కాకుండా నల్లగా కురుస్తూ ఆ ప్రాంత ప్రజలని భయపెడుతోంది. అయినా మంచు నల్లరంగులో కురవడం ఏంటి అనుకుంటున్నారా..? ప్రకృతి ప్రకోపం.. నల్లటి మంచు అసలు విషయమేంటంటే.. బొగ్గుతో పనిచేసే వేడి నీటి ప్లాంట్ ఓంసుచన్ ప్రాంతంలో ఉంది. ఈ ప్లాంట్ సహాయంతో ఆ ప్రాంతంలోని నాలుగు వేల మందికి అవసరమైన వేడిని అందిస్తున్నారు. బొగ్గ ఆధారిత ప్లాంట్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీని నుంచి వెలువడే దుమ్ము, మసి వాతావారణంలో కలిసి కాలుష్యంగా మారింది. దీంతో ఆకాశం నుంచి పడుతున్న మంచు భూమిపై పడకముందే నల్లగా కాలుష్యంతో నిండిపోయిన ఆ ఆవరణంలోకి రాగానే.. అది కూడా నల్లగా మారి కురుస్తుంది. బూడిద, నల్లటి మంచుతో కప్పబడిన వీధుల్లోతమ పిల్లలు ఆటలాడుకోవల్సి వస్తుందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ నల్లటి మంచుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #Russia is a country of outstanding natural beauty and diversity. But the sheer lack of environmental regulations is a devastating effect for residents in #Kuzbass, where last night there was BLACK SNOW. pic.twitter.com/zMiEWBJbnh — Mikhail Khodorkovsky (English) (@mbk_center) February 14, 2019 -
మండే సూర్యుడి నేలను.. మంచు ముద్దాడితే!
ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి. చీకటి ఖండం ఆఫ్రికాలో సుమారు పదకొండు దేశాలతో సరిహద్దును పంచుకుంటూ.. నిప్పు కణికల్లాంటి సూర్య తాపాన్ని ముద్దాడుతున్న నేల. అలాంటి ఇసుక తిన్నెలపై అరుదైన దృశ్యం(అలాగని కొత్తేం కాదు) చోటు చేసుకుంది. మహా ఎడారిని ఆనుకుని ఉన్న అయిన్ సెఫ్రా(అల్జీరియా)లో మంచు కురిసింది. దీంతో ఎర్రటి నేల మీద తెల్ల మంచు దుప్పటి పర్చుకుంది. సహారాలో వేడిమి అధికం. ప్రస్తుతం 58 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అవుతోంది. అయితే అల్జీరియా నామా ప్రావిన్స్‌కి ఉత్తరం వైపున ఉన్న అయిన్ సెఫ్రాలో మాత్రం మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతకు పడిపోవడంతో ఇలా జరిగింది. ఇదిలా ఉంటే అయిన్ సెఫ్రాను సహరా గేట్వేగా అభివర్ణిస్తుంటారు. అట్లాస్ పర్వతశ్రేణుల్లో, సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ప్రాంతం. గత 42 ఏళ్లలో ఇలా జరగడం ఇది ఐదవసారి. 1979, 2016, 2018, 2021లోనూ ఇలా జరిగింది. అయిన్ సెఫ్రాలో వేసవిలో గరిష్ఠంగా 37 డిగ్రీలు, శీతాకాలంలో కనిష్టంగా మైనస్ పది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుంటుంది. చల్ల గాలులపై ఒత్తిడి ప్రభావంతో ఇలా శీతల పరిస్థితి నెలకొంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. 2018లో ఏకంగా 40సెం.మీ. హిమపాతం నమోదు అయ్యింది ఇక్కడ. -
పాక్‌లో ఘోరం.. మంచు కింద 22 మంది సజీవ సమాధి
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో భారీగా కురుస్తున్న మంచు, మైనస్ 8 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు ఒకే కుటుంబానికి చెందిన 8 మంది సహా మొత్తం 22 మందిని బలి తీసుకున్నాయి. మృతుల్లో 10 మంది చిన్నారులున్నారు. ఇస్లామాబాద్‌కు 28 మైళ్ల దూరంలోని ప్రముఖ కొండప్రాంత రిసార్టు పట్టణం ముర్రీలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం ముర్రీకి పోటెత్తడంతో శుక్రవారం రాత్రి వేలాదిగా వాహనాలు ఆ దారిలో చిక్కుకుపోయాయి. తీవ్రంగా మంచు కురుస్తుండటం, ఉష్ణోగ్రతలు –8 డిగ్రీలకు పడిపోవడంతో చాలా మంది ఎటూ కదల్లేక వాహనాల్లోనే ఉండిపోయారు. చలికి గడ్డకట్టుకుపోయి ఇస్లామాబాద్‌కు చెందిన పోలీస్ అధికారి నవీద్ ఇక్బాల్ సహా ఆయన కుటుంబంలోని 8 మందితోపాటు మొత్తం 22 మంది వాహనాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నాలుగడుగుల మేర కురిసిన మంచులో వెయ్యి వరకు వాహనాలు చిక్కుకున్నాయి. దీంతో యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. శనివారం సాయంత్రం వరకు పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు చెప్పారు. ముందు జాగ్రత్తగా ముర్రీకి వెళ్లే రహదారులను ఆదివారం ఉదయం 9 గంటల వరకు మూసివేసినట్లు వెల్లడించారు. మంచు విపరీతంగా కురుస్తుండటంతో సైన్యం చేపడుతున్న సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. -
మన్యం ‘స్నో’గసులు పోతుంది..!
Snowfall In Visakhapatnam In Winter Season: మన్యం అందాలకు పుట్టినిల్లు.. సొగసుల మెట్టినిల్లు..శీతాకాలం వచ్చిందంటే ‘స్నో’గసులు పోతుంది. మంచు తెరలు మనసును మీటుతాయి. వెండిమబ్బుల్లాంటి మేఘాలు నిత్యం హాయ్ అంటూ పలకరిస్తాయి. శీతాకాలం సీజన్ ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో ముందస్తు భోగి మంటలు ప్రారంభమయ్యాయి. ఎక్కడ చూసినా చలి మంటలు స్వాగతం పలుకుతున్నాయి. చలి తట్టుకోవటం ఎవరికైనా చాలా కష్టం. ఎంతటి వారైనా చలికి గజగజ వణికిపోవల్సిందే.. ఎందుకంటే మన శరీరం 25 నుంచి 35 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. అంతకన్నా ఉష్ణోగ్రత తగ్గితే శరీరం వణకడం మొదలుపెడుతుంది. విశాఖ మన్యంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటోంది. అయితే చలిని తట్టుకుని నిత్య జీవనం గిరిజనుల సొంతం. అంతటి చలిలోనూ మన్యం వేకువనే నిద్ర లేస్తోంది. పిల్లలు సైతం గంట కొట్టకముందే పాఠశాలకు చేరుకుంటున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. అన్ని వర్గాల వారూ చలిగింతల మధ్య నిత్యజీవనం కొనసాగిస్తున్నారు. – పాడేరు చదవండి: బరితెగింపు: ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయంలో తగ్గేదేలే! -
శ్రీనగర్ సహా పలు ప్రాంతాల్లో వానలు
-
అమెరికాలో తీవ్ర మంచు తుపాను
-
హిమాచల్‌లో భారీగా కురుస్తున్న మంచు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం రొహ్‌తంగ్‌లో దట్టమైన మంచు కారణంగా అటల్ టన్నెల్ సమీపంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులను పోలీసులు కాపాడారు. శనివారం ఉదయం కొందరు పర్యాటకులు అటల్ టన్నెల్ దాటి లాహౌల్ వైపు వెళ్లారు. సాయంత్రం తీవ్రంగా మంచు కురియడంతో తిరిగి మనాలీ రావడం వీలుపడక అక్కడే ఉండిపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని వాహనాల్లో తరలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పర్యాటకులతో వస్తున్న వాహనాలు మంచు కారణంగా మధ్యలోనే నిలిచిపోయాయి. బీఎస్ఎఫ్ సాయంతో రెండు బస్సులు సహా మొత్తం 70 వాహనాల ద్వారా పర్యాటకులను శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి 12.33 గంటల వరకు మనాలీకి తరలించడం పూర్తయిందని కుల్లు ఎస్పీ గౌరవ్ సింగ్ తెలిపారు. కాగా, టన్నెల్లో పోలీసులు ఓ పర్యాటకుడిని కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, బాధ్యులను శిక్షిస్తామని ఎస్పీ చెప్పారు. కాగా, గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ప్రపంచంలోనే పొడవైన అటల్ టన్నెల్ పర్యాటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. 10,040 అడుగుల ఎత్తులో 9.02 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగం లాహౌల్–మనాలీలను కలుపుతుంది. -
ట్రాఫిక్‌లో 40 గంటలు నరకయాతన..!
టోక్యో: వర్షం పడి నాలుగైదు గంటలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటేనే చిరాకు, అలసట, విరక్తి ఇలా అన్ని రకాల భావాలు కలుగుతాయి. అలాంటిది ఏకంగా 40 గంటలపాటు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతే.. అది కూడా గడ్డకట్టే మంచులో. ఊహించుకుంటనే ఒళ్లు జలదరిస్తుంది కదా. కానీ పాపం జపాన్ వాసులు మాత్రం అలా గడ్డ కట్టే చలిలో కార్లలో కూర్చుని ట్రాఫిక్ కష్టాలు అనుభవించారు. తినడానికి తిండి, తాగడానికి నీరు లేవు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో 40 గంటల పాటు ఉగ్గబట్టుకుని కార్లలోనే కూర్చున్నారు. పాపం కొందరు దాహం వేసి తాగడానికి నీరు లేకపోవడంతో పక్కనే ఉన్న మంచు తీసుకుని బాటిళ్లలో వేసుకుని కరిగించి.. ఆ నీటిని తాగారు. దాదాపు 40 గంటల నరకయాతన తర్వాత వారు ఇళ్లకు చేరుకున్నారు. ఈ విపత్కర పరిస్థితులు జపాన్‌లో చోటు చేసుకున్నాయి. టోక్యో, నైగటాలను కలిపే కనెట్సు ఎక్స్‌ప్రెస్‌వేలో రికార్డు స్థాయిలో మంచు కురిసింది. (చదవండి: ఆశ్చర్యం.. చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడు!) దాంతో శుక్రవారం రోడ్డును మూసివేశారు. అయితే అప్పటికే హైవే మీద ఉన్న వాహనాలు మంచులో చిక్కుకుపోయాయి. దాదాపు 1000 మంది డ్రైవర్లు ఇలా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. మొదట ఒక కారు మంచులో కూరుకుపోవడంతో దాని వెనక వచ్చిన వాహనాలు అలా నిలిచిపోయాయి. టోక్యో నుంచి వచ్చే ట్రాఫిక్ క్లియర్ అయ్యింది. కానీ రాజధానిలోకి వెళ్లే రహదారులు మాత్రం మంచుతో కప్పబడి ఉన్నాయి. చీఫ్ క్యాబినెట్ కార్యదర్శి కట్సునోబు కటో మాట్లాడుతూ ‘ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి వాహనాల్లో ఇబ్బందులు పడుతున్న జనాలను కాపడాటనానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ దళాలు ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారికి ఆహారం, పెట్రోల్, బ్లాంకెట్స్ అందించాయి. ఇక అగ్నిమాపక దళాలు ఇప్పటికే కొందరి డ్రైవర్లను కాపాడారు. వీరిలో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు’ అని తెలిపారు. ఇప్పటికే హైవే కార్మికులు అనేక అడుగుల ఎత్తు మేర మంచుతో కప్పబడిని రహదారులను క్లియర్ చేస్తున్నారన్నారు. ఇక సముద్ర తీరం వెంబడి ప్రాంతాల్లో భారీ మంచు కురిసే అవకాశం ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరించింది. (చదవండి: గులాబీ రంగులోకి మంచు.. కారణం!) ఇక కొన్ని ప్రాంతాల్లో 32 అంగుళాల మేర మంచు కురిసింది. హిమపాతంలో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న ప్రజలకు సహాయం చేయడానికి అధికారులు మిలిటరీని మోహరించారు. ప్రధాని యోషిహిదే సుగా అత్యవసర క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
ముంచుతున్న మంచు!
సాక్షి, అమరావతి: గతనెల 4న తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ వద్ద చెన్నై నుంచి భువనేశ్వర్‌కు కార్ల లోడుతో వెళ్తున్న ఓ కంటైనర్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఎన్‌హెచ్–16పై రావులపాలెం–రాజమహేంద్రవరం మధ్య ఏటిగట్టు జంక్షన్లో జరిగిన ఈ ప్రమాదంలో లారీ డ్రైవరు ఎస్కే అబ్దుల్, క్లీనర్ ఎస్కే డానేష్ హక్‌లు మృతిచెందారు. తెల్లవారుజామున మంచు కారణంగా జంక్షన్ వద్ద ములుపు కనిపించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగింది. లఇలా రాష్ట్రంలో గత సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 440 వరకు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 67 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 250కు పైగా జాతీయ రహదారులపైన జరగ్గా 42 మంది మరణించారు. ఈ ప్రమాదాలకు మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్, రోడ్డు ఇంజనీరింగ్ లోపాలు ఓ కారణమైతే.. తెల్లవారుజామున మంచు కూడా ఓ ప్రధాన కారణమని రవాణా శాఖ అధ్యయనంలో తేలింది. దీంతో రవాణా శాఖా అధికారులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. డ్రైవరును ఆపి ముఖం కడుక్కోడానికి నీళ్లివ్వడం, టీ అందించడం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డిసెంబరు, జనవరి నెలల్లో మంచు కారణంగా అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని అంచనా వేసిన అధికారులు టోల్గేట్లు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో పోలీసులతో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీటన్నింటి కోసం ఇటీవలే రూ.120 కోట్లు మంజూరు చేశారు. దీంతో ఎలక్ట్రానిక్ బోర్డులు, రోడ్లపై డైవర్షన్ బోర్డులను రేడియం స్టిక్కర్లతో ఏర్పాటుచేస్తున్నారు. భారీ వాహనాలతో ప్రమాదాలు జాతీయ రహదార్లపై ఎన్హెచ్ఏఐ (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) విశ్రాంతి స్థలాలు సరిగ్గా ఏర్పాటుచేయకపోవడంతో రోడ్ల వెంబడే భారీ వాహనాలు నిలిపి ఉంచుతున్నారు. మంచులో కనిపించక వెనుక నుంచి అతివేగంతో వస్తున్న వాహనాలు వీటిని ఢీకొంటున్నాయి. దీంతో అక్కడికక్కడే మరణిస్తున్న సంఘటనలు ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో జరిగాయి. మరోవైపు.. నిబంధనల ప్రకారం ఐదు గంటల కంటే ఎక్కువసేపు వాహనాన్ని డ్రైవరు నడపకూడదు. రెండో డ్రైవర్ విధిగా ఉండాలి. కానీ, వాహన యజమానులు రెండో డ్రైవరును పంపకపోవడంతో ప్రమాదాలు అధికమయ్యాయి. ప్రమాదాల నివారణకు నీళ్లు, టీ అందిస్తున్నాం గతేడాది గుంటూరు జిల్లాలో ఒక్క డిసెంబరులోనే మూడు రోజుల వ్యవధిలో పొగమంచు కారణంగా తెల్లవారుజామున 15 మరణాలు చోటుచేసుకున్నాయి. పోలీసుల సహకారంతో ఆ సమయంలో వాహనాలను ఆపి డ్రైవర్లను ముఖం కడుక్కోమని సూచిస్తున్నాం. ఇందుకు నీటిని సమకూరుస్తున్నాం. అలాగే, వారంలో మూడుసార్లు డ్రైవర్లకు టీ అందిస్తున్నాం. – మీరా ప్రసాద్, గుంటూరు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పొగమంచు వల్ల.. కంటిచూపుపై ప్రభావం పొగమంచు వల్ల కంటి చూపుపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణ వెలుగు కంటే మంచులో ప్రయాణం అంటే 40 శాతం చూపు తగ్గిపోతుంది. అదే 40 ఏళ్లు పైబడిన డ్రైవరుకు చత్వారం సమస్య తోడవుతుంది. ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్వల్ల కూడా చూపు తగ్గుతుంది. దీనికి తోడు తెల్లవారుజామున కళ్లు మూతపడతాయి. ఆ సమయంలో డ్రైవర్లకు విశ్రాంతి అవసరం. – డాక్టర్ నరేంద్రరెడ్డి, సూపరింటెండెంట్, కర్నూలు ప్రాంతీయ కంటి ఆస్పత్రి రావులపాలెం–రాజమహేంద్రవరం మధ్య కాల్వలోకి దూసుకెళ్లిన కంటైనర్ -
350 మందిని రక్షించిన ఆర్మీ
శ్రీనగర్/జమ్మూ: విపరీతమైన మంచు కారణంగా 15,500 అడుగుల ఎత్తులో చిక్కుకున్న సుమారు 350 మందిని ఆర్మీ రక్షించింది. ఈ మేరకు శుక్రవారం రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ రాజేశ్ కలియా వెల్లడించారు. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద వీరంతా చిక్కుకున్నట్లు తెలిపారు. గురువారం నుంచి మంచు విపరీతంగా పడడంతో రోడ్లు మూసుకొని పోయి వాహనాల్లో ఇరుక్కుపోయారు. బయట ఉష్ణోగ్రతలు –7కు పడిపోయాయి. దాదాపు 250 ట్రక్కులు ఈ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయాయి. ఆర్మీ, పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం కలసికట్టుగా రాత్రంతా శ్రమించి వీరిని రక్షించారు. ప్రభుత్వం ద్వారా వారి జాడను తెలుసుకున్న ఆర్మీ వారిని రక్షించి, వేడి ఆహారాన్ని, దుప్పట్లను అందించింది. మరోవైపు పోలీసులు, జీఆర్ఈఎఫ్ సిబ్బంది రోడ్డుపై పేరుకున్న మంచు తొలగిస్తూ, ట్రాఫిక్ మళ్లించే ఏర్పాట్లు చేశారు. ఆర్మీ వెనువెంటనే తీసుకున్న నిర్ణయం వల్ల వీరు సురక్షితంగా బయటపడ్డారు. -
సిమ్లాను ముంచెత్తిన మంచు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాను మంచు ముంచెత్తింది. మరోవైపు, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, వడగండ్ల వానతో శనివారం తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కుఫ్రి, మషోబ్రా, ధల్లి ప్రాంతాల్లో వడగండ్లు పడగా, సిమ్లా, ధర్మశాల, డల్హౌసీ, ఫగు, సంగ్లా, రాజ్‌గఢ్, సంధోల్లలో తేలికపాటి వాన కురిసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల మేర తగ్గాయని పేర్కొంది. ఉనాలో అత్యధికంగా 41.5 డిగ్రీలు నమోదు కాగా, లాహౌల్, స్పిటి గిరిజన జిల్లాల్లో అత్యంత కనిష్టంగా 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. పేరుకుపోయిన మంచు, వర్షం కురుస్తున్న దృశ్యం -
అమెరికాను వణికిస్తున్న ఆర్కిటిక్ చలి
షికాగో: భీకరస్థాయిలో విరుచుకుపడుతున్న ఆర్కిటిక్ చలి దెబ్బకు అమెరికాలో లక్షలాది ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇళ్లలోనే ఉండిపోవాలని చాలా సంస్థలు తమ ఉద్యోగులకు సమాచారమిచ్చాయి. చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు, వ్యాపార, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఇప్పటికే 2000కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎలాంటి విపత్కర వాతావరణ పరిస్థితిల్లోనైనా ఉత్తరాలను బట్వాడా చేసే ‘యూఎస్ పోస్టల్ సర్వీస్’ సైతం ఇండియానా, మిషిగాన్, ఇల్లినాయిస్సహా 5 రాష్ట్రాల్లో తన సేవలను అర్ధంతరంగా నిలిపేసింది. ఉత్తర డకోటా, దక్షిణ డకోటా మొదలుకొని ఓహియో దాకా (1,930 కిలోమీటర్ల పొడవునా) డజనుకుపైగా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇటీవల కాలంలో ఎన్నడూలేనంతటి కనిష్టస్థాయిలకు పడిపోయాయి. ఆరుబయటకెళ్లి ఎక్కువసేపు మాట్లాడొద్దని, సెకన్లలోనే ఒళ్లు మొద్దుబారేలా చేసే చలివాతావరణం ఆవరించి ఉందని అమెరికన్ పౌరులను జాతీయ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. షికాగోలో ఉష్ణోగ్రత ఏకంగా మైనస్ 30 సెల్సియస్‌గా నమోదైంది. షికాగోలో మైనస్ 50కి సైతం పడిపోయే ప్రమాదముంది. అంటార్కిటికా ఖండంలోని కొన్నిచోట్ల సైతం ఇంతటి చలిలేదు. నార్త్ డకోటాలో ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీ ఫారన్‌హీట్‌గా నమోదైంది. కొన్ని రైళ్ల సర్వీసులనైనా నడిపేందుకు వీలుగా, మంచును కరిగించేందుకు షికాగోలో రైళ్ల పట్టాల దగ్గర సిబ్బంది మంటలు అంటించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో ‘మంచు ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. ఇల్లినాయిస్, మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో వాతావరణ ఎమర్జెనీ ప్రకటించారు. కెనడాలో సైతం చలి విజృంభిస్తోంది. ట్రంప్ వ్యంగ్య ట్వీట్: అమెరికాను మంచుదుప్పటి కప్పేసిన వేళ అధ్యక్షుడు ట్రంప్ తన వాదనను వ్యంగ్యంగా తెరపైకి తెచ్చారు. భూతాపం(గ్లోబల్ వార్మింగ్) అనేదే లేదని వాదించే ట్రంప్ బుధవారం.. ‘గ్లోబల్ వార్మింగ్ ఎక్కడ? త్వరగా అమెరికాకు వచ్చెయ్. ఈ చలిలో మాకు నీ అవసరం చాలా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై జాతీయ వాతావరణ శాఖ ఘాటుగా స్పందించింది. ‘చలి తుపాన్లు వచ్చినంతమాత్రాన గ్లోబల్ వార్మింగ్ అనేది లేదని కాదు’అంటూ ట్వీట్ చేసింది.