Gulmarg
-
కశ్మీర్ వివాదాస్పద ఫ్యాషన్ షో: ఆ డిజైనర్లు ఎవరంటే..?
పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్లో జరిగిన ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపింది. ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఈవెంట్‌పై రాజకీయ, సామాజిక వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేగాదు ఫ్యాషన్ షో దూమారం జమ్ముకశ్మీర్ అసెంబ్లీని కూడా అట్టుడికించింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు ఒమర్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి. ఈ నెల మార్చి 7న గుల్మార్గ్లో జరిగిన ఈ ఫ్యాషన్ షోపై తారాస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీనిపై జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 24 గంటల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. వివాదాస్పదంగా మారిన ఈ షో వెనుకున్న డిజైనర్లు ఎవరంటే..?ఎవరా డిజైనర్ ద్వయం..?ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డిజైనర్లు శివన్ భాటియా, నరేష్ కుక్రేజా. ఈ ఇద్దరు స్థానిక సున్నితత్వాన్ని విస్మరించి పవిత్ర రంజాన్ మాసంలో అశ్లీల దుస్తులతో ప్రదర్శన ఇవ్వడంతోనే ఈ షో వివాదాస్పదమైంది. అయితే డిజైనర్ల ద్వయం ఫ్యాషన్ పరిశ్రమలో తమ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గుల్మార్గ్లోని ప్రఖ్యాత స్కీ రిసార్ట్‌లో ఈ ఫ్యాషన్ షోని నిర్వహించారు. వాళ్ల బ్రాండ్‌కి సంబంధించిన శిల్పకళా స్కీ సూట్లు, అప్రెస్-స్కీ దుస్తులు, ఆర్ట్ ప్రింట్లు ఉన్న ట్రాన్స్పరేంట్ దుస్తులు ధరించారు ఇందులో పాల్గొన్న పురుషులు, మహిళలు. అయితే వాళ్లు సరిగ్గా రంజాన్ పర్వదినం సమయంలో దీన్ని నిర్వహించడతో ఇంతలా స్థానిక ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను దారితీసింది. పైగా ఈ ఈవెంట్ సాంస్కృతిక విలువలకు తిలోదాకలిచ్చే రీతిలో దారుణంగా ఉందంటూ మత పెద్దలు, ప్రజలు, రాజకీయనాయకులు మండిపడ్డారు. అయితే ఈ షోని నిర్వహించింది ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ హాలిడే. ఇది కేన్స్‌లోని 'మారే డి మోడా'లో భారతదేశపు తొలి లగ్జరీ బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. అధునాతన సౌందర్యానికి చెందిన ఈ బ్రాండ్ హాలిడే రిసార్ట్, స్విమ్ దుస్తుల పరంగా ఫ్యాషన్‌లో సంచలనాలు సృష్టించింది. వారి కలెక్షన్లు డీఎల్ఎఫ్ ఎంపోరియో (ఢిల్లీ), కలఘోడా (ముంబై), బంజారా హిల్స్ (హైదరాబాద్), ఎంబసీ చాంబర్ (బెంగళూరు) లలో అందుబాటులో ఉన్నాయి.ఇద్దరు డిజైనర్లు ఫ్యాషన్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థానాన్ని దక్కించుకున్నారు. వారిలో శివన్ NIFT ఢిల్లీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, ఇస్టిట్యూట్ యూరోపియో డి డిజైన్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. కాగా నరేష్ అదే సంస్థ నుంచి లగ్జరీ అండ్ మార్కెటింగ్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. ఈ బ్రాండ్‌ని ఎక్కువగా బాలీవుడ్ నటులు కిమ్ కర్దాషియాన్, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు నిర్వహించారు. ఈ బ్రాండ్‌కి వరించిన అవార్డులు..స్వరోవీస్కీ మోస్ట్ క్రియేటివ్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్ (2007)ఉత్తమ ఎమర్జింగ్ డిజైనర్లు (మేరీ క్లైర్ ఫ్యాషన్ అవార్డ్స్, 2010)ఉత్తమ రిసార్ట్ వేర్ (ఎల్లే స్టైల్ అవార్డ్స్, 2010)ఉత్తమ క్రూయిజ్ వేర్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2011)‘మేడ్ ఇన్ ఇండియా’ లేబుల్ టు ది వరల్డ్ (గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్, 2012)యంగ్ అచీవర్స్ అవార్డు (ఎంబసీ ఆఫ్ ఇండియా, ఖాట్మండు అండ్ టుడేస్ యూత్ ఆసియా)ఇంత మంచి పేరు, కీర్తీ దక్కించుకున్న ఈ ఫ్యాషన్ డిజైనర్లు గుల్మార్గ్ ఫ్యాషన్ షోతో ఒక్కసారిగా వివాదాస్పద వ్యక్తులుగా అపకీర్తిని మూటగట్టుకున్నారు, విమర్శలపాలయ్యారు. View this post on Instagram A post shared by SHIVAN & NARRESH (@shivanandnarresh) (చదవండి: వర్కౌట్లకు టైం లేదా..? ఐతే ఇలా బరువు తగ్గించుకోండి..) -
రంజాన్ వేళ కశ్మీర్లో అర్ధనగ్న ఫ్యాషన్ షో.. సీఎం ఒమర్‌కు ఝలక్!
శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్లో అర్ధనగ్న ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపుతోంది. ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పర్యాటకంపై ప్రచారం పేరుతో ఈ అశ్లీల ప్రదర్శన ఏమిటని విపక్షాలు, ప్రజలు.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో కశ్మీర్లో నిర్వహించిన ఫ్యాషన్ షో కార్యక్రమంపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి ఫ్యాషన్ షో జరగడం పట్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ప్రజల కోపాన్ని తాము అర్థం చేసుకున్నట్లు చెప్పారు. తన కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ పరిణామంపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మరోవైపు.. ఈ ఫ్యాషన్ షో వ్యవహారం అటు జమ్ము కశ్మీర్ అసెంబ్లీని సైతం తాకింది. రంజాన్ వేళ ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్ష నేతలు ఒమర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో, అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. A fashion show in Gulmarg has ignited controversy in J&K, with critics calling it "obscene" for being held during Ramzan. pic.twitter.com/4P77B8mtbf— Briefly (@Brieflybynewj) March 10, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు ఉత్తర కశ్మీర్ గుల్మార్గ్లోని ప్రముఖ స్కై రిసార్టులో ఆదివారం ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారు రెచ్చగొట్టే తరహాలో దుస్తులు ధరించారని స్థానిక మత పెద్దలతో పాటు హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దారుణంగా ఉందని విమర్శించారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన చిత్రాలు, వీడియో తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని అన్నారు. సూఫీ, సాధు సంస్కృతి, ప్రజల మతపరమైన దృక్పథానికి పేరుగాంచిన లోయలో దీన్ని ఎలా సహించాలి? ఇందులో పాల్గొన్న వారిని వెంటనే జవాబుదారీగా చేయాలి అని మండిపడ్డారు.#Watch: Noisy scenes in J&K #assembly over #Kathua killings, #Gulmarg fashion show pic.twitter.com/R80BG1YQ7A— Greater Kashmir (@GreaterKashmir) March 10, 2025 -
గుల్మార్గ్లో హిమపాతం
గుల్మార్గ్: జమ్మూకశ్మీర్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ను హిమపాతం ముంచెత్తింది. అఫర్వాత్ కొండ ఉన్న ఖిలాన్ మార్గ్ వద్ద సంభవించిన ఈ హిమపాతంలో మంచులో కూరుకుపోయి ఒక రష్యన్ పర్వతారోహకుడు ప్రాణాలు కోల్పోయాడు. హిమపాతాలకు నెలవైన నిషేధిత ఆర్మీ రిడ్జ్ ప్రాంతంలో స్థానిక గైడ్‌తో కలిసి కొందరు రష్యన్లు పర్వతారోహణకు వెళ్లినపుడు ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. హిమపాతం జరిగిన వెంటనే పర్యాటక విభాగం గస్తీ, ఆర్మీ, పోలీసులు సహాయక, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి మంచులో కూరుకుపోయిన ఏడుగురిని రక్షించారు. వీరిని ఆస్పత్రిలో చేరి్పంచారు. మృతుడిని మాస్కోవాసి హాంటెన్గా గుర్తించారు. -
గల్లీ క్రికెట్ ఆడిన సచిన్.. వీడియో వైరల్
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం తన తొలి కాశ్మీర్ పర్యటనలో బీజీబీజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సచిన్ తన కుటుంబంతో కలిసి చుట్టేస్తున్నారు. ఈ పర్యటనలో సచిన్ మరోసారి బ్యాట్ పట్టి సందడి చేశాడు. గుల్మార్గ్లో స్థానికులతో కలిసి మాస్టర్ బ్లాస్టర్ గల్లీ క్రికెట్ ఆడాడు. రోడ్డుపై స్ధానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడూతూ సచిన్ ఎంజాయ్ చేశాడు. అక్కడ వారితో ఫోటోలు కూడా క్రికెట్ గాడ్ దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ ఎక్స్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోకు క్యాప్షన్‌గా "క్రికెట్ అండ్ కాశ్మీర్.. స్వర్గంలో మ్యాచ్" అంటూ రాసుకొచ్చాడు. కాగా బుధవారం సచిన్ బుధవారం చాలా ప్రాంతాలను సందర్శించాడు. అక్కడ విల్లో క్రికెట్ బ్యాట్ల తయారీ కేంద్రాన్ని లిటిల్ మాస్టర్ విజిట్ చేశాడు. అదే విధంగా ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖపై చివరి పాయింట్ అమన్ సేతు వంతెనను కూడా సందర్శించాడు. ఈ సందర్భంగా అమన్ సేతు సమీపంలోని కమాన్ పోస్ట్ వద్ద సైనికులతో సచిన్ ముచ్చటించాడు. Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV — Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024 -
కశ్మీర్లో హిమపాతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో బుధవారం మంచు చరియల కింద చిక్కుకుని ఇద్దరు విదేశీ పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. మంచు కింద చిక్కుకుపోయిన మరో 21 మందిని పోలీసులు కాపాడారు. 21 మంది పోలండ్, రష్యా దేశస్తులు, ఇద్దరు స్థానిక గైడ్లు మూడు బృందాలుగా ఏర్పడి ప్రఖ్యాత స్కై రిసార్ట్ హపట్‌ఖుడ్ కాంగ్డోరి వద్ద ఉండగా భారీ 20 అడుగుల పొడవైన మంచు పెళ్ల వారికిపైకి దొర్లుకుంటూ వచ్చి పడింది. ఈ ఘటనలో మంచు కింద చిక్కుబడిన ఇద్దరు పోలండ్ జాతీయులు చనిపోగా, మిగతా వారినందరినీ కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో నిషేధ హెచ్చరికలు ఏర్పాటు చేశామన్నారు. -
ప్రపంచంలోనే పెద్ద ఇగ్లూ కఫే
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని గుల్మార్గ్లో ఇగ్లూ (మంచు) కఫే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల వెడల్పున్న ఈ కఫే 40 మందికి ఆతిథ్యమివ్వగలదు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇగ్లూ కఫే అని ఓనర్ సయ్యద్ వసీం షా చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం స్విట్జర్లండ్లో చూసిన ఇలాంటి హోటళ్లు, కఫేలే దీని రూపకల్పనకు స్ఫూర్తి అన్నారు. ‘‘గతేడాది కూడా 4 టేబుళ్లతో 16 మంది కూచునేలా ఆసియాలోకెల్లా అతి పెద్ద ఇగ్లూ కఫే ఏర్పాటు చేశా. ఈసారి 10 టేబుళ్లకు, 40 మంది సామర్థ్యానికి పెంచాం. దీన్ని 25 మంది 64 రోజుల పాటు రేయింబవళ్లు కష్టపడి ఐదడుగుల మందంతో కట్టారు. ఇది మార్చి 15 దాకా కరగకుండా ఉంటుందని ఆశిస్తున్నాం. ఆ తర్వాత మూసేస్తాం’’ అని వివరించారు. -
మంచు ముసుగులో కశ్మీర్ అందాలు
-
ఈ మంచు ప్రాంతాలను చుట్టేసి రండి
భారత్‌లో ఎన్నో అద్భుత పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో మంచు ప్రదేశాలు ప్రత్యేకమైనవి. మంచు ప్రదేశాలను ఇష్టపడని వారు ఉండరు. నూతన సంవత్సర వేడుకలకు వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ప్రదేశాలు ఎంతో ఆహ్లాదాన్నిఇస్తాయి. జనవరిలో మంచు అధికంగా ఉండటంతో చలికాలంలో పర్యాటానికి మంచు ప్రదేశాలు చక్కని ఆప్షన్. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశాలు భూలోక స్వర్గంలా కనిపిస్తాయి. మరి అలాంటి మంచు ప్రదేశాలు భారత్‌లో ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా.. ఇండియాలో ది బెస్ట్ మంచు ప్రదేశాలేంటో ఓసారి తెలుసుకుందాం.. 1.గుల్మార్గ్(జమ్మూ-కశ్మీర్) కశ్మీర్‌లోని అందమైన ప్రాంతాల్లో ఇదొకటి. గుల్మార్గ్ అంటే మంచు పూలదారి అని అర్థం. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ ప్రాంతమంతా శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. గుల్మార్గ్ ప్రాంతం అందం వర్ణించలేనిది. ఇక్కడి స్ట్రాబెర్రీ లోయలు, బయో స్పియర్ రిజర్వులు, గోల్ఫ్ కోర్స్, మహారాణి టెంపుల్ తదితర ప్రాంతాలు పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. జనవరిలో ఇక్కడ మంచు కురిసే అవకాశం ఉంటుంది. అందుకే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని చూడటానికి క్యూ కడతారు. వింటర్ సీజన్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్కేటింగ్, స్కీయింగ్ కూడా చేయవచ్చు. 2. ఔలి( ఉత్తరాఖండ్) ఉత్తరాఖండ్‌లో ఉన్న ఔలి ప్రాంతం గర్వాలీ రీజియన్. రాష్ట్రంలో చూడదగ్గ ప్రదేశాల్లో ఔలి ఒకటి. ఔలి అంటే పచ్చిక బయలు అని అని అర్థం. అంటే మంచు కొండల్లో ఉన్న పచ్చిక నేల అని. శీతాకాలంలో ఈ పచ్చదనాన్ని మంచు కప్పేస్తుంది. స్నో ఫాల్ చూడాలనుకునే వారికి ఇది చక్కని గమ్యస్థానం. స్కీ యింగ్ వంటి ఆటలు కూడా ఆడవచ్చు. ఔలి ప్రాంతానికి వెళ్తుంటే దారి వెంబడి ప్రవహించే నదులు కనిపిస్తాయి. ఈ నీరంతా మంచు కరిగిన నీరే. ఈ నదులు ఔలికి చేరుకునే పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. 3.సోనా మార్గ్(జమ్మూ-కశ్మీర్) సోనా మార్గ్ అంటే బంగారు మైదానం అని అర్థం. సోనా మార్గ్ పట్టణం అంతా మంచు పర్వతాలతో కప్పబడి ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ పూసే బంగారు వర్ణపు పువ్వుల వల్ల ఈ ప్రాంతానికి సోనామార్గ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ ట్రెక్కింగ్, హైకింగ్ వంటి సాహస క్రీడలు పర్యాటకుల ఆసక్తిని పెంచుతాయి. జనవరి మొదటి 15 రోజులు ఇక్కడ మంచు కురుస్తుంది. ముఖ్యంగా అన్ని ట్రెక్కింగ్ మార్గాలు సోనామార్గ్ నుంచే మొదలవుతాయి. చుట్టు ఉన్న కొలనులు, పర్వతాలు, సహజ ప్రకృతి సౌందర్యం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. శీతాకాలంలో ఈ ప్రాంతపు ఉష్ణోగ్రత జీరో డిగ్రీల కంటే తక్కువగా నమోదవ్వడం వల్ల వాతావరణమంతా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. 4. మనాలి( హిమచల్ ప్రదేశ్) మనాలి ప్రాంతం రాజధాని షిమ్లా నుంచి 260 కి. మీ దూరంలో ఉంది. అందమైన మనాలి ప్రాంతం మంచు యొక్క స్వర్గధామం. ఇది హనీమూన్ స్పాట్ కూడా. ఇక్కడ స్కీయింగ్, స్కేట్ బోర్డింగ్, స్లోప్ స్లెడ్జింగ్ వంటి మంచు క్రీడలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. మనాలిలో రోహతాంగ్ పాస్, చంద్రఖని పాస్, సోలాంగ్ లోయ, సుల్తాన్పుర ప్యాలెస్ వంటి ప్రదేశాలు చుట్టేయవచ్చు. 5. యామ్ తాంగ్ ( సిక్కిం) సిక్కిం పర్యాటక ప్రదేశాలలో యామ్తాంగ్ అందమైన పర్వత లోయ ప్రముఖంగా నిలుస్తుంది. దీనిని పువ్వుల లోయ అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 9 వేల అడుగుల ఎత్తులో ఈ వ్యాలీ ఉంటుంది. ఇక్కడికి దగ్గర్లోనే చైనా, టిబెట్ సరిహద్దులు ఉంటాయి. దేశంలోని ఈశాన్య వైపున ఉన్న ఈ అందమైన ప్రదేశంలో జనవరిలో మంచు కురుస్తుంది. ఇక్కడికి దగ్గర్లోనే జీరో పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి ప్రత్యేక అనుమతి అవసరం. న్యూ ఇయర్‌కు మంచు పర్వతాలను చుట్టేసి రావడానికి జనవరి సరైన సమయం. ఇక ఆలస్యం ఎందుకు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఓ రౌండ్ వేయండి. -
ప్రకాశ్‌రాజ్‌తో భార్య సెల్ఫీ.. ఇంతలోనే భర్త వచ్చి..!
సాక్షి, బెంగళూరు: ఇటీవల తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్లో పంచుకున్నారు. ఇటీవల ఆయన కశ్మీర్లో పర్యటించిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌లోని గుల్మార్గ్లో ఆయన విహరిస్తుండగా ఓ మహిళా అభిమాని తన కూతురితో కలిసి ప్రకాశ్ రాజ్‌తో సెల్ఫీ దిగాలని కోరింది. అభిమాని కోరడంతో ప్రకాశ్ రాజ్ అందుకు ఆనందంగా అంగీకరించారు. సెల్ఫీలు దిగిన తర్వాత ఆమె భర్త ఒక్కసారిగా ప్రవేశించాడు. ప్రకాశ్ రాజ్ చాలాసార్లు ప్రధాని నరేంద్రమోదీని విమర్శించారని, ఆయనతో సెల్ఫీలు దిగుతావా అంటూ తన భార్యపై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెల్ఫీలు ఫోన్లోంచి డిలీట్ చేయమని డిమాండ్ చేశాడు. దీంతో ప్రకాశ్ రాజ్ ఓ మంచి సలహా ఇచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ‘కశ్మీర్లో ఒక సందర్భంలో ఇది జరిగింది. ఇతరుల కోసం మనల్ని ప్రేమించేవారిని ఎందుకు బాధించాలి? అభిప్రాయభేదాలు ఉన్నంతమాత్రాన మనం ఎందుకు ద్వేషించుకోవాలి’ అంటూ ఈ ఘటనను ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారంటే.. ‘కశ్మీర్‌లోని గుల్మార్గ్లో ఉన్న హోటల్ నుంచి బయటకు రాగానే ఓ యువతి తన కూతురితో కలిసి నా దగ్గరికి వచ్చి సెల్ఫీ కావాలని అడిగింది. నేను అందుకు అంగీకరించాను. వాళ్లు ఎంతో ఆనందించారు. కానీ ఇంతలోనే తిట్లు తిట్టుకుంటూ ఆమె భర్త అక్కడికి వచ్చాడు. నేను మోదీతో విభేదిస్తాను కాబట్టి నాతో దిగిన సెల్ఫీలు డిలీట్ చేయాలని వారికి హుకుం జారీ చేశాడు. చుట్టూ ఉన్న పర్యాటకులు ఇదంతా గమనిస్తున్నారు. ఆ మహిళ ఒక్కసారిగా కన్నీళ్లపర్యంతమైంది. దీంతో నేను అతన్ని పక్కకు తీసుకెళ్లి మాట్లాడాను. ‘డియర్ సర్.. మీ భార్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి, అద్భుతమైన కూతుర్ని మీకు ఇవ్వడానికి, మీతో జీవితాన్ని పంచుకోవడానికి నేనో, మోదీనో కారణం కాదు. దయచేసి వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించండి. వారు మీ అభిప్రాయాన్ని కూడా గౌరవిస్తారు. సెలవులను ఆస్వాదించండి’ అని చెప్పాను. అతను జవాబు ఇవ్వకుండా అలాగే నిల్చుండిపోయాడు. నేను భారమైన హృదయంతో అక్కడి నుంచి కదిలాను. అతను నా ఫొటోలు డిలీట్ చేయించాడా? లేదా అన్నది తెలియదు. కానీ, వారికి చేసిన గాయాన్ని అతను మాన్పగలడా?’ అని పేర్కొన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వంపై గతంలో పలు సందర్భాల్లో ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజకీయాల్లోకి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. -
జమ్ము కశ్మీర్లో విషాదం
కశ్మీర్ : జమ్ము కశ్మీర్లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పర్యాటక స్థలమైన గుల్మార్గ్లో రెండు కేబుల్ కార్ టవర్ల మధ్య ఏర్పాటు చేసిన వైర్లపై భారీ చెట్టు పడింది.దీంతో వైర్ల సహాయంతో వెలుతున్న కేబుల్ కారు కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు యాత్రికులు మృతిచెందారు. భారీ ఈదురు గాలుల దాటికి కేబుల్ కార్ తీగలపై చెట్టు పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.