
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో ఇగ్లూ (మంచు) కఫే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వెడల్పున్న ఈ కఫే 40 మందికి ఆతిథ్యమివ్వగలదు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇగ్లూ కఫే అని ఓనర్ సయ్యద్ వసీం షా చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం స్విట్జర్లండ్‌లో చూసిన ఇలాంటి హోటళ్లు, కఫేలే దీని రూపకల్పనకు స్ఫూర్తి అన్నారు. ‘‘గతేడాది కూడా 4 టేబుళ్లతో 16 మంది కూచునేలా ఆసియాలోకెల్లా అతి పెద్ద ఇగ్లూ కఫే ఏర్పాటు చేశా. ఈసారి 10 టేబుళ్లకు, 40 మంది సామర్థ్యానికి పెంచాం. దీన్ని 25 మంది 64 రోజుల పాటు రేయింబవళ్లు కష్టపడి ఐదడుగుల మందంతో కట్టారు. ఇది మార్చి 15 దాకా కరగకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. ఆ తర్వాత మూసేస్తాం’’ అని వివరించారు.