విశాఖ మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత
విశాఖ: విశాఖ మన్యంలో రోజురోజుకీ చలి తీవ్రత పెరుగుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఉదయం పది గంటల వరకూ చలిగాలులు వీస్తున్నాయి. మన్యంలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కప్పివేయడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం పది గంటల వరకూ పొగమంచు కప్పేస్తోంది.
బాగా ఎండ వచ్చేవరకూ రహదారులు కూడా కనిపించట లేదు. పాడేరు, మినములూరులో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, పోతురాజుగుడి సమీపంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదుకొండమ్మ పాదాల వద్ద 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది.