గుల్‌మార్గ్: జమ్మూకశ్మీర్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్‌మార్గ్‌ను హిమపాతం ముంచెత్తింది. అఫర్‌వాత్ కొండ ఉన్న ఖిలాన్ మార్గ్ వద్ద సంభవించిన ఈ హిమపాతంలో మంచులో కూరుకుపోయి ఒక రష్యన్ పర్వతారోహకుడు ప్రాణాలు కోల్పోయాడు.
హిమపాతాలకు నెలవైన నిషేధిత ఆర్మీ రిడ్జ్ ప్రాంతంలో స్థానిక గైడ్‌తో కలిసి కొందరు రష్యన్లు పర్వతారోహణకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. హిమపాతం జరిగిన వెంటనే పర్యాటక విభాగం గస్తీ, ఆర్మీ, పోలీసులు సహాయక, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి మంచులో కూరుకుపోయిన ఏడుగురిని రక్షించారు. వీరిని ఆస్పత్రిలో చేరి్పంచారు. మృతుడిని మాస్కోవాసి హాంటెన్‌గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment